Read more!

గొంతు నొప్పికి చక్కటి పరిష్కారం..!

చలికాలం వచ్చిందే చాలు అనేక అనారోగ్యసమస్యలు ముసురుకుంటాయి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఏ మాత్రం జబులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించినా భయంతో హస్పిటల్స్ కు పరిగెత్తుతున్నారు. అయితే అన్ని సమస్యలను కరోనా దృష్టిలో చూడటం మంచిది కాదు. ముఖ్యం గొంతు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

జీర్ణక్రియ అస్తవ్యస్తం కావడంతో కొందరిలో గొంతు ఒరుసుకుపోతుంది. గొంతు వద్ద ఏదో నొక్కుతున్న భావన కలగడం, తెమడ జిగటగా ఉండి బయటికి రావడం కష్టం కావడం, కొండనాలుకలో వాపు కనిపిస్తాయి. ఈ స్థితిలో సల్ఫర్‌, సేఫియా, ఆర్సెనిక్‌ ఆల్బ్‌ం  వంటి మందులు బాగా పనిచేస్తాయి. బ్రయోనియా, పల్సటిల్లా,  మందులు కూడా ఉపయోగించవచ్చు. కొందరిలో జీర్ణాశయ సమస్యల వల్ల గొంతు, గవద బిళ్లలు ఎర్రబారడం, గొంతు ఒరిపిడికి గురికావడంతో పాటు  గొంతు పొడిబారినా దప్పిక అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో సాయంత్రం వేళ ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చలివేయడంతో పాటు గొంతులో జిగటగా అంటుకుపోతున్న భావన కలుగుతుంది. ఇలాంటి వారికి పల్సటిల్లా మందు బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి రాగానే భయపడకుండా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.