మీ మొహాలు మండ.. గవర్నర్ ఫోనూ ట్యాప్ చేశారా?

ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు. ఈ వేస్టుగాళ్ళు చేసిందే నీచ నికృష్టమైన పని. దాంట్లో కూడా పరిధులు దాటిపోయి ఎంత దారుణానికి దిగారనేది తెలుస్తుంటే రక్తం మరిగిపోతోంది. రాజకీయ కారణాలతో ప్రతిపక్షాల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారయ్యా అంటే, సర్లే, ఇది కూడా రాజకీయంలో ఒక భాగం అని సరిపెట్టుకోవచ్చు. అలాగని ఇది నేరం కాకుండా పోదనుకోండి. అలా కాకుండా ఈ త్రాష్టులు ప్రతిపక్ష రాజకీయ నాయకులతో ఆగకుండా సొంత పార్టీ వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగారా... ఆగితే వీళ్ళు మనుషులెలా అవుతారు? సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు.. ముఖ్యంగా ఇంటి ఇల్లాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగినా వీళ్ళను మనుషుల్లో వున్న పిశాచాలుగా భావించి క్షమించే అవకాశం వుండేది. ఈ నికృష్టులు మరింత అడ్వాన్స్ అయిపోయి సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి కాపురాల్లో నిప్పులు పోశారు. సమాజంలో ఉన్నత వర్గాల వారి ఫోన్లను ట్యాప్ చేసి, వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకుని, బ్లాక్ మెయిల్‌కి పాల్పడ్డారు.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లేటెస్ట్.గా బయటపడ్డ మరో ఘోరం ఇంకో ఎత్తు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌ని కూడా ఈ బేవర్సోళ్ళు ట్యాప్ చేశారట. ఆ విషయాన్ని ఆమె తాజాగా బయటపెట్టారు. ఆమె గవర్నర్‌గా వున్న సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రొటోకాల్‌ని పాటించకుండా ఆమెను అనేక అవమానాలకు గురిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర ముఖ్య నాయకులు తమిళిసైని ఎంతమాత్రం లెక్కచేయకుండా మాట్లాడేవాళ్ళు. తాచుపాము బుస కొట్టడం చూసి, వానపాము కూడా బుసకొట్టిందట. ఇదే తరహాలో బీఆర్ఎస్‌లోని గల్లీ లీడర్ల లాంటివాళ్ళు కూడా గవర్నర్‌కి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ మహాతల్లికి ఓర్పు ఎక్కువ కాబట్టి వీళ్ళ తీరుమీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేయకుండా నెట్టుకొచ్చింది. అయితే 2022లోనే ఆమె తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఆ ఆరోపణలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఆ ఆరోపణలను విన్నవారు ఆమె రాజకీయ కోణాలతో ఇలాంటి ఆరోపణ చేసి వుండవచ్చని భావించారు. అయితే ఇటీవలి కాలంలో బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గమనించిన తమిళిసై మరోసారి తన ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు జరుగుతోంది కాబట్టి, తాను గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూరిందని ఆమె అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, సాక్షాత్తూ రాష్ట్రపతికి, రాజ్యాంగానికి ప్రతినిధి అయిన గవర్నర్ ఫోన్‌ని ట్యాప్ చేశారంటే, అలా చేసిన వాళ్ళని, అలా చేయడానికి ఆదేశాలు జారీ చేసిన వాళ్ళని పాత చెప్పుని పేడలో ముంచి కొట్టాలి. 

విజయోత్సవాన్ని తలపించిన లోకేష్ నామినేషన్ ర్యాలీ

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. లోకేష్ నామినేషన్ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా సాగిన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని మంగళగిరి వాసులు చెబుతున్నారు.  ర్యాలీ సందర్భంగా  డిజె సౌండ్లు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో మంగళగిరి పట్టణం మోతెక్కిపోయింది. కాగా తండ్రి   మంగళగిరి తెలుగుదేశం సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకేష్ తరఫున  2సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ముందు మంగళగిరి శ్రీ సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలతో కూటమి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీగా    మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కూటమికి చెందిన ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ నేతలు లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.  

తెలుగుదేశం కూటమి జోరు.. వైసీపీ బేజారు!

