LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
  India has achieved an exceptional record in the ongoing Asian Games. Rahi Sarnobat has become the first Indian woman to grab a gold medal in the 67 year old history of Asian Games. However the achievement of Rahi was not surprising looking at her past. She has already bagged two gold medals at the 2010 Delhi Commonwealth Games and a bronze in the 25m pistol pairs event at the 2014 Incheon Asian Games. She is also the sixth Indian to shoot  gold in the Asian games. India now stands at the 7th position with 4 gold, 3 silver and 8 bronze medals. And there are many more events yet to come which could shower medals to Indian athletes.  
Humanity would certainly show up from unexpected parts when a calamity occurs. Here is an example for that. A temple hall in Kochukadavu village of Thrissur district was offered for Eid prayers during the holy festival of Bakrid. Around 200 Muslim devotees entered the temple hall and participated in the prayers as the nearby mosque at Kochukadavu still remained in flood waters. The temple hall was also serving as the relief camp for the people of Kochukavdu and nearby Kuzhur village as well. However this is not only the isolated incident of communal harmony in Kerala. A mosque in Malappuram district has provided shelter and food to neighbouring Hindu families.
ALSO ON TELUGUONE N E W S
తెలుగు ప్రేక్షకులు విషాదాంత ముగింపును జీర్ణించుకోలేరని చెప్పడానికి పలు సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి. తమిళ, కన్నడ సినిమాల్లో ఉన్నట్టు తెలుగులో సాడ్ ఎండింగ్స్ తక్కువ. ఈ సెంటిమెంట్ పక్కన పెట్టిన 'సైరా నరసింహారెడ్డి' టీమ్ విషాదాంత ముంగిపు వైపు మొగ్గు చూపింది. చరిత్రలోకి తొంగి చూస్తే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తెల్లదొరలు ఉరి తీశారు. చరిత్రలో ఉన్నది ఉన్నట్టు తీశామని దర్శకుడు సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. విషాదాంత ముగింపును ప్రేక్షకులు హర్షిస్తారా? అనే ప్రశ్నకు... "ఉయ్యాలవాడ ఉరి తరవాత ఆయన తలను 30 ఏళ్లు కోటగుమ్మానికి వేలాడదీశారు. తెల్లదొరలు అలా చేశారు అంటే, వాళ్లను ఉయ్యాలవాడ ఎంత భయపెట్టి ఉండాలి? నా దృష్టిలో అది గొప్ప విక్టరీ. ఉయ్యాలవాడ మరణంతో భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమం మొదలైంది. ఆయన జీవితం, త్యాగం, మరణం... గొప్ప విజయం" అని ఆయన అన్నారు. దీన్నిబట్టి 'సైరా నరసింహారెడ్డి'లో చిరంజీవి పాత్ర మరణిస్తుందని ఊహించవచ్చు. ఆల్రెడీ ట్రైలర్ లో ఉరికంబంలో నిలబడిన చిరంజీవి విజువల్స్ చూపించి... ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నారు.
హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఇదివరకు 'గౌతమ్ నందా' సినిమా వచ్చింది. గౌతమ్, నందా అనే రెండు భిన్న పాత్రల్లో గోపి నటనకు ప్రశంసలు లభించాయి. వాటిలో ఒకటి నెగటివ్ కేరెక్టర్ కావడం గమనార్హం. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఆశించిన రీతిలో ఆడలేదు. అయితే గోపి, సంపత్ మరోసారి కలిసి పనిచేయడానికి అదేమీ అడ్డు కాలేదు. అవును. గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బేనర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు. ఇంతకుముందు ఆయన సమంత ప్రధాన పాత్ర పోషించిన 'యు టర్న్' మూవీని నిర్మించారు. గోపి, సంపత్ కాంబినేషన్ మూవీని హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యేది, హీరోయిన్ ఎవరు, ఇతర కీలక పాత్రధారులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ మూవీకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను దర్శకుడు సంపత్ స్వయంగా సమకూరుస్తున్నారు.
దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకలోకం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది. ఒకరితో మరొకరు సినిమా చేయాలని వీరిద్దరూ ఎదురు చూస్తున్నారు. మహేష్, రాజమౌళికి నిర్మాత కె.ఎల్. నారాయణ అడ్వాన్సులు ఇచ్చారు. ఆయన నిర్మాణంలో సినిమా ఉంటుంది. మరొకరు నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది. జనవరి 2020 తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు సెట్స్ మీదకు వెళుతుందని ఇండస్ట్రీ టాక్. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చేస్తున్నారు. జనవరికి ఆ సినిమా విడుదల అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి చేస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలన్స్ ఉంటాయి. అవి పూర్తి చేసి, సినిమా పబ్లిసిటీపై దృష్టి పెట్టి జూలైలో సినిమా విడుదల అయ్యేవరకూ రాజమౌళి బిజీ. మధ్యలో మహేష్ కథపై కొంత దృష్టి పెట్టినా... 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల తర్వాతే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలరు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల తర్వాత మహేష్ బాబుతోనే రాజమౌళి సినిమా ఉండటం ఖాయమని ఫిలింనగర్ టాక్.
  '13 బి', 'ఇష్క్', 'మనం', '24'.. ఈ సినిమాల పేర్లు చాలదూ.. ఒక డైరెక్టర్ ఎంత ప్రతిభావంతుడో చెప్పడానికి! మరి అంతటి టాలెంటెడ్ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్‌కి ఏమైంది? అతని మ్యాజిక్ ఏమైంది?.. అనే మాటలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఏ తరహా కథ అయినా ఒక థ్రిల్లర్ తరహాలో రూపొందించే దర్శకుడిగా విక్రమ్ కుమార్ పేరు తెచ్చుకున్నాడు. అతని బలమంతా స్క్రీన్‌ప్లేలో ఉందని విమర్శకులు భావిస్తూ వచ్చారు. కానీ ఇవాళ ఆ స్క్రీన్‌ప్లేలోనే అతను బలహీనంగా కనిపిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అఖిల్ అక్కినేనితో అతను రూపొందించిన సినిమా 'హలో'.. బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్లే హిట్ కాలేకపోయింది. రమ్యకృష్ణ కేరెక్టర్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు బోర్ ఫీలవడం, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌కి తావులేని విధంగా స్క్రీన్‌ప్లే తయారు చేసుకోవడం, వాళ్లిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు ఆకర్షణీయంగా లేకపోవడం.. వంటి కారణాలతో ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. ఇప్పుడు నానితో అతను రూపొందించిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' సైతం అదే దారిలో వెళ్తోందని ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. తొలి వారాంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 56 శాతం రికవరీ సాధించిన ఆ సినిమా వసూళ్లు సోమవారం నుంచి భారీ స్థాయిలో పతనమవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఈ ఏరియాల్లో ఆ సినిమా కేవలం 6 శాతం రికవరీనే రాబట్టింది. వెరసి 62 శాతం రికవరీ అయ్యిందన్న మాట. ఆ తర్వాత కూడా థియేటర్లలో జనం పలచగానే కనిపిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే లాభాల మాట అటుంచి, బయ్యర్లు సేఫ్ అవడం అసాధ్యమనే మాట గట్టిగా వినిపిస్తోంది. సినిమా సినిమాకీ కథల ఎంపికలో విలక్షణత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న విక్రమ్.. 'గ్యాంగ్ లీడర్'ని కామెడీ మేళవించిన రివెంజ్ డ్రామాగా రూపొందించాడు. కానీ స్క్రీన్‌ప్లే డల్‌గా ఉండటం వల్లే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగినా, ఇంటర్వెల్ తర్వాతి నుంచీ కథలో అదే క్యూరియాసిటీని మెయిన్‌టైన్ చెయ్యడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. గ్యాంగ్ మెంబర్స్‌కు సంబంధించిన ట్విస్టులు టీవీ సీరియళ్ల ట్విస్టుల్లా ఉన్నాయనే మాట వినిపిస్తున్నదంటేనే.. అతని స్క్రీన్‌ప్లే ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా విక్రమ్ మేల్కొని.. సబ్జెక్ట్‌తో పాటు తన స్క్రీన్‌ప్లేలో దొర్లుతున్న లోపాల్ని సరిచేసుకోగలిగితేనే మునుముందు జనాకర్షకంగా సినిమాలు తియ్యగలుగుతాడు.. లేదంటే.. 'హలో', 'నానీస్ గ్యాంగ్ లీడర్' ఫలితాలే రిపీట్ అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేసిన కేరెక్టర్లనీ ఒకెత్తయితే, 'వాల్మీకి'లో చేసిన గద్దలకొండ గణేశ్ కేరెక్టర్ ఇంకో ఎత్తు. వయొలెంట్‌గా, వైల్డ్‌గా కనిపించే కేరెక్టర్‌లో మొదటిసారి మనం చూడబోతున్నాం. నటుడిగా వేరియేషన్ చూపించే కేరెక్టర్ అతడికి దొరికింది. ఇలాంటి కేరెక్టర్ చెయ్యాలని అతను ఎందుకు అనుకున్నాడు? నటుడిగా తనకు ఎలాంటి బౌండరీస్ ఉండకూడదని అనుకుంటాడు వరుణ్. ఏదో ఒక ఇమేజ్‌కే పరిమితమవ్వాలని అతడికి లేదు. 'వరుణ్.. ఏ కేరెక్టరైనా చేస్తాడు'.. అనిపించుకోవాలనేది అతడి తపన. 'హీరో ఎప్పుడూ ఎందుకు మంచోడై ఉండాలి? చెడ్డవాడు అయినప్పుడు ఎలా ఉంటుంది?' అని వరుణ్ అనుకుంటున్న రోజుల్లోనే హరీశ్ శంకర్ అతని దగ్గరకు తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ' స్క్రిప్టును తీసుకువచ్చాడు. అది నచ్చి, చెయ్యాలనుకున్నాడు. అలా అని వెంటనే నిర్ణయం తీసుకోలేదు. స్నేహితులు, సన్నిహితులు "బ్యాడ్ గై కేరెక్టర్ చెయ్యడం కరెక్ట్ కాదేమో.. చూసుకో" అని సలహా ఇచ్చారు. మూర్ఖంగా ఉండకుండా పక్కవాళ్లు చెప్పేది వినాలనుకున్నాడు వరుణ్. అయితే మిగతా వాళ్ల కంటే ఒక వ్యక్తి మాటపై అతనికి ఎక్కువ గురి. ఆ వ్యక్తి చెప్పాడంటే ఆలోచించకుండా చేసేస్తాడు వరుణ్. ఆ వ్యక్తి.. మెగాస్టార్ చిరంజీవి. ఆయనను చిన్నప్పట్నుంచీ 'డాడీ' అనే పిలుస్తాడు వరుణ్. ఆయనకు ఫోన్ చేసి, "డాడీ.. ఒక కథ అనుకుంటున్నాను. వింటారా?" అనడిగి, హరీశ్ శంకర్‌ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు. చిరంజీవి విన్నారు. "కథ చాలా బాగుంది. నువ్వు చెయ్యాలనుకుంటున్న కేరెక్టర్ అమేజింగ్‌గా ఉంది. ఈ సినిమా నువ్వు చెయ్యాలి" అని చెప్పడమే కాకుండా, చిన్న చిన్న మార్పులు కూడా సూచించారు. చిరంజీవి ఓకే అనడంతో మరో ఆలోచన లేకుండా 'వాల్మీకి'కి ఓకే చెప్పేశాడు వరుణ్. ఇక గద్దలకొండ గణేశ్ లుక్ ఎలా ఉండాలనే విషయంలో వరుణ్, హరీశ్ శంకర్ మధ్య ఎక్కువ చర్చే నడిచింది. వరుణ్ ధ్యాస అంతా తొలినాళ్లలో చిరంజీవి కనిపించిన రూపంపైనే ఉంది. ముఖ్యంగా చిరంజీవి తొలిసారి నటుడిగా కెమెరా ముందుకు వచ్చిన 'పునాది రాళ్లు' సినిమాలో కనిపించిన విధానమంటే వరుణ్‌కు బాగా ఇష్టం. అందులో నుదుటున పడే విధంగా బాగా పెంచిన ఉంగరాల జుట్టు అంటే మరీ ఇష్టం. ఆ లుక్‌లో కనిపిస్తానని వరుణ్ రిఫరెన్స్ చూపడంతో హరీశ్ శంకర్ సైతం సరే అనేశాడు. అలా గద్దలకొండ గణేశ్‌గా ఆ లుక్‌ను అడాప్ట్ చేసుకున్నాడు వరుణ్. లుక్ సరే.. డైలాగ్ డెలివరీ మాటేమిటి?.. అనేది నెక్స్ట్ ఇష్యూ. కారణం.. గణేశ్ మాట్లాడేది రూరల్ తెలంగాణ యాస. 'ఎఫ్ 2' మూవీలో వరుణ్ హైదరాబాదీ అబ్బాయిగా తెలంగాణ యాసలో మాట్లాడినా.. రూరల్ తెలంగాణ యాసతో పోలిస్తే అది సాఫ్ట్ కింద లెక్క. గ్రామీణ తెలంగాణ యాస కొట్టినట్లుగా ఉన్నా, అది చాలా స్వచ్ఛమైంది. హరీశ్ శంకర్ రూరల్ తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఆ యాసపై ఆయనకు గట్టి పట్టు ఉంది. అందువల్ల ఆ యాసలో డైలాగ్స్ రాశాడు. ఆ యాసలో మాట్లాడటానికి హరీశ్‌తో చాలా సమయం వెచ్చించాడు వరుణ్. హరీశ్ చెప్తుంటే, యాసలో డైలాగ్స్ ఎలా చెప్పాలో తెలుసుకుటూ వచ్చాడు. అలా ఇందులో వరుణ్ డైలాగ్ డెలివరీకి హరీశ్ శంకర్ చాలా హెల్ప్ చేశాడన్న మాట. సెట్స్‌పై సీన్‌లో నటించేప్పుడు డైలాగ్ చెప్పడం వేరు.. ఆ తర్వాత లిప్ మూమెంట్‌కు తగ్గట్లు డబ్బింగ్ థియేటర్‌లో డబ్బింగ్ చెప్పడం వేరు. గద్దలకొండ గణేశ్ కేరెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడానికి వరుణ్ కాస్త శ్రమించాడనే చెప్పాలి. సినిమాలో మిగతా పోర్షన్‌కు పెద్ద కష్టపడకుండానే డబ్బింగ్ చెప్పినా ఇంటర్వెల్ సీక్వెన్స్‌కు చెప్పడానికి కష్టపడ్డాడు వరుణ్. ఇంటెర్వెల్ బ్లాక్ 20 నిమిషాలుంటుంది. వరుణ్ పర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న సీక్వెన్స్. అమేజింగ్ ట్విస్ట్ ఉన్న సీన్. మామూలుగా అయితే రెండు మూడు గంటల్లో ఆ సీక్వెన్స్‌కు డబ్బింగ్ చెప్పేయొచ్చు. కానీ ఆ ఒక్క ఎపిసోడ్‌కు డబ్బింగ్ చెప్పడానికి ఒక రోజంతా తీసుకున్నాడు వరుణ్. ఎందుకంటే.. ఆ సీన్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. రేపు ప్రేక్షకులు కచ్చితంగా ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటారనే గట్టి నమ్మకాన్ని వరుణ్ వ్యక్తం చేస్తున్నాడు. 'జిగర్తాండ'లో ఈ కేరెక్టర్ చేసిన బాబీ సింహాను చూస్తే మనకు భయమేస్తుంది. అతని పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. 'వాల్మీకి'లో గద్దలకొండ గణేశ్‌ను చూసినా అంతే భయపడతారని యూనిట్ మెంబర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఒక డిఫరెంట్ లెవల్లో ఆ కేరెక్టర్‌ను వరుణ్ చేశాడనేది వాళ్ల మాట.
  మెగా ఫ్యాన్స్.. కాదు కాదు..అందరు హీరోల ఫ్యాన్స్.. దేశంలోని ఫిల్మ్ లవర్స్ అందరూ ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తోన్న 'సైరా.. నరసింహారెడ్డి' ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. 2 నిమిషాల 53 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. గూస్‌బంప్స్ వచ్చాయని చెప్పడం చిన్న మాట. కొద్ది రోజుల క్రితం టీజర్‌లో మనం చూసింది చాలా తక్కువ అనీ, సినిమాలో మనం చూడబోయేది చాలా ఉందనీ ట్రైలర్ చూశాక అర్థమైంది. ఒళ్లు గగుర్పాటు గొలిపే ఆ సన్నివేశాలేమిటి! చూసే కళ్లు మరీ ఇంత చిన్నగా ఉన్నాయేమిటి అని మనం ఫీలయ్యేలా చేసిన ఆ కెమెరా పనితనమేమిటి? ఆ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ తీరేమిటి! ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి హావభావ ప్రదర్శన ఏమిటి! మహా పరాక్రమశాలిగా చేసిన ఆ ఖడ్గచాలనమేమిటి!! చిన్న ట్రైలర్‌లోనే ఎన్ని విశేషాలు!!!  మనం ఊహించిన దానికంటే 'సైరా'లో చాలా చాలా విశేషాలుండబోతున్నాయని ప్రామిస్ చేస్తోంది ట్రైలర్. "నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతనొక కారణజన్ముడు" అనే మాటలు వినిపిస్తుండగా, కాళ్లూ, చేతులూ గొలుసులతో బంధించిన ఖైదీగా చిరంజీవి చెరశాల నుంచి మెట్లెక్కుతూ బయటకు రావడంతో ట్రైలర్ మొదలయింది. ఆ తర్వాత "అతనొక యోగి", "అతనొక యోధుడు", "అతన్నెవ్వరూ ఆపలేరు" అనే మాటలు నేపథ్యంలో వినిపించాయి. అవి వినిపించే సమయంలో నరసింహారెడ్డి ధ్యానం చేస్తున్న దృశ్యం చూపించారు. యోధుడిగా బ్రిటిషర్ల శరీరాల్ని ఆయన ఖడ్గం తుత్తునియలు చేసే సన్నివేశాలు, ఆయన వీరత్వాన్ని చాటిచెప్తున్నాయి. దర్శకుడు నరసింహారెడ్డి పాత్రను చరిత్రను మించి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని మలిచినట్లుగా అర్థమవుతుంది. ఒకవైపు దేశభక్తిని రగిలిస్తూనే, హీరోయిజానికి పరాకాష్ఠ అన్నట్లుగా ఆ పాత్రను సురేందర్ రెడ్డి తీర్చిదిద్దాడని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అందుకే ట్రైలర్ చూస్తుంటే ఒక భావోద్వేగంతో, ఒక ఉత్తేజంతో మనం ఊగిపోతాం. పొలానికి వచ్చి తమను శిస్తు కట్టమన్న బ్రిటిష్ ఆఫీసర్‌కు "ఈ భూమ్మీద పుట్టింది మేము. ఈ మట్టిలో కలిసేది మేము.. మీకెందుకు కట్టాలిరా శిస్తు?" అని ఆగ్రహంగా ప్రశించాడు నరసింహారెడ్డి. తన మీదకు కత్తి దూసిన అతడ్ని చావగొట్టాడు. "స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న తొలి యుద్ధమిది. యుద్ధంలో నువ్వు గెలవాలి" అని గురువు గోసాయి వెంకన్న ఆశీర్వదిస్తే, "నీ గెలుపును కళ్లారా చూడాలని వచ్చాను. సైరా.. నరసింహారెడ్డి" అన్నాడు అవుకు రాజు. అంతేనా.. నరసింహారెడ్డితో చేతులు కలిపి బ్రిటిషర్లతో పోరాడాడు. తన వీరత్వాన్ని ప్రదర్శించాడు. "వీరత్వానికి పేరుబడ్డ తమిళభూమి నుంచి వచ్చా. రాముడికి లక్ష్మణుడిలా నీకూడా ఉంటాను. అది విజయమో.. వీర మరణమో" అని నరసింహారెడ్డితో కలిసి రణభూమికి నడిచాడు రాజాపాండి. అన్నట్లే నదిలో బ్రిటిష్ సైనికుల్ని తన కత్తితో అడ్డంగా నరికేశాడు. "లక్ష్మి అనే నా పేరు ముందు నరసింహా అనే పేరివ్వండి చాలు" అని లక్ష్మి అంటే, "నన్ను మాత్రం వదలనని మాటివ్వండి" అని సిద్ధమ్మ అడుగుతుంది. ఆమెకు మాటిచ్చాడు నరసింహారెడ్డి. అయితే ఇటు భార్య, అటు ప్రేయసి మధ్య నరసింహారెడ్డి కొంత నలిగి ఉంటాడని మనం ఊహించవచ్చు. గుర్రబ్బండ్లపై శవాలై వచ్చిన తమ సైనికుల్ని చూసి ఆగ్రహంతో "సిద్ధంకండి. నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని ముక్కల్ని చేస్తాను" అని ఇంగ్లీషులో బ్రిటిష్ దొర హెచ్చరించాడు. "ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి" అని యాక్టర్ పృథ్వీ వాయిస్ వినిపించింది. జనం "మా గుండెల్లో ఉన్నాడు" అని గుండెలు చూపించారు. "షూట్ దెం" అంటూ బ్రిటిష్ దొర ఆర్డర్ వెయ్యడంతో తుపాకులు గర్జించాయి. జనాల ఒళ్లు తుపాకీ గుళ్లతో జల్లెడలా మారాయి. ఆ వెంటనే ఒక పిల్లవాడ్ని బ్రిటిషర్ ఈడ్చుకుంటూ మంటల్లో విసిరేసే సన్నివేశం చూస్తుంటే గుండెలు అవిసిపోయాయి. "స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా. నా దేశం వదిలి వెళ్లిపోండి. లేదా యుద్ధమే" అని తన వద్దకు రాయబారిగా వచ్చిన వ్యక్తికి చెప్పాడు నరసింహారెడ్డి. అంతకు ముందు కోట గోడపై జెండా పట్టుకొని నిల్చొన్న నరసింహారెడ్డిని చూస్తే ఒళ్లు పులకాంకితమవుతుంది. ఉరికంబం ముందు నిల్చొని "భారతమాతకీ" అని ఎలుగెత్తి నరసింహారెడ్డి నినదిస్తే, తమ కళ్లముందే ఆ ఉరితీతను ప్రత్యక్షంగా చూస్తున్న జనం "జై" అని గొంతు కలిపారు. ఆ ఉరి సన్నివేశ చిత్రీకరణ ఒళ్లు జలదరించేట్లు ఉంటుందని కెమెరా పనితనం చెబుతోంది. శిక్ష విధిస్తూ "చివరి కోరికేమైనా ఉంటే టెల్ మి నౌ ఇన్ ఒన్ సెంటెన్స్" అని బ్రిటిష్ జడ్జి అడిగితే, "గెటౌట్ ఫ్రం మై మదర్‌ల్యాండ్" అని గర్జించాడు నరసింహారెడ్డి.. వాట్ ఎ ట్రూ వారియర్!  మొత్తంగా చూస్తే.. 'సైరా'.. ఒక విజువల్ ఎక్స్‌ట్రావేగంజా అనేది స్పష్టం. టాలీవుడ్ హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టించే సత్తా ఈ సినిమాకు ఉందని ట్రైలర్‌లో చూసిన కొద్ది సన్నివేశాలతోనే మనకు గట్టి నమ్మకం కలుగుతోంది. కేవలం వార్స్ సీన్స్‌ను మాత్రమే గ్రాండియర్ స్కేల్‌లో తియ్యలేదనీ, ప్రతి సన్నివేశాన్నీ, ప్రతి షాట్‌నీ చాలా శ్రద్ధతో.. ఒక శిల్పి శిల్పాన్ని అందంగా చెక్కిన తీరు మాదిరిగా.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెక్కాడనీ తెలుస్తోంది. పైకి ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమాగా కనిపించవచ్చు. కానీ ట్రైలర్‌తో ఈ సినిమా చాలామందికి గొప్ప పేరు తెస్తుందనీ, పర్ఫార్మెన్స్ పరంగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో కనిపిస్తోన్న ఈ సినిమా టాలీవుడ్ రికార్డుల్నే కాకుండా ఇండియన్ సినిమా రికార్డుల్ని సైతం బద్దలు కొడుతుందనీ, అంతటితో ఆగకుండా నేషనల్ లెవల్లో ఎన్నో అవార్డుల్ని కొల్లగొడుతుందనీ అనిపించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
  రాఘవేంద్రరావు: "నాదొక చిన్న కోరిక. పూజా నువ్విస్తావా? హరీశ్ నువ్వు చెప్పు.. పూజ ఏ బిందె నడుం మీద పెట్టుకుందో అది నాకు గిఫ్ట్‌గా ఇచ్చి పంపిస్తావా?" హరీశ్ శంకర్: "పూజని చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపించింది?" రాఘవేంద్రరావు: "అనుమానం లేకుండా చెర్రీ అయితే బాగుంటుంది." .. ఈ సంభాషణ 'వాల్మీకి' మూవీ 'ఎల్లువొచ్చి గోదారమ్మా' వీడియో ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'దేవత' సినిమాలో శోభన్‌బాబు, శ్రీదేవిపై చిత్రీకరించిన 'ఎల్లువొచ్చి గోదారమ్మా వెల్లాకిల్లా పడ్డాదమ్మో' పాట ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పటికీ ఆ పాట ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. వెయ్యి బిందెలతో ఆ పాటను రాఘవేంద్రరావు చిత్రీకరించారు. అదే పాటను 'వాల్మీకి'లో వరుణ్‌తేజ్, పూజా హెగ్డే జంటపై డైరెక్టర్ హరీశ్ శంకర్ చిత్రీకరించాడు. ఆ ఐకానిక్ సాంగ్‌కు నీరాజనంగా ఆయన కూడా బిందెలతోటే ఈ పాటను తియ్యడం గమనార్హం. ఈ పాటకు మిక్కే జె. మేయర్ స్వరాలు సమకూర్చాడు. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ పాట వీడియో ప్రోమోను రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఆ పాటను తిలకించిన తర్వాత ఆయన మాట్లాడారు. "ముందుగా ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్ఠలు రావడానికి కారణమైన 'దేవత' నిర్మాత రామానాయుడుగారు, గేయరచయిత వేటూరి సుందరరామ్మూర్తి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తిగార్లను తలుచుకుంటున్నాను. ఈ సినిమా యూనిట్‌ నన్ను ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ పాట చూస్తుంటే మళ్లీ నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పాట తీసేముందు లొకేషన్స్‌ చూడటానికి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఉండ్రాజవరం అనే ఊళ్లో మా ఫ్రెండ్‌ డాబా మీద మడత మంచం మీద పడుకొని ఈ పాట ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఊరంతా ఠంగ్‌ ఠంగ్‌మని సౌండ్స్‌ వస్తున్నాయి. 'ఏమిటా సౌండ్‌?' అని అడిగితే.. 'ఇక్కడ బిందెలు తయారు చేస్తారు?' అని చెప్పారు. వెంటనే 'చాలా బిందెలుంటాయా?' అని అడిగాను. ప్రొడ్యూసర్స్‌ బాగుండాలని 'బిందెలు కొనే బదులు అద్దెకి ఇస్తారేమో అడుగు'.. అన్నాను. వారు ఒప్పుకొని పాట షూట్‌ చేసేటప్పటికి 1000 బిందెలు రెడీ చేసి ఇచ్చారు. ఈ సినిమా రివ్యూ రాస్తూ ఒక విలేకరి 'సినిమా అంతా బావుంది కానీ.. పాట వచ్చేటప్పటికి 1000 బిందెలు ఎట్లా వస్తాయో దర్శకుడికే తెలియాలి' అని రాశారు. తర్వాత నేనతన్ని కలిసినప్పుడు.. 'నువ్వుగానీ, మీ ఫ్రెండ్స్‌గానీ ఎవర్నైనా లవ్‌ చేశారా?' అనడిగితే.. 'మా ఫ్రెండ్స్ చేశారండీ' అన్నాడు. 'వాళ్లెప్పుడైనా డ్యూయెట్‌ పాడటం చూశావా? డ్యూయెట్‌ ఒప్పుకుంటే.. బిందెలు కూడా ఒప్పుకోవాలి' అన్నాను. పాట అనేది ప్రేక్షకుల కళ్లకి, చెవులకి ఆనందం కలిగించేది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిక్కీ పాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. 'గోపికమ్మా' దగ్గర నుండి నాకు ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. పూజాని చూసినరోజే 'ఈ అమ్మాయి టాప్‌ హీరోయిన్‌' అవుతుంది అన్నాను. వరుణ్‌ నటన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. 15 ఏళ్ల క్రితం ఈ ప్రొడ్యూసర్స్‌తో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈవిధంగా అవకాశం వచ్చినందుకు హ్యాపీ. 'దేవత' సినిమా 25 వారాలు ఆడినట్టు 'వాల్మీకి' సినిమా కూడా 25 వారాలు ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి" అన్నారు.
  'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ.. తన దృష్టినంతా క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై పెట్టాడు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ 'బ్రేకప్' అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విజయ్ దేవరకొండను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా క్రాంతి మాధవ్ నిర్ధారించేశాడు. అవును. విజయ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎస్. రామారావు సమర్పిస్తోన్న సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీని రామారావు కుమారుడు కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఒకరిద్దరు కాకుండా.. ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపే లవర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఆ నలుగురు భామలు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే. ఒక సెన్సిబుల్ సబ్జెక్టుతో క్రాంతి మాధవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడనీ, ఈ మూవీకి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తేనే తెలుస్తుందనీ సినిమా యూనిట్ చెబుతోంది. కాగా సెప్టెంబర్ 20న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకొన్న 'డియర్ కామ్రేడ్' నిరాశ కలిగించడంతో, 'వరల్డ్ ఫేమస్ లవర్'తో సక్సెస్ సాధించాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడు.
  'సైరా.. నరసింహారెడ్డి' రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ అందరిలోనూ క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను చూడాలని వాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా మొదలయ్యే వరకూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరో తెలీని వాళ్లకు ఇప్పుడు ఆయనెవరో తెలిసింది. 1857లో జరిగిందని హిస్టరీలో మనం చదువుకున్న ప్రథమ స్వాతంత్ర్య సమరానికంటే ఒక దశాబ్ద కాలం ముందుగానే బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ధీరుడిగా, వారి ఉరితీతకు గురైన సమరయోధుడిగా ఇవాళ చాలామందికి నరసింహారెడ్డి గురించి తెలుసు. ఆ పాత్రనే 'సైరా'లో మెగాస్టార్ పోషించారు. నరసింహారెడ్డి సరే.. ఈ సినిమాలో మహామహులైన కొందరు నటులు చేసిన పాత్రల గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఆ పాత్రల్ని పరిచయం చేసుకుందాం. బ్రిటిష్ దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డికి అండగా నిలిచిన గిరిజన నాయకుడు రాజా పాండి. తమిళ ప్రాంతానికి చెందిన ఆయన కూడా బ్రిటిషర్లను ధిక్కరించి పోరాడాడు. ఆ పాత్రను తమిళ హీరో, 'మక్కల్ సెల్వన్'గా ఫ్యాన్స్ పిలుచుకొనే విజయ్ సేతుపతి చేశాడు. పొడవాటి జుట్టు, నుదుటున విభూతి, మధ్యలో నిలువెత్తు తిలకంతో అతని ఆహార్యం ఆకట్టుకుంటోంది. పాలెగాడు అయిన నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న. ఆయన ప్రభావం నరసింహారెడ్డిపై ఎక్కువ. గురువు మాటను నరసింహారెడ్డి శిరసా వహిస్తాడని ఆయన కథ చెబుతోంది. అలాంటి వెంకన్న పాత్రను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేశారు. తెల్లగా నెరిసిన పొడవాటి జుట్టు, పెంచిన మీసాలు, గడ్డం, నుదుటున నిలువెత్తు కుంకుమ తిలకంతో గంభీరంగా కనిపిస్తోన్న అమితాబ్ రూపం ఆకట్టుకుంటోంది. గిద్దలూరు తిరుగుబాటు ఘటనలో నరసింహారెడ్డితో చేయి కలిపిన యోధుడు అవుకు రాజు. అవుకు రాజ్యానికి చెందిన అతను బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టాలపై నిరసనలు వ్యక్తం చేశాడు. ఆ పాత్రను 'అభినయ చక్రవర్తి'గా పేరుపొందిన కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ పోషించాడు. నలుపు దుస్తులు, నల్లగా నిగనిగలాడే పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మెలి తిప్పిన మీసంతో అవుకు రాజుగా సుదీప్ రూపానికి అందరూ ఫిదా అవుతున్నారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ అయినా, ఆయన మనసిచ్చిన ప్రేయసి లక్ష్మి. నరసింహారెడ్డి కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడని యువతి లక్ష్మి. ఆ పాత్రలో మిల్కీ బ్యూటీగా అందరూ పిలిచే తమన్నా భాటియా నటించింది. తన సహజ శరీర వర్ణానికి భిన్నమైన మేకప్‌తో ఆమె కనిపించనున్నది. ఆనాటి సంప్రదాయ వస్త్రాలంకరణ, ఆభరణాలతో తమన్నా రూపం కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి తెలియని వాళ్లెవరు? చిన్నప్పటి నుంచీ చరిత్ర పుస్తకాల్లోనూ, ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా లక్ష్మీబాయ్ గురించి చదువుకుంటూ వస్తూనే ఉన్నాం. నరసింహారెడ్డికి సమకాలీనురాలు. ఇక్కడ రేనాడులో బ్రిటిషర్లపై నరసింహారెడ్డి యుద్ధం ప్రకటిస్తే, అక్కడ ఉత్తర భారతంలోని ఝాన్సీ రాజ్యానికి రాణిగా పాలన చేస్తూ, బ్రిటిషర్లపై తిరగబడిన వీర వనిత. కొద్దిసేపు కనిపించే ఆ పాత్రను అనుష్క చేసింది. ఇప్పటికే 'రుద్రమదేవి' వంటి మహా యోధురాలైన చారిత్రక స్త్రీ పాత్ర చేసిన ఆమెకు ఇది రెండో హిస్టారికల్ రోల్. ఆమె ఆహార్యం ఎలా ఉంటుందనేది వెల్లడించకపోయినా, లక్ష్మీబాయ్ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆ పాత్రలో అనుష్క చెలరేగుతుంటే చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ. భర్తకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన సహధర్మచారిణి. నరసింహారెడ్డి మనసెరిగి నడచుకోవడమే కాకుండా, సదర్భం వచ్చినప్పుడు సలహాలిచ్చిన మేధావి. అలాంటి పాత్రలో దక్షిణ భారతావనిలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార నటించింది. సిద్ధమ్మగా తెలుగు సంప్రదాయ స్త్రీ మూర్తికి నిలువెత్తు అద్దంలా కనిపిస్తోన్న నయనతార ఆహార్యం అమితంగా ఆకట్టుకుంటోంది. నరసింహారెడ్డికి శత్రువులు బ్రిటిషర్లు మాత్రమే కాదు, వీరారెడ్డి కూడా శత్రువే. బ్రిటిషర్ల చేతికి నరసింహారెడ్డి దొరికిపోవడంలో వీరారెడ్డి పాత్ర ఉందని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అతనొక స్థానిక రాజు. ఆ పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించబోతున్నారు. సాఫ్ట్ హీరో నుంచి హార్డ్‌కోర్ విలన్‌గా మారి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తోన్న ఆయన వీరారెడ్డిగా దుష్టత్వాన్ని ఏ రీతిలో ప్రదర్సించి ఉంటారో ఊహించుకోవచ్చు. సగం నెరిసిన గడ్డం, పొడవాటి జుట్టు, తలపాగా, నుదుటున గుండ్రటి తిలకంతో నడివయసులో ఉన్న రెడ్డి రాజులా కనిపిస్తోన్న ఆయన ముఖంలో ప్రతినాయక హావభావాలు స్పష్టమవుతున్నాయి. ఇలా.. ఈ పాత్రలన్నింటి సమాహారమే 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ. ఈ కేరెక్టర్ల సపోర్టుతో నరసింహారెడ్డి కేరెక్టర్ ఏ రీతిలో ఎలివేట్ అవుతుందో, ఆ కేరెక్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో చెలరేగిపోయారో.. అక్టోబర్ 2న మనం చూడబోతున్నాం.
