LATEST NEWS
  Father of noted Sri Lankan cricketer Dhananjaya de Silva was shot dead. The player`s father is Mr. Ranjan who is a local politician. According to the police, unidentified gunmen has shot him down at the midnight of Thursday. Investigations were under way and no conclusions were yet made regarding the cause of murder. Hearing the demise of his father Dhananjaya has withdrawn from the test match series with West Indies.
  One of the policies of Amazon that attract customers is it’s returning policy. Customers can return back the goods if they are not satisfied enough. But it could be play time for some customers. They often order the goods and return them without valid reasons. Keeping such customers in mind Amazon has started banning such people from shopping on its site. "We want everyone to be able to use Amazon, but there are rare occasions where someone abuses our service over an extended period of time," explained an amazon representative.
  It seems to be raining biopics in Tollywood. After the success of mahanati- expectations on the biopics of NTR, Uday Kiran, YSR has reached to zenith. Now here is another interesting news regarding biopics, Telugu wrestler Karanam Malleswari is said to have been approached by a notable director for making her biopic. Rumours were being heard that either Sonakshi Sinha or Priyamani would act the lead role. Karanam Malleswari’s life indeed has all the ingredients to make a good movie. From poverty to Olympic medal, her life could be inspiring as well as interesting.
ALSO ON TELUGUONE N E W S
  Who could forget Morgan Freeman who is considered as one of the greatest Hollywood actors of all time. As least eight women has raised voice against his conduct. They alleged that his behaviour is inappropriate while working with him on the sets. Though Morgan Freeman has denied these allegations, he has apologised for any feelings being hurt- “Anyone who knows me or has worked with me knows I am not someone who would intentionally offend or knowingly make anyone feel uneasy. I apologize to anyone who felt uncomfortable or disrespected — that was never my intent.” Said Morgan in his statement issued.
  రంగస్థలం 200 కోట్ల వసూళ్ల మార్కుని దాటేసి రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో మూడో స్థానాన్ని సాధించింది. బాహుబలి 1, 2 తర్వాత స్థానం రంగస్థలానిదే. కానీ రామ్‌చరణ్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదు. ఒక సినిమాని దాని సత్తాతోనే ప్రజలు గుర్తించాలని అతను కోరుకుంటున్నట్లుంది. అందుకే నిన్న మీడియాతో మాట్లాడుతూ తన సినిమా వసూళ్ల గురించి పోస్టర్ల మీద ప్రచురించవద్దంటూ ప్రొడ్యూసర్లను కోరారు. వాటి గురించి లేనిపోని వివాదాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఆది పినిశెట్టి అటు తమిళ సినిమాలతో పాటు.. ఇక్కడ తెలుగు సినిమాలు కూడా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు సినిమాలో ప్రతి కథానాయకుడు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆది.. ఇటీవల కాలంలో వచ్చిన నిన్నుకోరి, రంగస్థలం మంచి పాత్రలు చేయగా.. ఆ సినిమాలు కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘నీవెవరో’ టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను కథానాయకుడు నాని ట్విటర్‌లో విడుదల చేశారు. ‘ఆది కొత్త సినిమా టైటిల్‌ ‘నీవెవరో’. మా ప్రియమైన ‘అరుణ్‌’ నటించనున్న సినిమా టైటిల్‌ లోగోను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కోనవెంకట్‌, తాప్సి, రితికా సింగ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు. అనంతరం ఆదికి ట్వీట్‌ చేస్తూ..‘నువ్వు చెప్పిన కథకు ఈ టైటిల్‌ అదిరిపోయింది బాబాయ్’ అని పేర్కొన్నారు. కాగా  హరినాథ్‌ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సి,  రితికా సింగ్‌ నటిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
  టాలీవుడ్ లో కోటి రూపాయలు తీసుకున్న మొట్ట మొదటి హీరోయిన్ ఎవరంటే ఇలియానా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా భామ పోకిరీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఒక్క నైట్ లో సూపర్ స్టార్ అయిపోయింది. అంతే ఆ తరువాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. ఇక ఈ భామ కూడా కోటి రూపాయలు డిమాండ్ చేసేసింది. నిర్మాతలు కూడా ఇలియానాకు కోటి రూపాయలు ఇవ్వడంలో వెనుకడుగు వేయలేదు. తాను డిమాండ్ చేసినంత ఇచ్చేవారు. అయితే అది అప్పుడు. ఆ తరువాత కొత్త కొత్త హీరోయిన్లు రావడం... ఛాన్స్ లు తగ్గడం తాను కూడా బాలీవుడ్ వెళ్లిపోవడం జరిగిపోయింది. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఎన్నో రోజుల నుండి ఇలియానా కూడా తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి ట్రైం చేస్తుంది... ఇలాంటి టైంలో ఈ అవకాశం వచ్చింది. అలాంటిది రాక రాక అవకాశం వస్తే ఎవరైనా పారితోషికం ఎంత ఇచ్చినా పర్వాలేదు.. ఛాన్స్ వచ్చింది కదా అని అనుకుంటారు. కానీ ఇల్లీ బేబీ మాత్రం ఎక్కడా తగ్గకుండా... 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసేసిందట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఆమెకు 2కోట్లు ఇవ్వడానికి  నిర్మాతలు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఇంత గ్యాప్ తరువాత కూడా ఇలియానా పారితోషికం విషయంలో ఎంతమాత్రం తగ్గకపోవడం.. దానికి నిర్మాతలు ఓకే చెప్పడం గ్రేట్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. నిజంగానే చాలా గ్యాప్ తరువాత కూడా ఇలియానా ఇంత డిమాండ్ చేయడం గ్రేటే..
  Puri Jagannadh has been going through turbulent times. First it was the drug case and then the successive defeats of Paisa Vasool and Mehabooba movies... but there seems to be a silver lining to his fate. Nagarjuna is said to have roped Puri to direct his next film. Nag who is on the good mood with the success of Raju Gari Gadhi-2 has given a thumbs up to puri for the next venture. He is currently shooting for Sriram Aditya’s multi starrer along with Natural star Nani. This would be the third venture between Nagarjuna and Puri after Shivamani and Super.
  నిన్న కర్ణాటకలో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారం ప్రాంతీయ పార్టీలన్నింటికీ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి హాజరై అంతా లాభపడినట్లే కనిపించారు. కానీ చంద్రబాబు మాత్రమే కాస్త చిక్కుల్లో పడ్డారేమో అన్నది విశ్లేషకుల అంచనా. రాహుల్‌గాంధితో కలిసి చంద్రబాబు నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడిన ఫొటోలని ప్రతిపక్షాలు బాగానే ఉపయోగించుకుంటున్నాయి. మొన్నటివరకూ బీజేపీతో జతపట్టి రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌తో కలిసి అదే తప్పు చేస్తున్నారని దుయ్యపడుతున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయనే కేసీఆర్‌ తెలివిగా ఓ రోజు ముందే వెళ్లి కుమారస్వామిని కలిసివచ్చారు. కాంగ్రెస్ మీద కసితోనే ఆవిర్భవించిన తెదెపా కూడా ఇలాంటి వ్యూహమేదో పాటిస్తే బాగుండేది. కానీ వేదిక మీద చంద్రబాబు బాడీలాంగ్వేజ్‌ కోరి విమర్శలు తెచ్చుకొంది.   మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కూడా తన దూకుడిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు మేధావి, అనుభవజ్ఞుడు అంటూ కితాబిచ్చిన నోటితోనే చంద్రబాబుని ఏకేస్తున్నారు. ఆయన మాట మీద నిలబడటం లేదనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేశారనినేరుగానే విమర్శిస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితల సమస్యలని కనుక తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్నారు. పవన్‌ హెచ్చరికలు ఎప్పుడెలా ఉంటాయో, ఎంత దూరం వెళ్తాయో అంచనా వేయడం కష్టం. ఇది ఖచ్చితంగా చంద్రబాబుని చికాకుపెట్టి తీరుతాయి.   ఇక వైసీపీ ఈసారి తెలివిగా వెంకన్నబాబుని రాజకీయంలోకి లాగింది. ఏకంగా రమణదీక్షితులులాంటి సెలబ్రెటీ స్టేటస్‌ ఉన్న అర్చకుడిని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పింది. వెంకటేశ్వరుని ఆభరణాలు చంద్రబాబే దొంగిలించారంటూ ప్రచారం చేస్తోంది. ఈ విషయాలను ప్రజలు నమ్మకపోయినప్పటికీ, ఎక్కడో ఏదో మతలబు జరుగుతోందనే అనుమానాన్ని కలిగించడంతో మాత్రం విజయం సాధించింది. అసలే ప్రత్యేక హోదాని రప్పించలేక, నూతన రాజధానిని నిర్మించలేక కష్టాల్లో ఉన్న చంద్రబాబు మీద ఇవన్నీ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి రాజకీయ చతురతలో ఆరితేరిపోయిన బాబు వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి!
