RELATED TELUGU TEJALU
RELATED ARTICLES
TELUGU TEJALU
MAURITIUS TELUGU BHAASHA BRAHMOTSAVAALU

మారిషస్ తెలుగు వారు, తెలుగు భాషా దినోత్సవ శుభ సందర్భంగా మారిషస్ లో అగస్టు ఇరవై ఏడో తేదీ నుండి నాలుగు రోజులు ఘనంగా తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సభలకు ప్రముఖ కవి తెలుగు చలన చిత్ర రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ముఖ్య అతిథిగా సతీ సమేతంగా హజారయ్యారు. మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రోత్సహాన్ని కల్పిస్తూ ఈ సభలను ఏర్పాటు చేసింది.

ఇరవై ఏడో తేదీ నాడు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాల్గు గంటల వరకు మారిషస్ లోని తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణా సదస్సు జరిగాయి. ఈ సదస్సులో యాభై మంది పైగా పాల్గొన్నారు. ఈ సదస్సులకు అధ్యక్షులుగా మహాత్మా గాంధీ సంస్థ తెలుగు బొధనాధిపతి మరియు మారిషస్ తెలుగు భాషా సంఘాధ్యక్షులు డాక్టర్ శ్రీ రెడ్డీ లక్ష్ముడు గారు అధ్యక్షత వహించారు. సంధాన కర్తగా శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు వ్యవహరించారు.

మారిషస్ లో తెలుగు నేర్చుకుని ఊర్మిలా అప్పడు అనే ఉపాధ్యాయిని ఆటవెలది ఛందస్సులో పద్యం రాయటం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఆశ్చర్యపరిచింది. మారిషస్ లో తెలుగు భాషను పరిరక్షించుకొవటం కోసం ఇక్కడి వారి ఆతృతను, ఆవేదనను అర్థం చేసుకుని స్పందించి, శ్రీ జొన్నవిత్తుల గారు ఆయన రచించిన తెలుగు వేదం, పద్య గేయ కావ్యం నుండి ఎన్నో పద్యాల గీతాలు ఆలపించారు. సభలో తెలుగు చైతన్యం వెల్లి విరిసింది.

మరు నాడు ఆదివారం ఇరవై ఎనిమిది తేదీ, రెండు వేల పదకొండవ సంవత్సరం మారిషస్ సాంస్కృతిక కళా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సంస్థ ప్రేక్షకగార ప్రాంగణంలో తెలుగు భాషా దినోత్సవం వైభవంగా జరిగింది. మారిషస్ పత్రికా, ప్రసార సాధన కర్త ప్రతినిధులు హజారై ఈ కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఈ తెలుగు భాషా దినోత్సవ సభకు మరి సాంస్కృతిక కళా శాఖా మంత్రి శ్రీ ముఖేశ్వర్ చున్ని గారు హజారయ్యారు. ఈ సభకు శ్రీమతి జొన్నవిత్తుల శేషు కుమారి జ్యోతి ప్రజ్వలనం చేశారు. తద్వారా శ్రీమతీ శ్రీ జొన్నవిత్తుల దంపతులకు బాగా సత్కరం జరిగింది. తెలుగు భాషా సంఘం యొక్క ముఖ్య అతిథిగా భాగ్యనగరం నించి పిలిచి వచ్చిన ఆచార్య శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు సతీ సమేతముగా తెలుగు ప్రజలందరికి తెలుగు సుమధుర పద్యాలతో మమ్మల్ని రంజింప చేశారు. ఈ సభలో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు కవితా ప్రసంగం మారిషస్ తెలుగు వారికి ఉత్తేజం కలిగించింది. శ్రీమతి దయాశ్రీ వారి శిష్యులు, తెలుగు చిన్నారుల కూచిపూడి నృత్యాలు అందరికి ఆకట్టుకున్నాయి.

 

 మరునాడు ఇరవై తొమ్మిదో తేదీ, రెండు వేల పదకొండవ సంవత్సరం, రోజ్ హిల్ల్ పట్టణంలో మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయంలో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ప్రసంగించారు. మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయాధ్యక్షులు శ్రీ నరాయణ సన్యాసి గారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు దంపతులను సత్కరించారు. ఆ తెలుగు సభ యొక్క అతిథుల ప్రత్యేక పుస్తకం శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు తమ స్పనన గురించి రాశారు.

 

సాయంత్రం మారిషస్ తెలుగు వారసత్వ కళా నికేతనంలో శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారి అధ్యక్షతలో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తెలుగు కవితా ప్రసంగం, స్థానిక తెలుగు కళాకారుల సంప్రదాయ సంగీత కార్యక్రమలు జరిగాయి. మారిషస్ ప్రభుత్వం మరియు మారిషస్ తెలుగు సంఘం ఆహ్వానం మేరకు ఇక్కడకు విచ్చేసి తమ తెలుగు పద్యాలు గీతాలు ప్రసంగాలతో తెలుగు తల్లికి నిరాజనం పట్టిన జొన్నవిత్తుల గారికి మారిషస్ తెలుగు వారు అభినందనం తెలియజేశారు.

 

 

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నించి జాతీయ దూరదర్శన తెలుగు విభాగం ఆహ్వానం పై ఒక చక్కటైన ప్రశ్నొత్తర కార్యక్రమం జరిగింది. అందులో నలుగురు తెలుగు ప్రముఖులు డాక్టర్ శ్రీ రెడ్డి లక్ష్ముడు గారు, ఆచార్య జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు, ఆయన ధర్మపత్ని శ్రీమతి శేషు కుమారి జొన్నవిత్తుల గారు మరి శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు పాగొన్నారు. ఆ కార్యక్రమం లో శ్రీ సంజీవ నరసింహ అప్పడు తెలుగు భాష యొక్క మాధుర్యం, మహత్వం మరి వికాసం గురించి వచ్చిన ప్రముఖ అతిథులకు వంతు ప్రకారంగా ప్రశ్నలు అడిగారు. తెలుగు భాషా సంఘం యొక్క అధ్యక్షులు, డాక్టర్ శ్రీ రెడ్డి లక్ష్ముడు గారు మారిషస్ దీవి లో తెలుగు భాష యొక్క పరిస్థితి గురించి, తెలుగు భాష అభివృద్ధి గురించి మరి తెలుగు భాషా సంఘం సభ్యులందరూ కలిసి చేసే తెలుగు సేవ గురించి వివరముగా చెప్పారు. ఆచార్య జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారు, తమ ఆశు కవితలను సృష్టించి, మారిషస్ యొక్క అందము ద్విపద శైలి లో తమ పద్యాలను భావ రాగ తాళాలతో ఆలపించారు. మారిషస్ దేశంలో తెలుగు భాష వికాసానికి ఇక్కడ మా ప్రభుత్వ సహాయం సహకారాల వల్ల ప్రగతి అవుతుందని అన్నారు. శ్రీమతి శేషు కుమారి గారు మారిషస్ లో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి, తెలుగు స్త్రీ ధర్మం గురించి మరి తమ అనుభవాల గురించి అచ్చమైన తెలుగు లో చెప్పింది.

 


TeluguOne For Your Business
About TeluguOne
;