LATEST NEWS
  A blast has occurred in a Indian Restaurant at Toronto in Canada. Police suspect that a powerful explosive has been used to create the blast. The restaurants name is Bombay Bhel which is a provides Indian cuisine in Mississauga, a suburb of the Canadian city of Toronto. However the reason of the blast is unknown though the police have identified two suspects and are trying to track them down. Though no casualties were recorded, more than 12 people are said to be seriously injured.
  Father of noted Sri Lankan cricketer Dhananjaya de Silva was shot dead. The player`s father is Mr. Ranjan who is a local politician. According to the police, unidentified gunmen has shot him down at the midnight of Thursday. Investigations were under way and no conclusions were yet made regarding the cause of murder. Hearing the demise of his father Dhananjaya has withdrawn from the test match series with West Indies.
  One of the policies of Amazon that attract customers is it’s returning policy. Customers can return back the goods if they are not satisfied enough. But it could be play time for some customers. They often order the goods and return them without valid reasons. Keeping such customers in mind Amazon has started banning such people from shopping on its site. "We want everyone to be able to use Amazon, but there are rare occasions where someone abuses our service over an extended period of time," explained an amazon representative.
ALSO ON TELUGUONE N E W S
సినిమాలు రెండు ర‌కాలు మంచి సినిమా చెత్త సినిమా మంచి సినిమాలోనూ లోపాలుంటాయి.. చెత్త సినిమాలోనూ ఒక‌టో రెండో మంచి విష‌యాలుంటాయి. కానీ.. `ప్ల‌స్ పాయింట్స్‌` భూత‌ద్దంలో వెదికినా క‌నిపించని సినిమాలు అరుద‌గా వ‌స్తుంటాయి. `నేల టికెట్టు` ఆ టైపే. ఈ సినిమాలో క‌థ ఉంది..కానీ విష‌యం లేదు. న‌టీన‌టులు ఉన్నారు కానీ.. వాళ్ల‌లో హుషారు లేదు. పాట‌లున్నాయి.. కిక్కు లేదు. ఫైట్లున్నాయి కానీ ఉత్సాహం లేదు.   అస‌లు ఇలాంటి క‌థ ఎంచుకున్నందుకు అటు హీరోకి, ఇటు నిర్మాత‌కీ కామ‌న్‌సెన్స్ లేదు. * క‌థ‌ ర‌వితేజని నేల టికెట్టు అనిపిలుస్తుంటారు. చిన్న‌ప్ప‌డు పెరిగింది థియేట‌ర్లో కాబ‌ట్టి, ఆ పేరొచ్చింది. చుట్టూ జ‌నం - మ‌ధ్య‌లో మ‌నం అనుకునే ర‌కం. వ‌ర‌స పెట్టి పిలిస్తే చాలు.. వాళ్ల కోసం ఏమైనా చేసేస్తాడు. ఓ ప‌నిమీద హైద‌రాబాద్ వ‌చ్చి హోం మినిస్ట‌ర్ (జ‌గ‌ప‌తిబాబు) మ‌నుషుల‌తో పెట్టుకుంటాడు. అక్క‌డి నుంచి హోం మినిస్ట‌ర్‌కీ, నేల టికెట్టుకీ మ‌ధ్య వార్ మొద‌ల‌వుతుంది. ఈ పోరులో ఎవ‌రు గెలిచారు?  అస‌లు హోం మినిస్ట‌ర్‌కీ, నేల టికెట్టుకీ మ‌ధ్య ఏం జ‌రిగింది? అనేది తెర‌పై చూడాల్సిందే. * విశ్లేష‌ణ‌ `నేల టికెట్టు` అనే పేరు బాగుంది క‌దా, దీనిపై ఓ సినిమా తీసేద్దాం - అని ర‌వితేజ‌, క‌ల్యాణ్ కృష్ణ ఫిక్స‌యిపోయి రంగంలోకి దిగిపోయి ఉంటారు. అందుకే ఇలాంటి క‌ళాఖండం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లు ఈ సినిమాలో క‌థ ఉందా, ఉన్నా ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకున్నాడా?  అనే డౌటు వ‌స్తుంది. త‌లా తోకా లేని స‌న్నివేశాలు చాలా వ‌చ్చిపోతుంటాయి. ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా క‌నెక్ట్ అవ్వ‌దు. లెక్క‌కు మించిన ఫ్లాష్ బ్యాక్‌లు సినిమాని సాగ‌దీస్తూనే ఉంటాయి. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ అస‌లు క‌థేంటి? ఇలా ఎందుకు న‌డుస్తోంది? అనేది అర్థం కాదు. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత‌... క‌థ అర్థ‌మైనా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అప్ప‌టికే మ‌న‌లోని ర‌సం పీల్చేశాడు ద‌ర్శ‌కుడు. హీరో - విల‌న్ మ‌ధ్య వార్ లో ఇంటిలిజెన్సీ ఏం ఉప‌యోగించ‌లేదు. ఓ హోం మినిస్ట‌ర్‌ని ఓ సామాన్యుడు ఎదిరించ‌డం అంటే మాట‌లు కాదు. ఆ స‌న్నివేశాల్లో ఎంత ఫైర్ ఉండాలి?  అలాంటిది లాజిక్కులు లేకుండా, అల్లాట‌ప్పాగా తీసేశాడు ద‌ర్శ‌కుడు. వీటికి తోడు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు క‌థ‌లో ఇరికించేశాడు. అవి కేవ‌లం సినిమాని సాగ‌దీయ‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌నికి రాలేదు. ఏ స‌న్నివేశం ఎందుకు వ‌స్తోందో, ఏది ముందో.. ఏది వెనుకో ఏమీ అర్థం కాదు. స్క్రీన్ ప్లే ఆ రేంజులో ఉంది. క‌థ‌లో ఒక్క ఎమోష‌న్‌కీ ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాక‌పోతే.. తెర‌పై ఎంత‌మంది సూప‌ర్ స్టార్లు క‌నిపించినా లాభం ఉండ‌దు. క్లైమాక్స్ మ‌రీ దారుణంగా, నీర‌సంగా ఉంటుంది. జ‌గ‌ప‌తిబాబు మారిపోవ‌డం కూడా అత్యంత కృత‌కంగా ఉంది. సినిమానే అలా ఉన్న‌ప్పుడు క్లైమాక్స్ అలా ఉంటే త‌ప్పేముంది?? * న‌టీన‌టులు ర‌వితేజ సోలో హ్యాండ్‌తో లాగించేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ క‌థ‌కు ర‌వితేజ బ‌లం కూడా స‌రిపోలేదు. అత‌ని క్యారెక్ట‌ర్ తో మ్యాజిక్ చేద్దామ‌నుకున్న ద‌ర్శ‌కుడికి నిరాశే ఎదురైంది. మాళ‌విక శ‌ర్మ బాగానే ఉన్నా, ఆ పాత్ర‌కు ఇచ్చిన ప్రాధాన్యం చాలా త‌క్కువ‌. ర‌వితేజ‌తో కెమిస్ట్రీ కూడా స‌రిగా పండ‌లేదు. జ‌గ‌ప‌తిబాబుని కూడా ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేదు. ఆ పాత్ర ఒక్క‌టే కాదు. అన్ని పాత్ర‌లూ అలానే త‌యార‌య్యాయి. ఒక్క పాత్ర‌కీ స‌రైన ఎంట్రీ, ఎగ్జిట్ ఉండ‌దు. ఎలా ప‌డితే అలా రాసుకున్నాడు. * సాంకేతిక వ‌ర్గం క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా క‌ల్యాణ్ కృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ద‌ర్శ‌కుడు దారి త‌ప్పితే.. మిగిలిన సాంకేతిక నిపుణుల ప‌రిస్థితి వేరేగా చెప్పేదేముంది?  పాట‌లు ఘోరంగా ఉన్నాయి. ఎడిటింగ్ ప్రాధ‌మిక సూత్రాలు కూడా ఎడిట‌ర్ మ‌ర్చిపోయాడు. సాంకేతికంగానూ ఈ సినిమా గొప్ప‌గా లేదు. సినిమా చూట్టేసిన ఫీలింగ్ క‌లిగితే.. అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు. *  ప్ల‌స్ పాయింట్స్‌ ఆ ఒక్క‌టీ అడ‌క్కండి * మైన‌స్ పాయింట్స్‌ ఒక్క‌ట‌ని ఏం చెబుతాం? * ఫైన‌ల్ పంచ్‌:  నేల నాకించేశాడు...! రేటింగ్‌: 1
  బాలీవుడ్‌ హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌కు, మొదటి భార్య అమృతా సింగ్‌కు పుట్టిన కూతురు సారా అలా ఖాన్‌. సారా తమ చిత్రానికి పనిచేసేందుకు ఒప్పుకుని ఆ తర్వాత మొహం చాటేసిందంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. తీరా సారాని నమ్ముకుని తాము చిత్రాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆమె వేరే చిత్రంలో బిజీగా ఉన్నానని తప్పించుకుంటోందని ఆరోపించాడు. ఆమె వల్ల తనకు జరిగిన నష్టానికిగాను అయిదు కోట్ల రూపాయలను నష్టం కింద కట్టాలని కోర్టుని అభ్యర్థించారు. మొత్తానికి మొదటి సినిమాకే కోర్టు కేసుని ఎదుర్కొన్న హీరోయిన్‌గా సారా చరిత్రకెక్కింది.
