రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారపగ్గాలు చేపట్టిన ఏడాదికిగాని ఇవి ఒక దారిన పడలేదు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తీరు ప్రభుత్వానికి బలాన్ని ఇచ్చిందా? ప్రభుత్వ బలహీనత బయటపడిందా?

చాలా కాలం తర్వాత శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. ఐదు రోజులు జరుగుతాయా?చాలా కాలం తర్వాత శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. ఐదు రోజులు జరుగుతాయా? లేక మూడు రోజుల ముచ్చటగా ముగుస్తాయా అన్నది పక్కన బెడితే గత రెండేళ్లుగా శాసనసభ సమావేశాలు సజావుగా జరగడం లేదన్నది వాస్తవం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేక ఆటుపోట్ల మధ్య ఒక ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోవడం ఒక విశేషం అయితే వచ్చే రెండున్నర ఏళ్లు ఈయనే ఉంటారన్న నమ్మకాన్ని కలిగించడంలో ఇప్పుడు ఆయన సఫలం అవుతున్నారనే చెప్పాలి.

ఒకప్పుడు గౌతమ బుద్దుడి కధలో ఆవాలు ఇచ్చి సమస్యలు లేని ఇల్లు ఉందేమో వెళ్లి ఇచ్చి రమ్మంటాడు. అలాగే ఇంటింటికి వెళితే ఇబ్బందులు లేని ఇల్లు ఒకటి కూడా కనిపించదు. అలాగే ఇప్పుడు మన దేశంలో అవినీతి లేని రాజకీయ నాయకుడు ఏ ఒక్కరైనా దొరుకుతారా? ఈ ప్రశ్నను బహిరంగంగా వేస్తే ఎవరూ ఒప్పుకోరు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక క్లారిటీ వస్తున్నట్లుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని, కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో క్రిమినల్ అని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అంతరంగికంగా వ్యాఖ్యానిస్తున్నారు.

మనకు రాజనీతిజ్ఞులు లేకుండా పోయారు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు. వారికి కావలసింది వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. ప్రజల విశాల ప్రయోజనాలు కావు. ప్రజల మనసులలో సాధ్యమైనంతమేర విషాన్ని నింపడమే వీరి లక్ష్యం. పరస్పరం ద్వేషాలు పెంచి పోషించడమే వీరి కర్తవ్యం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాజకీయ జెఎసి నెలరోజులకు పైగా నిర్వహిస్తున్న సకలజనుల సమ్మె విజయవంతం అయినట్లా? విఫలమైనట్లా? ఈ ప్రశ్నకు ఎవరికి కావాల్సిన సమాధానం వారు చెప్పుకోవచ్చు.

ద్వేష, విద్వేషాల మధ్య ఒక సమైక్య రాష్ట్రాన్ని నడపగలమా? విబేధాలు, తగాదాలు, ఆవేశకావేశాల మధ్య ఒక రాష్ట్రాన్ని ఇదే విధంగా పాలించగలరా? ప్రతిదానికి అనుమానాలు, పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ సహ జీవనం సాగించగలరా?

దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు ఒకే రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ఉద్యమ నేతలు వేర్వేరుగా కలుసుకున్నారు. ఇద్దరి వద్ద ఆయన చెప్పింది ఒక్కటే. తెలంగాణ అంశంపై ఏమి చెప్పినా వింటాను.

ఒకవైపు సకల జనుల సమ్మె, మరోవైపు హైదరాబాద్ బంద్ కు పిలుపు, మళ్లీ రైల్ రకో- ఇలా తెలంగాణ ఆందోళనలో భాగంగా తెలంగాణ ఉద్యమ నేతలు మళ్లీ కార్యాచరణను ప్రకటించడం అందరికి ఆందోళన కలిగిస్తోంది

రాష్ట్ర చరిత్రలో పదమూడో శాసనసభ, అలాగే రాష్ట్రాన్ని పాలించిన , పాలిస్తున్న ముఖ్యమంత్రులకు ఒక ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రెండువేల తొమ్మిదిలో ఎన్నికలలో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నర నెలలకే ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.

50 YEARS IN SERVICE OF PEOPLE'S JOURNALISM 

కొమ్మినేని శ్రీనివాసరావు

గౌరవ చీఫ్ ఎడిటర్,ఎన్‌టివ.

 

1952 నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ,లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలను కూడా తయారు చేశాను. రాష్ట్రంలోని ఏ నియోజక వర్గ ప్రముఖులకు సంబంధించిన విశేషాలనైనా తెలుసుకోవచ్చు.పుస్తకరూపంలోకన్నా వెబ్‌సైట్‌లో మరింత మందికి అందిబాతులోకి తేవచ్చన్న లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ఇందులో ఉంచుతున్నాము.ఇది ఒకరకంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పూర్తిస్థాయి గ్రంథంగా పరిగణలోకి తీసుకోవచ్చు.జర్నలిస్టు మిత్రులకు,రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నవారికి విస్తారమైన సమాచారాన్ని దీనిద్వరా అందించవచ్చు. ఇక రాష్ట్రస్థాయిలోను ఆయా జిల్లాలోను జరిగే ముఖ్యమైన రాజకీయ పరిణామలను తెలియచేయడానికి యత్నిస్తాము.

 

వ్యక్తిగత వివరాలు

 

జర్నలిజంలో ప్రవేశించిన సంవత్సరం...1978

 

పనిచేసిన సంస్థలు .. ఈనాడు 1978 - 2002

 

ఆంధ్రజ్యోతి 2002 -2006

 

ఎన్‌టివి..2007 -2007

 

సెప్టెంబరు టివి 5..2007 సెప్టెంబరు - 2009

 

ఆగస్టు ఎన్‌టివి..2009 ఆగస్టు నుంచి...

 

రాసిన గ్రంధాలు..రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004 తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా) తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి) శాసన సభ చర్చల సరళి..1956 - 1960. శాసన సభ చర్చల సరళి..1960 - 1971.

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature