LATEST NEWS
  అక్షరాలా వందకు చేరువవుతోంది ఉల్లిగడ్డ రేటు. ప్రస్తుతం మార్కెట్ లో రూ.60 నుండి రూ.70 మధ్య పలుకుతున్న ఉల్లి రేటు రేపో మాపో 100 కు చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ్టి లెక్కల ప్రకారం క్వింటాలకు ఉల్లి ధర అక్షరాలా రూ.6,700 సాయంత్రానికి రూ.7,000 కావచ్చు రేపో మాపో రూ.10,000 కావచ్చు. గతేడాది ఇదే సీజన్ లో క్వింటా ఉల్లి ధర 1000 రూపాయలు కూడా లేదు. కానీ ఈ సారి 10,000 లకు చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక తరువాత ఉల్లిని బాగా పండించేది కర్నూలు ఒకటే. ఇక్కడి మార్కెట్ లో ఉల్లి పలికిన ఆల్ టైమ్ హై రేటు 5,580 రూపాయలు అది కూడా 2017 లో, కానీ ఇప్పుడు దూకుడు ఎలా ఉంది అంటే నవంబర్ 20న అక్కడి మార్కెట్ ధర  రూ.6,700 ల రూపాయలు పలికింది. ఇది హోల్ సేల్ రేటు.. అదే రిటైల్ మార్కెట్ లో ఇస్తే రూ.67 రూపాయల. కానీ దళారుల తరువాత వ్యాపారుడు లాభాలు వేసుకోగా మన వంటింటికి వచ్చే సరికి రూ.100 ఖాయం.ఈ ఏడాది జూలైలో క్వింటాలు ఉల్లి రూ.1,670 రూపాయలు. ఆగస్టులో రూ.2900 , సెప్టెంబర్ లో రూ.4400, అక్టోబర్ లో రూ.4700 ఉంటే ఈ నెలలో మొన్నటి రేటు రూ.5590 పలికింది. నిన్న రూ.6700 పలికిన రేటుతో రైతు ఫుల్ హ్యాపీ, కాని వినియోగదారుడు మాత్రం లబోదిబోమంటున్నాడు. ఉల్లి కొనాలంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి.  ఉల్లి రేటు ఇంతలా పెరగటానికి కారణం ఎగువన కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు. అవును ఈ ఏడాది కుండపోతతో మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉల్లిసాగు దెబ్బతింది. దీంతో రోజూ 5000 పై వచ్చే ఉల్లి ట్రాక్టర్ లతో నాసిక్ మార్కెట్ కిటకిటలాడిపోయేది. కానీ ఈ సారి 100 కూడా లేవు. పైగా గత ఏడాది క్వింటాలకు రూ.1000 కూడా ధర పలకక పోవడంతో గతేడాది రూ.25,000 ల హెక్టార్లల్లో పంట వేసిన రైతులు ఈ సారి రూ.13,000 ల హెక్టార్లలోనే సాగు చేశారు. ఫలితం 2018 లో 8 లక్షల క్వింటాళ్ల ఉల్లి కర్నూలు మార్కెట్ కు వస్తే ఈ ఏడాది కేవలం మూడున్నర లక్షల క్వింటాళ్ల సరుకు మాత్రమే వచ్చింది.  అమాంతం పెరిగిన పెరుగుతున్న ఉల్లి రేటుతో ఎకరాకు రూ.50,000 ల పెట్టుబడి పెట్టిన రైతుకు ఈ సారి లక్షన్నర వరకు లాభం వస్తుంది. అప్పులు తీరుతున్నాయి. ఇది ఆనందించే విషయమే అయినా వినియోగదారులకు మాత్రం కన్నీళ్లు తప్పట్లేదు. పైగా డిమాండ్ ఎక్కువ సరుకు తక్కువగా ఉండటంతో దళారులు పంజా విసరటం ఖాయం. మార్కెట్ ను ఇంకాస్త బ్లాక్ చేస్తే డిసెంబర్ లో కిలో రూ.200 లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఉల్లి కోయకుండానే చూస్తేనే కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్ లో 3 నెలల నుండి స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ధరలు ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర మార్కెట్ లో రూ.80 రూపాయల వరకు వుంది. రిటైల్స్ కొచ్చేసరికి రూ.100 రూపాయల వరకు పలుకుతుంది. వచ్చే నెలలో ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారస్తులు.
  చంద్రబాబు రౌడీషీటర్లను.. మాఫియాను.. వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఛీప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. నాకే నోటీసు ఇస్తారా అంటూ పోలీసులను బెదిరిస్తున్నారని అన్నారు. తప్పు చేశారు కాబట్టే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు శ్రీకాంత్. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు ప్రభుత్వ చీఫ్ విప్. వ్యవస్థను నిర్వీర్యం చేశాను.. అందుకే నన్ను మూలన కూర్చోపెట్టారు.. చేసిన తప్పును తెలుసుకొని క్షమించండి అని చెప్పి జిల్లాల పర్యటనకు వెళ్తాడని అనుకున్నాము. కానీ బాబు క్షమాపణ చెప్పే విధంగా కాకుండా.. చింతమనేని లాంటి వారిపై కేసులు పెడతారా, నాకే నోటీసు ఇస్తారా అని ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందని చీఫ్ విప్ వెల్లడించారు.  తను జిల్లాల పర్యటనల్లో గతంలో ఆయన చేసిన అరాచకాలు కాని వ్యవస్థను నిర్వీర్య పరచటంలో కానీ గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని.. మాఫియాను క్రియేట్ చేసిన విధానాన్ని.. అందరూ గమనించారు. వాటన్నిటి పైనా తాను బేషరతుగా క్షమాపణను ప్రజలు  కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా రౌడీషీటర్ లను వెనకేసుకొచ్చి.. వాళ్ళేదో మహా ఋషులు వాళ్లపైనే కేసులు పెడతారా అంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను పెద్ద దైవంతో సమానమైన వ్యక్తిని నాపై కేసులు పెడతారా.. నాకు నోటీసులిస్తారా.. అని మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యకరంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం  చట్టం ముందు అందరూ సమానమే అన్నారు శ్రీకాంతరెడ్డి. తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.  
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కేఈ సోదరులపై సాగుతున్న ప్రచారాన్ని చూస్తే ఈ నానుడి గుర్తొస్తుంది. గత కొన్నేళ్లుగా కర్నూల్ జిల్లా టిడిపికి కేఈ కుటుంబం పెద్ద దిక్కుగా ఉంటుంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కేఈ క్రిష్ణమూర్తి, టిడిపి అధినేత చంద్రబాబుకు సమకాలికుడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన అనేక ఉన్నత పదవులు చేపట్టారు. టిడిపికి కష్టకాలం వచ్చినప్పుడు తెలుగుతమ్ముళ్లకు కేఈ సోదరుల వెన్నుదన్నుగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు తమ చిరకాల ప్రత్యర్థి అయిన కోట్ల ఫ్యామిలీతో కూడా కేఈ బ్రదర్స్ చేతులు కలిపారు. జిల్లాలో టిడిపికి అత్యధిక సీట్లు గెలిపించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కాని మొన్నటి ఎన్నికల్లో వీచిన వైసీపీ గాలిలో అవి ఫలించలేదు. కర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా టిడిపికి రాకపోయినా కేఈ కోట్ల కుటుంబాలు మాత్రం తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాయి. టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బాధితులకు అండగా నిలిచి స్థానిక ఎన్నికల సమయానికి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసి అధిక స్థానాల్లో పసుపు జెండా ఎగరేయాలనే లక్ష్యంతో కేఈ బ్రదర్స్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కేఈ సోదరులు టిడిపిని వీడబోతున్నారంటూ ప్రచారం మొదలు కావడం గమనార్హం. ఈ నెలాఖరున లేదా డిసెంబరులో కేఈ క్రిష్ణమూర్తి.. ఆయన తమ్ముడు కేఈ ప్రభాకర్.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కుటుంబాన్ని తమ పార్టీలో చోటివ్వడంతో జిల్లాలో ఆ సామాజిక వర్గాన్ని మరింత దరి చేర్చుకోవాలనే యోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కేఈ ఫ్యామిలీని వైసీపీలోకి ఆహ్వానిస్తూ.. కేఈ కృష్ణమూర్తికి రాజ్యసభ సీటు, ఆయన తమ్ముడు ప్రభాకర్ కు మంత్రి పదవి ఇస్తారని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం తమ దృష్టికి రాగానే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై కేఈ వర్గీయులు మండిపడ్డారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిసెంబర్ మొదటి వారంలో కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా టిడిపిలో గందరగోళం సృష్టించేందుకు కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కేఈ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పై టిడిపి జిల్లా నేతలు సైతం సీరియస్ అవుతున్నారు. టిడిపిని నైతికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెరవెనకుండి ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేఈ బ్రదర్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారంపై జిల్లాలోని ఆ పార్టీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. మొత్తానికి సోషల్ మీడియాలోకి ఫ్యామిలీపై జరుగుతున్న ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మాట వాస్తవమనే చెప్పుకోవాలి.  
  ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై.. ఎంపీ సీఎం రమేష్, ఏపి బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో మత మార్పిళ్ల దిశగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొన్ని చర్యలను సీఎం రమేష్ ఆధారాలతో సహా అందచేశారు. హిందువులను మతమార్పిడుల దిశగా ప్రోత్సహించేందుకు జగన్ కుటుంబానికి చెందిన మతపరమైన చానళ్ళలో జరుగుతున్న ప్రసారాల వీడియోలను అమిత్ షాకు సీఎం రమేశ్ అందించినట్లుగా తెలుస్తోంది. జగన్ బావ బ్రదర్ అనిల్ కు చెందిన రక్షణ టీవీలో భగవద్గీత చదువుతున్నట్టుగా బైబుళ్లును చదువుతున్నారు. ఆ చానల్ మొత్తం మతమార్పిడి లక్ష్యంతో హిందువులను టార్గెట్ చేసిందన్న అనుమానాలున్నాయని అభిషేకాలు పూజలు లాంటివి కూడా హిందూ పద్ధతిలో క్రీస్తుకు చేస్తూ మత మార్పిడలకు ప్రోత్సహిస్తున్నారని ఆర్ఎస్ఎస్ నేతలు కూడా అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.  అదే సమయంలో హిందూ దేవుళ్లను బడుగు, బలహీన వర్గాలకు దూరం చేసేలా ఓ ప్రణాళిక బద్ధమైన వ్యవహారం నడుస్తోందని దానికి సాక్ష్యంగా  తిరుమలలో ధరల పెంపు అంశాన్ని తెలిపారు.  క్రైస్తవులు జెరూసలెం యాత్రకు వెళ్లే ప్రోత్సాహకాన్ని పెంచడాన్ని కూడా గుర్తు చేశారు. పేదలకు శ్రీనివాసుడిని ఉచితంగా దర్శించుకునేలా దివ్యదర్శనం అనే పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని నిలిపివేశారు. ఆర్థిక సమస్యలే కారణమని చెబుతున్నారు. అదే సమయంలో జెరూసలెం యాత్రకు ప్రోత్సాహకాలు పెంచడమే కాకుండా పాస్టర్ లు అనిపించుకున్న ప్రతి ఒక్కరికీ నెలకు 5,000 ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. సీఎం రమేష్ బిజెపి ఆర్ఎస్ఎస్ నేతల ఫిర్యాదులను అమిత్ షా సావధానంగా విన్నారు. పార్టీ పరంగా ఇలాంటి ప్రయత్నాలను పూర్తిస్థాయిలో వ్యతిరేకించాలని ఆదేశించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే వ్యతిరేకించాలన్నారు. అదే సమయంలో ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిని బట్టి యాక్షన్ తీసుకోవాలా వద్దా అన్నదాని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
  టిడిపి అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీతో పాటు మంత్రి కొడాలి నాని..అంబటి రాంబాబు.. ఓ రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వైసిపి నేతలతో పాటు వంశీ విమర్శలకు టిడిపి నేతల నుంచి కౌంటర్ లు పడ్డాయి. టిడిపి నేతల కౌంటర్లు అన్ని నామమాత్రంగానే ఉండిపోయాయి. ఈ రభాసకి తెరతీయడానికి నందమూరి వారసుడే ముందుకు రావాల్సి వచ్చింది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు అంటూ చైతన్య కృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విధానాల పై విమర్శలు చేస్తే పర్వాలేదు కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునేది లేదు.. జాగ్రత్త అని సవాల్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. నందమూరి వంశం నుంచి రెస్పాన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చైతన్య కృష్ణ వీడియో వైరల్ అవుతుంది.  నందమూరి వంశం నుంచి మళ్లీ ఓ వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే డిస్కషన్ సాగుతోంది. పార్టీ లోకి జూనియర్ ఎన్టీఆర్ తిరిగి రావాలనే అంశాన్ని కొందరు నేతలు తెరపైకి తెచ్చారు. దీంతో నందమూరి వారసుడు తోనే జూనియర్ టాపిక్ కు చెక్ పెట్టాలనే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారనే  ప్రచారం జరుగుతుంది.  
ALSO ON TELUGUONE N E W S
  నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతూ ఆయన సినిమా 'రూలర్' టీజర్ గురువారం సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు రిలీజైంది. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి వచ్చి ఫర్వాలేదనిపించే స్థాయిలో ఆడిన 'జై సింహా' తర్వాత బాలయ్య, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో ఈ సినిమా తయారవుతుండటం గమనార్హం. 'రూలర్'.. బాలకృష్ణ 105వ చిత్రం. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా, సాయాజీ షిండే వంటి పేరుపొందిన నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ రెండు రకాల షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తున్నారని ముందు నుంచీ దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. టీజర్ కూడా ఆ విషయాన్నే తెలియజేసింది. ఒక షేడ్ పోలీసాఫీసర్ కాగా, మరొకటి హెలికాప్టర్లలో ట్రావెల్ చేసే బిలియనీర్. రెండు షేడ్లలో ఆయన రూపం కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా కనిపిస్తోంది. పోలీసాఫీసర్‌గా బుర్ర మీసాలు, గడ్డంతోనూ, బిలియనీర్‌గా వాన్ డైక్ బియర్డ్‌తోనూ ఆయన కనిపిస్తున్నారు. బిలియనీర్ గెటప్ మాత్రం అదుర్స్ అనిపించే రేంజిలో ఉంది. ఆ వేషంలో బాలయ్య యువకుడిలా మారిపోయారు. యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్, కామెడీ, శృంగారం, రౌద్రం.. వంటి అన్ని ఎలిమెంట్స్‌తో 'రూలర్' తయారవుతోందని టీజర్‌ని బట్టి ఇట్టే ఊహించవచ్చు. టీజర్ మొదట్లోనే "ధర్మా మా ఊరికే గ్రామదైవం. ఎవరికి ఏ కష్టమొచ్చినా తనే ముందుంటాడు." అని నేపథ్యంలో వినిపించిన ఒక స్త్రీ గొంతు బాలయ్య క్యారెక్టరైజేషన్ ఏమిటనేది తెలియజేసింది. ఊరన్నా, గ్రామమన్నా ఒకటే అనేది మనకు తెలిసిన అర్థం. కానీ ఈ మూవీ డైలాగ్ రైటర్ ఆ రెండూ వేరువేరని అనుకున్నట్లున్నాడు. అందుకనే "ధర్మా మా ఊరికే గ్రామదైవం" అని రాశాడు. ఆ రెండింటికీ తేడా ఏమిటనేది ఆయన తెలిపితే బాగుంటుంది. "ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే." అని బాలకృష్ణ తనేమిటో తెలియజేశాడు. 1 నిమిషం 15 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో బాలయ్య చెప్పిన ఏకైక డైలాగ్ ఇదే. బాలకృష్ణ అంటే 'సింహం' అని డైరెక్టర్లందరూ ఫిక్సయిపోయింట్లున్నారు. అందుకే డైలాగ్స్‌లో సింహం అనే మాట ఎక్కడో చోట పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అలాగే టైటిల్‌లోనూ సింహం బొమ్మ ఉండేలా చూసుకుంటున్నారు. 'రూలర్' టైటిల్ లోగోలోనూ మనం మూడు సింహాలను చూడొచ్చు. మూవీలో బాలయ్య పోలీసాఫీసర్ కాబట్టి, మూడు సింహాల గుర్తును ఉపయోగించారు. శాంపిల్‌గా చూపించిన యాక్షన్ సీన్స్ చూస్తే మూవీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనీ, ఇవి మాస్ ఆడియెన్స్‌తో పాటు బాలయ్య ఫ్యాన్స్‌ను అమితంగా అలరిస్తాయనీ ఊహించవచ్చు. యాక్షన్ ఎపిసోడ్లలో బాలయ్య విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం. టీజర్ ప్రకారం ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక పాత్రలు సినిమాకు కీలకమనే అభిప్రాయం కలుగుతుంది. భూమిక కేరెక్టర్ సెంటిమెంట్‌ని పండిస్తుందని తెలుస్తోంది. హీరోయిన్లు.. సోనాల్ చౌహాన్, వేదిక ఇద్దరూ గ్లామర్‌ను బాగా కురిపించారు. సోనాల్ అయితే స్వింసూట్‌లో దర్శనమివ్వనున్నది. విలన్ పాత్రధారిగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడు కనిపిస్తున్నాడు. మీడియాకు ఇచ్చిన కేస్టింగ్ వివరాల్లోనూ అతడి పేరు లేదు. సప్తగిరి, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ధన్‌రాజ్, రఘు కారుమంచి.. నవ్వులు పూయించనున్నారు.  యాక్షన్ ఎపిసోడ్లు కానీ, హెలికాప్టర్ ఉపయోగించడం కానీ, మిగతా సీన్లు కానీ చూస్తుంటే భారీ బడ్జెట్‌తో, రిచ్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారనేది స్పష్టం. తన డ్రీం ప్రాజెక్ట్, రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్.. బాక్సాఫీస్ దగ్గర అనూహ్య పరాజయాన్ని పొందడంతో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించాలనే తపనతో, కసితో 'రూలర్' మూవీని చేస్తున్నారు బాలయ్య. చిరంతన్ భట్ బ్యాగ్రౌండ్ స్కోర్, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీతో 'టీజర్' అదిరింది. ఈ డిసెంబర్ 20న వస్తున్న 'రూలర్'తో ఆయన ఏం సంచలనం సృష్టిస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి నిర్మాతలకు రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'దర్బార్', సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు', మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల... వైకుంఠపురములో', నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న 'ఎంత మంచివాడవురా' చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.  ప్రస్తుతానికి 'సరిలేరు...', 'అల...' చిత్రాలు జనవరి 12న రావడానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు నిర్మాతల నుండి విడుదల తేదీ ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున వస్తే, రెండు సినిమాల ఓపెనింగ్స్ తగ్గుతాయి. అదే ఒకటి ముందు రోజు వస్తే సమస్య కొంచెం తగ్గుతుంది. 'సరిలేరు...' నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు, 'అల... వైకుంఠపురములో' నైజాం థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. సో... మహేష్ సినిమాను ఒక్క రోజు ముందుకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రజనీకాంత్ 'దర్బార్' నిర్మాతలు, తమ సినిమాను మూడు రోజుల ముందుకు తీసుకువెళ్లారు. రజనీకాంత్ 'దర్బార్' జనవరి 9న విడుదల చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఒకవేళ మహేష్, అల్లు అర్జున్ సినిమాలు జనవరి 10 11, 12... ఏ తేదీల్లో వచ్చినా సమస్య ఉండదని. నందమూరి కల్యాణ్ రామ్ అయితే తన సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. సో... అతడికీ ప్రాబ్లమ్ లేదు. ఎటొచ్చి... మహేష్, బన్నీలో ఎవరు ముందు వస్తారనేది క్వశ్చన్. మ్యాగ్జిమమ్ మహేష్ బాబు సినిమా జనవరి 11న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. దాంతో రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. థియేటర్స్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. తర్వాత ఏ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది.
ముంబైలో కొత్త ప్రేమజంట రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రణబీర్ కపూర్ ఆప్తమిత్రుడు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాది బల్గేరియాలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. తర్వాత ఇండియాలో వారణాసిలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాంటసీ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ కూడా షూటింగ్ చేశారు. ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇంతకీ, ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఏంటో తెలుసా? 'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున ఆర్కియాలజిస్ట్ (పురావస్తు శాస్త్రవేత్త)గా కనిపించనున్నారు. పురావస్తు విద్యార్థులతో కలిసి పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న దేవాలయాలను సందర్శించే యాత్ర చేపడతారట. ఓ సంఘటన హీరో హీరోయిన్లు ఇద్దరూ నాగార్జున దగ్గరకు వచ్చేలా చేస్తుందట. కథలో నాగార్జున పాత్ర కీలకమని తెలుస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే... త్వరలో కొత్త దర్శకుడితో నాగార్జున సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి దగ్గర కొన్నాళ్లుగా పని చేస్తున్న అహిషోర్ సోలమన్ ను నాగార్జున దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా మొదలు కానుంది.  
  ప్రభాస్.. ఇవాళ దేశవ్యాప్తంగా సినీప్రియుల ఆరాధ్య నటుడు. 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కన్‌క్లూజన్' సినిమాల తర్వాత టాలీవుడ్ స్టార్ నుంచి ఇండియన్ స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. 'సాహో' సినిమా ఆ విషయాన్ని మరింత స్పష్టం చేసింది. తెలుగులో కంటే హిందీలోనే ఆ సినిమా మరింత బాగా ఆడటం, అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తేవడం దీనికి నిదర్శనం. దాంతో ఇప్పుడు ప్రభాస్ దేశంలోనే ఏకైక పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఎవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటున్నాడు? వెంటనే ఎవరికైనా అనుష్క పేరు మనసులో మెదులుతుంది. అనుష్కతో కాకుండా ఇంకెవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటాడని అతని ఫ్యాన్స్ కూడా అనుకుంటారు. కారణం.. ఎన్నో ఏళ్ల నుంచీ ఆ ఇద్దరి రిలేషన్‌షిప్‌పై ప్రచారం నడుస్తుండటం. అనుష్కతో తనకు అలాంటి రిలేషన్‌షిప్ ఏమీ లేదని గతంలో అనేకసార్లు ప్రభాస్ తేల్చిచెప్పాడు కానీ జనమే నమ్మట్లేదు. మరోవైపు అతని పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నాలుగేళ్ల నుంచీ ఎప్పటికప్పుడు ఈ ఏడాది ప్రభాస్ పెళ్లవుతుందంటూ చెబుతూ వస్తున్నారు కానీ అది నిజమవడం లేదు. దాంతో ప్రభాస్, అనుష్క ప్రేమాయణం వ్యవహారం అటకెక్కకుండా పచ్చిగానే ఉంటూ వస్తోంది. అనుష్క విషయం అలా ఉంచితే, నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ఇండియా'గా పరిగణిస్తోన్న ప్రభాస్‌తో డేటింగ్ చెయ్యడానికి ఎంతోమంది అమ్మాయిలు లైన్‌లో ఉంటారనేది నిజం. మరి ప్రభాస్‌కు చాన్స్ వస్తే, ఎవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటాడు? ఇటీవల తన మనసులో మాటను బయటపెట్టాడు ప్రభాస్. అయితే అతను డేటింగ్ చెయ్యాలనుకుంటోంది ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న నటి కావడం గమనార్హం. ముంబైలో ప్రభాస్‌ను "మీకు అవకాశమొస్తే ఏ నటితో డేటింగ్‌కు వెళ్లాలనుకుంటారు?" అని ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగితే, "నేను రవీనా టాండన్ అభిమానిని. ఆమెతో డేటింగ్ ఛాన్స్ వస్తే వదులుకోను" అని నవ్వేశాడు. అయితే అతడు ఆ మాటల్ని సరదాగానే చెప్పినా, రవీనా అంటే అతడికున్న అభిమానాన్ని ఆ మాటలు పట్టిస్తున్నాయి.     45 ఏళ్ల రవీనా కొంత కాలం క్రితం బాలీవుడ్‌లోని అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనూ నాలుగు సినిమాలు.. 'రథసారథి', 'బంగారు బుల్లోడు', 'ఆకాశ వీధిలో', 'పాండవులు పాండవులు తుమ్మెదా' సినిమాల్లో నాయికగా నటించారు. వీటిలో 'బంగారు బుల్లోడు' సినిమాలో బాలకృష్ణతో కలిసి ఆమె డాన్స్ చేసిన 'స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా' అనే పాట ఐకనిక్ రెయిన్ సాంగ్‌గా నిలిచిపోవడం మనకు తెలుసు. ఆ పాటలో రవీనా పరువాలు, వంపుసొంపుల సొగసును ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. 2004లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని ఆమె పెళ్లాడారు. పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న రవీనా, వివాహానంతరం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2001లో 'దమన్' సినిమాలో భర్త వల్ల హింసకు గురైన భార్యగా అద్భుతంగా నటించి, జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. వివాహానంతరం పిల్లలు పుట్టాక నటనకు కాస్త విరామమిచ్చిన ఆమె మళ్లీ నటిస్తూ వస్తున్నారు. పెళ్లయిన పదేళ్లకు మోహన్‌బాబు జోడీగా 'పాండవులు పాండవులు తుమ్మెదా'లో నటించడం గమనార్హం.   అలాంటి సౌందర్యరాశి అయిన రవీనాతో డేటింగ్‌కు వెళ్లాలనుకుంటానని ప్రభాస్ చెప్పడంలో వింతేముంది. అంతే కాదు.. 'సాహో' సినిమా విడుదలకు ముందు, ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హిందీ టెలివిజన్ రియాలిటీ షో 'నాచ్ బలియే' సీజన్ 9లో రవీనాతో కలిసి 'టిప్ టిప్ బర్సా పాని' పాటకు స్టెప్పులేశాడు ప్రభాస్. అది కూడా ఒక ఫేమస్ రెయిన్ సాంగ్ కావడం గమనార్హం. 'మొహ్రా' సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా జంటపై ఆ పాట తీశారు. ఆ పాటలోనూ రవీనా చేసిన నృత్యం, ఆమె అందాలు ప్రేక్షకుల మతులు పోగొట్టాయనేది నిజం. ఆ పాటకు 'నాచ్ బలియే'లో రవీనాతో ప్రభాస్ స్టెప్పులేసి, కావలించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో 'జాన్' సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.
  తమిళంలో తన పేరును శృతి హాసన్ భుజం వెనుక టాటూగా వేయించుకున్నారు. తెలుగులో హాట్ యాంకర్ అనసూయ ఎదపై టాటూ వేయించుకున్నారు. త్రిష ఎదపై కూడా సీతాకోకచిలుక కనిపిస్తుంది. తమ శరీరంపై తమకు నచ్చిన ప్రదేశాల్లో టాటూలు వేయించుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తమ టాటూలు కనిపించేలా దుస్తులు వేసుకుంటారు. ఈ జాబితాలో ఆషిమా నర్వాల్ కూడా చేరారు.  తెలుగులో 'నాటకం', 'జెస్సీ' సినిమాల్లో నటించిన హాట్ హీరోయిన్ ఆషిమా నర్వాల్, రీసెంట్‌గా రెండు  టాటూలు వేయించుకున్నారు. ఎక్కడో తెలుసా? రెండు కాళ్లపై. ఇంకా చెప్పాలంటే రెండు థైస్ (తొడల) మీద. అక్కడ టాటూ వేయించుకున్నానని చెప్పడం కోసం, ఆ టాటూలు కనిపించేలా దుస్తులు వేసుకుని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు విడుదల చేస్తున్నారు. వీటికి తోడు ఈషా రెబ్బా మెయిన్ రోల్ లో సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న తెలుగు 'లస్ట్ స్టోరీస్'లో ఆషిమా నర్వాల్ నటిస్తుండటంతో ఆమెపై ప్రేక్షకుల కన్ను కాస్త పడుతోంది.
  జస్ట్... కొన్ని గంటల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ, సంక్రాంతికి విడుదల కానున్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ప్రేక్షకుల ముందుకు ఇంటర్‌నెట్‌లో వచ్చేస్తుంది. ఇదెలా ఉండబోతుందోనని ఘట్టమనేని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కోపంగా చూస్తున్న మహేష్ కళ్లు మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ తో టీజర్ డేట్, టైమ్ అనౌన్స్ చేశారు. దాంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా, సినిమాపై అంచనాలను మరింత పెంచేలా అనిల్ రావిపూడి ఈ సినిమా టీజర్ కట్ చేశారట.  సినిమాలో మహేష్ సైనికుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి దేశభక్తి డైలాగులతో పాటు అభిమానుల చేత విజిల్స్ వేయించే పంచ్ డైలాగ్ ఒకటి టీజర్ లో ఉంటుందట. సాధారణంగా తన ప్రతి సినిమాలో ఒక సిగ్నేచర్ డైలాగ్ పెట్టడం అనిల్ రావిపూడికి అలవాటు. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్లోనూ అటువంటి హుకప్, సిగ్నేచర్ డైలాగ్ ఒకటి ఉంటుందట. అన్నిటి కంటే ముఖ్యంగా విజయశాంతితో మహేష్ బాబు ఫేస్ టు ఫేస్ చెప్పే డైలాగులు అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ వంటిది ఏదో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
  2020లో తెలుగు సినీసీమ మాత్రమే కాదు, యావద్భారత చిత్రసీమలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా చెప్పుకోదగ్గ 'ఆర్ ఆర్ ఆర్' మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయికగా నటిస్తున్నదెవరనే విషయం నిన్నటిదాకా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా ఉండిపోయింది. ఈరోజు, అంటే నవంబర్ 20న ఆ చిక్కు విడిపోయింది. తారక్ జోడీగా ఇంగ్లిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్‌పైకి వచ్చేసింది. ఆమె జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతి కేరెక్టర్‌ను పోషిస్తోంది. వాస్తవానికి మొదట ఈ కేరెక్టర్‌కు మరో బ్రిటిష్ తార డైసీ ఎడ్గార్ జోన్స్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకే ఆమె 'ఆర్ ఆర్ ఆర్' నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె ప్రకటించింది.  ఇది జరిగి దాదాపు 7 నెలలు గడిచాయి. అప్పట్నుంచీ తారక్ జోడీగా వచ్చే అమ్మాయి ఎవరు? అనే ప్రశ్న సినీ వర్గాల్లో, 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అభిమానుల్లో నలుగుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం తారక్ జోడీగా ఎమ్మా రాబర్ట్స్ ఎంపికైందనే వార్త హల్‌చల్ చేసింది. 'నర్వ్', 'లిటిల్ ఇటలీ', 'ప్యారడైజ్ హిల్స్'లో నటించిన ఎమ్మా.. 'ఆర్ ఆర్ ఆర్'లో ఎంపికైన విషయాన్ని సినిమా యూనిట్‌లోని ఎవరూ ధృవీకరించలేదు. దాంతో అది ఒక రూమర్‌గానే ఉండిపోయింది. ఇప్పుడు అది రూమర్ అనే విషయం స్పష్టమైంది. తారక్ సరసన నటించడానికి ఒలీవియా మోరిస్ వచ్చేసింది. ఆమె ఇప్పటి వరకూ 'కండెమ్డ్' అనే హారర్ మూవీ, '7 ట్రయల్స్ అండ్ 7 డేస్' అనే టీవీ సిరీస్‌లో నటించింది. ఆమె యూకేలోని 'ద రాయల్ వెల్ష్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా'లో నటనలో శిక్షణ పొందింది. 'ఆర్ ఆర్ ఆర్' కథ ప్రకారం జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతి ప్రేమలో పడతాడు కొమరం భీం. అయితే వాళ్ల ప్రేమకు ఎన్నో అవరోధాలు కలుగుతాయి. బ్రిటిష్ దుష్ట దంపతులు స్కాట్, లేడీ స్కాట్ ఆ యువజంట పాలిట విలన్లుగా మారతారు. ఆ పాత్రల్ని రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ పోషిస్తున్నారు.  హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'థోర్' చూసినవాళ్లకు 'వోల్‌స్టాగ్' కేరెక్టర్ గుర్తుండే ఉంటుంది. థోర్ ప్రధాన అనుచరుడైన ఆ కేరెక్టర్‌ను చేసింది రే స్టీవెన్సన్. జన్మతహా ఐరిష్ అయిన స్టీవెన్సన్ మొదట రంగస్థల నటుడిగా రాణించి, ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లోనూ, అమెరికన్ టెలివిజన్ సీరియళ్లలోనూ నటించి, ప్రతిభావంతుడైన యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటుడైన అతను ఒక భారతీయ చిత్రంలో.. అందునా ఒక ప్రాంతీయ భాషా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం విశేషంగా భావించాలి. 'బాహుబలి' డైరెక్టర్‌గా యస్.యస్. రాజమౌళికి విశ్వవాప్తంగా వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్లే, ఆయన 'ఆర్ ఆర్ ఆర్'లో నటించేందుకు ఒప్పుకున్నాడనుకోవాలి. స్టీవెన్సన్ రాకతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి గొప్ప ప్రయోజనం కలుగుతుందనేది కాదనలేని సత్యం. ఇక స్కాట్ భార్య లేడీ స్కాట్‌గా నటిస్తోన్న అలీసన్ డూడీ సైతం ఐరిష్ యాక్టరే. ప్రస్తుతం 53 ఏళ్ల వయసున్న ఆమె హాలీవుడ్ గ్రేట్ ఫిలింస్‌లో ఒకటైన 'ఇండియానా జోన్స్ అండ్ లాస్ట్ క్రూసేడ్'లో హారిసన్ ఫోర్డ్, సీన్ కేనరీ చేసిన పాత్రలతో సమానంగా ఎల్సా ష్నైడర్ అనే ప్రధాన పాత్ర చేసి ప్రేక్షకుల ఆరాధ్య తారగా అవతరించింది. ఆ తర్వాత కూడా 'మేజర్ లీగ్ 2', 'టెంప్టేషన్', 'కింగ్ సాల్మన్స్ మైన్స్' వంటి సినిమాలు చేసింది. లేడీ స్కాట్‌గా ఆమె 'ఆర్ ఆర్ ఆర్'కు ప్రత్యేక ఆకర్షణ తీసుకు రానున్నది. అటు రే స్టీవెన్సన్, ఇటు అలీసన్ డూడీ వంటి హాలీవుడ్ యాక్టర్లను తీసుకోవడం ద్వారా 'ఆర్ ఆర్ ఆర్'కు ఇంటర్నేషనల్ మూవీ కలర్ తీసుకొచ్చేశాడు రాజమౌళి. యు.ఎస్.లో 'ఆర్ ఆర్ ఆర్'కు మంచి పబ్లిసిటీ తీసుకురావడంలో ఆ ఇద్దరు నటులూ కచ్చితంగా ఉపయోగపడనున్నారు. 'బాహుబలి' సినిమాలు దేశవ్యాప్తంగా రాజమౌళికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకు రాగా, 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అంతర్జాతీయంగా ఆయనకు పేరు తెచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో బిజినెస్ పరంగానూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్.. ఈ పేర్లు చదువుతుంటేనే.. 'ఆర్ ఆర్ ఆర్' ఏ రేంజిలో తయారవుతోందో ఊహించుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి విప్లవ వీరుల పాత్రలతో, కల్పిక గాథతో తయారవుతున్న ఈ మూవీ భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సినిమా అని ఇప్పట్నుంచే నమ్మాలనిపిస్తోంది. చూద్దాం.. రాజమౌళి ఏం మాయ చేస్తాడో!
‘శుక్రవారం ఉదయం మా సినిమాను ఫ్రీగా చూడండి. అన్ని థియేటర్లలో ఫస్ట్‌ డే మార్నింగ్‌ షో టికెట్లు ఫ్రీగా ఇవ్వబడును’ అంటూ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమా ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’. స్ర్కీన్‌ప్లేను నమ్ముకుని తెరకెక్కించిన రియలిస్టిక్‌ రా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ‘రోజులు మారాయి’, ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’లో హీరోగా నటించిన చేతన్‌ మద్దినేని ఈ సినిమాకు హీరో, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌. మూడు సినిమాల్లో హీరోగా నటించిన అనుభవంతో ఆన్‌లైన్‌ డైరెక్షన్‌ ట్యుటోరియల్స్‌ చదివి ఈ సినిమాకు డైరెక్షన్‌ చేశానని అతడు తెలిపాడు. లో బడ్జెట్‌ సినిమా అయినా... ఎంతలో సినిమా తీశాననేది చెప్పలేదు కానీ, తొమ్మిది నెలల తన పాకెట్‌ మనీతో ఈ సినిమా తీశానని చేతన్‌ చెప్పుకొచ్చాడు. సినిమా చూశాక తన పాకెట్‌ మనీ ఎంత ఉంటుందో ఊహించుకోమన్నాడు. ప్రేక్షకులకు మార్నింగ్‌ షో ఫ్రీగా చూపించాలనే ఐడియా తనదేనని చేతన్‌ మద్దినేని తెలిపాడు. చిన్న సినిమాలకు ప్రేక్షకుల్లో సరైన బజ్‌ రావడం లేదనీ, ఆడియన్స్‌లో అటెన్షన్‌ కోసమే మార్నింగ్‌ షో ఫ్రీగా చూపిస్తున్నానని ఈ హీరో చెప్పాడు. ఇంకా చేతన్‌ మద్దినేని మాట్లాడుతూ ‘‘నేను ఒక రోజు యూట్యూబ్‌లో ‘ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారెంటీ’ అనే సినిమా చూశా. చాలా నవ్వుకున్నాను. ఆ డైరెక్టర్‌ నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేసి మాట్లాడాను. ఎందుకు ఆడలేదని ఆడిగా. ప్రేక్షకుల్లో టాక్‌ రాలేదన్నాడు. ఒకవేళ అందరూ సినిమా చూసి మౌత్‌టాక్‌ స్ర్పెడ్‌ అయితే ఆ సినిమా హిట్‌ అయ్యేది. అందుకని, నా సినిమాకు మార్నింగ్‌ షోలు ఫ్రీగా వేస్తున్నా. వంద మంది సినిమా చూస్తే... అందులో 80 మందికి నచ్చుతుందనే నమ్మకం నాకుంది’’ అన్నాడు. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్స్‌లో కౌంటర్‌లో టికెట్స్‌ ఫ్రీగా ఇస్తారట. మల్టీప్లెక్స్‌లో మాత్రం ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’ ఏజెంట్స్‌ను పెడుతున్నామనీ, వాళ్లు టైటిల్‌ లోగో ఉన్న టీషర్టులు వేసుకుంటారనీ, టికెట్స్‌ ఫ్రీగా ఇస్తారని చేతన్‌ అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్‌లో మల్టీప్లెక్స్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే డబ్బులు వాపస్‌ ఇస్తామన్నాడు.
కొమరం భీమ్‌ పాత్రలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇండియాలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అందులోనూ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న భామను బుధవారం సాయంత్రం ప్రేక్షకులకు పరిచయం చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. సినిమాలో జెన్నిఫర్‌ పాత్రలో ఒలీవియా మోరిస్‌ నటిస్తుందని ప్రకటించారు. ట్విట్టర్‌లో, సోషల్‌ మీడియాలో ఆమెకు పెద్దగా ఫాలోయింగ్‌ లేదు. హాలీవుడ్‌లోనూ పెద్దగా పేరున్న నటి కాదు. అయితే, ఈ సినిమాతో ఇండియన్‌ ఆడియన్స్‌ ఆమెను ఫాలో అయ్యే అవకాశముంది. మొదట ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్‌ నటి డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ను తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుండి ఆమె తప్పుకోవడంతో చాలా రోజులు ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలని మల్లగుల్లాలు పడ్డారు. చివరకు, ఒలీవియా మోరిస్‌ను ఎంపిక చేశారు.  
'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత బరువు తగ్గడానికి నానా తిప్పలూ పడుతూ వచ్చింది. ఆమె వల్లే 'బాహుబలి 2' షూటింగ్ ఆలస్యమయ్యిందన్న ప్రచారమూ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయిన 'సైజ్ జీరో' సినిమా తనకు నటిగా మంచి పేరు తెస్తుందనే ఉద్దేశంతో, ఆ మూవీ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి సూచన మేరకు బాగా లావయ్యింది. ఒక స్థూలకాయురాలైన అమ్మాయి జీవిత ప్రయాణం నేపథ్యంలో తీసిన ఆ సినిమా అనుష్క ఆశించిన దానికి భిన్నంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అనుష్క కెరీర్‌కీ ఆ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు.  ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, 'బాహుబలి 2' షూటింగ్‌కు వచ్చిన ఆమెను చూసి రాజమౌళి తీవ్రంగా అసంతృప్తి చెందాడు. యువరాణి దేవసేన పాత్రకు కావాల్సిన రూప లావణ్యాలు అనుష్కలో కనిపించలేదు. కారణం.. ఆమె ఇంకా భారీ పర్సనాలిటీతోనే ఉండటం. రాజమౌళి గట్టిగా చెప్పడంతో బరువు తగ్గే ప్రయత్నం చేసింది అనుష్క. అయినా 'బాహుబలి'లో కనిపించిన దానితో పోలిస్తే, 'బాహుబలి 2'లోని చాలా సన్నివేశాల్లో అనుష్క లావుగా కనిపించడాన్ని మనం గమనించవచ్చు. 'సైజ్ జీరో' తర్వాత ఆమె 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి', 'ఓం నమో వెంకటేశాయ' సినిమాల్లోనూ స్థూలకాయంతో కనిపించింది. సహజంగా యోగా ప్రాక్టీస్ చేసే అనుష్క బరువు తగ్గే విషయంలో చాలా ఆలస్యం చేసిందని చెప్పాలి. 'భాగమతి'లోనూ, 'సైరా.. నరసింహారెడ్డి'లోనూ మునుపటంత స్లింగా కాకపోయినా బరువు తగ్గి కనిపించింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీషు భాషల్లో తయారవుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతోంది. అందులో మాధవన్ జోడీగా ఒక మూగ చిత్రకారిణి అయిన సాక్షి అనే క్యారెక్టర్ చేసింది అనుష్క. 'బాహుబలి'కి ముందు చీరకట్టులో ఎంత బాగా కనిపిస్తూ వచ్చిందో, వెస్టరన్ డ్రస్సుల్లోనూ అంతలా మెప్పించింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వెస్టరన్ ఔట్‌ఫిట్‌లో ఆమె ఎంత బాగా ఉన్నదో తెలియజేసే ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. అనుష్క.. లో-వెయిస్ట్ జీన్స్‌లో ఉన్న ఆ ఫొటోలు ఫ్యాన్స్ మతులు పోగొడుతున్నాయి.  పింక్ కలర్ జీన్స్‌లో ఉన్న ఆ ఫొటోల్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రిట్వీట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆ ఫొటోల్లో ఒకటి బ్యాక్ వ్యూ అయితే, ఇంకొకటి ఫ్రంట్ వ్యూ. ఆ ఫొటోల్లో అనుష్కను చూసిన వాళ్ల కళ్లు పెద్దవి కావడం ఖాయం. తెలుగువాళ్లకు, తమిళులకు ఆరాధ్య తార అయిన అనుష్క 'బాహుబలి' సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. దేవసేన పాత్రలో అమోఘంగా రాణించి, ప్రభాస్‌కు సరైన జోడీగా నీరాజనాలు అందుకుంది. అంతకు ముందు కూడా ప్రభాస్ సరసన ఆమె 'మిర్చి', 'బిల్లా' సినిమాల్లో నటించింది. 'బాహుబలి: ద బిగినింగ్'లో నటించేప్పుడే ఆ ఇద్దరి మధ్యా ప్రేమానుబంధం ఉందంటూ బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తమ మధ్య స్నేహబంధం ఉంది కానీ, ప్రేమబంధం లేదని ఇద్దరూ చెబుతూ వచ్చారు. అయినా వాళ్లపై వదంతులకు ఫుల్‌స్టాప్ పడలేదు. త్వరలో ఆ ఇద్దరూ పెళ్లాడబోతున్నారని కూడా విరివిగా ప్రచారంలోకి రావడంతో, తమ ఇద్దరిలో ఏవరో ఒకరికి పెళ్లయితే కానీ ఈ వదంతులు ఆగవేమోనని ప్రభాస్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అయినా కూడా ప్రయోజనం కలగలేదు. నలభై యేళ్లయినా ప్రభాస్ కానీ, 38 ఏళ్ల వయసులో ఉన్న అనుష్క కానీ ఇంతదాకా పెళ్లాడలేదు. అందువల్లే వాళ్ల ఇద్దరి అనుబంధం గురించిన ప్రచారం కంటిన్యూ అవుతూ వస్తోంది. అనుష్క కెరీర్ విషయానికి వస్తే.. 'నిశ్శబ్దం' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. లేటెస్టుగా 'అసురన్' రీమేక్‌లో వెంకటేశ్ భార్యగా నటించే చాన్స్ వచ్చిందనే న్యూస్ బయటకు వచ్చింది. ధనుష్ హీరోగా నటించగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన తమిళ మూవీ 'అసురన్' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దాని తెలుగు రీమేక్ రైట్స్ చేజిక్కించుకున్న డి. సురేశ్‌బాబు, ఆ మూవీని తన తమ్ముడు వెంకటేశ్ హీరోగా రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. తమిళంలో మంజు వారియర్ చేసిన కేరెక్టర్‌ను తెలుగులో శ్రియ చేస్తుందనే ప్రచారం జరుగగా, ఇప్పుడు ఆమె స్థానంలో అనుష్క పేరు వినిపిస్తోంది. అదే నిజమైతే.. 'చింతకాయల రవి', 'నాగవల్లి' సినిమాల తర్వాత మూడోసారి ఆ ఇద్దరూ కలిసి నటించినట్లవుతుంది.
పాఠశాలల సంఖ్యను కుదించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక పాఠశాలకు మరో పాఠశాలకు మధ్య అయిదు కిలోమీటర్ల దూరం వుండేలా చర్యలు తీసుకునున్నట్లు సమాచారం. సర్కారు విద్యా చట్టం సవరణ చేయటంతో పది నుంచి పన్నెండు వేల పాఠశాలలు మూతపడనున్నాయి.కనీస స్థాయిలో విద్యార్థులు లేని సర్కారీ పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవరోధంగా నిలిచిన విద్యా హక్కు చట్టానికి కీలక సవరణలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఊరికి.. పాఠశాలకు మధ్య అనుమతించదగ్గ గరిష్ఠ దూరాన్ని ఐదు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని పై పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ,డీఈవో రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షణ ఏఎస్పీడి సభ్యులుగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సవరణల పై పరిశీలన చేయాలని విద్యా శాఖ ఈ కమిటీని ఆదేశించింది.దీని పై ఈ నెల ( నవంబర్ 22న) సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రాధమిక ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధనను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చిన నిబంధనల ప్రకారం ఏ పాఠశాల అయినా సరే ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడే అవకాశముంది. ఇప్పటికే సుమారు నాలుగు వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీని పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 10,000 నుంచి 12,000 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఓ ఉపాధ్యాయుడు అంచనా వేశారు.ఇందులో మెజారిటీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. ఈ పాఠశాలలే కిలో మీటరుకు ఒకటి ఉండటమే ఇందుకు కారణం.  గతంలోనే 15 మంది విద్యార్ధుల లోపు ఉన్న పాఠశాలను దగ్గర లోని పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3000 బడులు మూతబడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం  26,050 ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,230 ప్రాథమిక 3,179 ప్రాథమిక ఉన్నత, 4641  యొక్క ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లొ జీరో అడ్మిషన్ లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.విద్యా శాఖ నిర్ణయం అమలయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 70% శాతం మూతపడే ప్రమాదముంది. స్కూళ్ల మధ్య దూరాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని ఈ నిర్ణయం వల్ల భారీగా సర్కారీ బడులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అంటున్నారు. దీంతో గ్రామీణ తండాల్లోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.
  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.
  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  
కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు. అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.
  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
Just see how majestic it sounds!! That is my college. I was extremely excited about getting into it before. I have heard lots of success stories of people connected with BITS. What more interesting is that, its right in my hometown.  Although it’s a residential college, I never feel homesick!! There is lots to tell about my campus!  So tighten up your seat belts. Cause I am going to take you on an amazing tour around my campus. It’s a 200 acre campus with lots of greenery. Away from the city’s hustle, it’s very peaceful. There are lots of hostel rooms and academic blocks obviously! And when you see, it seems like they are just near-by. But when you walk from one to the other, that’s when you know they are tiresomely far. But for a lazy person like me, It’s some kind of exercise. The food is alright. How does it even matter when you have a chat bhandar and an ice-cream parlour.?  ;) There are lots of other activities involved other than just academics.  And when I say lots, I mean lots and lots and lots!!! There are clubs, MUN’s, departments, NGO’s. This is the place where I get to decide what I am actually interested in and what I am actually capable of.  This is where I am going to explore the complete me! What I really like is that people from all over India come here. There is so much diversity just inside the campus , that it is like a mini India in here!! Also there are students who are of an Indian origin but had been born in foreign countries studying here. I get to make friends from every corner of the world and I am pretty sure, this friendship is going to last long. Coming to the best part, every single detail here is planned and maintained by students. Lecturers are here only to teach,clarify doubs,evaluate and mentor which they do best. Everything else, right from printing our identity cards to getting sponsorship for fests and conducting them is done by students only!! The students here are so dedicated that it is amazing to see them work! Pearl, is our cultural fest and one of its kind. We have international bands playing for us and professionals entertaining us. We have dj-nights, music nights, dance nights, drama nights and what not!! We have ngo’s that help children from rural background choose their career and also help women. What more is that you are encouraged to have your own start-ups, rather than running behind companies to offer you a job. It’s a chance to be an employer rather than an employee. There have been students passed out from this campus who have started their own companies and are now coming back to recruit new people into their companies. How cool is that!!   I have been here now, for only around 10 days and I already feel so emotionally attached and protective about my campus that it is intimidating. Because I might never want to leave.  Even after four years! Anyways!! I welcome myself to the best four years of my life! -Sanjana Kunde
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య అనంతరం జంట నగరాల్లో పెట్రోల్ బంక్ యజమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదని.. పెట్రోల్ బంకుల్లో యజమానుల బోర్డులు సైతం పెడుతూ జనానికి అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పంచర్ షాపులో బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం తెలిసిందే. రోడ్డు పై వెళ్లే వాహన దారులు పెట్రోల్ బంకు అందుబాటులో లేనప్పుడు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమని అంటున్నారు పెట్రోల్ బంక్ యజమానులు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనల తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.వాహన దారుల పరిస్థితి గమనించి అమ్ముతానంటున్నారు.  పెట్రోల్ ను బాటిళ్లో తీసుకెళ్లి  ఎమ్మార్వో హత్య చేశారు. పెట్రోల్ బంకు డీలర్లు అందరం కలసి ఒక నిర్ణయానికి వచ్చామని.. ఇలా అమ్మడం వల్ల జరగకూడనివి జరుగుతున్నాయి కాబట్టి నిజాయితీగా ఎవరికైతే అవసరముందో వాళ్లకే బాటళ్లో ఇవ్వబడుతుందన్నారు. మామూలుగైతే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిచేశామని.. ఇంకా ఏమైనా ఆదేశాలు వస్తే మొత్తంగా ఆపేస్తామన్నారు. కేవలం కస్టమర్ ని  దృష్టిలో పెట్టుకొని వాళ్ల ఇబ్బంది తొలగించటానికి మాత్రమే ఒక సహాయక రూపంలోనే ఇవ్వడం జరుగుతుందని ఏ యజమాని వెల్లడించారు.మరోవైపు బంక్ యజమానుల ఆదేశాలనుసారం తాము బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం లేదని.. అది ఎప్పటి నుంచో అమల్లో ఉందని బంక్ లో పని చేసే ఉద్యోగులు చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్రోల్ పోయడం వల్ల మంటలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
  ఆయన ఒక పశువుల వైద్యుడు. ఆ వైద్యుడికి ఒక రోజు తమ ఇంటికి రమ్మంటూ ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఇంట్లో ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉందట. సరే! వైద్యుడు దానిని ఎలాగైనా నయం చేసే అవకాశం ఉందేమో చూసేందుకు సదరు ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి పెరట్లోకి అడుగుపెట్టిన వైద్యుడికి ఓ మూలగా కూర్చుని ఉన్న కుక్కని చూడగానే అర్థమైపోయింది. దానికి వయసు మీదపడిపోయిందనీ, తన అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం లేదనీ!   కుక్క చుట్టూ ఆ ఇంటి యాజమానీ, అతని భార్యా, వారి పన్నెండేళ్ల కొడుకూ దీనంగా నిల్చొని కనిపించారు. ‘‘మీకు ఈ మాట వినడం కష్టంగా ఉంటుందని తెలుసు! కానీ వాస్తవం చెప్పక తప్పదు. ఈ కుక్క ఊపిరితిత్తులు క్షీణించిపోయాయి. అది మరెంతో కాలం బతకదు. కానీ దాన్ని కనుక ఇలాగే వదిలేస్తే అది అనుక్షణం నరకయాతన పడాల్సి ఉంటుంది. మీకు సమ్మతం అయితే కనుక అది ఇంక ఎలాంటి బాధా పడకుండా వెంటనే చనిపోయేందుకు ఒక ఇంజక్షను ఇస్తాను,’’ అని చెప్పాడు వైద్యుడు.   వైద్యుడి మాటలు వినగానే వారి మొహాలు పాలిపోయాయి. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ ఆ కుక్క వారి కుటుంబంలో భాగంగా మారిపోయింది. అది లేకుండా వారికి పూటైనా గడిచేది కాదు. పొద్దు పోయేదీ కాదు! అలాంటి కుక్కని తమ చేతులతో తాము చంపాల్సి రావడం వారి గుండెని పిండేసింది. కానీ అది బాధతో చనిపోయేకంటే అనాయాసంగా చనిపోవడమే మేలనిపించింది. దాంతో మనసుని రాయి చేసుకుని ‘మీ ఇష్టం! మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి!’ అన్నాడు కుటుంబ యజమాని.   వైద్యుడు నిదానంగా తన బ్యాగ్‌లోంచి ఒక ఇంజక్షను తీసుకుని ఆ కుక్కకు ఇచ్చాడు. మరుక్షణమే అది మూలుగుతూ తన ప్రాణాలను విడిచింది. ఆ దృశ్యంతో కుటుంబసభ్యులలో ఉన్నా కాస్త నెత్తురూ పాలిపోయింది. వారి తలలు వాలిపోయాయి. కుక్క పట్ల వాటి యజమానులు చూపించే అభిమానం వైద్యుడికి కొత్తేమీ కాదు. అందుకనే వారిని కాస్త ఓదార్చేందుకు- ‘‘కుక్కలు కూడా మనలాగే నిండు నూరేళ్లు బతికితే బాగుండు కదా! కానీ పాపం అవి ఎందుకో పది పదిహేను ఏళ్లకు మించి బతకవు,’’ అన్నాడు. వైద్యుని మాటలకు యజమాని కొడుకు చివ్వున తలెత్తి చూశాడు. ‘‘కుక్కలు అంత తొందరగా ఎందుకు చనిపోతాయో నాకు తెలిసిపోయింది!’’ అన్నాడు.   కుర్రవాడు ఏం చెబుతాడా అని అంతా ఆసక్తిగా చూశారు. అతను తన కుర్రతనానికి తగిన సమాధానం ఇస్తాడులే అన్నట్లుగా అతని వంక చులకనగా చూశాడు వైద్యుడు. కానీ అతను చెప్పిన సమాధానానికి వారి దిమ్మ తిరిగిపోయింది. ‘‘మనిషి తన తోటివారిని ప్రేమించేందుకు, ప్రతి రోజునీ కొత్తగా స్వీకరించేందుకు, ప్రతిక్షణం సంతోషంగా జీవించే నేర్పు సాధించేందుకు... చాలా కాలం పడుతుంది. కానీ కుక్కకి ఆ నేర్పు పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఆ నేర్పుతోనే అది బతికే కొద్దికాలం హాయిగా బతికేస్తుంది. ఇక దానికి నూరేళ్లు జీవించాల్సిన అవసరం ఏముంది!’’ అన్నాడు కొడుకు తలవంచుకునే. అందరూ కుక్క బతుకంటే హీనమైనదంటారు. కానీ అసూయాద్వేషాలతో నిండు నూరేళ్లు రగిలిపోయేవారికన్నా కుక్క బతుకు ఎంత నయమో కదా! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.   నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాకా మధ్యాహ్నం లంచ్ తినేలోపు ఏదో ఒకటి తియ్యగా, కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీలో ఆందోళన లేదా వత్తిడి ఎక్కువగా ఉన్నాయనే  అర్ధం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనుకోవటాన్నే క్రేవింగ్ అంటారట. ఆస్ట్రేలియా లో తాజాగా నిర్వహించిన ఒక సర్వే పురుషులకన్నా ఈ క్రేవింగ్ బారిన ఎక్కువగా పడినది స్త్రీలేలని తేల్చి చెప్పింది. ఇది కొందరిలో స్థిరంగా ఉంటే మరికొందరిలో మారుతూ ఉంటుందిట. ఒక నెలలో ఎక్కువగా  తీపి  పదార్థాలు తినాలని అనిపిస్తే మరో నెలలో పులుపు లేదా కారం ఉన్నవి ఎక్కువగా తినాలనిపిస్తుందిట. మానసిక స్థితిలోని మార్పులలాగానే ఆహారపదార్థాల మీదుండే కోరిక కూడా మారుతూ ఉంటుందిట. అంతేకాదు మానసిక ఆందోళనా,టెన్షన్స్,నిరుత్సాహం ఎక్కువగా ఉన్నవారి మెదడులో కొన్ని రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో వారు అతిగా తినటం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎంత తింటున్నదీ,ఏం తింటున్నది అస్సలు పట్టించుకోరట. కేవలం డిప్రెషన్,టెన్షన్ మాత్రమే క్రేవింగ్ కి కారణం కాదు. రక్తంలో గ్లూకోస్ నిలవలు తగ్గిపోవటం, భోజనం చేసే వేళల మధ్య మరీ ఎక్కువ గ్యాప్ రావటం, హార్మోన్ల ఇంబాలన్స్ కూడా క్రేవింగ్ కి కారణాలు అవుతాయని చెపుతున్నారు వైద్యులు. అయితే ఇలాంటి ఇలా క్రేవింగ్ బారిన పడినవాళ్లు దానిని నియంత్రిన్చుకోవటం అంత  పెద్ద పనేం కాదు. ఇది తగ్గుముఖం పట్టాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో లంచ్,డిన్నర్లాంటివి తీసుకోకుండా ప్రతి మూడు గంటలకి ఒకసారి మితాహారాన్ని తీసుకోవటం వల్ల దీనిని నివారించవచ్చు. ఇలా మితాహారం కొంచెంకొంచెంగా తినటం వల్ల గ్లూకోజ్  పర్సెంటేజ్ నిలకడగా ఉంటుంది. క్రేవింగ్ బారిన పడినవారు పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలిట. ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్,ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలిట. ఏదైనా తినాలని అనిపించినప్పుడు దాని మీద నుంచి ధ్యాస మారటానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే క్రేవింగ్ నుండి బయటపడటమే కాదు నాజుకుగా కూడా తయ్యారవుతారు. కళ్యాణి 
  కొలెస్ట్రాల్.... ఈ మాట వినటం సర్వసాదారణం అయిపొయింది. ఇది శరీరంలో సమపాళ్ళలో ఉంటే  పర్వాలేదు కాని కాస్త పెరుగుతున్న సూచనలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టాల్సిందే  అంటున్నారు వైధ్యనిపుణులు. మనం తీసుకునే ఆహరపధార్ధాల్లో కొవ్వు శాతం ఎంత ఉందో, ఎంత ఉండచ్చో అనే విషయాలపై అవగాహన లేకపోవటమే కొవ్వు పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువయితే అది గుండె పోతుకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు కార్డియోలజిస్ట్ లు.   అయితే ఆహారంలో  మనం తీసుకునే కొన్ని పదార్ధాల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.       *  చూడగానే తన ఎర్రటి రంగుతో కూరాలకి మంచి రంగునిచ్చే మిరపకాయలు కొవ్వుని కరిగిస్తాయట. ఎండుకారం ఒంట్లో వేడి పుట్టేలా చేసి కొవ్వుని నియంత్రిస్తుంది. అంతేకాదు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుందిట. అయితే వేసవిలో మాత్రం వీటి వాడుకలో కొంత మార్పులు చేసుకోవాలి.     *  మిరియాలలో ఉండే పిపరైన్ అనే పదార్థం ఒంట్లో కొవ్వుని పెంచే కణాల పెరుగుదలని నియంత్రిస్తుందిట.కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూరలలో కారానికి బదులు మిరియాలపొడి వేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.       *  మసాల దినుసులలో మంచి ఘుమఘుమలాడే దాల్చిన చెక్కకి కూడా కొవ్వుని కరిగించే గుణం ఉంది. ఇది షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచటం వల్ల బరువు త్వరగా పెరగరు. దాల్చిన చెక్క పొడిలో  కొద్దిగా తేనే కలిపి వేడినీటితో సేవించినా కొవ్వు కరుగుతుంది. ఇలా ఆహారవిషయంలో పాటించే కొద్దిపాటి జాగ్రత్తల వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.    ...కళ్యాణి