  Who could forget Morgan Freeman who is considered as one of the greatest Hollywood actors of all time. As least eight women has raised voice against his conduct. They alleged that his behaviour is inappropriate while working with him on the sets. Though Morgan Freeman has denied these allegations, he has apologised for any feelings being hurt- “Anyone who knows me or has worked with me knows I am not someone who would intentionally offend or knowingly make anyone feel uneasy. I apologize to anyone who felt uncomfortable or disrespected — that was never my intent.” Said Morgan in his statement issued.
  రంగస్థలం 200 కోట్ల వసూళ్ల మార్కుని దాటేసి రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో మూడో స్థానాన్ని సాధించింది. బాహుబలి 1, 2 తర్వాత స్థానం రంగస్థలానిదే. కానీ రామ్‌చరణ్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదు. ఒక సినిమాని దాని సత్తాతోనే ప్రజలు గుర్తించాలని అతను కోరుకుంటున్నట్లుంది. అందుకే నిన్న మీడియాతో మాట్లాడుతూ తన సినిమా వసూళ్ల గురించి పోస్టర్ల మీద ప్రచురించవద్దంటూ ప్రొడ్యూసర్లను కోరారు. వాటి గురించి లేనిపోని వివాదాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఆది పినిశెట్టి అటు తమిళ సినిమాలతో పాటు.. ఇక్కడ తెలుగు సినిమాలు కూడా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు సినిమాలో ప్రతి కథానాయకుడు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆది.. ఇటీవల కాలంలో వచ్చిన నిన్నుకోరి, రంగస్థలం మంచి పాత్రలు చేయగా.. ఆ సినిమాలు కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘నీవెవరో’ టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను కథానాయకుడు నాని ట్విటర్‌లో విడుదల చేశారు. ‘ఆది కొత్త సినిమా టైటిల్‌ ‘నీవెవరో’. మా ప్రియమైన ‘అరుణ్‌’ నటించనున్న సినిమా టైటిల్‌ లోగోను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కోనవెంకట్‌, తాప్సి, రితికా సింగ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు. అనంతరం ఆదికి ట్వీట్‌ చేస్తూ..‘నువ్వు చెప్పిన కథకు ఈ టైటిల్‌ అదిరిపోయింది బాబాయ్’ అని పేర్కొన్నారు. కాగా  హరినాథ్‌ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సి,  రితికా సింగ్‌ నటిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
  తెలుగువాడికి, ఆ మాటకి వస్తే దక్షిణాదికి ఇలవేల్పు వెంకన్న దేవుడే! అందుకే తిరుమలలో ఏం జరిగినా సంచలనమే! ఒక పూట భక్తులు రాకపోయినా వార్తే, ఒక పూట భక్తులు కిటకిటలాడినా వార్తే! వెంకన్న దర్శనం కోసం ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయో కూడా ఓ వార్తే! అందుకే వెంకన్నని ప్రత్యక్షంగా సేవ చేసుకునే పూజారులకి కూడా సెలబ్రెటీ స్టేటస్‌ ఉంటుంది. కానీ ఆ పదవికి వన్నె తేవడం పోయి, వివాదాలు సృష్టించడం మొదలైపోయింది. ఈ సంప్రదాయానికి ముందుగా డాలర్‌ శేషాద్రి నాంది పలికారని చెప్పుకోవచ్చు. కాస్త పేరున్నవ్యక్తులు తిరుమలకు రాగానే పరుగుపరుగున వారికి స్వాగతాలు పలకడం, దగ్గరుండి వారికి దర్శనం చేయించడం, ప్రైవేటుగా పూజలు నిర్వహించడం లాంటి పనులతో శేషాద్రివారు తరచూ వార్తల్లోకి ఎక్కేవారు. అందుకే తిరుమల ఊరేగింపుల్లో పాల్గొనే భక్తులు, స్వామివారి ఉత్సవ విగ్రహం తర్వాత శేషాద్రినే ఆసక్తిగా గమనించేవారు.   ఇక శేషాద్రి పరపంరని కొనసాగిస్తూ రమణ దీక్షితులు కూడా నిత్యం వార్తల్లో నిలవడం మొదలుపెట్టారు. మనవడిని గర్భగుడిలోకి తీసుకువెళ్లడం, కొడుకులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వామి సేవలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి సంచలనాలకు తెరతీశారు. చివరికి ప్రభుత్వం తనని తొలగించడంతో ఏకంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. పదేళ్లకు ముందు జరిగిన సంఘటలన్నీ ఏకరవు పెట్టి, తిరుమలలో ఘోరమైన అపచారాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రజల్లో రేకెత్తించారు.   రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో స్వామివారికి చెందిన ఓ వజ్రం మాయమైందనీ, వెయ్యి కాళ్ల మండపాన్ని అన్యాయంగా కూల్చేశారని చెప్పిన విషయాలు ముఖ్యమైనవి. విచిత్రంగా ఇవన్నీ ఆయన ప్రధానార్చకునిగా ఉన్న సమయంలోనే జరిగాయి. వీటికి సంబంధించిన దర్యాప్తులలో ఆయన మాటలని స్వయంగా రికార్డు చేయడం జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు వ్యక్తం కావడం ఓ విచిత్రం. ఈ ఆరోపణలు చేసే ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసిరావడం, రమణ దీక్షితులకి బీజేపీ పార్టీ వంత పలకడం కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ఇక ఇలాంటి అదను కోసమే కాచుకున్న వైకాపా సంగతి చెప్పనే అక్కర్లేదు. తిరుమల విజ్రాలు సాక్షాత్తు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నాయనీ, వాటిని విదేశాలను మళ్లించేస్తున్నారనీ విజయసాయిరెడ్డి రకరకాల ఆరోపణలతో చెలరేగిపోయారు.   జరుగుతున్న పరిణామాలతో వెంకన్న మీద భక్తుల నమ్మకం ఇసుమంతైనా తగ్గదు. కానీ అక్కడి పరిపాలనతో ఏదో లోటు జరుగుతోందనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరుమల మీద సరైన పట్టు లేదనీ ప్రజలలో దురభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు. రమణ దీక్షితుల మీద క్రిమినల్‌ కేసు పెట్టినంత మాత్రాన ఈ సమస్య తీరదు. తితిదే నివేదికలు, దర్యాప్తులు, ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పాలన పారదర్శకంగా ఉన్నప్పుడే ప్రజల మనసులో అనుమానాలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు రమణ దీక్షితులు, రేపు మరొకరు తమ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకునేందుకు వెంకన్న ప్రతిష్టనే దిగజార్చేయగలరు.
  నిన్న కర్ణాటకలో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారం ప్రాంతీయ పార్టీలన్నింటికీ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి హాజరై అంతా లాభపడినట్లే కనిపించారు. కానీ చంద్రబాబు మాత్రమే కాస్త చిక్కుల్లో పడ్డారేమో అన్నది విశ్లేషకుల అంచనా. రాహుల్‌గాంధితో కలిసి చంద్రబాబు నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడిన ఫొటోలని ప్రతిపక్షాలు బాగానే ఉపయోగించుకుంటున్నాయి. మొన్నటివరకూ బీజేపీతో జతపట్టి రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌తో కలిసి అదే తప్పు చేస్తున్నారని దుయ్యపడుతున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయనే కేసీఆర్‌ తెలివిగా ఓ రోజు ముందే వెళ్లి కుమారస్వామిని కలిసివచ్చారు. కాంగ్రెస్ మీద కసితోనే ఆవిర్భవించిన తెదెపా కూడా ఇలాంటి వ్యూహమేదో పాటిస్తే బాగుండేది. కానీ వేదిక మీద చంద్రబాబు బాడీలాంగ్వేజ్‌ కోరి విమర్శలు తెచ్చుకొంది.   మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కూడా తన దూకుడిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు మేధావి, అనుభవజ్ఞుడు అంటూ కితాబిచ్చిన నోటితోనే చంద్రబాబుని ఏకేస్తున్నారు. ఆయన మాట మీద నిలబడటం లేదనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేశారనినేరుగానే విమర్శిస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితల సమస్యలని కనుక తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్నారు. పవన్‌ హెచ్చరికలు ఎప్పుడెలా ఉంటాయో, ఎంత దూరం వెళ్తాయో అంచనా వేయడం కష్టం. ఇది ఖచ్చితంగా చంద్రబాబుని చికాకుపెట్టి తీరుతాయి.   ఇక వైసీపీ ఈసారి తెలివిగా వెంకన్నబాబుని రాజకీయంలోకి లాగింది. ఏకంగా రమణదీక్షితులులాంటి సెలబ్రెటీ స్టేటస్‌ ఉన్న అర్చకుడిని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పింది. వెంకటేశ్వరుని ఆభరణాలు చంద్రబాబే దొంగిలించారంటూ ప్రచారం చేస్తోంది. ఈ విషయాలను ప్రజలు నమ్మకపోయినప్పటికీ, ఎక్కడో ఏదో మతలబు జరుగుతోందనే అనుమానాన్ని కలిగించడంతో మాత్రం విజయం సాధించింది. అసలే ప్రత్యేక హోదాని రప్పించలేక, నూతన రాజధానిని నిర్మించలేక కష్టాల్లో ఉన్న చంద్రబాబు మీద ఇవన్నీ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి రాజకీయ చతురతలో ఆరితేరిపోయిన బాబు వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి!
  తిరుమల తిరుపతి దేవస్థానం పై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెద్ద తుఫానుగా మారేలా కనిపిస్తోంది. అంతేకాదు.. చూడబోతే ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వం కూడా ఇరుకునపడే పరిస్థితి వస్తుందేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకే కుదిస్తూ టిటిడి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రమణదీక్షితులు పింక్ డైమండ్ తో పాటు టిటిడిలో చోటు చేసుకొంటున్న విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికితోడు... పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి టిటిడి ఆభరణాలు కొన్ని కన్పించకుండా పోయాయని ఆరోపించారు. 2011లో తాము ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. శ్రీకృష్ణ దేవరాలయాల కాలం నుండి శాసనంలో ఉన్న ఆభరణాలు ,ఇతర వస్తువులు లేవని ఆయన చెప్పారు.అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు టిటిడి ఆభరణాలను భద్రపర్చేందుకు కమిటీని ఏర్పాటు చేసి జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఇక మొత్తంగా టిటిడిలో పరిణామాలు టిటిడి పాలకవర్గంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఈవో సింఘాల్ తో సమీక్ష నిర్వహించారు.   ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై రమణదీక్షితులు ఎలా విమర్శలు గుప్పిస్తారని చంద్రబాబునాయుడు రమణదీక్షితులు వ్యవహరంపై ప్రశ్నించారని సమాచారం. ఇక సమీక్ష ముగిసిన తరువాత సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. టిటిడిలో శ్రీవారి నగలన్నీ సురక్షితంగానే ఉన్నాయని.. టిటిడి నిధులు ఎక్కడ కూడ దుర్వినియోగం కాలేదని ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయడు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. ఆగమశాస్త్రం ఒప్పుకొంటే శ్రీవారి నగలను ప్రదర్శిస్తామని... నగలను ప్రదర్శించేందుకు తాము సిద్దంగా ఉన్నామని... 1952 నుండి కూడ స్వామివారికి ఉన్న నగల జాబితాకు సంబంధించిన రికార్డులున్నాయని ఆయన చెప్పారు. 2011లో రిటైర్డ్ జడ్జిల కమిటీ ప్రకారంగా నగలు ఉన్నాయని... అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ నగలు ఇచ్చారనే విషయాన్ని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చలేదన్నారు.     మొత్తానికి ఈ వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక కేంద్రం వరకూ ఈ వ్యవహారం వెళ్లడంతో ఏం జరుగుతుందా అని  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే కేంద్రానికి.. చంద్రబాబు చెడింది... ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..
  గత కొద్దికాలంగా బీజేపీ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సందు దొరికినప్పుడల్లా బీజేపీపై మోడీపై తెగ విమర్సలు చేసేశారు ప్రకాశ్ రాజ్. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ డ్రామాపై స్పందిస్తూ బీజేపీ పై కామెంట్లు విసిరారు. అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇక జేడీఎస్ మద్దతు కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్,బీజేపీ బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేజీఎస్ కాంగ్రెస్ కు మద్దతిచ్చి బీజేపీకి షాకిచ్చింది. దీంతో బీజేపీ ఎలాగైనా తమకు కావాల్సిన ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక గవర్నర్ ను అడ్డుపెట్టుకొని కూడా అధికారం చేపట్టాలని చూసింది. కానీ ఆ పప్పులేమి ఉడకలేదు. సుప్రీంకోర్టు బీజేపీ అడిగిన వారం రోజులు గడువు ఇవ్వకుండా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చి బలపరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలతో బేరసారాలు కూడా చేశారు బీజేపీ నేతలు. ఇక బలపరీక్ష కొద్దిసేపట్లో జరుగుతుంది అన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు చాలా తెలివిగా ఈ ఆడియో టేపులను కాస్త బయటపెట్టింది. ఈ ఆడియో టేపుల్లో స్వయంగా యడ్యూరప్ప పేరే బయటకు రావడంతో బీజేపీకి అసలు సమస్య వచ్చిపడింది. ఇలా చేసినందుకు మోడీ, షా ద్వయం యడ్యూరప్పపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసేది లేక రాజీనామా చేయమని ఆదేశించడంతో.. బలపరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా చేశారు. ఇక యెడ్డీ రాజీనామాతో బలపరీక్ష చేసే పని తప్పింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   ఇక గత వారంరోజులుగా జరిగిన కర్ణాటక రాజకీయాలపై రజనీకాంత్ మాట్లాడుతూ... కర్ణాటకలో జరిగిన అన్యూహ్య సంఘటనను చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నా.. బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్ 15 రోజులు సమయం ఇవ్వడం, అందుకు భాజపా మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టుగా ఉంది.. బల నిరూపణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు.. ఆతీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది అని అన్నారు. ఇక రజనీ చేసిన వ్యాఖ్యలను బట్టి తాను కూడా బీజేపీకి వ్యతిరేకమని చెప్పకనే చెప్పారని అంటున్నారు పలువురు. అంతేకాదు రజనీ బీజేపీ పై కోపంగా ఉండటానికి వేరే కారణం ఉందని కూడా అంటున్నారు. అది ఏంటంటే.. ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న వ్యాఖ్యలే రజనీ బీజేపీ అంటే మండిపడటానికి కారణం అంటున్నారు. స్వామిగారు రజనీపై మామూలు కామెంట్లు వేయలేదు మరి. రజనీకి చదువు లేదని.. ఆయన రాజకీయాలకు పనికిరాడని... అతనితో పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద నష్టం ఇంకేం లేదు... సినీ తారలకు రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ రోజులు ఎప్పుడో పోయాయని.. సినిమా తారలతో అలయెన్స్ అంటే అది అతిపెద్ద వైఫల్యమే అని తెగ విమర్శలు గుప్పించారు. ఈ కారణం కూడా బీజేపీపై రజనీ కోపంగా ఉండటానికి ఒక రీజన్ అంటున్నారు విశ్లేషకులు. దానికితోడు ఈ మధ్య కాలంలో బీజేపీ పై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ కారణాలవల్లే రజనీ కూడా ఇప్పుడు ఓపెన్ గానే బీజేపీ పై కామెంట్లు చేశారని... దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోను అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...
  మూడు రోజులుగా జరుగుతున్న కర్ణాటక రాజకీయ డ్రామాలకు తెరపడింది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంకోసం చేసిన పోరులో ఎట్టకేలకు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 104 సీట్లు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో అధికారం చేపట్టే అవకాశం చేజార్చుకుంది. అసెంబ్లీ బలపరీక్షలో ఎలాగైనా గెలవాలని బీజేపీ విశ్వప్రయత్నాలే చేసింది. దీనిలో భాగంగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపుకు లాగడానికి బేరసారాలకు సైతం దిగింది. కానీ బీజేపీ ప్రయత్నాలు మాత్రం వర్కవుట్ కాలేదు. ఇక ఈరోజు ఇంకొద్ది సేపట్లో బలపరీక్ష జరుగుతుంది.. ఎవరు అధికారం చేపడతారో అని అందరూ ఎదురచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా యడ్యూరప్ప తమ పార్టీ నేతలతో చేసిన బేరసారాల వీడియో బయటపెట్టారు. దీంతో విషయం బయటపడటంతో మోడీ, అమిత్ షా యడ్యూరప్ప మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆఖరికి రాజీనామా కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పరీక్ష ముందే తమ ఓటమిని అంగీకరించి..ఉద్వేగంతో ప్రసంగం చేసిన యెడ్డీ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.   అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే... కర్ణాటకలో అన్ని పార్టీల కంటే అధికంగా 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అధికారంలో రాలేకపోయామని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఇక ఇప్పటికే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో... 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ వాజుబాయ్ వాలాకు సామూహిక రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరగాలంటే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారట. మరి ఇప్పుడు సామూహిక రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలని మొదలుపెడితే ప్రజలు ఆదరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న.. మరి ఇప్పటికే  బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. దానికితోడు కర్ణాటకలో బీజేపీ చేసిన రాజకీయాలవల్ల ఉన్న ఇమేజ్ కూడా పోయింది. దానికి  తోడు ఆడియో టేపులు బయటపడటం. అన్నీ బీజేపీకి ఎదురుదెబ్బలే తగిలాయి. అందుకే  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజల ఆగ్రహం చవిచూడటం కంటే ప్రతిపక్షంగా ఉండటమే మంచిదని బీజేపీ పెద్దలు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత మళ్లీ సామూహిక రాజీనామాలు అంటూ డ్రామాలు మొదలుపెడితే వర్కవుట్ అవుతుందా.. బీజేపీ మళ్లీ పప్పులో కాలేస్తుందని అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
  గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షపదవిలో ఎవరిని నియమించాలో బీజేపీ పెద్దలు చర్చలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ రేసులో మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారి ముగ్గురిలో మాణిక్యాలరావువైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ముందు సోమువీర్రాజు నే అనుకున్నా.. ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని.. అందుకే దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అయితే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ... మళ్లీ బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పురుంధరేశ్వరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలా చర్చించిన కొన్ని రోజుల తరువాత మళ్లీ సోము వీర్రాజుకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకున్నారు. ఇక కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత అసంతృప్తి చెందిన కన్నా లక్షీ నారాయణ వైసీపీ చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక రేపో మాపో కన్నా వైసీపీలో చేరుతారు అనుకునే లోపు.. అమిత్ షా నుండి ఫోన్ రావడం... ఆ తరువాత అనారోగ్యం అని ఏదో సాకు చెప్పి పార్టీ మార్పుకు బ్రేక్ చెప్పారు. ఇక ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్‌గా చేశారు. నాడు పార్టీ చీఫ్‌గా చేయనందుకే ఆయన వైసీపీలోకి వెళ్లాలని భావించారని, కానీ అధిష్టానం నుంచి హామీ వచ్చాక ఆగిపోయారని, ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.   ఇక ఇప్పుడు బీజేపీ అధిష్టానం కన్నాకు ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఓ మనిషి అలక పూనినట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు...సోము వీర్రాజు. ఆ పదవి తనకు దక్కుతుందనుకున్న సోము వీర్రాజు పాపం నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.  పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న తనను కాదని, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెందారట... ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఎనిమిది గంటల సమయం నుంచి ఆయన అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. మరోవైపు కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు... సోము వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. తమ నేత వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. రాజీనామా పత్రాలను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు పంపినట్టు తెలిపారు. మరి దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో.. సోము వీర్రాజును ఎలా బుజ్జగిస్తారో చూడాలి..
  కోపాన్ని అర్ధం చేసుకోవడం ఎలా? ఉదాహరణకి మీరు ఒక మీటింగ్ లో కూర్చున్నారు. మీరు ఏదో చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఒకరు అడ్డుపడుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ వ్యక్తి పైన కోపం వస్తుంది. అది ఒకవేళ మీ సహోద్యోగి అయితే, కోపం ప్రదర్శించే అవకాశం ఉంది... కానీ అదే మీ బాస్ అయితే, కోపం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి... ఇలాంటి సిట్యుయేషన్స్ లో కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=vOIHWmAqQVI
మీరు చాలా సార్లు మీ ఫ్రెండ్స్ వారి ప్రతిభకి తగ్గ ఉద్యోగం దొరకలేదు అని బాధపడటం చూసి ఉంటారు. ఒక్కోసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గరో లేక బంధువుల దగ్గరో ఇలాగే అని ఉండుంటారు. అలాంటి సందర్భంలో మానేజర్ మీ ప్రతిభని గుర్తించడం లేదు అని కోపం వస్తుంది. మరి, మీ పనితనం మీ ఆఫీస్ లో గుర్తించాలి అంటే ఎం చేయాలి. ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=ykMcxp6VEP0  
ఇంట్లో పసిపిల్లలు ఉన్నారంటే ఆ సందడే వేరు. వాళ్ల ఆటపాటలతో రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే పిల్లలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారనుకోండి... అప్పుడుంటుంది అసలు టెన్షన్‌. పిల్లవాడు ఏడుపు ఆపేవరకు తల్లిదండ్రులకు ఏమీ తోచదు. కానీ జపాన్‌లోని టోక్యోలో సంగతే వేరు. అక్కడ ఏడ్చే పిల్లవాడే విజేతగా నిలుస్తాడు. అదేంటో మీరే చూడండి. జపాన్‌ రాజధాని టోక్యోలో సెన్‌సోజి అనే బౌద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక వేసవి కాలం మొదలయిందంటే ఆ సందడి ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ జరిగే ఓ పిల్లల పోటీనే ఇందుకు కారణం. ఆ పోటీ పేరు ‘నాకిజుమో’... అంటే ఏడ్చే పిల్లల పోటీ అని అర్థం. ‘ఏడ్చే పిల్లలు బాగా బలంగా ఉంటారు’ అని జపాన్లో ఓ సామెత ఉంది. అంతేకాదు! పిల్లలు ఏడిస్తే... ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయని కూడా వాళ్లు నమ్ముతారు. అందుకనే ఏటా ఈ పోటీ పెడతారు. నాలుగు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పోటీలో ప్రవేశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే పిల్లలని ఇద్దరు సుమోలు ఎదురెదురుగా పట్టుకుని నిలబడతారు. ఆ ఇద్దరు పిల్లలలో ఎవరు ముందు ఏడుస్తారో వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ పిల్లలిద్దరూ ఒకే సమయంలో ఏడిస్తే, వాళ్లలో ఎవరు గట్టిగా ఏడుస్తున్నారో చూస్తారు. పోటీలో పిల్లలు బాగా ఏడ్చేందుకు రిఫరీలే వాళ్లని భయపెడుతారు. అప్పటికీ పిల్లవాడు ఏడవకపోతే భయపెట్టే మాస్కులు వేసుకుని పిల్లలు జడుసుకునేలా చేస్తారు. ఆ పోటీ చూసేందుకు వచ్చిన జనం కూడా పిల్లల్ని ఏడవమని అరుస్తూ రెచ్చగొడతారు. ఇంత జరిగిన తర్వాత పిల్లలు ఎడవకుండా ఎలా ఉంటారు చెప్పండి! ఈ ఏడుపు పోటీలు ఇప్పటివి కాదు. దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచీ వీటని నిర్వహిస్తున్నారట. ఏటా దాదాపు రెండు వందల మంది పిల్లల్ని ఈ పోటీలో పాల్గొనేందుకు తీసుకువస్తూ ఉంటారు. వాళ్లకి సుమో బట్టలు వేసి, నిర్వాహకుల చేతిలో పెడుతుంటారు. నిజానికి పిల్లలు అప్పుడప్పుడూ ఏడవటం మంచిదే కావచ్చు. దాని వల్ల వాళ్ల ఊపిరితిత్తులు బలపడతాయి. వాళ్ల ఆకలి, అనారోగ్యాల గురించి పెద్దవాళ్లకి తెలుస్తాయి. కానీ అదేపనిగా గుక్కపట్టి ఏడవటం వల్ల, వాళ్ల మెదడు దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌వాసులు మాత్రం ఈ మాటని వినేలా లేరు. - నిర్జర.
    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్‌ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట. మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్‌ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే! ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్‌ పనితీరు మెరుగుపడి, షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్‌ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్‌ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్‌ ని హ్యాపీగా గడిపేయండి.  
  మనం తల ఎటువైపు పెట్టి పడుకుంటే మంచిదో ఆలోచిస్తాం. కానీ ఎటువైపు తిరిగి పడుకోవాలో పట్టించుకోము. కుడివైపు అయినా, ఎడమవైపు అయినా పెద్దగా తేడా ఉండదన్నది మన నమ్మకం. నిజానికి ఎడమవైపు తిరిగి పడుకుంటే చాలా లాభాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. Digestion బాగుంటుంది:- మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునే పాంక్రియాస్‌ ఎడమచేతి వైపే ఉంటాయి. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి త్వరగా చేరిపోతుంది. దాని వల్ల ఎసిడిటీ, కాన్‌స్టిపేషన్‌లాంటి సమస్యలు రావు. అందుకే ఎప్పుడన్నా భుక్తాయాసంగా ఉన్నప్పుడు, ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. గర్భవతులకి మంచిది:- గర్భవతులు, ముఖ్యంగా నెలలు నిండినవారు ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వల్ల వెన్నెముక మీద భారం తగ్గుతుంది. పైగా కడుపులోని బిడ్డకు రక్తప్రసారం కూడా మెరుగవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ లివర్‌కు నొక్కుకుపోవడం వల్ల, లివర్‌ పనితీరు దెబ్బతినవచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ సమస్య కూడా దరిచేరదు. గుండె బాగుంటుంది:- ఎడమవైపు అనగానే మనకి గుర్తుకి వచ్చే భాగం గుండెకాయే! ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె తన సహజమైన స్థితిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా పడుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, అందులో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరుగుతాయట. అంతేకాదు... * వెన్ను సమస్యలు ఉన్నవారిలో కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్లే ఎక్కువ ఉపశమనం ఉంటుందని తేలింది. * కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల రాత్రిళ్లు గుండె మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల, కడుపులో రసాయనాలు పైకి వచ్చే అవకాశమే ఉండదంటున్నారు. * మన శరీరంలోని పనికిమాలిన పదార్థాలను బయటకు పంపేందుకు లింఫ్‌ గ్రంధులు చాలా ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు ఈ లింఫ్‌ గ్రంధులు మరింత ప్రభావంగా పనిచేస్తాయట. * ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య గురక. మనం పడుకున్నప్పుడు, గొంతులో ఉండే కొండనాలుక వైబ్రేట్‌ అవ్వడం వల్ల గురక ఏర్పడుతుంది. అయితే ఎడమవైపు తిరిగి పడుకుంటే కొండనాలుక సరైన పొజీషన్‌లోనే ఉండి, గురక రాదని చెబుతున్నారు. చూశారుగా! ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, నిద్రపోయేటప్పుడు కాస్త ఎడమవైపుకి తిరిగి పడుకుని చూడండి... - నిర్జర.