జగన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదహారు మందిపై ఎట్టకేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేశారు. మరో ఎమ్మెల్యే రాజీనామాను ఆయన ఆమోదించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆరు నియోజకవర్గాలు, కోస్తాలో ఒక నియోజకవర్గం మొత్తం ఏడింటితో కలిపి ఈ పదిహేడు ఉప ఎన్నికలు ఒకేసారి రాకుండా జాగ్రత్తపడ్డారు.

పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆనాడు రాష్ట్రంలో ఒక ఘటన జరిగింది. ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఎన్.టి.రామారావు ఉన్నారు. అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమాన్ని మహిళలు నిర్వహిస్తే, ఆ తర్వాత ఎన్.టి.ఆర్. దానిని హైజాక్ చేసి మద్య నిషేద ఉద్యమానికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఎలా ఉందో, రాష్ట్ర బడ్జెట్ కూడా అదే మాదిరి గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఎప్పుడూ బడ్జెట్ ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. సామాన్యుడికి అర్ధం కాకుండా, పెద్ద, పెద్ద అంకెలతో ఊదర కొట్టడమే బడ్జెట్ లక్ష్యంగా కనబడుతుంది.

శాసనసభకు అధ్యక్షత వహించే సబాపతుల వ్యవస్థ కూడా తరచు పరీక్షలను ఎదుర్కుంటుంది. నిజానికి శాసనసభ స్పీకర్ కు సమావేశాలు జరిగే నలభై లేదా ఏభై రోజులే ఎక్కువగా పని ఉండాలి. కాని ఫిరాయింపుల నిషేదం చట్టం వచ్చిన తర్వాత వారి పాత్ర మారిపోయింది.

మన దేశంలో, మన సమాజంలో అవినీతిగా బతకడం కన్నా నీతి వంతంగా జీవించడం ఎంతో కష్టం అవినీతి ముద్ర వేస్తే జనం చెవులు కొరుక్కోవచ్చు. అంతకు మించి పెద్దగా సమస్యలు రావు. కాని నీతివంతంగా ఉండాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. జనం కూడా నీదేం పోయింది.

రాష్ట్రానికి ఏదో శాపం పట్టుకుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు యధాతధంగా కొనసాగితే రాష్ట్రం బాగా నష్టపోతుంది. పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు వెనుకాడతారు. అభివృద్ది కుంటుపడితే నిరుద్యోగం ప్రబలుతుంది. అది మరింత ప్రమాద పరిస్థితికి దారి తీస్తుంది.

kommineni srinivas, journalist, tdp chandrababu naidu, chandrababu telugudesam party, ysr party jagan mohan reddy, cm kiran kumar reddyరాజకీయ పార్టీలకు సాధారణంగా అధికారమే పరమావధి అవుతుంది. తద్వారానే ప్రజలకు సేవ చేయడం గాని, తమ విదానాలను అమలు చేయడం గాని జరుగుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. రాజకీయ పార్టీలు అధికారానికి దూరంగా ఉంటే సుదీర్ఘకాలం మనగలగడం కష్టం అవుతుంది.

bjp kishan reddy,  bharateeya janat party ratha yatra, rata yatra kishan reddy, bharateeya janata party ratayatraభారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణలో రధయాత్రకు సన్నద్దం అవుతున్నారు. బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర మొదలవుతోంది. దీనికి భారీ హంగులు, ఆర్భాటాలు చేస్తున్నారు.

తెలంగాణలో గత వారం రోజులలో ఇద్దరు ప్రముఖులు చేసిన పర్యటనలకు అత్యంత ప్రాముఖ్యత లభించింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అలాగే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎమ్.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లు చేసిన యాత్రలు సఫలం అవడం ఆశ్చర్యకరం కాకపోవచ్చు కాని, ఆసక్తికరమైనవని చెప్పకతప్పదు. వీరిద్దరు రైతుల సమస్యలపై తెలంగాణ లో యాత్రలు చేశారు.

జగన్ ఆస్తుల కేసులో ఒక కీలకమైన మలుపు జగతి కంపెనీలకు వైస్ ఛైర్మన్ గా ఉన్న విజయసాయి రెడ్డి అరెస్టు. ఏ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు. తప్పు లేదు.

రాష్ట్ర చరిత్రలో రెండువేల పదకొండుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఏదో ఒక విశిష్టత ఉండవచ్చు. కాని ఈ 2011 మాత్రం పలు రకాలుగా విశిష్టమైనది చెప్పాలి.

మన దేశంలో న్యాయ వ్యవస్థ ఇంతవరకు పెద్ద సంక్షోభాలను ఎదుర్కోలేదు. అలాఅని విమర్శలకు అతీతంగా లేదు. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ కపాడియానే ఒక సందర్భంలో న్యాయవ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, దిగజారుతున్న విలువల గురించి ఆవేదన వ్యక్తం చేశారు.

50 YEARS IN SERVICE OF PEOPLE'S JOURNALISM 

కొమ్మినేని శ్రీనివాసరావు

గౌరవ చీఫ్ ఎడిటర్,ఎన్‌టివ.

 

1952 నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ,లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలను కూడా తయారు చేశాను. రాష్ట్రంలోని ఏ నియోజక వర్గ ప్రముఖులకు సంబంధించిన విశేషాలనైనా తెలుసుకోవచ్చు.పుస్తకరూపంలోకన్నా వెబ్‌సైట్‌లో మరింత మందికి అందిబాతులోకి తేవచ్చన్న లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ఇందులో ఉంచుతున్నాము.ఇది ఒకరకంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పూర్తిస్థాయి గ్రంథంగా పరిగణలోకి తీసుకోవచ్చు.జర్నలిస్టు మిత్రులకు,రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నవారికి విస్తారమైన సమాచారాన్ని దీనిద్వరా అందించవచ్చు. ఇక రాష్ట్రస్థాయిలోను ఆయా జిల్లాలోను జరిగే ముఖ్యమైన రాజకీయ పరిణామలను తెలియచేయడానికి యత్నిస్తాము.

 

వ్యక్తిగత వివరాలు

 

జర్నలిజంలో ప్రవేశించిన సంవత్సరం...1978

 

పనిచేసిన సంస్థలు .. ఈనాడు 1978 - 2002

 

ఆంధ్రజ్యోతి 2002 -2006

 

ఎన్‌టివి..2007 -2007

 

సెప్టెంబరు టివి 5..2007 సెప్టెంబరు - 2009

 

ఆగస్టు ఎన్‌టివి..2009 ఆగస్టు నుంచి...

 

రాసిన గ్రంధాలు..రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004 తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా) తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి) శాసన సభ చర్చల సరళి..1956 - 1960. శాసన సభ చర్చల సరళి..1960 - 1971.

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature