Read more!

బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?

ప్రపంచంలో యువతరం నేడు ఆత్మహాత్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా పోటీ తత్వాన్ని అంగీకరించకపోవడం, ఆత్మన్యూనతా భావం వెంటాడుతూ ఉండడంతో ఒక వైపు ఉద్యోగభధ్రత లేకపోవడం ఆర్ధిక సమస్యలు మరోవైపు కరోనా యువతను కుంగ దీస్తూ ఉండడంతో బతుకు పోరాటం చేయలేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి ఓర్పు సహనం లేని కుర్రకారు యదార్ధ గాధ మీ ముందు ఉంచుతున్నాను. అతను ఒక ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతం అయినా పెళ్ళిచేసుకున్నాడు. భార్య గర్భవతి. ప్రసవం ఎలా చేయించాలి అన్న దగ్గర నుంచి అంతా ఏమౌతుందో అన్న స్ట్రెస్. ఎలాగో ఒకలా బాబు పుట్టాడు అంతా బాగుంది అనుకున్నారు. బారసాలకు ఊరు వెళ్ళారు. పూజా పునస్కారం బాగానే ఉంది. అప్పుడే మొదలైంది అసలు కథ. పిల్లాడికి డాక్టర్ చెప్పిన విధంగానే పాలపొడి డబ్బాలు కొనాలని గట్టిగా చెప్పాడు. అసలు మీరు ఏ డబ్బాలు కొన్నారో నాకు వాట్సాప్ చెయ్యాలంటాడు. రోజూ వీడియో కాల్ చెయ్యాలి అన్నాడని అమ్మాయి అంటుంది. అలాకాకపోతే నాతో మాట్లాడవద్దని అంటూ అత్తామామతో గొడవకు దిగాడు. బావమరిదిని సైతం వదలలేదు నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. నీ అంతు చూస్తానంటూ అనుకున్నారు. కొద్దిరోజులకు అంతా సద్దుమణిగింది అనుకున్నారు.
 

ఊరినుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. తన భార్య ఫోన్ మాట్లాడలేదని, మామ తనను అవమానించాడని మనసులో పెట్టుకున్న అతగాడు అంతా నిద్రపోయాక తనదగ్గర ఉన్న సానిటైజర్ తీసుకున్నాడు. మొబైల్ ఫోనులో నా చావుకు అత్త మామ భార్య కారణమంటూ పేస్ బుక్ లో పెట్టాడు. ఆఘమేఘాల మీద వెళ్లిన బావమరిది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే వచ్చిన పోలీసులను చూసి మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ సానిటైజర్ తీసి పోలీసుల ముందు తాగే ప్రయత్నం చేయడంతో, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి ఇంటికి పంపారు. అసుపత్రి ఫీజ్ 15000 పైమాటే. అసలు సమస్య పక్కకి పోయింది. ఉరిలో పరువుపోయింది, చుట్టాల్లో ఉన్నగౌరవం పోయింది. కేవలం ఒక పట్టుదల మనిషిని చావువరకూ తీసుకెళ్ళింది. అన్నిసమస్యలకి చావు ఒక్కటే పరిస్కారం కాదన్న విషయం ఎందుకు గ్రహించరు. స్త్రీలకంటే ముందు పురుషులే ఆత్మహత్య చేసుకుని తనువు చలిస్తున్న వారి సంఖ్య 3.5% ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెల్లడించింది. నానాటికీ పెరుగుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సహజంగా ఇతరులపై ఆధారపడని, సహాయం తీసుకోకపోగా ఇతరుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు. దీనికితోడు మొండితనం కూడా తోడవ్వడంతో తను అనుకున్నది జరగలేదన్న సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుందని ఆందోళనతోనే ఆత్మాహాత్యలకు పాల్పడుతూ ఉంటారని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అంశంపై పరిశోదన చేయడమంటే సవాళ్ళతో కూడుకున్నదని న్యూయార్క్ చెందిన ఫోర్ దానా విశ్వ విద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ సర్వీస్ కు చెందిన కాల్ మాన్ ఈ విషయం వెల్లడించారు. చావు అన్నింటికీ పరిస్కారం కాదు. బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?