కరోనా కేసులు పెరుగుతుండటంతో.. దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది. అత్యవసర సేవలకే మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని సడలింపులు ఇచ్చింది. రాత్రివేళ కర్ఫ్యూను కుదించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్‌ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీల పై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. అద్భుతంగా పాలించామని, ఒక్క ఏడాదిలోనే మేనిఫెస్టోలో చెప్పినవి 90 శాతం చేశామని, మేనిఫెస్టోలో చెప్పనవి కూడా ఎన్నో చేసి.. ప్రజా ప్రభుత్వం అనిపించుకున్నామని అధికార పార్టీ చెబుతోంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం.. జగన్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే ప్రజలకు చుక్కలు చూపించిందని.. కూల్చివేతలు, కబ్జాలు, కోర్టు మొట్టికాయలు, మంత్రుల బూతులు తప్ప.. ఏడాదిలో జగన్ సర్కార్ సాధించింది ఏమి లేదని విమర్శిస్తున్నాయి. సరే అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవడం, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్. అసలు వైఎస్ జగన్ ఏడాది పాలన గురించి సామాన్య జనం ఏమనుకుంటున్నారు?. అది తెలుసుకోవడం కోసమే.. తెలుగు వన్ సంస్థ యూట్యూబ్ లో పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో 50 వేల మందికి పైగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. "వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయింది. జగన్ ఏడాది పాలనపై మీరు సంతృప్తిగా ఉన్నారా?" అని తెలుగు వన్ పోల్ నిర్వహించగా.. 42 శాతం మంది జగన్ ఏడాది పాలనతో సంతృప్తిగా ఉన్నామన్నారు. అయితే, 58 శాతం మంది మాత్రం సంతృప్తిగా లేమని చెప్పారు. అంటే, జగన్ ఏడాది పాలన బాగుంది అన్నవారికంటే.. బాగాలేదు అన్నవారు 16 శాతం ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ పోల్ కి కామెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. అందులో జగన్ సర్కార్ ని మెచ్చిన కామెంట్స్ కొన్ని ఉంటే, తీవ్ర విమర్శలు చేసిన కామెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొందరు జగన్ సర్కార్ ని ప్రజా ప్రభుత్వమని ప్రశంసించగా, కొందరు మాత్రం ప్రతీకార ప్రభుత్వమని విమర్శించారు. "రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, పోలవరం ఆగిపోయింది, ఇసుక కొరత, న్యాయస్థానాలపై గౌరవం లేదు." అంటూ ప్రభుత్వ తీరుపై కొందరు విరుచుకుపడ్డారు. "ఒక్క శాతం కూడా సంతృప్తిగా లేము, త్వరగా జమిలి ఎన్నికలు వచ్చి వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుండు" అంటూ కొందరు కామెంట్స్ చేశారు. వరస్ట్ సీఎం.. తుగ్లక్ చర్యలు.. క్యాస్ట్ ఫీలింగ్ లేని రాజకీయం ఎప్పుడొస్తుందో?.. అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ దర్శనమిచ్చాయి. మొత్తానికి తెలుగు వన్ నిర్వహించిన పోల్ లో జగన్ ఏడాది పాలనకి లైక్ కొట్టినవారికంటే, డిస్ లైక్ కొట్టినవారే ఎక్కువ ఉన్నారు.
వైసిపిలో నంబర్ వన్ ఎవరంటే ఎవరైనా ఠక్కున జగన్ అనే చెప్తారు. అలాగే నంబర్ టూ ఎవరు అంటే నిన్నటి వరకు ఎంపీ విజయసాయి రెడ్డి అనే చెప్తారు. అటు కేంద్రం తో, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంచి రిలేషన్స్ మెయింటేన్ చేస్తూ పార్టీలో జగన్ కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో ఐతే ఆయనను ఉత్తరాంధ్ర సీఎం అని ఆయనంటే గిట్టని వాళ్ళు, అలాగే ప్రతిపక్షాలు ఆడి పోసుకుంటాయి. నిన్నటివరకు పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా అందులో అయన ప్రజెన్స్ ఉంది తీరాల్సిందే. ఐతే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎంపీ విజయసాయి రెడ్డి ని మెల్లగా పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో చూసుకోవాలని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పవర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికోసం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక నుండి రోజూ ఆయన కేంద్ర కార్యాలయానికి వచ్చి కొంత టైం పార్టీ వ్యవహారాల కోసం స్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇక పార్టీ తరపున ఎలాంటి వ్యవహారాలకైనా విజయసాయిరెడ్డిని సంప్రదించరాదనే సంకేతాలు కొంత మంది నేతలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ రోజుతో ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఈ పరిణామాలు వైసీపీ కేడర్ ను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
ALSO ON TELUGUONE N E W S
  కొద్ది రోజుల క్రితం రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్ నిశ్చితార్ధం (రోకా) జ‌రిగింది. రామానాయుడు స్టూడియోస్‌లో కుటుంబ‌స‌భ్యుల‌ మ‌ధ్య ఉల్లాసంగా జ‌రిగిన ఈ వేడుక‌లో ఆ ఇద్ద‌రి జంట ఎంత అందంగా ఉందో చూశాం. అప్ప‌ట్నుంచీ వాళ్ల పెళ్లి తేదీ ఎప్పుడో తెలుసుకోవాల‌ని రానా ఫ్యాన్స్ ఆస‌క్తి చూపుతూ వ‌స్తున్నారు. తాజాగా ఆ తేదీని రానా తండ్రి సురేశ్‌బాబు బ‌య‌ట‌పెట్టారు. ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో ఈ వేడుక జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు ఆ వేడుక‌కు హాజ‌ర‌వుతార‌ని సురేశ్‌బాబు చెప్పారు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి కుటుంబ‌ స‌భ్యుల‌తో పాటు రానా, మిహీకాల స్నేహితులు, సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన‌ కొంత‌మంది ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొనే అవ‌కాశం ఉంది. రానా, మిహీకా కొంత‌కాలంగా ప్రేమించుకుంటూ వ‌స్తున్నారు. అయితే త‌మ మ‌ధ్య బంధాన్ని వాళ్లు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. "ఆమె స‌రేనంది" అంటూ సోష‌ల్ మీడియా ద్వారా మిహీకాను రానా ప‌రిచ‌యం చేశాకే.. అంద‌రికీ వాళ్ల ప్రేమ వ్య‌వ‌హారం తెలిసింది.