'జై సింహా' హిట్ కాంబినేషన్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో విలన్ ఎవరో తెలుసా? శతఫ్ ఫిగర్. పేరు కొత్తగా ఉంది కదూ. తెలుగు తెరకు ఈ నటుడు కూడా కొత్తే. బాలకృష్ణ కోసం బెంగాలీ నటుడ్ని విలన్ గా తీసుకొచ్చారు దర్శకుడు కె.ఎస్. రవికుమార్. ప్రజెంట్ శతఫ్ హిందీలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. రాజ్ కుమార్ హీరోగా నటించిన 'మేడ్ ఇన్ చైనా'లో కీ రోల్ చేశాడు. 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో హీరో కార్తీక్ ఆర్యన్ కి ఫాదర్ గా నటిస్తున్నాడు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న 'షేర్ షా'లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.    
  గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల... గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్.. వారణాసిలో ఎంస్ పూర్తి చేశారు. అసలు ఆరోజుల్లో వైద్య విద్యను అభ్యసించడమే గొప్ప అయితే, ఎంఎస్ పూర్తి చేయడం మరో సంచలనం. అంతేకాదు నర్సరావుపేటలో సొంతంగా ఆస్పత్రిని నెలకొల్పి రూపాయికే వైద్యం అందించడంతో పల్నాడులో కోడెల పేరు మోరుమోగిపోయింది. రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న కోడెలను ప్రజలు ఎంతో అభిమానించేవారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కోడెలను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారు. ఎన్టీఆర్ స్వయంగా కోరడంతోనే అతి చిన్న వయసులో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కోడెల. అయితే, రాజకీయాల్లో వచ్చినా, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినప్పటికీ, కొద్దిరోజులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. అందుకే కోడెల అంటే పల్నాడు ప్రజలకు అంత అభిమానం. కోడెలపై పల్నాడు ప్రజలకున్న అభిమానమే ఆయన్ను వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. 1983లో మొదటిసారి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్... అప్పట్నుంచి 1999వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో తిరుగులేని, ఎదురులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88 మధ్య హోంమంత్రిగా, అలాగే, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, 2004, 2019 ఎన్నికల్లో కోడెల ఓటమి చెందారు. 2014లో మళ్లీ సత్తెనపల్లి నుంచి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా సేవలందించారు. అయితే, కోడెలది తలదించని వ్యక్తిత్వం.... తలవంచని మనస్తత్వం... అంతేకాదు అత్యంత సున్నిత మనస్కుడు... స్నేహశీలి... పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి... అదే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలిగొంది. చిన్న ఆరోపణను కూడా తట్టుకోలేని మనస్తత్వం కోడెలది... అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే  ఒక్క కోడెలపైనే 19 కేసులు పెట్టింది. ఇక ఆయన కుమారుడు, కూతురుపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. పైగా కోడెలపై దొంగతనం కేసు మోపడం... ఆ కేసుల్లో జీవితఖైదు పడే సెక్షన్లను పెట్టడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంద రోజుల్లో వంద రకాలుగా వేధించడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాజకీయాల్లో రాటుతేలిన నేత అయినప్పటికీ, చివరి రోజుల్లో అలాంటి అపనిందలను తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా తనపై మోపిన అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగం నుంచి బయటపడేందుకు కోడెల తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు... ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి లేఖ రాశారు... తనను మానసికంగా క్షోభపెట్టొద్దంటూ వేడుకున్నారు... అసెంబ్లీ ఫర్నిచల్ తరలింపులో తన తప్పులేదని, హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ను తీసుకొచ్చే క్రమంలో అధికారులే తన క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారని, తన పదవీ కాలం పూర్తయిన తర్వాత  వెంటనే ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరానని, లేదా వెల కడితే డబ్బు చెల్లిస్తానని జూన్ ఏడునే లేఖ రాశానని, కానీ అధికారులు స్పందించలేదని, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి లేఖలు రాశానని, అయినా స్పందించకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోడెల ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఇప్పటికే తన కార్యాలయం నుంచి ఫర్నిచర్ ను తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చని, కానీ తనను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రభుత్వానికి కోడెల విజ్ఞప్తి చేశారు. 37ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలుచేస్తూ, దొంగతనం కేసు మోపి, తనను మానసిక క్షోభకు గురిచేయవద్దని కోరారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించలేదు... కోడెలపై వేధింపులకు పాల్పడింది. 90రోజుల్లో 19 కేసులు పెట్టి క్షోభకు గురిచేసింది. కోడెలకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుట్ర చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా చేసిన రచ్చను కోడెల తట్టుకోలేకపోయారు. చివరి ఆ మనోవేదనతోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  గులాబీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. ఎన్నడూ నోరెత్తని నేతలు తమ గొంతులు సమరించుకుంటున్నారు. ఎన్నడూ గీత దాటని నాయకులు, ధిక్కారగళంతో కళ్లెర్రజేస్తున్నారు. అధిష్టానానికి అతిదగ్గరగా ఉన్న నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ గీసిన గీతను దాటని నేతలు, ఒకరి తర్వాత మరొకరు నోరు తెరుస్తున్నారు. ఈటల బాటలోనే ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమలో గూడకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుతో, ఇక మంత్రి పదవి రాదని డిసైడైన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈటల, రసమయి మాటల మంటలు చల్లారకముందే, మరో రెండు గొంతులు ధిక్కార స్వరం వినిపించాయి. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అయితే... తామంతా ఓనర్లమేనంటూ ఈటల మాదిరిగానే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, కౌన్సిల్‌లో ఉండు... మంత్రి పదవి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఊహాగానాలు వినిస్తున్నాయని, కానీ ఆ పదవి తనకు వద్దే వద్దన్నారు...... ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఘన్ పూర్ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య కూడా ఇదే తరహాలో కేసీఆర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో 12శాతమున్న మాదిగలకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని, రాజయ్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మరో సీనియర్‌ నేత పద్మారావు కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న తమకు, ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో పద్మారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలంతా, ఈటల తరహాలోనే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి ఈటల రేపిన మంటల స్ఫూర్తిగా ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తిగళం వినిపిస్తుండటం... గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఈటల పార్టీపరంగా మాట్లాడితే, రసమయి మరో అడుగు ముందుకేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు పోయి టీఎస్ వచ్చింది తప్పా... ఏమీ మారలేదంటూ చేసిన కామెంట్స్... అటు పార్టీని... ఇటు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మొత్తానికి ఇంతకాలం కేసీఆర్ మాటను జవదాటని నేతలు, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఒక్కటే కారణంగా తెలుస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతుందని, ఇది ఏదోఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఛాన్సుందని అంటున్నారు.
  ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని చెప్పింది. అయితే నాణ్యం మాట దేవుడెరుగు, గతంలో కంటే నాసిరకమైన బియ్యం పంపిణీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో జిల్లాలో పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా పంపిణీ అయిన బియ్యం సంచుల్లో ముక్కిపోయిన బియ్యం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ముఖ్యంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. "సంచి ఘనం, బియ్యం దారుణం".. "సంచి డిజైన్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బియ్యం మీద పెట్టుంటే బాగుండేది" అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేనా మీరు ఇస్తానన్న నాణ్యమైన బియ్యం అంటూ మండిపడుతున్నారు.     ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ వైఫల్యాలకు వారు పంపిణీ చేసిన బియ్యమే రుజువు అని అన్నారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా? అని వైసీపీ సర్కార్ పై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
    మంత్రులు... తెలంగాణలో అసలు యూరియా కొరతే లేదన్నారు. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. ఏదో యాక్సిడెంటల్ గా ఒక రైతు గుండెపోటుతో మరణిస్తే, యూరియా కోసం పడిగాపులుపడి ఆ మనోవేదనతో కుప్పకూలి చనిపోయాడని అంటారా? అంటూ సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగితే, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాగింది. తన ఆదేశాల ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేలింది. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాపై తీవ్ర విమర్శలు రావడం... రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం... ఏకంగా తన సొంత జిల్లాలోనే... క్యూలైన్లో ఓ రైతు మరణించడంతో... అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటుతుందని గుర్తించిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియా సరఫరా కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌.... యూరియా సరఫరా వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకొచ్చిందంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. రైతులకు సరిపడినంత యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మూడు నాలుగు రోజుల్లోనే పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లు, లారీలు... ఏది దొరికితే దాంట్లో యూరియాను తీసుకొచ్చి, నేరుగా గ్రామాలకే తరలించాలని ఆర్డర్స్ జారీ చేశారు. అయితే, దాదాపు లక్షా15వేల టన్నుల యూరియా... ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరడంతో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు ఏపీ మంత్రి పేర్నినానితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్‌... పోర్టులకు అవసరమైన లారీలను పంపాలని కోరారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 3వేల లారీలను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరడంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఏపీ పోర్టుల నుంచి రైళ్లు, లారీల్లో యుద్ధ ప్రాతిపదికన యూరియాను తరలించేందుకు, వ్యవసాయాధికారులను ఆంధ్రప్రదేశ్ కు పంపాలని నిర్ణయించారు.   తెలంగాణలో యూరియా కొరత అనే మాట వినిపించొద్దన్న కేసీఆర్‌... సమస్య పరిష్కారమయ్యేవరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి రైతుకూ యూరియా అందేవరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదిఏమైనాసరే మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ యూరియాను ఎట్టిపరిస్థితుల్లోనే అందించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారు.
యూరియా కొరత తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు... అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెళ్లాం-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా, గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా... ఎరువులు దొరక్కపోవడంతో... ఆ నిరాశతో కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య... క్యూలైన్లో నిలబడీనిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య... యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో.... ఈసారి ఎలాగైనాసరే దక్కించుకోవాలని.... భార్య లక్ష్మితో కలిసి క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటిహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు.... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్ సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టీఆర్ఎస్ గవర్నమెంట్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు... ఎల్లయ్య కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.
  ప్రగతి రథ చక్రాలు... ఇకపై ప్రభుత్వ రథ చక్రాలుగా మారనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరబోతోంది. దాంతో ఆర్టీసీ ఎంప్లాయిస్‌... త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం... కేసీఆర్ ను చిక్కుల్లో పడేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ వేశారు. వివిధ కోణాల్లో అధ్యయనం జరిపిన కమిటీ... ముఖ్యమంత్రి జగన్ కు మధ్యంతర నివేదికను అందజేసింది. దాంతో సంబంధిత మంత్రులు, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన జగన్మోహన్ రెడ్డి.... ఆర్టీసీ విలీనానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. నిపుణుల కమిటీ సూచించిన మేరకు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ ను ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. అయితే, ఆర్టీసీ విలీనం ద్వారా ప్రభుత్వంపై ఏటా 3వేల 500కోట్ల రూపాయల భారం పడనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కానుండటంతో, కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన విధివిధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్న పేర్ని నాని... ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తామన్నారు. అయితే, ఆర్టీసీ విలీనానికి సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో జరగకపోవడం, అలాగే ఆస్తుల విభజన పూర్తికాకపోవడం, తెలంగాణతో సమస్యలు ఉండటంతో,  ఇప్పటికిప్పుడు విలీనం సాధ్యంకాదని చెప్పింది. ఈ సమస్యలన్నీ కొలిక్కిరావడానికి కొంత సమయం పడుతుందని, అలాగే కేంద్రం వాటాను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కమిటీ నివేదిక ఇఛ్చింది. దాంతో, ఆర్టీసీ కార్పొరేషన్ ను కొనసాగిస్తూనే, ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.  మొత్తానికి, జగన్ సర్కారు నిర్ణయంపై ఆంధ్రా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో చేసినట్లే... ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీలో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులిచ్చిన ఎంప్లాయిస్ యూనియన్... సెప్టెంబర్ 17 తర్వాత ఏక్షణమైనా సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించింది. దాంతో జగన్ నిర్ణయం ఇక్కడ కేసీఆర్ ను చిక్కుల్లో పడేసినట్లయ్యింది.  
  చందమామ రహస్యాలను అన్వేషించేందుకు ప్రయోగించిన చంద్రయాన్-2లో అసలుసిసలు కథ ఇప్పుడే ఆరంభమైంది. దాదాపు అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-2 అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి చేరుకుంది. జాబిల్లిపై ల్యాండర్ దిగడమే మిగిలి ఉంది. ల్యాండర్ ల్యాండింగ్ కి ముందు జరగాల్సిన అత్యంత ముఖ్యమైన దశ ముగిసింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా వేరవడంతో.... ల్యాండర్లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌... చంద్రమామ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. జులై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం అప్రతిహాతంగా దూసుకుపోతోంది. ఆగస్ట్ 20న చంద్రుడి వలయంలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 కక్ష్యను ఇప్పటివరకు ఐదుసార్లు విజయవంతంగా తగ్గించారు. స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే పలు దఫాలుగా చంద్రుడి ఫొటోలను ఇస్రోకు పంపించింది. ప్రస్తుతం చంద్రుడికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. దాంతో చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే, చంద్రయాన్-2లో అత్యంత ముఖ్యమై చివరిదైన కీలక ఘట్టం సెప్టెంబర్ 7న ప్రారంభంకానుంది. ఏడున అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య చందమామ దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో ల్యాండర్ దిగనుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటికి వస్తుంది. పవర్ డీసెంట్ గా పిలిచే ఈ దశ 15 నిమిషాలపాటు సాగనుంది. ఈ 15 నిమిషాలనే ఇస్రో.... అత్యంత ఉత్కంఠభరిత క్షణాలుగా అభివర్ణిస్తోంది. ఈ సమయంలోనే చంద్రుడి రహస్యాలను రోవర్ ఇస్రోకు పంపుతుంది. దాంతో సెప్టెంబర్ ఏడున ఆవిష్కృతం కాబోయే అద్భుత ఘట్టం కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది.  అయితే, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ల్యాండర్ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణించకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణిస్తే క్రాష్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని, అయితే చంద్రయాన్-2లో ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకపోవడంతో... అంతా సవ్యంగానే జరుగుతుందని ఇస్రో ప్రకటించింది.
