EDITORIAL SPECIAL
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
ALSO ON TELUGUONE N E W S
  ప్రిన్స్ మ‌హేశ్ హీరోగా 1999లో కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేసిన 'రాజ‌కుమారుడు' సినిమాతో ప‌రిచ‌య‌మ‌య్యాడు. కాల‌క్ర‌మంలో తండ్రి కృష్ణ‌కు త‌గిన వార‌సుడిగా సూప‌ర్‌స్టార్ అనిపించుకొని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీతో 21 సంవ‌త్స‌రాల్లో 26 సినిమాలు పూర్తి చేశాడు మ‌హేశ్‌. అత‌ని స‌ర‌స‌న జోడీగా ఇటు సౌత్ బ్యూటీలు, అటు నార్త్ హీరోయిన్లు న‌టించారు. వారిలో ఏడుగురు సుంద‌రాంగులు మ‌హేశ్ సినిమాల‌తోటే టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వ‌గా, వాళ్లంతా ఉత్త‌రాది భామ‌లే కావ‌డం విశేషం. వాళ్లెవ‌రు, ఇప్పుడు వాళ్ల స్థితి ఎలా ఉందో ఓ చూపు చూసేద్దాం... 1. న‌మ్ర‌తా శిరోద్క‌ర్ (వంశీ) మ‌హేశ్ హీరోగా న‌టించిన మూడో సినిమా 'వంశీ' ద్వారా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టింది. దాని త‌ర్వాత మ‌రో సినిమా మాత్ర‌మే ఆమె తెలుగులో చేసింది. అది మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న చేసిన 'అంజి'. ఆమె న‌టించగా విడుద‌లైన చివ‌రి సినిమా కూడా అదే. తెలుగులో త‌న తొలి సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, ఆ సినిమా హీరో మ‌హేశ్‌నే న‌మ్ర‌త పెళ్లి చేసుకోవ‌డం, త‌న తొలి టాలీవుడ్ డెబ్యూ హీరోయిన్‌నే మ‌హేశ్ పెళ్లాడ‌టం ఒక విశేషం. ఇద్ద‌రు పిల్ల‌లు.. గౌత‌మ్‌కృష్ణ‌, సితారల‌కు త‌ల్లిదండ్రులుగా ఆ ఇద్ద‌రి వైవాహిక బంధం అత్యంత ఆనంద‌క‌రంగా న‌డుస్తోంది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మైంది న‌మ్ర‌త‌. 2. సోనాలీ బెంద్రే (మురారి) కృష్ణ‌వంశీ డైరెక్ట్ చేసిన 'మురారి' మూవీ మ‌హేశ్ కెరీర్‌కు ఊత‌మివ్వ‌డ‌మే కాకుండా, సోనాలీ బెంద్రేతో అత‌డి జోడీ ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. సోనాలీ అంద‌చందాలు, న‌ట‌నా ప్ర‌తిభ‌కు ముగ్ధులైన ప్రేక్ష‌కులు ఆ త‌ర్వాత కూడా ఆమెను ఆద‌రించారు. 'ఇంద్ర', 'ఖ‌డ్గం', 'మ‌న్మ‌థుడు' చిత్రాలు అందుకు ఉదాహ‌ర‌ణ‌. తెలుగులో చిరంజీవితో చేసిన రెండో సినిమా 'శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్' సైతం ఆమెకు మంచి పేరు తెచ్చింది. దాని త‌ర్వాత ఆమె సినిమాల‌కు స్వ‌స్తిచెప్పింది. అంత‌కు రెండేళ్ల క్రిత‌మే పెళ్లాడిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ గోల్డీ బెహ‌ల్‌తో జీవితంలో స్థిర‌ప‌డింది. స‌రిగ్గా రెండేళ్ల క్రితం త‌న‌కు కేన్సర్ అని వెల్ల‌డించిన ఆమె, ప్ర‌స్తుతం దాని నుంచి రిక‌వ‌ర్ అవుతోంది. 3. లీసా రే (ట‌క్క‌రి దొంగ‌) తండ్రి బాట‌లో కౌబాయ్‌గా మ‌హేశ్ న‌టించిన 'ట‌క్క‌రిదొంగ‌' సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన తార లీసా రే ఒక ఇండో కెన‌డియ‌న్ యాక్ట‌ర్‌. వ‌య‌సులో మ‌హేశ్ కంటే మూడేళ్లు పెద్ద‌దైన ఆమె తెలుగులో న‌టించిన ఏకైక సినిమా ఇదే. ఆ త‌ర్వాత ఇంగ్లిష్ సినిమాల్లోనే న‌టిస్తూ వ‌చ్చిన ఆమె నాలుగేళ్ల‌గా హిందీ సినిమాలు చేస్తోంది. గ‌తేడాది ఎ.ఆర్‌. రెహ‌మాన్ మ్యూజిక్ స‌మ‌కూర్చిన '99 సాంగ్స్' సినిమా చేసింది. ప్ర‌స్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్‌లో లెస్బియ‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. 2009లోనే బ్ల‌డ్ కేన్స‌ర్ బారిన ప‌డిన ఆమె.. దాని నుంచి కోలుకొని ఒక‌వైపు న‌టిస్తూనే మ‌రోవైపు కేన్స‌ర్‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసే అనేక కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటుండ‌టం విశేషం. 4. బిపాషా బ‌సు (ట‌క్క‌రి దొంగ‌) 'ట‌క్క‌రిదొంగ‌'లో సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించిన బాలీవుడ్ బ్యూటీ బిపాషా బ‌సు, ఆ సినిమా త‌ర్వాత లీసా రే త‌ర‌హాలోనే మ‌రే తెలుగు సినిమాలోనూ న‌టించ‌లేదు. ఓవ‌రాల్‌గా ఇది ఆమెకు రెండో సినిమా. దీనికి ముందు బాలీవుడ్‌లో 'అజ్‌న‌బీ' మూవీతో తెరంగేట్రం చేసి, బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న బిపాషా.. రాజ్‌, జిస్మ్‌, ఐత్‌బార్‌, నో ఎంట్రీ, రేస్‌, బ‌చ్‌నా ఏ హ‌సీనో, రాజ్ 3డి వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. 2005, 2007 సంవ‌త్స‌రాల‌కు గాను 'సెక్సియెస్ట్ ఉమ‌న్ ఇన్ ఏషియా'గా ఆమెను యుకె మ్యాగ‌జైన్‌ 'ఈస్ట‌ర్న్ ఐ' ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. కొన్నాళ్లు బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ జాన్ అబ్ర‌హాంతో డేటింగ్ చేసిన ఆమె.. అత‌డితో బ్రేక‌ప్ త‌ర్వాత‌ 2016లో న‌టుడు మోడ‌ల్ క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను పెళ్లాడింది. 5. అమృతా రావ్ (అతిథి) సూర‌జ్ ఆర్‌. బ‌ర్జాత్యా డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ 'వివాహ్‌'లో హీరోయిన్‌గా అమృతా రావ్ న‌ట‌న దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల‌ను అల‌రించ‌డంతో, 'అతిథి' మూవీలో అమృత పాత్ర‌కు అమృతా రావే క‌రెక్ట‌ని ఫిక్స‌యి ఆమెను టాలీవుడ్‌కు తెచ్చాడు డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి. సినిమా ఫ‌లితం ఎలా ఉండ‌నీ గాక‌, అమృతా రావ్ న‌ట‌న, ఆమె అంద‌చందాలు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. తెలుగులో ఆమె న‌టించిన సినిమా ఇదొక్క‌టే. మై నేమ్ ఈజ్ ఆంథోనీ గాన్‌స్లేవ్స్‌, వెల్‌క‌మ్ టు స‌జ్జ‌న్‌పూర్‌, జాలీ ఎల్ఎల్‌బీ, స‌త్యాగ్ర‌హ లాంటి సినిమాలు చేశాక సినిమాల‌కు దూర‌మైంది. 2016లో బాయ్‌ఫ్రెండ్ అన్‌మోల్‌ను పెళ్లాడిన ఆమె, ఆరేళ్ల గ్యాప్‌తో 2019లో బాల్ థాక‌రే బ‌యోపిక్‌గా వ‌చ్చిన 'థాక‌రే' మూవీలో ఆయ‌న భార్య మీనా థాక‌రే క్యారెక్ట‌ర్ చేసి అంద‌రి ప్ర‌శంస‌లూ పొందింది. 6. కృతి స‌న‌న్ (1.. నేనొక్క‌డినే) మ‌హేశ్ స‌ర‌స‌న స‌మీరా పాత్ర‌కు మొద‌ట త‌మ‌న్నా, త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తీసుకోవాల‌ని అనుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్‌.. ఆ ఇద్ద‌రి బిజీ షెడ్యూళ్ల కార‌ణంగా డేట్స్ ప్రాబ్లెమ్ త‌లెత్త‌డంతో కొత్త‌మ్మాయి కోసం అన్వేషించి, మోడ‌ల్ అయిన కృతి స‌న‌న్‌ను ఎంచుకున్నాడు. '1.. నేనొక్క‌డినే'తోటే కృతి తెరంగేట్రం చేసింది. స‌మీర‌గా ఆమె ప‌ర్ఫార్మ‌న్స్‌ను ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు మెచ్చారు. దీని త‌ర్వాత తెలుగులో నాగ‌చైత‌న్య జోడీగా 'దోచెయ్' మూవీ చేసింది కృతి. ఆ త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే అంకిత‌మై అక్కడ స్టార్ యాక్ట్రెస్‌గా రాణిస్తోంది. గ‌తేడాది 'లుకా చుప్పీ', 'హౌస్‌ఫుల్ 4' సినిమాల‌తో అల‌రించింది. ప్ర‌స్తుతం 'మిమి' అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌తో పాటు అక్ష‌య్‌కుమార్ సినిమా 'బ‌చ్చ‌న్ పాండే' చేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుంద‌రి. 7. కియారా అద్వానీ (భ‌ర‌త్ అనే నేను) హిందీలో తెరంగేట్రం చేసిన నాలుగేళ్ల‌కు టాలీవుడ్‌కు 'భ‌ర‌త్ అనే నేను' మూవీతో ప‌రిచ‌య‌మైంది చ‌క్క‌ని చుక్క లాంటి కియారా అద్వానీ. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ముఖ్య‌మంత్రి భ‌ర‌త్‌గా చేసిన మ‌హేశ్ ప్రేమించే ఎంబీఏ గ్రాడ్యుయేట్ వ‌సుమ‌తి పాత్ర‌లో చ‌క్క‌గా రాణించింది. ఆమె అందానికి కుర్ర‌కారు దాసోహ‌మ‌న్నారు. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ జోడీగా 'విన‌య విధేయ రామ‌'లో క‌నిపించిన కియారా.. ఇవాళ బాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న తార‌. 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'క‌బీర్ సింగ్‌'లో హీరోయిన్ ప్రీతి సింగ్‌గా న‌టించి దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియుల హృద‌యాల‌ను దోచుకుంది. అక్ష‌య్‌కుమార్ స‌ర‌స‌న న‌టించిన 'ల‌క్ష్మీ బాంబ్' మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇటీవ‌ల వ‌చ్చిన నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'గిల్టీ', అదివ‌ర‌కటి 'ల‌స్ట్ స్టోరీస్' సినిమాల్లో ఆమె న‌ట‌న అంద‌రి ప్ర‌శంస‌లూ పొందింది.
సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ఫొటోలతో హడావిడి చేయడం స్టార్ట్ చేశారు. 'పవర్ స్టార్' టైటిల్‌లో, ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్స్‌లో ఆయన ఎవరిని టార్గెట్ చేశారనేది క్లియర్ కట్‌గా ఎల్‌కెజి పిల్లాడికి అయినా సరే తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను సైతం వర్మ టార్గెట్ చేశారు. అదే మాట ఆయనతో అంటే ఎప్పటిలా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. వర్మ సినిమాలో హీరో పాత్రధారి ఎవరిలా ఉన్నాడని అడిగితే ఠక్కున సమాధానం ఇస్తారు.  వర్మ మాత్రం తన సినిమాలో హీరో పేరు పవర్‌స్టార్ అనీ, అందుకే పవర్‌స్టార్ టైటిల్ పెట్టాననీ... పవన్ కల్యాణ్‌కి, ఈ సినిమాకి సంబంధం లేదనీ, కావాలంటే పవన్ అభిమానుల మీద ఒట్టేస్తాననీ... ఎవరైనా గుర్తొస్తే యాదృశ్చికమేననీ అంటున్నారు. కానీ, వర్మ పోస్టర్లను ఎవరైనా సీరియస్ గా తీసుకుంటే పెద్ద వివాదం అయ్యేలా ఉంది. త్రివిక్రమ్ మీద  చేసుకున్నట్టు ఒక స్టిల్ విడుదల చేశారు.  మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను కెలకాలని వర్మ తీవ్రంగా ట్రై చేస్తున్నారు. కానీ, ఈసారి అభిమానులలో కొందరు తప్ప పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వర్మ ట్వీట్స్ కింద మెగాభిమానుల కంటే ఇతర హీరోల అభిమానుల ట్వీట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి.  దాంతో వర్మకు కావలసిన క్రేజ్ వచ్చింది. ఏటీటీలో విడుదల చేసినప్పుడు యాంటీ ఫాన్స్ చూసినా బడ్జెట్ కంటే  ఎక్కువ డబ్బులు లాక్కోవచ్చు. 
సామాజిక మాధ్యమాలలో నటీమణులకు ఎటువంటి వేధింపులు ఎదురవుతున్నాయనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అనునిత్యం ఎవరో ఒకరికి ఆకతాయిల నుండి కామ కూతలు తప్పవు. తాజాగా నటి, 'బిగ్ బాస్' ఫేమ్ పునర్నవి భూపాలం ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నారు.  'నీ ఫొటో చూస్తూ రోజూ హస్త ప్రయోగం చేసుకుంటున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఒకడు మెసేజ్ చేశాడు. అందులో ఇంగ్లిష్ కూడా సరిగా లేదు. అతడి మెసేజ్ స్క్రీన్ షాట్ తీసిన ఆమె ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఎవరో ఒకరు వాడికి ఇంగ్లిష్ నేర్పమని అన్నారు. 'ఇవన్నీ కామన్ కదా ఈ రోజుల్లో. అబ్బాయిలకు హస్త ప్రయోగం చేసుకోవడం, గట్రా. సీరియస్ ఎందుకు?' అని ఇంకొకరు మెసేజ్ చేశాడు. ఈసారి పునర్నవి భూపాలం గట్టిగా ఇచ్చింది. 'ఆ గొట్టం గాడిని జస్టిఫై చేయడనికి వీడు వచ్చాడు" అని స్ట్రాంగ్ కోటింగ్ ఇచ్చాడు.  "ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది. అది తెలుసా?" అని పునర్నవి భూపాలం కామ కూతలు మెసేజ్ చేసిన వాళ్లను ప్రశ్నించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ "అవును. ఇటువంటి వెధవలు ఉంటారు. కొన్ని మెసేజ్ లు నేను డైరెక్టుగా పోస్ట్ చేయడంతో కొంతమంది షాక్ అయ్యారు. నేను పోస్ట్ చేసిన ప్రతిదానికి సెక్స్ కోణంలో మాట్లాడేవారు ఉన్నారు. వాళ్ల భాగోతం బయటపెట్టే సమయం వచ్చింది. వాళ్లు ఎస్కేప్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. ఇటువంటి మెసేజ్ లు స్క్రీన్ షాట్ తీసి, సైబర్ క్రైమ్ ద్వారా  కంప్లయింట్ ఇస్తా" అని అన్నారు. ఎవరైనా అటువంటి మెసేజ్ చేస్తే చూసీచూడనట్టు వదలొద్దనీ, డిలీట్ చేయవద్దనీ, వేధింపులకు పాల్పడిన వాళ్లపై  కంప్లయింట్ ఇవ్వమని ఆమె అన్నారు.
  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'వ‌కీల్ సాబ్' మూవీని ఈ ఏడాది ఎలాగైనా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని నిర్మాత దిల్ రాజు త‌పిస్తున్నా ప‌రిస్థితులు అనుకూలంగా క‌నిపించ‌డం లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గి, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాకే సెట్స్‌పైకి వెళ్లాల‌ని పవ‌న్ కల్యాణ్ భావిస్తున్నాడు. ఆయ‌న‌కు సంబంధించి మ‌రో రెండు వారాల షెడ్యూల్ మిగిలి ఉంది. 'వ‌కీల్ సాబ్'‌తో పాటు మ‌రో సినిమానీ పీకే చేస్తున్న విష‌యం తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 19వ శతాబ్దం ద్వితీయార్ధం నేప‌థ్యంలో న‌డుస్తుంది. ప్ర‌చారంలో ఉన్న దాని ప్ర‌కారం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుపొందిన పండుగ సాయ‌న్న క‌థ ఈ సినిమాకు ఆధారం. మహ‌బూబ్‌న‌గ‌ర్ ద‌గ్గ‌ర్లోని మెరు‌గోని గ్రామ వాస్త‌వ్యుడైన సాయ‌న్న భూస్వాముల‌ను దోచుకొని పేద‌ల‌కు పంచిపెట్టేవాడుగా చ‌రిత్ర చెబుతోంది. ఆయ‌న‌పై బెక్కం జ‌నార్ద‌న్ రాసిన న‌వ‌ల ఆధారంగా ఇప్ప‌టికే క్రిష్ ఈ సినిమా స్క్రిప్టును పూర్తి చేసిన‌ప్ప‌టికీ, సాయ‌న్న వంశ‌స్తుల‌ను క‌లుసుకోవాల‌ని క్రిష్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు, వారి నోటి వెంట సాయ‌న్న వీర‌గాథ‌ల‌ను వినాల‌ని కూడా ఆయ‌న ఆశిస్తున్నాడు. త్వ‌ర‌లోనే క్రిష్ మెరుగోనికి వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని వినిపిస్తోంది. సాయ‌న్న క్యారెక్ట‌ర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ రీతిలో న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా కోసం 'విరూపాక్ష'‌, 'వారాహి' అనే టైటిల్స్‌ను ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేశారు. సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. ర‌త్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తనను తాను మొండిఘటంగా జయప్రద అభివర్ణించుకున్నారు. అంతే కాదు... తాను ఏ పనినైనా చాలా అకింతభావంతో, నిబద్ధతగా చేస్తానని చెప్పుకొచ్చారు. అకింతభావం, మొండితనం, నిబద్ధత మహిళకు ఉంటే చాలామంది మైనస్ అనుకుంటారనీ, తాను మాత్రం భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తానని జయప్రద తెలిపారు.  