  అల్లు అర్జున్ మూవీ 'అల వైకుంఠ‌పుర‌ములో' విడుద‌లైన త‌ర్వాత కూడా త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల దుమ్ము దుల‌ప‌గా, త‌మ‌న్ ట్యూన్స్ ఇచ్చిన ఆ మూవీలోని పాట‌లు అమిత ఆద‌ర‌ణ సంపాదించుకున్నాయి. మొద‌ట సీతారామ‌శాస్త్రి ర‌చించిన‌ 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌', త‌ర్వాత కాస‌ర్ల శ్యామ్ రాసిన‌ 'రాములో రాములా' పాట‌లు బంప‌ర్ హిట్ కాగా, వాటి త‌ర్వాత రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన‌ 'బుట్ట‌బొమ్మ' సాంగ్ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. తాజాగా 'బుట్ట‌బొమ్మ' వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేష‌న‌ల్ హిట్ట‌యి, 200 మిలియ‌న్ వ్యూస్ సాధించింది. ఇదివ‌ర‌కు ఈ మార్క్‌ను 'రాములో రాములా' సాంగ్ అందుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ సాంగ్‌కు వ‌చ్చిన వ్యూస్ 271 మిలియ‌న్ వ్యూస్ కావ‌డం విశేషం. అలాగే 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' పాట 189 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మిగ‌తా పాట‌లు 'ఓమైగాడ్ డాడీ', టైటిల్ సాంగ్‌, 'సిత్త‌రాల సిర‌ప‌డు' కూడా బాగానే పాపుల‌ర్ అయ్యాయి. మొత్తానికి త‌మ‌న్ మ్యూజిక‌ల్ కెరీర్‌లో అల వైకుంఠ‌పుర‌ములో మూవీ సాంగ్స్ మ‌ర‌పురానివిగా నిలిచాయి.
  సూప‌ర్ స్టార్ మ‌హేశ్ 'స‌ర్కారు వారి పాట' పాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అవును. మూడు నాలుగు రోజులుగా ప్ర‌చారంలో ఉన్న‌ట్లుగా ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో మ‌హేశ్ న‌టించే సినిమాకు 'స‌ర్కారు వారి పాట' టైటిల్‌ను ఖాయం చేశారు. టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆదివారం (మే 31) విడుద‌ల చేశారు. ఇందులో మ‌హేశ్ ప్రిలుక్ కూడా ఉంది. మ‌హేశ్ ముఖం క‌నిపించ‌కుండా ఒక వైపు త‌ల‌ను చూపిస్తూ ఉన్న ఈ లుక్ ఆస‌క్తి క‌లిగిస్తోంది. చెవికి రింగు, మెడ‌పై రూపాయి కాయిన్ టాట్టూతో మ‌హేశ్ కొత్త అవ‌తారంతో ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. గోల్డ్ క‌ల‌ర్‌లో డిజైన్ చేసిన టైటిల్ లోగో చివ‌ర ఒక గంట‌ను డిజైన్ చేశారు. ప్ర‌భుత్వం వేసే వేలానికి ముందు గంట కొట్ట‌డం ఆన‌వాయితీ. దాన్నే లోగోలో చూపిస్తున్నారు. ఈ టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన మ‌హేశ్‌.. "బ్లాక్‌బ‌స్ట‌ర్ స్టార్ట్ ఫ‌ర్ అన‌ద‌ర్ హ్యాట్రిక్" అని పోస్ట్ చేసి, సినిమాపై త‌న‌కెంత గ‌ట్టి న‌మ్మ‌కం ఉందో తెలియ‌జేశాడు. 'భ‌ర‌త్ అనే నేను', 'మ‌హ‌ర్షి', 'స‌రిలేను నీకెవ్వ‌రు' మూవీల‌తో ఒక హ్యాట్రిక్‌ను పూర్తిచేసిన ఆయ‌న 'స‌ర్కారు వారి పాట‌'తో రెండో హ్యాట్రిక్ మొద‌ల‌వుతుంద‌ని చెప్తున్నాడు. ఇక తొలిసారి మ‌హేశ్‌ను డైరెక్ట్ చేసే.. ఆ మాట‌కొస్తే తొలిసారి ఒక టాప్ స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన ప‌ర‌శురామ్‌.. "సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌గారిని డైరెక్ట్ చేయాల‌నే నా సుదీర్ఘ కాల నిరీక్ష‌ణ ఇప్పుడే ముగిసింది. సెట్స్‌పైకి వెళ్లేందుకు అత్యుత్సాహంతో, ఆస‌క్తితో ఎదురుచూస్తున్నా. ఇది నిజ‌మ‌వుతున్న క‌ల" అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'గీత గోవిందం' త‌ర్వాత అత‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న మూవీ ఇదే. ఇదివ‌ర‌కు మ‌హేశ్ హీరోగా నిర్మించిన 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతోటే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మైత్రీ మూవీమేక‌ర్స్‌, మూడు సినిమాలు.. 'దూకుడు', '1.. నేనొక్క‌డినే', 'ఆగ‌డు' నిర్మించిన 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (ఇప్పుడు దీని పేరును 14 రీల్స్ ప్ల‌స్‌గా మార్చారు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాటితో పాటు మ‌హేశ్ సొంత నిర్మాణ సంస్థ జిఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. టైటిల్ లోగో పోస్ట‌ర్‌కు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఫ్యాన్స్ నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చి, అది వైర‌ల్‌గా మారింది. స‌రికొత్త‌గా కనిపిస్తోన్న మ‌హేశ్ లుక్ వాళ్ల ఉత్సాహాన్ని మ‌రింత పెంచేసింది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే గూస్‌బంప్స్ ఆగ‌ట్లేద‌నీ, క‌ళ్ల‌ల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయ‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ముందు అనుకున్న‌ట్లుగానే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా 'స‌ర్కారు వారి పాట‌'కు త‌మ‌న్ ట్యూన్స్ క‌ట్ట‌నున్నాడు. ప‌ర‌శురామ్ చాయిస్ గోపీ సుంద‌ర్ కంటే మ‌హేశ్ చాయిస్ అయిన త‌మ‌న్‌కే ఈ సినిమాకు ప‌నిచేసే ఛాన్స్ ద‌క్కింది. సినిమాటోగ్రాఫ‌ర్‌గా 'అల వైకుంఠ‌పుర‌ములో' ఫేమ్ పి.ఎస్‌. వినోద్ ప‌నిచేయ‌నున్నాడు. సూప‌ర్ స్టార్‌తో వినోద్‌కు ఇదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. సీనియ‌ర్ ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేశ్‌, ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్. ప్ర‌కాశ్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు వినిపిస్తున్నా, అధికారికంగా మాత్రం క‌న్‌ఫామ్ చేయ‌లేదు. అయితే 'భ‌ర‌త్ అనే నేను' మూవీ త‌ర్వాత మ‌హేశ్ జోడీగా కియారా మ‌రోసారి ఈ సినిమాలో కనిపించ‌డం ఖాయ‌మ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆ జోడీని మ‌రోసారి చూడాల‌ని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. మ‌హేశ్ అందానికి కియారా అందం స‌రిగ్గా మ్యాచ్ అయ్యింద‌నేది వాళ్ల అభిప్రాయం. ఇక మ‌హేశ్ ఆశిస్తున్న‌ట్లు 'స‌ర్కారు వారి పాట' ఆయ‌న‌కు రెండో హ్యాట్రిక్‌ను స్టార్ట్ చేస్తుందా? మాస్ లుక్‌లో క‌నిపిస్తూ, ఎంట‌ర్‌టైన్ చేసే క్యారెక్ట‌రైజేష‌న్‌తో మ‌హేశ్ అల‌రించ‌డం ఖాయ‌మ‌నేది రైటింగ్ డిపార్ట్‌మెంట్ చెబుతోన్న మాట‌. అదెంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో.. లెట‌స్ వెయిట్ అండ్ సీ...  
  ‘అందాల రాక్షసి’ తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా నటించిన సినిమాల్లో చెప్పుకోతగ్గ చిత్రం ‘అలా ఎలా?’. వినోదం పండించే భారాన్ని ‘వెన్నెల’ కిశోర్‌ భుజాన వేసుకోవడంతో సినిమా నవ్వులు పండించింది. కథ కూడా బావుండడంతో మోస్తరు విజయం సాధించింది. ఆ చిత్రానికి అనీష్‌కృష్ణ దర్శకుడు. తర్వాత రాజ్‌తరుణ్‌ హీరోగా దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌లో ‘లవర్‌’ తీశాడు. అది ఫ్లాప్‌! అయితే, అనీష్‌కృష్ణలో టాలెంట్‌ ఉంది. కామెడీ బాగా రాయగలడు. ఎమోషన్స్‌ తీయగలడు. అందుకని, అతడికి నాగశౌర్య ఛాన్స్‌ ఇస్తున్నాడని ఇండస్ట్రీ టాక్‌. ఇటీవల నాగశౌర్యను కలిసిన అనీష్‌కృష్ణ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ డ్రామా సబ్జక్ట్‌ ఒకటి చెప్పాడట. అందులో హీరో క్యారెక్టరైజేషన్‌, మరీ ముఖ్యంగా వినోదం నాగశౌర్యకు బాగా నచ్చాయట. దాంతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. మూడు నాలుగు నెలలో సినిమా స్టార్ట్‌ చేద్దామని దర్శకుడితో చెప్పాడని సమాచారం. ఆల్రెడీ అనీష్‌కృష్ణ స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశాడట. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ప్రస్తుతం నాగశౌర్య చేస్తున్న సినిమాలు చకాచకా పూర్తి చేస్తే... ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడని తెలిసింది.
  ఒక‌ప్ప‌టి ప్ర‌ఖ్యాత టాలీవుడ్ విల‌న్ రావు గోపాల‌రావు త‌న‌యుడు, నేటి పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రావు ర‌మేశ్ త‌న‌కు సోష‌ల్ మీడియాలో అకౌంట్ లేద‌ని తేల్చారు. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్‌లో ఆయ‌న పేరిట వ‌చ్చిన ట్వీట్స్ సంచ‌ల‌నం క‌లిగించాయి. అది ఆయ‌న అకౌంటేన‌నీ, అవి ఆయ‌న చేసిన ట్వీట్సేన‌ని భావించి, అనేక‌మంది వాటిని లైక్ చేస్తూ, రిట్వీట్ చేస్తూ వ‌చ్చారు. ఫ‌ర్ ఎగ్జాంపుల్‌.. ప్ర‌జావేదిక కూల్చివేత‌పై స్పందించిన‌ట్లుగా, "మొద‌టి విధ్వంసం! చాలా బాధ‌ప‌డ్డా.. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎటు వెళ్తుందోన‌ని. ఇప్ప‌టికైనా మార‌తార‌ని ఆశిస్తూ.. మీ రావు ర‌మేశ్" అంటూ ఆయ‌న పేరుతో వ‌చ్చిన ట్వీట్ అయితే వైర‌ల్‌గా మారింది.   అలాగే ‘‘పోలవరం ప్రాజెక్ట్ వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఎంత పని చేశారో చెప్పండి?’’ అంటూ చేసిన ట్వీట్ సైతం కాక పుట్టించింది. అంతేకాదు, నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మించ‌డానికి వీలుగా హైకోర్టు వెలువ‌రించిన తీర్పుపై "Justice served on the right day" అనే మ‌రో ట్వీట్ వ‌చ్చింది. ఈ ట్వీట్ల‌కు #1YearOfMassDestruction అనే హ్య‌ష్‌టాగ్‌ను జోడించారు. ఇది వెరిఫైడ్ అకౌంట్ కాదు. ప‌ది రోజుల క్రిత‌మే Actor Rao Ramesh పేరుతో ఈ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. త‌న పేరిట జ‌రుగుతున్న ఈ ప్ర‌చారం రావు ర‌మేశ్ దృష్టికి వెళ్లింది. ఆయ‌న స‌న్నిహితులు, స్నేహితులు ఈ ట్వీట్ల గురించి అడ‌గ‌డంతో ఆయ‌న ఖంగుతిన్నారు. మొద‌ట్నుంచీ సోష‌ల్ మీడియాకు తాను దూరంగా ఉంటూ వ‌స్తున్నాన‌నీ, త‌న పేరిట వ‌స్తున్న ట్వీట్స్ కానీ, ఇత‌ర మెసేజ్‌లు కానీ ఫేక్‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బ‌హుశా ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్‌ను కించ‌ప‌రుస్తూ వ‌చ్చిన ట్వీట్ల‌ వ‌ల్ల సీరియ‌స్ ట్ర‌బుల్‌లో ప‌డ‌తాన‌ని ఆయ‌న భావించి ఉండాలి. ప‌రిస్థితులు త‌న చేజారిపోక‌ముందే జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిద‌ని భావించిన ఆయ‌న‌, శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. త‌న పేరిట సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌కూ, త‌న‌కూ సంబంధం లేద‌నీ, అవి ఫేక్ అకౌంట్స్ అనీ స్ప‌ష్టం చేశారు. "మీడియా మిత్రులకు, నన్ను , నా నటనను అభిమానించే ప్రతి ఒక్కరికీ...నాకు ఏ సోషల్ మీడియా లో ఏటువంటి అకౌంట్స్ లేవు, ఫేస్ బుక్ గానీ,  ట్విట్టర్ గానీ , ఇన్ స్ట్రా గ్రామ్ ఇలా ఏమి లేవు..ఈ రోజు నా పేరు మీద ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు...ఆ పోస్టులు కు గానీ , ఆ అకౌంట్ కు గానీ నాకు ఏటువంటి సంబంధం లేదు.. దయచేసి వాటిని నమ్మకండి... ఏమైనా ఉంటే పత్రికా ముఖం గా నేనే తెలియజేస్తాను... త్వరలోనే నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతు న్నాను. - మీ రావు రమేష్" అంటూ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. న‌ట‌న‌లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావు ర‌మేశ్, 'మ‌గ‌ధీర' మూవీలో చేసిన పాత్ర‌తో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చారు. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' సినిమాలో చేసిన పాత్ర‌ ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తీసుకురావ‌డ‌మే కాకుండా డైరెక్ట‌ర్ల ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అయ్యేందుకు దోహ‌దం చేసింది. అప్ప‌ట్నుంచి ఏడాదికి ప‌దిహేను నుంచి ఇర‌వై సినిమాల వ‌ర‌కు ఆయ‌న చేస్తూ వ‌స్తున్నారంటే ఆయ‌న డిమాండ్ ఏ రీతిలో ఉందో ఊహించుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ కాంట్ర‌వ‌ర్సిటీల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చిన ఆయ‌న ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకోవ‌డం గ‌మ‌నార్హం. ప‌ది రోజుల క్రిత‌మే త‌న పేరిట ట్విట్ట‌ర్‌లో అకౌంట్ క్రియేట్ అయినా, ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన ట్వీట్లు వివాదాస్ప‌ద‌మైన‌వి కాక‌పోవ‌డంతో ఆయ‌న ప‌ట్టించుకోలేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, త‌ర్వాత నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఈ అకౌంట్ నుంచి ట్వీట్లు వ‌చ్చాయి. వాటికి వేల‌ల్లోనే లైక్స్‌, రిట్వీట్‌లు వ‌చ్చాయి. అప్పుడు ఆ అకౌంట్ త‌న‌ది కాద‌ని ఆయ‌న స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీ ట్వీట్లు రావ‌డంతో మేలుకొన్న ఆయ‌న వాటిని ఖండించారు. అది త‌న అకౌంట్ కాద‌నీ, త‌న పేరిట దుష్ప్ర‌చారం చేస్తున్న వారిపై కేసు పెడ‌తాన‌నీ అంటున్నారు. ఆ అకౌంట్ ఎవ‌రు క్రియేట్ చేశారో త్వ‌ర‌లో తేల‌నున్న‌ది.   రావు ర‌మేశ్ పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ అకౌంట్ అండ్ ట్వీట్స్‌  
మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వం వహించనున్న సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మించనున్నాయి. గత కొన్ని సినిమాల నుండి మహేష్‌ పారితోషికం తీసుకోకుండా.... శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు తీసుకుంటున్నారు. అందుకని, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పేరు కూడా పోస్టర్ల మీద ఉంటోంది. మహేష్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (మే 31) ఉదయం 9.09 గంటలకు అధికారికంగా సినిమాను ప్రకటించనున్నారు. ఆల్రెడీ సినిమాకి ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ ఖారారు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే... ఈ సినిమాకి రెండు ప్రొడక్షన్‌ హౌస్‌లు కలవడం వెనుక ఆసక్తికరమైన కథ ఫిలింనగర్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్‌తో సినిమా అవకాశం రాకముందు అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో దర్శకుడు పరశురామ్‌ ఒక సినిమా ప్రకటించారు. ఈలోపు మహేష్‌–వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్‌ కావడం, హీరో నుండి పిలుపు రావడంతో ఆ సినిమాను పరశురామ్‌ పక్కన పెట్టారు. తమకు చేయాల్సిన సినిమాను పక్కనపెట్టిన కారణంగా ఈ సినిమాలో 14 రీల్స్‌ ప్లస్‌కి ప్రొడక్షన్‌లో షేర్‌ చేసుకొనే అవకాశం వచ్చింది. ఇక, మహేష్‌తో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్‌ అడ్వాన్సు ఇచ్చింది. ఇటు దర్శకుడి దగ్గర కూడా వాళ్ల అడ్వాన్సు ఉంది. అందుకని, 14 రీల్స్‌ ప్లస్‌ను, మైత్రీని మహేష్‌ కలిపారట. అదీ సంగతి!
నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుకు పట్టుమని రెండు వారాలు కూడా లేదు. జూన్‌ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు. ఆ రోజు అభిమానులకు కానుక ఇవ్వాలని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నట్టు సమాచారం. ‘సింహా’, ‘లెజెండ్‌’ భారీ విజయాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందులో బాలకృష్ణ రెండు గెటప్పులో కనిపించనున్నారు. రెండిటిలో ఒకటి అఘోరా గెటప్‌. దానికోసం కూడా రెండుమూడు లుక్కులు అనుకుంటున్నారట. లెటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే... బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తాజా చిత్రానికి ‘మోనార్క్‌’ టైటిల్‌ ఖరారు చేశారట. జూన్‌ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ ఏడాది బర్త్‌డే బాలయ్యతో పాటు అభిమానులకు చాలా స్పెషల్‌. ఇప్పుడు నటసింహానికి 59 సంవత్సరాలు. జూన్‌ 10న ఆయన 60వ పడిలో అడుగుపెడతారు. అందుకని, గ్రాండ్‌గా అభిమానులు పండగ చేసుకొనేలా లుక్‌ రిలీజ్‌ చేయాలని బోయపాటి ప్లాన్‌ చేస్తున్నారట.
