కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ భారత్ ను కవ్విస్తున్న పాక్ ఆర్మీకి భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చింది. భారత ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న పాక్ కుట్రను భారత్ తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ రేంజర్లు చనిపోయారు. దీంతో శాంతికి, లొంగుబాటుకు చిహ్నమైన తెల్లజెండా చూపిస్తూ... పాక్ సైనికులు తమ సహచరుల మృత దేహాలను తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం జమ్మూ కశ్మీర్లోని హాజీపూర్ సెక్టార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న హాజీపూర్ సెక్టార్ లో భారత ఆర్మీ పోస్టులపై ఈ నెల 10,11 తేదీల్లో పాక్ బలగాలు భారీఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భారత ఆర్మీ వారి కుట్రను దీటుగా తిప్పికొట్టింది. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో పాక్ బలగాలు తోకముడిచాయి. భారత్ చేసిన దాడిలో పాక్ ఆర్మీలోని ఇద్దరు రేంజర్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్మీ నిబంధనల ప్రకారం పాక్ సైనికులు కొందరు తెల్లజెండాతో ముందుకు వచ్చారు. తెల్లజెండాను చూపితే కాల్చవద్దని అర్థం. దీంతో భారత బలగాలు తమనుతాము నియంత్రించుకున్నాయి. ఈ సందర్భంగా తమవారి మృతదేహాలను పాక్ తీసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి భారత ఆర్మీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా తమ సహచరుల శవాలను తీసుకెళ్లిన కొద్ది సేపటికే పాక్ రేంజర్లు ఇవాళ మళ్లీ కాల్పులు మొదలు పెట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాలాకోట్, మెందార్ సెక్టార్లలో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. ఎల్వోసీ వద్ద పహారా కాస్తున్న భారత సైనికులు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నారు.
  నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. అసలు యురేనియం అంటే ఏంటి? యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలేంటి? పర్యావరణం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వంటి విషయాలు తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. యురేనియం ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది మూడు ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, అణురియాక్టర్లలో ఇంధనంగా వాడుతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా మూడు రూపాలలో లభిస్తుంది. అవి యూ 238, యూ 235, యూ 234. యూ 235 అనేది అణురియాక్టర్లు అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2-4 పార్ట్‌ మిలియన్‌గా లభిస్తుంది. భారత్‌లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో ఉన్నాయి. భూమిలో ఉన్నంత వరకు యురేనియం క్షేమకరమైనది. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆక్సైడ్‌గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటికి రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75 శాతం అధికంగా ఉంటుంది. ఇది న్యూక్లియర్‌ రియాక్టర్లలో చర్య జరిగినపుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం యు-235 .. తక్కువ లో తక్కువగా 7కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయొచ్చు. యురేనియం (యు- 238) నుంచి జనించే ఫ్లుటోనియం అనే రూపం (యు-239) అత్యంత ప్రమాదకరమైనది. యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలోని అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లో, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీనితో చాలా సులభంగా క్యాన్సర్‌ వ్యాధి వ్యాపిస్తుంది. భూమి లో నుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో చనిపోతారు. కొన్ని వందల తరాలు వికృత సంతానం లేదా పూర్తిగా సంతాన లేమితో మానసిక వ్యధకు గురియ్యే ప్రమాదం ఉంది. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి స్త్రీలలో అండాల విడుదల క్రమం దెబ్బతినడం, గర్భాశయ క్యాన్సర్‌ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.  యూఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినపుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టిలో కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలు, చెట్ల వేర్లలో నిక్షిప్తమౌతాయి.  యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వల్ల 200-300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల, నీటి సెలయేర్ల యందు, అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరుల మొత్తం విషపదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి. మండుతున్న యురేనియంతో కార్బన్‌ను చర్య జరపడం వలన యురేనియం మోనాక్సైడ్‌ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అందువల్ల వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిద్యం దెబ్బతింటుంది.ప్రస్తుతం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం అనుమతించింది. ఈ యురేనియం త్రవ్వకాలు జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభావం చూపనున్నది. అందుకే పర్యావరణ ప్రేమికులు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమయ్యారు.