కథానాయికగా, నటిగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జయప్రద... రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేశారు. ఆమె జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. రాజకీయాల్లో పలు సవాళ్ళను ఎదుర్కొన్నారామె. జీవితంలో ఎన్నో విజయాలు, విమర్శలు చూసిన జయప్రద... ప్రస్తుతం ఓ పుస్తకం త్వరలో తన ఆత్మకథ రాయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎవరైనా స్ట్రాంగ్ మహిళకు రచనా బాధ్యతలు అప్పగిస్తానని ఆమె అన్నారు. మహిళా అయితేనే తన బయోగ్రఫీకి న్యాయం చేస్తుందని జయప్రద వ్యాఖ్యానించారు. ఆల్రెడీ సావిత్రి జీవితకథ ఆధారంగా 'మహానటి' సినిమా వచ్చింది. జయప్రద ఆటోబయోగ్రఫీ రాస్తే... దాన్ని ఎవరో ఒకరు సినిమాగా తీస్తారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు. 
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
  ఇది చాలాకాలం క్రితం జరిగిన కథ. అప్పట్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతనికి జీవితసత్యం ఏమిటో తెలుసుకోవాలని తెగ తపనగా ఉండేది. ఆ తపనతో అతను ఎక్కడెక్కడో వెతికాడు. ఎవరెవరినో కలిశాడు. అతను వెళ్లిన చోట, అతను కలిసినవారు రకరకాల జవాబులు చెప్పారు. కానీ వాటిలో ఏ ఒక్క జవాబు అతనికి తృప్తిగా తోచలేదు. కుర్రవాడు అలా తిరుగుతూ తిరుగతూ ఉండగా అతనికి ఎవరో ఓ సలహా చెప్పారు. ‘చూడు! ఇలా ఎంత తిరిగినా నీకు తగిన సమాధానం దొరకడు. ఈ ఊరి చివర ఉన్న అడవి మధ్యలో ఒక పాత బావి కనిపిస్తుంది. ఆ బావిలోకి తొంగిచూసి ఎవరైనా తమ మనసులోని ప్రశ్నని అడిగితే, తప్పకుండా జవాబు లభిస్తుంది,’ అని అన్నారు.   ఆ సలహా విన్న కుర్రవాడు బావి దగ్గరకు వెళ్లనే వెళ్లాడు. అందులోకి తొంగిచూసి... ’జీవిత సత్యం ఏమిటి?’ అని అడిగాడు. ‘ఈ అడవి దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో మూడో కూడలి దగ్గరకి వెళ్లి చూడు. అక్కడ నీకు జీవిత సత్యం ఏమిటో అర్థమవుతుంది,’ అని చెప్పింది బావి. బావి చెప్పినట్లుగానే, కుర్రవాడు అడవి తర్వాత వచ్చే గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామంలోని మూడో కూడలి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాడు. అక్కడ అతనికి మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. మొదటి దుకాణంలో ఇనప ముక్కలు అమ్ముతున్నారు, రెండోది కలప దుకాణం, మూడుదాన్లో తీగలు అమ్మకానికి ఉన్నాయి. అంతకుమించి వాటిలో ఎలాంటి ప్రత్యేకతా ఆ కుర్రవాడికి కనిపించలేదు. వాటిలో జీవిత సత్యం ఏమిటో ఆ కుర్రవాడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కుర్రవాడు నిరాశతో మళ్లీ బావి దగ్గరకు వెళ్లాడు. ‘నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ కూడలి దగ్గరకు వెళ్లాను. అక్కడ ఓ మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. వాటిలో జీవితసత్యం ఏముందో నాకు అర్థం కాలేదు!’ అని నిష్టూరమాడాడు.   ‘కంగారుపడకు. వాటిలో దాగిన జీవితసత్యం నీకు నిదానంగా బోధపడుతుంది. ఆ పరిపక్వత నీకు వచ్చిన రోజున నేను చెప్పిన జవాబు తప్పు కాదని తెలుస్తుంది,’ అని బదులిచ్చింది బావి. కుర్రవాడు ఉసూరుమంటూ తన గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన రోజువారీ పనులలో పడిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుర్రవాడికి వయసు, ఆ వయసుతో పాటుగా లోకజ్ఞానం పెరిగింది. జీవితం మీద తనకంటూ కొంత అవగాహన ఏర్పడింది. అలాంటి ఒక రోజున అతను పడుకుని ఉండగా... ఎక్కడి నుంచో ఒక సితార మోగుతున్న సంగీతం వినిపించింది. ఆ మధురమైన సంగీతం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ సంగీతం వింటూ అతను