రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మరో కీలక ఘట్టంలో ప్రవేశించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ జెఎసి, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన సకల జనుల సమ్మె ఆరంభమైంది.
తెలంగాణ అంశంపై అటో, ఇటో తేల్చడానికి సమయం దగ్గర పడుతోంది. ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలు చూసినా, కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాలు చూసినా తెలంగాణపై త్వరలోనే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అబిప్రాయం కలుగుతోంది.

తెలంగాణ అంశం పై కేంద్రం ఏమి చేస్తుందో, కాంగ్రెస్ హైకమాండ్ ఏమి చేస్తుందో కాని , మన రాష్ట్రానికి చెందిన ఉభయ ప్రాంతాల ఎమ్.పిలు కొత్త డ్రామాకు తెరదీసి రక్తికట్టిస్తున్నారు. వారి కుమ్ములాటలు చూసి ప్రజలకు నవ్వాలో, ఏడవాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతోంది.
కెసిఆర్ దశాబ్ద కాలపు తెలంగాణ ఉద్యమానికి చిరునామా. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పదేళ్ల క్రితం ఆయన ఆరంభించిన ఒక చిన్న ఉద్యమం అది పాయలు, పాయలుగా అభివృద్ది చెంది
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నా హజారే బృందానికి భారతదేశం యావత్తూ జేజేలు పలుకుతోంది. పార్టీలకు అతీతంగా ఈ మద్దతు లభిస్తోంది. ఇది గొప్ప విజయం.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమార్తె, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? తెలుగుదేశంలో హరికృష్ణ వివాదాన్ని సృష్టిస్తున్న నేపధ్యంలో ఈ చర్చకు తెర లేస్తోంది.
జూపల్లి రాజీనామా ఆమోదించడంతో దాని ప్రభావం తెలంగాణ ఉద్యమంపై ఏ రకంగా ఉంటుందన్న చర్చ ఆరంభమైంది. తెలంగాణ వాదానికి, తెలంగాణ ఉద్యమానికి కృష్ణారావు రాజీనామా కొంత ఊతం ఇచ్చే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఆయన తెలంగాణ అంశం కన్నా..
ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. చాలామంది తెలంగాణ పై మీ వైఖరి ఏమిటని అడుగుతున్నారు. అనే క వ్యాసాలలో నా వైఖరి తెలిపాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంతానికి అది మేలు కలిగిస్తుందన్నది నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ప్రకటించినప్పుడు వ్యతిరేకించడం ద్వారా ఆంధ్ర నేతలు చారిత్రక తప్పిదం చేశారని కూడా పేర్కొన్నాను.
దేశం అంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్ అంటూ రాసిన మహాకవి గురజాడ అప్పారావు ఆనాటి తెలుగు జాతిలో స్పూర్తి రగిలించారు. తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అని స్పూర్తిని ప్రేరేపించారు నేటి తరం ప్రఖ్యాత కవి, జ్ఞనాపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు పలువురు వారి, వారి స్థాయిలలో రాష్ట్రప్రగతికి కృషి చేశారు. కొందరు ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు తక్కువ ప్రాధాన్యత పొందారు. కారణాలు ఏవైనా మన రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి.
రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ఆమాటకు వస్తే అన్ని విషయాలలోను పరస్పర వైరుధ్యాలతో మన సమాజం కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్కన అన్నాహజారే ఉద్యమం.
తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఒకవైపు తెలంగాణ అంశం, మరో వైపు జగన్ ఫాక్టర్ తెలుగుదేశం పార్టీని సతమతం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం నిజానికి రెండువేల తొమ్మిది సంవత్సరంలో కచ్చితంగా అదికారంలోకి వస్తానని విశ్వసించింది. అందుకోసం చేయని యత్నిం లేదు.
కొమ్మినేని శ్రీనివాసరావు
గౌరవ చీఫ్ ఎడిటర్,ఎన్‌టివ.
1952 నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ,లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలను కూడా తయారు చేశాను. రాష్ట్రంలోని ఏ నియోజక వర్గ ప్రముఖులకు సంబంధించిన విశేషాలనైనా తెలుసుకోవచ్చు.పుస్తకరూపంలోకన్నా వెబ్‌సైట్‌లో మరింత మందికి అందిబాతులోకి తేవచ్చన్న లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ఇందులో ఉంచుతున్నాము.ఇది ఒకరకంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పూర్తిస్థాయి గ్రంథంగా పరిగణలోకి తీసుకోవచ్చు.జర్నలిస్టు మిత్రులకు,రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నవారికి విస్తారమైన సమాచారాన్ని దీనిద్వరా అందించవచ్చు. ఇక రాష్ట్రస్థాయిలోను ఆయా జిల్లాలోను జరిగే ముఖ్యమైన రాజకీయ పరిణామలను తెలియచేయడానికి యత్నిస్తాము.
వ్యక్తిగత వివరాలు
జర్నలిజంలో ప్రవేశించిన సంవత్సరం...1978
పనిచేసిన సంస్థలు .. ఈనాడు 1978 - 2002
ఆంధ్రజ్యోతి 2002 -2006
ఎన్‌టివి..2007 -2007
సెప్టెంబరు టివి 5..2007 సెప్టెంబరు - 2009
ఆగస్టు ఎన్‌టివి..2009 ఆగస్టు నుంచి...
రాసిన గ్రంధాలు..రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004 తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా) తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి) శాసన సభ చర్చల సరళి..1956 - 1960. శాసన సభ చర్చల సరళి..1960 - 1971.


