ALSO ON TELUGUONE N E W S
  స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సంక్రాంతి హిట్ 'అల... వైకుంఠపురములో' సినిమాలో టబు భర్తగా నటించిన జయరామ్ గుర్తున్నాడా? మలయాళంలో ఆయన స్టార్ యాక్ట‌ర్‌. ఇంతకు ముందు కమల్ హాసన్ 'పంచతంత్రం'తో తెలుగు ప్రేక్షకులు కొందరికి అతడు గుర్తే. అనుష్క 'భాగమతి'లోనూ నటించారు. ఇప్పుడీయనకు తెలుగులో మరో భారీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ప్రభాస్ కథానాయకుడిగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రకు జయరామ్ ను ఎంపిక చేశారు. ఆ పాత్ర ఏమిటన్నది కొన్ని రోజులు సస్పెన్సు. ఇందులో పూజా హెగ్డే తండ్రి పాత్రలో మురళీశర్మ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆల్రెడీ లుక్ ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
  సాజిద్-వాజిద్ కుటుంబానికి మరో షాక్. వాజిద్ మృతి నుండి కోలుకోకముందే, అతడి అంత్యక్రియలు పూర్తయిన అతి కొద్ది సమయానికే కుటుంబమంతా ఆసుపత్రికి పరుగులు తీసింది. అతడు మరణించిన కొన్ని గంటల్లో వాజిద్ ఖాన్ తల్లి రెజీనా కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబై మహానగరంలోని సురానా సేథియా ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. వాజిద్ ఖాన్ కూడా అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు రెజీనా ఖాన్‌ త్వరగా కోలుకోవాలని సాజిద్-వాజిద్ కుటుంబం సహా వాళ్లను అభిమానించే శ్రోతలు, సన్నిహితులు, హిందీ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు దేవుని ప్రార్థిస్తున్నాను. వాజిద్ ఖాన్ మృతిపై హిందీ చిత్ర పరిశ్రమలో తొలుత భిన్న కథనాలు వినిపించాయి. అతడికి హార్ట్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఆ కారణంగా మరణించి ఉంటాడని పలువురు ఊహించారు. అయితే అతడి సోదరుడు సాజిద్ ఖాన్.. కరోనా వైరస్ కారణంగా వాజిద్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సోమవారం ముంబై లోని ముస్లిం స్మశానవాటికలో వాజిద్ అంత్యక్రియలు నిర్వహించారు. అతి కొద్దిమంది స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ కార్యక్రమాలు జరిగాయి.
  మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ ప్ర‌స్తుతం ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. కొంత కాలంగా అత‌ను చేస్తున్న సినిమాలేవీ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలు తీసుకు రావ‌ట్లేదు. అయిన‌ప్ప‌టికీ అత‌ని చేతిలో ఆస‌క్తిక‌ర చిత్రాలున్నాయి. 'గౌత‌మ్ నందా' మూవీ త‌ర్వాత మ‌రోసారి అత‌ను సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌నున్న‌ది. ఇందులో ఫుల్‌బాల్ కోచ్‌గా గోపి క‌నిపించ‌నున్నాడు. దీని త‌ర్వాత‌ త‌న కెరీర్‌కు విల‌న్‌గా 'జ‌యం' మూవీతో పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ డైరెక్ష‌న్‌లో 'అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ' మూవీని చేసేందుకు అత‌ను సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంద‌ని స‌మాచారం. ఇందులో వేంక‌ట‌ర‌మ‌ణ క్యారెక్ట‌ర్‌ను గోపీ చేయ‌నుండ‌గా, అలిమేలుమంగ పాత్ర‌ను ఎవ‌రు చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఇద్ద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. ఒక‌రు గోపీతో ఇదివ‌ర‌కు స‌రైన జోడీ అనిపించుకున్న అనుష్క కాగా, మ‌రొక‌రు ఇప్ప‌టికీ టాప్ స్టార్స్ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌. నిజానికి తేజ మొద‌ట కాజ‌ల్‌నే తీసుకుందామ‌ని భావించిన‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌వ‌ర‌కూ గోపీ, కాజ‌ల్ క‌లిసి న‌టించ‌లేదు. అయితే ఇటీవ‌ల వ‌రుస‌గా 'నేనే రాజు నేనే మంత్రి', 'సీత' సినిమాల్లో నాయిక‌గా కాజ‌ల్‌నే తీసుకున్న తేజ‌.. ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్న‌ట్లు వినిపిస్తోంది. 'ల‌క్ష్యం', 'శౌర్యం' వంటి సినిమాల‌తో గోపీ, అనుష్క హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. 'శౌర్యం' త‌ర్వాత ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌లేదు. ఇప్ప‌డు ఆ జోడీ ఖాయ‌మైతే ప‌న్నెండేళ్ల విరామంతో మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తున్న‌ట్లు అవుతుంది. తేజ చివ‌ర‌కు ఎవ‌రిని తీసుకుంటాడో చూడాల్సిందే.
  మెగా బ్రదర్ నాగబాబు గురించి స్పందించడానికి నందమూరి బాలకృష్ణ ఇష్టపడలేదు.‌ తాను ఎందుకు మాట్లాడాలని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరకు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. అంతకుముందు చిరంజీవి ఇంట్లో సినిమా ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో థియేటర్ల మూసివేత చిత్రీకరణకు అనుమతి వంటి పలు అంశాలను చర్చించారు. ఆ చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే. అందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా తాను చాలా బాధపడ్డాననీ‌‌... తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ వద్ద నాగబాబు గురించి ప్రస్తావించగా "నేనేమీ మాట్లాడలేదు. అతనే మాట్లాడుతున్నాడు. నేనెందుకు మాట్లాడాలి. ఛీఛీ" అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరకు చిరంజీవి, నాగార్జున వెళ్ళిన సమయంలో మిమ్మల్ని ఆహ్వానించలేదనీ... గతంలో కేసీఆర్ మీద మీరు విమర్శలు చేయడమే కారణమా? అందువల్ల దూరం పెట్టారని అనుకోవచ్చా? అని బాలకృష్ణను ప్రశ్నించగా "కేసీఆర్ గారికి నాపై ఎప్పుడూ కోపం లేదు. రాజకీయాలు వేరు. ఎందుకు పిలవలేదో నాకు తెలియదు మరి" అని సమాధానం ఇచ్చారు.
  ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’తో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌ని సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్‌. స్వల్ప విరామం అనంతరం తన తదుపరి చిత్రంగా 'సర్కారు వారి పాట'ని ప్రకటించాడు. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్‌ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. సహజంగానే 'సర్కారు వారి పాట’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ప్రి లుక్ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనుంది. కాగా దాదాపు ఏడేళ్ళ‌ విరామం అనంతరం ఈ సినిమా కోసమే మహేశ్‌ బాబుతో మరోసారి జట్టుకడుతున్నాడు యువ సంగీత సంచలనం త‌మన్. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘పోకిరి’కి.. ఈ ‘సర్కారు వారి పాట’కి గురు శిష్యుల క‌నెక్ష‌న్ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే.. 'పోకిరి'కి 'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తే.. ‘సర్కారు వారు పాట’ని ఆయన శిష్యుడు పరశురామ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ‘పోకిరి’కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తే.. ‘సర్కారు వారి పాట’కి మ‌ణి శిష్యుడు త‌మన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సో.. ‘పోకిరి’కి గురువుల కాంబినేషన్ (పూరీ జగన్నాథ్, మ‌ణిశ‌ర్మ) ఎలాగైతే మ‌హేశ్‌ బాబుకి వర్కవుట్ అయిందో.. అలాగే 'సర్కారు వారి పాట’కి శిష్యుల కాంబినేషన్ (పరశురామ్, త‌మ‌న్) కూడా కలిసొస్తుందేమో చూడాలి.
తమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ...     మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి. రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు!     - నిర్జర.
  Do you think you are Loyal towards the Mother Earth after taking everything that is essential? After seeing so much of deforestation we feel the answer is absolutely no. How loyal should you be towards the planet - watch this video to know more.......   https://www.youtube.com/watch?v=dSohFWv4tgs  
ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు. అయితే, తారక్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, రాజకీయాల్లో తన పేరు బాగానే వినిపిస్తూ ఉంటుంది. ఆయన తాతగారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున.. 2009 ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన తారక్.. ఆ తరువాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే, కొందరు అభిమానులు, టీడీపీ శ్రేణులు మాత్రం తారక్ పొలిటికల్ ఎంట్రీపై చర్చిస్తూనే ఉంటారు. ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని, ఆయనకు తెలంగాణలో టీడీపీ పగ్గాలు అప్పగించాలని ఇలా రకరకాలుగా అభిప్రాయపడుతుంటారు. అయితే, తారక్ మాత్రం తన ఫోకస్ అంతా సినిమాల పైనే పెడుతున్నారు. కాగా, తాజాగా తారక్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి నంద‌మూరి బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాల‌కృష్ణకు తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. "జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి వ్య‌క్తులు కూడా పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వస్తే అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్రా‌లో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంది అనే వాద‌న ఉంది" అంటూ యాంకర్ అడిగారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. ‘‘అది డేడికేష‌న్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది" అన్నారు. "అదీగాక మీరు ఫుల్ టైమ్ పాలిటిక్స్ అంటున్నారు. త‌న‌కు సినిమా యాక్ట‌ర్‌గా చాలా భవిష్య‌త్తు ఉంది. మ‌రి వాడిష్టం. ప్రొఫెష‌న్ వ‌దులుకుని ర‌మ్మ‌నముగా. ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్న‌గారు కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబ‌ట్టి వారి వారి ఇష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది’’ అని బాలకృష్ణ సమాధానమిచ్చారు.
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం, ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌ కారును ఓ నిరుద్యోగి అడ్డుకున్నారు. సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టైరిన్ గ్యాస్ కు మరో ప్రాణం బలయింది. గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు. గతంలో 12 మంది మరణించగా, కొద్దిరోజుల క్రితం ఒక వృద్ధ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో కనకరాజు మృతి చెందడంతో మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, సోమవారం(నిన్న) తీవ్ర అస్వస్థతకు గురవడంతో కనకరాజు మృతి చెందాడు. కాగా, ఎల్జీ పాలిమర్స్ వల్లనే మృతి చెందాడని కనకరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స అందిన కొన్నిరోజులకి కూడా ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన సమయంలో అస్వస్థకు గురైన వందలాది మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
  చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  
  ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మేఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్‌ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం ఉంది. అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతోపాటుగా ఆక్జలేటులు ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ. పాలకూర టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటున్నాం. ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదును మించితేనే ప్రమాదం. పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.