  ఏపీ సీఎం వైఎస్ జగన్ కి నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రాసిన లేఖ అందరినీ కదిలిస్తోంది. స్కూలులో తనతోపాటు చదువుకుంటున్న పిల్లలు ఎవరూ మాట్లాడడం లేదని, తమను ఊరి నుంచి వెలివేశారని చిన్నారి లేఖలో పేర్కొంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడూరి పుష్ప అనే బాలిక ఈ లేఖ రాసింది. తనకో చెల్లెలు గాయత్రి, తమ్ముడు హేమంత్ ఉన్నారని, తన తండ్రి పేరు రాజు, తల్లి పేరు జానకి అని లేఖలో పేర్కొంది. తాత పేరు వెంకటేశ్వర్లు, నానమ్మ పేరు మంగమ్మ అని తెలిపింది. ఈ నెల 4 వ తేదీ నుంచి తమ ముగ్గురితో స్కూలులో ఎవరూ మాట్లాడడం లేదని, ఎవరైనా మాట్లాడితే రూ. 10 వేల జరిమానా వేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను ఊర్లోనుంచి వెలివేశారని అందరూ అంటున్నారని పేర్కొంది. తమతో ఎవరూ మాట్లాడడం లేదని, ఆడుకోవడానికి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, నాన్న, తాతను చంపేస్తారని స్నేహితులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు చాలా భయంగా ఉందని పేర్కొంటూ లేఖలో తన తండ్రి ఫోన్ నంబరు, వివరాలను ఇచ్చింది. కాగా, స్థానికంగా ఉన్న ఓ భూ వివాదం కారణంగా వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయాన్ని చిన్నారి లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లింది. చిన్నారి రాసిన లేఖపై సీఎం జగన్ స్పందించారు. దినపత్రికల్లో ఈవార్తను చూసిన ఆయన నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి ఆరాతీశారు. వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు పూర్తిగా కనుక్కుని, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
ALSO ON TELUGUONE N E W S
  తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన 'కాప్పాన్' మూవీ తెలుగు వెర్షన్ 'బందోబస్త్'.. ఒరిజినల్‌తో పాటే సెప్టెంబర్ 20న తెలుగునాట రిలీజవుతోంది. తిరుపతి ప్రసాద్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ పిలుచుకొనే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ ఈ మూవీని తెలుగు స్టార్ హీరోల సినిమా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకు అగ్రెసివ్ ప్రమోషన్ ఇస్తున్నారు. ఆయనిస్తున్న ప్రమోషన్‌కు ఆ మూవీ ప్రి రెలీజ్ ఈవెంట్‌లో సూర్య సైతం తెగ పొగిడేశారు. అయితే 'బందోబస్త్'ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారా?.. అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ తమిళ స్టార్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అంతెందుకు.. ఆ మధ్య ఎంతో ఆర్భాటంతో, ప్రచారంతో విడుదల చేసిన సూర్య మునుపటి సినిమా ‘ఎన్‌జీకే’ తెలుగులో డిజాస్టర్ అయింది. అదే సినిమా తమిళంలో హిట్టవడం గమనార్హం. కొంత కాలం క్రితం తమిళ అనువాద చిత్రాలు తెలుగు తెరపై సృష్టించిన అలజడిని ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోలేదు. రజనీకాంత్, కమలహాసన్ మొదట్నుంచీ తెలుగు హీరోల మాదిరిగానే ఆదరణ పొందుతూ రాగా, ఆ తర్వాత వారికి విక్రం, సూర్య, శింబు, సిద్ధార్థ్, విశాల్, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్ వంటి హీరోలు తోడయ్యారు. దాంతో ఒక్కొక్కప్పుడు తెలుగు సినిమాలకే తగినన్ని థియేటర్లు లభించని స్థితి ఏర్పడింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాను విడుదల చేసినట్లుగానే వాళ్ల సినిమాలను కూడా ఇక్కడ భారీ పబ్లిసిటీతో విడుదల చేస్తూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే మన హీరోలకు వీళ్లు పక్కలో బల్లేల్లా తయారయ్యారు. ఓ వైపు మన యువ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే, మరోవైపు తమిళ యువ హీరోల సినిమాలు శరపరంపరలా దూసుకువచ్చి థియేటర్లను ఆక్రమించేవి. అంతేనా.. అవి ఆడుతున్న థియేటర్లు యువతరం ప్రేక్షకులతో కిటకిటలాడేవి. దాంతో సహజంగానే వాళ్ల చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. ‘అపరిచితుడు’, ‘గజిని’, ‘పందెంకోడి’, ‘ప్రేమిస్తే’, ‘మన్మథ’, ‘ఆవారా’, ‘రఘువరన్ బీటెక్’, ‘తుపాకి’, ‘రెమో’, ‘అభిమన్యుడు’ తదితర అనువాద చిత్రాలు ప్రేక్షకుల ఆదరాన్ని బాగా పొందాయి. ఆ హీరోల్లో సిద్ధార్థ్ అయితే ఏకంగా టాలీవుడ్‌లోనే కొంత కాలం తిష్ఠవేశాడు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'అనగనగా ఓ ధీరుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయాయి. ఇదివరికటిలా తమిళ హీరోల సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రజనీకాంత్ ‘పేట’ తమిళంలో బ్లాక్‌బస్టర్ కాగా, ఇక్కడ అంతంత మాత్రంగానే ఆడింది. దానితో పాటు విడుదలైన అజిత్ సినిమా ‘విశ్వాసం’ సైతం తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కానీ తమిళంతో పాటు తెలుగులో విడుదల చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు రాలేదు. చివరకు చాలా రోజుల తర్వాత విడుదల చేస్తే, మొదటి రోజే ఈ సినిమాకి ప్రేక్షకులు లేకపోవడంతో రెండో రోజు నుంచే కొన్ని థియేటర్ల నుంచి ఆ సినిమా మాయమైంది. ఇక సిద్ధార్థ్, శింబు వంటి హీరోల సినిమాలను తెలుగులో విడుదల చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొంత కాలం క్రితం తెలుగు హీరోలా మారిపోయాడనిపించిన కార్తీ సినిమాలకు సైతం తెలుగులో డిమాండ్ తగ్గిపోయింది. అతడు హీరోగా నటించీన 'కాష్మోరా', 'చెలియా', 'ఖాకీ', 'చిన్నబాబు', 'దేవ్' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఇదివరకటిలా ధనుష్, విశాల్ ప్రాభవం తెలుగునాట కనిపించడం లేదు. దీనికి కారణం.. కొంత కాలంగా తెలుగులోనూ యువ హీరోల సంఖ్య బాగా పెరగడమే. దీంతో అరవ హీరోలు వెనుకబడిపోయారు. తెలుగునాట ఇదివరకటిలా వాళ్ల పప్పులు ఉడకడం లేదు. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న 'బందోబస్త్'ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఆసక్తి టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది.
