EDITORIAL SPECIAL
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఏపీలో సీఎం ఆర్ఎఫ్ బాధితుల పరిస్థితి. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ల తో సొమ్ము ఆదా చేసినట్టు ప్రజల ఆరోగ్య విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత వారికి డబ్బులు జమ చేయకుండా కొత్త వారికి దరఖాస్తులు చూడకుండా ప్రభుత్వం వారితో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి నామ మాత్రం గానే బాధితులకు సొమ్ము విడుదల చేస్తోంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా ఇక్కడ కూడా రివర్స్ పద్ధతిని పాటిస్తున్నట్లు కనబడుతుంది. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను మళ్లీ తనిఖీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రిలీఫ్ పండ్ సెక్షన్ లో సుమారు ముప్పై మూడు వేల దరఖాస్తులు నూట యాభై కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వం తన మన అని చూడకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్వోసీలోని ఉదారంగా అందించింది. కొత్త ప్రభుత్వం అంత కంటే ఎక్కువే చేస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి నాలుగు నెలలుగా ప్రతి రోజూ మూడు వందల నుంచి నాలుగు వందల దరఖాస్తుల సీఎంఆర్ఎఫ్ వస్తున్నాయి. అధికారులు వాటి అన్నింటినీ పక్కన పడేస్తున్నారు. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు పదమూడు వేల సీఎం ఆర్ కు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ సుమారు డెబ్బై కోట్లని అంచనా. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన పద్దెనిమిది వేల దరఖాస్తులను కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. వీటి విలువ కూడా అరవై ఐదు కోట్ల పైనే ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తుంది.వీటిలో ఐదు వందల నుంచి ఆరు వందల దరఖాస్తులకు మాత్రమే చెక్కులు అందించింది.ఆ చెక్కులు కూడా బాధితుల అకౌంట్ లలో జమ కాలేదని తెలుస్తోంది. దరఖాస్తులను ఇంకా వాయిదాలో ఉండటంతో  బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జిల్లాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే లు సీఎం కార్యాలయం పై ఒత్తిడి తెస్తున్నారు ఫలితంగా నియోజకవర్గాని కి యాభై దరఖాస్తుల చొప్పున క్లియర్ చేసేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు పేద ప్రజలను వదిలేసి తమ బంధువుల అనుంగు సహచరులు దరఖాస్తులు మాత్రమే నిశ్చితం చేయించుకుంటున్నారు. డబ్బుల్లేక నిధులు విడుదల చేయడం లేదా అంటే ప్రస్తుతం సుమారు ఎనభై కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. వీటిని విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల మందికి ఇచ్చిన చెక్కు లను కూడా ఇప్పటి వరకు క్లియిర్ చేయకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. చెక్కులు చేతికి వచ్చిన బ్యాంకుల్లో డబ్బు లు జమ కాకపోవడం తో కొంత మంది బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత వాతావరణం చూసి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యా లు భయపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నాయి. అందుకే రోగులకు లెటర్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఎల్ వోసీలు బకాయిలున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టుకొని కొత్తగా రోగుల కు ఎల్ వోసీ నుంచి తాము అప్పులపాలు కాలేమని ప్రైవేటు ఆసుపత్రుల చేతులెత్తేస్తున్నాయి. ఇదే విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరిస్తున్నాయి డబ్బులుంటే బిల్లు కట్టే వైద్యం చేయించుకోండి లేదంటే వెళ్లిపొమ్మని కటువుగా చెప్పేస్తున్నారు విధిలేక కొందరు రోగులు లక్షల్లో అప్పు లు చేసి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకొంతమంది అనారోగ్యం తో యుద్ధం చేస్తున్నారు.ఇక జగర్ సర్కార్ ఏమి చేయ్యబోతోందో వేచి చూడాలి.
  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.
ALSO ON TELUGUONE N E W S
  గతంలో ఎన్నడూ లేని విధంగా హిస్టరీ వైపు దృష్టి సారిస్తోంది తెలుగు సినిమా. కొంత కాలంగా గమనిస్తే.. చరిత్ర లేదా, జీవిత కథలతో ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు తయారవుతూ రావడం కనిపిస్తుంది. 'రుద్రమదేవి', 'వంగవీటి', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'ఘాజి', 'మహానటి', 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు', 'యాత్ర', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వంటి సినిమాలు.. అందుకు ఉదాహరణ. ఈ కోవలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'సైరా.. నరసింహారెడ్డి'. వీటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే, కొన్ని బాగానే ఆడాయి. ఒక్కటి మాత్రం నిజం.. చరిత్రకెక్కిన విషయాల ఆధారంగా కథ రాసుకొని, దాన్ని వెండితెరపై తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలనే తపన తెలుగు ఫిల్మ్ మేకర్స్‌లోనూ, నటులలోనూ పెరుగుతూ వస్తోంది. వచ్చే ఏడాది యస్.యస్. రాజమౌళి మూవీ 'ఆర్ ఆర్ ఆర్' రానున్నది. ఇద్దరు ప్రసిద్ధ చారిత్రక వ్యక్తులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను తీసుకొని కల్పిత కథతో ఆ మూవీని రాజమౌళి రూపొందిస్తున్నాడు. తెల్లవాళ్లను తన అసమాన ధైర్యసాహసాలతో ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, ప్రజలపై అత్యాచారాలు చేస్తూ, వాళ్లను క్రూరంగా హింసించిన రజాకార్లపై గెరిల్లా పద్ధతుల్లో యుద్ధం చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్ర కని కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే పేరుపొందిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్, తెలుగునాట సుప్రసిద్ధ మల్లయోధుడైన కోడి రామ్మూర్తినాయుడు జీవితం ఆధారంగా ఒక సినిమా, విజయవాడ రాజకీయాల్లో కీలక నేత, ఇటీవలే దివంగతుడైన దేవినేను నెహ్రూ జీవితం ఆధారంగా 'దేవినేని'  సినిమాలు తయారవుతున్నాయి. బ్యాడ్మింటన్‌లో దేశానికి కీర్తి సాధించిపెట్టిన ముగ్గురు హైదరాబాదీ క్రీడాకారులు.. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు బయోపిక్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. చిత్రమేమంటే 'రుద్రమదేవి', 'గౌతమిపుత్ర శాతకర్ణి', ఇప్పుడు 'సైరా' సినిమాల మేకింగ్‌కు పురికొల్పిన సినిమా చారిత్రకం కాకపోవడం.. అది ఒక జానపద చిత్రం కావడం. అదే.. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా అది సాధించిన విజయంతో భారీ బడ్జెట్‌తో తెలుగు సినిమాలు చెయ్యవచ్చనే నమ్మకం మిగతా దర్శక నిర్మాతల్లో, నటుల్లో కలిగింది. అదివరకు ఆ నమ్మకం వారిలో ఉండేది కాదు. అంతెందుకు.. తెలుగులో మెగాస్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న చిరంజీవి సైతం రెండేళ్ల క్రితం వరకు ఆ తరహా సినిమా చెయ్యడానికి సాహసించలేకపోయారు. 20 సంవత్సరాల క్రితమే తాను భగత్ సింగ్ బయోపిక్ చెయ్యాలనుకున్నాననీ, పన్నెడేళ్ల క్రితం నుంచీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చెయ్యాలనేది తన కలగా ఉంటూ వచ్చిందనీ, అయితే భారీ బడ్జెట్ అవసరమయ్యే ఆ సినిమాలను తీసే సాహసం చెయ్యలేకపోయాననీ ఆయన స్వయంగా వెల్లడించారు. రాజమౌళి 'బాహుబలి' ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు 'సైరా' సినిమా చేశానని ఆయన చెప్పారు. 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని అనూహ్యంగా పెంచడం వల్లే, ఇవాళ ఆ తరహా సినిమాలు చెయ్యగలమన్న ధైర్యం తెలుగు నిర్మాతల్లో పెరిగింది. తెలుగువారు జరుపుకొనే ఉగాది పండగకు ఆద్యుడు, తనపేరిట శాలివాహన శకాన్ని లిఖించిన గౌతమిపుత్ర శాతకర్ణి, కాకతీయ సామ్రాజ్యాన్ని దశాబ్దాల కాలం పాలించిన వీరనారి రుద్రమదేవి.. రాజ్య పాలకులైతే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన 61 గ్రామాల పాలెగాడు. విదేశీ రాజుల దండయాత్రలను ఎదుర్కోవడానికి భారతీయ రాజ్యాల్ని ఏకతాటిపై తీసుకు రావడానికి కృషిచేసిన గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ నటించారు. ఓటమి ఎరుగని వీరునిగా పేరుపొందిన శాతకర్ణి ఎన్ని అవాంతరాలను ఎదుర్కొని రాజులనందర్నీ ఐక్యంగా