Read more!

మకో రోబోటిక్‌తో కీళ్ళమార్పిడి!

మకో రోబోటిక్ ఆర్మడ్ అసిస్టెడ్ సర్జరీతో కీళ్ళమార్పిడి సులభంగా లుధియానా వైద్యుల అవిష్క రణ. కీళ్ళమార్పిడి మకో రోబోటిక్ ఆర్మ్ అసిస్టేడ్ టెక్నాలజీతో సర్జరీ పద్దతిని లుధియానాలోని హ్యుజన్ ఆసుపత్రి అదునతన విధానాన్ని కనుకున్నది . రోబోట్ ఆర్మ్ ఆసిస్టేడ్ విధానంలో సర్జన్లు లేకుండానే  కీళ్ళమార్పిడి శాస్త్ర చికిత్స చేయవచ్చని ఈ విధానంలో ఊహించినదానికన్నా ఎక్కువ సమయంలోనే సమర్దవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు లుదియానకు చెందిన వైద్యులు విజయం సాధించారు. మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్ స్టెద్ విధానంతో లుధియానా ఆసుపత్రి వైద్యరంగంలో  మైలురాయిని అధిగమించినట్లయ్యింది. కీళ్ళమార్పిడి పద్దతిలో అదునాతాన సాంకేతికతను వినియోగించిన  ఉత్తరాదిలో మొట్టమొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది.

మాకో రోబో టిక్ ఆర్మ్ అసిస్టేడ్  విధానాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎఫ్ డి ఎ  సైతం అనుమతించింది. స్ట్రైకర్ ఇండియా హ్యుంజన్ ఆసుపత్రి సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. శాస్త్రీయ సంప్రదాయ సర్జరీలకన్న భిన్నంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  కీళ్ళ నొప్పులు , కీలు అరిగిపోయిన వారికీ చేసే కీళ్ళ మార్పిడికి మాకో రోబో ఆర్మ్ ఆసిస్టెడ్ సర్జరీ ఒకరకమని స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్  మీనాక్షి  నేవతియా అన్నారు. భవిష్యత్తులో హ్యుజన్ ఆసుపత్రితో కలిసి మరిన్నికొత్త పద్దతులు అమలు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని మీనాక్షి పేర్కొన్నారు. రోగుల అవసరాలను తీర్చగలిగినందుకు ఆనందంగా ఉందని ఆమె హార్షం వ్యక్తం చేసారు. లుదియానాకు చెందిన హ్యుజన్ ఆసుపత్రి డైరెక్టర్ నీరీప్లేస్మేంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్  హ్యుజన్  మాట్లాడుతూ సంప్రదాయ శస్త్ర చికిత్స లకు ఒక సవాల్ వంటిదని ఆయన అన్నారు. ఇందులో సర్జన్ ప్రతిభ ఆధారపది ఉంటుందని అన్నారు. పాత పద్దతిలో బోన్స్  ను ప్రతిసారీ కోయాల్సి వచ్చేదని కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు.

ఎనిమిది మంది పైజరిపిన శస్త్ర చికిత్స  మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. సర్జరీకి ముందుగానే ఆ పేషంట్ల గురించి అవగాహన ఉండడం వల్ల  తక్కువ కోతలు ఉండవచ్చని సాఫ్ట్ టి ష్యు డేమేజ్ కాకుండా నివారించవచ్చని ఎముకను కాపాడవచ్చని హ్యుజన్ వివరించారు. హ్యుజన్ ఆసుపత్రి ఆర్తో కన్సల్టెంట్  జైవీర్ హ్యుజాన్ మాట్లాడుతూ అధునాతన రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్  టెక్నాలజీతో రోగుల జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిలో రోగులకు మరిన్ని లాభాలున్నాయని అన్నారు. అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం అమలు చేస్తామని జైవీర్ తెలిపారు. ఒక్కోక్కరిలో బోన్స్ అనాటమీ వేరువేరుగా ఉంటుందని కీళ్ళ మార్పిడి లేదా హిప్ సర్జరీ చేయడంలో మాకో రోబోటిక్ సర్జరీలో త్రీ డి మోడల్ గుర్తించేందుకు సి డి స్కాన్ ఆధారంగా వర్చువల్ సర్గికల్ ప్రొసీజర్ అమలుచేస్తామని జైవీర్ తెలిపారు. ఇందుకోసం 1౦౦౦ మాకో సిస్టంలో 35,౦౦౦ పద్దతులు ఇప్పటిక్ పరిశీలించమని   మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్టెడ్ సాంకేతికత క్లినికల్ గా నిరూపించామన్నారు.