Read more!

ఈ సింపుల్ యోగ ముద్రలతో ఎన్నో రోగాలు అరికట్టవచ్చు...

 

మానవ శరీరం లో ఉన్న ప్రతీ అవయవం చాల గొప్పది.. ఏది సరిగా పని చేయకపోయినా దాని ప్రభావం పూర్తిగా శరీరం పై పడుతుంది. కానీ ఒక్క అవయవం తో  మనం మానసిక స్థితిని, భౌతిక స్థితిని , ఆధ్యాత్మిక స్థితిని కూడా పొందవచ్చని మీకు తెలుసా..  అది ఎలా అంటారా మనం చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, మనకు తెలియదు. చేతి వేళ్ళని కొన్ని భంగిమలలో పెట్టె ప్రక్రియని ముద్ర అంటారు. మరి ఆ ముద్రలలో రకాలు వాటి వాళ్ళ మనకి కలిగే ప్రయోజనాలు అవి ఎలా వేయాలో చూద్దాం..


1.జ్ఞాన ముద్ర:

ఈ జ్ఞాన ముద్ర వేయడం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది , నాలెడ్జి కూడా ఇంప్రూవ్ అవుతుంది ,ఇంకా మన జ్యపకశక్తిని కూడా పెంచుతుంది. ఇంకా ఈరోజుల్లో చాల మంది నిద్రలేమి తో బాధపడుతున్నారు. ఈ ముద్ర వేయడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. మరి ఈ ముద్ర వేయడం ఎలా అంటారా చాల సులభం. మనం బొటన వేలుని చూపుడు వేలుతో కలిపి ఉంచి మిగిలిన మూడు వెళ్ళాను నిటారుగా నిలపడమే ఈ జ్ఞాన ముద్ర. ఇది మనం ఎపుడైనా వేయవచ్చు నిల్చున్నపుడు , కూర్చున్నపుడు , నిద్రపోయేటప్పుడు ఇలా ఎప్పుడైనా వేయవచ్చు


2.సూన్య ముద్ర:

ఈ ముద్ర ని ఎలా వేయాలంటే మన మధ్య వేలుని బొటన వేలు తో ఒత్తి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టాలి ,ఇలా రోజుకి కనీసం నలభై నిమిషాలైనా చేస్తే మన శరీరంలో ఉన్న dullness అనేది లేకుండా పోతుంది ,చెవి నొప్పి లాంటి సమస్యలేమైనా ఉన్న కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు ఇంకా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర  బాగా  ఉపయోగపడుతుంది


3.ప్రాణ ముద్ర:

ఈ ముద్ర ఎలా వేయాలంటే మన ఉంగరపు వేలుని ,చిటికెన వేలుని బొటనవేలికి టచ్ చేసి మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ ప్రాణ ముద్ర ,ఇది ఎప్పుడు ఐన వేయవచ్చు. ఇది వేయడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది , ఇంకా బద్దకాన్ని నివారిస్తుంది, ఇంకా మానసికంగా , శారీరకంగా దృఢం గ ఉండేలా చేస్తుంది ,ఇంకా మన కంటిచూపు మందగించడాన్ని మెరుగుపరుస్తుంది ,ఈ ముద్ర వేయడం వల్ల మనిషి చాల ఆక్టివ్ గ ఉంచేలా చేస్తుంది


4.ధ్యాన ముద్ర:

ఇది ఎలా చేయాలంటే మన రెండు చేతుల్ని అరచేతులు పైకి వచ్చేలా మన ఒడిలో పెట్టుకుని రెండు బొటన వేళ్ళు మాత్రమే టచ్ అయేలా ఉంచాలి. దీన్ని కదలకుండా నిటారుగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంతసేపైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చిరాకు,డిప్రెషన్, స్ట్రెస్ లాంటి వాటినుండి చాల రిలీఫ్ ఉంటుంది. ఇది చాల పవర్ఫుల్ ముద్ర


5.బుద్ది ముద్ర:

ఇది కూడా చాల ముఖ్యమైన ముద్ర మన చేతి బొటన వేలుని చిటికెన వేలితో కలిపి ఉంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ  బుద్ధి ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా , మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఇది  బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతని కోరుకునే ప్రతి ఒక్కరు  ఈ ముద్ర లు తప్పక  కంటిన్యూ చేయండి.


6.సూర్య ముద్ర:

మన చేతి ఉంగరం వేలు ని బొటన వేలు కింద మడిచి పెట్టి మిగిలిన వేళ్ళను నిటారుగా నిలబెట్టి ఉంచడమే ఈ సూర్య ముద్ర ఈ సూర్య ముద్ర వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు ఈ ముద్ర చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.


7.ఆపాన ముద్ర:

మన చేతి మధ్య వేలుని , ఉంగరం వేలుని బొటన వేలుతో కలిపి ఉంచి మిగిలిన వేళ్ళను నిటారుగా ఉంచడమే ఈ ఆపాన ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇంకా మన శరీరంలోని  వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపిస్తుంది.


8.గణేష్ ముద్ర:

మన రెండు చేతులను సగం పిడికిలి బిగించి ,రెండు చేతులను కలిపి బిగించి , మన ఛాతి భాగానికి పెట్టి నిటారుగా కూర్చుని ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేయడం వల్ల మన శరీర దారుఢ్యం చక్కగా ఉంచడానికి , మన కండరాల తీరు పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.


9.వాయు ముద్ర:

మన చేతిలో చూపుడు వేలుని మధ్యకి మడిచి బొటనవేలితో అదిమిపెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర ఈ ముద్ర ని వేయడం వల్ల మన శరీరం లో ఉన్న చేదు గాలి బయటికి వచ్చి మన కి ఉన్న నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు విపరీతమైన కీళ్ల, కండరాల నొప్పులను రాకుండా చేస్తుంది, ఇంకా మనం చిరాగ్గా అనిపించినపుడు కూడా ఈ ముద్ర వేస్తె ప్రశాంతంగా ఉంటాం..

https://www.youtube.com/watch?v=BFMHOO_XUE8