నిలపడానికి కృషి చేశాడో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో దర్శకుడు క్రిష్ చూపించాడు. ఒక మహా సామ్రాజ్యాన్ని పాలించడానికి స్త్రీ కూడా అర్హురాలే అని నిరూపించి, సమాజ దృష్టిని మార్చిన వీర వనిత 'రుద్రమదేవి'గా అనుష్క అమోఘమైన నటన ప్రదర్శించింది. మహా మహా సంస్థానాధీశులే బ్రిటిష్‌వాళ్లకు దాసోహమవగా, ఒక చిన్న పాలెగాడు వాళ్లపై తిరుగుబాటు చెయ్యడం ఊహకు అందని కాలంలో ఆ పనిచేసి, తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి అభినయం ఎలా ఉందో ఇవాళ 'సైరా'లో చూస్తున్నాం. శతాబ్దాల క్రితం నాటి చరిత్రతో తీసిన సినిమాలతో పాటు 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దం తొలినాళ్లలో తెలుగునాట తమదైన ముద్రవేసిన వ్యక్తుల జీవితాల్ని సెల్యులాయిడ్‌పైకి తీసుకువచ్చారు దర్శకులు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తార అయిన సావిత్రి జీవితం ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన 'మహానటి'లో సావిత్రిగా జీవించిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ ఉత్తమనటి పురస్కారం పొందింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేసి విశ్వఖ్యాత నటసార్వభౌమునిగా, మహానేతగా కీర్తిపొందిన నదమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ రూపొందించిన రెండు సినిమాలు 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' సినిమాల్లో టైటిల్ రోల్‌ను ఆయన తనయుడు బాలకృష్ణ పోషించారు. అలాగే 20వ శతాబ్దం చివరిలో, 21వ శతాబ్దం ఆరంభంలో రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి, ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో మహానాయకునిగా తెలుగువాళ్ల హృదయాల్లో చోటుపొంది, హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన 'యాత్ర'లో రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి గొప్పగా రాణించారు. చరిత్రతో పాటు పురాణాలూ ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. హిరణ్యకశిపుడు, ఆయన కొడుకు ప్రహ్లాదుడి కథతో ఇప్పటికే తెలుగులో 'భక్త ప్రహ్లాద' పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. లేటెస్టుగా, హిరణ్య కశిపుడి పాత్రను ఆధారం చేసుకొని 'హిరణ్యకశిప' సినిమా రూపొందించేందుకు డైరెక్టర్ గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్క్రిప్టును సిద్ధం చేశారు కూడా. ఆ కేరెక్టర్‌లో నటించేందుకు దగ్గుబాటి రానా సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు అందరి దృష్టీ రాజమౌళి తీస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీపై కేంద్రీకృతమవుతోంది. 19వ శతాబ్దం చివరలో జన్మించి 20వ శతాబ్దం ప్రథమార్ధంలో మృతిచెందిన ఇద్దరు మహాయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్ని ఆయన వెండితెరపై కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు. హిస్టరీలో రికార్డు కాని ఒక నాలుగేళ్ల కాలంలో ఆ ఇద్దరు వీరుల జీవితం ఎలా ఉండి ఉంటుందీ, వాళ్లు ఎలాంటి ఘటనల్ని ఎదుర్కొని ఉంటారనే ఊహాజనిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి. నిజంగా ఇది కత్తిమీద సాము వ్యవహారమే. 2020 జూలైలో రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ట్విట్టర్ వేదికగా బాధాతప్త హృదయంతో ఈ రోజు ఆ విషయాన్ని ప్రకటించాడు. ఇద్దరి మధ్య డిఫరెన్సులు రావడంతో విడాకులు తీసుకున్నట్టు మనోజ్ తెలిపాడు. ఈలోపు చాలా బాధకు గురైనట్టు పేర్కొన్నాడు. ఇద్దరం వేరు పడాలని, జీవితంలో ముందు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ఇన్నాళ్లు యాక్టింగ్, సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం వ్యక్తిగత జీవితంలో ఒడిడుకులు కారణమన్నట్టు మనోజ్ వ్యాఖ్యలు ఉన్నాయి. మనసు బాలేకపోవడం వలనే సినిమాలపై దృష్టి సారించాలేకపోయానని అతడు అన్నాడు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలబడ్డారని తెలిపాడు. మళ్ళీ త్వరలో సినిమాల్లోకి వస్తున్నట్టు, నటించబోతున్నట్టు మనోజ్ స్పష్టం చేశారు. తనకు తెలిసింది, తాను ప్రేమించేది సినిమాల్లో నటించడమేనని అన్నాడు.
తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది 3'లో కథానాయికగా ముందు తమన్నాను తీసుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు కూడా! కానీ, సినిమాలో మాత్రం మిల్కీ బ్యూటీ లేరు. అవికా గోర్ నటించారు. విడుదలకు ఒక్క రోజు ముందువరకూ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుండి తమన్నా తప్పుకున్నారని అశ్విన్, ఓంకార్ చెబుతూ వచ్చారు. విడుదలకు ముందు ఓంకార్ అసలు నిజాన్ని బయట పెట్టారు. కథలో, తన పాత్రలో మార్పులు చేయమని చెప్పడంతో తమన్నాను సినిమా నుండి తప్పించామని ఆయన చెప్పారు. జస్ట్ స్టోరీ లైన్ విని తమన్నా కథ ఓకే చేశారు. ఓపెనింగ్ కి వచ్చారు. పూర్తి కథ విన్నాక... కొన్ని మార్పులు చేయమని చెబితే ఓంకార్ అన్నయ్యకు నచ్చలేదు. దాంతో ఏకంగా కథానాయికను మార్చేశారు దర్శకుడు కమ్ నిర్మాత ఓంకార్. తమన్నా తప్పుకున్నాక, ఈ కథతో కాజల్ దగ్గరకు వెళ్లానని ఓంకార్ అన్నాడు. అయితే... అప్పటికి కాజల్ ఇతర సినిమాలు అంగీకరించడంతో నెలలో వారం రోజులు మాత్రమే డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చెప్పిందట. ఇక లాభం లేదనుకుని అవికా గోర్ ను తీసుకున్నారు. అయితే... కాజల్, తమన్నాకు చెప్పిన కథ, ఇప్పుడు సినిమా తీసిన కథ వేరని ఓంకార్ అంటున్నాడు. ఆ కథతో తప్పకుండా పెద్ద కథానాయికతో సినిమా తీస్తానని చెబుతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందించిన చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చూడమని కోరారు. నిన్నటికి నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. 'సైరా' సినిమా చూపించారు. రాజకీయ ప్రముఖులను మెగాస్టార్ ఎందుకు కలుస్తున్నారు? ఎందుకు 'సైరా' సినిమా చూపిస్తున్నారు? రాజకీయ ప్రముఖులు సినిమా బావుందని మెచ్చుకుంటే థియేటర్లకు కొత్తగా వచ్చే ప్రేక్షకులు ఉండరు. మెగాస్టార్ చిరంజీవిని మించిన బ్రాండ్ సైరాకు అవసరం లేదు. మరెందుకు ఈ మెగా పొలిటికల్ మీటింగులు? అవార్డుల కోసమని ఫిలింనగర్ గుసగుస. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డుల కోసం మెగాస్టార్ ఇప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం మాస్ కమర్షియల్ అంశాలకు దూరంగా 'రుద్రవీణ' సినిమా చేశారు మెగాస్టార్. మళ్ళీ ఇన్నాళ్లకు తన సహజశైలికి భిన్నంగా 'సైరా నరసింహారెడ్డి' చేశారు. ఇందులో మెగాస్టార్ నుండి ఫ్యాన్స్ ఆశించే మాస్ పాటల్లేవ్. కమర్షియల్ ఫైటుల్లేవ్. కథ ప్రకారం సినిమా చేశారు. అందులోనూ స్వాతంత్య సమర శంఖాన్ని పూరించిన వ్యక్తి కథ. ముందుగా ఈ సినిమాను రాజకీయ ప్రముఖులకు చూపిస్తే సినిమా గొప్పదనం వారికీ తెలుస్తుంది. అవార్డుల సమయంలో సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది అవార్డులు ప్రకటిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో ఓ సినిమా చేయడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ తమిళ నిర్మాత కూడా ముందుకొచ్చారు. దర్శక నిర్మాతలతో రాజశేఖర్, జీవిత రెండుమూడు సార్లు సమావేశం అయ్యారు. స్క్రిప్ట్ నుండి డైలాగుల వరకూ అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నారు. రాజశేఖర్ పక్కన నందితా శ్వేతను హీరోయిన్ గా సెలక్ట్ కూడా చేశారు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో సినిమా క్యాన్సిల్ అయింది. ఏమైందో ఏమో... రాజశేఖర్ ఆ సినిమా చెయ్యట్లేదు. కారణాలు తెలియవు గానీ, ఇప్పుడు కొత్త కథల కోసం రాజశేఖర్ చూస్తున్నారు. గరుడవేగ సినిమా తర్వాత కథల ఎంపికలో యాంగ్రీ స్టార్ తీరు మారింది. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కల్కి ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా... హీరోకి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తన వయసుకు నప్పే, ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథల కోసం రాజశేఖర్ చూస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తితో ఆయన అనుకున్న సినిమాను ఇప్పుడు సుమంత్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ టాక్.
    ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.  
కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది. అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.  
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల కోసం వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తోన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా 24వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. డిసెంబర్ 21నుంచి వైఎస్సార్ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే, వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు 10వేలు చొప్పున ఆర్ధికసాయం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. అదేవిధంగా మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ మంత్రివర్గం... హోంగార్డుల రోజువారీ వేతనాన్ని 710 రూపాయలకు పెంచింది. దాంతో హోంగార్డుల నెల వేతనం 18వేల నుంచి 21వేల 300కి చేరనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్‌లో సభ్యత్వమున్న న్యాయవాదులకు నెలకు 5వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక, జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం... మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పలాస ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతి తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి... ప్రభుత్వమే హామీగా ఉండి... రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కములకు ఊరటనిచ్చేందుకు... 4వేల 471కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
  న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు.  హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.
  పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా, ఉద్యోగాలు లేవని ప్రకటించిన సీఎం కేసీఆర్ కరుణిస్తారా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మహదావకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఆయన రాసిన అంశం కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, సూసైడ్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని తెలిపారు. నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చి ఆర్టీసీ గొప్పగా ఆదుకున్న ఘనత టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన లేఖ ద్వారా ఆయన గుర్తు చేశారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో తాను ఉన్నా అని, ఎక్కడా కూడా అర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు అని అలా చేయడమంటే పాలసీని మార్చుకోవడమే అన్నారు. ఇదంతా సాదాసీదా కామెంట్స్ అయినా కానీ పరిస్థితి చేజారిపోకముందే కార్మికులు సమ్మె విరమించాలి అని కూడా రాశారు. కార్మికులు ముందుకొస్తే పరిస్థితి అదుపు లోకి వచ్చినట్టే అని తెలుస్తుంది. అద్దె బస్సులు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్ పై సీఎం తీసుకున్న నిర్ణయం సమ్మె నేపథ్యంలోనే అని గుర్తించాలని చెప్పారు కేకే. అయితే అర్టీసి కార్మికుల సమ్మె తీవ్ర తరం అవడంతో ప్రభుత్వం దీనిని ఆపాలనే ఉద్దేశంతో కెకెతో అధికారికంగా కాకపోయినా ఆర్టీసి సంఘాలతో సంప్రదింపులు జరిపి సమ్మెను విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తాము ఆర్టీసి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిధ్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. వారు ముందే సీఎం కె.సి.ఆర్ ను సంప్రదించామని అన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
  కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు... ఇప్పటికే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు... ఇంకా వేల కోట్ల రూపాయల పని మిగిలే ఉంది. అయితే, ప్రాజెక్టును మాత్రం ప్రారంభించేశారు. అయితే, లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములను పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరును మాత్రం అపర కుబేరుడిని చేసింది.  ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మేఘా కంపెనీ తలరాతే మారిపోయింది. అవును... కాళేశ్వరం ప్రాజెక్టు... మేఘా కంపెనీకి కాసుల పంట పండించింది. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తామన్న కేసీఆర్....  తెలంగాణను బంగారంగా మార్చారో లేదో తెలియదు కానీ... మేఘా కంపెనీ తలరాతను మాత్రం బంగారంగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మేఘా కంపెనీ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అమాంతం దూసుకొచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో మొన్నటివరకు 47వ స్థానంలో ఉన్న మేఘా కంపెనీ యజమానులు... కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 39వ ప్లేస్ కి చేరుకున్నారు. అయితే, మేఘా కంపెనీ ఒక్కసారిగా పుంజుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని ఫోర్బ్స్ విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా నెట్ ప్రాఫిట్ 3వేల కోట్లు దాటిందని, అలాగే రెవెన్యూ 23శాతం వృద్ధి చెందిందని, దాంతో మేఘా ఫ్యామిలీ ఆస్తుల విలువ 6శాతం పెరిగాయని ఫోర్బ్స్ విశ్లేషించింది. ఇక, మేఘా కంపెనీ అంటే టక్కున గుర్తొచ్చేది మేఘా కృష్ణారెడ్డే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎండీగా ఉన్న కృష్ణారెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కలిసి దాదాపు 40వేల కోట్ల రూపాయలు పంచుకుని తిన్నారని ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్ నిపుణుల సైతం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. ఇక, ఫోర్బ్స్ లిస్ట్ తర్వాతే మేఘా కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడాల్సిందేనని విపక్షాలూ ఆశిస్తున్నాయి. అయితే, ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా టాప్ 40కి వచ్చేస్తే, ఇక ఏపీ, తెలంగాణలో దక్కించుకుంటున్న, దక్కించుకోబోతున్న ప్రాజెక్టులతో వచ్చే ఏడాడే టాప్ టెన్ లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.
