పరిస్థితిని బట్టి పద్దతి మార్చుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అబ్బే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మా తీరు మార్చుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో దూసుకెళ్తుంది అనుకుంటే టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. పోనీ 2018 ఎన్నికల్లో అయినా మిగతా పార్టీల మద్దతుతో సత్తా చాటుతుంది అనుకుంటే.. మహాకూటమి రూపంలో మునిగిపోయింది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు పార్టీని వీడారు. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ.. పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతల పోరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా మారింది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి.. తమకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేసారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలు చేసారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు. పీసీసీ కుర్చీపై కన్నేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సీనియర్ నేతలంతా కలిసిపోయారు. వారి కలయికకు కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. రేవంత్ కి టీడీపీలో ఉన్న సమయంలోనే మాస్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరాక కూడా ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. అయితే రేవంత్ తో ఇన్నాళ్లు సీనియర్లకు అంతగా ప్రాబ్లమ్ రాలేదు. కానీ ఇటీవల రేవంత్.. కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దాంతోపాటే సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు మనలో మనం పోటీ పడ్డాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ కి ఇస్తానంటే ఎలా ఊరుకుంటాం అనుకున్నారేమో.. అందరూ ఏకమయ్యారు. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రేవంత్ తన వ్యాఖ్యలతో సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం అంశాలలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా ఏకమై రేవంత్ ని కార్నర్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి, విహెచ్, సంపత్ వంటి వారు పీసీసీ చీఫ్ గా తామే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా ఒంటరిగానే ఉన్నారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవొచ్చు. మరి అధిష్టానం అందరికి సర్ది చెప్పి గొడవ సద్దు మణిగేలా చేస్తుందో లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి నష్టం చేసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్ బీజేపీ వైపు చూసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ లాంటి నేతను కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ కాంగ్రెస్ లో వర్గ పోరు పడలేక బీజేపీలోకి చేరి తన సత్తా చూపుతారేమో చూడాలి.
  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సోమవారం భేటీ కానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ మంగళవారం సమావేశం కానున్నారు. ఇందుకు న్యూయార్క్ వేదిక కానుంది. ఒక్క రోజు వ్యవధిలో పాక్, భారత్ ప్రధానులతో ట్రంప్ భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు మరోమారు ప్రస్తావిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మూడో దేశం జోక్యం అంగీకరించబోమని ఓ పక్క భారత్ చెబుతున్న ఇరువర్గాలకు ఆమోదం అయితేనే తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. మరో పక్క నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక రక్షణసంబంధ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తో సమావేశం కానుండడం ఇది నాల్గోసారి. వాణిజ్య, రక్షణ, విద్యుత్ కు సంబంధించిన అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం హ్యూస్టన్ లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరై ట్రంప్ కీలక ప్రకటన చేయొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. ఇరుగు దేశాలకూ మధ్య జరిగే ఒప్పందాలను ఆయన ప్రస్తావించే అవకాశాలు కన్పిస్తున్నాయి. హౌడీ మోదీ సభలో అమెరికాలోని అత్యున్నత స్థాయి అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.
  అనంతపురం జిల్లా కుందుర్పిలో తాజాగా జరిగిన సంఘటన కలకలం రేపుతోంది. గుప్త నిధుల కోసం ఏకంగా విగ్రహాన్నే పెకిలివేశారు దుండగులు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పురాతన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. గురువారం అర్ధరాత్రి గరుడ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధులు ఉన్నాయనే సమాచారంతో విగ్రహాన్ని పెకలించి వేసారు. అక్కడే రాత్రంతా గుంతలు తవ్వారు అయితే విగ్రహం ప్రతిష్టించిన చోట ఎలాంటి గుప్త నిధులు లేవని దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. గరుడ విగ్రహం చుట్టూ రక్షణ కల్పించారు. జాగిలాలను రప్పించి క్లూస్ టీమ్ ద్వారా వేలి ముద్రలు సేకరించారు. కుందారపులో పురాతన ఆలయాలు చాలా ఉన్నాయని వాటికి రక్షణ కల్పించాలనీ దేవాదాయ శాఖాధికారులను భక్తులు కోరుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ పూజారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆలయ కమిటీ సభ్యులు దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కల్యాణదుర్గం సీఐ శివ శంకర్ నాయక్ సూచించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ALSO ON TELUGUONE N E W S
తెలుగులో భారీ చిత్రాల విడుదలకు వారం రోజుల ముందు, తర్వాత సరైన సినిమాలు విడుదల కావు. అది ఎవరూ రాయని రాజ్యాంగం. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'సాహో' 30కి వాయిదా పడితే... 30న విడుదల కావాల్సిన 'నానిస్ గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ రెండోవారానికి వెళ్లింది. ఆ వారంలో రావాల్సిన వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' నిన్న విడుదలైంది. కానీ, మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు 'సైరా నరసింహారెడ్డి' విడుదలైన మూడు రోజులకు 'చాణక్య' విడుదల చేస్తున్నాడు గోపీచంద్. 'సైరా' ఫలితంపై సందేహమో లేదా 'చాణక్య' అవుట్ పుట్ మీద విపరీతమైన నమ్మకమో. అక్టోబర్ 2న 'సైరా' విడుదల అవుతుంది. అదీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో. భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది విడుదలైన మూడు రోజులకు వస్తున్న 'చాణక్య'కు ఎన్ని థియేటర్లు లభిస్తాయో చూడాలి.
  లాంగ్ హెయిర్.. ఫుల్ బియర్డ్.. నోటిలో సిగరెట్.. నిర్లక్ష్యపు సూపు. ఇదిప్పుడు విజయ్ దేవరకొండ సిగ్నేచర్ లుక్ అయిపోయిందా?.. చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తొలిసారి ఇలాంటి లుక్‌తో అతను 'అర్జున్‌రెడ్డి' మూవీలో కనిపించాడు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి, రాత్రికి రాత్రే విజయ్‌ని స్టార్‌గా మార్చేసింది. ఆ సినిమాలో కథానుసారం జుట్టు, గడ్డం పెరిగిపోయి, మందుతో పాటు సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ఒక పిచ్చివాడి తరహాలో కనిపిస్తాడు విజయ్. చాలా సన్నివేశాలు ఆ లుక్‌తోనే నడుస్తాయి. నిజానికైతే అలాంటి లుక్‌ను ఇష్టపడేవాళ్లు తక్కువ. కానీ సర్‌ప్రైజింగ్‌గా ఆ లుక్‌లో యూత్ బాగా లైక్ చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో విజయ్ ఫుల్ బియర్డ్ లుక్ వైరల్ అయిన తీరే దీనికి నిదర్శనం. ఆ సినిమా తర్వాత అతడు 'గీత గోవిందం', 'నోటా', 'టాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' సినిమాలు చేశాడు. 'డియర్ కామ్రేడ్'ను మినహాయిస్తే మిగతా మూడు సినిమాల్లో అతడు షార్ట్ హెయిర్ లేదా నార్మల్ హెయిర్‌తో కనిపించాడు. అయితే బియర్డ్ లుక్ మాత్రం కామన్. 'డియర్ కామ్రేడ్'లో కాలేజీ స్టూడెంట్‌గా నార్మల్ లుక్‌తో కనిపించిన విజయ్. తనకు హీరోయిన్ దూరమయ్యాక, 'అర్జున్‌రెడ్డి' తరహా లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్, సిగరెట్ లుక్‌లోకి రావడం మనం చూశాం. ఆ లుక్ బయటకు వచ్చినప్పుడు.. విజయ్ 'అర్జున్‌రెడ్డి'ని మరిచిపోలేకపోతున్నాడనే కామెంట్లు కూడా వినిపించాయి. ఈ విషయంలో విజయ్‌తో పాటు ఆ మూవీ డైరెక్టర్ భరత్ కమ్మ.. విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా కూడా కమర్షియల్‌గా అంతంత మాత్రంగానే ఆడింది. కొద్ది రోజులు గడిచాయి. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్‌లో మునిగిపొయ్యాడు విజయ్. ఆ సినిమాకు 'బ్రేకప్' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు మొదట్లో వినిపించింది. కారణం.. ఆ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉండటం. ఆ నలుగురు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీతే. ఒకరి తర్వాత ఒకరికి ప్రేమిస్తూ, వాళ్లకు బ్రేకప్ చెబుతూ వస్తాడనీ, అందుకే ఆ టైటిల్ పెట్టే అవకాశాలున్నాయనీ ప్రచారం జరిగింది. ఇప్పుడది గతం. సినిమాకు ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆ సినిమా మేకర్స్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక తెలుగు సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ పెట్టడానికి చాలా గట్స్ కావాలి. విజయ్ కేరెక్టర్ లేదా ఈ సినిమా స్టోరీకి యూనివర్సల్ అప్పీల్ ఉందనుకున్నా, ఒక రీజియనల్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం సాహసం కిందే లెక్క. స్టోరీపరంగా ఆ టైటిల్ యాప్ట్ అని డైరెక్టర్ క్రాంతి మాధవ్ నమ్మకంగా చెబుతున్నాడు. సరే.. ఈ సినిమాలో విజయ్ కేరెక్టర్ ఒక లవర్ అనేది స్పష్టం కాబట్టి.. అతడి లుక్ అల్ట్రా మోడరన్‌గా కనిపిస్తుందని ఊహించడం నేచురల్. లేదా.. ఏ రాక్‌స్టార్ తరహాలోనో కనిపిస్తాడని అనుకున్న వాళ్లూ ఉన్నారు. వాళ్లందర్నీ షాక్‌కు గురి చేస్తూ.. ఆ సినిమాలో తన లుక్‌ను రివీల్ చేశాడు విజయ్. అది.. అచ్చం 'అర్జున్‌రెడ్డి' తరహాలోనే ఉంది. లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్‌తో కనిపిస్తూ, తాగుతున్న సిగరెట్‌ను బొటన వేలు, మధ్యవేలుతో పట్టుకొని ఎదుటి వ్యక్తి మీదకు కోపంగా విసిరేస్తున్నట్లుగా ఉన్నాడు విజయ్. నోట్లోంచి బయటకు వస్తున్న సిగరెట్ పొగ.. ముఖంపై