  తెలంగాణలో రైతుబంధు పథకానికి సంబంధించి కోత పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రైతుబంధు పథకానికి పది ఎకరాల సీలింగ్ పెట్టటం ద్వారా.. ఖర్చును కాస్త తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో రైతుబంధు పథకం ప్రారంభించినపుడు సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. 2019లో దాన్ని రూ.5 వేలకు పెంచారు. అంటే.. ఖరీఫ్‌, రబీకి కలిపి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాల్సి వస్తోంది. రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వ్యవసాయం చేసే రైతు సమస్యలకు అసరాగా ఉండేలా ఈ పథకాన్ని ప్లాన్ చేశారు. అయితే ఎంత భూమి అంటే అంత మొత్తానికి పథకాన్ని అమలయ్యేలా చేశారు. ఈ పథకం బడ్జెట్ భారీగా ఉండటంతో ఇతర సంక్షేమ పథకాలకు.. ఇతరత్రా పథకాలకు నిధుల సమస్య ఇబ్బందిగా మారింది.  ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.14,500 కోట్లు రైతుబంధుకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంది. దాంతో రైతుబంధు పథకానికి కోత పెట్టి, కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దాంతో రైతుబంధుకు సీజన్‌కు రూ.50 వేల గరిష్ఠ పరిమితితో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫైలు సీఎం కేసీఆర్‌ వరకు వెళ్లిందని, ఆయన ఆమోదిస్తే రబీ నుంచే కోత అమల్లోకి వస్తుందని అంటున్నారు. అయితే సీఎం ఇందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.   అధికారుల ప్రతిపాదనల ప్రకారం రైతుకు 10 ఎకరాలకు మించి భూమి ఉన్నా.. 10 ఎకరాలకు మాత్రమే లబ్ధి కలుగుతుంది. పదెకరాలకు మించిన భూమి లక్షా రెండు వేల మంది రైతులకు ఉన్నట్లు సమాచారం. వారిచేతిలో 15.25 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే, దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమికి ఇవ్వాల్సిన రూ.500 కోట్ల రైతు బంధు సాయం మిగులుతుందన్నమాట. తాజా నిర్ణయం ప్రభుత్వానికి అంతో ఇంతో ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. మరి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
  అది ఓ ప్రభుత్వ ఆసుపత్రి... అందులోని ఐసీయూ వార్డు. ఆ వార్డులో చావుబతుకుల మధ్య ఉన్న ఓ వృద్ధుడు. ఖచ్చితంగా అతను ఆ రాత్రిని మించి బతకడని వైద్యులందరికీ తేలిపోయింది. అందుకనే అతని బంధువులు అందరికి ఫోన్లు చేసి త్వరగా రమ్మంటున్నారు. ఆసుపత్రిలో అతని తాలూకు పిల్లలు ఎవరన్నా ఉన్నారేమో అని ఓ నర్సు వార్డు బయట అటూఇటూ చూసింది. వార్డు బయట బెంచీ మీద ఓ యువకుడు కనిపించాడు. ‘ఐసీయూ వార్డులో ఫలానా పెద్దాయన మీ తండ్రేనా!’ అని అడిగింది.‘ఏ ఏమైంది!’ అని కంగారుగా అడిగాడు ఆ యువకుడు.   ‘ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నారు. తన కొడుకుల కోసం తెగ కలవరిస్తున్నారు. ఈ రాత్రి కాస్త ఆయన పక్కనుంటే ప్రశాంతంగా కన్నుమూస్తారు’ అని చెప్పుకొచ్చింది నర్సు.‘నేను ఆయన చిన్న కొడుకుని. దయచేసి ఈ రాత్రి ఆయన పక్కనే ఉండే అవకాశం ఇవ్వండి,’ అని అడిగాడు యువకుడు. యువకుడు లోపలికి వెళ్లేసరికి వృద్ధుని పరిస్థితి నిజంగానే బాగోలేదు. కళ్లు తెరుచుకోవడం లేదు. ఏదేదో కలవరిస్తున్నాడు. కొడుకుల స్పర్శ కోసం చేతిని చాస్తున్నాడు. యువకుడు ఠక్కున వెళ్లి ఆ చేతిని అందుకున్నాడు. అతని పక్కనే ఒక బల్ల వేసుకుని రాత్రంతా కూర్చున్నాడు.   ఆ రాత్రి ఒకో జాము గడిచేకొద్దీ వృద్ధుడు తన జీవితానికి సంబంధించి ఏవేవో చెబుతూ ఉన్నాడు. దానికి యువకుడు ఊ కొడుతూనే ఉన్నాడు. మధ్యమధ్యలో వృద్ధుడు యువకుడి చేతిని గట్టిగా అదిమిపట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. వృద్ధుడు శరీరంలో ఇక ప్రాణం నిలిచేట్లు లేదు. ఆఖరుగా ‘బిడ్డా! నువ్వు ఈ చివరి క్షణాల్లో నా దగ్గర ఉంటావని అనుకోలేదు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి,’ అంటూ చెక్కిలి మీద నుంచి కన్నీరు జారుతుండగా కన్నుమూశాడు. ఆ దృశ్యం చూసిన యువకుడికి దుఃఖం ఆగలేదు. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి అతని దగ్గరికి నర్సు కంగారుగా రావడం కనిపించింది. ‘ఆ ముసలాయన కుటుంబమంతా ఇప్పుడే వచ్చింది. నిన్న రాత్రి వాళ్లు రాలేకపోయారంట. వాళ్లలో ఒకతను ఆయన చిన్నకొడుకునని అంటున్నాడు. మరి మీరెవరు?’ అని అడిగింది.   ‘నిజానికి ఆ ముసలాయన ఎవరో నాకు తెలియనే తెలియదు. కానీ చివరిక్షణంలో ఆయన దగ్గర ఎవరూ లేకపోవడం మాత్రం బాధ కలిగించింది. జీవితంలో ఎంత సాధించినా ఆఖరు క్షణాన ఒంటరిగా మిగిలిపోవడం నిజంగా నరకం. అందుకనే మీరు నన్ను పిలిచినప్పుడు మారుమాటాడకుండా లోపలకి వచ్చేశాను. మంచం మీద ఉన్న ఆ మనిషికి కావల్సింది తనవారు పక్కనే ఉన్నారన్న ధైర్యం, వారి స్పర్శలో ఉండే స్థైర్యం... అని అర్థమైంది. మరేం ఆలోచించకుండా ఆయనకి నా చేతిని అందించాను. జీవితపు చివరి క్షణంలో కావల్సిన తృప్తిని ఇచ్చాను’ అంటూ సంజాయిషీగా చెప్పుకొచ్చాడు.     ..Nirjara
  We've heard enough on anger and said enough on it. But it has been our companion all through the while. We tried hard to control it and failed. So! let's give one more try!! The Occurrence: Anger might be the result of the external situation (like traffic, argument..) or might be triggered by our low mood. Surprisingly it was found out that some people can genetically be much furious than the rest. And of course, the circumstances that we've faced and the way we've moulded our character do affect our angry moods. The Result: The fire in the tree would burn it and the forest. So does the anger! We and our lives are the first and fatal victims to our anger. If suppressed, it would boil our heart and mind. And if expressed it would derail our circumstances.  Our goodwill, relations, transactions... get vulnerable at our ire. By the time we realise that, things should have been dealt with ease... they would've turned worse. And repentance is all that's left after the fist of rage. The Solution: While there are lot of advices given on the net and in the books on anger management... I've found the following to be practical and useful . You can add your own solution to the list.   - Expressing in the most plausible manner: If you feel that your displeasure should be conveyed, do it with a coat of sugar. Convey that you are upset, let them know that your are hurt... but let your tone be mild, and your words be polite. - Divert the force: Every emotion of us is a power! If expressed, it would result into something. So why not get a positive result from our displeasure. I've once heard from my lecturer - `Whenever my family members did upset me, I just kept quiet and immersed in my studies. I'm certainly aware of the fact that a bright career is the solution for many of my personal problems.` - Skip the environment: Anger needs a dais for us to express. It might be the highway or the kitchen. It's better to move away from the place and let passions dilute. - The alternatives: Some situations keep recurring. They make you tense on the daily basis. It might be the pits on the road you pass or a friend that robs every penny out of you. Just change the road or bid goodbye to the friend   - Think logically: The first side effect that come along with anger is, that you lose the power to reason. Just let your mind be intact. Evaluate what has happened, deduce the possibilities, conclude a few things... and decide the course of action. - Watch your words: When we are in the hold of anger. We try to hurt as much as we could with our words. So let's watch our words. Let`s be civilised and let's hear what the other one is saying.  In other words, we say a lot when we are in anger. So let's hear a lot too! - Don't dig the past: The worst thing we do, during those moments of anger... is to dig the filth out of the past! Each and every moment of displeasure is recollected and associated with the present situation. So treat the present situation as unique and be likewise. - Calming down: This is my favourite one. The way we breath is directly associated to our emotions. So let's slow our veins down. Taking a deep and slow breath filling every inch of our lungs and exhaling slowly would certainly calm us down..     -nirjara
