ALSO ON TELUGUONE N E W S
  ఏయన్నార్ మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుశాంత్ నటించిన వినోదాత్మక సన్నివేశాలు కొన్నిటిని దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ఫైనల్ కాపీలో తీసేశారు. అవును... ఇది నిజం. స్వయంగా సుశాంత్ చెప్పాడు. 'అల వైకుంఠపురము'లో తాను నటించిన కొన్ని ఫన్నీ సీన్స్ ఫైనల్ ఎడిట్ లో లేవని అతడు స్పష్టం చేశాడు. తాను నటించిన సీన్స్ ఉండటం కంటే సినిమా లెంగ్త్ కూడా ఇంపార్టెంట్ అని సుశాంత్ అన్నాడు. లెంగ్త్ ఎక్కువ అవుతుందని సుశాంత్ సీన్లు త్రివిక్రమ్ లేపేశారన్నమాట. అవి యుట్యూబ్ లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు చూసే ఛాన్స్ దక్కుతుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అల... వైకుంఠపురము' సినిమాలో జయరామ్, టబు కుమారుడిగా (అసలు కొడుకు అల్లు అర్జున్ అనుకోండి. మురళీ శర్మ కొడుకు సుశాంత్. అయితే, మురళీ శర్మ ఆసుపత్రిలో బిడ్డలను మారుస్తాడు) కీలక పాత్రలో సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఉన్నంతలో అతడు బాగా చేశాడు. 'రాములో రాములా' పాటలో నాగస్వరం స్టెప్ తనకంటే సుశాంత్ బాగా చేశాడని అల్లు అర్జున్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక అందులో సుశాంత్ రెండు సిగరెట్స్ కాలుస్తూ, మందు కొట్టే సీన్ యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. అలా మిగతావి ఎప్పుడు రిలీజ్ చేస్తారో?
  హిందీ టీవీ క్వీన్ ఏక్తా క‌పూర్ నిర్మిస్తోన్న 'క‌సౌటీ జింద‌గీ కే 2' సీరియ‌ల్‌లో అనురాగ్ బ‌సుగా లీడ్ రోల్ చేస్తున్న పార్థ్ సంతాన్ ఆదివారం కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాడు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేసిన అత‌ను, గ‌త కొద్ది రోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా మెల‌గిన వాళ్లంద‌రినీ కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరాడు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు సెల్ఫ్‌-క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు అత‌ను తెలిపాడు. దీంతో ఆ సీరియ‌ల్ షూటింగ్‌ను మూడు రోజుల పాటు నిలిపి వేస్తున్న‌ట్లు ఏక్తా క‌పూర్ నిర్మాణ సంస్థ‌కు చెందిన అధికార ప్ర‌తినిధి తెలిపారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకంటూ షూటింగ్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నామ‌ని ఆ ప్ర‌తినిధి చెప్పారు. న‌టీన‌టుల‌కు, ఇత‌ర సిబ్బందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించి, రిజ‌ల్ట్ వ‌చ్చిన త‌ర్వాతే షూటింగ్‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అందిన స‌మాచారం ప్ర‌కారం జూన్ 26 నుంచి 'క‌సౌటీ జింద‌గీ కే '2 సీరియ‌ల్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పార్థ్‌. శుక్ర‌వారం అత‌నికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డిన అత‌ను ఆ మ‌రుస‌టి రోజు టెస్ట్ చేయించుకున్నాడు. ఆదివారం పాజిటివ్‌గా తేలింది. పార్థ్ ఇద్ద‌రు న‌టుల‌తోటే స‌న్నివేశాల్లో పాల్గొన్నాడు. ఒక‌రు అత‌ని సోద‌రి పాత్ర‌ధారి కాగా, మ‌రొక‌రు కీల‌క పాత్ర‌ధారి క‌ర‌ణ్ ప‌టేల్. టీవీ స‌ర్కిల్స్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. పార్థ్‌ ఇటీవ‌ల త‌న క‌జిన్స్‌ను క‌లుసుకోడానికి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు ఫ్లైట్‌లో వ‌చ్చాడు. అత‌డికి కొవిడ్‌-19 సోక‌డానికి ఈ ప్ర‌యాణం కార‌ణం కావ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా వస్తుందని ఎవరూ ఊహించలేదు. అమితాబ్, అభిషేక్ కరోనా బారిన పడ్డారని ఆందోళన చెందిన అభిమానులు... అభిషేక్ భార్య, ప్రముఖ కథానాయిక ఐశ్వర్య, ఈ దంపతుల కుమార్తె ఆరాధ్యకు కరోనా లేదని కాస్త ఊరట చెందారు. ఆ ప్రశాంతత పదిమందికి చేరేలోపు పిడుగులాంటి న్యూస్. తరవాత రోజుకి ఐశ్వర్య, ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. జయాబచ్చన్ మినహా మిగతా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కరోనా పాజిటివ్ గా తేలారు. దాంతో బచ్చన్ ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్ టెన్షన్ పడుతోంది. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ముంబైలో భారీ భవంతి ఉంది. ఆ లంకంత కొంపలోకి ఎవరుపడితే వాళ్ళు వెళ్ళడానికి, రావడానికి వీలు పడదు. కేవలం సన్నిహితులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని పరీక్షలు చేసిన అనంతరం అనుమతించారట. అటువంటిది బచ్చన్ ఫ్యామిలీకి కరోనా రావడంతో గత పది, పదిహేను రోజుల వ్యవధిలో బచ్చన్ కుటుంబ సభ్యులను కలిసిన వాళ్లు, కరోనా టెస్టులకు రెడీ అవుతున్నారు. అభిషేక్ బచ్చన్ 'బ్రీత్: ఇన్‌టు ద‌ షాడోస్' వెబ్ సిరీస్ లో నటించిన అమిత్ స‌ద్‌, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నప్పటికీ... కొవిడ్19 టెస్టు చేయించుకుంటానని చెప్పాడు. అలాగే, బచ్చన్ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలిగిన మిగతావాళ్ళూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
  ఇప్ప‌టి దాకా టాలీవుడ్‌లో చిన్న సినిమాలే ఓటీటీలో విడుద‌ల‌వుతూ వ‌స్తున్నాయి. అమృతా రామ‌మ్‌, కృష్ణ అండ్ హిజ్ లీల‌, 47 డేస్‌, భానుమ‌తి రామ‌కృష్ణ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ‌వ‌డం చూశాం. ఇప్పుడు ఓ క్రేజీ సినిమా ఓటీటీలో నేరుగా రిలీజ‌వ‌నుంద‌నే ప్ర‌చారం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో జోరుగా న‌డుస్తోంది. ఆ సినిమా.. ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టించిన 'క్రాక్‌'. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఆడియెన్స్‌లోనే కాకుండా బిజినెస్ వ‌ర్గాల్లోనూ మంచి అంచ‌నాలే ఉన్నాయి. ర‌వితేజ మునుప‌టి సినిమాలు స‌రిగా ఆడ‌క‌పోయినా, గోపీచంద్‌తో ఆయ‌న చేసిన సినిమాలు 'డాన్ శీను', 'బ‌లుపు' సినిమాలు బాగానే ఆడాయి. ఈ నేప‌థ్యంలో వాళ్ల కాంబినేష‌న్ లేటెస్ట్ మూవీ 'క్రాక్' కోసం ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మామూలు ప‌రిస్థితులు ఉన్న‌ట్ల‌యితే మే నెల‌లోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వ‌చ్చి ఉండేది. అయితే ఇప్ప‌ట్లో థియేట‌ర్లు ఓపెన్ అయ్యే అవ‌కాశాలు స్వ‌ల్పంగా క‌నిపిస్తుండ‌టం, ఓపెన్ చేసినా క‌రోనా భ‌యంతో జ‌నం థియేట‌ర్ల‌కు రారేమోన‌నే అనుమానాల‌తో నిర్మాత‌లు ఓటీటీలో నేరుగా సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అక్ష‌య్‌కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సైతం త‌న లేటెస్ట్ ఫిల్మ్ 'ల‌క్ష్మీ బాంబ్‌'ను హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుండ‌టంతో.. ఆ ప్రేర‌ణ‌తో 'క్రాక్‌'ను ఓటీటీలో రిలీజ్ చెయ్య‌డానికి నిర్మాత‌ల‌కు ఇప్ప‌టికే ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం ఒక పెద్ద స్ట్రీమింగ్ సైట్‌తో వాళ్లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఆశించిన రేటు గ‌నుక వ‌చ్చేట్ల‌యితే ఆ సైట్‌కు అమ్మ‌డానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ చ‌ర్చ‌లు ఫ‌లించిన‌ట్ల‌యితే ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ‌య్యే తొలి భారీ సినిమాగా 'క్రాక్' నిల‌వ‌నున్న‌ది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
  వివాదాస్పద కథలను ఎంపిక చేసుకుంటూ, చకచకా సినిమాలు చేస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూకుడుకు ఎవరూ సాటి రారు, రాలేరు. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న టాలీవుడ్ దర్శకులు కొత్త కథలపై ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంత షూటింగ్ చేసిన డైరెక్టర్స్, మళ్లీ ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయోనని ఎదురు చూపులు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్‌డౌన్‌లో చకచకా సినిమాలు తీస్తున్నారు. ఏటీటీలో 'క్లైమాక్స్', 'నగ్నం' సినిమాలు రిలీజ్ చేసిన వర్మ, ప్రస్తుతం అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణాతో 'థ్రిల్లర్' సినిమా చేస్తున్నారు. 'పవర్ స్టార్' షూటింగ్ చేస్తున్నారు. అమృత, ప్రణయ్ కథ ఆధారంగా 'మర్డర్' అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా కొత్తగా 'లాక్‌డౌన్‌' అని ఇంకో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాల్లో నటించిన శ్రీ తేజ్ గుర్తున్నాడా? ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్'లో వైఎస్ రాజరేఖర్ రెడ్డి పాత్ర పోషించాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చంద్రబాబుగా నటించాడు. అతడు, పూజితా పొన్నాడ ప్రధాన పాత్రధారులుగా వర్మ 'లాక్‌డౌన్' తీయనున్నారు. ఆల్రెడీ 'కరోనా వైరస్' ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తున్నారు. అవి కంప్లీట్ అయిన తరవాత విడుదల చేయనున్నారు.
సంసారాన్ని ఓ ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు కాస్త ఆదమరచి ఉన్నా, వెనకబడిపోవాల్సిందే! ఆ పొరపొటు ఒకోసారి భాగస్వామిని చేజార్చుకునేంతవరకూ వెళ్లవచ్చు. లేదా శాశ్వతంగా మన పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టవచ్చు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు. ఇంతకీ వారి సలహాలు ఏమిటంటే...   కుటుంబంలో ఆఫీసు పెట్టొద్దు కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనలేరు. కానీ కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించకపోతే మన పడే కష్టానికి అర్థమే ఉండదు. కనీసం ఇంట్లో ఉండే సమయంలో అయినా టీవీ, ఫేస్‌బుక్‌లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందే. ఆఫీసులో పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి చెప్పి ఉంచితే... మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన బలపడకుండా ఉంటుంది.   ఆఫీసరు మీద ఆవేశం ఇంట్లో వద్దు చాలామంది చేసే పొరపాటే ఇది. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ తాలూకు కోపాన్ని ఇంట్లో వెళ్లగక్కుతూ ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు. ఊరంతా తిరిగివచ్చి, ఇంటి బయట చెప్పులు విడవడంతోనే... రోజువారీ చిరాకులన్నీ మర్చిపోయి మనిషిలా మెలగమని సూచిస్తుంటారు పెద్దలు.   అనుమానాస్పదమైన బంధాలు వద్దే వద్దు జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ స్నేహం సంసారంలోకి ప్రవేశిస్తోందన్న అనుమానం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే! మీ స్నేహాన్ని భాగస్వామి అపార్థం చేసుకుంటున్నారనో, మీ బంధం హద్దులు మీరడం లేదనో అనుకుంటే ఉపయోగం లేదు. ఆ పరిస్థితిని దాటుకుని మొండిగా సాగే స్నేహం సంసారం చీలిపోయేందుకు దారితీస్తుంది.   రహస్యాలు దాచవద్దు భార్యాభర్తల మధ్య మిగిలే రహస్యాలు ఎప్పటికైనా అపనమ్మకానికి దారితీస్తాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అప్పులకి సంబంధించిన వ్యవహారాలు వారితో పంచుకుని తీరాల్సిందే!   మనస్పర్థలు సహజమే రోడ్డు మీద ఓ ఇద్దరు మనుషులు ఎదురుపడితేనే గొడవలు మొదలైపోతుంటాయి. అలాంటిది ఇద్దరు మనుషులు ఏళ్లతరబడి కలిసి జీవిస్తే మనస్పర్థలు రాకుండా ఎలా ఉంటాయి. ఆ బేధాలను దాటుకుని ముందుకు సాగడం ఎలా అన్నది ఓ నైపుణ్యం. కోపంలో వాదించకుండా, అహంతో ఆలోచించకుండా, విచక్షణ కోల్పోకుండా పట్టువిడుపులకి సిద్ధపడుతూ సాగితేనే స్పర్థని దాటగలం.                              - నిర్జర.
  ఇది చాలాకాలం క్రితం జరిగిన కథ. అప్పట్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతనికి జీవితసత్యం ఏమిటో తెలుసుకోవాలని తెగ తపనగా ఉండేది. ఆ తపనతో అతను ఎక్కడెక్కడో వెతికాడు. ఎవరెవరినో కలిశాడు. అతను వెళ్లిన చోట, అతను కలిసినవారు రకరకాల జవాబులు చెప్పారు. కానీ వాటిలో ఏ ఒక్క జవాబు అతనికి తృప్తిగా తోచలేదు. కుర్రవాడు అలా తిరుగుతూ తిరుగతూ ఉండగా అతనికి ఎవరో ఓ సలహా చెప్పారు. ‘చూడు! ఇలా ఎంత తిరిగినా నీకు తగిన సమాధానం దొరకడు. ఈ ఊరి చివర ఉన్న అడవి మధ్యలో ఒక పాత బావి కనిపిస్తుంది. ఆ బావిలోకి తొంగిచూసి ఎవరైనా తమ మనసులోని ప్రశ్నని అడిగితే, తప్పకుండా జవాబు లభిస్తుంది,’ అని అన్నారు.   ఆ సలహా విన్న కుర్రవాడు బావి దగ్గరకు వెళ్లనే వెళ్లాడు. అందులోకి తొంగిచూసి... ’జీవిత సత్యం ఏమిటి?’ అని అడిగాడు. ‘ఈ అడవి దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో మూడో కూడలి దగ్గరకి వెళ్లి చూడు. అక్కడ నీకు జీవిత సత్యం ఏమిటో అర్థమవుతుంది,’ అని చెప్పింది బావి. బావి చెప్పినట్లుగానే, కుర్రవాడు అడవి తర్వాత వచ్చే గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామంలోని మూడో కూడలి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాడు. అక్కడ అతనికి మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. మొదటి దుకాణంలో ఇనప ముక్కలు అమ్ముతున్నారు, రెండోది కలప దుకాణం, మూడుదాన్లో తీగలు అమ్మకానికి ఉన్నాయి. అంతకుమించి వాటిలో ఎలాంటి ప్రత్యేకతా ఆ కుర్రవాడికి కనిపించలేదు. వాటిలో జీవిత సత్యం ఏమిటో ఆ కుర్రవాడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కుర్రవాడు నిరాశతో మళ్లీ బావి దగ్గరకు వెళ్లాడు. ‘నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ కూడలి దగ్గరకు వెళ్లాను. అక్కడ ఓ మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. వాటిలో జీవితసత్యం ఏముందో నాకు అర్థం కాలేదు!’ అని నిష్టూరమాడాడు.   ‘కంగారుపడకు. వాటిలో దాగిన జీవితసత్యం నీకు నిదానంగా బోధపడుతుంది. ఆ పరిపక్వత నీకు వచ్చిన రోజున నేను చెప్పిన జవాబు తప్పు కాదని తెలుస్తుంది,’ అని బదులిచ్చింది బావి. కుర్రవాడు ఉసూరుమంటూ తన గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన రోజువారీ పనులలో పడిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుర్రవాడికి వయసు, ఆ వయసుతో పాటుగా లోకజ్ఞానం పెరిగింది. జీవితం మీద తనకంటూ కొంత అవగాహన ఏర్పడింది. అలాంటి ఒక రోజున అతను పడుకుని ఉండగా... ఎక్కడి నుంచో ఒక సితార మోగుతున్న సంగీతం వినిపించింది. ఆ మధురమైన సంగీతం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ సంగీతం వింటూ అతను పరివశించిపోయడు. హఠాత్తుగా... ఆ సంగీతంలో అతనికి జీవితసత్యం స్ఫురించింది. లోహం, చెక్క, లోహపు తీగలు... ఈ మూడు విడివిడిగా ఎందుకూ పనికిరాని చెత్తలాగా కనిపిస్తాయి. కానీ ఈ మూడింటి కలియికతో సితార్లాంటి అందమైన వాయిద్యం రూపొందుతుంది. ఆ వాయిద్యాన్ని మీటితే అద్భుతమైన సంగీతం జనిస్తుంది. జీవితం కూడా ఇంతే! జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కావల్సిన ముడిసరుకు అంతా ప్రకృతి మనకు ఇచ్చింది. కానీ మనలో ఉన్న సమార్థ్యాన్ని మర్చిపోయి... ఎందుకూ పనికిరానివారమని మధనపడిపోతాం. విధి మనకి అన్యాయం చేసిందని ఆరోపిస్తాం. నిజంగా సరైన విచక్షణే ఉంటే... కనిపించని విధి మీద నిందలు వేయడం మాని, అందుబాటులో ఉన్న వనరులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే అన్నింటికీ మించిన జీవితసత్యం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
భారత్ మొత్తం కరోనా తో గజగజలాడుతోంది. ఇక తెలంగాణాలో ఐతే హైదరాబాద్ లో కరోనా ఉధృతంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి రంగంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? ప్రజల బాగోగుల గురించి ప్రతి సంవత్సరం పూజారులు అడిగేవారు. ఐతే ఈసారి మాత్రం కరోనా వైరస్ గురించి అమ్మవారిని అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? దానికి ప్రజలు ఏం చెయ్యాలి? అని అడగగా ఆమె తన భవిష్యవాణిలో ప్రజలకు కొన్ని హెచ్చరికలు చేశారు. రానున్న కాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అంతే కాకుండా "ఎవరు చేసుకున్న కర్మ వాళ్లు అనుభవించక తప్పదని" అమ్మవారు హెచ్చరించారు. ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఐతే అంతకు మించి కొంత మంది ప్రజలు ఇలా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనాను అదుపు చేయడానికి తాను సిద్ధమేనని, అయితే తనను ఐదు వారాలు కొలవాలని, అలాగే యజ్ఞ యాగాదులు చేయాలనీ చెప్పారు. ప్లేగువ్యాధి అంతరించిన తర్వాత 19వ శతాబ్దం మొదట్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది బోనాలకు లక్షల్లో జనం హాజరయ్యేవారు. ఐతే ఈ సంవత్సరం కరోనా వల్ల కొద్దిమంది మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు.
కాపులను బీసీలలో చేర్చాలని తీవ్రంగా ఉద్యమం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా తనను కుల ద్రోహి, గజదొంగ వంటి దారుణమైన వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో మేధావులతో కలిసి తాను ఉద్యమం నడిపానని ఆయన చెప్పారు. కాపు ఉద్యమం ద్వారా నిజానికి తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని అయన తెలిపారు. కొంత మంది తనను రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారని అయన తెలిపారు . ఇప్పుడు కాపు రిజర్వేషన్ బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం తనను తీవ్రంగా బాధిస్తోందని అయన వాపోయారు. ఐతే ఉద్యమ సందర్భానుసారంగా రూపురేఖలు మార్చుకుంటోందని, దీనితో తన జాతికి ఏదో ఒక విధంగా మేలు జరగాలని తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని అయన ఈ సందర్భంగా తెలిపారు.
ఏపీలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న ఒక్క రోజే 1933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 17,624 శాంపిల్స్ పరీక్షించగా రికార్డ్ స్థాయిలో 1933 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతే కాకుండా నిన్న 19 మంది మృత్యువాత పడ్డారు. దీనితో మృతుల సంఖ్య 328 కి చేరుకుంది. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168 కి చేరింది. ఐతే వీరిలో 15,412 మంది కోలుకోగా ప్రస్తుతం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంత మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఉండగా ఎక్కువ మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
మూడు దశల్లో మూడు విధాలుగా నివారణ చర్యలు.. భయం బలహీనుల్ని చేస్తుంది.. కరోనా ఎవరికైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావల్సిందే. ప్రతి కుటుంబం తమ ఇంటిని అత్యవసరమైన పరిస్థితుల్లో ఐసోలేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోోవాలి. ప్రాథమిక చికిత్స కోసం వీటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. పారాసెటమాల్ విటమిన్ సి, డి 3 సప్లిమెంట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఆక్సిమీటర్   కోవిడ్ మూడు దశలు: కోవిడ్ 19 మానవ శరీరంలోకి చేరిన తర్వాత మూడు దశల్లో తన ప్రభావం చూపిస్తోంది.  ఒక్కక్కరిలో ఒకవిధమైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించి నివారణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. - ముక్కులో కొందరికీ ముక్కు చేరిన ఈ వైరస్ అక్కడే వుంటుంది. దీనిని నివారించడానికి ఆవిరి పట్టడం ఒక్కటే సరైన మార్గం. -గొంతులో గొంతు నొప్పితో బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు వేడి నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేస్తే చాలు. 2,3రోజులు వరుసగా ఉదయం, రాత్రి వేడినీటితో గార్లింగ్ చేస్తే వైరస్ ను అరికట్టవచ్చు. -ఊపిరితిత్తులలో ముక్కు, గొంతును దాటి ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఈ లక్షణాలు కనిపించేవారు వేడి నీటి గార్లింగ్ చేస్తూ ప్రాణాయామం చేయాలి,విటమిన్ సి, బి కాంప్లెక్స్, ,పారాసెటమాల్ వేసుకోవాలి. ఆక్సిమీటర్ తో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో  ఆసుపత్రికి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనించాలి. సాధారణ 98-100 ఉండాలి. అయితే 80కన్నా తగ్గితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే సరి. లేకపోతే  ఆసుపత్రిలో చేరాలి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్లు చేతులు, ముఖం కడుక్కోవాలి. కరోనా అనగానే భయపడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల వైరస్ ల మాదిరిగానే దీన్ని పరగణిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా కన్న ముందు భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే దినుసుల్లో కొన్ని వంటింట్లో ఉండే పొపుల డబ్బాను ఔషధాల పెట్టెగా చెప్పవచ్చు. మన పూర్వీకులు ఎంతో అనుభవంతో కొన్ని రకాల గింజలను మన ఆహారంలో భాగంగా చేర్చారు. వాటిలో కొన్నింటి గురించి ... - నల్లమిరియాలు వీటినే క్వీన్ ఆఫ్ స్పెషల్ గా పిలుస్తారు. నల్లమిరియాల కి ఆయుర్వేదంలో చాలా విశిష్ట స్థానం ఉంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి పాలల్లో చిటికెడు మిరియాలపొడి వేసుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫం అంతా పోతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. వెల్లుల్లి మిరియాలు కాంబినేషన్ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి. మిరియాల టీ, అల్లం మిరియాల టీ రోజూ తీసుకుంటే అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. - జీలకర్ర జీలకర్ర బెల్లం లేకుండా హిందూ సంప్రదాయంలో పెండ్లి జరగదు.  జీలకర్ర ఆవాలు పోపు లేనిదే చాలామందికి పప్పు అన్నం గొంతు దిగదు. శరీరంలోని ఉష్ణాన్ని తీసేసే శక్తి జీలకర్రకు ఉంది.దీనిలోని పాలీఫినాల్స్ అనే పదార్థం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది - నట్స్ శరీరానికి ఇమ్యూన్ బూస్టర్ గా నట్స్  పనిచేస్తాయి యాంటీఆక్సిడెంట్ గాను, రోగనిరోధక శక్తి పెంచడంలోనూ గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ గింజలు రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. - బాదం పప్పు ఇంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. బాదం, గసగసాలు రెండు కలిపి పొడిగా చేసి పాలలో కలుపుకుని తాగితే శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. - అవిసె గింజలు గింజల్లో కెల్ల చాలా ప్రత్యేకమైన స్థానం. ఇందులో ఉన్న ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,  ఒమేగా-3 కొవ్వు కరిగించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని ఫైటో ఈస్ట్రోజెన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన గ్రహించే శక్తి ని ఇవి ఇస్తాయి. ఇవి రోజూ తీసుకుంటే... శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంతో, రోగనిరోధక శక్తి పెంచడంలో లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, వెల్లుల్లి బాగా పనిచేస్తాయి. - లవంగాలు ఇందులో ఉండే ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మెదడు పని తీరును చురుగ్గా చేస్తాయి. అంతేకాదు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతాయి.  వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి,  విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, కఫం, పంటినొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లవంగాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. - దాల్చిన చెక్క శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క ది కీలక పాత్ర. ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.-  అంతేకాదు శరీరంలోని రక్త కణాలు ఆక్సిజన్ను గ్రహించే శక్తిని కూడా పెంచుతాయి. -అల్లం రోజూ అల్లం తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తోంది. రోజూ పరగడుపున అల్లం తేనెతో కలిపి తీసుకోవడం ఎంతో ఉత్తమం. అల్లం తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం. -వెల్లుల్లి అల్లము వెల్లుల్లి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమం లేనిదే నాన్ వెజ్ కర్రీలకు రుచి రాదు. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్న వెల్లుల్లి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. గుండె జబ్బులను వెల్లుల్లి నివారిస్తుంది.
గుమ్మడి, బొప్పాయ రోగనిరోధకశక్తి పెంచుతాయి ఎనర్జీ బూస్టర్ గా పనిచేసే సిట్రస్ జాతి పండ్లు కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి.  ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను మనం ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర భాగాల పని తీరు సక్రమంగా సాగుతుంది. సీజనల్ వచ్చే అనేక వ్యాధుల నుంచి,  కరోనా లాంటి భయంకర రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...  గుమ్మడి కాయ గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. బొప్పాయి బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజాయ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో  విటమిన్ లోపాలు ఉండవు . అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. - కివి ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి. - నిమ్మకాయ సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. - నారింజ జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు  ఆరెంజ్ రసం తాగితే  తక్షణం శక్తి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.  - ఉసిరి ఔషధాల సిరి గా ఉసిరిని చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండు రకాల ఉసిరి లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే ఉసిరిలో అధిక రక్తస్రావాన్ని నివారించేలో లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూరగాయలు లోనే కాకుండా ఔషధాలలో ఎక్కువగా వాడతారు. - అరటిపండు అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. - పుచ్చకాయ ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఆకట్టుకునే పుచ్చకాయ సీజనల్ లోనే లభించేది. కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు మార్కెట్లో కనిపిస్తుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. - అల్ల నేరేడు సీజనల్ గా  వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లు కు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.  చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.