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది.   ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.  ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే  నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.  సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏపీలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది.  గురువారం దశమి కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలను ఏప్ిల్ 26,  ఉపసంహరణకు తుదిగడువు ఏప్రిల్ 29.  మే 13న పోలింగ్ ,  జూన్‌ 4వ తేదీన ఫలితాలు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో నేటి నుంచి అన్ని రకాల ప్రీపోల్, పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్, ఒపినియన్ పోల్ లకు, సర్వేలకు ఈ రోజుతో చుక్క పడింది. అంటే ఫుల్ స్టాప్ పడింది. నే అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు.  ప్రీ-పోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. అంటే ఇప్పటి వరకూ వెలువడిన పది పదకొండు సర్వేలు మినహాయిస్తే ఇక నుంచి మళ్లీ జూన్ 1వ తేదీ అంటే సార్వత్రిక ఎన్నికల తుది దశ ముగిసే వరకూ ఎటువంటి సర్వేలూ వెలువడే అవకాశం లేదు.  ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఏపీలో ఎలక్షన్ వార్ వన్ సైడేనని తేల్చేయడం, తెలుగుదేశం కూటమి ఘన విజయం తథ్యమని పేర్కొన్న నేపథ్యంలో కూటమి ప్రచారంలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరో వైపు వైసీపీ కూటమిలో గుబులు కనిపిస్తున్నది. జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి బస్సు యాత్రకు జన స్పందన కరువు అవ్వడం, జగన్ వినా ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయగలిగే ప్రభావమంతమైన క్యాంపెయినర్లు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. బొత్స, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు సైతం తమ నియోజకవర్గంలో విజయం కోసమే చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉండటంతో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా శిరోముండనం కేసులో ఆ పార్టీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.  అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై తీర్పు ఈ నెల 23న వెలువడ నుంది. ఒక వేళ అవినాష్ బెయిలు రద్దైతే వైసీపీకి కడపలో కూడా ఇబ్బందులు తప్పవు. అదే విధంగా జగన్ పై గులకరాయి దాడి సెంటిమెంట్ ను రగల్చడం సంగతి అటుంచి మొత్తంగా పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా నవ్వుల పాలు చేసింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమికి దీటుగా వైసీపీ ప్రచారం జోరు పెంచే అవకాశాలు కనిపనించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మోడీ ఫస్ట్.. బీజేపీ నెక్ట్స్!

కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ... బీజేపీని మించి ఎదిగిపోయారా? పార్టీ కంటే ఆయనే ప్రధానం అనే స్థాయికి కమలం క్యాడర్ వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే విశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన  మేనిఫెస్టోను చూసిన ఎవరైనా మోడీ ఫస్ట్, బీజేపీ నెక్ట్స్ అన్నట్లుగానే కమలం పార్టీ పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయానికే వస్తారని అంటున్నారు.  మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలకే పెద్ద పీట వేశారు.   పదేళ్ల కాలంలో మోడీ సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను  కొనసాగిస్తామనీ,  జి.ఎస్‌.టి వంటి సంస్కరణలు, ఆర్టికల్‌ 370ని రద్దు  వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు మోడీ ఇచ్చిన ఇచ్చిన ప్రాధాన్యత,   సమాజంలోని ప్రతి వర్గానికి తాము అందజేసిన లబ్ధి వంటి వాటిని మోడీ ఘనతలుగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.  మూడవసారి కూడా  మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అ ధికారంలోకి రావ డం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మరో అయిదేళ్ల పాటుబియ్యం ఉచితంగా సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్నారు.   ఉమ్మడి పౌర స్మృతిని, ఒకే దేశం-ఒకే ఎన్నికలు తదితర అంశాలను అమలు చేస్తామనడమే కాకుండా, బులెట్‌ రైళ్లు,  వందే భారత్‌ రైళ్ల సంఖ్యను పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పేదలకు మూడు కోట్ల గృహాల నిర్మాణం, పైపుతో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నట్టు   ప్రకటించారు. ప్రధానంగా హిందుత్వ అజెండానే పొందుపరిచారు. దాదాపుగా బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గత పదేళ్లుగా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు చేసిన ప్రకటనలు వాగ్దానాలే అనడంలో సందేహం లేదు. అయితే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంపన్న, పేదల మధ్య పెరిగిన అంతరం, రైతుల ఆదాయం రెట్టింపు కావడం అటుంచి, వారి కష్టాలు మరింత పెరగడం వంటి అంశాల జోలికి బీజేపీ మేనిఫెస్టో పోలేదు. ఈ మేనిఫెస్టోలో ఆ దిశగా ఎటువంటి వాగ్దానాలూ లేవనే చెప్పాలి.  ఉద్యోగాలను సృష్టిం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి గత వాగ్దానాల గురించిన ప్రస్తావనే లేదు.  దీంతో బీజేపీ పార్టీగా కంటే మోడీని మరింత ఫోకస్ లోకి తీసుకురావడం మీదనే ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనసేనకు జబర్దస్త్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు. జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ నిస్సందేహంగా ఎన్నో ఇబ్బందులకు గురైంది. సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ, సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతుల విషయంలో కానీ జగన్ సర్కార్ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేసింది. జగన్ కు మొదటి నుంచీ కూడా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న భావన ఉంది. తాను సీఎం అయిన సందర్భంలో సినీ పరిశ్రమ పెద్దలు ఎవరూ తనను అభినందించలేదన్న కోపం కూడా మనసులో పెట్టుకున్నారని సినీ వర్గాల సమాచారం. ఆ కారణంగానే పరిశ్రమ పెద్దలను తన గెప్పెట్లో ఉంచుకోవాన్న ఉద్దేశంతోనే సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలు  ఒకటి రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానానికి ఆయన కళ్లెం వేసినట్లు కనిపిస్తున్నారు. అలాగే కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు కూడా కళ్లెం వేయడంతో పరిశ్రమ పెద్దలు ఆయన వద్దకు వెళ్లి మరీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నెయ్యం కోరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినా ఫలితం లేకపోయిన సంగతి తెలిసిందే.  అయితే జగన్ సర్కార్ విషయంలో సినీ పరిశ్రమలోని పెద్దలు ఆర్థిక నష్టాల భయంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల విషయంలో ఒకరిద్దరు వినా మొత్తం పరిశ్రమ సైలెంటైపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   ఈ నేపథ్యంలో జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు నటులు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.     జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనకాపల్లి రూరల్ మండలంలోని బీఆర్టీ కాలనీలో వీరు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.  