  తిరుమల తిరుపతి దేవస్థానం పై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెద్ద తుఫానుగా మారేలా కనిపిస్తోంది. అంతేకాదు.. చూడబోతే ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వం కూడా ఇరుకునపడే పరిస్థితి వస్తుందేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకే కుదిస్తూ టిటిడి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రమణదీక్షితులు పింక్ డైమండ్ తో పాటు టిటిడిలో చోటు చేసుకొంటున్న విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికితోడు... పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి టిటిడి ఆభరణాలు కొన్ని కన్పించకుండా పోయాయని ఆరోపించారు. 2011లో తాము ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. శ్రీకృష్ణ దేవరాలయాల కాలం నుండి శాసనంలో ఉన్న ఆభరణాలు ,ఇతర వస్తువులు లేవని ఆయన చెప్పారు.అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు టిటిడి ఆభరణాలను భద్రపర్చేందుకు కమిటీని ఏర్పాటు చేసి జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఇక మొత్తంగా టిటిడిలో పరిణామాలు టిటిడి పాలకవర్గంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఈవో సింఘాల్ తో సమీక్ష నిర్వహించారు.   ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై రమణదీక్షితులు ఎలా విమర్శలు గుప్పిస్తారని చంద్రబాబునాయుడు రమణదీక్షితులు వ్యవహరంపై ప్రశ్నించారని సమాచారం. ఇక సమీక్ష ముగిసిన తరువాత సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. టిటిడిలో శ్రీవారి నగలన్నీ సురక్షితంగానే ఉన్నాయని.. టిటిడి నిధులు ఎక్కడ కూడ దుర్వినియోగం కాలేదని ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయడు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. ఆగమశాస్త్రం ఒప్పుకొంటే శ్రీవారి నగలను ప్రదర్శిస్తామని... నగలను ప్రదర్శించేందుకు తాము సిద్దంగా ఉన్నామని... 1952 నుండి కూడ స్వామివారికి ఉన్న నగల జాబితాకు సంబంధించిన రికార్డులున్నాయని ఆయన చెప్పారు. 2011లో రిటైర్డ్ జడ్జిల కమిటీ ప్రకారంగా నగలు ఉన్నాయని... అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ నగలు ఇచ్చారనే విషయాన్ని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చలేదన్నారు.     మొత్తానికి ఈ వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక కేంద్రం వరకూ ఈ వ్యవహారం వెళ్లడంతో ఏం జరుగుతుందా అని  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే కేంద్రానికి.. చంద్రబాబు చెడింది... ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..
  గత కొద్దికాలంగా బీజేపీ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సందు దొరికినప్పుడల్లా బీజేపీపై మోడీపై తెగ విమర్సలు చేసేశారు ప్రకాశ్ రాజ్. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ డ్రామాపై స్పందిస్తూ బీజేపీ పై కామెంట్లు విసిరారు. అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇక జేడీఎస్ మద్దతు కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్,బీజేపీ బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేజీఎస్ కాంగ్రెస్ కు మద్దతిచ్చి బీజేపీకి షాకిచ్చింది. దీంతో బీజేపీ ఎలాగైనా తమకు కావాల్సిన ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక గవర్నర్ ను అడ్డుపెట్టుకొని కూడా అధికారం చేపట్టాలని చూసింది. కానీ ఆ పప్పులేమి ఉడకలేదు. సుప్రీంకోర్టు బీజేపీ అడిగిన వారం రోజులు గడువు ఇవ్వకుండా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చి బలపరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలతో బేరసారాలు కూడా చేశారు బీజేపీ నేతలు. ఇక బలపరీక్ష కొద్దిసేపట్లో జరుగుతుంది అన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు చాలా తెలివిగా ఈ ఆడియో టేపులను కాస్త బయటపెట్టింది. ఈ ఆడియో టేపుల్లో స్వయంగా యడ్యూరప్ప పేరే బయటకు రావడంతో బీజేపీకి అసలు సమస్య వచ్చిపడింది. ఇలా చేసినందుకు మోడీ, షా ద్వయం యడ్యూరప్పపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసేది లేక రాజీనామా చేయమని ఆదేశించడంతో.. బలపరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా చేశారు. ఇక యెడ్డీ రాజీనామాతో బలపరీక్ష చేసే పని తప్పింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   ఇక గత వారంరోజులుగా జరిగిన కర్ణాటక రాజకీయాలపై రజనీకాంత్ మాట్లాడుతూ... కర్ణాటకలో జరిగిన అన్యూహ్య సంఘటనను చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నా.. బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్ 15 రోజులు సమయం ఇవ్వడం, అందుకు భాజపా మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టుగా ఉంది.. బల నిరూపణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు.. ఆతీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది అని అన్నారు. ఇక రజనీ చేసిన వ్యాఖ్యలను బట్టి తాను కూడా బీజేపీకి వ్యతిరేకమని చెప్పకనే చెప్పారని అంటున్నారు పలువురు. అంతేకాదు రజనీ బీజేపీ పై కోపంగా ఉండటానికి వేరే కారణం ఉందని కూడా అంటున్నారు. అది ఏంటంటే.. ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న వ్యాఖ్యలే రజనీ బీజేపీ అంటే మండిపడటానికి కారణం అంటున్నారు. స్వామిగారు రజనీపై మామూలు కామెంట్లు వేయలేదు మరి. రజనీకి చదువు లేదని.. ఆయన రాజకీయాలకు పనికిరాడని... అతనితో పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద నష్టం ఇంకేం లేదు... సినీ తారలకు రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ రోజులు ఎప్పుడో పోయాయని.. సినిమా తారలతో అలయెన్స్ అంటే అది అతిపెద్ద వైఫల్యమే అని తెగ విమర్శలు గుప్పించారు. ఈ కారణం కూడా బీజేపీపై రజనీ కోపంగా ఉండటానికి ఒక రీజన్ అంటున్నారు విశ్లేషకులు. దానికితోడు ఈ మధ్య కాలంలో బీజేపీ పై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ కారణాలవల్లే రజనీ కూడా ఇప్పుడు ఓపెన్ గానే బీజేపీ పై కామెంట్లు చేశారని... దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోను అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...
  మూడు రోజులుగా జరుగుతున్న కర్ణాటక రాజకీయ డ్రామాలకు తెరపడింది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంకోసం చేసిన పోరులో ఎట్టకేలకు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 104 సీట్లు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో అధికారం చేపట్టే అవకాశం చేజార్చుకుంది. అసెంబ్లీ బలపరీక్షలో ఎలాగైనా గెలవాలని బీజేపీ విశ్వప్రయత్నాలే చేసింది. దీనిలో భాగంగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపుకు లాగడానికి బేరసారాలకు సైతం దిగింది. కానీ బీజేపీ ప్రయత్నాలు మాత్రం వర్కవుట్ కాలేదు. ఇక ఈరోజు ఇంకొద్ది సేపట్లో బలపరీక్ష జరుగుతుంది.. ఎవరు అధికారం చేపడతారో అని అందరూ ఎదురచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా యడ్యూరప్ప తమ పార్టీ నేతలతో చేసిన బేరసారాల వీడియో బయటపెట్టారు. దీంతో విషయం బయటపడటంతో మోడీ, అమిత్ షా యడ్యూరప్ప మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆఖరికి రాజీనామా కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పరీక్ష ముందే తమ ఓటమిని అంగీకరించి..ఉద్వేగంతో ప్రసంగం చేసిన యెడ్డీ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.   అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే... కర్ణాటకలో అన్ని పార్టీల కంటే అధికంగా 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అధికారంలో రాలేకపోయామని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఇక ఇప్పటికే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో... 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ వాజుబాయ్ వాలాకు సామూహిక రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరగాలంటే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారట. మరి ఇప్పుడు సామూహిక రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలని మొదలుపెడితే ప్రజలు ఆదరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న.. మరి ఇప్పటికే  బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. దానికితోడు కర్ణాటకలో బీజేపీ చేసిన రాజకీయాలవల్ల ఉన్న ఇమేజ్ కూడా పోయింది. దానికి  తోడు ఆడియో టేపులు బయటపడటం. అన్నీ బీజేపీకి ఎదురుదెబ్బలే తగిలాయి. అందుకే  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజల ఆగ్రహం చవిచూడటం కంటే ప్రతిపక్షంగా ఉండటమే మంచిదని బీజేపీ పెద్దలు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత మళ్లీ సామూహిక రాజీనామాలు అంటూ డ్రామాలు మొదలుపెడితే వర్కవుట్ అవుతుందా.. బీజేపీ మళ్లీ పప్పులో కాలేస్తుందని అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
  గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షపదవిలో ఎవరిని నియమించాలో బీజేపీ పెద్దలు చర్చలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ రేసులో మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారి ముగ్గురిలో మాణిక్యాలరావువైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ముందు సోమువీర్రాజు నే అనుకున్నా.. ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని.. అందుకే దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అయితే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ... మళ్లీ బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పురుంధరేశ్వరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలా చర్చించిన కొన్ని రోజుల తరువాత మళ్లీ సోము వీర్రాజుకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకున్నారు. ఇక కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత అసంతృప్తి చెందిన కన్నా లక్షీ నారాయణ వైసీపీ చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక రేపో మాపో కన్నా వైసీపీలో చేరుతారు అనుకునే లోపు.. అమిత్ షా నుండి ఫోన్ రావడం... ఆ తరువాత అనారోగ్యం అని ఏదో సాకు చెప్పి పార్టీ మార్పుకు బ్రేక్ చెప్పారు. ఇక ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్‌గా చేశారు. నాడు పార్టీ చీఫ్‌గా చేయనందుకే ఆయన వైసీపీలోకి వెళ్లాలని భావించారని, కానీ అధిష్టానం నుంచి హామీ వచ్చాక ఆగిపోయారని, ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.   ఇక ఇప్పుడు బీజేపీ అధిష్టానం కన్నాకు ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఓ మనిషి అలక పూనినట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు...సోము వీర్రాజు. ఆ పదవి తనకు దక్కుతుందనుకున్న సోము వీర్రాజు పాపం నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.  పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న తనను కాదని, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెందారట... ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఎనిమిది గంటల సమయం నుంచి ఆయన అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. మరోవైపు కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు... సోము వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. తమ నేత వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. రాజీనామా పత్రాలను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు పంపినట్టు తెలిపారు. మరి దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో.. సోము వీర్రాజును ఎలా బుజ్జగిస్తారో చూడాలి..
  నేను ఎప్పటికైనా సీఎం అవుతా... నాకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం..ఇంత ధైర్యంగా ఈ మాటలు చెబుతున్నది ఎవరబ్బా అనుకుంటున్నారా... ఎవరో కాదు రేవంత్ రెడ్డి. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజానికి టీడీపీ లో ఉన్నప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి..కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి చాలా తేడానే ఉందని చెప్పొచ్చు. టీడీపీలో ఉన్న రోజుల్లో రేవంత్ రెడ్డి  మీడియా ముందుకు వచ్చారంటే  సెన్సేషనే. కేసీఆర్ పై ఆయన చేసినట్టుగా  ఇంకెవరూ విమర్శలు గుప్పించేవారు కారు... అంత ధైర్యంగా కేసీఆర్ పై మాటల యుద్దం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కింది. అంతేకాదు ఎవరికి భయపడని కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కాస్త భయపడినట్టే చెప్పొచ్చు. అందుకే పక్కా ప్లాన్ చేసి ఓటుకు నోటు కేసులో ఇరికించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆతరువాత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడం.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొత్తలో ఉన్నంత ఊపుగా రేవంత్ ఇప్పుడు లేరని చెప్పొచ్చు. వారంలో నాలుగైదు ప్రెస్‌మీట్లు పెట్టే రేవంత్.. ఇప్పుడు నెలకొకటి రెండింటికే పరిమితమవుతున్నాడు.   ఇదిలా ఉండగా..ఉన్నట్టుంది ఇప్పుడు ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడంతో రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎప్పటిలాగే కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. మోదీ-కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఏసీబీ కేసుల సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రసార సాధనాల్లో, పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాయించి కేసు జరిగిన రోజు కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించి మమ్మల్ని భయపెట్టో.. బెదిరించో, లొంగదీసుకునో.. తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడు కోవడానికి అటు మోదీ-ఇటు కేడీ ఆడుతున్న నాటకంలో భాగమే.. కేసీఆర్ రివ్యూ వ్యవహారం" అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం చేశారు. అంతేకాదు ఇంకా పలు సంచలన వ్యాఖ్యలే చేసారు. " పార్టీ నాయకత్వం నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. నా స్థాయికి తగిన పదవి ఇవ్వాలని పలుమార్లు అధిష్టానాన్ని డిమాండ్ చేశాను. నాకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం. ఇప్పుడు కాకున్నా, కొన్నేళ్ల తర్వాతనైనా సీఎం అవుతాను. కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది నేతలు తన మాటను వింటారు. నా సలహా మేరకే వేటుపడిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌లు దీక్ష చేశారు" అని రేవంత్ రెడ్డి తన మనసులోని కొన్ని మాటలను బయటపెట్టారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ లో ఉన్న వారందరూ తలలు పండిన నేతలే. దీంతో ఎవరికి వారు తమే ముఖ్యమంత్రి అవుతామని  ఎవరి స్టేట్మెంట్స్ వాళ్లు ఇచ్చేస్తుంటారు. ఇటీవల ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన సీనియర్ నేత జానారెడ్డి తాను అన్ని విధాలా ముఖ్యమంత్రి పదవికి అర్హుడునని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు వాళ్లందరూ రేవంత్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూద్దాం..  
  కోపాన్ని అర్ధం చేసుకోవడం ఎలా? ఉదాహరణకి మీరు ఒక మీటింగ్ లో కూర్చున్నారు. మీరు ఏదో చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఒకరు అడ్డుపడుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ వ్యక్తి పైన కోపం వస్తుంది. అది ఒకవేళ మీ సహోద్యోగి అయితే, కోపం ప్రదర్శించే అవకాశం ఉంది... కానీ అదే మీ బాస్ అయితే, కోపం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి... ఇలాంటి సిట్యుయేషన్స్ లో కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=vOIHWmAqQVI
మీరు చాలా సార్లు మీ ఫ్రెండ్స్ వారి ప్రతిభకి తగ్గ ఉద్యోగం దొరకలేదు అని బాధపడటం చూసి ఉంటారు. ఒక్కోసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గరో లేక బంధువుల దగ్గరో ఇలాగే అని ఉండుంటారు. అలాంటి సందర్భంలో మానేజర్ మీ ప్రతిభని గుర్తించడం లేదు అని కోపం వస్తుంది. మరి, మీ పనితనం మీ ఆఫీస్ లో గుర్తించాలి అంటే ఎం చేయాలి. ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=ykMcxp6VEP0  
ఇంట్లో పసిపిల్లలు ఉన్నారంటే ఆ సందడే వేరు. వాళ్ల ఆటపాటలతో రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే పిల్లలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారనుకోండి... అప్పుడుంటుంది అసలు టెన్షన్‌. పిల్లవాడు ఏడుపు ఆపేవరకు తల్లిదండ్రులకు ఏమీ తోచదు. కానీ జపాన్‌లోని టోక్యోలో సంగతే వేరు. అక్కడ ఏడ్చే పిల్లవాడే విజేతగా నిలుస్తాడు. అదేంటో మీరే చూడండి. జపాన్‌ రాజధాని టోక్యోలో సెన్‌సోజి అనే బౌద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక వేసవి కాలం మొదలయిందంటే ఆ సందడి ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ జరిగే ఓ పిల్లల పోటీనే ఇందుకు కారణం. ఆ పోటీ పేరు ‘నాకిజుమో’... అంటే ఏడ్చే పిల్లల పోటీ అని అర్థం. ‘ఏడ్చే పిల్లలు బాగా బలంగా ఉంటారు’ అని జపాన్లో ఓ సామెత ఉంది. అంతేకాదు! పిల్లలు ఏడిస్తే... ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయని కూడా వాళ్లు నమ్ముతారు. అందుకనే ఏటా ఈ పోటీ పెడతారు. నాలుగు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పోటీలో ప్రవేశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే పిల్లలని ఇద్దరు సుమోలు ఎదురెదురుగా పట్టుకుని నిలబడతారు. ఆ ఇద్దరు పిల్లలలో ఎవరు ముందు ఏడుస్తారో వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ పిల్లలిద్దరూ ఒకే సమయంలో ఏడిస్తే, వాళ్లలో ఎవరు గట్టిగా ఏడుస్తున్నారో చూస్తారు. పోటీలో పిల్లలు బాగా ఏడ్చేందుకు రిఫరీలే వాళ్లని భయపెడుతారు. అప్పటికీ పిల్లవాడు ఏడవకపోతే భయపెట్టే మాస్కులు వేసుకుని పిల్లలు జడుసుకునేలా చేస్తారు. ఆ పోటీ చూసేందుకు వచ్చిన జనం కూడా పిల్లల్ని ఏడవమని అరుస్తూ రెచ్చగొడతారు. ఇంత జరిగిన తర్వాత పిల్లలు ఎడవకుండా ఎలా ఉంటారు చెప్పండి! ఈ ఏడుపు పోటీలు ఇప్పటివి కాదు. దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచీ వీటని నిర్వహిస్తున్నారట. ఏటా దాదాపు రెండు వందల మంది పిల్లల్ని ఈ పోటీలో పాల్గొనేందుకు తీసుకువస్తూ ఉంటారు. వాళ్లకి సుమో బట్టలు వేసి, నిర్వాహకుల చేతిలో పెడుతుంటారు. నిజానికి పిల్లలు అప్పుడప్పుడూ ఏడవటం మంచిదే కావచ్చు. దాని వల్ల వాళ్ల ఊపిరితిత్తులు బలపడతాయి. వాళ్ల ఆకలి, అనారోగ్యాల గురించి పెద్దవాళ్లకి తెలుస్తాయి. కానీ అదేపనిగా గుక్కపట్టి ఏడవటం వల్ల, వాళ్ల మెదడు దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌వాసులు మాత్రం ఈ మాటని వినేలా లేరు. - నిర్జర.