‘‘నన్ను, నా నటనను అభిమానించే ప్రతిఒక్కరికీ చెప్పేది ఏంటంటే... నాకు సోషల్‌ మీడియాలో ఎటువంటి అకౌంట్స్‌ లేవు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌... వేటిలోనూ నేను లేను’’ అని నటుడు రావు రమేష్‌ తెలిపారు. ఆయన నుండి ఈ ప్రకటన రావడానికి కారణం... ట్విట్టర్‌లో ఫేక్‌ అకౌంట్‌. ఎవరో రావు రమేష్‌ పేరు మీద ట్విట్టర్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. రెండు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అందువల్ల, రావు రమేష్‌ వివరణ ఇచ్చారు. ‘‘నా పేరు మీద ఎవరో ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. వాటికి, నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఆ పోస్టులకు, ఆ ట్విట్టర్‌ అకౌంట్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి వాటిని నమ్మకండి. నా అభిప్రాయాలను నేనే పత్రికా ముఖంగా తెలియజేస్తా. నా పేరు మీద ఇటువంటివి చేస్తున్న వారిపై త్వరలో కంప్లయింట్‌ ఇవ్వబోతున్నా’’ అని రావు రమేష్‌ తెలిపారు. ఇప్పుడు ప్రజలందరూ సోషల్‌ మీడియా జమనాలో ఉన్నారు. ప్రముఖులు సైతం! గతంలో ప్రముఖులు ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రజలకు చేరువ కావాలంటే విలేకరుల సమావేశం నిర్వహించేవారు. ఇప్పుడు ట్విట్టర్‌లో ట్వీట్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెడితే చాలు. అవి చూడనివాళ్లకు సైతం చేరవేసే బాధ్యతను పత్రికలు, వెబ్‌సైట్లు, టీవీ ఛానల్స్‌ తీసుకున్నాయి. అందుకని, మెగాస్టార్‌ చిరంజీవి సైతం సోషల్‌ మీడియాలో అడుగుపెట్టారు. సోషల్‌ మీడియాతో అప్పుడప్పుడూ స్టార్స్‌కి ఇటువంటి లేనిపోని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.
  * మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్ * 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి * రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది * వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.     కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:   సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.     కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది.  ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.
  బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.
ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా అతని అభిమానుల్నీ తీవ్రంగా నిరాశపరచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా మూడు ఫార్మట్లలోనూ బ్యాట్స్‌మన్‌గా అతను విఫలమవడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరచింది. మూడు ఫార్మట్లలో కలిపి 11 ఇనింగ్స్ ఆడిన విరాట్ చేసిన మొత్తం పరుగులు కేవలం 218.  న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ప్లేయర్‌గా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విరాట్, సిరీస్ ముగిసే సరికి రెండో ర్యాంకుకు దిగజారాడు. విరాట్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 53.62 యావరేజ్ కలిగిన విరాట్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి సాధించిన యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 9.5.  ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం మాట అటుంచి ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యని హయ్యెస్ట్ స్కోర్ 19 రన్స్. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ స్కోర్ చేశాడు. అతను ఈ టెస్ట్ సిరీస్‌లో చేసిన పరుగులు వరుసగా.. 