తొలి విడతలో.. బీజేపీ, కాంగ్రెస్ కూటములు నువ్వా నేనా!

దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు లోని మొత్తం 39 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.   అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ లో ఆరు, మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటితోపాటు బీహార్‌లో నాలుగు నియోజకవర్గాలకు మణిపూర్, మేఘాలయలో రెండు  , మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతే కాదు రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది, ఉత్తరాఖండ్ లో ఐదు , పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజ కవర్గాలు పోలింగ్ జరుగుతుంది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో  మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే, కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని   కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నాడీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం పది చోట్ల పోటీ చేస్తోంది. అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు కూడా ఒకటి రెండు చోప్పున బీజేపీ  సీట్లు  కేటాయించింది. తమిళనాడులో నిన్నమొన్నటివరకు బీజేపీకి పెద్దగా బలం కానీ, గుర్తింపు కానీ లేదు.  ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ ఏదో ఉనికి మాత్రంగా రాష్ట్రంలో ఆ పార్టీ ఉండేది.  అయితే  తమిళనాడు బీజేపీ పగ్గాలు అన్నామలై చేపట్టిన తరువాత ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై బరిలో నిలిచారు.తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు.  ఇక యూపీ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నూర్‌, నగీనా, రాంపూర్‌, పిల్‌భిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎనిమిదిలో ముజఫర్‌నగర్, కైరానా, పిల్‌భిత్..బీజేపీ సిట్టింగ్ సీట్లు.  ల్‌భిత్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్‌కు పిల్‌భిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సత్తా చూపగల ఉప ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జయంత్ చౌధురి నాయకత్వంలోని  రాష్ట్రీయ లోక్‌దళ్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్‌డీ మద్దతుతో జాట్ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్‌ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్‌దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ …పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80స్థానాలనూ గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాల రాముడి ప్రతిష్టతో ప్రజల్లో పెరిగిన సెంటిమెంట్ ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో మందుకు సాగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలుస్తుందని భరోసాతో ఉన్నారు కమలనాథులు. కాగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 17 సీట్లు కేటాయించింది సమాజ్‌వాదీ పార్టీ. మిగతా 63 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్యపక్షాలు పోటీ చేస్తున్నాయి. ఇక బీహార్ విషయానికి వస్తే..  బీహార్లో మొత్తం 40 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. కాగా ఏప్రిల్ 19న ఈ రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలు ఔరంగాబాద్‌, నవాడా, గయ, జమూయ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి బీహార్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మారిన సమీకరణాల నేపథ్యంలో కొన్ని నెలలకిందటే  జేడీ యూ అధినేత నితీశ్‌ కుమార్ రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగారు. మళ్లీ ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ అండతో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో నితీశ్ కుమార్‌కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీశ్ కుమార్ పొలిటికల్‌గా యూ టర్న్ తీసుకున్న తీరు ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ బీహార్లో మెజారిటీ యాదవ సామాజికవర్గాన్ని రాష్ట్రీయ జనతాదళ్‌ వైపు మళ్లించడంలో తేజస్వి యాదవ్  సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. అలాగే ముస్లిం మైనారిటీలు కూడా మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా మారారని అంటున్నారు. బీజేపీ, నితీశ్‌ కుమార్ నాయకత్వంలోని జేడీ యూ ఒక కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా జనతాదళ్‌ యునైటెడ్ పార్టీ 16 సీట్లలో బరిలో దిగుతోంది. కాగా బీహార్‌లో కాంగ్రెస్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి.  ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే..ఈ రాష్ట్రంలో  48 లోక్ సభ స్థానాలున్నాయి.  ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆరు పార్టీలు ప్రస్తుతం రెండు కూటములుగా ఏర్పడ్డాయి.  ఒకవైపు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన , కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ , మరోవైపు భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను శివసేన చాలాకాలం పాటు శాసించింది. శివసేన హవా బలంగా వీచినంత కాలం మహారాష్ట్రలో బీజేపీ స్వంతంగా పాగా వేయలేకపోయింది. అయితే శివసేనలో చీలిక..  శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలికల  నేపథ్యంలో  రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించింది.  ఇక రాజస్థాన్ విషయానికి వస్తే..  రాజస్థాన్‌లో మొత్తం 25 నియోజకవర్గాలున్నాయి. తొలి దశలో అల్వార్, భరత్ పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్ అర్బన్‌, జైపూర్ రూరల్, ఝుంఝును, కరౌలి-ధోల్పూర్, నాగౌర్, సికార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. రాజుల కోటగా పేరున్న రాజస్థాన్‌ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉంది.  2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్ సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. సారి కూడా క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.  ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాజస్థాన్ లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ పరాజయం నుంచి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో   ఈ ఎన్నికల్లో ఎలాగైనా బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.  మొత్తం మీద రాజస్థాన్‌పై కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.

