RELATED EVENTS
EVENTS
Permanent Free Medical Camp NATS

న్యూ జెర్సీ జూన్ 3: అమెరికాలో తెలుగుజాతికి ఏ కష్టమెచ్చినా.. అండగా నిలబడే నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో గొప్ప ముందడుగు వేసింది.. వైద్యం ఖరీదవుతున్న ఈ రోజుల్లో ఉచిత వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.. తెలుగువారికి నాట్స్ శాశ్తత ఉచిత వైద్య కేంద్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని నాట్స్ నిర్వహకులు తెలిపారు.

 

nats free medical camp, north america telugu association, nats ghazal srinivas, nats medical free camp, Permanent Free Medical Camp nats,  teluguone nri news

 

నాట్స్ వైద్య కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలతో పాటు.. వైద్యం కూడా ఉచితంగా అందించబడుతుందని నాట్స్ టీం తెలిపింది. నాట్స్ తలపెట్టిన ఈ సత్కార్యానికి మేము సైతం అంటూ సేవా నిరతి గల వైద్యులు ముందుకొచ్చారు.. ఈ వైద్య కేంద్రంలో తాము సేవలు అందిస్తామని హమీ ఇచ్చారు. నాట్స్ వైద్య కేంద్రంలో ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు అందించనున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలా ఉండాలనే దానిపై వైద్యులు పూర్తి అవగాహన కల్పిస్తారని నాట్స్ తెలిపింది. ఈ వైద్యం కేంద్రం గురించి మరిన్ని వివరాల కోసం నాట్స్ వెబ్ సైట్ లో సంప్రదించగలరు. ఇప్పటికే నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా నాట్స్ ఎప్పటికప్పుడు తెలుగువారికి అండగా నిలబడుతోంది.. ఇక ముందు దానిని మరింత విస్తృతం చేసేందుకు నాట్స్ ఈ శాశ్వత ఉచిత వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.. ఈ ఉచిత వైద్య కేంద్రాన్ని, కాంగ్రెస్స్ మాన్ ఉపేంద్ర చివుకుల ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశం నుంచి వచ్చిన మన తెలుగు వారు, ఇక్కడ ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి తెలుగువారికి తక్షణం ఉపశమనం కలిగించటానికి, రానున్న తరాల వారికి ఒక వేదిక గా వుండాలని ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య దేవాలయం లాంటి ఈ వైద్యశాల, అమెరికా లోనే ఒక గొప్ప ప్రయత్నం ఇది అన్నారు.

 

nats free medical camp, north america telugu association, nats ghazal srinivas, nats medical free camp, Permanent Free Medical Camp nats,  teluguone nri news

 

గంగాధర్ దేశి మాట్లాడుతూ, డా.గారేపల్లి లక్ష్మీపతి గారి ఆలోచనలోనించి వచ్చినదే ఈ ఉచిత వైద్యశాల. మన దేశం నించి తెలుగు వారే కాకుండా, ఎవరైనా వైద్య సలహాలకు మరియు రెండవ అభిప్రాయ సేకరణ నిమిత్తం వచ్చినపుడు, లేదా H1 లో వుండి సరైన వైద్య భీమా లేని వారికి సేవ చేయాలనే ఉద్దేశ్యం తో ఇది ఏర్పాటు చేయబడింది. ఈ సేవా కార్యక్రం లో పాల్గొనటానికి డాక్టర్ లు కాని, నర్సులు గాని, వాలంటీర్లు స్వచ్చందంగా ఈ సేవా కార్యక్రమం లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ వారి సౌజన్యం తో రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. చాలా మంది తెలుగు వారు రక్త దానం చేసారు.

 

nats free medical camp, north america telugu association, nats ghazal srinivas, nats medical free camp, Permanent Free Medical Camp nats,  teluguone nri news

 

ప్రెసిడెంట్ రవి మాదాల మాట్లాడుతూ, సేవా దృక్పథం తో ఏర్పడ్డ ఈ సంస్థ నించి వచ్చిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికి విజ్నప్తి చేసారు. ఉపేంద్ర చివుకుల నాట్స్ ని అభినందిస్తూ సేవే గమ్యం అని నినాదానికి తగ్గట్టుగా చేస్తున్న ఈ బృహత్కార్యక్రమం విజయమంతా మవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇంకా, నాట్స్ డిప్యుటీ చైర్మన్ మధు కొర్రపాటి, విమల్ కావూరి, శ్యాం మద్దాలి, గంటి సూర్యం, గంటి అరుణ, మోహన్ కృష్ణ మన్నవ స్థానిక తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులు, అభిమానులు, వాలంటీర్లు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ వైద్యశాల గురించి మరింత ప్రచారం చేసి పది మందికీ ఉపయోగ పడేలా చూడాలని ప్రమాణం చేసారు

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;