LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
మ‌ర‌క మంచిదే అన్న‌ట్లు ...వివాదం కూడా కొన్ని సార్లు సినిమాల‌కు ప్ల‌స్ పాయింట్స్ అవుతాయి. అలా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే వివాదంలో ఇరుక్కోవాల్సిందే. అవును...అవే ఆయ‌న సినిమాల‌కు మంచి ప‌బ్లిసిటీ ఇస్తున్నాయి కూడా అంటున్నారు కొంత మంది. ఒక సారి అర్జున్ రెడ్డి సినిమా విష‌యానికొస్తే...ఆ సినిమా పోస్ట‌ర్ విష‌యంలో చాలా వివాదాలు చెల‌రేగాయి. ఆ వివాద‌మే ఈ సినిమాకు విప‌రీత‌మైన ప‌బ్లిస‌టీ ఇచ్చింది.  ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.  అలాగే ఇటీవ‌ల విడుద‌లై క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపిస్తోన్న `గీత గోవిందం`  చిత్రం కూడా సూపర్ డూప‌ర్ హిట్ అయింది. ఇక దేవ‌ర‌కొండ లేటెస్ట్ చిత్రం నోటా చిత్రం కూడా ప్ర‌స్తుతం వివాదంలో ఇరుక్కుంది. ఒక సారి పూర్తి వివ‌రాల్లోకి వెళితే...ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ బేన‌ర్ పై జ్జాన్ వేల్ రాజా నిర్మించిన చిత్రం నోటా. ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ కి శశాంక్ వెన్నెలకంటి సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. అయితే ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ లో డైలాగ్ రైట‌ర్ శ‌శాంక్ వెన్నెలకంటి పేరు వేయ‌లేద‌ట‌.  డైర‌క్ట‌ర్ పేరే వేసుకున్నార‌ట‌. దీంతో ఇదే విష‌యంపై ఇటీవ‌ల శ‌శాంక్ మీడియాతో మాట్లాడారు. `డైలాగ్స్ రాసినంద‌కు రెమ్యూనిరేష‌న్ ఇవ్వ‌క‌పోగా పేరు కూడా వేయ‌లేదంటూ ..త‌న‌కు న్యాయం చేయాలంటూ  నిర్మాత జ్ఞాన‌వేల్ రాజాపై చెన్నై పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చార‌ట. త‌న‌కు న్యాయం జ‌రిగాకే సినిమాను విడుద‌లయ్యేలా చూడాలంటూ వారిని కోరారు. ప్ర‌స్తుతం ఈ వివాదం కూడా నోటా సినిమాకు మంచి ప‌బ్లిసిటీ అవుతోంది.
  శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే యువత మనస్సు గెలుచుకున్నారు.. తరువాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మల్టీస్టారర్ ట్రెండ్ ను టాలీవుడ్ కి తిరిగి తీసుకొచ్చారు.. తరువాత 'ముకుంద'తో మెగా హీరో వరుణ్ తేజ్ ను వెండితెరకు పరిచయం చేసారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. తరువాతే శ్రీకాంత్ అడ్డాల కథ అడ్డం తిరిగింది.. మహేష్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.. దీంతో శ్రీకాంత్ అడ్డాల రేస్ లో బాగా వెనుకబడిపోయారు.. అవకాశాలు దూరమయ్యాయి.. అయితే శ్రీకాంత్ అడ్డాల గోడకి కొట్టిన బంతిలా మళ్ళీ బౌన్స్ అవ్వడానికి సిద్ధమయ్యారు.. యంగ్ హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలి అనుకుంటున్నారు.. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల, శర్వానంద్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఈ సినిమా పూర్తైన వెంటనే నానితో కూడా ఓ సినిమా ఉంటుందని సమాచారం.. ప్రస్తుతం నాని నటించిన ‘దేవదాస్’ సినిమా విడుదలకు సిద్ధమైంది.. ఈ సినిమాతో పాటు నాని ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా అనంతరం నాని, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది.. చూద్దాం మరి శర్వానంద్, నాని సినిమాలతో శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ట్రాక్ లోకి వస్తారేమో.
అవును ఈ రోజు విడుద‌ల చేసిన ఎన్టీర్ చిత్రంలోని ఏయ‌న్నార్ లుక్  అదిరిరందంటున్నారు. ఈ లుక్ లో అచ్చం అక్కినేని లాగే క‌నిపిస్తున్నాడు సుమంత్. ఈ రోజు అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఈలుక్ విడుద‌ల చేశారు.  విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ లైఫ్ హిస్ట‌రీ ఆధారంగా వ‌స్తోన్న చిత్రం `ఎన్టీఆర్`. ఈ బ‌యోపిక్ లో బాల‌య్య ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌,  ఏయ‌న్నార్ స‌మ‌కాలీకులు కావ‌డంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఏయ‌న్నార్ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే ఈ పాత్ర‌కోసం ఏయ‌న్నార్ మ‌న‌వ‌డు సుమంత్ ని తీసుకున్నారు.   ఇక ఇప్ప‌టికే విడుద‌లైన ఎన్టీఆర్ చిత్రంలోని బాల‌య్య లుక్ అచ్చం అన్న‌గారిలాగే ఉందంటూ మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత నారా చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా కూడా స‌రిగ్గా స‌రిపోయాడంటూ తెగ పొగిడేసారు. ఇక ఏయ‌న్నార్ పాత్ర‌లో సుమంత్ అయితే టీనేజ్ లో ఏయ‌న్నార్ ని చూస్తున్న‌ట్లే అనిపిస్తోంది.  లుక్ ప‌రంగా ఓకే కానీ న‌ట‌న ప‌రంగా ఎలా ఉంటుందో అని కొంత మంది సందేహం వ్య‌క్త‌ప‌రిచినా.... అక్కినేని అభిమానులు మాత్రం క‌చ్చితంగా తాత ఎక్కడున్న గ‌ర్వించేలా సుమంత్ న‌టిస్తాడంటున్నారు. ఇప్ప‌టికే విడ‌దులైన ఒక్కో లుక్ ని అద‌ర‌గొడుతూ ద‌ర్శ‌కుడు క్రిష్ నంద‌మూరి అభిమానుల‌ను అల‌రిస్తూ ఎన్టీఆర్ సినిమా పై అంచ‌నాలు పెంచుతున్నాడు. జ‌న‌వరి 7న ఈ సినిమా విడుద‌ల కానుంది.
అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అంటే అకుంఠిత దీక్ష, కృషి ప‌ట్టుద‌ల‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఆయ‌న న‌టుడు కావాల‌నుకున్నాడు త‌ప్ప న‌టుడుగా పుట్ట‌లేదు. 85 ఏళ్ల తెలుగు సినీ చ‌రిత్ర‌లో బ‌హుదూర‌పు బాట‌సారి అక్కినేని. న‌ట‌న‌లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న అతికొద్ది మంది న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. భార‌తదేశ సినీ చ‌రిత్ర‌లో అక్కినేని ఒక చ‌రిత్ర , ఒక శ‌కం.  ఈ రోజు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న్ను ఒకసారి స్మ‌రించుకుందాం...  అక్కినేని 1923 , సెప్టెంబ‌ర్ 20న జ‌న్మించారు. పుట్టి పెరిగింది సంపన్న కుటుంబంలో కాదు,  హ‌య్య‌ర్ స్ట‌డీస్ ఏమీ చ‌దువుకోలేదు.  సినిమా క‌ష్టాల‌న్నీ ప‌డ్డారు. అలాంటి ఓ పేద రైతు  బిడ్డ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మూల స్థంభంగా ఎదగాడానికి ఎంతో  కృషి చేశారు. చిన్న‌నాటి నుంచి స్వ‌యం కృషితో ఎదిగారు. దేవుళ్ల‌ను నమ్మ‌డు, న‌మ్మేవాళ్ల‌కు అడ్డు చెప్ప‌డు. గెలుపైనా, ఓట‌మైనా పూర్తి బాధ్య‌త త‌నే తీసుకునేవారు.  వ్య‌క్తిత్వంలో ఆయ‌న ఉన్న‌త శిఖరం. సాహ‌సాలు చేయ‌డం అక్కినేనికి చాలా ఇష్టం. నువ్వు ఇది చేయ‌లేవు అంటే అది చేసే వ‌ర‌కు నిద్ర‌పోయేవారు కాదు.     