"మనలో చాలామంది జీవితం కోసం ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళుతుంటాం. కానీ, జీతం... జీవితం కోసం కాకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, తుపాకీ తూటాలకు ఎదురు నిలిచి.. ఉద్యోగం చేసేవాళ్లే కమాండోలు" అని సూర్య అన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు సెక్యూరిటీగా ఉండేది ఎన్.ఎస్.జి లేదా ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోలు. అటువంటి కమాండోగా నటించిన సినిమా 'బందోబస్త్'. ప్రధాన మంత్రి ఆఫీసుతో పాటు డిఫెన్స్ వివరాలు తెలిసిన కమాండో రెబెల్ గా మారి ఏం చేశాడనే కథతో 'రంగం' ఫేమ్, దర్శకుడు కెవి ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించాడట. కమాండో జీవితంతో పాటు వ్యవసాయం గురించి సినిమాలో చర్చించారని సూర్య తెలిపాడు. ఈ సినిమా కోసం ఆయన ఢిల్లీకి దగ్గరలోని మనేసర్ ఏరియాలో కమాండోలతో మూడు రోజులు ఉన్నారు. వాళ్లు ఏ విధమైన శిక్షణ తీసుకుంటారు? ఎలా పని చేస్తారు? అనే విషయాలు తెలుసుకున్నారట. కమాండోలు తనను సోదరుడిలా చూసుకున్నారని, అక్కడివారిలో క్యాస్ట్ ఫీలింగ్స్ లేవనీ, 'మేమంతా భారతీయులమే' అనే భావన మాత్రమే ఉందని సూర్య తెలిపారు. సెప్టెంబర్ 20న విడుదలవుతున్న ఈ సినిమా కంప్లీట్ ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ అన్నారు.
ఓ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియాలో సెగలు పుట్టాలి. కుర్రకారుకు కిక్ ఎక్కించాలి. ప్రేక్షకుల్లో హాట్ హాట్ డిస్కషన్ జరగాలి. తమన్నా బికినీ వేస్తే ఇటువంటివేవీ జరగలేదు. ఆడియన్స్ క్యాజువల్ గా చూశారు. లైట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఏడేళ్ల క్రితమే 'రెబల్'లో బికినీ లాంటి టాప్ వేసుకున్నారు తమన్నా. అందాలు చూపించే విషయంలో ఆమె ఎప్పుడూ మొహమాటపడలేదు. మొన్నటికి మొన్న 'ఎఫ్ 2'లోనూ తమన్నా బికినీ వేశారు. ఇప్పటివరకూ వేసిన బికినీలు ఒక ఎత్తు... విశాల్ 'యాక్షన్' సినిమాలో వేసిన బికినీ మరో ఎత్తు. టూ పీస్ బికినీలో బోల్డ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు తమన్నా రెచ్చిపోయారు. 'యాక్షన్' టీజర్లో టూ పీస్ బికినీలో తమన్నా కనిపించేది రెండు సెకన్లు మాత్రమే అయినప్పటికి... బికినీ వాక్ రిజిస్టర్ అయింది. టీజర్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలోనూ హాట్ గా కనిపించారు. కానీ, ఆడియన్స్ లైట్ తీసుకున్నట్టున్నారు. తమన్నా మరోసారి బికినీ వేసుకోవడంలో విశేషం ఏముందన్నట్టు చూశారు. ఇదే విధంగా ప్రతి సినిమాలోనూ బికినీ వేసుకుంటూ వెళితే... చూపించడానికి తమన్నా దగ్గర ఇంకేముంది? తమన్నా ఇంకేం చూపించగలదు? అనుకోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది. ఆల్రెడీ కొందరు అలాగే ఫీల్ అవుతున్నారు.
ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా సెట్ చేసుకోవడం నానికి అలవాటు. దాంతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయగలుగుతున్నాడు. ఎప్పుడూ నాని చుట్టూ ముగ్గురు నలుగురు దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడూ రెండు మూడు సినిమాలు లైనులో ఉన్నాయి. అందులో దర్శకుడు శివ నిర్వాణ సినిమా ముందు పట్టాలు ఎక్కుతుందని, సెప్టెంబర్ 13న విడుదలైన 'గ్యాంగ్ లీడర్' తర్వాత హీరోగా నాని నెక్స్ట్ సినిమా అదేనని సమాచారం. అదేంటి? మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్నాడు కదా అని కొందరికి సందేహం రావొచ్చు. అందులో నాని హీరో కాదు, విలన్ కదా! 'వి' షూటింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ లో శివ నిర్వాణ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించనున్నారు. 'నిన్ను కోరి'తో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. షైన్ స్క్రీన్స్ లో 'కృష్ణార్జున యుద్ధం' చేశాడు. అటు దర్శకుడితో... ఇటు నిర్మాతలతో నానికి ఇది రెండో సినిమా అన్నమాట.  
ప్రేమికులకు, ముఖ్యంగా అబ్బాయిలకు సూర్య ఒక సలహా ఇచ్చారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆమెను ఎలా ఒప్పించాలి? అని తీవ్రంగా ఆలోచిస్తున్న అబ్బాయిలకు ఈ సలహా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే... నేరుగా అమ్మాయి తల్లి దగ్గరకు వెళ్లి, నిజాయతీగా వాళ్ల అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నామన్నది చెప్పడమే. కాబోయే అత్తగారి దగ్గర ప్రేమ కహాని గురించి క్లారిటీగా చెప్పడమే. తమిళ హీరో ఆర్య అలాగే చేశాడని శుక్రవారం రాత్రి నిర్వహించిన 'బందోబస్త్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య అన్నారు. తెలుగులో హీరోగా అఖిల్ అక్కినేని తొలి సినిమా 'అఖిల్'లో నటించిన సాయేషాను ఆర్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు ఇద్దరూ 'బందోబస్త్'లో నటించారు. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. సూర్యకు జంటగా సాయేషా నటించగా... కీలక పాత్రలో ఆర్య నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయానికి  ఆర్య, సాయేషా ప్రేమలో పడ్డారు. అంతకు ముందు వీరిద్దరూ 'భలే భలే మగాడివోయ్' తమిళ్ రీమేక్ 'గజినీకాంత్'లో జంటగా నటించారు. 'బందోబస్త్'లో ఆర్య ముందు సాయేషాతో లవ్ సీన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డానని సూర్య తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదల అవుతోంది.  
