Read more!

ప్రపంచంలో ఖరీదైన నివాసభవనాలు

తల దాచుకోవడానికి చిన్న గూడైన ఉండాలనుకుంటారు సగటు మనుషులు. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరిన కొందరి ఇళ్లు చూస్తే ఇంద్ర భవనమా.. దేవంద్ర భవనమా.. మయుడి వాస్తు కళా నైపుణ్యామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని ఇళ్ల విశేషాలు చూద్దాం...


అంటిలియా - ముఖేశ్ అంబానీ

ప్రపంచంలోనే లక్షలాది ఇండ్ల మాదిరిగా  అంటిలియా ను చూడలేం. వాటిలో ఒకటిగా లెక్కించలేం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండవది. దక్షిణ ముంబయిలో ఉండే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యుల రెడిడెన్సీ.  ఆంటీలియాను  డిజైన్ చేసింది చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్సన్ విల్. ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ హోల్డింగ్స్  నిర్మించారు.

ఈ భవనంలో 27 అంతస్తులు ఉంటాయి.  అనేక ఆధునిక హంగులతో దీన్ని రూపొందించారు. ఇందులో సెలూన్, న్యూ మూవీ థియేటర్ ఐస్ క్రీమ్ పార్లర్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ,స్పా లాంటివి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇంటి ఖరీదు రెండు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండోవ స్థానం సాధించిన ఈ ఇల్లు భారతదేశంలో అతి ఖరీదైన మొదటి గృహం.

జెకె హౌస్,  గౌతమ్ సింఘానియా

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటి టైటిల్‌ను అంటిలియా  సొంతం చేసుకుంది. 
ఇప్పుడు భారతదేశానికి చెందిన మరో బిలియనీర్ కుటుంబం సింఘానియా  నివాసగృహం వెలుగులోకి వచ్చింది.   j.k కంపెనీ అధినేత విలాసవంతమైన, ఆధునిక హంగులు ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు. 

భారతీయ వ్యాపార సంస్థలలో అతి పెద్దదైన  jk పరిశ్రమల పేరుతో నిర్మించిన ఈ ఇల్లు అంటీలియా తర్వాత అత్యంత ఖరీదైన గృహంగా రికార్డు సొంతం చేసుకుంది.   16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఐదు ఫ్లోర్ల వరకు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు.  పట్టణంలో ఉన్న ఉత్తమ కార్లను పార్క్ చేయడానికి మాత్రమే ఐదు ఫ్లోర్ల స్థలం ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇల్లు, ఇంటిలోని వారు ఎంత రిచో.. మిగతా అంతస్తుల్లో  స్పా, స్విమింగ్ ఫూల్, జిమ్ వంటి వసతులతో పాటు  ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రత్యేక స్థలం ఉంది. అంతేకాదు సొంత హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. జెకే సంస్థకు గౌతమ్ సింఘానియా, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.  ఈ సంస్థ  రేమండ్ గ్రూప్ గా ప్రసిద్ధి చెందింది. ఆయనకు  ఫాస్ట్ కార్లు,  ఆధునిక పడవలు,  లగ్జరీ రివేట్ జెట్‌లపై అమితమైన ఆసక్తి.  ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఖరీదైన భవనం విలువ  సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ఖరీదైన గృహం  అంటిలియా తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం.

అడోబ్, అనిల్ అంబానీ

ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలో అత్యంత ఖరీదైన
 గృహాలలో ఒకటిగా  చెప్పవచ్చు. ఈ  ఎత్తైన భవనం ఫాన్సీ హెలిప్యాడ్ వంటి అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు.  ఈ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ,  దాదాపు 70 మీటర్ల ఎత్తులో ఉంది.  ఈ విలాసవంతమైన ఇంటి విలువ సుమారు 5000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. 
అయితే ఈ విలాసవంతమైన భవనంలో నివసించే అనిల్ అంబానీ  జీవనశైలి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. 

మన్నాట్, షారుఖ్ ఖాన్

ముంబయిలో ఉన్న మరో ఖరీదైన భవనం మన్నాట్. ఈ భవనం వార్తల్లోకి రావడానికి కారణం ఈ ఇంటి యజమాని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కావడం.  ఈ భవనం పై నుంచి  అరేబియా సముద్రం అందాలను వీక్షించే సదుపాయం ఉంది.  ఇది ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉంది.  గ్రామీణ ప్రాంతంలోని ఇంటి సగటు పరిమాణం 497 చదరపు అడుగులు, ఇది వ్యక్తికి 103 చదరపు అడుగులు. అయితే మన్నాట్ లో మాత్రం సుమారు 225 మంది  నివసించవచ్చు. షారూఖ్ డ్రీమ్ హోమ్ అయిన ఈ భవనం ప్రపంచంలోని ఖరీదైన  గృహాల జాబితాలో 10 వ స్థానంలో ఉంది.  13.32 కోట్లతో షారూఖ్ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాని  విలువ 200 కోట్ల రూపాయలు. 

స్కై హౌస్, విజయ్ మాల్యా

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా   పెంట్ హౌస్ ఖరీదైన గృహాల జాబితాలో చోటు సాధించింది. 
40,000 చదరపు అడుగుల స్థలంలో తన డ్రీమ్ హౌస్ ను  విజయ్ మాల్యా  నిర్మించుకున్నారు.  35 అంతస్తుల ఎత్తైన భవనంపై నిర్మించిన పెంట్ హౌస్ ఇది.   బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కింగ్‌ఫిషర్ టవర్స్ -  నివాసం అంటారు. ఎత్తైన టవర్ల పైభాగంలో  నిర్మించిన ఆకాశ హర్మ్యం ఇది. దీన్ని  మాల్యా  వైట్ హౌస్, స్కై హౌస్ గా కూడా పిలుస్తారు.  ఎత్తైన టవర్ల పై స్విమింగ్ ఫూల్,  వైన్ సెల్లార్,  సెలూన్ , స్పా, జిమ్ తో పాటు అనేక ఇతర విలాసవంతమైన  సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హెలిప్యాడ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి పెంట్ హౌస్ లా కనిపించినప్పటికీ ఇది  ఒక పెంట్ హౌస్ కాదు, ఇది విల్లా కన్నా ఎక్కువ.  స్కై హౌస్ విలువ గతంలో   135 కోట్ల రూపాయలు. ఇప్పుడు విలువ 150 కోట్ల రూపాయలు.