LATEST NEWS
  గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆపరేషన్ వశిష్టా ఇక ఆగిపోయినట్లేనా అనే అనుమాలు అందరిలో నెలకొన్నాయి. అయితే  మొదటి ప్రయత్నంలో విఫలమైన ధర్మాణి సత్యం బృందం రెండో ప్రయత్నం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బోటును వెలికితీయటం ఎంతవరకు సాధ్యం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.  బోటు మునిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ గల్లంతైన వారి వివరాలు పూర్తిగా తెలియనేలేదు. ప్రాణాలతో బయటపడ్డ ఇరవై ఆరు మంది తప్ప గల్లంతైనవారు ఎంతమంది అన్న లెక్క ఇప్పటికీ తేలని లేదని చెప్పాలి. అధికారులు మాత్రం ఇంకో పధ్నాలుగు మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు.సెప్టెంబర్ 15 వ తేదీ న కచ్చులూరు దగ్గర ఊహించని విధంగా గోదావరిలో మునిగి పోయింది రాయల్ వశిష్ట బోటు. ఇప్పుడది మూడు వందల అడుగులకుపైగా లోతులో ఉంది. దాదాపు నలభై అయిదు టన్నులకు పైగా బరువున్న రాయల్ వశిష్ట బోటును వెలికితీస్తే గానీ అందులో చిక్కుకున్న మృతదేహాల సంఖ్య తేలే పరిస్థితి లేదు. అయితే బోటును వెలికితీయటం ఎలా ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్యగా మారింది.  బోటును బయటకు తీయడం కోసం సాంకేతిక పద్ధతులు అన్నీ అనుసరించారు.బోటు పడనున్న లోతులను కనిపెట్టడం తప్ప దాన్ని బయటకు లాగే మార్గాలేవి దొరక లేదు. దీంతో సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే బోటును బయటకు లాగగలనని ఆలోచన కు వచ్చారు. ఈ విధానంలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న ధర్మాడి సత్యంకు ఈ బాధ్యతలు అప్పగించారు .కాంట్రాక్ట్ తీసుకున్న మరుసటి రోజునే ధర్మాడి సత్యం టీమ్ కచ్చులూరుకు వెళ్ళింది. ఐరన్ రోపులతో, ప్రొక్లెయినర్ లు తీసుకొని లంగర్ లు వేసి బోటు మునిగి ఉన్న ప్లేస్ ను గుర్తించింది. కానీ బయటకు లాగేందుకు చేసిన వారి తొలి ప్రయత్నం విఫలమైంది. ఐరన్ రోప్ తెగి పోవడంతో సత్యం ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఇప్పటికీ సత్యం బృందం బోటును వెలికితీస్తామని నమ్మకం తోనే ఉంది.అయితే ఇటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆపరేషన్ వశిష్టకు పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడడం గోదావరి ల వరద తగ్గడంతో మళ్లీ సత్యం టీం ఆపరేషన్ వశిష్టకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ధర్మాణి సత్యం టీమ్ కచ్చులూరుకు చేరుకోబోతోంది. బోటు తమ లంగర్లలకు చిక్కి బయటకు లాగేందుకు పట్టు దొరికితే రెండురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తోంది ధర్మడి సత్యం టీమ్. సాయంత్రం కచ్చులూరు చేరుకోబోతున్న ధర్మడి సత్యం టీమ్ మళ్లీ  ఆపరేషన్ మొదటి నుంచి మొదలు పెట్టబోతోంది మొదటి ప్రయత్నం కోసం తెచ్చుకున్న సామాగ్రి మొత్తాన్ని మళ్లీ ఇప్పుడు కచ్చులూరుకు తరలించాల్సి ఉంది. గోదావరి సహకరించి వర్షం తగ్గితే ధర్మం సత్యం రెండో ప్రయత్నం మొదలుకానుంది.ఈ సారి ఐనా ఏ అవంతరాలు లేకుండా జరగుతుందో లేదో వేచిచూడాలి.  
  రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతు భరోసా గడువు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఆయన నెల రోజుల పాటు ఈ పథకానికి గడువు పెంచారని తెలిపారు. అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా ప్రక్రియ ప్రారంభమవుతుంది అని నవంబరు పదిహేను వరకు అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడి సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారుల జాబితాలన్నీ విలేజ్ సెక్రటేరియట్ లో అదే విధంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఎండీఓ ఆఫీసు లో, కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పకుండా నోటీసు బోర్డుల్లో పెట్టాలని సీఎం గారు ఆదేశించారని అన్నారు. ఇప్పటి వరకు విలేజ్ సెక్రటేరియట్ లో గత రెండు రోజులు నుంచి జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు అని తెలిపారు. గత ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది రైతు కుటుంబాల జాబితాని పిఎం కిసాన్ పథకానికి సమర్పించినట్టుగా లెక్కలున్నాయన్నారు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ సరిచూసినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా మూడున్నర లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందటానికి నిబంధల ప్రకారం అనర్హులుగా తేలుతోందని వివరించారు. అర్హత ఉండి ఆరు లక్షల మంది ఈ పథకాల్లో ప్రయోజనం పొందలేకపోయారని కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం తేలిందన్నారు. కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సవరించి ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూడటం మీ బాధ్యత అని సీఎం గారు ఆదేశించారని తెలిపారు. గతంలో ఇచ్చిన దానికన్న మిన్నగా ఈ పథకం అమలు చేయమని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు మూడు లక్షల మంది కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన కౌలు రైతులు ఈ పథకాల్లో లబ్ధి పొందబోతున్నారు అని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ రైతు భరోసా అక్టోబర్ లో ప్రారంభమౌతుంది కనుక కౌలురైతులు ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోలేకపోవటం, సీ.సీ.ఆర్.సి కార్డ్సు పొందలేకపోవడం వంటి ఇబ్బందులుంటే వాటిని నవంబర్ పదిహేను వరకు మరల దరఖాస్తు చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.
  ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా కొన్ని విషయాలు తేల్చడంలో మాత్రం జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.రాయలసీమలో హైకోర్టు ఉద్యమం మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏకంగా జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు.విధులకు వెళ్లకుండా కోర్టు గేటుకు తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాయర్ లను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.నెల రోజుల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదంటూ భగ్గుమన్నారు న్యాయవాదులు.  కర్నూలులో హైకోర్టును  ఏర్పాటు చేయాలంటూ గత ముప్పై మూడు రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కోర్టులు పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజూ కూడా లాయర్ లందరూ కూడా విధులకు హాజరు కానీ సంధర్బాలు లేవు. ఈ రోజునుంచి ఏకంగా స్టాఫ్ కానీ జిల్లా జడ్జిలు కానీ ఎవ్వరూ కూడా కోర్టుకు హాజరు కాకుండా ఏకంగా కోర్టులకు తాళాలు వేశారు. ఉద్యమం మరింత ఉధృతం అవుతున్న సంధర్బంలో కచ్చితంగా హై కోర్టుని ఏర్పాటు చేయలనే డిమాండ్ మరింత ఊపందుకుంటోంది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలసిందేనని డిమాండ్ ఉధృతం అవుతుంది.దీనిపై జగన్ సర్కార్ వీలైనంత త్వరగా స్పందిస్తే మంచిదని డిమాండ్ చేస్తున్నారు న్యాయమూర్తులు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోందో వేచి చూడాలి. 
  కర్తార్ పూర్ కారిడార్ సిద్ధమైంది. సిక్కుల మత గురువు ఐదు వందల యాభైవ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించబోతున్నారు. నవంబరు ఎనిమిదిన భారత భూభాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తే మరుసటి రోజు పాకిస్థాన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.ప్రధాని నరేంద్ర మోడీ కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ ఎనిమిదిన ప్రారంభించబోతున్నారు. డేరా బాబా నానక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించి 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి ఇది.గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మోడీని కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు .రాష్ట్రపతి రామనాథ్ గోవింద్, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్ పూర్ కారిడార్ గుడ్డ పాకిస్తాన్ లోని గురునానక్ గురుద్వారాకు చేరుకుంటారు,కాగా పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ తొమ్మిదిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించబోతున్నారు. సిక్కు గురువు డేరా బాబా గురునానక్ దేవ్ 1469 నవంబర్ ఇరవై తొమ్మిదిన పంజాబ్ లో జన్మించి 1539 సెప్టెంబరు ఇరవై రెండున మరణించారు.ఆయన పుట్టిన, మరణించిన స్థలాలూ రెండు ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉన్నాయి. ఆయన చివరి రోజుల్ని కర్తార్ పూర్ లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు పధ్ధెనిమిది ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. దీంతో దాన్ని అత్యంత పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు. అటువంటి ఆ రెండు ప్రదేశాలైన డేరా బాబా నాన్నక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన రహదారి గురునానక్ దేవ్ జయంతి రోజు ప్రారంభం కానుంది.తర్వాతి రోజే పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించబోతున్నారు మన్మోహన్,ఈ కారిడార్ గుడ్డ భారత్ కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కు వెళ్ళి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైనా గురుద్వారా సాహిబ్ ను దర్శించుకోనున్నారు.ఇందు కోసం ఎలాంటి వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది.మరోవైపు భారతదేశం నుంచి కర్తార్ పూర్ వెళ్లే తొలి భక్తబృందాల్లో పాల్గొనాలనీ కెప్టెన్ అమరిందర్ సింగ్ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం పంపించారు.దీంతో పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ల నున్న తొలి సిక్కుల వృద్ధుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉండబోతున్నారని సమాచారం. 
  ఆర్టీసీ సమ్మే మొదలై ఇప్పటికి పది రోజులు కావొస్తున్నా రోజురోజుకు ఉత్కంఠంగా కొనసాగుతున్న అంశంగా మారింది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించేందుకు వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి నివాళులు అర్పించారు విద్యార్ధులు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన వ్యక్తం చేయగా తరవాత మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి ర్యాలీగా బయలుదేరారు. ఉస్మానియా గేట్ దాటక ముందే వారిని పోలీసులు అడ్డుకొని  అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని వ్యాన్ లలో ఎక్కించారు పోలీసు అధికారులు.  తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం అనేది వీలైనంత త్వరగా జరిగితేనే అందరికి మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యనిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి లాంటి వ్యక్తులు సురేందర్ గౌడ్ లాంటి వ్యక్తులు చనిపోవడంతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ  వాళ్ల ఆత్మశాంతి చేకూర్చే విధంగా  నివాళులర్పించారు. ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా విద్యార్థిలు ,ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉంటున్న నేపధ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించినట్లు ప్రకటించారు, కావున  విద్యాసంస్థలను తక్షణమే కేసీఆర్ గారు సెలవులనూ విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పదోవ  రోజుకు చేరింది. దాదాపు ఆరుగురు ఏడుగురు పేద కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు పిట్టల్లా రాలిపోతున్నారు. పొడిగించిన వారంరోజులు విద్యాసంస్థల సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలని, కాలేజీలు స్కూళ్లను వెంటనే తెరిపించి పిల్లల చదువును కూడా ముందుకు తీసుకుపోవాలని ఆర్టీసీ సమ్మేలోని నేతలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఒక పరిష్కారం చూడాలని లేదంటే పరిస్థితులు ఇంకా ఉధృక్తం అవుతాయని వెల్లడించారు. 
ALSO ON TELUGUONE N E W S
  దర్శకురాలు నందినీరెడ్డి క్లారిటీ ఇచ్చారు... 'ఆల్రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ను నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటుంది? ఈ రూమర్స్ ఏంటో?' అని 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కి నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు రాసినవారిపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. దాంతో 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ ఉండదేమోనని చాలామంది అనుకున్నారు. నిజం ఏంటంటే... 'లస్ట్ స్టోరీస్' తెలుగులో రీమేక్ అవుతోంది. మరి, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? అంటే.... తరుణ్ భాస్కర్. అవును... 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ కి డైరెక్టర్. ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' విడుదలకు రెడీ అవుతోంది. అది ప్రేక్షకుల ముందుకు వచ్చాక 'లస్ట్ స్టోరీస్' రీమేక్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ మీద కూడా తరుణ్ భాస్కర్ వర్క్ చేస్తున్నాడని తెలిసింది.
పవన్‌కల్యాణ్‌ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన 'పంజా' ప్లాప్ కావొచ్చు. కానీ, ఆ సినిమాలో పవన్ స్టైల్, కాస్ట్యూమ్స్ సూపర్ హిట్. అందులో డైలాగులు కూడా హిట్టే. అబ్బూరి రవి 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు' వంటి అద్భుతమైన డైలాగులు రాశారు. అయితే... కొన్ని డైలాగులు విషయంలో దర్శకుడు విష్ణువర్ధన్‌తో గొడవ పడ్డారట. పవన్ కల్యాణ్ ముందే తనకు, దర్శకుడికి గొడవ జరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో అబ్బూరి రవి చెప్పారు. కొన్ని డైలాగులు కొంతమందికి రాయకూడదని, ఏ డైలాగ్ ఎవరికి రాస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దర్శకుడు, డైలాగ్ రైటర్ ఊహించగలగాలని ఆయన అన్నారు. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'తో విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న అబ్బూరి రవి, డైలాగ్ రైటర్‌గా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. దర్శకుడు కావాలనే కోరిక మనసులో బలంగా ఉందనీ, అయితే డైలాగ్ రైటర్‌గా బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఆ కోరికను పక్కన పెట్టాననీ, డైరెక్షన్ కోసం సొంత కథ రాసుకోవడానికి డైలాగ్ రైటర్‌గా సినిమాలు తాగించానని అబ్బూరి రవి తెలిపారు. దర్శకుడు సాయికిరణ్ అడివి కోసం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో విలన్ ఘాజీ బాబా పాత్ర చేశానన్నారు. తన నటన ఎలా ఉందో ఈ నెల 18న విడుదలవుతున్న సినిమా చూసి ప్రేక్షకులే చెప్పాలని అన్నారు.
'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు మిలటరీ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఆర్మీ డ్రస్సులో సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తూ ఒక పాట కూడా విడుదల చేశారు. అయితే... సినిమాలో ఆర్మీ ఎపిసోడ్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? మహేష్ బాబు ఆర్మీ అధికారిగా, దేశ సరిహద్దుల్లో సైనికుడిగా కనిపించేది ఎంతసేపో తెలుసా? జస్ట్ 20 మినిట్స్ మాత్రమే. మిగతా కథ అంతా తెలుగు నేల మీద నడుస్తుంది. బోర్డర్ నుండి కథ కర్నూల్ కొండారెడ్డి బురుజుకు షిఫ్ట్ అవుతుంది. వయా ఒక పెద్ద ట్రైన్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ అంతా చాలా హిలేరియస్ గా ఉంటుందని టాక్. సినిమా స్టార్టింగులో మిలిటరీ, ఆర్మీ ఎపిసోడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం. విజయశాంతి ప్రధాన పాత్రలో, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాతో బండ్ల గణేష్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు.
  దేశమంతా ఒక డైరెక్టర్ తీస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని మనకు తెలుసు. ఆ డైరెక్టర్.. ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' సినిమాలతో ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లుక్ కోసం రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను, తమిళ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర కనిని ఆయన తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకడైన అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో ఒక కీలక్ కేరెక్టర్ చేస్తున్నాడని చాలా కాలం క్రితమే రాజమౌళి ప్రకటించాడు. శంకర్ డైరెక్ట్ చేసిన '2.0' మూవీలో అక్షయ్ కుమార్ ఎలాగైతే విలన్‌గా కనిపించాడో, అదే తరహాలో అజయ్ దేవగణ్ సైతం 'ఆర్ ఆర్ ఆర్'లో విలన్‌గా కనిపించనున్నాడంటూ వదంతులు వినిపించాయి. దాంతో పాటు రాంచరణ్ తండ్రి కేరెక్టర్‌లో ఆయన కనిపించనున్నాడంటూ కూడా ప్రచారం జరిగింది.  అయితే అజయ్ చేస్తున్నది విలన్ కేరెక్టర్ కాదనీ, ఆయనది హీరోలను తీర్చిదిద్దే గురువు తరహా కేరెక్టర్ అనీ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. తెల్లవాళ్లపై తిరగబడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, రజాకార్లకు నిద్రలేకుండా చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే నిజమైన పాత్రలతో, ఫిక్షనల్ స్టోరీతో ఈ మూవీని రాజమౌళి తీస్తున్నాడు. పోరాట యోధులుగా మారక ముందు సమకాలికులైన ఆ ఇద్దరూ.. తమ ఇళ్లను, ఊళ్లను విడిచిపెట్టి మూడు నాలుగేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారని వాళ్ల జీవిత కథలు చెప్పాయి కానీ, ఆ కాలంలో వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయం చరిత్రలో చెప్పలేదు. దాన్నే కథగా తీసుకొని.. ఆ ఇద్దర్నీ యోధులుగా తీర్చిదిద్దిన గురువుగా అజయ్ దేవగణ్‌ను 'ఆర్ ఆర్ ఆర్'లో రాజమౌళి చూపిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో కాలమే చెబుతుంది.
  హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌కు నలుగురు పేరుపొందిన డైరెక్టర్లు.. అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ వంటి స్టార్లు అందులో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఎపిసోడ్‌లో అమలా పాల్, జగపతిబాబు నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేనా.. నాలుగు భాగాలకు నందినీరెడ్డి, సందీప్‌రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారని కూడా వైరల్ అయ్యింది.  అయితే తెలుగు 'లస్ట్ స్టోరీస్'కు తను డైరెక్ట్ చేస్తున్నాననే ప్రచారాన్ని నందినీరెడ్డి ఖండించింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో.. "ఆల్‌రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ని నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చెయ్యాలనుకుంటుంది? వై అమ్మా? ఏంటో ఈ వెరైటీ రూమర్స్" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అయితే ఆమె డైరెక్ట్ చేసిన 'జబర్దస్త్', 'ఓ బేబీ' మూవీస్ రెండూ రీమేక్‌లే. వాటిలో 'ఓ బేబీ' ఒరిజినల్ అయిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో విడుదలైన విషయం ప్రస్తావనార్హం. నందిని ఇలా రెస్పాండ్ అయినా, ఇప్పటికే ఈ సిరీస్ తెలుగు రీమేక్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, అందులో అమలా పాల్ పాల్గొంటున్నదనీ ప్రచారం జరుగుతోంది. ఈ రెండు వెర్షన్స్‌లో ఏది నిజమో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
  అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా ప్రెజెంట్ సెట్స్‌పై ఉంది. త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తర్వాత రెండు సినిమాలు చెయ్యడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేం వేణు శ్రీరాం డైరెక్షన్‌లో అనౌన్స్ చేసిన 'ఐకాన్' కాగా, మరొకటి సుకుమార్ డైర్క్షన్‌లో చెయ్యాల్సిన సినిమా.  'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. దాని తర్వాత బన్నీ 'ఐకాన్' సినిమా చేస్తాడా? లేక సుకుమార్ సినిమా చేస్తాడా? అనేది తేలలేదు. ఇంతలోనే ఒక రూమర్ ఫిలింనగర్‌లో తెరపైకి వచ్చింది. 'ఐకాన్' మూవీ ఆగిపోయిందనేది ఆ రూమర్.  చేగువేరా బయోపిక్‌గా హాలీవుడ్‌లో వచ్చి క్లాసిక్‌గా నిలిచిన 'ద మోటార్ సైకిల్ డైరీస్' ఆధారంగా 'ఐకాన్' స్క్రిప్టును వేణు శ్రీరాం రాసుకున్నాడనేది సమాచారం. దాని ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో బన్నీ హ్యాపీగా లేడనీ, అందుకే ఆ ప్రాజెక్టును వద్దనుకుంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది దిల్ రాజు ప్రాజెక్ట్ కాబట్టి అంత ఈజీగా ఆగిపోయే ప్రసక్తి ఉండదని బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న దిల్ రాజు 'ఐకాన్' మోషన్ టీజర్ రిలీజ్ చేశాడు కూడా. 'కనబడుట లేదు' అనేది ట్యాగ్‌లైన్. డైరెక్టర్ వేణు శ్రీరాంతో స్క్రిప్టును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దించే పని ఆయన చేపట్టాడనీ, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావచ్చనీ ఆ వర్గాలు అంటున్నాయి. 
  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'వార్' హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్‌లో  200 కోట్ల రూపాయల క్లబ్‌లో జాయినయ్యింది. బుధవారం 11 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించిన ఆ మూవీ గురువారం మరో 9 కోట్లను రాబట్టింది. వెరసి.. ఇప్పటివరకూ ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే దేశవ్యాప్తంగా 228.50 కోట్ల రూపాయలను వసూలు చేసిందని అంచనా. మొదటివారం వసూళ్లపరంగా హృతిక్, టైగర్, ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్)  కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ క్రమంలో వైఆర్ఎఫ్ మునుపటి రికార్డ్ హోల్డర్ 'సుల్తాన్'ను అది అధిగమించింది. 2019లో ఇప్పటివరకూ విడుదలైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు పరుగులు తీస్తోంది 'వార్'. దేశవ్యాప్తంగా 'వార్' వసూళ్లు ఎలా ఉన్నాయంటే... అక్టోబర్ 2 - రూ. 51.60 కోట్లు  అక్టోబర్ 3 - రూ. 23.10 కోట్లు అక్టోబర్ 4 - రూ. 21.30 కోట్లు అక్టోబర్ 5 - రూ. 27.60 కోట్లు అక్టోబర్ 6 - రూ. 36.10 కోట్లు అక్టోబర్ 7 - రూ. 20.60 కోట్లు అక్టోబర్ 8 - రూ. 27.75 కోట్లు అక్టోబర్ 9 - రూ. 11.20 కోట్లు అక్టోబర్ 10 - రూ. 9.25 కోట్లు ఇప్పటివరకూ వసూలు చేసింది   - రూ. 228.50 కోట్లు (హిందీ వెర్షన్) తెలుగు, తమిళ వెర్షన్లు రాబట్టిన వసూళ్లు - రూ. 9.85 కోట్లు మొత్తం - రూ. 238.35 కోట్లు
  Cast: Payal Rajput, Tejus Kancherla, Naresh, Aamani, Adithya Menon, Mumaith Khan Songs: Bhaskarabhatla Cinematography: C Ram Prasad Editor: Prawin Pudi Music: Radhan Producer: C. Kalyan Story, Screenplay & Direction: Shankar Bhanu Release Date: 11th Oct 2019 While the teaser of the movie RDX Love was released with a lot of steamy scenes the trailer was exactly opposite. The trailer focused on social issues. After RX100, actress Payal Rajput will be seen in this movie. So how is the movie, let us read the review. Story: Alivelu (Payal Rajput) is promoting government schemes with 4 friends. The scheme emphasis on how to use condom (which is called safety in the movie). They also teach women on how to take care of their relationships. Siddu (Tejus Kancherla) falls in love with her. He asks her why does she promote such schemes? The answer is to meet the CM! But why does she want to meet CM? What is her ultimate aim? Answers to such questions form the movie story! Analysis: Before speaking about the movie RDX Love, we have to speak about a particular romantic scene where the heroine is seen sleeping under the tree showcasing her bellybutton. Up above the tree is a honeycomb from where a drop of honey falls near her belly button. Her friends tell the hero that she gets angry if something falls on her while she is sleeping & request him to do something. The hero then takes out the honey with his lips. All this are shot by heroine’s friends & later on heroine shares it to heros father. Why have they introduced this situation, to showcase what is a little unclear. If we keep the commercial success of the movie aside, it is a shock to know that a director who once took meaningful movies like “Ardhanari” has taken such a movie. Can directors come down to this level for commercial success? May be the director’s intensions were good. But just to meet CM will a girl do such things? Are there no other ways left? Audience will surely get this doubt. Okay, after taking that path has he traversed properly? The answer is no again. Plus Points: Payal Rajput Few DIalogues Minus Points: Direction Music & Background music Romantic scenes Performances: If we look at hero & heroine differently, we feel they have done a good job. But if we look at their chemistry, it has clearly not worked out. Heroine Payal looked elder than hero Tejas. Among the others Aditya Menon & Naresh did justice to their character. Tulasi’s character goes on an emotional track. TeluguOne Perspective: Audience who have gone for the movie after seeing RDX Love teaser, they will only be able to enjoy a few scenes & a couple of songs. Similarly, for people who have gone for the movie after watching the trailer, you will surely be disappointed. If anyone wishes to watch the movie with family, they will surely face awkward situation in the theatre. The movie is a collection of cheap scenes!! Rating 2/5