టి20 వరల్డ్ కప్ లోఓపెనర్ గా కింగ్ కోహ్లీ

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ లో స్ట్రైక్ రేట్ కారణంగానే బెంగళూరు ప్రదర్శన పేలవంగా ఉందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే కోహ్లీ వినా ఆ జట్టులో మిగిలిన బ్యాట్స్ మన్ ఎవరూ అంచనాల మేరకు రాణించకపోవడంతోనే కోహ్లీపై ఒత్తిడి పెరిగి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటోందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శన ఈ ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ లో అతడి స్థానంపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు కోహ్లీకి వరల్డ్ కప్ ఆడే చాన్స్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో జట్టు ఎంపికకు సమాయత్తమౌతున్న బీసీసీఐ, సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో కింగ్ కోహ్లీ ఓపెనర్ గా ఆడతాడని సంకేతాలు ఇచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.  ఐపీఎల్ లో బేంగళూరు జట్టుకు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ ఆ జట్టుకు శుభారంభాన్ని అందించడమే కాకుండా మంచి స్కోర్లు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో ఒక సెంచరీ సాధించి ఐపీల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీని స్కిప్పర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెన్ చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. అందుకు కోహ్లీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.  

మరో బీఆర్ఎస్ వికెట్ డౌన్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి రాజీనామా

బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది. తాజాగా ఆ పార్టీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు దిగిపోయారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీ టికెట్ విషయంలో అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను గెలిపించాలంటూ తాను ప్రజల ముందుకు వెళ్లి ప్రచారం చేయలేనని బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గురువారం (ఏప్రిల్ 18) ఓ లేఖ రాశారు. అవకాశ వాది అయిన లక్ష్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయలేనని పేర్కొన్న ఆయన తెలంగాణ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం తాను ప్రచారం చేయనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి వెల్లడించారు. తన రాజీనామాను, కేసీఆర్ కు రాసిన లేఖను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.  

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేష్ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో  ఆంధ్రప్రదేశ్,   ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ  స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడింది.   దీంతో ఆయా రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 25. కాగా 26న నామినేషన్ల పరిశీల ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 29.  మే 13న పోలింగ్. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటాయి.  ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఇక నోటిఫికేషన్ కూడా విడుదల కానుండటంతో ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి ప్రచారం హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా జోరుగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.  