పరివశించిపోయడు. హఠాత్తుగా... ఆ సంగీతంలో అతనికి జీవితసత్యం స్ఫురించింది. లోహం, చెక్క, లోహపు తీగలు... ఈ మూడు విడివిడిగా ఎందుకూ పనికిరాని చెత్తలాగా కనిపిస్తాయి. కానీ ఈ మూడింటి కలియికతో సితార్లాంటి అందమైన వాయిద్యం రూపొందుతుంది. ఆ వాయిద్యాన్ని మీటితే అద్భుతమైన సంగీతం జనిస్తుంది. జీవితం కూడా ఇంతే! జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కావల్సిన ముడిసరుకు అంతా ప్రకృతి మనకు ఇచ్చింది. కానీ మనలో ఉన్న సమార్థ్యాన్ని మర్చిపోయి... ఎందుకూ పనికిరానివారమని మధనపడిపోతాం. విధి మనకి అన్యాయం చేసిందని ఆరోపిస్తాం. నిజంగా సరైన విచక్షణే ఉంటే... కనిపించని విధి మీద నిందలు వేయడం మాని, అందుబాటులో ఉన్న వనరులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే అన్నింటికీ మించిన జీవితసత్యం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ఒక కుర్రవాడికి కేన్సర్‌ చివరి దశలో ఉందని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ అతనికి ఈ ప్రపంచం ఒక దుఃఖసాగరంగా మారిపోయింది. ఎటు చూసినా, ఏది పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా తన వ్యాధే గుర్తుకు వచ్చేది. అందుకనే నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ తన గదిలో ఒంటరిగా చివరి రోజులను వెళ్లదీస్తూ ఉండేవాడు. ఒకసారి ఎందుకనో కుర్రవాడికి అలా వీధి చివరిదాకా వెళ్లి రావాలని అనిపించింది. చాలాకాలం తరువాత కుర్రవాడు వీధిలోకి అడుగుపెట్టడం చూసి అతని తల్లికి కూడా సంతోషం వేసింది. ఊరికనే అలా నాలుగడుగులు వేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇంతలో వీధి చివర కొత్తగా పెట్టిన సీడీల షాప్ చూసేసరికి అందులోకి అడుగుపెట్టాలనిపించింది. కుర్రవాడు సీడీల షాప్‌లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ కౌంటర్‌ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని చూసి మనసు చెదిరిపోయింది. ఆ అమ్మాయిని చూడటం కోసం అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఆ షాపులోకి వెళ్లి ఏదో ఒక సీడీని కొనుక్కునేవాడు కుర్రవాడు. ఆ సీడీని భద్రంగా ఓ కవర్లో పెట్టి, చిరునవ్వుతో అతనికి అందించేది అమ్మాయి. ఆ అమ్మాయితో ఓసారి సరదాగా అలా షికారుకి వెళ్తే ఎంత బాగుండో అనుకునేవాడు కుర్రవాడు. కానీ తీరా కాదంటే ఆ బాధని తట్టుకునే స్థితిలో అతని మనసు లేదు. అందుకనే కనీసం ఒక్క పది నిమిషాలైనా ఆమెని చూస్తూ గడపడం కోసం రోజూ షాపుకి వెళ్లేవాడు. కానీ అలా ఎన్నాళ్లని వెళ్తాడు. నెల తిరక్కుండానే ఆ కుర్రవాడిని క్యాన్సర్‌ కబళించివేసింది.    కుర్రవాడి చావుకి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎలాగొలా బంధువుల సాయంతో అతని అంత్యక్రియలు పూర్తిచేసింది. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అతని జ్ఞాపకాలని వదలలేకపోయింది తల్లి. కాసేపు అతని గదిలో కూర్చునైనా సేదతీరుదామనుకుంటూ, అతని గదిలోకి అడుగుపెట్టింది. తల్లి గదిలోకి అడుగుపెట్టేసరికి ఒక మూల గుట్టగా పేర్చి ఉన్న సీడీలు కనిపించాయి. కొన్నవి కొన్నట్లు ఆ సీడీలు అలాగే ఉన్నాయి. కనీసం వాటిని కవర్లోంచి కూడా తీయలేదు కుర్రవాడు. అతని అవసరం సీడీలు కాదు కదా! అందులో ఒక కవర్‌ని తెరిచి చూసింది తల్లి. అంతే! కవర్లో ఉన్నదాన్ని చూసి ఆమె గుండె చెదిరిపోయింది. ‘మీ నవ్వు చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కాఫీ తాగాలనుంది’ అన్న చీటీ సీడీతో పాటే ఆ కవర్లో ఉంచింది ఆ అమ్మాయి. రెండో కవరు, మూడో కవరు, మరో కవరు, ఇంకో కవరు.... అన్నింటిలోనూ ఇలాంటి చీటీలే ఉన్నాయి. ఆ కవర్లని కుర్రవాడు ఒక్కసారన్నా తెరిచి చూస్తే అతని చివరి రోజులు ఎంత అందంగా గడిచేవో కదా! పోనీ తన మనసులో ఉన్న మాటనన్నా అతను చెప్పగలిగితే ఎంత బాగుండేదో! మనలో చాలామంది ఆ కుర్రవాడిలాగే ప్రవర్తిస్తుంటాం. మనకి అర్హత లేదనో, సాధ్యం కాదనో... మన లక్ష్యాలని మనసులోనే దాచేసుకుంటాం. దక్కదేమో అన్న భయంతో ఉన్న కొద్ది రోజులనీ భారంగా గడిపేస్తుంటాం. వెనక్కి తిరిగి చూసుకునే సరికి కాలం కాస్తా కరిగిపోతుంది.
గుమ్మడి, బొప్పాయ రోగనిరోధకశక్తి పెంచుతాయి ఎనర్జీ బూస్టర్ గా పనిచేసే సిట్రస్ జాతి పండ్లు కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి.  ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను మనం ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర భాగాల పని తీరు సక్రమంగా సాగుతుంది. సీజనల్ వచ్చే అనేక వ్యాధుల నుంచి,  కరోనా లాంటి భయంకర రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...  గుమ్మడి కాయ గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. బొప్పాయి బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజాయ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో  విటమిన్ లోపాలు ఉండవు . అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. - కివి ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి. - నిమ్మకాయ సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. - నారింజ జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు  ఆరెంజ్ రసం తాగితే  తక్షణం శక్తి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.  - ఉసిరి ఔషధాల సిరి గా ఉసిరిని చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండు రకాల ఉసిరి లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే ఉసిరిలో అధిక రక్తస్రావాన్ని నివారించేలో లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూరగాయలు లోనే కాకుండా ఔషధాలలో ఎక్కువగా వాడతారు. - అరటిపండు అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. - పుచ్చకాయ ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఆకట్టుకునే పుచ్చకాయ సీజనల్ లోనే లభించేది. కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు మార్కెట్లో కనిపిస్తుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. - అల్ల నేరేడు సీజనల్ గా  వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లు కు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.  చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం.. రోజువారి ఆహారంలో ఇవి ఉన్నాయా.. ప్రతి రోజూ మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యారెట్, బచ్చలి, తులసి, పాలకూర, నిమ్మకాయ, కోడిగుడ్లు మొదలైనవి. - ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలని మన పెద్దలు అంటారు పూజించడానికి కాదు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మంచివి. రోజూ నాలుగు తులసి ఆకులు నమలడం వలన శరీరంలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి ఎన్నో వ్యాధి కారకాలను తులసి నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల కూడా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. - మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజు ఉదయాన్నే మీ రోజుని గ్రీన్ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్  మీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం కాకుండా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  - మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. వీటిలో ముఖ్యంగా బచ్చలి, పాలకూర. రోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ఆకుకూరల్లో బచ్చలి కూరది విశిష్ట స్థానం. ఇందులో విటమిన్ సి తోపాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. - పాలకూర విటమిన్ సి ,బి 6 తో పాటు విటమిన్ కె ఇందులో అధికంగా ఉంటుంది క్యారెట్ ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ బి 6 యాంటీఆక్సిడెంట్లు ఉత్తేజపరుస్తాయి క్యారెట్ టమాటతో కలిపి తాగితే క్యాన్సర్ ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. - ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే పెరుగును రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట అన్నంలో తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పెరుగు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఈ పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. -  ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దు.