  ప్రపంచంలో అతి సులువుగా లభించేది ఏమన్నా ఉంటే సలహానే! అందుకనే ఎవరికి వారు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ ఒకోసారి మనం ఆచితూచి ఇచ్చే సలహానే మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. వారి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అండగా నిలుస్తుంది. అందుకనే అనువైన సలహాని ఇవ్వడం కూడా ఒక కళగా భావించవచ్చు. ఇందుకోసం కొన్ని మెలకువలు పాటిస్తే సరి...   అడగనిదే! అవతలివారి సమస్య మీకెంత సామాన్యంగా తోచినా, దానికి ఖచ్చితమైన సలహా మీ దగ్గర ఉందని అనిపించినా... అడగకుండా ఇచ్చే సలహాకి అంత ఉపయోగం ఉండదు. సరికదా! వారు నొచ్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు... తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టడానికే అవకాశం ఉంది. అందుకే అడగకుండా సలహా ఇవ్వకూడదంటారు పెద్దలు. ఒకవేళ అతని సమస్యకు మీ దగ్గరే పరిష్కారం ఉందని తోస్తే అతని అనుమతి తీసుకునో, ఒంటరిగా ఉన్నప్పుడో, మధ్యవర్తుల ద్వారాలో మీ సలహాను అందిస్తే సరి.   సావధానంగా విన్నాకే! సమస్య ఉన్నవారే సలహా కోసం అభ్యర్థిస్తారు. సమస్య ఉంది కాబట్టి దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడి కొంత ఉపశమనాన్ని పొందాలని అనుకుంటారు. కాబట్టి సలహా ఇవ్వాలనుకుంటూ వారి మాటలను సావకాశంగా వినితీరాలి. మనకి కాస్త విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా సంభాషణను సాగించాలి. వీలైతే మరిన్ని ప్రశ్నలు వేసి, సమస్యలోని భిన్న కోణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.   మనదిగా భావించి! సమస్య మనది కాకపోవచ్చు. కానీ మనం ఇచ్చే పరిష్కారంతో అది ముగిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే, అందులోని లోతుపాతులు తెలుస్తాయి. అలా కాకుండా కేవలం ఒక మూడో వ్యక్తిగానే ఉంటే, సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. ‘ఇదే ఇబ్బంది నాకు తలెత్తితే, నేను ఏం చేయగలను? నేను తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎలాంటి సావకాశాలు ఉన్నాయి?’ అని ఆలోచిస్తేనే సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం లభిస్తుంది.   చర్చించండి! సలహా అడిగారు కదా అని అవతలివారిని ఊదరగొట్టేస్తే సరిపోదు. సలహాలదేముంది! సవాలక్ష చెప్పేయవచ్చు! అవతలివారు కూడా మొహమాటానికి పోయి ఊరకుండిపోవచ్చు. కానీ సమస్య గురించి మీకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు... అన్నీ కూడా అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం అనేది ఒక కాలక్షేపంగా కాకుండా కార్యాచరణకు మార్గంగా నిలుస్తుంది.   నిజాయితీతో! సలహా కోసం వచ్చారు కదా అని చాలామంది అవతలివారిని చులకనగా చూస్తుంటారు. కానీ అవతలివారు తమమీద ఒక భరోసాతో వచ్చారన్న బాధ్యతని గుర్తుంచుకోరు. అలాంటి భేషజాలకు పోకుండా సమస్యను సానుకూలంగా విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వడం అవసరం. ఒకవేళ సమస్య పరిథి మనల్ని దాటిపోతోందని అనిపిస్తే... ఫలానా వ్యక్తినో, నిపుణుడినో కలిస్తే మంచిది అని చెప్పేయడం మంచిది.   - నిర్జర.
సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  
The deadly Ebola virus has claimed more than 700 people who have died of the deadly virus  and infected close to 1300 people that has spread across the West African nations of Liberia, Guinea, Sierra Leone, and Nigeria. Now whether other countries could also be infected because of this deadly virus is yet to be seen as it spread only through certain conditions Ebola is not known to infect people through the air -- you must come into contact with the virus somehow in order to be at risk for infection, It is transmitted through exposure to an animal that carries the virus (such as a bat or primate), through exposure to the bodily fluids of a human who is infected and symptomatic, and through exposure to items that have been contaminated with the virus. People who are "providing care for a household member ... when they're cleaning up vomit or diarrhea, they come into contact with the virus, and the way it's transmitted is there's virus in the fluids," she said. "That virus gets into your own body through the nose, mouth and such. Ebola can also survive outside the host for a significant period of time -- as long as a couple of days -- at room temperature. What happens to a person infected? Once the Ebola virus makes its way into the body, it gets in the body's cells and replicates itself. Then it comes bursting out of our cells and produces this protein that wreaks havoc. The protein is called ebolavirus glycoprotein, and attaches to the cells on the inside of the blood vessels. This increases permeability of the blood vessels -- leading to blood leaking out of the vessels. Even people who don't show hemorrhagic symptoms will experience this leaking of blood from the vessels -- which can eventually lead to shock and, ultimately, death. Patients infected with Ebola experience sudden fever, intense weakness, muscle pain, headaches, vomiting and diarrhea. As the disease progresses, it can cause kidney and liver failure as well as internal bleeding. Treatment for Ebola In the four decades since the Ebola virus was first identified in Africa, treatment hasn't changed much. There are no licensed drugs or vaccines for the deadly disease. Without a specific treatment, doctors and nurses focus on easing the disease's symptoms — fever, headache, vomiting and diarrhea — and on keeping patients hydrated and comfortable. For one thing, the Ebola virus is hard to work with. The virus doesn't grow well in petri dishes and experiments can only be done in the relatively few labs with the highest security measures. There are about a half dozen Ebola drugs and vaccines in development, several of which have received funding from the U.S. One drug developed by the U.S. Army has shown promising results when tested in monkeys. While animal studies for vaccine candidates have been encouraging, it's unclear what dose humans would need. Sources: Wikipiedia, Huffington Post, Kansascity.com
  Coconut Oil for Good health:People who consume coconut oil on a regular basis (referring to the Keralites) are known to have a healthy skin, free from any bacterial attacks, lustrous hair, are intelligent , slim - contrary to the studies which say coconut oil is fattening, and the most important factor (for women) have wrinkle free skin … Coconut oil is one of the richest sources of saturated fat with about 90 percent of calories as saturated fat. It contains lauric acid, a powerful antibacterial and antiviral agent that keeps away viruses, infections, inflammation and acne. Coconut oil is also rich in essential fatty acids and Vitamin E, which are perfect for keeping your skin moist, soft, and wrinkle-free ( anti aging benfits) and is also known to reduce weight.WOmen use coconut oil to remove makeup and clean their face with it before going to bed. Coconut oil is especially good if you have thyroid. Plus, there’s considerable evidence that this oil has so many health benefits: Coconut oil contains a lot of medium chain triglycerides, which are metabolized differently and can have therapeutic effects on several brain disorders. The medium chain triglycerides in coconut oil have been shown to increase 24 hour energy expenditure by as much as 5%, potentially leading to significant weight loss over the long term. Coconut oil can be applied topically as well, studies showing it to be effective as a skin moisturizer and protecting against hair damage. It can also be used as a mild form of sunscreen and as mouthwash. So do we need to give more scientific reasons to bring this healthy natural oil back into our lives?