Read more!

ఇంకా జలదిగ్భందంలోనే హైదరాబాద్ నగరం..

 

హైదరాబాద్ నగరంలోని కొన్ని కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరం నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగిపోయాయి. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. కనీస నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కునేందుకు బయటకు రాని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ వరద నీటికి నగరం మొత్తం మీద సుమారు సుమారు 2 వేల కార్లు, 6 వేల ద్విచక్రవాహనాలు, వేల సంఖ్యలో ఆటోలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సానికి కొన్ని ద్విచక్రవాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఇంకా నిజాంపేట, మూసాపేట వంటి ప్రాంతాల్లో వర్షం ధాటికి నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అపార్ట్ మెంట్లలో ఉన్న నీటిని ఫైరింజన్ల ద్వారా బయటకు పంపుతున్నారు.