Read more!

కరోనాతో కన్నుమూసిన మాజీ ఐఏఎస్ అధికారి

మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రముఖ రచయిత్రి, కవి నీల సత్యనారాయణ్ (72) కరోనాతో కన్నుమూశారు. రెండు వారాల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త, కుమారుడు కూడా కోవిద్ 19 వైరస్ బారిన పడ్డారు. కుమార్తె , అల్లుడు ఐసోలేషన్ లో ఉన్నారు.

1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీల 2012లో మహారాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారు. మహారాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ గా  పనిచేసిన మొదటి మహిళగా పేరు గాంచారు. కరోనాతో మృతి చెందిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి కూడా ఆమెనే కావడం విచారకరం. సాహిత్య, సంగీత రంగాల్లో విశేష ప్రతిభ ఉన్న ఆమె ఎన్నో పుస్తకాలు రాసి రచయిత్రిగా గుర్తింపు పొందారు. కొన్ని సినిమాలకు కూడా ఆమె సంగీతాన్ని అందించారు.