  Cast: Nani, Kartikeya, Priyanka Arul Mohan, Lakshmi, Saranya, Vennela Kishore, Baby Praanya Banner: Maitri Movie Makers Cinematography: Miroslav Kuba Brojek Music Director: Anirudh Ravichander Producer: Y Naveen, Y Ravi and Mohan Cherukuri Songs: Ananta Sriram Director: Vikram Kumar Release Date: 13rd Sept 2019 Ishq, Manam, 24 are among the few movies directed by Vikram Kumar. When there was a buzz that Natural Star Nani is uniting with Vikram Kumar, audience were excited to see Nani’s character in his movie. To match the audience’s excitement, director named the movie as Gang Leader! So has the movie done justice to the audience’s excitement? Let us read the review. Story: Six members successfully execute the plan of robbing Rs. 300 crore from a bank near Punjagutta of Hyderabad city. As soon as they rob & are ready to get into the van, one among those six members shoot the other five & manages to escape without getting caught! One of the five people who got killed, one of them has a baby girl (Baby Praanya), another one has finance (Priyanka Arul Mohan), third man has a sister Swathi (Sriya Reddy), fourth person has mother Varalakshmi (Saranya) & the last person has his grandma Saraswathi (Lakshmi). After 1 n half year of robbery, grandma successfully gathers everyone. She plans to meet an extraordinary revenge story writer Pencil Parthasarathy (Nani) to find out the person who has killed their family members. So how will Pencil Parthasarathy help the gang of five? Answer to this question forms the movie story. Plus Points: Comedy Songs Twists in the Story Minus Story: Increased length Flashback episodes Introductory first half Analysis: Director Vikram Kumar very clearly detailed the confusing flashback scenes in Manam with ease. For a director like him, it is not at all difficult to explain & narrate to the audience as to who has done the robbery! The journey of 5 ladies who try to locate the revenge story teller & their introduction with each other will make the audience laugh. But the director failed to handle the climax or rather the last 30 minutes of the movie. He failed in writing crucial character’s characterization well. Did he create magic like he did in his movie Ishq? The answer is no again. Audience will wait for the movie get over sometimes. Neither Lakshmi nor Kartikeya’s flashback will appeal the audience. Few scenes in the movie are good. Nani’s investigation will make the audience laugh & sometimes create thrill. Background score is good. Production values are too good.   Director chose the characters of the movie very well. This character for Nani is not challenging at all, he does it like a cakewalk – very well. Kartikeya who is best known for his role n RX 100 has done total justice to his character. Priyanka Arul Mohan has performed well just like the girl next door. Needless to mention about Lakshmi & Saranya who did equally very well. Though Vennela Kishore & Priyadarshini are seen only in few scenes, they make us laugh.   TeluguOne Perspective: Nani’s Gang Leader has good comedy & nice songs. But director Kumar struggled to tell the story in an interesting manner from start to end! You can enjoy the movie once if you go without expectations. Rating: 2.25/5
  Cast: Kiccha Sudeep, Suniel Shetty, Aakanksha Singh, Kabir Duhan Singh, Sushanth Singh Banner: RRR Motion Pictures Production Music Director: Arjun Janya Producer: Swapna Krishna Editor: Ruben Cinematography: Ganesh Acharya, Raju Sundaram Written & Directed By: S Krishna Release Date: 12th Sept 2019 Kiccha Sudeep, is a Kannada superstar was introduced to Telugu audience with Eega. He had also played a cameo role in “Rakta Charitra”. Later on he was also seen in Baahubali. But as a hero, he will be seen in movie Pailwaan for which he has dubbedfor himself. Now lets see how the movie is! Story: Sarkar (Suniel Shetty) is a bachelor. He has devoted his life for wrestling. An orphan named Krishna (Kiccha Sudeep) joins him to learn wrestling. Sarkar takes care of Krishna like his own son. Sarkar’s only dream is to see Krishna win National Wrestling Championship. His only condition is Krishna to fall in love & marry Rukmini (Aakanksha Singh). But what happens later? Does Krishna obeys Sarkar? Does he forgets his love? Answers to these questions form the movie story Plus Points: Pre Climax Children’s Emotion Production Values   Minus Points: Routine Story Direction Lack of family cast for Telugu Audience Climax Lengthy Movie   Analysis: “Balam undanna aham tho kotevadu rowdy, Balamaina karanam kosam kottevadu Yodhudu”, this powerful dialogue can be heard twice in the Pailwaan movie trailer. The dialogue can be heard twice in the movie too! But certain situations in the movie related to this dialogue will irritate the audience. We should surely speak about one incident in the movie which can be completely related to a scene from “Magadheera”. When the heroine meets hero for the first time, an astrologer will predict that certain things might occur & it happens the same way. But other than that heroine does not have an effective reason for falling in love with him! The reason for which hero wants to get into the boxing ring is commendable. Sudeep has really worked hard for this role. He has acted well. Heroine Aakanksha Singh has done justice to her role. She looks beautiful in a song. Sunil Shetty added value to his character with his acting. But he could not display his acting skills due to his characterization. Now except Villian Kabir Duhan Singh, there are not faces whom the telugu audience will recognize.   TeluguOne Perspective: Pailwaan is a routine story & narration with commercial aspects. Since Sudeep is a Kannada star hero, his star image might work there & appeal the kannada audience. But coming to Telugu audience, they might feel that all the scenes are very much hyped. There is nothing new for which we can watch the movie. Rating: 1.75/5
నటీనటులు: నాని, కార్తికేయ, లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుల్ మోహన్, బేబీ ప్రన్యా, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా తదితరులు పాటలు: అనంత శ్రీరామ్ మాటలు: వెంకీ   సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌ బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్‌ సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్   నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి కథ, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్ విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2019 నేచురల్ స్టార్ నాని... 'ఇష్క్', 'మనం', '24' వంటి సినిమాలు తీసిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఎటువంటి సినిమా చేస్తారోనని! ఆసక్తికి తగ్గట్టు 'గ్యాంగ్ లీడర్' అంటూ ఐదుగురు మహిళలు (అందులో చిన్న పాప కూడా ఉందనుకోండి), వారికి నాని లీడర్ అని ప్రచార చిత్రాలు విడుదల చేసి ఆసక్తి ఇంకొంచెం పెంచారు. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా?   కథ: ఆరుగురు కలిసి హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక బ్యాంకులో రూ. 300 కోట్లు దొంగతనం చేస్తారు. డబ్బు కాజేసి బ్యాంకు కింద వ్యాన్ దగ్గరకు వచ్చేసరికి ఆరుగురిలో ఒకడు మిగతా ఐదుగురినీ షూట్ చేసి, పోలీసులకు దొరక్కుండా డబ్బుతో చెక్కేస్తాడు. చంపబడిన ఐదుగురిలో ఒకరికి చిన్న పాప చిన్ను (బేబీ ప్రన్యా), ఒకరికి చెల్లి స్వాతి (శ్రియ రెడ్డి), ఇంకొకరు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ప్రియ (ప్రియాంక అరుల్ మోహన్), మరొకరికి బామ్మ సరస్వతి (లక్ష్మి), ఇంకొకరికి అమ్మ వరలక్ష్మి (శరణ్య) ఉంటారు. దొంగతనం జరిగిన ఏడాది తర్వాత వీరందరినీ బామ్మ ఏకం చేస్తుంది. ప్రముఖ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథి (నాని)తో కలిసి తమ వాళ్లను చంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఐదుగురు ఆడవాళ్లకు పెన్సిల్ ఏ విధమైన సహాయం చేశాడు? ప్రముఖ రేసర్, స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ దేవ్ (కార్తికేయ)కు, పెన్సిల్ పార్థసారథికి సంబంధం ఏంటి? అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: కామెడీ పాటలు కథలో మలుపులు మైనస్ పాయింట్స్: ముఖ్యంగా చివరి అరగంట నిడివి ఎక్కువైంది ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ విశ్లేషణ: 'మనం'లో క్లిష్టమైన మలుపులను అరటిపండు వలిచి తినిపించినట్టు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు విక్రమ్ కె. కుమార్. అతడికి ఓ బ్యాంక్ దొంగతనం, అదెవరు చేశారో తెలుసుకోవాలని హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టి పుస్తకాలు రాసే రచయిత చేసే ప్రయత్నాలను వినోదాత్మకంగా చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. రచయిత ఇంటికి ఐదుగురు ఆడవాళ్లు రావడం, వాళ్ల మధ్య పరిచయం, పగ తీర్చుకోవాలని చేసే ప్రయత్నాలు పెదవులపై చిరు నవ్వు తెప్పిస్తాయి. అప్పటివరకూ సినిమాను బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు... ఒక్కసారి దొంగకు తనను వెంటాడుతున్నది ఎవరో తెలిసిన తర్వాత వచ్చే సన్నివేశాలను, ముఖ్యంగా చివరి అరగంటను సరిగా హ్యాండిల్ చేయలేదు. కథకు కీలకమైన పతాక సన్నివేశాలను రసవత్తరంగా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక ఫైట్ తో ముగించాడు. పోనీ... కథ లేకున్నా 'ఇష్క్'లో సన్నివేశాలతో మేజిక్ చేసినట్టు చేశాడా? అంటే అదీ లేదు. దాంతో చివరి అరగంటలో కథలో వేగం, ప్రేక్షకులను కట్టిపడేసే దర్శకత్వం కొరవడ్డాయి. ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకుడు ఎదురు చూసేలా క్లైమాక్స్ సాగింది. కార్తికేయ ప్లాష్ బ్యాక్ లో గానీ... లక్ష్మి ఫ్లాష్ బ్యాక్ లో గానీ... భావోద్వేగాలు పండలేదు. సగటు సినిమాల్లో చూసే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లా ఉన్నాయి. సినిమా ప్రారంభంలో పాత్రలను పరిచయం చేసే సన్నివేశాలను పక్కన పెడితే... పతాక సన్నివేశాల వరకూ సినిమాను విక్రమ్ నడిపించిన తీరు పర్వాలేదు. నాని పరిచయం నుండి పతాక సన్నివేశాల వరకూ కాసేపు వినోదం, మరికాసేపు ఉత్కంఠ కలిగిస్తూ ముందుకు నడిపాడు. నాని ఇన్వెస్టిగేషన్ కొన్నిసార్లు నవ్విస్తే... మరికొన్ని సార్లు ఉత్కంఠ కలిగిస్తుంది. పాటలు కథకు అడ్డు తగల్లేదు. 'రారా జగతిని జయించుదాం', 'హొయన హొయన' బావున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. నిడివి ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. కథకు, పాత్రలకు తగ్గట్టు దర్శకుడు విక్రమ్ కె. కుమార్ నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. నానికి ఈ పాత్ర పెద్ద కష్టమేమీ కాదు. అవలీలగా, సహజంగా నటించేశాడు. ప్రతినాయకుడి పాత్రలో 'ఆర్.ఎక్స్100' కార్తికేయ మెప్పించాడు. ప్రియాంక అరుల్ మోహన్ పక్కింటి అమ్మాయిలా ఉంది. హీరోయిన్ లా కాదు, పాత్రకు తగ్గట్టు చక్కగా నటించింది. నాని, ప్రియాంక మధ్య కెమిస్ట్రీ బావుంది... ముఖ్యంగా 'హొయన హొయన' పాటలో! లక్ష్మి, శరణ్య కూడా చక్కటి నటన కనబరిచారు. ప్రియదర్శి. 'వెన్నెల' కిషోర్ కనిపించింది కాసేపే అయినా నవ్వించారు.   తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: చక్కటి కామెడీ, మంచి పాటలు 'నానిస్ గ్యాంగ్ లీడర్'లో ఉన్నాయి. కానీ, కథను ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తడబడ్డాడు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.25/5
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  గులాబీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. ఎన్నడూ నోరెత్తని నేతలు తమ గొంతులు సమరించుకుంటున్నారు. ఎన్నడూ గీత దాటని నాయకులు, ధిక్కారగళంతో కళ్లెర్రజేస్తున్నారు. అధిష్టానానికి అతిదగ్గరగా ఉన్న నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ గీసిన గీతను దాటని నేతలు, ఒకరి తర్వాత మరొకరు నోరు తెరుస్తున్నారు. ఈటల బాటలోనే ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమలో గూడకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుతో, ఇక మంత్రి పదవి రాదని డిసైడైన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈటల, రసమయి మాటల మంటలు చల్లారకముందే, మరో రెండు గొంతులు ధిక్కార స్వరం వినిపించాయి. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అయితే... తామంతా ఓనర్లమేనంటూ ఈటల మాదిరిగానే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, కౌన్సిల్‌లో ఉండు... మంత్రి పదవి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఊహాగానాలు వినిస్తున్నాయని, కానీ ఆ పదవి తనకు వద్దే వద్దన్నారు...... ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఘన్ పూర్ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య కూడా ఇదే తరహాలో కేసీఆర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో 12శాతమున్న మాదిగలకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని, రాజయ్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మరో సీనియర్‌ నేత పద్మారావు కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న తమకు, ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో పద్మారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలంతా, ఈటల తరహాలోనే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి ఈటల రేపిన మంటల స్ఫూర్తిగా ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తిగళం వినిపిస్తుండటం... గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఈటల పార్టీపరంగా మాట్లాడితే, రసమయి మరో అడుగు ముందుకేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు పోయి టీఎస్ వచ్చింది తప్పా... ఏమీ మారలేదంటూ చేసిన కామెంట్స్... అటు పార్టీని... ఇటు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మొత్తానికి ఇంతకాలం కేసీఆర్ మాటను జవదాటని నేతలు, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఒక్కటే కారణంగా తెలుస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతుందని, ఇది ఏదోఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఛాన్సుందని అంటున్నారు.
  ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని చెప్పింది. అయితే నాణ్యం మాట దేవుడెరుగు, గతంలో కంటే నాసిరకమైన బియ్యం పంపిణీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో జిల్లాలో పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా పంపిణీ అయిన బియ్యం సంచుల్లో ముక్కిపోయిన బియ్యం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ముఖ్యంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. "సంచి ఘనం, బియ్యం దారుణం".. "సంచి డిజైన్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బియ్యం మీద పెట్టుంటే బాగుండేది" అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేనా మీరు ఇస్తానన్న నాణ్యమైన బియ్యం అంటూ మండిపడుతున్నారు.     ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ వైఫల్యాలకు వారు పంపిణీ చేసిన బియ్యమే రుజువు అని అన్నారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా? అని వైసీపీ సర్కార్ పై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
    మంత్రులు... తెలంగాణలో అసలు యూరియా కొరతే లేదన్నారు. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. ఏదో యాక్సిడెంటల్ గా ఒక రైతు గుండెపోటుతో మరణిస్తే, యూరియా కోసం పడిగాపులుపడి ఆ మనోవేదనతో కుప్పకూలి చనిపోయాడని అంటారా? అంటూ సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగితే, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాగింది. తన ఆదేశాల ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేలింది. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాపై తీవ్ర విమర్శలు రావడం... రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం... ఏకంగా తన సొంత జిల్లాలోనే... క్యూలైన్లో ఓ రైతు మరణించడంతో... అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటుతుందని గుర్తించిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియా సరఫరా కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌.... యూరియా సరఫరా వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకొచ్చిందంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. రైతులకు సరిపడినంత యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మూడు నాలుగు రోజుల్లోనే పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లు, లారీలు... ఏది దొరికితే దాంట్లో యూరియాను తీసుకొచ్చి, నేరుగా గ్రామాలకే తరలించాలని ఆర్డర్స్ జారీ చేశారు. అయితే, దాదాపు లక్షా15వేల టన్నుల యూరియా... ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరడంతో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు ఏపీ మంత్రి పేర్నినానితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్‌... పోర్టులకు అవసరమైన లారీలను పంపాలని కోరారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 3వేల లారీలను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరడంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఏపీ పోర్టుల నుంచి రైళ్లు, లారీల్లో యుద్ధ ప్రాతిపదికన యూరియాను తరలించేందుకు, వ్యవసాయాధికారులను ఆంధ్రప్రదేశ్ కు పంపాలని నిర్ణయించారు.   తెలంగాణలో యూరియా కొరత అనే మాట వినిపించొద్దన్న కేసీఆర్‌... సమస్య పరిష్కారమయ్యేవరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి రైతుకూ యూరియా అందేవరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదిఏమైనాసరే మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ యూరియాను ఎట్టిపరిస్థితుల్లోనే అందించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారు.
యూరియా కొరత తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు... అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెళ్లాం-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా, గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా... ఎరువులు దొరక్కపోవడంతో... ఆ నిరాశతో కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య... క్యూలైన్లో నిలబడీనిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య... యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో.... ఈసారి ఎలాగైనాసరే దక్కించుకోవాలని.... భార్య లక్ష్మితో కలిసి క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటిహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు.... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్ సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టీఆర్ఎస్ గవర్నమెంట్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు... ఎల్లయ్య కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.
