Read more!

నందిగ్రామ్.. దీదీ నయా సంగ్రామ్ 

సాధారణంగా ఏ పొలిటీషియన్ అయినా ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా సేఫ్ నియోజకవర్గం ఏది అని వెతికి మరీ పోటీ చేస్తారు. మరి కొంతమంది అయితే ఎందుకైనా మంచిదని రెండు మూడు నియోజకవర్గాలలో పోటీ చేయడం కూడా మనం చూసాం. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఈసారి నందిగ్రామ్ నుండి పోటీకి సై అన్నారు. ఇప్పటివరకు ఆమె వరుసగా పోటీ చేస్తున్న భవానీపూర్ ను కూడా కాదని నిన్నటివరకు తమ పార్టీలో ఉండి.. కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరి సవాల్ విసురుతున్న సుబేందును రాజకీయంగా ఎదుర్కోడానికి దీదీ రెడీ అయ్యారు. నందిగ్రామ్ నుండి పోటీ చేసి సీఎం మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని మాజీ టీఎంసీ నేత సువేంధు అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అందరు పొలిటీషియన్స్ లాగా మమతా కూడా తన గెలుపు కోసం రెండు చోట్ల నుండి పోటీ చేసే అవకాశం ఉన్నా. ఆమె మాత్రం నందిగ్రామ్ ఒక్కచోటే పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నిత్యం రాష్ట్ర పరిపాలనలో తనను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీకి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బెంగాల్ ఎన్నికలలో పోటీ చేసే 291 మంది అభ్యర్ధుల జాబితాను పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమత బెనర్జీ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "నాపై నమ్మకముంచండి.. బెంగాల్ ను ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత నాది" అంటూ ఆమె ఓటర్లకు హామీ ఇచ్చారు ఈ తొలి జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు సీట్లను కేటాయించారు.మరోపక్క పార్టీలోని 80 ఏళ్లు దాటిన నాయకులకు మమత టిక్కెట్టు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ లుగా ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు మమత టిక్కెట్లు ఇవ్వలేదు.

ఇక వరుసగా కొన్ని దశాబ్దాల పాటు బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కమ్యూనిస్టులు ఈసారి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను అయినా దక్కించుకుంటారో లేదో తెలియని స్థితిలో ఉన్న కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పూర్తిగా యువ రక్తాన్నే ప్రోత్సహించాలని డిసైడ్ అయింది ఇప్పటికే బెంగాల్ లో మొత్తం టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయినా సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలలో గెలుపు కోసం తృణమూల్, బీజేపీ పోటాపోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి.