LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
  `బాహుబ‌లి` చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న భారీ చిత్రం `సాహో`. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జె తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆఖ‌రి ద‌శ‌కు వ‌చ్చింది.  రెండో సినిమాకే సుజిత్ ను న‌మ్మి అంత బ‌డ్జెట్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ అంద‌రూ యువి క్రియేష‌న్స్ వారిని భ‌య‌పెట్టిన‌ప్ప‌టికీ సుజిత్ మీద నమ్మ‌కంతో సినిమా మొద‌లుపెట్టారు.  ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా విడుద‌ల చేసిన  మేకింగ్ వీడియో హాలీవుడ్ స్థాయిలో చూపించి అంద‌ర్నీ షాక్ కి గురి చేశాడు సుజిత్. ఇక ఈ చిత్రంలోని హీరో ఇంట‌ర్ డ‌క్ష‌న్ సీన్ హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు సుజిత్. ఈ ఎంట్రీ ధూమ్ -2 లా రాబ‌రీ సీన్ తో ఉంబోతున్న‌ట్లు తెలుస్తోంది. హీరో, నిర్మాత‌లు సుజిత్ పై పెట్టుకున్న న‌మ్మకానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమాను తీర్చిదిద్దుతున్నాడ‌ట సుజిత్.  `ర‌న్ రాజా ర‌న్` చిత్రంతో మెప్పించిన సుజిత్ `సాహో` చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.  ఇందులో రాబ‌రీ సీన్ రామోజీ ఫిలిం సిటీలో భారీ గా పిక్చ‌రైజ్ చేశారు. ఈ చిత్రాన్ని అగ‌స్టు 15న రిలీజ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ మ‌రో చిత్రం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న విష‌యం తెలిసిందే.   ఈ చిత్రం ఇప్ప‌టికే ఇట‌లీలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ల‌వ్ స్టోరిగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం కూడా భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోంది.  రాధాకృష్ణ కూడా ఒకే సినిమా చేశాడు గ‌తంలో . అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్ ఇలా ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల‌తో వెంట వెంట‌నే సినిమాలు చేస్తూ రిస్క్ చేస్తున్నాడ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌భాస్ కు ఇద్ద‌రి పై న‌మ్మ‌కం ఉన్నా కానీ. కొంచెం ఒత్తిడి ఫీల‌వుతున్నాడ‌ని స‌న్నిహితుల నుంచి తెలుస్తోంది.
ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌తో మ‌హా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని ఏస్ డైర‌క్ట‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విష‌యం కూడా తెలిసిందే. అయితే ఇటీవ‌ల జ‌క్క‌న్న త‌న‌యుడు వివాహం సంద‌ర్భంగా కొంత బ్రేక్ ఇచ్చారు. అందులో విన‌య విధేయ రామ చిత్రం ప్ర‌మోష‌న్ లో భాగంగా రామ్ చ‌ర‌ణ్ కూడా బిజీ గా ఉన్నాడు. ఇక ఇపుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఫ్రీ అయ్యాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ 16 అయిపోతుంది..కాబ‌ట్టి ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ ను ఈ నెల 21న నుంచి ప్రారంభించ‌డానికి ఇప్ప‌టికే చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. పీరియాడిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని , రాహుల్ రామ‌కృష్ణ ఇంపార్టెన్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 300 కోట్లు భారీ బ‌డ్జెట్ తో డివివి దాన‌య్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ  చిత్రం వ‌చ్చే ఏడాది తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ , మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయనున్నారు.
ప్ర‌జంట్ ప్లే బాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం `ప్రేమ‌తో రా` అంటూ వెంక‌టేష్ న‌టించిన సినిమా ప్లేబాయ్ గా అల‌రించాడు. ఆ సినిమా అప్ప‌ట్లో పెద్ద‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత 8 ఏళ్ల క్రితం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ఆరెంజ్‌` తో షార్ట్ ట‌ర్మ్ ల‌వ్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యూజిక‌ల్ గా ఆ రెండు సినిమాలు మెప్పించాయి.  కానీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక ప్ర‌స్తుతం అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ క‌థే అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ హీరోల బాట‌లోనే యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌రకొండ కూడా వెళ్ల‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది.  `మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ కి జోడిగా రాశీఖ‌న్నా , కేథ‌రిన్ త్రెసా, ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తున్నారు. కాగా ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ లో విజ‌య్ ప్లే బాయ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌రి...ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తోంది. కె.య‌స్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.
ప్ర‌జంట్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పీరియాడిక్ సినిమా హ‌వా కొనసాగుతుంద‌నే చెప్పాలి. ఈ కోవ‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `జెర్సీ`. ఇదొక ఇంట్ర‌స్టెంగ్ మూవి. వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకెళ్లిన యువ హీరో నాని ఇటీవ‌ల కాస్త నెమ్మ‌దించాడు. అలాగే త‌న స్థాయికి త‌గ్గ హిట్ మాత్రం ఇటీవ‌ల రాలేదు. మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ న‌టి శ్ర‌ద్ధ త్రినాథ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు చిత్ర టీమ్‌. న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 1న `జెర్సీ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జెర్సీ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. `క్రికేట‌ర్ కావాల‌నుకునే ఓ యంగ్ కుర్రాడి స్టోరి గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అర్జ‌న్ పాత్ర‌లో నేచ‌ర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్నాడు. టీజ‌ర్ లో `ప్ర‌య‌త్నిస్తూ ...ఓడిపోయిన‌వాడు లేండంటూ ఓ ఎమోష‌న‌ల్ డైలాగ్ నానితో చెప్పించారు. ఈ డైలాగ్ ప్ర‌స్తుతం హ‌ల్ చల్ఛ్ చేస్తోంది. సితార ఎంర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్న స‌మ‌కూర్చ‌డం విశేషం.
టాప్ హీరోయిన్ అనుష్క త‌న నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మాధ‌వ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కోన‌వెంక‌ట్ ఈ సినిమాకు అన్నీ తానై ప‌ని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇందులో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మాడ్స‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌న ఇంత వ‌ర‌కు వెలువ‌డ‌లేదు. అయితే ఇటీవల కోన వెంక‌ట్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో దేవ‌సేన అనుష్క లుక్ మా సినిమాలో అద్భుతంగా ఉండ‌బోతుందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆగ‌కుండా త‌న సినీ కెరీర్ లోనే మా సినిమా బెస్ట్ సినిమా కాబోతుందంటూ రాసుకొచ్చాడు. ఈ సినిమాకు హేమంత్ మ‌ధుక‌ర్ డైర‌క్ష‌న్  చేస్తున్నాడు.  దీనికి సైలెన్స్ అనే టైటిల్ ని నిర్ణ‌యించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  గోపి మోహ‌న్ ఈ సినిమాకు క‌థ‌ని అందించారు. రెండేళ్ళు ఈ క‌థ పై వ‌ర్క్  చేసారు కోన‌వెంక‌ట్‌. మార్చిలో షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభంకానుంది. అమెరికాలో అధిక‌భాగం షూటింగ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.
  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.
  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.
  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
  తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు.  ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు. 
  తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు. 
      Studies tell is that it is critical for adults to seek treatment for a sleep illness and aim for 7 to 9 hours of sleep each night in order to maintain a healthy lifestyle. Three new studies show just how critical it is for adults to seek treatment for a sleep illness and aim for seven to nine hours of sleep each night in order to maintain a healthy lifestyle.   One study of 2,240 adults is the first to examine the link between obstructive sleep apnea (OSA) and mortality in Asians. Results show that all-cause mortality risk was 2.5 times higher and cardiovascular mortality risk was more than 4 times higher among people with severe OSA. The results are consistent with previous studies in the U.S. and other countries. Another study of 2,673 patients in Australia found that untreated OSA is associated with an increased risk of motor vehicle crashes in very sleepy men as well as near-misses in men and women. Participants with untreated OSA reported crashes at a rate three times higher than the general community. That last study examined the relationship between sleep duration and self-rated health in Korean adults. Results show that short sleep duration of 5 hours or less per day and long sleep duration of 9 hours or more per day was associated with poor self-rated health. The results add weight to recent data emphasizing the importance of adequate sleep in physical and mental health. All three of the studies are in the Oct. 15 issue of the Journal of Clinical Sleep Medicine, which is published by the American Academy of Sleep Medicine. The AASM reports that at least 12 to 18 million adults in the U.S. have untreated obstructive sleep apnea, which involves the repetitive collapse of the upper airway during sleep. OSA is a serious sleep illness that is associated with an increased risk of high blood pressure, heart disease, diabetes, depression and stroke. The most effective treatment option for OSA is CPAP therapy, which helps keep the airway open by providing a stream of air through a mask that is worn during sleep.   So most of us adults need about seven to eight hours of nightly sleep to feel alert and well rested.
ఓ కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది. ఆ సందేహం అతన్ని నిలవలనీయలేదు, కూర్చోనీయలేదు. ‘మనిషి విలువ ఏమిటి?’ అన్నదే అతని సందేహం. తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే ఉంటుందనిపించింది ఆ కుర్రవాడికి. వెంటనే తాతయ్య దగ్గరకి పరుగుపరుగున వెళ్లాడు. ‘తాతయ్యా! తాతయ్యా! మనిషి విలువ, మనిషి విలువ అంటూ ఉంటారు కదా! అసలు మనిషి విలువ ఏమిటి?’ అని అడిగాడు.   కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు. ‘ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరకి వెళ్లి, ఈ రాయి విలువ ఏమిటో ఒకొక్కరినీ అడిగి చూడు. కానీ పొరపాటున అమ్మవద్దు,’ అన్నారు.   ఎర్రగా తళతళా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలోకి బయల్దేరాడు. ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది. దుకాణంలోకి వెళ్లి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘దీన్ని తీసుకుని మీరేం ఇవ్వగలరు,’ అని అడిగాడు. పండ్ల దుకాణదారుడు ఆ రాయిని ఎగాదిగా చూసి ‘ఓ ఐదు డజన్ల యాపిల్స్ ఇస్తాను,’ అని గొప్పగా చెప్పాడు.   ఆ తరువాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు?’ అని అడిగాడు. దానికి ఆ దుకాణదారుడు ‘నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధం,’ అని చెప్పాడు.   తన రాయికి పండ్లు, కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు. దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లాడు. దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకుడు డంగైపోయాడు. ‘ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం,’ అనేశాడు. నగలవర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసిపారేయదగింది కాదనిపించింది అతనికి. దాంతో వాళ్లనీ వీళ్లనీ అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు.   రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. ఓ ముఖమల్ వస్త్రం తీసుకుని బల్ల మీద పరిచి, కుర్రవాడి చేతిలోని రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు. ‘ఇది మామూలు రాయి కాదు. ఇది ఓ గొప్ప పగడం. నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని నేను కొనలేను,’ అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు.   రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటనకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకుని అదెక్కడ చేజారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరుగుతీశాడు. తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు.   ‘ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా! నీకు ఎదురుపడిన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. నువ్వు ఆ అమూల్యమైన పగడంలాంటి వాడివి. కానీ నీకు జీవితంలో ఎదురుపడేవారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం. వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి, విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు. జీవితంలో వాళ్లు విలువైనవి అనుకునేవాటికీ నీకూ పొంతన లేకపోవచ్చు. నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్లకి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపారివంటివాడు నీకు ఎదురుపడతాడు. నీ విలువని అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు. కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం. అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి. అలాగే ఉండేందుకు ప్రయత్నించు. నీ మీద నువ్వు గౌరవం ఉంచుకో! పండ్ల వ్యాపారీ, కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చవకగా అమ్ముడుపోవద్దు,’ అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మనిషి విలువ అమూల్యం అన్నమాట!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  అది అమెరికాలో జాన్ హాప్‌కిన్స్‌ అనే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కి ఓ ఆలోచన వచ్చింది. ‘తన కళ్ల ముందు ఉన్న స్టూడెంట్స్ అంతా మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే కదా! వాళ్లు ఎప్పటికైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు కదా! మరి బస్తీలో పెరిగే పిల్లల సంగతి ఏంటి?’ అన్న ఆలోచన ప్రొఫెసర్ మనసుని కదిలించేసింది. వెంటనే ఆయన కొంతమంది స్టూడెంట్స్‌ని పిలిచాడు. ‘ఈ ఊరి చివర ఓ స్లమ్‌ ఏరియా ఉంది కదా! మీరంతా అక్కడికి వెళ్లండి. అక్కడ పిల్లల మనస్తత్వాన్నీ, వాళ్ల నేపథ్యాన్నీ గమనించండి. వాళ్లు పెద్దయ్యాక ఏమవుతారో ఊహించండి?’ అంటూ ఓ ప్రాజెక్ట్‌ వర్క్‌ అప్పగించాడు. ప్రొఫెసర్ చెప్పినట్లుగానే విద్యార్థులు ఊరి చివర ఉన్న స్లమ్‌ ఏరియాకు వెళ్లారు. అక్కడ పిల్లలని ఓ రోజంతా పరిశీలించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు రెండువందల మంది పిల్లలను గమనించారు. చివరికి వాళ్లలో కనీసం 90 శాతం మంది పిల్లలైనా, పెద్దయ్యాక ఎందుకూ పనికిరాకుండాపోతారని అంచనా వేశారు. వాళ్లలో చాలామంది ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లితీరతారని ఊహించారు. తమ ప్రాజెక్టుని ప్రొఫెసరుకి అందించారు.   ఇదంతా జరిగి సుమారు 25 సంవత్సరాలు గడిచింది. ఈసారి ప్రొఫెసరుగారికి మరో ఆలోచన వచ్చింది. తాను ఒకప్పుడు చేయించిన ప్రాజెక్టు ఎంతవరకు నిజమైందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఇప్పుడు చదువుతున్న కొంతమందికి పాత పేపర్లు అప్పగించి, అప్పటి పిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో పరిశీలించి రమ్మని చెప్పాడు.   ప్రొషెసరుగారు అప్పగించిన కాగితాలు తీసుకుని విద్యార్థులు బయల్దేరారు. ఆనాటి రెండు వందల మంది పిల్లల్లో ఓ 180 మంది ఆచూకీ కనిపెట్టగలిగారు. వాళ్లంతా రకరకాల వృత్తులలో ఉన్నారని తేలింది. ఆశ్చర్యంగా వాళ్లలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లినట్లు బయటపడింది. ఒకప్పుడు అల్లరిచిల్లరగా తిరిగిన పిల్లలలో అంత మార్పు ఎలా వచ్చిందో విద్యార్థులకి అర్థం కాలేదు. చివరికి అక్కడ పనిచేసిన ఓ టీచర్ కారణంగా వాళ్లంతా బుద్ధిమంతుల్లా మారిపోయారని బయటపడింది.   అంతమందిలో మార్పు తీసుకువచ్చిన టీచర్‌ గురించి విద్యార్థులలో ఆసక్తి పెరిగిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటారో కనుక్కుని విద్యార్థులంతా బయల్దేరారు. ఆ టీచర్‌ని కలవగానే, తాము స్లమ్‌ ఏరియాలో చూసిన అద్భుతాన్ని ఆవిడతో చెప్పుకొచ్చారు. ‘మీరు ఇంతమందిలో మార్పు ఎలా తీసుకువచ్చారు,’ అంటూ ఆ టీచర్ని అడిగారు.   విద్యార్థుల ప్రశ్నకి టీచర్‌ ఏమాత్రం తడుముకోలేదు. ‘నేను వాళ్లని ప్రేమించాను. వాళ్లు తప్పకుండా మారతారని నమ్మకం ఉంచాను. ఒక టీచర్‌గా నా బాధ్యతని నిర్వహించాను. వాళ్లు భవిష్యత్తులో నేరగాళ్లు అవుతారనే అనుమానమే నాకు ఉండేది కాదు,’ అంటూ చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. ఆ టీచర్‌ సమాధానం విద్యార్థులందరికీ ఓ కొత్త పాఠాన్ని నేర్పింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  థైరాయిడ్‌కి ఆహారానికి ఉన్న సంబంధం ఏంటీ..? థైరాయిడ్‌తో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటివి ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుందో డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం. https://www.youtube.com/watch?v=sX5UXwfitas  
  వైద్యమూ, వ్యాపారమూ ఇప్పుడు కలగాపులగం అయిపోయాయి. ఇందుకోసం మనం ప్రత్యేకించిన అధ్యయనాలు చేయనవసరం లేదు. వైద్యం మునుపటిలా నిస్వార్థంగా లేదన్నది ప్రతి ఒక్కరి అనుభవమే! ఇలాంటి సమయంలో ఓ 91 ఏళ్ల డాక్టరు విలువల గురించి సమాజానికి ఓ సరికొత్త పాఠాన్ని చెబుతున్నారు.   మొదటి డాక్టర్ ఇప్పుడంటే ఆడపిల్లల చదువు గురించి ప్రత్యేకించి పోరాడాల్సిన పని లేదు. కానీ స్వాతంత్రానికి ముందర ఈ పరిస్థితి ఎలా ఉండేదో చరిత్ర చెబుతూనే ఉంది. ఆడపిల్ల డిగ్రీ సాధించడమే గగనం అనుకునే అలాంటి పరిస్థితులలో భక్తి యాదవ్ అనే మహిళ ఏకంగా MBBS పట్టాని సాధించింది. ఇండోర్లోని MGM మెడికల్ కాలేజి నుంచి 1948లోనే ఈ ఘనతని అందుకుంది. అలా ఇండోర్లోని తొలి మహిళా వైద్యురాలిగా నిలిచింది.   పేదల కోసమే! వైద్య పట్టా చేతికి రాగానే ఎక్కడ ప్రాక్టీసు పెడదామా, ఎంత లాభపడదామా అనే ఆలోచనలు రావడం సహజం. కానీ ప్రభుత్వాసుపత్రిలో చేరమంటూ ఆహ్వానం వచ్చినా, భక్తి యాదవ్ తొందరపడలేదు. ఆ సమయంలో Nandlal Bhandari Mills అనే సంస్థ పేద మిల్లు కార్మికుల కోసం ఓ ప్రసూతి ఆసుపత్రిని నడిపేది. అందులో చేరిపోయారు భక్తి. 1978లో ఆ సంస్థ మూతబడిన తరువాత ‘వాత్సల్య’ పేరుతో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు.   పైసా తీసుకోకుండా 1970లలో వైద్యం చాలా అరుదైన సౌకర్యంగా ఉండేది. అందులోనూ ప్రసూతి వైద్యం చేసే మహిళా డాకర్లు మరింత అరుదుగా ఉండేవారు. అలాంటి సమయంలో తన దగ్గరకు ఎలాంటి రోగులు వచ్చినా అక్కున చేర్చుకునేవారు భక్తి యాదవ్. రోగులు తమంతట తాముగా ఎంతోకొంత ఇస్తే తప్ప... ఇంత రుసుము చెల్లించాలి అని చేయి చాచిన సందర్భం ఎప్పుడూ లేదు. అలా వేలకొద్దీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగానే పురుడు పోసారు. వాటిలో అధికశాతం నార్మల్ డెలివరీలే కావడం గమనార్హం.   విశ్రాంతి లేదు భక్తి యాదవ్‌ను ఇండోర్ వాసులు ప్రేమగా అమ్మ అని పిలుస్తారు. ఆమె హస్తవాసి గురించి విన్న రోగులు రాష్ట్ర సరిహద్దులు దాటుకుని మరి ఇండోర్‌కు చేరుకునేవారు. అలాంటివారిని చూస్తూ భక్తి యాదవ్ ఎలా విశ్రాంతిగా ఉండగలరు? అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా, వయసు మీద పడినా కూడా తన నర్సింగ్‌ హోమ్‌కు చేరుకున్న రోగులని పరీక్షించేవారు. గైనకాలజీలో భక్తియాదవ్‌ది అపారమైన నైపుణ్యం. ఆమె చేతితోనే చేసే పరీక్షల ముందు ఆధునిక యంత్రాలు కూడా బలాదూర్ అన్నది రోగుల నమ్మకం.   సలహా కోసం ఏడాది క్రితం రోగులను పరీక్షిస్తుండగా, భక్తియాదవ్ కిందపడి గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో రోగులను చూసే పరిస్థితిలో లేరు. నర్సింగ్ హోమ్ బాధ్యతలన్నీ వైద్యులైన ఆమె కొడుకు, కోడలే చూసుకుంటున్నారు. అయినా సరే! భక్తియాదవ్ సూచనల కోసమైనా జనం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సంతానం లేనివారు సైతం ఆమె అందించే సలహా కోసం పడిగాపులు కాస్తుంటారు.   ఇప్పటి వైద్యులని చూస్తే... తన సేవలతో కొందరి జీవితాలైనా సంతోషంగా ఉన్నాయన్న విషయం భక్తి యాదవ్కు తృప్తినిస్తుంది. భక్తి యాదవ్ సేవలను చూసి భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. అయినా ఆమెలో ఏదో అసంతృప్తి. ఇప్పటి వైద్యులు యాంత్రికంగా మారిపోతున్నారన్న ఆవేదన. వైద్యం అంటే కేవలం శరీరాన్ని బాగుచేయడం కాదు, మనిషిలో తిరిగి తన పట్ల నమ్మకాన్ని పెంపొందించడం అన్నది భక్తియాదవ్ దృక్పథం. అందుకే తన దగ్గరకు వచ్చిన రోగులను ఆమె బంధువులా ఆదరించేవారు. వారి బాగు కోరుకునే ఆత్మీయురాలిగా మెలిగేవారు. అవసరం అనుకుంటే తన రోగులను చూసేందుకు, సైకిల్ తొక్కుకుంటూ ఎంత దూరమైనా వెళ్లేవారు. కానీ ఇప్పటి వైద్యులలో ఆడంబరం, స్వార్థం, ఉదాసీనత పెరిగిపోయాయన్నది డా॥ భక్తి యాదవ్ ఆవేదన. - నిర్జర.  
  మీ పిల్లలు బొద్దుగా.. ముద్దుగా ఉన్నారని సంబరపడి అలాగే వదిలివేయకండి.. ఎందుకంటే ఆ బొద్దుతనమే భవిష్యత్తులో మీ చిన్నారిని ఇబ్బందుల పాలుజేస్తుంది. అవును.. ఊబకాయం ప్రపంచానికి పెనుముప్పుగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు.. 19 ఏళ్లలోపు వయసు గల యువతి, యువకుల్లో ఇది తీవ్ర సమస్యగా మారింది. గత నాలుగు దశాబ్ధాల్లో మనుషులు విపరీతంగా బరువు పెరగడం పది రెట్లు పెరిగింది. గతంలో ఈ సమస్య కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లోనూ ఊబకాయుల సంఖ్య పెరిగిపోతున్నట్లు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్- ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.   దీని ప్రకారం ఐదు నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు బాల, బాలికల్లో ఊబకాయంతో బాధపడుతున్న వారు 1975లో 1.10 కోట్ల మంది కాగా, 2016 నాటికి ఈ సంఖ్య 12.40 కోట్లకు పెరిగింది. వీరే కాకుండా అధిక బరువుతో ఉన్నవారు మరో 21.30 కోట్ల మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రాసెస్ చేసిన హై కేలరీలు, పోషకాలు కల ఆహారం అధికంగా తీసుకోవడం దానికి తోడు తగినంత వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. అధిక బరువు కారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.   చురుకుతనం తగ్గిపోవడం, నలుగురిలో కలవడానికి సిగ్గుపడటంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. మార్కెట్లో అధిక కేలరీలు కలిగిన ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ ఖర్చుకే వచ్చేస్తుండటంతో ప్రజలు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కూడా టీవీలు, కంప్యూటర్లు చూస్తూ పెరుగుతున్నారు. నేటి తరం చిన్నారుల్లో శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. పిల్లలను ఇలాంటి వాతావరణం నుంచి దూరం చేసి వారికి శారీరక శ్రమ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇది ప్రపంచం ముందు అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.