    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్‌ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట. మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్‌ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే! ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్‌ పనితీరు మెరుగుపడి, షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్‌ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్‌ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్‌ ని హ్యాపీగా గడిపేయండి.  
  మనం తల ఎటువైపు పెట్టి పడుకుంటే మంచిదో ఆలోచిస్తాం. కానీ ఎటువైపు తిరిగి పడుకోవాలో పట్టించుకోము. కుడివైపు అయినా, ఎడమవైపు అయినా పెద్దగా తేడా ఉండదన్నది మన నమ్మకం. నిజానికి ఎడమవైపు తిరిగి పడుకుంటే చాలా లాభాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. Digestion బాగుంటుంది:- మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునే పాంక్రియాస్‌ ఎడమచేతి వైపే ఉంటాయి. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి త్వరగా చేరిపోతుంది. దాని వల్ల ఎసిడిటీ, కాన్‌స్టిపేషన్‌లాంటి సమస్యలు రావు. అందుకే ఎప్పుడన్నా భుక్తాయాసంగా ఉన్నప్పుడు, ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. గర్భవతులకి మంచిది:- గర్భవతులు, ముఖ్యంగా నెలలు నిండినవారు ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వల్ల వెన్నెముక మీద భారం తగ్గుతుంది. పైగా కడుపులోని బిడ్డకు రక్తప్రసారం కూడా మెరుగవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ లివర్‌కు నొక్కుకుపోవడం వల్ల, లివర్‌ పనితీరు దెబ్బతినవచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ సమస్య కూడా దరిచేరదు. గుండె బాగుంటుంది:- ఎడమవైపు అనగానే మనకి గుర్తుకి వచ్చే భాగం గుండెకాయే! ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె తన సహజమైన స్థితిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా పడుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, అందులో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరుగుతాయట. అంతేకాదు... * వెన్ను సమస్యలు ఉన్నవారిలో కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్లే ఎక్కువ ఉపశమనం ఉంటుందని తేలింది. * కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల రాత్రిళ్లు గుండె మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల, కడుపులో రసాయనాలు పైకి వచ్చే అవకాశమే ఉండదంటున్నారు. * మన శరీరంలోని పనికిమాలిన పదార్థాలను బయటకు పంపేందుకు లింఫ్‌ గ్రంధులు చాలా ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు ఈ లింఫ్‌ గ్రంధులు మరింత ప్రభావంగా పనిచేస్తాయట. * ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య గురక. మనం పడుకున్నప్పుడు, గొంతులో ఉండే కొండనాలుక వైబ్రేట్‌ అవ్వడం వల్ల గురక ఏర్పడుతుంది. అయితే ఎడమవైపు తిరిగి పడుకుంటే కొండనాలుక సరైన పొజీషన్‌లోనే ఉండి, గురక రాదని చెబుతున్నారు. చూశారుగా! ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, నిద్రపోయేటప్పుడు కాస్త ఎడమవైపుకి తిరిగి పడుకుని చూడండి... - నిర్జర.