అక్కినేనితో దేవ‌దాసు, విప్ర‌నారాయ‌ణ చిత్రాలు తీస్తే నిండా మునిగిపోతారంటూ ఎంతో మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను భ‌య‌పెట్టిన వాళ్లున్నారు.  అక్కినేని  సాహన శీలి.  త‌న‌దైన స్టైల్ లో అన్నింటీని అధిగ‌మించాడు. ఈ బ‌క్క‌ప‌ల్చ‌టి వాడు సినిమాల్లో ప‌నికొస్తాడా అన్నారు?  కానీ వ‌రుస విజ‌యాల‌తో నోళ్లు మూయించాడు. జాన‌ప‌ద చిత్రాల‌తో  మెప్పించాడు. కీలుగుర్రం, బాల‌రాజు లాంటి సినిమాల‌తో స‌మాధానం చెప్పాడు. సాంఘిక సినిమాల‌కు పెద్ద దిక్కుగా చిలిచాడు. ఈ ప‌ర్స‌నాలిటీతో  పౌరాణిక చిత్రాలు చేస్తే జ‌నాలు చూస్తారా అన్నారు. ఎన్టీఆర్ కంటే ముందే రాముడు,విష్ణుమూర్తి పాత్ర‌ల్లో మెప్పించారు. నాస్తికుడు, భ‌క్తుడి పాత్ర ల్లో చేస్తార‌ని విమ‌ర్శించిన  వాళ్ల‌తోనే భక్తుడి పాత్రలకు అక్కినేని తప్ప మరొకరు లేరని నిరూపించారు.     అక్కినేని విమ‌ర్శ‌లు ఎదురైతే స‌మాధానం ఇచ్చారు. ఆయ‌న కు ఎదురైనా ప్ర‌తి స‌వాల్ను స్వీక‌రించారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ప్రంప‌చాన్ని సృష్టించుకున్నారు. త‌నకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఏన్నార్ కు ఏన్నారే సాటి. తెలుగు  తెర‌కు స్టెప్పులు నేర్పిచిన    క‌థానాయుకుడు అక్కినేని . బ్రేక్ డాన్ప్ లు, షేక్ డాన్స్ లు రావ‌డానికి కార‌ణం అక్కినేని. హీరో ల‌నేవాడు స్టెప్పులేయాల‌ని చూపించిన  స్టైలిష్ హీరో ఏన్నార్. 85 ఏళ్లు సినీ పరిశ్ర‌మ గ‌మ‌నంలో ప్ర‌త్య‌క్ష సాక్షిగా నిలిచారు అక్కినేని. 75 ఏళ్ల పాటు సినీ క‌ళామ త‌ల్లి సేవ‌లోనే  త‌రించారు.  మూకీ చిత్రాలప్పుడే ఏయ‌న్నార్ సినీప్రయాణం మొదలైంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ తొలిత‌రం సూప‌ర్ స్టార్ అక్కినేని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ దాటిన ప్ర‌తీ మ‌లుపు ద‌గ్గ‌ర నుంచి చూసిన వ్య‌క్తి అక్కినేని. ఇలా సినిమాలో ఇన్ని కోణాల్ని ఇంత అభివృద్దిని చూసిన వ్యక్తి ప్రపంచంలో అక్కినేని తప్ప మరో నటుడు లేరు.     తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్ప‌మ‌ని ఎవ‌రైనా అడిగితే. అక్కినేని చ‌రిత్ర చెబితే చాలు.ఈ 80ఏళ్ల తెలుగు సినీ గ‌మ‌నంలో అక్కినేని పాత్ర ఎంతో కీల‌క‌మైంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ రావ‌డానికి ప్ర‌ధాన పాత్రధారి అక్కినేని. ఎంతో క‌ష్టప‌డి,ఎన్నో ఆటంకాల‌కొడ్డి అన్న‌పూర్ణ స్టూడియోను హైద‌రాబాద్ లో నిర్మించారు . ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డానికి కార‌కుడు అక్కినేని. ఆయ‌న‌ ఎప్పుడు కోపంగా క‌నిపించరు. త‌న  అస‌హ‌నాన్ని మ‌రొక‌రిపై ప్ర‌ద‌ర్శించరు. అస‌లు ఆయ‌న‌కు కోపమే రాదు. అక్కినేని రూపం ప్ర‌శాంత‌త‌కు చిరునామా. సంతోషానికి నిలువెత్తు రూపం అక్కినేని. జీవితాన్నంతా సంపూర్ణంగా అనుభ‌వించిన నిండైన మ‌నిషి అక్కినేని. ఎప్పుడూ మోముపై చెర‌గ‌ని చిరున‌వ్వు. ఇదే అక్కినేని ఆరోగ్యం ర‌హ‌స్యం.