RELATED NEWS
NEWS
శశికాంత్ వల్లిపల్లికి తానా ప్రతిష్టాత్మక అవార్డు

 

తానా 22వ మహాసభల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు నిర్వాహకులు పురస్కారాలను అందించారు. బిజినెస్ మరియు వ్యవస్థాపకత (Business and Entrepreneurship) రంగానికి సంబంధించి వల్లిపల్లి శశికాంత్‌ కి అవార్డు దక్కింది. శశికాంత్‌ కి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం పట్ల అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటోంది. అదేవిధంగా శశికాంత్‌ సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన 'తానా'కి తెలుగు ఎన్ఆర్ఐ సంఘం ధన్యవాదాలు తెలిపింది.

వ్యవస్థాపకత, మానవతా సేవ మరియు దాతృత్వంతో అమెరికాలో మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖుల్లో శశికాంత్ వల్లిపల్లి ఒకరు. ఆయన ఓ నాయకుడు. తెలుగు కమ్యూనిటీ బలపడటంలో సహకారం అందించాడు. పలు ప్రధాన కార్యక్రమాల్లో శశికాంత్ విశేష సేవలు అందించారు. Silver Jubilee of Telugu Association of Greater Boston మరియు thirty years of TAGB సెలబ్రేషన్ వంటి ఎన్నో కార్యక్రమాలకు ఆయన సేవలు అందించారు.

ఆయన వృత్తి పరంగా పలు విజయాలు సాధించి పేరు సంపాదించడమే కాకుండా, వివిధ లాభాపేక్షలేని సంస్థలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Trustee, TANA Foundation – (2017-2021)

Chairman,Telugu Association of Greater Boston (2018-2019)

Founder and Chairman, Kant Foundation

అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని అనేకమంది పిల్లల చదువు కోసం శశికాంత్ సహాయం చేస్తున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne