Read more!

చక్కర ఎక్కువ తీసుకుంటే.. పిల్లలకు ప్రమాదమే.. 

పిల్లలు చక్కర ఎకువగా తింటే మెదడు అభివృద్ధి మందగిస్తుంది జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకి తాయిలాలు పెట్టనిదే మాట వినరు. అలా తాయిలాలకి అదేపనిగా అలవాటు పడ్డపిల్లల లో అతిగా చక్కర శాతం ఉన్న పానీయాలు అలవాటు చేస్తే  వచ్చే తదితర సమస్యలపై పిల్లల బ్రెయిన్ పెరుగుదల పై చేసిన పరిశోదన కొన్ని సూచనలు చేసింది. జార్జియా విశ్వ విద్యాలయం జరిపిన పరిశోదనాలో చక్కెర వాడడం వల్ల లేదా చక్కెర తో కూడిన కూల్ డ్రింకులు ఎక్కువ తీయగా ఉండే వస్తువులు తీసుకుంటారో ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవారు . ముఖ్యంగా సాధన నేర్చుకునే వారిలో ప్రయత్నంలో ఉంటారో జ్ఞాపక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్ద వయస్సు ఉన్నవాళ్ళలో ముఖ్యంగా బాక్టీరియా లో వచ్చే మార్పువల్ల  జ్ఞాపక శక్తి సరిగా ఉండదని తేల్చారు. సహజంగా మీరు కొనుక్కునే చక్కెర తో చేసే పదార్ధాలు   దుకాణాలలో  లభిస్తుంది. అవి పిల్లల కోసమే పెట్టి అమ్ముతూ ఉంటారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్దాలాను ఇతర వస్తువులను వాడేది పిల్లలు మాత్రామే అతిగా తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపు తుంది. ఒక వైపు నేర్చు కుంటూనే జ్ఞాపకం ఉంచుకోవాలి  దీనిని హేప్పో క్యాంపస్ అంటారు. జార్జియా విశ్వ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయ బృందం సదరన్ కాలిఫోర్నియా సమన్వయం తో పలు అంశాలపై పరిశోదనలు చేసింది. యుక్త వయస్సు నుంచి ఎదిగే వరకు  ఒక పక్క నేర్చుకోడం. సాధన చేయడం గుర్తుపెట్టుకోడం . ఒక్కసారి వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి జ్ఞాపక శక్తికి సంబంధించి సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు. పారా బాక్టీరియాను ఎక్స్ పర్మెంట్ గా జంతువులకి ఇచ్చారు. అయితే వాటికి చక్కర ఇవ్వలేదు.ముందుగా చక్కర తీసుకున్న వాటిలో పారా బాక్టీరియా లెవెల్స్ పెరిగాయి. ఎక్కువ శాతంలో పారా బాక్టీరియా ఉన్న జంతువులలో తీవ్ర పరిణామాలు వచ్చాయి. అధిక  చక్కర వల్లే వినికిడి సమస్య జ్ఞాపక శక్తి, కారణమని తేల్చారు. 

చక్కెరను నియంత్రించాలి.-----

మనం తీసుకునే ఆహారం లో కొన్ని సూత్రాలను తప్పని సరిగా పాటించాలని దిశా నిర్దేశంచేసారు.యు ఎస్ వ్యవసాయ విభాగం, ఆరోగ్యం మానవ వనరుల విభాగం సంయుక్తంగా చక్కర శాతం ఎంత ఉండాలి అన్న అంశాన్ని సంయుక్తంగా ఒక ప్రచూరణ చేసింది. ప్రతిరోజూ 1 ౦ %  క్యాలరీల కంటే మించరాదని సూచించింది. డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్  విభాగం తమ వద్ద ఉన్న డాటా ప్రకారం  9- 18  సంవత్చ రాల వయస్సు ఉన్న వారు చక్కెర ద్వారా ఎక్కువ క్యాలరీలు వస్తున్నాయని ఎక్కువ చక్కెర శాతం ఉన్న ఆహారం వల్ల మైక్రో బ్యాక్టీరియా ను చిన్న చిన్న ఎలుకలలో చక్కర పదార్ధాలను ఇచ్చామని వాటి ప్రభావం పనితీరు పరిశీలించారు. ఎలుకలలో జ్ఞాపక శక్తి వినికిడి సమస్యలు వచ్చాయని గమనించామన్నారు. జంతువులలో గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి తగ్గిందని చక్కర పదార్ధాలు వాడడం వల్ల 1 ౦ ౦ మిలియన్లమైక్రో ఆర్గానిజమ్స్ గ్యాస్ట్రో ఇంటర్స్తైనల్ సమస్యలు మానవ ఆరోగ్యం పై తీవ్ర తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా మెదడు వృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ప్రతి వ్యక్తిలో ఉండే బ్రెయిన్ వల్ల అతని మెదడుకు  ఏమి అవసరామో 
తెలియ చేస్తుంది.