Read more!

పప్పు కాదు పవర్ ఫుల్ లీడర్! వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్ 

ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు.. సంపాదనే పరమావధిగా పాలిటిక్స్ చేసేవారు మరికొందరు. ప్రస్తుత రాజకీయాల్లో మొదటి రకంలో  కొందరే ఉంటారు. అలాంటి వారిలో టాప్ గా నిలుస్తారు నారా లోకేష్. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్.. ఎమ్మెల్సీగా, మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అనునిత్యం ప్రజల కోసమే పని చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వైసీపీ నేతలు తనను పప్పు పప్పు అని అవహేళన చేస్తున్నా .. ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవలో ముందుంటూ తానొక ఫర్ ఫెక్ట్ లీడరని నిరూపించుకున్నారు.  
         
తండ్రి ఎమ్మెల్యే అయితేనే అక్రమ దందాలు చేస్తూ అతని కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకునే కాలమిది.  తండ్రి వైఎస్ సీఎం అయితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లు ప్ర‌జాధనం దోచుకుని 31 కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి. కాని తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పనిచేసినా.. నారా లోకేష్‌పై ఇప్పటివరకు ఒక్క కేసు లేదు. తాత  తార‌క‌రామారావు ఆరేండ్లు, తండ్రి చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌లో త‌ల‌దూర్చ‌లేదు. అందుకే  ఒక్క కేసులేని మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నారు చినబాబు. జగ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చాక  ఏదో ఒక కేసు పెట్టాల‌ని చూసినా వారి కుట్రలు ఫలించలేదు. ఇసుక సైట్ హ్యాక్ చేశార‌ని, డేటా చోరీ అంటూ చిల్లర ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మయ్యారు.చివ‌రికి అజాగ్ర‌త్త‌గా ట్రాక్ట‌ర్ న‌డిపార‌ని, కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ంటూ  లోకేష్ పై  కేసులు బ‌నాయించి కామెడీ పీసైపోయారు 
సర్కార్  రెడ్డి పోలీసులు.  

మంత్రిగా  పనిచేసి రూపాయి అవినితి ఆరోప‌ణ‌లు నారా లోకేష్ పై రాలేదు‌. అంతేకాదు తన పనితీరుతో ఏపీని దేశంలోనే టాప్ లో నిలిపారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను లోకేష్  నిర్వహించగా.. ఈ రెండు శాఖలకు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈ ఘనత సాధించామని అధికారులే స్వయంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించి పేదలకు బాసటగా నిలిచారు నారా లోకేష్. అవినీతి అంతమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఏకరవు పెడుతూ వారికి కొరకరాని కొయ్యలా మారారు నారా లోకేష్. 

టీడీపీకి కులం రంగు అంటించి విష‌ప్ర‌చారం చేస్తోంది వైసీపీ. అయితే లోకేష్ ను దగ్గరనుంచి చూసిన వారికి తెలుసు అతను ఏమాత్రం క్యాస్ట్ పట్టింపులేని వజ్రమని. ప్రస్తుత సీఎం జగన్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ నుంచి అధికారుల వరకు అంతా ఒకే కులం. సీఎంవో మొత్తం ఆయన  సామాజిక‌వ‌ర్గ‌మే.  నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గర పనిచేసిన వారంతా ఇతర సామాజిక వర్గాల వారే.  పంచాయ‌తీరాజ్ శాఖ  కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి, గ్రామీణ‌నీటిస‌ర‌ఫ‌రా శాఖలో 
భ‌ర‌త్‌గుప్తా, స్వ‌చ్ఛ‌భార‌త్ కార్పొరేష‌న్ ఎండీ గా  ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉండేవారు. ఐటీ శాఖలో జ‌య‌చంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు (ఎస్సీ) మంత్రి కార్యాల‌యంలో ఓఎస్‌డీగా  రంజిత్ భాషా(ముస్లిం), శ్రీనివాస్ (బీసీ),  పీఎస్ అర్జున్ (ఎస్సీ) ప్రైవేట్ పీఏ న‌రేష్ (గౌడ‌) పీఆర్వోగా  చైత‌న్య‌రెడ్డి పని చేశారు. లోకేష్ ఐటీ  మేనేజ‌ర్ గా శ్రీనివాస్ (బ్రాహ్మిన్‌). వ్య‌క్తిగ‌త ఫిట్‌నెస్ ట్రైన‌ర్ జిజూ జోసెఫ్ (క్రిస్టియ‌న్ కేర‌ళ‌) ప‌ర్స‌న‌ల్ డ్రైవ‌ర్ స‌తీష్ (ఎస్సీ). ఇలా ప్ర‌భుత్వం ఇచ్చిన  ప్రైవేట్ సెక్యూరిటీలోనూ నారా లోకేష్ కులం వారు ఒక్క‌రూ లేరు. 

