ఓ సినిమాలోని ‘ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు’ అంటూ సాగిన పాట వింటుంటే ఒక్క అడుగుకి అంత శక్తి వుంటుందా? ఒక్కరివల్ల మార్పు సాధ్యమా? అనిపించేది. సందేహంగా వుండేది. అయితే ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ గురించి విన్నాక నాకు ఈ పాటే గుర్తుకొచ్చింది. నిజమే... ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ అడుగుని మరో అడుగు అనుసరిస్తుంది. కొన్నాళ్ళకి అవి పదులై, వందలై, వేలల్లోకి మారతాయి. ఆ వేల అడుగులు ఎన్నో లక్షల పాదాలకి దారి చూపిస్తాయి. రహదారిని నిర్మిస్తాయి. జీవితంలో అత్యంత విషాదాన్ని చవిచూసిన మహిళలలో జీవితం పట్ల ఆశ కలిగించడం అంటే మాటలా చెప్పండి! జీవితంపై ఆశనే కాదు.. ఆ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా మలచుకునే ఆత్మస్థైర్యాన్ని
అడుగడుగునా అవరోధాలు, ఏం చేయాలో పాలుపోదు. అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒడిదుడుకుల దారి పడుతుంది. అలాంటి సమయంలో భవిష్యత్తుపై ఆశ ఏ మాత్రం మిగలదు. గుండెల్లో ధైర్యం మొత్తం సన్నగిల్లిపోతుంది. ఇప్పటి వరకు నడచిన ఈ దారి ముసుకుపోతు౦టే ఎలా ఏం చెయ్యాలని మథనపడతాం
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన దాసరి శివ శ్రమజీవి. కొద్ది రోజుల క్రితం ఆయన కరెంట్ పోల్ ఎక్కి టీవీ కేబుల్ లాగుతూ వుండగా హెటెన్షన్ వైర్లు తగిలి ఆయన తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచెయ్యి మొత్తం కాలిపోయింది.