Read more!

మాంసాహారంతో గుండె సమస్యలు!  

ముక్క లేనిదే ముద్ద దిగదు.. కొందరికి రోజూ ఉంటే, కొందరికి  వారానికి  ఒక్కసారైనా నాన్ వెజ్ లేనిదే ఆ వారం గడవదు. సండే వచ్చిందా పిల్లలకి పెద్దలకి పండగే. సండే వస్తే నాన్ వెజ్ ఉండాలి. పుట్టినరోజు పార్టీకి నాన్ వెజ్ ఉండాలి. పండగ వచ్చిందా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొన్ని చోట్ల ఆయా సంప్రదాయాలు అలవాట్లని బట్టి నాన్ వెజ్ తప్పనిసరిగా వండుకుంటారు. ఇలా ప్రతి సారీ అవకాశం దొరికినప్పుడల్లా ఈదేవి, ఎగిరేవి, పాకేవి అనే తేడా లేకుండా.. పిట్ట మాంసం, జింక మాంసం, పంది మాంసం, కుందేలు మాంసం ఇలా దొరికిందల్లా మీ పొట్టలోకి తోసేస్తే కొవ్వుపెరిగి గుండెలో కొలెస్ట్రాల్ చేరి, రక్తనాళాలు మూసుకు పోయి స్టెంట్లు వేసుకోడం ఒకబాధ. అసలు గుండె నొప్పి వచ్చినట్టు కూడా తెలియకుండా మనిషిని తీసుకుపోయే హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కకోసం కాస్త కక్కుర్తి పడ్డారో గుండె లో సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చ్రరిస్తున్నారు.

 

మాంసాహారము తినే వారిలో కార్డియో వాస్క్యులర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియో వాస్క్యులర్  సమస్యలతోపాటు చనిపోయే అవకాశం ఉందని కార్డియో సర్జన్లు హెచ్చరిస్తున్నారు. అయితే చేపలు కొంత ప్రమాదం తక్కువే అని పేర్కొన్నారు .  మాంసాహారము తింటున్న వారిపై ఇటీవల జరిపిన పరిశోధనలో చికెన్ ఇతర మాంస పదార్ధాల వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వచ్చే అవకావం ఉందని సాచురేటెడ్ ఫాట్స్  ఉంటాయని కార్డియో సమస్యకు దారితీస్తాయని హృద్రోగనిపుణులు తెలిపారు. న్యూయార్క్ కు చెందిన కర్నాల్  విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఈ విషయం బయట పడిందని తెలిపారు.