గుడ్డు లోని ప్రోటీన్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి. - శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లు తిరిగి ఏర్పడ్డానికి జింక్ బాగా తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన జింక్ ఎక్కువగా కోడిగుడ్డు మాంసంతో పాటు సీఫుడ్ లో లభిస్తుంది వారానికి రెండుసార్లు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన జింక్ విటమిన్-డి లభిస్తాయి వీటివలన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది. - ఎర్ర బియ్యం లోనూ అధిక యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ ఉంది రోగనిరోధకశక్తిని పెంచడానికి పళ్ళు కూరగాయలు మసాలా దినుసులతో పాటు ఎర్ర బియ్యం కూడా ఎంతో ఉపయోగపడతాయి.‌ వీటన్నింటితో పాటు ప్రతిరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
మనం నిత్యం తీసుకునే ఆహారంలో సుగంధద్రవ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో మరోసారి మన సుగంధద్రవ్యాలలోని ఔషధ విలువల గురించి చర్చ జరుగుతుంది. తక్కువ మోతాదులో వాడే వీటి వల్ల మనం తీసుకునే ఆహారానికి కమ్మని రుచి వస్తుంది. వీటిని రుచికోసమే వాడతామా అంటే కాదనే చెప్పాలి. అంతకుమించిన  వీటిలో ఉన్నది ఎంటో తెలుసుకుందాం.. శరీరంలో రక్తకణాలు ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వ్యాధులకు ఎదుర్కోవాలన్నా ఆక్సిజన్ తగినంతగా శరీరకణాలను అందాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే సుగంధ ద్రవ్యాలకు రక్తకణాలు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించేలా చేయగలిగే శక్తి ఉంది. దీన్నే ఓఆర్ఎసి( ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్ కెపాసిటీ) అని పిలుస్తారు. మనం రోజూ వాడే పసుపు, తులసి, అల్లం మొదలైన వాటిలో పదిరెట్లు ఓఆర్ఎసి ఉంటుంది. అంతేకాదు ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మూలికలు ఆక్సిజెన్ గ్రహించే శక్తిని పెంచుతాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలోని ORAC .... లవంగం: 314,446 ORAC దాల్చినచెక్క: 267,537 ORAC పసుపు: 102,700 ORAC జీలకర్ర: 76,800 ORAC తులసి: 67,553 ORAC అల్లం: 28,811 ORAC జాజికాయ : 69,640 ORAC నల్ల మిరియాలు : 34, 053 ORAC కోవిడ్ 19 వైరస్  నుంచి రక్షణ పొందాలంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తినిపెంచుకోవడమే ఏకైకమార్గం. ఓఆర్ఎసి ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరా రక్షణ యంత్రాంగానికి కావల్సిన సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా3 వంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. మన ఆయుర్వేదంలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధునిక యుగంలోనూ మందులు లేని ఎన్నో వ్యాధులను ఇవి నయం చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధులను అరికట్టడంతోనూ మన భారతీయ ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాంప్రదాయ ఆహారంలోనే ఔషధ విలువలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి. భవిష్యత్ లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే కంప్యూటర్ లో ఇంటెల్ ప్రాసెసర్  పనిచేసినట్టే మన శరీరంలోనూ రోగనిరోధక శక్తి పనిచేయాల్సిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.