రాయిదాడి జగన్నాటకమే.. బోండా ఉమాను ఇరికించేయత్నం?!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే జగన్ పై గులకరాయి దాడిని హత్యాయత్నంగా చిత్రీకరించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి.  చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోనే జ‌గ‌న్ పై రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింద‌ని, జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి తెలుగుదేశం ఓర్వ‌లేక పోతుంద‌ని వైసీపీ నేత‌లు విస్తృత ప్ర‌చారం చేశారు.  అంతేకాదు.. రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగిన క్ష‌ణాల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు,  తెలుగుదేశం నేత‌ల‌పై విష‌ప్ర‌చారం జ‌రిగింది.  వైసీపీ నేత‌లు   మైకుల ముందుకొచ్చి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే, పోలీసుల ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌స్తున్న విష‌యాల‌నుబ‌ట్టి  రాయిదాడి ఘ‌ట‌న‌కు తెలుగుదేశంకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. జనం కూడా జగన్ పై రాయిదాడి సంఘటనలో తెలుగుదేశం ప్రమేయం ఉందని ఇసుమంతైనా నమ్మడం లేదు. సరే జనం నమ్మకపోతే పోనీ..  ఈ కేసును ఎలాగైనా టీడీపీ నేత‌ల‌పై నెట్టేసి వారిని అదుపులోనికి తీసుకుంటే తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో దూకుడునైనా ఆపవచ్చన్న తలంపుతో జ‌గ‌న్ మోహన్ రెడ్డి సూచ‌న‌ల‌తో పోలీసులు ఈ కేసులో తెలుగుదేశంను ఇరికించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలుగుదేశం విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి బోండా ఉమాపై రాయిదాడి కేసును బలవంతంగా రుద్దే దిశగా పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతున్నద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 16) తెల్ల‌వారు జామున వ‌డ్డెర కాల‌నీకి చెందిన ఎనిమిది మంది మైన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించి విచారిస్తున్నారు. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన ప్రాంతానికి వ‌డ్డెర ప్రాంతానికి కేవ‌లం 400 మీట‌ర్ల దూరమే ఉంటుంది. అయితే, త‌మ పిల్ల‌ల‌ను రెండు గంట‌ల్లో వ‌దిలిపెడ‌తామ‌ని తీసుకెళ్లార‌ని, పోలీస్ స్టేష‌న్ కు వెళ్లినా వారి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని కాల‌నీ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ బ‌స్సుయాత్ర స‌మ‌యంలో రోడ్డుప‌క్క‌న నిల‌బ‌డితే రూ. 200 నుంచి 300 ఇస్తామ‌ని చెబితే వెళ్లామ‌ని, రూ. 200కు ఆశ‌ప‌డి వెళ్తే మా పిల్ల‌ల‌పై కేసులు పెట్టారంటూ వ‌డ్డెర కాల‌నీ వాసులు పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేసు ద‌ర్యాప్తులో 10మంది వ‌ర‌కూ న‌గ‌రంలోని వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల్ని ప్ర‌శ్నించిన పోలీసులు అందులో స‌తీష్ అనే యువ‌కుడిని రాయి విసిరిన వ్య‌క్తిగా గుర్తించారు. ఆ త‌రువాత బుధ‌వారం బోండా ఉమ కార్యాల‌యంలో ప‌నిచేసే వేముల ద‌ర్గారావు అనే మ‌రో యువ‌కుడిని తీసుకెళ్లారు. అత‌ని నుంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాయిదాడి కేసును ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై నెట్ట‌కుంటే ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న వైసీపీ పెద్ద‌లు  ఎలాగైనా తెలుగుదేశంకి ఈ కేసును అంట‌గ‌ట్టాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే  తెలుగుదేశం నేత బోండా ఉమ‌ను ఈ కేసులో ఇరికించి రాయిదాడి ఘ‌ట‌న‌ను తెలుగుదేశంపై నెట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌వ‌చ్చున‌న్నది జ‌గ‌న్ ప్లాన్‌గా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వైసీపీ కుట్ర‌ల‌ను గుర్తించిన టీడీపీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ విష‌యంపై బోండా ఉమ స్పందిస్తూ..  సీఎం జ‌గ‌న్ పై రాయి దాడి ఘ‌ట‌న‌కు తనకు ఎలాంటి సంబంధం లేక‌పోయినా కొంద‌రు పోలీసు అధికారులు త‌న‌ను ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఇందులో భాగంగానే త‌న ఆఫీసులో ప‌నిచేసే దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు  రాయిదాడి ఘ‌ట‌న‌లో తాజాగా ప‌రిణామాల‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు స్పందించారు. రాయిదాడి కేసులో నిందితులంటూ వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల‌ను తీసుకుపోయారు. టీడీపీ నేత‌ల ప్రోద్భ‌లంతోనే దాడి జ‌రిగింద‌ని చెప్పించ‌డానికి య‌త్నిస్తున్నారంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసు శాఖ‌తో ప్ర‌భుత్వం త‌ప్పులు చేయిస్తోంది. బోడా ఉమా ఎన్నికల ప్ర‌చారాన్ని త‌ప్పుడు కేసుల‌తో అడ్డుకోవాల‌ని య‌త్నిస్తున్నారు. అలా జ‌రిగితే సంబంధిత అధికారుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక శిక్షిస్తామంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. సీఎంకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన వారిని ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించి,  ఈసీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  వేరే అధికారుల‌తో స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాయి దాడి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే  ఇదేమంత సంక్లిష్టమైన కేసు కాదు. కానీ, రాయి దాడి కేసులో తెలుగుదుశం నేతలను ఇరికించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై రాయిదాడి జరగకుండా భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోకుండా.. వారితోనే కేసు దర్యాప్తు చేయిస్తుండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు అంతేకాదు. మైనర్లకు విచారణ పేరుతో తీసుకెళ్లి వారి ద్వారా తెలుగుదేశం నేతలే రాయిదాడి చేయాలని సూచించారని చెప్పించడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.  ఐదేళ్ల జగన్ ప్రభుత్వంపై  ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం   ఇప్పటి వరకూ వెల్లడైన పలు సర్వేల   ఫలితాల్లో వెల్లడైంది. జగన్ ను  గద్దె దింపి సాగనంపడానికి ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని సర్వేలు తేల్చేశాయి.  జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం కూడా ఆయన పాలన పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారని తెలియజేస్తున్నది.  దీంతో వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి ప్రజలను బలవంతంగా బస్సుయాత్రకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాలంటే సానుభూతి పొందేలా ఏదో ఒక ఘటనను క్రియేట్ చేసి అయినా ప్రయోజనం పొందాలని జగన్ అండ్ కో రచించిన ప్రణాలికలో భాగమే  జగన్ రాయిదాడి ఘటన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రమేయంతోనే జరిగినట్లుగా కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు ఘటనలను ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన విధంగానే ఇప్పుడు రాయిదాడి కేసును ఉపయోగించుకుని గట్టెక్కాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు.   రాయిదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెడితే ప్రజల్లో జగన్ పై సానుభూతి ఏర్పడుతుందన్నది వైసీపీ పెద్దల భావనగా పరిశీలకులు చెబుతున్నారు.  అందుకే  పక్కా ప్లాన్ ప్రకారం రాయిదాడి కేసును తెలుగుదేశం నేతలపైకి నెట్టేందుకు కసరత్తు జరుగుతోందని అంటున్నారు.   

పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.  ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.  పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ  అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది. కనీసం పవన్ కల్యాణ్ పేరు కూడా ఉచ్ఛరించకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ప్రస్తావిస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని చూస్తునే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల అంతటి వ్యతిరేకత ఎందుకు. సాధారణంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సంయమనాన్ని కూడా పాటించకుండా పవన్ పై వ్యక్తిగత దూషణలకు సైతం తెగపడేంత ద్వేషభావం ఎందుకు?  అన్న ప్రశ్నకు పదేళ్ల వెనక్కు ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. ఔను నిజమే.. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో తన పార్టీ ఓటమికి అధికారానికి దూరం కావడానికి పవన్ కల్యాణే కారణమని జగన్ విశ్వసిస్తున్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడు లేకపోయి ఉన్నట్లైతే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ భావనగా ఆయనకు సన్నిహితంగా ఉండే వారు ఇప్పటికీ చెబుతున్నారు.  అయితే వాస్తవానికి విభజనతో అన్నిందాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టే అనుభవం, దార్శనికత ఉన్న వ్యక్తిగా ఏపీ జనం చంద్రబాబును విశ్వసించారు కనుకనే ఆయన విజయం సాధించారన్నది విశ్లేషకులు మాట. విశ్లేషకుల మాట ఎలా ఉన్నా కేవలం పవన్ కల్యాణ్ అప్పట్లో తన పార్టీని ఎన్నికల బరిలో దించకుండా చంద్రబాబుకు మద్దతు పలకడం వల్లనే వైసీపీ పరాజయం పాలైందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికలలో పవన్ పోటీలోకి దిగారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ 2014 నాటి పొత్తులు పొడవడంతో ఓటమి తప్పదన్న భయంతోనే ఆయన పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దూషణలకు తెగబడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎప్పడు పవన్ ప్రస్తావన వచ్చినా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే సంబోధిస్తున్న సంగతి తెలిసిందే.   సాధారణంగా రాజకీయ నాయకులు తమ విమర్శలలో ప్రత్యర్ధుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా నియంత్రణ పాటిస్తారు. మర్యాద రేఖ దాటకుండానే విమర్శలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అటువంటి నియంత్రణ అనేదే లేకుండా పవన్ కల్యాణ్ వివాహాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు.  అయితే ఇటీవల ఓ రెండు నెలల కిందట జనసేనాని తనకు  జగన్ నాలుగో భార్యా అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచం వెనక్కు తగ్గారు. ఈ రెండు నెలలుగా పవన్ కల్యాణ్ వివాహాలపై ఎటువంటి కామెంట్లూ చేయకుండా నియంత్రణ పాటించారు. అయితే మనమంతా సిద్ధంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మళ్లీ నియంత్రణ కోల్పోయి జగుప్పాకరమైన భాషలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిశీలకులు గోదావరి జిల్లా వేదికగా జగన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తమదైన విశ్లేషణలు చేస్తున్నారు.  గోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం, బీసీ సామాజిక వర్గాల మధ్య స్వతహాగా ఉండే వైరాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలను దగ్గర చేసుకునే వ్యూహంతో జగన్  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు.  అయితే పవన్ పై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు  జగన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వవని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న జగన్ కు  ఇటు కాపుల మద్దతు, అటు బీసీల మద్దతూ కూడా ఉందనీ, ఆ కారణంగా జగన్ వ్యాఖ్యల కారణంగా వైసీపీకే నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.   ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

చోటే బేటియా గుట్టల్లో నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్.... 

దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు.  ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారీ ఎన్ కౌంటర్. పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో  జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్ట్రైక్ గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు. గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి. తాజాగా నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్‌ మురళి అలియాస్‌ శ్రీపల్లి సుధాకర్‌ కాగా.. మరొకరు బీజాపూర్‌ జిల్లా భామర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజనం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే. పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే.

ఇంకా నెల రోజులు భరించాలా? జగన్ సర్కార్ పై జనంలో ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైనా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగకపోతాయా అని ఆశపడ్డారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో, మరో కారణమో జగన్  ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కు రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు గడువు ముగింపునకు వచ్చింది. 2014 ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుంటే కంటుండొచ్చు కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకు ఉన్న మార్గాల అన్వేషణలో పడ్డారు.  ఆ అన్వేషణలో భాగంగానే హత్యాయత్నం అంటే సెంటిమెంటాయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనస్సుల్లో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండటంతో.. కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తికట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ను నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జనం జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది.   దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం  చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. 

రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ 

ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.  దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.

జగనే ఎందుకు ?

ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు?  ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల జ్ణాపకశక్తి చాలా తక్కువ అన్న నమ్మకంతో కావచ్చు  ధైర్యంగా వైనాట్ 175 అంటూ స్వయంగా జగన్ ఒక ప్రశ్నను సంధించి రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజల జ్ణాపకశక్తిపై జగన్ కు ఉన్న నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు కానీ నడుస్తున్న చరిత్ర , పడుతున్న కష్టాలు, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలనను జనం క్షమిస్తారనీ, పట్టించుకోరనీ ఆయన భావించడం అయితే అతి విశ్వాసం లేదా అహంభావం అయి ఉండాలి. లేదా అమాయకత్వం అయ్యి ఉండాలి. కానీ జనగ్ ను అమాయకుడని ఎవరూ భావించజాలరు. వైనాట్ 175 అన్న తన నమ్మకాన్ని నిలుపుకోవడానికి, ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికీ జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి బోలెడు ఉదాహరణలు ఉణ్నాయి   నిజానికి ఐదేళ్ల  జగన్  పాలనలో రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే, అరాచకం రాజ్యమేలింది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు . యువత వలసబాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.   అవి చాలవన్నట్లు, జగన్ రెడ్డి, కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. వేధింపులు, అరాచకాలు తప్ప జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో ఇంకేం లేకుండా పోయింది. దీంతో జగన్  కి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని, ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.  దీంతో వారు  చేసిన తప్పు  మళ్ళీ చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్ ను అధికారం నుంచి దింపాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ ప్రజాభిప్రాయమే సర్వేలలో ప్రతిఫలిస్తోంది.   జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే  కాదు, చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులెట్టేలా చేయాలన్న జనం నిశ్చయాన్ని కూడా సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.  ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా జనం ఇంకా నెలరోజులా అని భావిస్తున్నట్లుగా వారిలో ఆవేశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వై నాట్ 175 అన్న తన ఆశ పగటి కలేనని జగన్ కే తెలిసిపోయినట్లుంది. దీంతో  గత ఎన్నికలలో తనకు లబ్ధి చేకూర్చిన సెంటిమెంటుపై పడ్డారు. గులకరాయి దాడిని తనపై హత్యయత్నంగా చూపి సానుభూతి పొందడానికి చేసిన యత్నం నవ్వుల పాలు కావడానికి జనం కోడికత్తి దాడి డ్రామాను జనం ఇంకా మరచిపోకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు.   దీంతో మళ్ళీ జగనే ..ఎందుకు కావలి?’ అని వైసీపీ రూపొందించిన ప్రచార కార్యక్రమం  అవును జగనే ఎందుకు ? వద్దే వద్దు అన్న జనవాక్యంగా మారిపోయిందని చెబుతున్నారు. 

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ... రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ 

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.  ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి  స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కల్యాణం చూసేందుకు ఎత్తున భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.సీఎం రేవంత్​రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్​ టెలికాస్ట్​ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక మహోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాములవారి కల్యాణం లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో 23న రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి

మోడీ హ్యాట్రిక్ ధీమా వెనుక ఉన్నది ప్రజాభిమానం కాదు.. విపక్షాల వైఫల్యమే!

కేంద్రంలో వరుసగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తున్నది. అయితే  ఆ విశ్వాసం, ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదనీ, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేననీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో  సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్  విజయాల కోసం, కాంగ్రెస్ రెండు ఓటముల తరువాత ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో  చెమటోడుస్తున్నాయి. ప్రచారం తీరు, దూకుడు చూస్తే ఎవరైనా కేంద్రంలో మోడీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమనే అంటున్నారు. అయితే పరిశీలకులు, రాజకీయ పండితులు మాత్రం అదంత వీజీ కాదంటున్నారు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మిత్రపక్షాలను దూరం చేసుకుంది. మళ్లీ ఎన్నికల ముందు మిత్రపక్షాలతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఏకపక్ష విజయం పట్ల నిజంగానే అంత ధీమా ఉంటే.. పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతుందన్న ప్రశ్న సహజంగానే అందరిలో ఉదయిస్తుంది. మరో వైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే విషయంలో ముందు వెనుకలాడుతున్నాయి. దీంతో సహజంగానే ఎన్డీయే బలంగా ఉంది. ఇండియా కూటమి బలహీనంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే పరిస్థితి బయటకు కనిపించేంత క్రిస్టల్ క్లియర్ గా లేదనీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు హ్యాట్రిక్ విజయం సునాయాసంగా దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు.  2004లో బీజేపీ భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో  ముందస్తు ఎన్నికలకు వెళ్లిన   బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఉన్నదీ ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. మిత్రధర్మాన్ని పాటించడంలో కానీ, ప్రజామోద పాలన విషయంలో కానీ మోడీ సర్కార్ కంటే వాజ్ పేయి సర్కారే బెటరనీ పరిశీలకులు చెప్పడమే కాదు. అప్పటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా ఎలాంటి  సంకోచం లేకుండా చెబుతారు. అయినా అప్పటి వాజ్ పేయి  ప్రభుత్వం పై వ్యతిరేకత  కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎన్నికల తరువాత పరిశీలకులు నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు.  ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత నిశ్శబ్ధ ఉందనీ, జనం బాహాటంగా ఆ విషయాన్ని వెల్లడించకపోయినా.. ఎన్నికలలో ఆ వ్యతిరేకత ప్రభావం కనిపించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయోధ్య రామమందిర ని్మాణం,  హిందూత్వ అజెండా,  ఉమ్మడి పౌరస్మృతి వాగ్దానం, తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు తమను మరో సారి అధికార పీఠంపై కూర్చోపెడతాయన్న విశ్వాసం మోడీలో స్పష్టంగా గోచరిస్తోంది. అయితా ఓ తాజా సర్వే భారతీయులు హిందుత్వ కంటే సర్వమత సామరస్యాన్నే కోరుకుంటున్నారనీ, రామ భక్తి సామ్రాజ్యం కంటే ప్రజాస్వామ్య భారతాన్ని ఇష్టపడుతున్నారనీ తేల్చింది. జనాభాలో దాదాపు 79శాతం మంది బీజేపీ అజెండా హిందుత్వ అయినా తాము బహు మత భారత ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తాజా తీసుకున్న శాంపిల్స్ తక్కువే అయి ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఈ సందర్భంగా 2004 ఎన్నికల ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో యూపీఏ ప్రధాని అభ్యర్థిగా సోనియా అన్న నినాదంతోనే ఎన్నికలు వెళ్లంది. అప్పట్లో సోనియా విదేశీయతను బీజేపీ చాలా ప్రముఖ అంశంగా ప్రచారం చేసింది. అయినా జనం సోనియా విదేశీయత అంశాన్ని పట్టించుకోలేదు.  ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది. అదే సమయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్, కూటమి  పార్టీలూ పెద్దగా సఫలం కావడం లేదు. అయినా ప్రజలలో రామ మందిర నిర్మాణం పట్ల సానుకూలత కంటే  దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావనల పట్లే ఎక్కువ ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి ఇండియా ఫ్రంట్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీ వైఫల్యాలు ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారు.గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై విమర్శలు వచ్చాయి. కొన్ని యంత్రాలు కనిపించకండా పోయాయనే వార్తలు వచ్చాయి. దేశంలో విలయతాండవం చేస్తున్న నిరుద్యోగ రక్కసి కారణంగా మధ్యతరగతి ప్రజలలో మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోందని, అలాగే రైతుల ఆదాయం రెట్టిపు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. రైతులను దగా చేసిందన్న అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతోంది. ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు.  నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి.వీటిని అదుపు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.  ఉత్పత్తి రంగాలు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లాయి.వారికి ప్రభుత్వం అండ ఉండడంతోపాటు ఆర్ధికవ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు.ఫ లితంగా వారు నిర్ణయించినదే ధరగా మారుతోంది. దీంతో అదుపులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీనితో అన్ని వర్గాలలోనూ కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల ఏదో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో  ఈ విషయాలపై ప్రజలలోకి బలంగా దూసుకెళ్లాల్సిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయి.   పంజాబ్,హర్యానాలో రైతుల్లో గిట్టుబాటు బాటు ధర,రైతు చట్టాలు ఉపసంహరణ చేయకపోవడంపై అసంతృప్తి ఉంది. సీఏఏ   అమలులోకి తేవడం వల్ల పౌరసత్వం పై మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు ప్రభుత్వ తీరును విమర్శ చేస్తే అర్బన్ నక్సలైట్లు గా పిలుస్తూ అరెస్టు చేయడంతో ఆయా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ పై వ్యక్తమౌతున్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి, ఇతర బీజేపీయేతర పార్టీలూ విఫలం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న సిరిసిల్లలో కేసీఆర్ ప్రసంగంలో చేసిన అభ్యంతర కర వ్యాఖ్యలపై బుధవారం ( ఏప్రిల్ 18) లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రసంగంలో చేసిన పరుష వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ జారీ చేసిన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు మేరకు ఈ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలో తన ప్రసంగంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై కుక్కల కొడుకుల్లారా, లతుకోరులు, చవటదద్దమ్మలు వంటి పరుష పదాలను ప్రయోగించారు. అలాగే లతుకోరు ప్రభుత్వం, గొతుల్ని కోసేస్తాం, చంపేస్తాం వంటి  వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయంటూ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.