నారా లోకేష్‌ కు తెలుగు మాట్లాడటం రాదని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఇంగ్లీషు మీడియం కావ‌డం వ‌ల్ల తెలుగు మాట్లాడేట‌ప్పుడు త‌డ‌బ‌డ‌తాన‌ని నిజాయితీగా ఒప్పుకున్నారు లోకేష్. పదాలు తడబడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు వాటినే వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నా.. ఆయన ప్రజాబాట మరవలేదు. లైవ్‌లో మాట్లాడ‌టం ఆపేయ‌లేదు. మీడియా మిత్రుల‌ని కూడా ఏమైనా ప్ర‌శ్న‌లున్నాయా అంటూ అడిగి మ‌రీ ప్రెస్‌మీట్లు ముగిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌ద‌వ‌లేక  తెలుగుని ఖూనీ చేస్తూనే వున్నాడు. చివ‌రికి లైవుల్లో దొరికిపోతున్నామ‌ని రికార్డెడ్‌కి వెళ్లి అక్క‌డా త‌ప్పుడు లెక్క‌లు, ప‌దాల్ని ప‌ల‌క‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప‌ప్పు అని జ‌గ‌న్‌రెడ్డి అండ్ కో గేలి చేసిన నారా లోకేష్ ప్ర‌జ‌ల్లో వుంటూ, లైవుల్లో పంచ్ డైలాగులు విసురుతుంటే..  జ‌గ‌న్‌రెడ్డి మాత్రం మీడియా ముందుకి కూడా రాలేక తాడేప‌ల్లి నుంచి రికార్డెడ్ ప్రెస్‌మీట్లు వ‌దులుతూ జీరో అయిపోయారు. 
 
తెలుగుదేశం పార్టీకి స‌మాజ‌మే దేవాల‌యం..ప్ర‌జ‌లే దేవుళ్లు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లే కుటుంబం. తమ్ముళ్ల  కోసం లోకేష్‌ ఆలోచ‌న‌ల కార్య‌రూపమే కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి. జెండా మోసే కార్య‌క‌ర్త‌కి అండ‌గా నిలిచేందుకు నారా లోకేష్ ఆరంభించిన ఈ విభాగం ఇప్పటికే వేలాది కుటుంబాల‌కు చేయూత‌నిచ్చింది.  టిడిపి స‌భ్య‌త్వం తీసుకున్న 80 ల‌క్ష‌ల‌మంది కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ప్రీమియం క‌ట్టి, వారి భ‌ద్ర‌త‌కు భ‌రోసానిచ్చారు నారా లోకేష్‌. ఎటువంటి ఆర్థిక ఆస‌రాలేని సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రతి నెలా  1500 వారి ఖాతాల్లో వేస్తూ చేదోడుగా నిలుస్తున్నారు లోకేష్‌. నిరుపేద టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌త్య‌ర్థి పార్టీల దాడుల్లో చ‌నిపోయిన కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌కు ఎన్టీఆర్ మోడ‌ల్‌ స్కూల్లో ఉచిత విద్య‌నందిస్తున్నారు. నిరుపేద‌లైన కార్య‌క‌ర్త‌ల వైద్య‌, విద్య‌, వివాహ అవ‌స‌రాల‌కు సంక్షేమ నిధి నుంచి  సాయం అందిస్తున్నారు. ప్రాణాంత‌క క్యాన్స‌ర్ సోకిన పార్టీ కుటుంబ స‌భ్యుల‌కు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌‌త్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. పేద కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌ వివాహాలకు పార్టీ నుంచి పెళ్లికానుక  అందిస్తున్నారు నారా లోకేష్. 

పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని కుటుంబ‌స‌భ్యుల్లా భావించి వారి సంక్షేమానికి పాటుప‌డుతూ కార్య‌క‌ర్త‌ల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న నారా లోకేషే అస‌లు సిస‌లు ప్ర‌జానాయ‌కుడని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. ప్రజలే దేవుళ్లని భావించే కుటుంబం నుంచి వచ్చిన లోకేష్.. వాళ్ల స్పూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కొద్ది కాలంలోనే రాజకీయంగా రాటు దేలి, ప్రజా సేవలో ఆదర్శంగా నిలుస్తూ.. అవినీతికి అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఏపీకి భవిష్యత్ ఆశాకిరణంలా మారిపోయారు చినబాబు.