2, 19, 3, 14. మొత్తం రన్స్ 38. అతనికంటే ఎక్కువగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి 44 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన విరాట్ ఇంత ఘోరంగా ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు 2016-17లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 9.2 యావరేజ్‌తో 46 పరుగులు చేశాడు. అతని కెరీర్ మొత్తమ్మీద అదే అతని పూరెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో దాని దగ్గరకు వచ్చాడు. ఇక రెండో టెస్ట్ సందర్భంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తన అతనికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కెప్టెన్‌గానూ అతను టెస్ట్, వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదట వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన అతడు ఇప్పుడు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించుకున్నాడు. గుడ్డిలో మెల్లగా మొదటగా జరిగిన టీ20 సిరీస్‌ను మాత్రం 5-0తో వైట్ వాష్ చేయగలిగాడు. అయితే అందులోనూ బ్యాట్స్‌మన్‌గా అతను వైఫల్యం చెందాడు. అంతర్జాతీయంగా 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ యావరేజ్ 50.80. కానీ ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతని సగటు 26.25 మాత్రమే. అతడి హయ్యెస్ట్ స్కోర్ 45. మిగతా మూడు మ్యాచ్‌లలో వరుసగా 11, 38, 11 స్కోర్లు చేశాడు. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ పరుగుల వర్షం కురిపించడం వల్లే టీ20ల్లో భారత జట్టు విజేతగా నిలవగలిగింది. గాయం కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లలో రోహిత్ లేని లోటు సుస్పష్టంగా కనిపించింది. ఫాంలో ఉన్న కె.ఎల్. రాహుల్‌ను టెస్టుల్లోకి తీసుకోకుండా విరాట్ తీవ్ర తప్పిదం చేశాడని విశ్లేషకులంతా ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ యావరేజ్ 25 మాత్రమే. టూర్ మొత్తం మీద అతడు హాఫ్ సెంచరీ చేసింది ఈ వన్డే సిరీస్‌లోనే. అది మొదటి వన్డేలో 51 పరుగులు చేశాడు. మూడు రకాల ఫార్మట్లలో ఒక ఇన్నింగ్స్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడు చేసిన రన్స్ వరుసగా 15, 9. ఇప్పటివరకూ 248 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ టోటల్ యావరేజ్ 59.33 కావడం గమనార్హం. ఈ గణాంకాలే న్యూజిలాండ్ టూర్‌లో అతడు ఏ స్థాయిలో వైఫల్యం చెందాడో తెలియజేస్తున్నాయి. బౌలర్ నుంచి వచ్చే బంతిని అతని కన్ను నిశితంగా గమనిస్తుందనీ, దాని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి, చాలా వేగంగా స్పందించి షాట్ కొడతాడనీ కోహ్లీని విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అలవోకగా ఫోర్లు కొడతాడని అంటుంటారు. ఫ్రంట్ ఫుట్ ఆడటంలో విరాట్‌ని మించిన వాడు లేడని కూడా వాళ్లు కితాబునిస్తుంటారు. అంటే అనేకమంది ఇతర బ్యాట్స్‌మెన్ కంటే అతడు ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడతాడు. చాలామంది స్క్వేర్ కట్ కొట్టే బంతుల్ని అతడు కవర్ డ్రైవ్ కొడతాడు. అంతేకాదు, చాలామంది దూరంగా పోతుందని వదిలేసే బంతుల్ని కూడా విరాట్ కవర్ డ్రైవ్స్ ఆడతాడు. అంత లాఘవంగా ఆ షాట్లను ఆడతాడని అతను పేరుపొందాడు. అలాంటివాడు రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎల్బీడబ్ల్యూ అయిన తీరు నిర్ఘాంతపరచింది. అయితే తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపమూ లేదని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ క్యాచ్ అవుట్ అయ్యాక, న్యూజిలాండ్ టూర్‌లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు "నా బ్యాటింగ్ బాగానే ఉంది" అని జవాబిచ్చాడు విరాట్. కొన్నేసి సార్లు స్కోర్లు బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించవనీ, బంతిని సరిగా ఎగ్జిక్యూట్ చెయ్యకపోవడం వల్ల అవుటవ్వాల్సి వస్తుందనీ అతను చెప్పాడు. జట్టు గెలిస్తే.. 40 పరుగులు చేసినా గొప్పగానే ఉంటుందనీ, జట్టు ఓడితే.. సెంచరీ చేసినా వేస్టయిపోతుందనీ అతను వాదించాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ బాడీ లాంగ్వేజ్‌లోనే తేడా కనిపించిందనీ, బ్యాటింగ్ చేసేటప్పుడు మునుపటి ఈజ్ అతనిలో లోపించిందనీ క్రికెట్ అనలిస్టులు చెప్తున్న మాట. తదుపరి సిరీస్‌కైనా మనం మునుపటి గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మర్‌ను విరాట్‌లో చూడగలమా? వెయిట్ చేద్దాం.
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ...     మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి. రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు!     - నిర్జర.
  Do you think you are Loyal towards the Mother Earth after taking everything that is essential? After seeing so much of deforestation we feel the answer is absolutely no. How loyal should you be towards the planet - watch this video to know more.......   https://www.youtube.com/watch?v=dSohFWv4tgs  
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. మొన్నామధ్య ఏపీలో, ఇప్పుడేమో తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల గురించే చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలిసిన వాళ్ల ఇళ్లలో ఇంటర్ చదివే పిల్లలు ఎవరున్నారా అంటూ ఆసక్తిగా అందరూ ఫోన్లు చేస్తున్నారు. మార్కులు బాగా వస్తే అందరికీ సంతోషమే! కానీ తక్కువ వస్తేనో, లేక తప్పిపోతేనో అసలు సమస్య మొదలవుతుంది. పిల్లలు దిగాలు పడిపోవడం, డిప్రెషన్లోకి కూరుకుపోవడం, ఒకోసారి ఆత్మహత్యకి సైతం పాల్పడం జరుగుతూ ఉంటుంది. పరీక్షల్లో తప్పారన్న కారణంతో పిల్లలు తమ ఉసురుని తీసుకునే వార్తలు ఉసూరుమనిపిస్తాయి. పిల్లలు ఇలాంటి విపరీత మనస్తత్వంలోకి కూరుకుపోయినప్పుడు వారిని తిరిగి మామూలు మనుషులను చేసే సత్తా, బాధ్యతా తల్లిదండ్రుల మీద తప్పకుండా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే...     - పరీక్షా ఫలితాల తరువాత పిల్లవాడు డీలాగా కనిపిస్తుంటే అతనితో కాసేపు సమయాన్ని గడపండి. ఒకవేళ అతని దిగాలుకి ఫలితాలే కారణమైతే, అతనిలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించండి. పిల్లవాడు క్రుంగుబాటుకి లోనైన ఈ కొద్ది రోజులలో అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ కాలాన్ని కనుక వాళ్లు దాటేయగలిగితే, ఆత్మహత్య వంటి ఆలోచనలు కూడా దాటిపోతాయి. అందుకని పిల్లవాడు తిరిగి మామూలు స్థితికి వచ్చేదాకా అతన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోసేలా మీరు అతని ఫలితాల పట్ల నిరాశ చెందిన విషయాన్ని ప్రస్తావించవద్దు.     - ఇంటికి వచ్చినవారంతా పిల్లవాడి ఫలితాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి ప్రస్తావనని వీలైనంత త్వరగా ముగించేయండి. ‘కష్టపడ్డాడు కానీ...’, ‘మళ్లీ అందుకుంటాడు...’ లాంటి సానుకూలమైన వాక్యాలతోనే అతని ఫలితాల గురించి తెలియచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కళ్ల ముందే వేరొకరు, మీ పిల్లవాడిని మందలించే అవకాశం ఇవ్వవద్దు. అతిథులతో ఫలితాలకు సంబంధించిన చర్చలను కూడా వీలైనంత క్లుప్తంగా ముగించేయండి.   -  తమ పిల్లవాడి తప్పాడన్న విషయం కంటే ఇతరుల పిల్లలు పాస్‌ అయ్యారన్న బాధే చాలామందికి ఉంటుంది. ఇది మానవసహజమే! కానీ ఇలాంటి సమయాలలో పోలికలు కొంప ముంచుతాయని గుర్తుంచుకోండి. ఫలానా సుబ్బారావుగారి పిల్లవాడి సంగతి మనకి అనవసరం. అలాగే మన పిల్లవాడి స్నేహితుల ఫలితాలూ ప్రస్తుతానికి అసందర్భం. పోలికలంటూ తెస్తే పరాజయాలనూ తీసుకురండి. ఫలానా ఎడిసన్ కూడా చిన్నప్పుడు ఫెయిల్‌ అయ్యాడనో, మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి పరాజయాలను ఎదుర్కొన్నారనో చెప్పి పిల్లలను ఊరడించండి.   - పరీక్ష ఫలితాన్ని ఎలాగూ మార్చలేము. కాబట్టి అసలు ఇలాంటి ఫలితం రావడానికి కారణం ఏంటో కనుక్కొనేందుకు ప్రయత్నించండి. ఇల్లు, కళాశాల, స్నేహాలు, ఏకాగ్రత, అనారోగ్యం... ఇలా ఏ సమస్య పిల్లవాడి చదువుకి అడ్డం పడుతోందో విశ్లేషించండి. పిల్లవాడు భవిష్యత్తులో తిరిగి ఓడిపోకుండా ఆ కారణానికి తగిన పరిష్కారాన్ని కూడా సాధించండి. ఆ పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికను ఏర్పరిచేందుకు ప్రయత్నించండి. ఈ విశ్లేషణలో మీ పిల్లవాడిని కూడా భాగస్వామిగా చేసుకోవడం మర్చిపోవద్దు.   - పిల్లవాడని మరీ సుకుమారంగా పెంచడంతో ఒకోసారి వారు పరాజయాలను తట్టుకునే స్థితిలో ఉండరు. కాబట్టి ముందుగా మీ దృక్పథాలను కూడా ఓసారి సరిచూసుకోండి. పిల్లవాడికి నిరంతరం చదువే లోకంగా మారిపోతోందా? అతనిలో శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత లోపిస్తున్నాయా? అన్నది ఒక్కసారి గమనించుకోండి. ఈ విషయంలో అవసరమైతే సైకాలజిస్టుల వంటి నిపుణుల సలహాలను తీసుకోవడంలో తప్పేమీ లేదు.   ఒకరకంగా చెప్పాలంటే పరీక్షలలో బాగా తక్కువ ఫలితాలు రావడం అన్నది ఓ హెచ్చరికలాంటిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్న సూచన మాత్రమే! ఆ హెచ్చరికను గ్రహిస్తే పిల్లవాడు భవిష్యత్తులో మరిన్ని పరాజయాలు ఎదుర్కోకుండా రక్షించనవారమవుతాం. లేకపోతే వాడి జీవితాన్ని మన ఆశలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నించి భంగపడతాం!   - నిర్జర.
  ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మేఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్‌ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం ఉంది. అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతోపాటుగా ఆక్జలేటులు ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ. పాలకూర టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటున్నాం. ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదును మించితేనే ప్రమాదం. పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు.