చత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ ..8 మంది నక్సలైట్ల హతం 

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఇద్దరు భధ్రతాసిబ్బందికి గాయాలయ్యాయి. చత్తీస్ గడ్ లో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు హాయంలో రెండు ఎన్ కౌంటర్లు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇవ్వాళ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరగడం నక్సలైట్ల ఉనికి లేకుండా పాలకులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది.  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లా మన్పూర్ అటవీ ప్రాంతం పరిధిలోని పర్దోని దగ్గర మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా నలుగురు మావోయిస్టులు, ఒక ఎస్సై మరణించారు. చనిపోయిన వారిలో సీపీఐ మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్ అశోక్, ఏరియా కమిటీ మెంబర్ నరేటి కృష్ణ, దళ సభ్యులు సవిత, పరిమిళ ఉన్నారు. చనిపోయిన ఎస్సై పేరు శ్యామ్ కిషోర్ శర్మ. అయితే ఈ సంఘటనపై పోలీసుల వర్షన్ మాత్రమే ఇప్పటి వరకు తెలిసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటన‌ కానీ, స్థానికులు ‌కానీ ఇంత వరకు మీడియాకు ‍అమ్దుబాటులోకి రాలేదు. అయితే పోలీసులు మాత్రం ఎప్పుడూ చెప్పే కథనే మళ్ళీ చెప్పారు. వారి కథనం ఏంటంటే.... మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో  జరిగిన ఎన్ కౌంటర్ జరిగిన తీరు హృదయవిదారకంగా జరిగింది.  మన్పూర్ కు నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.
Publish Date: Apr 16, 2024 7:00PM

మాట త‌ప్ప‌టం జ‌గ‌న్ నైజం.. చెప్పింది చేయ‌టం చంద్ర‌బాబు ల‌క్ష‌ణం.. కేశినేని వెంక‌ట్

543వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం  క‌మ‌లం గుర్తు, సైకిల్ గుర్తు పై ఓటు వేయాల‌ని అభ్య‌ర్ధ‌న  కేశినేని వెంక‌ట్, యలమంచిలి కార్తీక్ కి అపూర్వ స్వాగ‌తం వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి అప్పుల‌పాలు చేసి ప్ర‌జ‌ల నెత్తిమీద భారం మోపాడు. ఈ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ చేసిన ప‌ని ఒక్క‌టే..ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నెరవేర్చ‌కుండా మాట త‌ప్ప‌టం..మాట త‌ప్పే నైజం గ‌ల జ‌గ‌న్..ఇదొక్క‌టి మాత్ర‌మే ఖ‌చ్చితంగా చేశాడ‌ని టిడిపి యువ‌నాయ‌కుడు  కేశినేని వెంక‌ట్ అన్నారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ గారి త‌న‌య‌డు వెంక‌ట్, బిజెపి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుజాన చౌద‌రి గారి త‌న‌యుడు య‌ల‌మంచిలి కార్తీక్ క‌లిసి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంగ‌ళ‌వారం ఉద‌యం 53వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. జెండా సెంట‌ర్ నుండి మొద‌లైన ఈ ప్ర‌చారం ఆ ప్రాంతంలోని ప‌లు వీధుల్లో ఎన్డీయే కూట‌మి కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య భారీగా సాగింది. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కేశినేని వెంక‌ట్ అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు చేయ‌బోయే అభివృద్ది ప‌నుల గురించి చెప్పారు. విజ‌న్ గ‌ల నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు అయితే...ఎటువంటి ప్ర‌ణాళిక‌లు, అభివృద్ది ఆలోచ‌న‌లు లేని నాయ‌కుడు జ‌గ‌న్ అని వివ‌రించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌టంలో...ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌టంలో చంద్ర‌బాబు గారు చెప్పిందే కాదు..,చెప్ప‌న‌వి కూడా చేస్తార‌న్నారు. ఎన్డీయే అభ్య‌ర్ధుల్ని గెలిపించేందుకు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అసెంబ్లీ ఓటు క‌మ‌లం గుర్తుపై , పార్ల‌మెంట్ ఓటు సైకిల్ గుర్తు పై వేయాల‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ ప్రెసిడెంట్ రావూరి స‌త్య‌నారాయ‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ మైనార్టీ కార్య‌ద‌ర్శి ఇమ్రాన్, తెలుగు మ‌హిళ నాయ‌కురాలు ల‌క్ష్మీ, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మ‌ధుతో టిడిపి, బిజెపి, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.
Publish Date: Apr 16, 2024 6:56PM

