Read more!

పెట్రోల్ కోసం లోన్!

దేశంలో చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీ గంగాపురంలో పది రోజుల క్రితమే సెంచరీ మార్క్ దాటేసింది లీటర్ పెట్రోల్ రేట్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ ప్రీమియం లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలు క్రాస్ చేసింది. ఢిల్లీలోనూ హండ్రెడ్ కు దగ్గరలో ఉంది లీటర్ పెట్రోల్ ధర. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలకు దగ్గరలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టేందుకు దూసుకువస్తున్నాయి. 

చమురు ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింద. రోజు రోజుకు పెరుగుతున్నధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చిరు వ్యాపారులు చితికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. నిరసనలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులో ఓ వాహనదారుడు తనకు పెట్రోల్ కోసం లోన్ ఇప్పించాలని బ్యాంకును ఆశ్రయించాడు. 

పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ యువజన సంఘం వినూత్న నిరసన చేపట్టింది. అఖిల భారత ఫ్వార్వర్డ్‌ బ్లాక్‌ అనుబంధ యువజన విభాగం ఆధ్యర్యంలో నిరసనకారులు  తేనిలో  ర్యాలీగా కెనరా బ్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. పెట్రోల్‌, డీజల్‌ కొనుగోలుకు రుణం ఇప్పించాలని బ్యాంకుమేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు సహా వ్యక్తిగత రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయని, ప్రస్తుతం మనిషి దైనందిన జీవనంలో పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ సిలిండర్‌ వినియోగం సాధారణమైందన్నారు. ప్రస్తుతం వాటిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్టు తెలిపారు.