గాయాలయినట్లు నెత్తుటి మరకలు.. ఒక యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగానో, లేక ఒక ఇంటెన్స్ సీన్ సందర్భంగానో ఆ లుక్‌లో విజయ్ కనిపిస్తాడని ఊహించవచ్చు. అది ఏ సీన్ అయినా కానివ్వండి.. మళ్లీ మునుపటి 'అర్జున్‌రెడ్డి', 'డియర్ కామ్రేడ్' లుక్‌లోనే విజయ్ కనిపిస్తుండటంతో.. అది విజయ్ సిగ్నేచర్ లుక్ అయిపోయిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ లుక్‌పై జనరల్ ఆడియెన్స్ నుంచి మిక్సుడ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ ఇంకా 'అర్జున్‌రెడ్డి' హ్యాంగోవర్ నుంచి బయటకు వస్తున్నట్లు లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్‌లో అత్యధికులు మాత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్‌ను స్వాగతిస్తున్నారు. మరి.. సినిమాలో ఈ లుక్ ప్రాధాన్యం ఏమిటి? ఈ లుక్‌లో అతను ఎంతసేపు, ఏ సందర్భంలో కనిపిస్తాడనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.
  ప్రభాస్ కొత్త సినిమాపై 'సాహో' ఎఫెక్ట్ పడింది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో పూజా హెగ్డే హీరోయిన్. ఆల్రెడీ కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఎప్పుడో స్క్రిప్ట్ లాక్ చేశారు. చేయడానికి ముందు ఏడాదికి పైగా స్క్రిప్ట్ వర్కులు, మళ్లీ మార్పులు జరిగాయి. 'సాహో' రిజల్ట్ చూసి... స్క్రిప్ట్ లో మార్పులు చేయమని దర్శకుడికి ప్రభాస్ సూహించాడట. తెలుగు ప్రేక్షకులను 'సాహో' అంతగా ఆకట్టుకోలేదు. కానీ, హిందీలో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. రూ. 150 కోట్లు క్రాస్ చేసింది. ఇంకా కొన్ని ఏరియాల్లో ఆడుతుంది. అందుకని, దర్శకుడు రాధాకృష్ణకు హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథలో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ చెప్పాడని టాక్. దీనిపై ఇండస్ట్రీలో, ప్రభాస్ హార్డ్ కొర్ తెలుగు అభిమానుల్లో భిన్నమైన స్పందన వ్యక్తమవుతుంది. 'సాహో'లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తక్కువ అవ్వడం వల్లే సరైన వసూళ్లు రాలేదని, మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారో అని అభిమానులు అనుకుంటున్నారు. తెలుగు కంటే హిందీకి ప్రభాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కొందరికి నచ్చలేదు. మరికొందరు అభిమానులు హిందీలో తమ హీరో మార్కెట్ పెరుగుతుంది కాబట్టి తప్పు లేదని అంటున్నారు.
  త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సుకుమార్... ఒకప్పుడు తెలుగులో ఈ అగ్ర దర్శకుల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి, దేవిశ్రీకి మధ్య ఏమైందో ఏమో.... ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచంద్రన్ వంటి యువ సంగీత దర్శకుల పేర్లు త్రివిక్రమ్ తీసిన 'అరవింద సమేత వీరరాఘవ', 'అజ్ఞాతవాసి' పోస్టర్ల మీద పడ్డాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న 'అల... వైకుంఠమురములో'కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీని త్రివిక్రమ్ ఎందుకు పక్కన పెట్టాడనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇప్పుడు కొరటాల కూడా దేవిశ్రీని పక్కన పెడుతున్నాడని ఇండస్ట్రీ గుసగుస. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 'సైరా' విడుదల తరవాత పట్టాలు ఎక్కనున్న ఆ సినిమాకు హిందీ సంగీత దర్శకుణ్ణి తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 'సైరా'కి అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చగా, జూలియస్ పేకియమ్ నేపథ్య సంగీతం అందించారు. కొరటాల శివ సినిమాకు ఎవరిని తీసుకొస్తారో?
  క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ వచ్చేసింది. టైటిల్‌ని బట్టి అతడు సాఫ్ట్‌గా, నున్నటి గడ్డంతో ఏ రాక్‌స్టార్ తరహాలోనో కనిపిస్తాడని అందరూ ఊహిస్తుంటే అందుకు భిన్నమైన 'అర్జున్‌రెడ్డి' తరహా లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు విజయ్. లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్‌తో కనిపిస్తూ, తాగుతున్న సిగరెట్‌ను చేత్తో పట్టుకొని ఎదుటి వ్యక్తిపైకి విసిరేయబోతున్నట్లుగా ఆ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నాడు విజయ్. అతడి ముఖమంతా దెబ్బలు తగిలినట్లు నెత్తుటి గాయాలున్నాయి. కోపంతో అరుస్తున్నట్లు తెరిచిన నోట్లోంచి సిగరెట్ పొగ వస్తోంది. మొత్తానికి అది ఒక ఉద్వేగభరితమైన సన్నివేశానికి సంబంధించినదిగా అర్థమవుతోంది.  ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు - రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథిరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీతే - నటిస్తున్నారు. డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ ఒక సెన్సిబుల్ క‌థాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేన‌ని మూవీ యూనిట్ చెబుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జరుగుతోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎ. వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
  వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చెయ్యగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'వాల్మీకి' మూవీ టైటిల్‌ను చివరి నిమిషంలో 'గద్దలకొండ గణేష్'గా నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అప్పటికే 'వాల్మీకి' పేరుతో ప్రచారం చేసినందువల్ల బయట ఎక్కడా 'గద్దలకొండ గణేష్' పేరుతో పోస్టర్లు కనిపించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా 'వాల్మీకి' పేరుతోటే ఇచ్చినందువల్ల దానినే థియేటర్లలో ప్రదర్శించడం గమనార్హం. బోయ సామాజిక వర్గం వాళ్లు చేసిన ఆందోళనల ఫలితంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆ సినిమా ప్రదర్శన నిలిపివేతకు కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడంతో మరో దారిలేక నిర్మాతలు 'గద్దలకొండ గణేష్'గా టైటిల్ మారుస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక మాధ్యమల్లో ఆ మేరకు పోస్టర్లు ప్రచారంలోకి తెచ్చారు. కాగా ఈ టైటిల్ మార్పు విషయమై హీరోలు, దర్శకులు ఓ వైపు మద్దతు తెలుపుతూనే, మరోవైపు సానుభూతి ప్రకటించారు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ "వాల్మీకి ఇప్పుడు 'గద్దలకొండ గణేష్'. ఒక సినిమాకి ఇలాంటిది జరగడం దురదృష్టకరం. కానీ థియేటర్లు ఫుల్ అవుతాయనీ, సినిమాని జనం ఎంజాయ్ చేస్తారనీ ఆశిస్తున్నా. వరుణ్ తేజ్‌కూ, హరీశ్ శంకర్ అన్నకూ, అధర్వమురళికీ, పూజా హెగ్డేకీ, మిగతా టీంకు నా శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశాడు. అలాగే డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, బాబీ, హీరో సుధీర్ బాబు సైతం ఇదే రకమైన ట్వీట్స్ చేశారు.
  మొదట చిన్న చిన్న పాత్రలు చేసి, సడన్‌గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా దర్శనమిచ్చి, సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి.. హిందీలో మరింత ఘన విజయం సాధించాడు. 'దంగల్' ఫేం నితేష్ తివారి డైరెక్ట్ చేసిన 'చిచ్చోరే' సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు మరో హీరోగా నవీన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2019లో ప్రస్తుతం టాప్ 10 పొజిషన్‌లో నిల్చున్నది.  రెండు వారాల్లో ఈ సినిమా రూ. 105 కోట్ల (నెట్)ను వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సర్‌ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. తొలివారంతో పోలిస్తే రెండో వారం వసూళ్లు 42 శాతం తగ్గినప్పటికీ, రూ. 100 కోట్ల వసూళ్లను దాటిపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. 'చిచ్చోరే' మొదటి వారం రూ. 66.84 కోట్లనూ, రెండో వారం రూ. 38.75 కోట్లనూ వసూలు చేయడం విశేషం. రెండో వారం వసూళ్ల పరంగా చూసుకుంటే 2019లో ఇది నాలుగో అత్యధిక వసూళ్లు. ఈ విషయంలో 'చిచ్చోరే' కంటే ముందున్న సినిమాలు.. 'కబీర్ సింగ్', 'ఉరి: ద సర్జికల్ స్ట్రిక్', 'మిషన్ మంగళ్'. రానున్న రోజుల్లో ఈ సినిమా గనుక రూ. 130 కోట్ల మార్కును చేరుకునేట్లయితే, రణ్‌వీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన 'గల్లీ బాయ్' 9వ స్థానానికి ఎసరు పెట్టినట్లే!
  Cast: Varun Tej, Atharvaa, Pooja Hegde, Mirnalini Ravi Banner: 14 Reels Plus Music: Mickey J Meyar Cinematography: Ayananka Bose Editing: Chota K Prasad Producers: Achanta Ramu, Achanta Gopinath Director: Harish Shankar Release Date: 20th Sept 2019   Harish Shankar’s Valmiki has been creating a lot of buzz since actor Varun Tej has been portrayed in the negative role as a rowdy. But the movie’s title faced objections from the Boya section of the society the movie’s title was changed on the night of movie release as Gaddhalakonda Ganesh. This movie is a remake of Tamil hit film 'Jigartanda', which was made five years ago by 'Peta' director Karthik Subbaraj. The character played by Bobby Simha in Tamil is played by Varun Tej, Athaevaa has played the role of Siddhartha. So did Varun impress the audience as Gaddhalakonda Ganesh? Let us read themovie review. Story: This is the story of a gangster rowdy named Gadalakonda Ganesh (Varun Tej). He chooses the path of violence & the one who opposes him he punished either by chopping his hands or legs, by burning them, shooting them or simply chop them off. Abhilash (Atharvaa), a young man who gets the chance to direct for the first time, wants to make a movie with a live gangster. He hears about Ganesh & comes to Gadalakonda, to know more about him. Somehow Ganesh suspects & gets him caught. Ganesh meets Abhilash & tells him to make the movie with him. What does Abhilash do then? Meanwhile what happens to Mrinalini who likes Abhilash but Ganesh wants to marry her? What is the role of Sridevi (Pooja Hegde) in Ganesh’s life? Answers to all these questions forms the movie story. Analysis: Director Harish Shankar has done just an average direction for the movie. But he has done a very good job in rewriting the character of Varun Tej which will make Varun Tej the star of the film. But the changes made in the original movie story makes us feel that this is not our story & that creates a huge disconnect.  Mickey J Meyar’s music is very good & the background score was just magical. Ayananka Bose’s cinematography is top class. Editing could have been better. The color tone he used in filming the scenes was impressive. Production values of the film is very good & the same can be seen on screen. Plus Points:   Varun Tej acting Cinematography Songs Dialogues   Minus Points: Forceful narration Inability to carry emotions Climax has weak or rather no meaning   Performances:   Varun Tej has surely impressed the audience with his Gadalakonda Ganesh’s character. He has made his career debut in a negative role with this movie. He has been brutally intense in his negative role. In the flashback scenes with his bell bottom pants, he has reminded us of the 1980s hero’s. Infront of his character all the other characters seem very small & thus we can conclude saying that Gaddhalakonda Ganesh is truly Varun’s movie. After Ganesh the next important role is that of Abhilash aka Atharvaa. Atharvaa also did justice to his role. He excels in the role of looking soft but also being extremely harsh at heart. Exactly to match him, Mirnalini Ravi has also done a good job. Pooja Hegde has a very small role as Sridevi. Like her name she looked extremely beautiful & audience will surely feel that her role should have been a little longer. Brahmaji appeared in a surprising role as an acting teacher. His gestures entertained. Subbaraju, Prabhas Shenu, Racha Ravi and Annapurna have performed professionally.   TeluguOne Perspective: Impressive sparks & good dialogues are the movie Gadalakonda Ganesh’s aka Valmiki’s biggest plus points. This movie will surely fetch a very good name for actor Varun Tej. This cinema does not give any special credits to the director Harish Sankar. The movie is purely for the mass audience & thus they should only decide if they were thoroughly entertained by the movie. Rating: 2.75/5
    హుజూర్‌నగర్ ఉపఎన్నిక... ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక అభ్యర్ధిత్వంపై తలెత్తిన వివాదంతో నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా ఏకమయ్యారు. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య పద్మావతిని ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో సీనియర్లంతా ఏకమవుతున్నారు. అసలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది. పార్టీలో రేవంత్ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతోందని భావిస్తోన్న సీనియర్లు ఏకమవుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు  నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌‌పై మండిపడుతున్నారు. తాను రాజీనామాచేసిన తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ప్రకటిస్తే తప్పేటంటూ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు... తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎప్పుడూ ఉత్తమ్ పై విమర్శలుచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించడంతో... ఉత్తమ్-కోమటిరెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి... మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌.... మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక కోమటిరెడ్డి అయితే, రేవంత్ పై సెటైర్లు వేశారు. కొత్తగా వచ్చినోళ్ల సలహాలు తమకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో విభేదాలున్నా, తాను, ఉత్తమ్, జానారెడ్డి ఒక్కటిగా పనిచేస్తున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పీసీసీ రేసులో తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే... మరొకరు కాదనే నేతలు ఇప్పుడు... తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. మరి ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
  గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల... గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్.. వారణాసిలో ఎంస్ పూర్తి చేశారు. అసలు ఆరోజుల్లో వైద్య విద్యను అభ్యసించడమే గొప్ప అయితే, ఎంఎస్ పూర్తి చేయడం మరో సంచలనం. అంతేకాదు నర్సరావుపేటలో సొంతంగా ఆస్పత్రిని నెలకొల్పి రూపాయికే వైద్యం అందించడంతో పల్నాడులో కోడెల పేరు మోరుమోగిపోయింది. రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న కోడెలను ప్రజలు ఎంతో అభిమానించేవారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కోడెలను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారు. ఎన్టీఆర్ స్వయంగా కోరడంతోనే అతి చిన్న వయసులో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కోడెల. అయితే, రాజకీయాల్లో వచ్చినా, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినప్పటికీ, కొద్దిరోజులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. అందుకే కోడెల అంటే పల్నాడు ప్రజలకు అంత అభిమానం. కోడెలపై పల్నాడు ప్రజలకున్న అభిమానమే ఆయన్ను వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. 1983లో మొదటిసారి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్... అప్పట్నుంచి 1999వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో తిరుగులేని, ఎదురులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88 మధ్య హోంమంత్రిగా, అలాగే, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, 2004, 2019 ఎన్నికల్లో కోడెల ఓటమి చెందారు. 2014లో మళ్లీ సత్తెనపల్లి నుంచి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా సేవలందించారు. అయితే, కోడెలది తలదించని వ్యక్తిత్వం.... తలవంచని మనస్తత్వం... అంతేకాదు అత్యంత సున్నిత మనస్కుడు... స్నేహశీలి... పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి... అదే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలిగొంది. చిన్న ఆరోపణను కూడా తట్టుకోలేని మనస్తత్వం కోడెలది... అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే  ఒక్క కోడెలపైనే 19 కేసులు పెట్టింది. ఇక ఆయన కుమారుడు, కూతురుపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. పైగా కోడెలపై దొంగతనం కేసు మోపడం... ఆ కేసుల్లో జీవితఖైదు పడే సెక్షన్లను పెట్టడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంద రోజుల్లో వంద రకాలుగా వేధించడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాజకీయాల్లో రాటుతేలిన నేత అయినప్పటికీ, చివరి రోజుల్లో అలాంటి అపనిందలను తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా తనపై మోపిన అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగం నుంచి బయటపడేందుకు కోడెల తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు... ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి లేఖ రాశారు... తనను మానసికంగా క్షోభపెట్టొద్దంటూ వేడుకున్నారు... అసెంబ్లీ ఫర్నిచల్ తరలింపులో తన తప్పులేదని, హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ను తీసుకొచ్చే క్రమంలో అధికారులే తన క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారని, తన పదవీ కాలం పూర్తయిన తర్వాత  వెంటనే ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరానని, లేదా వెల కడితే డబ్బు చెల్లిస్తానని జూన్ ఏడునే లేఖ రాశానని, కానీ అధికారులు స్పందించలేదని, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి లేఖలు రాశానని, అయినా స్పందించకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోడెల ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఇప్పటికే తన కార్యాలయం నుంచి ఫర్నిచర్ ను తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చని, కానీ తనను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రభుత్వానికి కోడెల విజ్ఞప్తి చేశారు. 37ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలుచేస్తూ, దొంగతనం కేసు మోపి, తనను మానసిక క్షోభకు గురిచేయవద్దని కోరారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించలేదు... కోడెలపై వేధింపులకు పాల్పడింది. 90రోజుల్లో 19 కేసులు పెట్టి క్షోభకు గురిచేసింది. కోడెలకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుట్ర చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా చేసిన రచ్చను కోడెల తట్టుకోలేకపోయారు. చివరి ఆ మనోవేదనతోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  గులాబీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. ఎన్నడూ నోరెత్తని నేతలు తమ గొంతులు సమరించుకుంటున్నారు. ఎన్నడూ గీత దాటని నాయకులు, ధిక్కారగళంతో కళ్లెర్రజేస్తున్నారు. అధిష్టానానికి అతిదగ్గరగా ఉన్న నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ గీసిన గీతను దాటని నేతలు, ఒకరి తర్వాత మరొకరు నోరు తెరుస్తున్నారు. ఈటల బాటలోనే ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమలో గూడకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుతో, ఇక మంత్రి పదవి రాదని డిసైడైన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈటల, రసమయి మాటల మంటలు చల్లారకముందే, మరో రెండు గొంతులు ధిక్కార స్వరం వినిపించాయి. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అయితే... తామంతా ఓనర్లమేనంటూ ఈటల మాదిరిగానే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, కౌన్సిల్‌లో ఉండు... మంత్రి పదవి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఊహాగానాలు వినిస్తున్నాయని, కానీ ఆ పదవి తనకు వద్దే వద్దన్నారు...... ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఘన్ పూర్ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య కూడా ఇదే తరహాలో కేసీఆర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో 12శాతమున్న మాదిగలకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని, రాజయ్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మరో సీనియర్‌ నేత పద్మారావు కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న తమకు, ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో పద్మారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలంతా, ఈటల తరహాలోనే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి ఈటల రేపిన మంటల స్ఫూర్తిగా ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తిగళం వినిపిస్తుండటం... గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఈటల పార్టీపరంగా మాట్లాడితే, రసమయి మరో అడుగు ముందుకేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు పోయి టీఎస్ వచ్చింది తప్పా... ఏమీ మారలేదంటూ చేసిన కామెంట్స్... అటు పార్టీని... ఇటు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మొత్తానికి ఇంతకాలం కేసీఆర్ మాటను జవదాటని నేతలు, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఒక్కటే కారణంగా తెలుస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతుందని, ఇది ఏదోఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఛాన్సుందని అంటున్నారు.
  ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని చెప్పింది. అయితే నాణ్యం మాట దేవుడెరుగు, గతంలో కంటే నాసిరకమైన బియ్యం పంపిణీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో జిల్లాలో పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా పంపిణీ అయిన బియ్యం సంచుల్లో ముక్కిపోయిన బియ్యం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ముఖ్యంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. "సంచి ఘనం, బియ్యం దారుణం".. "సంచి డిజైన్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బియ్యం మీద పెట్టుంటే బాగుండేది" అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేనా మీరు ఇస్తానన్న నాణ్యమైన బియ్యం అంటూ మండిపడుతున్నారు.     ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ వైఫల్యాలకు వారు పంపిణీ చేసిన బియ్యమే రుజువు అని అన్నారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా? అని వైసీపీ సర్కార్ పై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
    మంత్రులు... తెలంగాణలో అసలు యూరియా కొరతే లేదన్నారు. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. ఏదో యాక్సిడెంటల్ గా ఒక రైతు గుండెపోటుతో మరణిస్తే, యూరియా కోసం పడిగాపులుపడి ఆ మనోవేదనతో కుప్పకూలి చనిపోయాడని అంటారా? అంటూ సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగితే, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాగింది. తన ఆదేశాల ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేలింది. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాపై తీవ్ర విమర్శలు రావడం... రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం... ఏకంగా తన సొంత జిల్లాలోనే... క్యూలైన్లో ఓ రైతు మరణించడంతో... అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటుతుందని గుర్తించిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియా సరఫరా కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌.... యూరియా సరఫరా వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకొచ్చిందంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. రైతులకు సరిపడినంత యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మూడు నాలుగు రోజుల్లోనే పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లు, లారీలు... ఏది దొరికితే దాంట్లో యూరియాను తీసుకొచ్చి, నేరుగా గ్రామాలకే తరలించాలని ఆర్డర్స్ జారీ చేశారు. అయితే, దాదాపు లక్షా15వేల టన్నుల యూరియా... ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరడంతో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు ఏపీ మంత్రి పేర్నినానితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్‌... పోర్టులకు అవసరమైన లారీలను పంపాలని కోరారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 3వేల లారీలను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరడంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఏపీ పోర్టుల నుంచి రైళ్లు, లారీల్లో యుద్ధ ప్రాతిపదికన యూరియాను తరలించేందుకు, వ్యవసాయాధికారులను ఆంధ్రప్రదేశ్ కు పంపాలని నిర్ణయించారు.   తెలంగాణలో యూరియా కొరత అనే మాట వినిపించొద్దన్న కేసీఆర్‌... సమస్య పరిష్కారమయ్యేవరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి రైతుకూ యూరియా అందేవరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదిఏమైనాసరే మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ యూరియాను ఎట్టిపరిస్థితుల్లోనే అందించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారు.
యూరియా కొరత తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు... అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెళ్లాం-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా, గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా... ఎరువులు దొరక్కపోవడంతో... ఆ నిరాశతో కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య... క్యూలైన్లో నిలబడీనిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య... యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో.... ఈసారి ఎలాగైనాసరే దక్కించుకోవాలని.... భార్య లక్ష్మితో కలిసి క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటిహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు.... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్ సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టీఆర్ఎస్ గవర్నమెంట్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు... ఎల్లయ్య కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.
  కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.   ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