Its been 2 weeks since my college started. All its activities have also started in full swing!!   There so many events where you have to showcase your talent in front of the entire class. Be it a class presentation on biotechnology or giving inductions for the dance club! You will have to come forth and show what you have got.   But most of the teenagers have a little voice inside their heads which gives them a doubt on their talents. It is not even a doubt, its just a fear to stand up. That little voice starts growing louder and louder until we fall under it and not step up. There is a constant question, why me? Why now? Why cant I just talk to them in person? Is it necessary to stand there on the dais and look at everybody? We also wish to be known by everybody. We also wish to be looked upon as extremely cool kids of the campus. But we want to have all that without coming out and putting forth anything. Just secretly, somehow people manage to understand how awesome we are and come to hang out with us. Well ,that is not possible,right? I completely understand. Because, that was my mentality a few years ago during my schooling. But soon I realized, its not going to help me in anyway. All my friends were fast enough to go way ahead of me and I was left alone sitting in the dark when I had the potential to shine as bright as a diamond. There were elocution competitions and debates and all sorts of interesting stuff. But I wondered if I was good enough to hold the mike and argue with people who had good enough knowledge about everything. I knew to myself, that I was a pretty good orator. But I didn’t know if wanted to show it to everybody. There was always a question at the back of my mind, what if? Then one fine day, I decided to give it a try. A genuine one. I took part in this elocution competition and practiced for it. Before I went on to the stage, I was really nervous. All the “what if” questions kept coming back to me. I took a deep breath and reminded myself that I planned to give  a genuine try and it was not possible if fear overpowered me. So I shoved all the questions to a very dark corner of my mind and went on to the stage. I gave it all I had. The results were out. What are the odds? I got the first place!! Along with the prize I gained lots of praises from teachers and friends. It felt so nice to hear so many compliments, that I was beaming with confidence.     Confidence is the main point here. Winning, losing is a different matter. Although you have to try to win, its absolutely alright if you lose. What matters the most is the confidence with which you come before all the people and project yourself. When you know deep in your heart that you are good at something and there is an opportunity to show case it. Donot step back. Donot hesitate. Remember, Not everyone gets an opportunity. People die to get one. When it is knocking right at your door, just welcome it in with open arms. I am sure you will never regret it. You will definitely learn something. So,don’t be afraid. Just reach out to your wings and I know you’ll fly. -Sanjana Kunde
  Pain is the most common health complaint we get to experience or listen from our family and friends. We generally attribute body pains to change in weather or physical strain or stress. Most of the times, popping some pain killers would do the trick for us. However, there are some pains that come up for no apparent reason and they persist for a longer period of time and no pain killer would really help us. How do we deal with this? Pain can be the foremost indicator for a bigger issue in your environment. Instead of ignoring the pain as a regular one, start listening to your body. Our body is telling us, 'Do not ignore, there is an issue you need to look into here'. The issue most probably is an emotional one. We tend to ignore those small little things in our life, those small differences of opinions or small fights or small hurts. However they go and pile up in our subconscious memory and start playing their part. They just need a trigger to show up and what else can be a better way, change of season or weather or physical strain. Trigger can be anything from weather to workplace stress. We cannot ignore physical pain, though we ignore emotional pain. As discussed in our last article, when you stop the energy from its natural flow, it starts stinking. When we experience a thought or feeling or emotion, if we don’t allow it to flow through us but hold on to it, the stagnant energy starts showing up in our body as pain or illness. Does it mean when we stop energy from its flow, would the energy become negative or bad? Never. Energy is energy and there is nothing like bad energy or good energy. Don’t get into any belief system that there is something called bad energy or good energy. It’s just energy. If we start looking at our lives and try to understand the most common emotional reason, we experience pains whenever we do not allow ourselves to feel our anger or when suppressing anger. Remember, anger has a wide range of feelings from mild irritation to helpless rage. Each emotional cause leads to a different body pain because each part of the body is connected to a different emotion and reflects different parts of life. You can understand what your body wants to indicate by noticing your pain closely. Do you feel constrained, controlled, suppressed or pushed around? Usually the language our body speaks to us is easy to understand. Let us look at some of the most common and chronic pains, body pains, back pain and joint pain. We listen to body pain complaints mostly from our mother or grand mothers. They  never opened up and expressed their unhappiness about a situation or felt suppressed or they felt they were not living the life they wanted to live. All the resentment or frustration is not allowed to be felt, so it settles in various parts of body and manifests as body pains. If they go to a doctor, a pain medication may help. But the pain comes back, because they haven't addressed the emotional issues or feelings. You must have observed people who control others around them. Whenever we allow someone to enter into our boundaries and allow them to manipulate us, they tend to control us. Without our conscious knowledge, we follow them without questioning them or just believing them. Suddenly we feel powerless and realise what happened.  We get annoyed with ourselves, how we allowed someone to control us and our lives. Imagine yourself in the situation, don't you feel constrained, so helpless, so very powerless. How does the body express these anger based feelings? Through joint pains. Our body literally shows us I feel I am controlled so much I cannot move a step because that's how we feel emotionally, controlled in our movements. It starts with knee pain or stiff knees, loss of cartilage and finally ends up with a knee replacement surgery. It goes well for next couple of years after the operation, however in few cases it may return again because the helpless anger is still unaddressed. But you don't have to beat yourself up, even if you are the controller or you are the one being controlled, any form of control is insecurity about life. If I am not in control, life may go out of my hands! So be compassionate with yourself and address the associated feelings. I had a client suffering from severe back pain for over 5 years. He works abroad and his family is back in India. When we looked into his history, he said 5 years ago, he experienced extreme financial difficulty and took a lot of burden and stress to get over the challenge. While he was going through those difficult times of his life, he started experiencing lower back pain. He took all possible medical help which helped him to manage pain to some extent. But the pain didn't go away fully, it was in the background as nagging pain. If we look into it closely, back bone is a symbol of support system and financial security is the biggest support factor in our lives. Whenever someone experiences back pain, there is an issue with support system, either emotional support or financial support. But usually lower back pain is related to financial security. When someone experiences lack of support in financial system, they experience lower back pain. Once we know there is a cause for any pain, it's easier to heal it, while using our regular medical help, we can also look into emotional issues. Be gentle, compassionate with your body, extend all your love to the body and it will start working with you in sync. There are some who find it difficult to get their pain healed. Why would anyone want to hold on to pain? At conscious level, no one would like to have pain in their life. But once we start looking deeply, at subconscious level, it is we who hold on to pain not that pain is holding on to us. Because pain has become our identity, we don’t want to let go of the pain. I had a client who had experienced traumatic childhood. All her life is built around the trauma. She invited all experiences around the same. When we started working on her issues, she wasn't ready to let go of her childhood issues. Her question was, what will I hold on to if I let go of my pain and my past? Let's understand that we are here to experience life and we don't need to have pain as an experiencing process. We have a choice here, either experience life with pain or with happiness and peace. Body is a wonderful indicator for us. Anything you miss at emotional level even by mistake, it actually shows up glaringly into our face, as pain. Stop disconnecting with your body and start building relationship with it. "As eyes are reflection of our soul, body is reflection of our subconscious mind." Your body speaks just the truth. Even our prospective HR Managers depend on your body language, during interviews they listen to your answers but take confirmations from your body language. How cool it is?! If others are listening to our body language why don't we want to listen to it. Let's listen to our body, our own sweet selfless buddy! -Ramakrishna Maguluri  
  ఆమధ్యన ఒక శాస్త్రవేత్త చిన్నపాటి ప్రయోగం ఒకటి చేశాడట. కొన్ని పురుగులని పట్టి ఒక గాజు సీసాలో ఉంచాడు. సీసాలో వేయగానే ఒక్కసారిగా ఆ పురుగులన్నీ బయటకి ఎగిరేందుకు ప్రయత్నించాయి. అవి అలా పైకి ఎగురుతుండగానే.... సీసాకి ఓ మూతని బిగించేశారు. అంతే! ఆ పురుగులన్నీ శక్తి కొద్దీ వెళ్లి ఆ మూతకి తగులుతూ కిందకి పడిపోవడం మొదలుపెట్టాయి. అలా కాసేపు జరిగిన తర్వాత ఇక ఆ సీసాను దాటుకుని వెళ్లడం అసాధ్యమన్న విషయానికి అవి అలవాటుపడిపోయాయి. దాంతో ఇక మూతని తాకకుండా అక్కడక్కడే ఎగరడం మొదలుపెట్టాయి. కొంతసేపటి తర్వాత సీసా మూతని తీసేసినా కూడా పురుగులు అందులోంచి బయటపడేందుకు ప్రయత్నించలేదు. అడ్డుగా ఉన్న మూతని దాటుకుని వెళ్లడం అసాధన్యమన్న భ్రమలోనే అవి ఉండిపోయాయి.   ఇంటర్నెట్‌లో ‘flear in a jar’ అని టైప్ చేస్తే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించేదంతా నిజమో కాదా అన్నదాని మీద పెద్ద వివాదమే ఉంది. కానీ చాలా సందర్భాలలో జీవుల ప్రవర్తనను ఇలా ప్రభావితం చేసేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. జంతువులలో కనిపించే ఇలాంటి ప్రవర్తనని conditioning అంటారు. ఈ conditioning ద్వారానే వాటిని ఒకోసారి మనకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాము కూడా!   వీడియోలో కనిపించేంది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుందన్నది సైకాలజిస్టుల మాట. మనుషులు కూడా తమ చుట్టూ ఉండే పరిస్థితులకి ఇలాగే లోబడిపోతుంటారని తెలిసిందే! ‘నేను ఎందుకూ పనికిరానివాడిని,’ ‘నా లోపాలను మించి నేను ఎదగలేను’, ‘ఈ సమస్యలను దాటడం నా వల్ల కాదు’... లాంటి సవాలక్ష నమ్మకాలతో మనల్ని మనమే conditioning చేసుకుంటూ ఉంటాము.   ఎప్పుడో ఒకసారి మనకి ఎదురుపడిన పరాజయం మన అనుమానాలు నిజమేనన్న బలాన్ని కలిగిస్తాయి. పైకి ఎదిగేందుకు అడ్డుగా నిలుస్తాయి. మన నమ్మకాలు నిజమో కాదో మరోసారి పరీక్షించకుండానే, వాటని మన లోపాలుగా మార్చేసుకుంటూ ఉంటాము. అందుకే! పరాజయపు మాట పక్కన పెట్టి మరోసారి ప్రయత్నించి చూడమని ఈ పరిశోధన చెబుతోంది. ఎగిరేందుకు ప్రయత్నిస్తేనే కదా.... మనకి హద్దు, అదుపు ఉన్నాయో లేదో తెలిసేది! - నిర్జర.
  కొవ్వు పదార్ధాలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా శరీరం బరువు పెరిగిపోవడం, బాగా లావెక్కడం, రక్తపోటు, షుగర్, గుండెపోటు లాంటి వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ చాలామంది కొవ్వు బాగా వున్న పదార్ధాలను చాలా ఇష్టంగా తింటూ వుంటారు. అలాంటివాళ్ళకు మరో హెచ్చరిక... కొవ్వు అధికంగా ఉన్న పదార్ధాలను ఎక్కువగా తినడం వల్ల పైన పేర్కొన్న సమస్యలు మాత్రమే కాదు... పిచ్చి కూడా ఎక్కే ప్రమాదం వుందట. ఈ విషయం లుసియానా విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. లుసియానా యూనివర్సిటీ పరిశోధకులు బయోలాజికల్ సైకియారిటి అనే జర్నల్లో తమ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. కొవ్వు పదార్థాలను పరిమితికి మించి తినేవారి ప్రవర్తనలో విపరీత ధోరణులు ఏర్పడతాయని, అయినప్పటికీ తమ ఆహారాన్ని మార్చుకోని పక్షంలో మానసిక సమస్యలు వేగం పుంజుకుని, ఒత్తిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా మానసిక సంబంధమైన సమస్యలు పెరిగిపోయి చివరికి పిచ్చికి దారితీసే ప్రమాదం వుందని సదరు పరిశోధకులు అంటున్నారు.
If you are sick you go to the doctor. But, what if you could avoid falling sick? Of course you can’t avoid everything and anything but there are a few problems to which you can lower your vulnerability. Diabetes type 2 is one such problem you can avoid simply by an increased consumption of eggs and fat dairy products. Surprised? It is a very unusual remedy but experts say its very effective. For more proof you can take a look at what the research of a University of Eastern Finland has revealed. After a controlled experiment it was realized that men who ate 4 eggs in a week brought down their risk of developing type 2 diabetes by 37%. However, taking more than 4 eggs per week did not lead to any other benefits that are worth a mention. Another group of Scandinavian scientists who conducted a similar research, pointed out that increased consumption of high fat dairy products can bring down your risk of developing type 2 diabetes by 23%. Shockingly, 6% of the population in Britain are diagnosed with diabetes and most of the people fall in the type 2 category. If you don’t want to be one among them, consult your doctor and include these essential foods in your diet. -Kruti Beesam
  నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.   - మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.   - నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.   - నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.   - నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.   - నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.   ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు. మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.