వైసీపీని ఓడించి జీ టాక్స్ రద్దు చేసుకుందాం.. కేశినేని నాని

జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని  విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో  సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేశినేని చిన్న ఆర్యవైశ్య సమాజం మద్దతు పలికిన వారే అధికారంలోకి వస్తారన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ మాయమాటలకు అందరూ మోసపోయారన్నారు. అండగా ఉటాడని గెలిపిస్తే జనగ్ జే ట్యాక్స్ విధించి వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బందులకు గురి చేశారని, రాష్ట్రానికి ఏ కంపెనీ రాకుండా అభివృద్ధిని అడుడకున్నారని విమర్శించారు. ఆర్యవైశ్యులకు వ్యాపారాలు జరగకుండా ఇబ్బందులకు సృష్టించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా నిలిచి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే జే ట్యాక్స్ రద్దౌతుందని కేశినేని చిన్ని అన్నారు.   విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు గత 20 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘం సమస్యలు పరిష్కరించలేదని, తన ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం పార్టీలు మారుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని వాడుకున్నారని విమర్శించారు. ఆ వ్యక్తి ఇక్కడ గెలవడని పక్క నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడకు కొత్త అభ్యర్థిని తీసుకు వచ్చారు. సుజనా చౌదరి దెబ్బకు ఆ వ్యక్తి ఓడిపోవడం ఖాయమని చిన్ని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం, యువత భవిత కోసం కూటమికి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదన్న ఆయన రాష్ట్రంలో జగన్‌ పాలనపై అందరూ విసిగిపోయారని అన్నారు. సుజనా గెలుపుతో వెస్ట్‌ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సుజనాచౌదరి వెనకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకోవ టం ఈ ప్రాంతం అదృష్టంగా కేశినేని చిన్ని అభివర్ణించారు.  వెస్ట్‌ నియోజకవర్గాన్ని సుజనాచౌదరి మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉందన్నారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో   తాను కూడా నడుస్తానన్నారు. మోడీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సుజనాచౌదరి ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలం గుర్తుపై ఓటువేసి సుజనాచౌదరిని అసెంబ్లీకి పంపిం చాలని, పార్లమెంట్‌ అభ్యర్థిగా  సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్టా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.ఎస్‌.బేగ్‌, ఏపీ మర్చంట్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, దుర్గగుడి ఆలయ మాజీ  చైర్మన్‌ పైలా సొమినాయుడు, తమ్మలపాటి శ్రీనివాస్‌, గుంట్ల రాము, కోణిజేటి రమేష్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Publish Date: Apr 16, 2024 6:44PM

సివిల్స్ 2023 ఫలితాలు.. తెలుగమ్మాయికి మూడో ర్యాంక్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ (2023) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కి చెందిన దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. అలాగే ఈసారి ఫలితాలో ప్రథమ ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంకును అనిమేష్ ప్రధాన్ సొంతం చేసుకోగా, మూడో ర్యాంకర్‌గా తెలుగమ్మాయి అనన్య రెడ్డి నిలిచారు. గత సంవత్సరం కూడా తెలంగాణకే చెందిన ఉమా హారతి మూడో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా మూడో ర్యాంకు తెలుగమ్మాయికే రావడం విశేషం. ఇదిలా వుండగా, సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు యువతీ యువకుడు ర్యాంకుల పంట పండించారు. నందల సాయికిరణ్ (27), మేరుగు కౌశిక్ (82), పెంకీసు ధీరజ్ రెడ్డి (173), జి.అక్షయ్ దీపక్ (196), గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ (198) నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి (382), బన్న వెంకటేష్ (467), కడుమూరి హరిప్రసాద్ రాజు (475), పూల ధనుష్ (480), కె.శ్రీనివాసులు (526), నెల్లూరు సాయితేజ (558), కిరణ్ సాయింపు (568), మర్రిపాటి నాగ భరత్ (580), పోతుపురెడ్డి భార్గవ్ (590), కె.అర్పిత (639), ఐశ్వర్య నెల్లి శ్యామల (649), సాక్షి కుమారి (679), చౌహాన్ రాజ్‌కుమార్ (703), గాదె శ్వేత (711), వి.ధనుంజయ్ కుమార్ (810), లక్ష్మీ బానోతు (828), ఆదా సంపత్ కుమార్ (830), జె.రాహుల్ (873), హనిత వేములపాటలి (887), కె.శశికాంత్  (891), కెసారపు మీన (899), రావూరి సాయి అలేఖ్య (995), గోవద నవ్యశ్రీ (995) ర్యాంకులు సాధించారు.
Publish Date: Apr 16, 2024 5:31PM

తెలంగాణలో ముక్కోడు పోయాడు.... ఏపీలో తిక్కోడు పోతాడు

తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి పవర్‌ఫుల్ పంచ్ వేశారు. పల్నాడులో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో అటు ముక్కోడి మీద ఇటు తిక్కోడి మీద పంచుల మీద పంచులు వేసి జనం పొట్ట పట్టుకుని నవ్వేలా చేశారు. ‘‘మొన్నటి వరకూ మా ముక్కోడు బాగా నీలిగిండు. ఇప్పుడు అక్కడ ముక్కోడు పోయిన తర్వాత ఇక్కడ వున్న తిక్కోడికి భయం పట్టుకుంది. మేం అక్కడ తిక్కోణ్ణి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తిక్కోణ్ణి ఇంటకి పంపించేయాల్సిన అవసరం వుంది. అందుకనే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, టూరిజానికి శాడిజానికి, విజనర్‌కి ప్రిజనర్‌కి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎటు వుండాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఇక్కడున్న తిక్కోడు 2104లో నాకు నాన్న లేడు అన్నాడు. జనం నమ్మారు. 2019లో నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని అడిగితే జనం ఇచ్చారు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగు పోయింది. బడిలో తెలుగు పోయింది. నదిలో ఇసక పోయింది. గుడిలో విగ్రహాలు పోయాయి. నేరాలు పెరిగిపోయాయి. ఘోరాలు జరిగిపోయాయి. పరిశ్రమలు పారిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. ఆస్తులు తరిగిపోయాయి. అమ్మకి గౌరవాధ్యక్ష పదవి పోయింది. చెల్లికి ఆస్తిపోయింది. బాబాయి పైకి పోయె.. బాబు జైలుకు పోయె’ అని నన్నూరి నర్సిరెడ్డి పంచులతో అదరగొట్టేశారు.
Publish Date: Apr 16, 2024 5:08PM

కెసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలు? 

పదేళ్ల పాటు తెలంగాణలో  చక్రం తిప్పిన బిఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ఇల్లు లేదా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. ఓటమి నుంచి తేరుకోకమునుపే కూతురు కవిత తీహార్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టడం కెసీఆర్ ను కలచివేసింది. దీనికి తోడు హైదరాబాద్ నందినగర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు చర్చనీయాంశమైంది.  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి.ఎర్రని బట్టలు, బొమ్మ , పసుపు కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు ఉండటంతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది.అర్దరాత్రి ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు జరగడం చర్చనీయాంశం అవుతోంది. ఎవరు క్షుద్రపూజలు చేశారు..? ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ పూజలు జరిపారు..? దీని వెనక ఎవరైనా ఉన్నారా..? రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ క్షుద్రపూజలకు పాల్పడ్డారా..? అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలకు వేదిక చేసుకోవడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీని ఆందోళనకు గురి చేసేందుకే ఇలాంటి ఏమైనా ప్లాన్ చేశారా..? అనే అనుమానాలను బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సెంటిమెంట్లను ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఆయన్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేసేందుకు ఇలాంటి వాటికి తెరతీశారా..? అనే కోణంలో చర్చలైతే జరుగుతున్నాయి. ఈ క్షుద్రపూజల పై ఇప్పటివరకు కేసీఆర్ ఫ్యామిలీ స్పందించలేదు కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ రాజసూయ యాగం నిర్వహించడాన్ని బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ తప్పు పట్టారు.  రాజసూయ యాగం పేరిట కెసీఆర్ జన వశీకరణ క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే
Publish Date: Apr 16, 2024 5:07PM

వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. ఎన్డీయే విజయం తథ్యం.. కేశినేని శ్రీదేవి

35వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం  కేశినేని శ్రీదేవి, యలమంచిలి ఉమారాణి అపూర్వ స్వాగ‌తం ఎన్నిక‌ల ప్ర‌చారానికి  విశేష స్పంద‌న‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని...ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని  టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది  కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ టిడిపి అభ్య‌రి కేశినేని శివ‌నాథ్, ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుజ‌నా చౌద‌రి విజ‌యాన్ని కాంక్షిస్తూ 35వ డివిజ‌న్ లో వ‌రుస‌గా రెండో రోజు మంగ‌ళ‌వారం కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం య‌ల‌మంచిలి ఉమారాణితో క‌లిసి నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం పెజ్జోని పేట‌, బాప్టిస్ట్ న‌గ‌ర్ లో సాగింది. కేశినేని శ్రీదేవి గారు ఇంటింటికి వెళ్లి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల క‌ర‌ప‌త్రాలు పంపిణి చేసి..జ‌గ‌న్ చేసిన దుర్మార్గ‌పు పాల‌న గురించి..ఎన్డీయే అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు గారు ముఖ్య‌మంత్రి అమ‌లు చేయ‌బోయే ప‌థ‌కాల‌ను వివ‌రించారు. అలాగే సుజ‌నా చౌద‌రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేయ‌బోయే ప్ర‌ణాళిక గురించి తెలియ‌జేశారు. చంద్ర‌బాబు హ‌యంలో ప్ర‌తి పండ‌గ‌క్కి పేద ప్ర‌జ‌ల‌కు  కానుక‌లు ఇచ్చేవార‌ని, జ‌గ‌న్  ఏ పండుగ‌క్కి కానుకలు ఇవ్వ‌లేద‌న్నారు.  అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు గారు మ‌ళ్లీ పండుగ కానుక‌లు ఇస్తార‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ ప్రెసిడెంట్ బూదాలి నంద‌కుమారి గారు, సెక్ర‌ట‌రీ ఇత్త‌డి నాగ‌ల‌క్ష్మీ, ఇత్త‌డి చార్లెస్ గారు, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ హ‌నుమంతురావు గారు, బూత్ క‌న్వీన‌ర్లు కొద‌మ‌ల రాజు గారు, మ‌ణిబాబు, ర‌వికిషోర్, ఆసిఫ్, భాస్క‌ర‌రావు , క‌ర్రి సునీత‌, బిజెపి మ‌హిళ నాయ‌కురాలు నాగ‌ల‌క్ష్మీ గార్ల‌తోపాటు బిజెపి టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు
Publish Date: Apr 16, 2024 5:07PM

జ‌గ‌న్ కి ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే నైతిక హ‌క్కు లేదు.. కేశినేని జానకి లక్ష్మి

40వ వార్డులో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం కేశినేని జాన‌కిల‌క్ష్మీ, సిరిపుర‌పు ధ‌న‌ల‌క్ష్మీ కి అపూర్వ స్వాగ‌తం ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్  మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని  తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్  స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ  అన్నారు. బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన  విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి  కేశినేని శివనాథ్ గారు, పశ్చి  నియోజకవర్గ బిజెపిశాసనసభ అభ్యర్థి  సుజ‌నా చౌద‌రి  గార్ల  విజయాన్ని కాంక్షిస్తూ 40వ డివిజ‌న్ భ‌వానీపురంలో మంగ‌ళ‌వారం ఉద‌యం సుజనా చౌదరి గారి సోదరి సిరిపుర‌పు ధ‌న‌ల‌క్ష్మీ గారితో క‌లిసి ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జాన‌కి ల‌క్ష్మీగారు సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు వివ‌రించి ఎన్డీయే అభ్య‌ర్ధులకి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.  ఈ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మానికి  ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌ వ‌చ్చింది.  ఈ ఇంటింటికి ఎన్నిక‌ల‌ ప్ర‌చారం  ఆకుల రాజేశ్వ‌ర‌రావు మిల్ రోడ్డు, గాంధీ బొమ్మ రోడ్డు, బాలాజీ హాస్ప‌ట‌ల్ రోడ్డు, జ్యోతి కాన్వెంట్ రోడ్డు, కోపూరి వారి వీధి, హ‌నుమ‌య్య వీధి, సాయిబాబా గుడి రోడ్డు, ప్ర‌సాద్ హోట‌ల్ రోడ్డులో  సాగింది. ఈ డివిజ‌న్ లోని మ‌హిళ ఓట‌ర్లు కేశినేని జాన‌కిల‌క్ష్మీ , సిరిపుర‌పు ధ‌న‌ల‌క్ష్మీ కి మంగళ‌హార‌తులిచ్చి త‌మ మ‌ద్దతు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్బంగా కేశినేని జాన‌కి ల‌క్ష్మీగారు మాట్లాడుతూ చంద్ర‌బాబు గారు అధికారంలోకి రాగానే  త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ద్వారా ప్ర‌తి కుటుంబంలో ఎంత‌మంది పిల్ల‌లు చ‌దువుతుంటే వారంద‌రికీ ఏడాదికి ప‌దిహేను వేలు చొప్పున అంద‌జేయ‌నున్నార‌ని తెలిపారు. రాక్ష‌స పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడి...రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపించే చంద్ర‌బాబు నాయుడ్ని ముఖ్య‌మంత్రిగా అధికారంలో తీసుకువ‌చ్చేందుకు ఎన్డీయే అభ్య‌ర్ధుల్ని గెలిపించాల‌ని కోరారు.ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుజ‌నా చౌద‌రి గారిని భారీ మెజార్టీతో గెలిపించి....విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి శివ‌నాథ్ గారికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక మెజార్టీ అందించాల‌ని కోరారు.    ఈ కార్య‌క్ర‌మంలో  డివిజ‌న్ పార్టీ ప్రెసిడెంట్ పి.వి.సుబ్బారావుగారు, డివిజ‌న్ పార్టీ సెక్ర‌ట‌రీ జి.గ‌ణేష్, బూత్ ఇన్చార్జ్ సురేష్‌, బూత్ ఏజెంట్స్ కె.శ్రీనువాస‌రావు, సి.హెచ్. నాగ‌రాజు, ఎమ్.నారాయ‌ణ‌, వెంక‌టేశ్వ‌ర్లు, దుర్గ‌రావు, శివాజీ, ఎమ్.ఆదినారాయ‌ణ గార్ల‌తోపాటు బిజెపి, టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.
Publish Date: Apr 16, 2024 4:57PM

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా 

గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉండటంతో వాయిదాపడింది. సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా 22వ తేదీన విచారణ జరగనుంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించే అవకాశం లేదని తెలుస్తోంది. 
Publish Date: Apr 16, 2024 4:24PM

రాయి పడింది... ప్లాను చెడింది.. కోడికత్తి-2 కేసు తుస్సుమంది!

అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో కోడికత్తి ద్వారా తన మీద తాను దాడి చేయించుకోవడం ద్వారా జగన్ మావయ్య రాజకీయంగా లాభం పొందారు. ఈసారి ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఆయన ప్రభుత్వం పరువు పాతాళానికి చేరుకోవడంతో ‘కోడికత్తి-2’ డ్రామాకు తెర తీసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఆ కేసును నీరుగార్చే పనిలో పడింది. అలా రాయి తగిలిందో లేదో ఇలా జగన్‌పై హత్యాయత్నం అని భారీ స్థాయిలో మీడియాలో ప్రచారం చేయడంతోపాటు, జగన్‌పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబు నాయుడేనని రకరకాల కథనాలు వండి వడ్డిస్తూ వచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు వెనకడుగు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్‌పై రాయిపడిన సంఘటనకి  ‘హత్యాయత్నం’ కలరింగ్ ఇచ్చి, దానికి  చంద్రబాబుని బాధ్యుణ్ణి చేసి రాజకీయంగా మరోసారి లాభం పొందాలని వైసీపీ వర్గాలు శాయశక్తులా కృషి చేశాయి. అయితే జనం ఈసారి జగన్ మాయలకు మోసపోవడానికి సిద్ధంగా లేకపోవడంతో వాళ్ళ చేసిన ప్రచారం అంతా తేలిపోయింది. జనంలో సానుభూతికోసమే జగన్ ఈ డ్రామా ఆడిస్తున్నాడని జనం అర్థం చేసుకుని లైట్‌గా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఇది జగన్ ఆడుతున్న డ్రామా అని క్లారిటీగా చెబుతున్నారు. దాంతో జగన్ పథకం పారలేదు. దీనితోపాటు ఈ సంఘటనతో జగన్ మీద నెగటివిటీ పెరిగింది. ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం వుంది. ఈ నెలరోజులపాటు ‘హత్యాయత్నం, హత్యాయత్నం’ అని గగ్గోలుపెట్టి జనం సానుభూతిని పొందాలని జగన్ అండ్ కో వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈసారి జరిగే ఎన్నికలలో జగన్ పార్టీకి 40 వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని అంచనాలుండేవని, ఈ కోడికత్తి-2 సంఘటన తర్వాత జగన్ మీద జనంలో వ్యతిరేకత మరింత పెరిగి మరో పదిస్థానాలు తగ్గిపోయాయని ఒక వైసీపీ ప్రముఖుడే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ కేసుని కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో వాళ్ళు కేసును తవ్వి నిజానిజాలు బయట పెట్టేముందే తామే హ్యాండ్సప్ అయిపోతే మంచిదని, కేసును  క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్తే మంచిదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే పోలీసులు కొత్త కేరెక్టర్లను రంగంలోకి దించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడితోపాటు అతని మిత్రులైన ఆకాష్, చిన్నారావు, దుర్గ, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ మీద రాయి విసిరిందని తానేనని సతీష్ అనే కుర్రాడు ఒప్పుకున్నాడు. ఇంతకీ జగన్ మీద రాయి ఎందుకు వేశావయ్యా అని పోలీసులు అడిగితే, ‘మాకు క్వార్టర్ బాటిల్, 350 రూపాయలు ఇస్తామని వైసీపీ నాయకులు ఆశపెట్టి జగన్ సభకు తీసుకొచ్చారు. తీరా వచ్చాక డబ్బు ఇవ్వకుండా మందు బాటిల్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. డబ్బులివ్వకుండా వెళ్ళిపోయారన్న కోపంతోనే జగన్‌ను రాయితో కొట్టాను’ ఇది జగన్‌పై ‘హత్యాయత్నం’ కేసులో దొరికిపోయిన నవ యువకుడు చెప్పాడు. డబ్బు ఇవ్వకపోవడంతో సదరు యువకుడికి కోపం వచ్చిందట. రోడ్డు పక్కనే వున్న ఒక రాయిని తీసుకుని జగన్ మీదకి విసిరాడట. అదీ విషయం. నిన్నటి వరకూ అంతమంది జనాల్లో, అది కూడా లైట్లు లేని సమయంలో ఎవరు దాడి చేశారో ఎలా కనుక్కవాలి? అని చెబుతూ వచ్చిన విజయవాడ పోలీసు పెద్దలకు ఇప్పుడు ఈ 350 రూపాయల బ్యాచ్ ఎలా దొరికిందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు జగన్‌పై దాడి చేశాడని చెప్పిన యువకుడు, మిగతావాళ్ళ పరిస్థితి మరో కోడికత్తి శ్రీనులా అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిందే. తన కొడుకుని పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారని, ఎక్కడ వున్నాడో తెలియదని సతీష్ అనే యువకుడి తల్లి లబోదిబోమంటోంది. మరి పోలీసులు సతీష్ తదితరులను మీడియా ముందు హాజరు పరుస్తారా లేక పోలీసులే ఈ కేసు గురించి, దాడి జరిగిన తీరు గురించి మీడియాకి చెప్పి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి వుంది. 
Publish Date: Apr 16, 2024 3:57PM

కంటోన్మెంట్ లో త్రిముఖ పోటీ 

సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగుతోంది. ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశా తిలక్ పేరును బీజేపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టివి నారాయణ కుమారుడే వంశా తిలక్‌. బీజేపీ అభ్యర్థి ప్రకటనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉపఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు.కాంగ్రెస్ పార్టీ శ్రీగణేశ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది.మెుదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదితకు ఛాన్స్ ఇచ్చింది బిఆర్ఎస్.  సాయన్న మరణంతో కంటోన్మెంట్ టికెట్ ఆయన కూతురు లాస్య సందితకు కేటాయించింది . కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై ఆమె గెలుపొందినప్పటికీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతిచెందారు. అయితే గులాబీ బాస్ కె. చంద్రశేఖర్ రావు  మళ్లీ సాయన్న కుటుంబం నుంచే మరోసారి టికెట్ ఇచ్చింది. లాస్య నందిత సోదరి నివేదితకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.   తాజాగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేశారు. ఈ సీటు కోసం చాలా మంది బీజేపీ నేతలు ఆశలు పెట్టుకోగా.. చివరకు తిలక్ పేరును ఫైనల్ చేశారు.
Publish Date: Apr 16, 2024 3:43PM

దావూద్ ఇబ్రహీంపై కంటే జగన్ పైనే ఎక్కువ క్రిమినల్ కేసులు!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు  వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్  పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.  ఇదే విషయాన్ని ప‌లు  స‌ర్వేలు  వెల్ల‌డించాయి. 2 024 ఎన్నిక‌ల్లో తెలుగుదేం కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని, జ‌గ‌న్  పార్టీకి ఘోర పరాజయం తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో కోడిక‌త్తి డ్రామా త‌ర‌హా ప్ర‌యోగాల‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ తెర‌పైకి తేబోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.   మూడు రోజుల కిందట జ‌గ‌న్‌పై జరిగిన గులక రాయి దాడి ఘ‌ట‌న ఇందులో భాగ‌మేన‌ని కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు.  గ‌త ఎన్నికల ముందు జరిగిన  కోడి క‌త్తి, వివేకానంద రెడ్డి హ‌త్య‌  జగన్ పై సానుభూతి వెల్లువెత్తి ఆయన పార్టీ  భారీ మెజార్టీతో అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. తాజాగా అదే త‌ర‌హా ప్ర‌యోగాల‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది మ‌రోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది.   సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిమిన‌ల్ మైండ్ తో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పైకి న‌వ్వుతూ క‌నిపించినా.. ప్ర‌తీ విష‌యాన్ని క్రిమిన‌ల్ మైండ్ తో ఆలోచిస్తారని, ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేనని అంటున్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల అఫిడ‌విడ్ ను చూస్తే ఆయ‌న నేర సామ్రాజ్యం క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యేగా  ఏప్రిల్ 22న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన నామినేషన్ వేయడానికి ముందే ఆయన నేరారోపణలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ను రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు త‌న‌ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఎన్నిక‌ల‌ అఫిడవిట్ ప్రకారం సీఎం జ‌గ‌న్‌పై మొత్తం 146   కేసులు ఉన్నాయి.   38 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  వీటిలో 21 కేసులు 2011 సంవత్సరానికి చెందినవి. 13 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి విచారణ లేకుండా అన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దేశంలోనే డాన్ గా పేరు పొంది విదేశాల‌కు పారిపోయిన దావూద్ ఇబ్ర‌హీం పైనకూడా జ‌గ‌న్ పై ఉన్న‌న్ని క్రిమినల్ లేవని అంటున్నారు.  దావూద్ ఇబ్రహీం విదేశాల‌కు పారిపోకుండా రాజకీయాల్లో చేరిఉంటే, అతను ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడనీ. అధికార అండతో కేసులు విచారణ వరకూ రాకుండా పెండింగ్ లో ఉంచుకోగలిగేవారనీ నాగేశ్వరరావు పోస్టుపై నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు  జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదై ఉన్న ఏ కేసూ విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్న విధానం చూస్తే అలాగే అనిపిస్తోందని అంటున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 2011 మంది అభ్యర్థులు పోటీ చేయగా..వారిలో 334 మంది అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఇక 222 మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు మొత్తం 96 మంది ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే క్రిమినల్ కేసులున్న 55శాతం మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 55 మంది అభ్యర్థులు చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు. ఓ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న 55 మంది ఎమ్మెల్యేల్లో అధికారిక వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇక తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వాన్ని నడపడం అనే అంశంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని గ‌తంలో నేత‌లు డిమాండ్ చేశారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ గత ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి  సమర్పించిన ఎన్నికల అఫిడవిడ్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.   
Publish Date: Apr 16, 2024 3:19PM

నేటి నుంచి నీట్ పీజీ 2024 రిజిస్ట్రేషన్ 

నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా.. స్టెప్ 1:natboard.edu.in వెబ్ సైట్ ను తెరవాలి. స్టెప్ 2: వెబ్ సైట్ హోం పేజీలో నీట్ పీజీ 2024 లింక్ పై క్లిక్ చేయాలి స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను పూర్తి చేసి అకౌంట్ లోకి లాగిన్ కావాలి. స్టెప్ 4: ఆ తర్వాత దరఖాస్తు నింపాలి. స్టెప్ 5: అనంతరం పేమెంట్ పూర్తి చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. స్టెప్ 6: కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకొని ఒక ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి. ఎవరికి ఎంత పరీక్ష ఫీజు నీట్ పీజీ 2024 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ. 3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 2500. పరీక్ష రుసుమును క్రెడిట్ కార్డ్ లేదా దేశీయ బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డు లేదా వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్ సైట్ ను చూడాలి. ఫలితాలు ఎప్పుడు? నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 జూన్ 18న అందుబాటులోకి వస్తుంది. పరీక్షను జూన్ 23న నిర్వహిస్తారు. జూలై 15న ఫలితాలు విడుదల అవుతాయి. గతంలో ఈ పరీక్షను జూలై 7న నిర్వహించాలనుకున్నారు. నీట్ పీజీ 2024కు అర్హత సాధించేందుకు అభ్యర్థులు ఆగస్టు 15 కటాఫ్ తేదీలోగా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 మధ్య కౌన్సెలింగ్ సెషన్లు జరుగుతాయి. సెప్టెంబర్ 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రశ్నలు ఇలా.. నీట్ పీజీ పరీక్ష 200 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. పరీక్ష పేపర్ ను కేవలం ఇంగ్లిష్ లోనే ఇస్తారు. అభ్యర్థులు మూడున్నర గంటల్లో పరీక్షను పూర్తి చేయాలి. తప్పు సమాధానాలకు 25 శాతం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జవాబు రాయని ప్రశ్నలకు మార్కుల్లో కోత ఉండదు.
Publish Date: Apr 16, 2024 3:10PM

శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు

వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది.  శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.   1998 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు పది మందికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆ పది మందితో తోట త్రిమూర్తులు కూడా ఒకరు. సుదీర్ఘంగా  విచారణ సాగిన ఈ కేసులో 28 ఏళ్ల తరువాత నిందితులకు శిక్ష పడింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  
Publish Date: Apr 16, 2024 2:55PM

కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన జగన్ సర్కార్!

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూడా జగన్ సర్కార్ విపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను అందజేయకుండా వేధిస్తున్న నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నామినేషన్‌ పత్రాల దాఖలు సమయంలో తమపై ఉన్న కేసుల వివరాలను కూడా అభ్యర్థులు అందజేయాల్సి ఉంది. వారిచ్చే సమాచారంలో ఏ ఒక్కటి మిస్‌ అయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ  మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ డీజీపీ స్పందించకపోవడంతో చంద్రబాబు తదితరులు కోర్టును ఆశ్రయించారు.  ఏపీ సర్కార్ విపక్ష నేతలపై వేధింపులలో భాగంగా ఆ కేసుల వివరాలను కోరినా కూడా విపక్ష నేతలకు అందజేయడంలేదంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడుఅచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణ, అయ్యన్నపాత్రుడు తదితరులు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు. వారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రజాప్రతినిథులపై ఉన్న కేసుల వివరాలను వారికి అందజేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ నెల 16లోగా కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ కేసులు సోమవారం (ఏప్రిల్ 16)కు వాయిదా వేసిన సంగతి తెలసిందే.   కోర్టు ఆదేశాలతో దిగివచ్చిన ప్రభుత్వం నేతలపై ఉన్న కేసుల వివరాలను వారి ఈమెయిల్ కు పంపినట్లు సోమవారం (ఏప్రిల్ 16) కోర్టుకు తెలిపింది.  దీంతో కోర్టు  ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని ఈ మధ్యాహ్నంలోగా ఆ వివరాలు వచ్చాయో లేదో చెప్పాలని పిటిషనర్‍ లు తరపున న్యాయవాదులను ఆదేశించింది. 
Publish Date: Apr 16, 2024 1:56PM