Read more!

నిద్రలేమి సమస్య గుండె జబ్బుకి దారితీస్తుంది

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? సమస్య తీవ్రమైతే మీ గుండెకి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి నిద్ర పోవడం కొందరికి సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొందరు పుస్తకాలను, మరికొంతమంది కంప్యూటర్ ను, కొంతమంది సెల్ ఫోన్లలను ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అలా నిద్రలేని రాత్రులు గడిపేవాళ్లకు గుండె జబ్బు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమి- గుండెజబ్బు వంటి అంశాలపైన పరిశోధనలు జరిపిన వైద్యులు ఒక రిపోర్టును అందించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారని అన్నారు. 50% గుండె సమస్యలకు, గుండె నొప్పికి నిద్రలేమి సమస్యలే కారణమని వెల్లడించారు. అమెరికన్ హార్ట్ జనరల్ ప్రచురించిన జర్నల్లో గుండె నెప్పి తర్వాత నిద్రలేమి వల్ల వచ్చేసమస్యలు అత్యధికమని పేర్కొన్నారు. నిద్రలేమి సమస్య వల్ల ఊపిరి ఆగిపోవడం దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. నాలుక లేదా గొంతు వద్ద శ్వాస నాలం పూడుకు పోతుందని వివరించారు. దీనివల్ల శ్వాస ప్రసరణలో మార్పులు వస్తాయని, కొందరు వ్యక్తులకు గురక వస్తుందని ఇది నిద్రలేమికి కారణంగా పరిశోధనలో తేలిందని వివరించారు. కొన్ని సెకండ్లలో 70% మందికి గుండె నొప్పికి కారణంగా తేల్చారు. గురక, లేదా శ్వాస ఆగిపోవడం  కొన్నిసెకండ్ల పాటు ఉంటుందని పేర్కొన్నారు. శ్వాస ఆడక నిద్రలేమి సమస్యకు కారణంగా చెప్పవచ్చు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తో తీవ్రంగా బాధ పడుతున్న వారు గంటకు 30 కంటే ఎక్కువ సార్లు నిద్రాభంగం కలిగినప్పుడు దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని  డాక్టర్ సందీప్ కోట్ విశ్లేషించారు. సరైన నిద్రతో మరల శక్తిమంతులుగా మారవచ్చని, శ్వాసలో పెనుమార్పులు రావడం వల్ల శరీర ఆకృతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా రక్త ప్రసారంలో ఒత్తిడి పెరగడం గమనించవచ్చని డాక్టర్ సందీప్ కోట్ తెలిపారు. దీనివల్ల హై బీపీ, పెరుగుతుందని దీనివల్లే నిద్రలేమి గుండె సమస్యలు విషయం కొందరు గుర్తించరని, బీపీ వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయం గ్రహించాలన్నారు. స్థూల కాయం  నిద్రలేమి ఒకదానికొకటి ముడిపడి ఉందని ఈ రెండు సమస్యలు  ఉన్నవారిలో గుండె సమస్య తప్పకుండా ఉంటుందని విశ్లేషించారు.