Which should be our priority? Helping others, attending other's needs? or taking care of self ? Is a million dollor question for most of us... Specially for women, this will be the dilemma which always puts them in nutshell... Majority of women find their happiness in keeping their family happy; however constant urge to satisfy other's needs is putting them in "both physical and mental stress" says a recent survey. Experts add that, If women continue to stay in this state of mind for long time, they might loose their self confidence too. Right from simple things of choosing her own wardrobe, food habits, hobbies which keep her happiness intact are the things which need not impress others or approved by others.  Do you believe? Most of the ladies, won't be able to decide the restaurants for the parties they host, can't finalise on the menu for a get together they arrange.. They always put themselves last comparing to family members and kids for that matter. These incidents might sound silly but they have lot of impact on one's personality traits. However, encouraging women in your family to make choices of their own, allow them to take a call when you all go to an eat street, appreciating her choices when you are deciding on home reated affairs are few gestures which build lot of confidence in women in family. On the other hand , women need to take out time for their ownselves; remember, your new cutlery is not only for guests to show off but you have every right to cook, serve and enjoy a special meal for yourself. Treating yourself with an icecream, gifting a book to you by you, wearing a new outfit and trying anew hairstyle just to pep up your day are few of the options to catch up with one own self. Try this out and see the kind of happiness you experience.. ....Bhavana
  అది ఓ ప్రభుత్వ ఆసుపత్రి... అందులోని ఐసీయూ వార్డు. ఆ వార్డులో చావుబతుకుల మధ్య ఉన్న ఓ వృద్ధుడు. ఖచ్చితంగా అతను ఆ రాత్రిని మించి బతకడని వైద్యులందరికీ తేలిపోయింది. అందుకనే అతని బంధువులు అందరికి ఫోన్లు చేసి త్వరగా రమ్మంటున్నారు. ఆసుపత్రిలో అతని తాలూకు పిల్లలు ఎవరన్నా ఉన్నారేమో అని ఓ నర్సు వార్డు బయట అటూఇటూ చూసింది. వార్డు బయట బెంచీ మీద ఓ యువకుడు కనిపించాడు. ‘ఐసీయూ వార్డులో ఫలానా పెద్దాయన మీ తండ్రేనా!’ అని అడిగింది.‘ఏ ఏమైంది!’ అని కంగారుగా అడిగాడు ఆ యువకుడు.   ‘ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నారు. తన కొడుకుల కోసం తెగ కలవరిస్తున్నారు. ఈ రాత్రి కాస్త ఆయన పక్కనుంటే ప్రశాంతంగా కన్నుమూస్తారు’ అని చెప్పుకొచ్చింది నర్సు.‘నేను ఆయన చిన్న కొడుకుని. దయచేసి ఈ రాత్రి ఆయన పక్కనే ఉండే అవకాశం ఇవ్వండి,’ అని అడిగాడు యువకుడు. యువకుడు లోపలికి వెళ్లేసరికి వృద్ధుని పరిస్థితి నిజంగానే బాగోలేదు. కళ్లు తెరుచుకోవడం లేదు. ఏదేదో కలవరిస్తున్నాడు. కొడుకుల స్పర్శ కోసం చేతిని చాస్తున్నాడు. యువకుడు ఠక్కున వెళ్లి ఆ చేతిని అందుకున్నాడు. అతని పక్కనే ఒక బల్ల వేసుకుని రాత్రంతా కూర్చున్నాడు.   ఆ రాత్రి ఒకో జాము గడిచేకొద్దీ వృద్ధుడు తన జీవితానికి సంబంధించి ఏవేవో చెబుతూ ఉన్నాడు. దానికి యువకుడు ఊ కొడుతూనే ఉన్నాడు. మధ్యమధ్యలో వృద్ధుడు యువకుడి చేతిని గట్టిగా అదిమిపట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. వృద్ధుడు శరీరంలో ఇక ప్రాణం నిలిచేట్లు లేదు. ఆఖరుగా ‘బిడ్డా! నువ్వు ఈ చివరి క్షణాల్లో నా దగ్గర ఉంటావని అనుకోలేదు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి,’ అంటూ చెక్కిలి మీద నుంచి కన్నీరు జారుతుండగా కన్నుమూశాడు. ఆ దృశ్యం చూసిన యువకుడికి దుఃఖం ఆగలేదు. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి అతని దగ్గరికి నర్సు కంగారుగా రావడం కనిపించింది. ‘ఆ ముసలాయన కుటుంబమంతా ఇప్పుడే వచ్చింది. నిన్న రాత్రి వాళ్లు రాలేకపోయారంట. వాళ్లలో ఒకతను ఆయన చిన్నకొడుకునని అంటున్నాడు. మరి మీరెవరు?’ అని అడిగింది.   ‘నిజానికి ఆ ముసలాయన ఎవరో నాకు తెలియనే తెలియదు. కానీ చివరిక్షణంలో ఆయన దగ్గర ఎవరూ లేకపోవడం మాత్రం బాధ కలిగించింది. జీవితంలో ఎంత సాధించినా ఆఖరు క్షణాన ఒంటరిగా మిగిలిపోవడం నిజంగా నరకం. అందుకనే మీరు నన్ను పిలిచినప్పుడు మారుమాటాడకుండా లోపలకి వచ్చేశాను. మంచం మీద ఉన్న ఆ మనిషికి కావల్సింది తనవారు పక్కనే ఉన్నారన్న ధైర్యం, వారి స్పర్శలో ఉండే స్థైర్యం... అని అర్థమైంది. మరేం ఆలోచించకుండా ఆయనకి నా చేతిని అందించాను. జీవితపు చివరి క్షణంలో కావల్సిన తృప్తిని ఇచ్చాను’ అంటూ సంజాయిషీగా చెప్పుకొచ్చాడు.     ..Nirjara
మనం ఆరోగ్యంగా వుండటానికి అత్యుత్తమమైన మార్గం యోగా. భారతదేశంలో అభివృద్ధి చెందిన యోగాను ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తోంది. మనం ఎదుర్కొనే అన్ని అనారోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారం లభిస్తుంది. శ్రద్ధగా యోగాను అనుసరించాలేగానీ, మనకు చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. పొత్తికడుపును తగ్గించుకునే యోగాసనాల గురించి ప్రముఖ యోగా థెరపిస్ట్ రాజేశ్వరి వడ్డిపర్తి వివరిస్తున్నారు చూడండి...
    Food Check   Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s.   Fitness Check   Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime...   No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit.  Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts,  This keeps your workout fun and your mind motivated.           Take care, Stay Healthy!!!!   -Sandya Koya