  ప్రగతి రథ చక్రాలు... ఇకపై ప్రభుత్వ రథ చక్రాలుగా మారనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరబోతోంది. దాంతో ఆర్టీసీ ఎంప్లాయిస్‌... త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం... కేసీఆర్ ను చిక్కుల్లో పడేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ వేశారు. వివిధ కోణాల్లో అధ్యయనం జరిపిన కమిటీ... ముఖ్యమంత్రి జగన్ కు మధ్యంతర నివేదికను అందజేసింది. దాంతో సంబంధిత మంత్రులు, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన జగన్మోహన్ రెడ్డి.... ఆర్టీసీ విలీనానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. నిపుణుల కమిటీ సూచించిన మేరకు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ ను ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. అయితే, ఆర్టీసీ విలీనం ద్వారా ప్రభుత్వంపై ఏటా 3వేల 500కోట్ల రూపాయల భారం పడనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కానుండటంతో, కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన విధివిధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్న పేర్ని నాని... ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తామన్నారు. అయితే, ఆర్టీసీ విలీనానికి సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో జరగకపోవడం, అలాగే ఆస్తుల విభజన పూర్తికాకపోవడం, తెలంగాణతో సమస్యలు ఉండటంతో,  ఇప్పటికిప్పుడు విలీనం సాధ్యంకాదని చెప్పింది. ఈ సమస్యలన్నీ కొలిక్కిరావడానికి కొంత సమయం పడుతుందని, అలాగే కేంద్రం వాటాను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కమిటీ నివేదిక ఇఛ్చింది. దాంతో, ఆర్టీసీ కార్పొరేషన్ ను కొనసాగిస్తూనే, ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.  మొత్తానికి, జగన్ సర్కారు నిర్ణయంపై ఆంధ్రా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో చేసినట్లే... ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీలో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులిచ్చిన ఎంప్లాయిస్ యూనియన్... సెప్టెంబర్ 17 తర్వాత ఏక్షణమైనా సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించింది. దాంతో జగన్ నిర్ణయం ఇక్కడ కేసీఆర్ ను చిక్కుల్లో పడేసినట్లయ్యింది.  
  చందమామ రహస్యాలను అన్వేషించేందుకు ప్రయోగించిన చంద్రయాన్-2లో అసలుసిసలు కథ ఇప్పుడే ఆరంభమైంది. దాదాపు అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-2 అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి చేరుకుంది. జాబిల్లిపై ల్యాండర్ దిగడమే మిగిలి ఉంది. ల్యాండర్ ల్యాండింగ్ కి ముందు జరగాల్సిన అత్యంత ముఖ్యమైన దశ ముగిసింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా వేరవడంతో.... ల్యాండర్లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌... చంద్రమామ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. జులై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం అప్రతిహాతంగా దూసుకుపోతోంది. ఆగస్ట్ 20న చంద్రుడి వలయంలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 కక్ష్యను ఇప్పటివరకు ఐదుసార్లు విజయవంతంగా తగ్గించారు. స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే పలు దఫాలుగా చంద్రుడి ఫొటోలను ఇస్రోకు పంపించింది. ప్రస్తుతం చంద్రుడికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. దాంతో చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే, చంద్రయాన్-2లో అత్యంత ముఖ్యమై చివరిదైన కీలక ఘట్టం సెప్టెంబర్ 7న ప్రారంభంకానుంది. ఏడున అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య చందమామ దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో ల్యాండర్ దిగనుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటికి వస్తుంది. పవర్ డీసెంట్ గా పిలిచే ఈ దశ 15 నిమిషాలపాటు సాగనుంది. ఈ 15 నిమిషాలనే ఇస్రో.... అత్యంత ఉత్కంఠభరిత క్షణాలుగా అభివర్ణిస్తోంది. ఈ సమయంలోనే చంద్రుడి రహస్యాలను రోవర్ ఇస్రోకు పంపుతుంది. దాంతో సెప్టెంబర్ ఏడున ఆవిష్కృతం కాబోయే అద్భుత ఘట్టం కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది.  అయితే, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ల్యాండర్ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణించకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణిస్తే క్రాష్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని, అయితే చంద్రయాన్-2లో ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకపోవడంతో... అంతా సవ్యంగానే జరుగుతుందని ఇస్రో ప్రకటించింది.
  తెలంగాణలో రైతుబంధు పథకానికి సంబంధించి కోత పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రైతుబంధు పథకానికి పది ఎకరాల సీలింగ్ పెట్టటం ద్వారా.. ఖర్చును కాస్త తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో రైతుబంధు పథకం ప్రారంభించినపుడు సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. 2019లో దాన్ని రూ.5 వేలకు పెంచారు. అంటే.. ఖరీఫ్‌, రబీకి కలిపి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాల్సి వస్తోంది. రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వ్యవసాయం చేసే రైతు సమస్యలకు అసరాగా ఉండేలా ఈ పథకాన్ని ప్లాన్ చేశారు. అయితే ఎంత భూమి అంటే అంత మొత్తానికి పథకాన్ని అమలయ్యేలా చేశారు. ఈ పథకం బడ్జెట్ భారీగా ఉండటంతో ఇతర సంక్షేమ పథకాలకు.. ఇతరత్రా పథకాలకు నిధుల సమస్య ఇబ్బందిగా మారింది.  ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.14,500 కోట్లు రైతుబంధుకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంది. దాంతో రైతుబంధు పథకానికి కోత పెట్టి, కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దాంతో రైతుబంధుకు సీజన్‌కు రూ.50 వేల గరిష్ఠ పరిమితితో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫైలు సీఎం కేసీఆర్‌ వరకు వెళ్లిందని, ఆయన ఆమోదిస్తే రబీ నుంచే కోత అమల్లోకి వస్తుందని అంటున్నారు. అయితే సీఎం ఇందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.   అధికారుల ప్రతిపాదనల ప్రకారం రైతుకు 10 ఎకరాలకు మించి భూమి ఉన్నా.. 10 ఎకరాలకు మాత్రమే లబ్ధి కలుగుతుంది. పదెకరాలకు మించిన భూమి లక్షా రెండు వేల మంది రైతులకు ఉన్నట్లు సమాచారం. వారిచేతిలో 15.25 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే, దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమికి ఇవ్వాల్సిన రూ.500 కోట్ల రైతు బంధు సాయం మిగులుతుందన్నమాట. తాజా నిర్ణయం ప్రభుత్వానికి అంతో ఇంతో ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. మరి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
HANDWRITING IS MORE THAN A CHILDS PLAY     Children Handwriting   Raise your child’s grades, levels of confidence and self-esteem, discover their hidden talents; improve positive skills, power of concentration and memory. Understand better and help shy/emotionally disturbed/ difficult children and do much more … through Handwriting. Sounds hard to believe but it is true. But you can do all these and more. How much do you really know about your children? Do you at times wonder why are they so difficult to deal with? Do you ever wish you could know their deeper feelings and desires, their moods and silences, which can often be disturbing to you, to say the least? To understand their attitudes, character and psychological make-up and to help them improve in all aspects is easier than you think, through Graphology (the study of handwriting and handwriting analysis). A single page of a child’s handwriting can tell the Graphologist volumes about the child’s personality, character, fears, frustrations, etc, even without a personal encounter. WHAT IS GRAPHOLOGY? Graphology is a science, which deals with handwriting analysis. Handwriting is the psychological imprint of a person on paper. It is as unique as a fingerprint. No two handwriting samples are alike. Applied Graphology is a science wherein handwriting reveals character; where handwriting rewrites character. Handwriting Analysis combined with traditional training in handwriting can make subtle yet powerful shifts in the child’s mind, resulting in better attitude, better behavior and performance both at home and at school. Research conducted at the University of California Los Angeles (UCLA) in 1991, on the actual movements of the hand and it’s relationship to the stimulation of the brain, has successfully established a link between hand and brain. It has been ascertained that by changing handwriting one could change one’s attitude and personality. Most of the beliefs, values and habit patterns that are the basis of long-term success or failure, seem to take a concrete shape between 7-14 years of growing children. In this process, parents will be able to monitor and guide their children better, and give the right direction to the amazing potential all children possess. Your child will no longer be an unfathomable mystery to you! You will know and understand how he or she thinks and reacts, and you will know best how to deal with them. Basic tips on how to improve your handwriting: (A few practical points that can make a lot of difference). 1.You must have good lighting. 2.You must be sitting comfortably. 3.The surface that you put your paper on is important too. 4.Your arm needs to be able to move freely if it is to work at its best. 5.You need to be relaxed. 6.Lines. Well spaced, even lines of writing create an immediate impression of clarity and legibility. 7.The way you hold your pen will affect the letters that you write, there is no correct method of holding pen so hold the pen in the way you’re most comfortable. There are certain ways to improve your personal characteristics through your handwriting. Following tips applicable to children as well adults • If you want to be expressive, make sure that your right margins align all down the page. • To develop your confidence cross your t-bars above the stem. • Letters should be equally spaced in the words and lines to improve social life. • Always write upright or sloping (slanting) towards right to improve memory. • Apply medium pressure to improve your concentration power, avoid light and heavy pressure in your handwriting. • If you want to develop leadership qualities let the first letter in your signature dominate others. Write everyday a full page of handwriting. You cannot go wrong if you “write” right!
కుటుంబసభ్యులు కానీ.. బంధు మిత్రులు కానీ.. ఆఫీసులో సహోద్యోగులు కానీ నిత్యం ఇంతమందిని చూస్తుంటాం.. మరి వీరందరివి వేరు వేరు మనస్తత్వాలు. మనతో ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వ్యక్తిత్వం వేరు. మరి వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడం ఎలా..? ఒక చిన్న ఐస్‌క్రీమ్‌తో ఈ చిక్కు ముడి విప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=WuXFWRrbPdc
  చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.   ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు. తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు. ‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు.... ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు... మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.  
  Health benefits of neem juice: 1. Due to its anti-inflammatory ingredients, neem juice extract is best to get rid of acne or pimples. Neem juice also improves the complexion. 2. By drinking neem juice, the toxins from the system are flushed out. This improves the hair quality, skin complexion and digestion. 3. Neem juice is considered effective for diabetic patients. By having neem juice everyday, you control the sugar levels in the body. 4. Neem juice reduces vaginal pain during pregnancy. Many pregnant women massage with neem juice to get rid of labor pain. Use of Neem Leaf for Dental Problems: Dry Neem leaves in shade and grind to make powder. Use it to massage your gums to treat pyorrhoea. It will also strengthen the gums. You may add a pinch of clove powder and peppermint powder to make it more refreshing.
  One of the most common and widely used method of detoxification is the juice fasting or also known as juice cleansing, in this regime the person deletes the solid food consumption and practically survives on fruits and vegetables juice for his nutritional survival. The are quite a few reason for the uptake of this juice diet, spiritual or religious reasons, alleged detoxification, weight loss, as a part of rehabilitation post the indulgence into smoking or or caffeine addiction, binge-eating or excessive soda consumption. Many believe that this to cure chronic pain, cancer, depression, arthritis, autoimmune diseases and severe infections that are resistant to antibiotics. One of the proven method is the bi-anually of week long periods which synchronize with the nature thus aiding and fastening the process of purification.  As a known fact, no diet is foolproof, this diet has some issues too. The juice has no fiber, thus flushing out of the slush from intestines. Yet another issue is the is the shelf life of maximum 72hours. Certain juices like grapefruit might interact with drugs causing reactions. And most importantly salt deficiency, as the content is low in fruits and vegetables, it may cause symptoms of headaches, light-headedness and nausea.      The best fruits for juice dieting are apples they are packed with antioxidants, reduces cholesterol and boost immunity. Pineapple add a tropical  flavor and have anti-inflammatory, antiviral and antibacterial; might also aid in the dissolution of blood clots; pineapple has a Bromelain protein for good digestion. Papaya is yet another option good for people for with weak digestion. Tomatoes are packed with lycopene which reduces the risk of cancer and cardiovascular diseases. This is great way of detoxification and weight loss. But we should bear in mind about the vitamin and mineral deficiencies; also keep away unhealthy regain of fat after the detox ends!