  "ఈ మూవీ నా కెరీర్‌లో మైలురాయి అవుతుందని కచ్చితంగా చెప్పగలను. ఏ యాక్టర్ కెరీర్‌లోనైనా ఇలాంటి స్క్రిప్ట్స్ అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.".. ఇవి 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నోటి నుంచి వచ్చిన మాటలు. ఆమె మాటల్ని బట్టి 'ఆర్డీఎక్స్ లవ్' ఎంత గొప్పగా ఉంటుందో అనే అభిప్రాయం, కచ్చితంగా సినిమా చాలా బాగుంటుందనే నమ్మకం చాలామందిలో కలుగుతుంది.  నిజానికి కొన్ని రోజుల క్రితం ఈ మూవీ టీజర్, తర్వాత ట్రైలర్ రిలీజైనప్పుడు.. వాటిలో పాయల్ కనిపించిన తీరుచూసి, సోషల్ మీడియాలో చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. "ఇలాంటి కేరెక్టర్ చెయ్యడం అవసరమా?" అని ప్రశ్నించారు. అంత బోల్డ్‌గా తన అందాలు, వంపుసొంపులు ప్రదర్శిస్తూ వాటిలో కనిపించింది పాయల్. స్క్రిప్ట్ ప్రకారం అలా కనిపించానే కానీ, నిజానికి ఇది గొప్ప స్క్రిప్ట్ అనీ, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విషయాలు, వార్నింగ్ ఇచ్చే విషయాలు ఉంటాయని, అందుకే ఈ సినిమా చేశాననీ విమర్శకులకు సమాధానం చెప్పింది పాయల్. ఇప్పుడు సినిమా మనముందుకు వచ్చింది. నిజమే. పాయల్ చెప్పినట్లు 'ఆర్డీఎక్స్ లవ్'లో కొన్ని మంచి విషయాలున్నాయి. 'సేఫ్ సెక్స్', మద్యపానాన్ని విడనాడి భార్యల్ని సుఖపెట్టడం, గుట్కాలను త్యజించడం వంటి వాటిని కథలో భాగం చేశాడు డైరెక్టర్ శంకర్ భాను. అంతే కాదు.. తమ ఊరు, తమ చుట్టుపక్కల ఉన్న నలభై ఊళ్ల ప్రజల కోసం నాలుగు కిలోమీటర్ల వంతెన తీసుకురావడానికి అలివేలు అనే యువతి తన శీలాన్ని సైతం పణంగా పెట్టిందనే విషయాన్నీ ఈ సినిమాలో హైలైట్ చేశారు. ఆ అలివేలు ఎవరో కాదు.. పాయల్ రాజ్‌పుత్. ఇంతకీ ఆమె తన శీలాన్ని పణంగా పెట్టింది, అర్పించింది ఎవరికో తెలుసా.. తన ప్రియుడికి! 'సేఫ్ సెక్స్' గురించి ప్రచారం చేసే అమ్మాయి.. ప్రియుడితో గడిపి, తన శీలాన్ని పణంగా పెట్టానంటూ విలన్‌కు చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో! ఆ విలన్ ఎవరో కాదు.. ఆమె ప్రియుడి తండ్రే! ఇక సీఎం బాపినీడు అపాయింట్‌మెంట్ సాధించడానికి తన నలుగురు స్నేహితురాళ్లతో కలిసి ఆమె చేసే 'సేఫ్ సెక్స్' ప్రచారం చూస్తుంటే.. సినిమాని చూస్తున్నట్లు కాకుండా ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక నడివయసు వ్యక్తి పెళ్లిచేసుకోకుండా రోజుకో స్త్రీతో సేఫ్ సెక్స్ చేస్తున్నానని చెప్తే, అతడు చేస్తున్నది తప్పుపని అని మూతిపళ్లు రాలకొట్టాల్సిందిపోయి, తమ 'సేఫ్ సెక్స్' ప్రచారానికి అతను బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడని తెగపొగిడేసి, అతడితో సెల్ఫీ దిగే హీరోయిన్ అలివేలును ఏమనుకోవాలి! అలివేలు చేసే ప్రచారం, ఆమె చేష్టలు చూస్తే.. సేఫ్ సెక్స్ చేసేవాడు ఎన్ని లైంగిక సంబంధాలైనా పెట్టుకోవచ్చు.. అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇందులో ఏమాత్రం నైతికత లేదని ఏకొంచెం జ్ఞానం ఉన్నవాడైనా ఈజీగా చెప్పేస్తాడు. అలివేలు చేసే ఘనకార్యాలు అంతటితో ఆగవు. ఒక ఊళ్లో స్త్రీలకు కడుపు పండటంలేదనీ, మరణాల రేటు పెరుగుతోంది కానీ, జననాల రేటు ఏమాత్రం కనిపించడంలేదని తెలిసి, తన బృందంతో అక్కడకు వెళ్తుంది. తమ మొగుళ్లు ఫూటుగా తాగేసివచ్చి, తొంగుంటున్నారనీ, తమతో శృంగారం చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదనీ, ఇక తమ కడుపులు ఎలా పండుతాయనీ ఆ ఊరి స్త్రీలంతా అలివేలుకు మొరపెట్టుకుంటారు. తలనిండా మల్లెపూలు పెట్టుకొని సింగారించుకుంటే, ఆ వాసనకి మత్తెక్కి ఆ మొగుళ్లు శృంగారంలోకి దిగుతారని సలహా ఇస్తుంది అలివేలు. కానీ అది ఏమాత్రం ఫలితాన్నివ్వదు. మల్లెపూల వాసన కంటే, మందు వాసనే బాగుంటుందంటూ ఆ మొగుళ్లు తమ పెళ్లాల్ని తోసేస్తారు.  దాంతో అలివేలును పిచ్చిగా ప్రేమిస్తూ, ఆమె వెంటే ఉంటూ వస్తున్న సిద్ధు ఒక సలహా ఇస్తాడు. మొగ్గుళ్లు మీ దగ్గరకు రాకపోతే, మీరే వాళ్ల దగ్గరకు వెళ్లమంటాడు. దానికంటే ముందు 'వాత్సాయన కామసూత్రాలు' తెలుసుకోమంటాడు. అతడిచ్చిన 'వాత్సాయన కామసూత్రాలు' పుస్తకం నిరక్షరాస్యులైన అక్కడి స్త్రీలకు చదివి వినిపిస్తుంది అలివేలు. దాంతో ఆ స్త్రీలు వేడెక్కిపోయి, కామంతో దహించుకుపోతూ, తమ మొగుళ్లమీద పడి, వాళ్లకు శృంగార రసాన్ని రుచి చూపిస్తారు. అంతే! ఇక ఆ మొగుళ్లు మందు మాట మర్చిపోయి పెళ్లాల కొంగును వదిలితే ఒట్టు! ఈ ఆలోచనేదో సూపర్‌గా ఉంది కదూ! తమను నిర్లక్ష్యం చేసే మొగుళ్లను తమ కొంగున ముడేసుకోవాలంటే స్త్రీలకు పనికొచ్చే గొప్ప ఆయుధం 'వాత్సాయన కామసూత్రాలు' అన్నమాట. అది చదివితే, స్త్రీల కాపురాలన్నీ చక్కబడతాయనే డైరెక్టర్ థాట్‌కు హ్యాట్సాఫ్ చెప్పుదామా? అలివేలు లీలలు ఇంకా ఉన్నాయండోయ్! ఆమె ఆపరేషన్‌లో ఇంకో ఘట్టం.. గుట్కాలు మాన్పించడం. విజయవాడలో ఒక పాతబస్తీ తరహా ఏరియా ఉందన్నట్లు చూపించిన డైరెక్టర్.. గుట్కాకు బానిసలైన ఆ బస్తీవాసుల చేత.. ఆ అలవాటు మాన్పించే పనిని అలివేలుకు అప్పగించాడు. ఆమె ఆ బస్తీకి దాదా అయిన ఉస్మాన్ చేతే ఎంత సునాయాసంగా గుట్కా మాన్పిస్తుందో చూస్తే.. గుట్కా వీరులందరికీ స్పెషల్ షో ద్వారా 'ఆర్డీఎక్స్ లవ్' సినిమా చూపించెయ్యాలనిపిస్తుంది. ఉస్మాన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ, ఆమె అతడ్ని దూరంగా పెట్టేస్తుంది. కారణం.. అతడిని ముద్దుపెట్టుకోవాలంటే, అతడి నోరు గుట్కా వాసన వేస్తున్నదని! నమ్మబుద్ధి కావట్లేదా?  నిజమండీ బాబూ.. ఈ విషయం ఉస్మాన్ దగ్గర అలివేలే బయటపెడుతుంది. అప్పుడు కానీ తన ప్రేయసి తనను ఎందుకు దూరంగా పెడుతుందనే విషయం.. పాపం.. ఉస్మాన్‌కు తెలీదు. నిజం తెలిసిన ఉస్మాన్, తన నోటిని బాగా రుద్ది రుద్ది కడుక్కొని, తన నోరు గుట్కా వాసన వెయ్యట్లేదని రూఢి చేసుకొంటాడు. అప్పుడు అతడి దగ్గరకు అతని ప్రేయసి వచ్చి, గుట్కా వాసన వెయ్యని అతడి నోటిని తన నోటితో మూసేస్తుంది. వారెవ్వా! గుట్కా సమస్యకు ఎంత చక్కటి పరిష్కారం!! గుట్కా వీరులారా.. అర్జెంటుగా 'ఆర్డీఎక్స్ లవ్' చూడండి.. జీవితంలో మీరెంత ప్రేమను కోల్పోతున్నారో తెలుసుకోండి. మీ జీవితాల్ని ఆనందమయం చేసుకోండి. ఇన్ని లీలలు చేసిన అలివేలు.. తన ఊరికి అన్యాయం చేసిన టీవీ 59 యజమాని గిరిప్రకాశ్‌కు ఎలా చుక్కలు చూపిస్తుందో కూడా తెలుసుకోవాలి కదా! ఈ గిరిప్రకాశ్ పేరు, అతడ్ని చూపించిన విధానం గమనిస్తే, కొంతకాలంగా వార్తల్లో కనిపిస్తున్న ఒక ప్రముఖ చానల్ మాజీ సీఈవో ఉదంతం స్ఫురించకుండా ఉండదు. ఆ గిరిప్రకాశ్‌కు తెలీకుండా, తనను పిచ్చిగా ప్రేమించిన అతడి కొడుకు సిద్ధును తనతో తీసుకుపోయి, అతడు తనతో చేసే శృంగార చేష్టల్ని వీడియో తీసి, ఆ క్లిప్స్‌ని గిరిప్రకాశ్‌కు షేర్ చేస్తుంది. సిద్ధుకు తన శరీరాన్ని అర్పించి, ఊరికోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టానంటూ ఫోన్‌లో గిరిప్రకాశ్‌కు సందేశాన్నిస్తుంది అలివేలు.  ఇదండీ.. 'ఆర్డీఎక్స్ లవ్'లో మనకు కనిపించే అలివేలు కథ. నిజమే.. ఇన్ని ఫీట్లు చేసిన, ఇన్ని ఘనకార్యాలు చేసిన అలివేలు గొప్ప కేరెక్టరే! ఒక నటికి ఇలాంటి కేరెక్టర్లు అరుదుగా దొరుకుతాయనీ, ఈ కేరెక్టర్ తాను కాక ఇంకెవరు చేస్తారంటూ ప్రశ్నించిన పాయల్ రాజ్‌పుత్ కష్టాన్ని మన ప్రేక్షకులు గుర్తించి, 'ఆర్డీఎక్స్ లవ్'కు ఘన విజయం చేకూరుస్తారా? సౌత్ ఇండియా టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆమెను ఇప్పుడు నంబర్ వన్ స్టార్‌ను చేస్తారా? 
  నటీనటులు: తేజస్ కంచర్ల, పాయల్ రాజ్‌పుత్‌, ఆదిత్య మీనన్, వీకే నరేష్, నాగినీడు తదితరులు పాటలు: భాస్కరభట్ల మాటలు: వి. పరశురామ్   సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్ సంగీతం:రధన్  ప్రొడక్షన్ కంపెనీ: హ్యాపీ మూవీస్ నిర్మాత: సి. కళ్యాణ్  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:శంకర్ భాను విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019 'ఆర్.డి.ఎక్స్. లవ్' టీజర్ హాట్ అయితే... ట్రైలర్ నీట్. టీజర్లో హీరోయిన్ అందాలను ఎక్కువ చూపిస్తే... ట్రైలర్లో ఊరి సమస్యలు, సందేశం అంటూ సామాజిక సినిమా అన్నట్టు చూపించారు. 'ఆర్.ఎక్స్. 100' తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ నటించిన చిత్రమిది. అసలు, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదవండి.    కథ: నలుగురు స్నేహితులతో కలిసి ప్రభుత్వ పథకాలకు అలివేలు (పాయల్ రాజ్‌పుత్‌) ప్రచారం చేస్తుంటుంది. అంటే... కండోమ్ (సినిమాలో సేఫ్టీ అని పిలిచారు) వాడకం గురించి వివరించడం, గుట్కా మాన్పించడం, మగాళ్లు సంసారం చేయాలంటే ఏం చేయాలో మహిళలకు వివరించడం వంటివి అన్నమాట. ఆమెను చూసి సిద్ధు (తేజస్ కంచర్ల) ప్రేమలో పడతాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని అలివేలును అడిగితే... ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసమని చెబుతుంది. ముఖ్యమంత్రిని అలివేలు ఎందుకు కలవాలని అనుకుంటుంది? ఆమె లక్ష్యం ఏంటి? ఆమెకు సిద్ధు ఎలా సహాయ పడ్డాడు? అనేది సినిమా.  విశ్లేషణ:  'ఆర్.డి.ఎక్స్. లవ్' కంటే ముందు సినిమాలో ఓ సన్నివేశం గురించి చెప్పుకోవాలి. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశమది. నాభి అందాలు కనిపించేలా ఓ చెట్టు కింద హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. చెట్టు మీద తేనెపట్టు ఉంటుంది. ఓ చుక్క కింద నిద్రిస్తున్న హీరోయిన్ నాభి పక్కన పడుతుంది. ఆమె స్నేహితులు హీరోతో 'అలివేలు నిద్రపోతున్నప్పుడు అలా మీద ఏదైనా పడితే గోల చేస్తుంది. ఏదో ఒకటి చేసి తీసేయ్' అంటారు. అప్పుడు హీరోగారు పెదవులతో తేనెచుక్కను ఆస్వాదిస్తారు. స్నేహితులతో చాటుగా ఈ దృశ్యాన్ని వీడియో తీయించిన హీరోయిన్, హీరో తండ్రికి పంపిస్తుంది. హీరో తండ్రి దగ్గర పనిచేసే వ్యక్తి 'అబ్బాయిగారు రొమాంటిక్' అంటాడు. అందుకు బదులుగా హీరో తండ్రి 'ఇంత దిగజారుడు ఏంటి?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సినిమాలో సన్నివేశాల గురించి సింబాలిక్ గా చెప్పడానికి ఆ సన్నివేశంలో 'దిగజారుడు' అనే పదం రాశారో? హీరో తండ్రిని విలన్ గా చూపిస్తున్నారు కనుక రాశారో? కానీ, కరెక్టుగా రాశారు. సినిమాలో దిగజారుడు సన్నివేశాలు చాలా ఉన్నాయి.  కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే 'అర్ధనారి' వంటి అర్థవంతమైన సినిమా తీసిన దర్శకుడి నుండి ఇటువంటి సినిమా రావడం ఆశ్చర్యపరుస్తుంది. కమర్షియల్ సక్సెస్ కోసం దిగజారి సన్నివేశాలు తీశారా? అనే అనుమానం కలుగుతుంది. దర్శకుడి ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ప్రభుత్వ పథకాల పేరుతో తీసిన సన్నివేశాలు అన్నీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిని కలవడం కోసం ఆడపిల్ల అటువంటి పథకాలకు ప్రచారం చేయాలా? మరో మార్గం లేదా? అని ప్రేక్షకులకు సందేహం రావొచ్చు.దర్శకుడు ఈ దారిని ఎంచుకున్నాడని సరిపెట్టుకున్నా... ఆ దారిలో సరిగా ప్రయాణించాడా? అంటే అదీ లేదు. లక్ష్య సాధన కోసం హీరోయిన్ ఎంచుకున్న దారి సబబుగా అనిపించదు. దిగజారుడు కింద అనిపిస్తుంది. హీరో తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడానికి హీరోతో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు పంపాలా? చివర్లో ఆ దారిలో హీరోయిన్ ఎందుకు వెళ్ళింది? అనే విషయంలో ట్విస్ట్ ఇచ్చినా... అదేమంత గొప్పగా లేదు. అసలు కథలోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు. ట్విస్టుల సంగతి పక్కన పెడితే... సినిమా మెయిన్ కాన్సెప్ట్ రవితేజ 'భగీరథ' సినిమా కాన్సెప్టే. నిడివి ఎక్కువైంది. కండోమ్ వాడకం, వాత్సాయన కామసూత్ర ప్రచారం పక్కన పెడితే... కొన్ని సన్నివేశాల్లో డైలాగులు పర్లేదు. రధన్ పాటల్లో గుర్తుంచుకునేవి లేవు. నేపథ్య సంగీతం హింస పెట్టింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ప్లస్ పాయింట్స్: పాయల్ రాజ్‌పుత్‌ కొన్ని మాటలు మైనస్ పాయింట్స్: దర్శకత్వం పాటలు, నేపథ్య సంగీతం రవితేజ 'భగీరథ'ను గుర్తుచేసే కథ ఓవర్ ది బోర్డ్ వెళ్లిన రొమాంటిక్ సీన్స్    నటీనటులు:   హీరో హీరోయిన్ పాత్రలను వేర్వేరుగా చూస్తే ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. ఇద్దర్నీ జంటగా చూస్తే కెమిస్ట్రీ కుదరలేదు. హీరో తేజస్ కంటే హీరోయిన్ పాయల్ పెద్దదిగా కనిపించింది. మిగతా నటీనటుల్లో ఆదిత్య మీనన్, నాగినీడు, నరేష్ బాగా చేశారు. అనుభవంతో పాత్రలను చేశారు. తులసి పాత్ర ఎమోషనల్ గా సాగుతుంది.  తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: 'ఆర్.ఎక్స్. 100'లో పాయల్ రాజ్‌పుత్‌ అందాలు చూసి... 'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు రెండు పాటలు, రెండు మూడు సన్నివేశాలు తృప్తినిస్తాయి. అలాగే, టీజర్ చూసి సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు కూడా. కానీ, ట్రైలర్ చూసి సినిమాకు వెళితే మోసపోవడం ఖాయం. అందానికి, అసభ్యతకు మధ్య చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటి సినిమా తీశారు. కుటుంబంతో, పిల్లలతో కలిసి సినిమాకు వెళితే ఇబ్బందిపడతారు. ఇదొక చీప్ సన్నివేశాలు ఉన్న సినిమా. రేటింగ్: 2/5
  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.
  చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ. సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు. పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.
కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.
  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 
  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు.  ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.
  గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీ సర్కార్ ప్రారంభించింది. తూర్పుగోదారి కరపలో జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిచోటా పది నుండి పన్నెండు మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం, జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరు నుంచి ఏడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డ్ సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో లక్షా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. పింఛన్ లు, రేషన్ కార్డులు ఇంటి పట్టా వంటి వాటి కోసం పేదల మండల ఆఫీసులు, కలెక్టరేట్ రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారముంది, ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రతీ నెల కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయాల్లోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్దిష్ట కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చేర్పించి నిర్ణయించాలనీ, ఏడాదిలో తప్పని సరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాలో అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను సైతం సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.
  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు. మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.
  జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అనుభవంతో మిగతా స్టార్ హీరోలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలు సినిమాలకు సంబంధించినవి అనుకుంటే పొరపాటే, రాజకీయాలకు సంబంధించినవి. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి.. తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక పార్టీ కూడా 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తర్వాత కొందరి సలహాతో 2011 లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాజ్యసభకు ఎంపికై కేంద్ర కేబినెట్ లో పనిచేసారు. ఓ రకంగా చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. దీంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష పోరుకి దిగారు. కానీ చిరంజీవి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూశారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా పవన్ తన పోరాటం ఆగదంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం, జనసేన పార్టీలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, మరియు రాజకీయాల్లో తనకున్న ప్రత్యక్ష అనుభవంతో.. సినిమా స్టార్లు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ స‌ల‌హా ఇచ్చారు.  "నేను సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అయితే ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది" అని అన్నారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు అంత సుల‌భ‌మైతే కాదని, నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న తెలిపారు. న‌న్న‌డిగితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌నే స‌ల‌హా ఇస్తాను అని చిరంజీవి స్పష్టం చేసారు. మొత్తానికి చిరంజీవికి అనుభవంతో తత్త్వం బోధ పడింది. రాజకీయాలకు దూరం పాటించాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్ప‌టికే మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీతో క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు. ర‌జ‌నీ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరిద్దరూ చిరంజీవి సలహాతో ఆలోచనలో పడతారో, లేక అనుభవమే పాఠాలు నేర్పుతుంది అంటూ ముందుకి సాగుతారో చూడాలి.
  భారత్ లో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు, దేశ వ్యాప్తంగా ముప్పై చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన ఈ కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖను ఐబీ కనిపెట్టింది. పాక్ భూభాగం లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ వెలిశాయని, మరోసారి దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన రెండు రోజుల్లోనే జైషే మహమ్మద్ కుట్ర బయటకు రావడంతో అందరూ అలర్ట్ అయ్యారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ తీవ్రమైన కడుపు మంటతో ఉంది. భారత్ ని నేరుగా ఎదుర్కోలేకపోతున్న పాక్ ముష్కరులుని రెచ్చగొట్టి విధ్వంసాలకు కుట్ర చేస్తుందని సమాచారం. భారత్ లో భారీ విధ్వంసాలకు పాల్పడటమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని కూడా హిట్ లిస్ట్ లో పెట్టుకున్నామని, వారిని హత్య చేస్తామని జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖతో బయటపడింది. జైషే మహమ్మద్ చేస్తున్న ఈ కుట్రకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కనిపెట్టింది. ఆర్టికల్స్ 370 రద్దుతో కాశ్మీర్ లో పాకిస్తాన్ పప్పులుడికేలా పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉగ్రమూకల్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడు జైషే మహమ్మద్ చేసిన కుట్ర కూడా కాశ్మీర్ పై ఉన్న కడుపుమంటే అని తెలుస్తుంది. ఐబీ కనిపెట్టిన జైషే మహమ్మద్ లేఖలో అనేక ఉగ్ర కుట్రకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దేశంలో ముప్పై చోట్ల పేలుళ్లకు వేసిన ప్లాన్ లో గాంధీనగర్, కాన్పూర్, లక్నో ఎయిర్ పోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లను పేల్చేయాలని పన్నాగం పన్నింది పాకిస్తాన్. దీంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా సెక్యూరిటీని అలర్ట్ చేసింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తరువాత మసూద్ అజర్ ని అదుపులోకి తీసుకుని జైలులో పెట్టిన పాకిస్తాన్, సరిగ్గా నెల రోజుల క్రితం అతన్ని వదిలేసింది. మసూద్ అజర్ బయటకు రాగానే బాలాకోట్ లో మళ్లీ ఉగ్రక్యాంప్ లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత ఆర్మీ రెండు రోజుల క్రితమే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది. బాలాకోట్ లో జరుగుతున్న ఉగ్రవాద శిక్షిణా శిబిరాలపై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించింది.
తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రెండు స్కీములు ఉన్నాయని, అవి పెడితే మీ పని ఖతమేనని, అవి అమలైతే గతంలో చెప్పినట్లుగా రెండు మూడు సార్లు గెలుస్తాం అంటూ ధీమాతో కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఆయన దాచిన ఆ రెండు అద్భుత పథకాలు ఏంటి, వాటిని అమలు చేస్తే కేసీఆర్ కు అధికారం మళ్లీ వస్తుందా, ఇంతకీ కేసీఆర్ దాచిన పథకాలు ఏంటని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించారు. అమావాస్య, పౌర్ణానికి వచ్చి లొల్లిచేసే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. కాంగ్రెస్ అసలు తమకు పోటీనే కాదంటూ గడిచిన ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఎవరి బలం తగ్గిందో తెలుసుకోండని లెక్కలు చెప్పారు. కేసీఆర్ అంత ధీమాగా ఆ రెండు పథకాల గురించి చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమ్ముల పొదలోని అస్త్రాలు తెలంగాణ అంతటా ఉచిత వైద్యం, యువతకు ఉద్యోగాల కల్పన అనే చర్చ గులాబీ ముఖ్యుల వర్గాల్లో సాగుతోందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది మొత్తం జనాభాకు అందరికీ ఉచిత వైద్యం అందిస్తే ఎంత లెక్క అవుతుందని కె.సి.ఆర్ ఆరా తీశారట. పేదలకు ఉచితంగా ఉన్నత వర్గాలకు కొంత మొత్తం వసూలు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించేందుకు కేసీఆర్ ఇప్పటికే దీనిపై నివేదికలు, అంచనాలూ, ఖర్చు లెక్కను తెప్పించుకున్నారట. వచ్చే 2024 ఎన్నికల ముందర ఈ అద్భుత పథకాన్ని ప్రవేశ పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ గీసినట్టు తెలిసింది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల లెక్కలు తీసి పరిశ్రమలతో కలిసి ప్రభుత్వం నడిపించే అన్నిట్లోనూ, ప్రైవేటు పరిశ్రమల్లోనూ ప్రభుత్వమే రిక్రూట్ చేసే కొత్త పథకాన్ని కేసీఆర్ రూపొందించారట. వైన్ షాపులు, రేషన్ షాపులు ఇతర ప్రభుత్వ సేవలన్నింటినీ యువతకు అప్పగించేందుకు ప్లాన్ చేశారట. ఖాళీగా ఉండే వారికి నెలకు నిరుద్యోగ భృతి ఇస్తారట. ఈ రెండు పథకాలకు బడ్జెట్ కొరతతో కేసీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ భవిష్యత్లో అధికారంలోకి రావటానికి ఇవే సోపానాలని భావిస్తున్నారట. కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు ఇవేనంటూ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
  చాలా రోజుల క్రితం ఓ పిసినారి ఉండేవాడు. అతని యావంతా డబ్బు మీదే! సాయంత్రమయ్యేసరికి ఇంకొకరితో కన్నీళ్లు పెట్టించయినా, తన కడుపు కొట్టుకుని అయినా వీలైనంత డబ్బుని పోగుచేసుకోవాలన్నదే అతని తాపత్రయం! రోజురోజుకీ ఇంట్లో డబ్బు మూటలు పోగవుతున్న కొద్దీ పిసినారికి వాటిని పెంచుకోవాలన్న యావ పెరగసాగింది. ఇలా కాలం గడిచేకొద్దీ ఒకటి కాదు, రెండు కాదు... పదుల కొద్దీ నాణెపు మూటలు పోగవడం మొదలయ్యాయి.   ఇంతవరకూ బాగానే ఉంది! కానీ ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ అశాంతి తప్పదు కదా! ఎప్పుడు ఎవరి కన్ను పడుతుందా? ఎవరు వచ్చి తన నెత్తిన ఒక దెబ్బ వేసి ఆ మూటలను దోచుకుపోతారా? అని బిక్కుబిక్కుమంటూ పిసినారి కాలం గడపడం మొదలుపెట్టాడు. ఈ భయంతో అతనికి రాత్రిళ్లు కూడా సవ్యంగా నిద్ర పట్టేది కాదు. తన ఆస్తంతా ఇలా దోచుకుపోవడానికి సిద్ధంగా ఉండటమే... తనలోని అశాంతికి కారణం అని అర్థమైంది పిసినారికి. దాంతో అతను ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఒకరోజు తన నాణెపు మూటలన్నీ తన బండిలో వేసుకుని పట్నానికి బయల్దేరాడు. అక్కడ నేరుగా ఒక బంగారపు దుకాణానికి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న నాణెలకు బదులుగా బంగారాన్ని ఇవ్వమని బేరం పెట్టాడు. దుకాణం యజమానికి ఇదంతా చాలా సాధారణమైన విషయంలా తోచింది. వెంటనే ఆ నాణేలన్నింటినీ తీసుకుని తన పనివారితో లెక్కపెట్టించాడు. వాటి లెక్కకు తగినంతగా... ఒక ఇటుకరాయంత బంగారాన్ని పినినారి చేతిలో పెట్టాడు.   ఆ ఇటుకరాయంత బంగారాన్ని తీసుకుని పసినారి సంతోషంగా బయల్దేరాడు. కానీ దారిలో అతనికి ఇంకో అనుమానం తట్టింది. ఇంతకుముందు నాణేల మూటలు ఉన్నాయి కాబట్టి, అంత పెద్ద మూటలని దోచుకోవడం కష్టం కావచ్చు. కానీ ఇప్పుడు చేతిలో పట్టేంత బంగారపు ఇటుకని దోచుకుంటే నా గతేం కాను! నా సంపద, నా శ్రమ అంతా ఈ ఇటుకరాయంత బంగారంలోనే ఉంది కదా! మరేం చేసేది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరో ఉపాయాన్ని ఆలోచించాడు.   పిసినారి తన ఊరి బయటకు చేరుకోగానే ఎవ్వరూ చూడకుండా చల్లగా ఒక రావి చెట్టు చాటుకి చేరుకున్నాడు. చీకటి పడేవరకూ ఉండి. ఆ చెట్టు కింద వీలైనంత పెద్ద గుంతను తవ్వాడు. తన బంగారపు ఇటుకను అందులో కప్పి... ఏమీ ఎరుగనట్లు ఊరిలోకి చేరుకున్నాడు. మర్నాటి నుంచి పిసినారి జీవితం మామూలుగానే సాగిపోయింది. జనాలని పీక్కు తినడం, తన కడుపుని మాడ్చుకోవడం, డబ్బుని పోగుచేసుకోవడం! ఇదే అతని దినచర్యగా సాగింది. కాకపోతే వారం వారం ఊరిబయటకు వెళ్లి ఆ బంగారపు ఇటుకను బయటకు తీసి తనివితీరా చూసుకుని ఇంటికి చేరుకునేవాడు.   ఓ వారం ఎప్పటిలాగే పిసినారి ఊరిబయట చెట్టు కిందకు వెళ్లాక... అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మతిపోయింది. చెట్టు కింద గుంత తవ్వేసి ఉంది. బంగారపు ఇటుక మాయమైపోయింది. ఇంకేముంది! లబోదిబోమంటూ ఎడవడం మొదటుపెట్టాడు. పిసినారి ఏడుపుని చూసి అటుపక్కగా రహదారి మీద పోయేవారంతా చెట్టు కిందకి చేరుకున్నారు. వారిలో ఒక సాధువు, పినినారి భుజం మీద చేయి వేసి ఏమైందంటూ అనునయంగా అడిగాడు. పిసినారి భోరుభోరుమంటూ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. సాధువు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అన్నాడు... ‘నీదేమంత పెద్ద సమస్య కాదు. నీకు కావల్సింది గుంతను తెరిచి చూసుకోవడమే కానీ, అందులో ఉన్న ధనాన్ని వాడుకోవడం కాదు కదా! ఓ పని చేయి. ఓ బండరాయిని తీసుకుని ఆ గుంతలో పూడ్చిపెట్టు. వారం వారం వచ్చి దాన్ని చూసుకో! అదే బంగారం అనుకో. ఉపయోగపడనిదానికి, అది బండరాయి అయితేనేం, బంగారం అయితేనేం?’ అంటూ తన దారిన తను చక్కా పోయాడు.   పిసినారికి సాధువు మాటల్లోని మర్మం తెలిసి వచ్చింది. జీవితం కోసం డబ్బుని సంపాదించడం తప్పులేదు కానీ, డబ్బే జీవితంగా మారకూడదని బోధపడింది. రోజువారీ ఖర్చులకు, భవిష్యత్తులోని అవసరాలకు డబ్బుని సంపాదించాలే కానీ... కేవలం కూడపెట్టడం అనే ఒకే ఒక్క ఆశయంతో సంపాదన చేయకూడదని అర్థమైంది. అదే కనుక జీవితాశయం అయితే బంగారానికీ, బండరాయికీ తేడా ఏముంటుంది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara
మొటిమలు..నేటి సమాజంలో అత్యంత ఇబ్బంది కలిగించే సమస్యల్లో ఒకటి. చాలా మంది అనుకున్నట్లు, మొటిమలు కేవలం టీనేజర్లను మాత్రమే కాదు..అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడతాయి. కొంతమందికి పింపుల్స్ మరీ పీడకలలా వేధిస్తుంటాయి. చర్మాన్ని నాశనం చేయడంతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ఈ మొటిమల్ని నివారించడం ఎలా..? వాటి గురించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం రండి. 1. పింపుల్ అంటే ఏంటి..? మొటిమ అనేది చర్మానికి సంబంధించిన ఒక హార్మోనల్ డిజార్డర్. అవసరమైన దానికంటే ఎక్కువ ఆండ్రోజన్లు ఉత్పత్పి అయిన పక్షంలో, చర్మానికి అవరసమైన దానికంటే ఎక్కువ నూనె ఏర్పడుతుంది. ఇది చర్మం గ్రంథులు వ్యాపించేలా చేస్తుంది. దాన్ని పింపుల్ లేదా మొటిమ అని అంటారు. 2. మొటిమల్లో ఎన్ని రకాలుంటాయి..? పింపుల్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కోమెడోన్స్, క్లోజ్డ్ కోమెడోన్స్ అని వీటిని అంటారు. వాడుక భాషలో ఓపెన్ కోమెడోన్స్ ను వైట్ హెడ్స్ అని, క్లోజ్డ్ కోమెడోన్స్ ను బ్లాక్ హెడ్స్ అని పిలుస్తారు. వెంట్రుక పెరిగే చోట మూసుకుపోయి, నూనె చేరుకుని ఏర్పడి పింపుల్ ను బ్లాక్ హెడ్ అంటారు. కొవ్వు కారణంగా ఏర్పడిన,తెల్లగా కనబడే మొటిమల్ని వైట్ హెడ్స్ అంటారు. 3. షేవింగ్ కారణంగా పింపుల్స్ వస్తాయా..? ఆడవారిలోనే కాక, మగవారిలో కూడా పింపుల్స్ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉన్నవారు చాలా మందే ఉంటారు. షేవింగ్ కారణంగా పింపుల్స్ వస్తాయా అనేది చాలామందికి వచ్చే సందేహం. కేవలం షేవింగ్ కారణంగా ఇవి రానప్పటికీ, సరైన బ్లేడ్ లేదా షేవింగ్ క్రీమ్ ను వాడకపోతే, చర్మానికి ఎలర్జీ వచ్చి, మొటిమలుగా మారే అవకాశం ఉంది. 4. సెల్ ఫోన్స్ వాడకం కారణంగా పింపుల్స్ వస్తాయా..? బుగ్గలపైన, లేదా ఫోన్ ను ముఖం మీద ఆనించి ఉంచే చోటులో పింపుల్స్ ఉంటే, వాటికి మొబైల్ ఫోన్ వాడకం ఒక కారణమయ్యే అవకాశం ఉంది. రోజూవారీ వాడకంలో, చేతుల నుంచి మొబైల్ ఫోన్ కు అనేక రకాల మురికి, డస్ట్, బ్యాక్టీరియా చేరుతుంటుంది. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు, ఈ బ్యాక్టీరియా ముఖంపై చర్మానికి చేరుకునే అవకాశం ఉంది. రోజుకు ఒకసారైనా, మొబైల్ ను యాంటీ బ్యాక్టీరియల్ తో నీట్ గా తుడవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. 5. ఒత్తిడి పింపుల్స్ ను కలిగిస్తుందా..? పనిచేసే చోట, లేక పర్సనల్ లైఫ్ లో కలిగే రోజూ వారీ ఒత్తిళ్లు మానసికంగా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఒత్తిడి వలన డైరెక్ట్ గా పింపుల్స్ ఏర్పడే అవకాశం లేనప్పటికీ, ఇన్ డైరెక్ట్ గా కారణం కావచ్చు. ఒత్తిడి మరీ ఎక్కువై శరీరం హార్మోన్లు ఎక్కువ విడుదల చేస్తుంది. అది తిరిగి మొటిమలు ఏర్పడటానికే కారణం అవుతుంది. 6. సబ్బులు, యాంటీ పింపుల్ క్రీమ్స్ హెల్ప్ అవుతాయా..? సరైన సబ్బులు, యాంటీ పింపుల్ క్రీమ్స్ ను వాడితే, ఫలితం ఉండచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు, రోజుకు రెండు సార్లు యాంటీ పింపుల్ క్లెన్సర్ తో గానీ, ఆయిల్ స్కిన్ కు వాడే క్లెన్సర్ ను గానీ ఉపయోగిస్తే మొటిమలు తగ్గడానికి ఆస్కారం ఉంది. అయితే మరీ ఎక్కువ క్రీములను ఉపయోగించడం కూడా ప్రమాదకరమే. యాంటీ ఆయిల్ క్రీమ్స్ ముఖం లోని ఆయిల్ శాతాన్ని పూర్తిగా తగ్గించి స్కిన్ డ్రై అయిపోవడానికి దోహదపడతాయి. ఇది మొటిమల్ని మరింత ఎక్కువ చేస్తుంది. ఇలాంటి క్రీమ్స్ వాడాలనుకుంటే, స్కిన్ స్పెషలిస్ట్ సూచనల మేరకు వాడటం చాలా మంచిది. 7. పింపుల్స్ ను చిదిమేయచ్చా..? ఎక్కువ శాతం మందికి ఉండే క్వశ్చన్ ఇది. పింపుల్స్ ను చిదిమేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చా అని ఆలోచించే వారికి కొదువ లేదు. కానీ అలా చేయడం పింపుల్ ను తగ్గించకపోగా, మరింత ఎక్కువ చేస్తుంది. పైపెచ్చు విషమించి మరింత పెద్ద ఇన్ఫెక్షన్ లో కి దారి తీసే ప్రమాదం ఉంది. చిదిమిన తర్వాత పింపుల్ లో ఉండే బ్యాక్టీరియా మరింత లోతుకు వెళ్లిపోయి పుండుగా మారిపోయే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి వాటిని సహజంగా తగ్గించడమే సేఫ్ తప్ప, చిదిమడం అంత మంచిది కాదు. అన్నింటికీ మించి మొటిమల సమస్యలతో బాధపడే వారు ప్రతీ రెండు మూడు గంటలకోసారి కేవలం నీటితో ముఖాన్ని కడుక్కోవడం ద్వారా పింపుల్స్ సమస్య అదుపులోకి తెచ్చుకోవచ్చు. 
The occurence of headcahes is very common. WHO states that tension headaches are the second most disabling condition in the world, with migraine being third. When headache strike what hurts is not the brain because brain lack pain-sensitive nerves. but several areas over head including scalp, face, mouth and throat may hurt due to the presence of pain-sensitive nerve fibres. It might be shocking to know that there are different types of headaches! 1. Migraine - A migraine headache is throbbing pain, usually localised to one side of the head, which may be severe and last from few hours to days. It may be accompanied with nausea, vomiting, sensitivity to light and noise and visual disturbances. This runs in families, and women are most likely to be afffect when compared to men! 2. Cluster Headaches - These aren't common. They are one-sided stabbing pain that last for an hour or two. They may occur one or more times  a day for a few days or weeks to months, sometimes at the same time of day also, hence the term 'cluster'. They are more prevalent in men than women. 3. Tension Headache - The most common form of headache, which is caused bymuscle tension in head neck and shoulders. It is steady, non-throbbing mild to moderate pain on both sides of the head. It may be caused by stressfull situations, thus also called stress-headache. 4. Hormonal Headaches and Migraine - Few women experience headaches and migraines simultaneously at times when their hormae levels go haywire, usually during menustruation. we are yet to find out what is triggering these demons on women! 5. Exertion Headache - some poeple experience headaches post -physical strain, though these are harmless, but at times they might be due to the underlying bleed, tumours or arterial disorders. It is best advised to ee a doctor when you are striked by exertion headache. 6. Eye-strain Headache - Seen in poeple who do not address their visual problem wit prescribed glasses or contact lens. It causes pain and heaviness around the eye. Some eye conditions such glaucoma, astigmatism and presbyopia can also cause headache. 7. Secondary Headache - Secondary headaches are a common symptom secondary disorders, such as sinus infections, severe hypertension, inflammation of the temporal artery and hangover. Take Care!! Stay Healthy!!
ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ... ఒత్తిడితో చేసే ఉద్యోగం వల్ల నానారకాల రోగాలు మనల్ని పట్టిపీడిస్తాయంటూ ఆ మధ్య కొన్ని పరిశోధనలు నిరూపించాయి. సదరు ఒత్తిడితో పాటుగా ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలన్నీ మనల్ని చుట్టుముడతాయని తేలిపోయింది. కానీ తాజాగా ఒక పరిశోధన ఒత్తిడిలో చేసే ఉద్యోగం మంచిదే అంటోంది. కాకపోతే దాని కోసం కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదని చెబుతోంది. ఏడేళ్ల పరిశీలన ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశీలన కోసం ఒక 2,363 మంది ఉద్యోగులను ఎన్నుకొన్నారు. వీరందరూ కూడా యాభై ఏళ్లు పైబడినవారే. ఇలా ఎన్నుకొన్న అభ్యర్థులని ఏడేళ్ల పాటు నిశితంగా గమనించారు. ఈ పరిశీలనలో ఉద్యోగంలో ఒత్తిడికీ, మరణాలకీ ఖచ్చితమైన సంబంధం బయటపడింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవారు త్వరగా చనిపోయేందుకు 15.4 శాతం అధికమైన అవకాశం ఉన్నట్లు తేలింది. పనిలో పనిగా బయటపడిన మరో ఫలితం వారిని నిర్ఘాంతపరిచింది. ఒత్తిడితో మృత్యువు దూరం ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు సుదీర్ఘకాలం బతికినట్లు తేలింది. ఉద్యోగం ఎంత కఠినమైనదైనప్పటికీ, లక్ష్యాలు ఏర్పరిచే అవకాశం దగ్గర్నుంచీ వాటిని సాధించే విధానం దాకా అన్నీ ఉద్యోగికి అందుబాటులో ఉన్నప్పుడు అది అతని ఆరోగ్యం మీద అనుకూల ప్రభావమే చూపుతోందని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఏకంగా 34 శాతం తక్కువగా ఉందట. ఒత్తిడి ఒకోసారి బాగుంటుంది ఒక పక్క ఒత్తిడిలో ఉండి, దానిని పరిష్కరించేందుకు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేని వ్యక్తులు... సదరు ఒత్తిడిని అధిగమించేందుకు అతిగా తినడమో, సిగిరెట్లు కాల్చడమో వంటి పనులు చేస్తుంటారట. ఇక మనసులోనే తిష్టవేసుకునే ఒత్తిడి వలన రక్తపోటు ఎలాగూ తప్పదు. అదే సమయంలో బాధ్యతలూ నీవే, హక్కులూ నీవే అన్న భరోసాని ఉద్యోగికి కల్పించినప్పుడు అతను అదే ఒత్తిడిని ఒక సవాలుగా తీసుకుంటాడు. దానిని ఎదుర్కోవడాన్ని, తద్వారా తనని తాను నిరూపించుకోవడాన్నీ ఇష్టపడతాడు. వింటానికి బాగుంది కానీ... ‘నిర్ణయాలు తీసుకునే అధికారం’ అన్న వాక్యం వినడానికి బాగుంది కానీ... ఆ అదృష్టం ఎంతవరకూ, ఎంతమందికి లభిస్తుందన్నదే అనుమానం. ఒత్తిడి మాత్రమే ఉండి స్వేచ్ఛ లేని సందర్భాలలో దానిని ఎదుర్కొనేందుకు మనసుని స్థిరంగా ఉంచుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం... వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించమని చెబుతున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ, వీటిని ఎంతమంది పాటిస్తారన్నదే అనుమానం!!!   - నిర్జర.
Do you love drinking coffee? If that is true, then I have some good news for you. Did you know? By drinking coffee, you are protecting your liver from many diseases. Read on to find out more. This news has come from the nation of coffee lovers - Canada, on World Coffee Day. With 63% of them consuming coffee everyday, it made them very happy to know that they were doing a favor on their liver while satisfying their coffee cravings. So what does coffee do to protect your liver. Here’s a list of few benefits you receive by consuming a minimum of 3 cups of coffee per day. • Improving  abnormal liver blood tests including ALT, AST and GGT • Preventing fatty liver disease by reducing insulin resistance; • Enhancing response to treatment for  chronic hepatitis C • Reducing  the risk  of cirrhosis due to alcohol or viral hepatitis • Reducing the risk of  hepatocellular carcinoma (liver cancer) Now, that’s a lot, isn’t it? Most of the time, we don’t recognize a liver disease until its beyond repair. With coffee we are unknowingly saving our liver or sometimes repairing the damage caused by alcohol consumption. After a thorough research, it is advised by Seinäjoki Central Hospital and the University of Tampere in Finland, that heavy alcohol consumption must be compensated with 5 cups of coffee or more. This may undo the damage caused by alcohol. So grab that coffee mug to save your liver!   -Kruti Beesam