అంద‌రికీ చెప్పిన జీవిత సూత్రం. మ‌నిషికి సంతోషానికి మించిన మందు లేద‌ని నిరూపించిన మ‌హామ‌నిషి.       స‌వాల్ ను స్వీక‌రించ‌డం అంటే అక్కినేనికి మ‌హా ఇష్టం. అందుకే నీవిక న‌టించ‌లేవంటూ 40 ఏళ్ల క్రితం గుండె ఆప‌రేష‌న్ చేసిన డాక్ట‌ర్ చెప్పినా. ఆ స‌వాల్ ను స్వీక‌రించి అధిగ‌మించారు అక్కినేని. గుండె ఆప‌రేష‌న్ త‌ర్వాత ఇన్నేళ్ళు బ‌తికిన మ‌నిషి ప్రంపంచంలో అక్కినేని మాత్ర‌మే అంటే ఆయ‌న నిబ‌ద్ద‌త ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది. చావుకు ఏనాడూ భ‌య‌ప‌డ‌లేదు ఏయ‌న్నార్. కాన్స‌ర్ సోకింద‌ని ధైర్యంగా ప్రెస్ మీట్  చెప్పిన మ‌హామ‌నిషి ప్ర‌పంచంలో అక్కినేని మాత్ర‌మే. త‌న‌కేమీ కాద‌ని అభిమానులు కంగారు ప‌డొద్ద‌ని ధైర్యం చెప్పారు. మీ అభిమాన‌నే నా ఆయుష్షంటూ చావుకే స‌వాల్ విసిరిన ధైర్య‌శీలి అక్కినేని. చివ‌రకు ఆయ‌న జ‌న‌వ‌రి 22, 2014న క‌న్ను మూసారు.
  యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'Mr. మజ్ను' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అఖిల్‌ తాతగారు డా.అక్కినేని నాగేశ్వరరావు 'లైలా మజ్ను'గా, తండ్రి కింగ్‌ నాగార్జున 'మజ్ను'గా నటించారు. ఇప్పుడు అఖిల్‌ అక్కినేని 'Mr. మజ్ను'గా అందర్నీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నటసామ్రాట్‌ డా. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌లో యూత్‌ కింగ్‌ అఖిల్‌ అక్కినేని స్టైలిష్‌ లుక్‌తో ఎంట్రీ ఇవ్వగా, 'దేవదాసు మనవడో.. మన్మథుడికి వారసుడో, కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో..' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే టైటిల్‌ సాంగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. 'ఎక్స్‌క్యూజ్‌మి మిస్‌.. ఏమిటో ఇంగ్లీష్‌ భాష, దేన్నయితే మిస్‌ చేయకూడదో దాన్నే మిస్‌ అన్నారు' అంటూ అఖిల్‌ అక్కినేని చెప్పే డైలాగ్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. ఈ చిత్రంలో అఖిల్‌ అక్కినేని లుక్‌, స్టైల్‌, పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
  తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.. ఇప్పటికే ఎవరి ఊహలకు అందకుండా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేసీఆర్ కి అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది.. కేసీఆర్ ని ఓడించటం కోసం సీట్ల త్యాగాలకు కూడా ఈ పార్టీలు సిద్దపడ్డాయి.. మరోవైపు ఈ నాలుగు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.. కొత్త ప్రణాళికలు, కొత్త వ్యూహాలతో కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.. అలాంటి వ్యూహమే వారసులను తెరమీదకు తీసుకురావడం.. దానిలో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్ ను ఎన్నికల బరిలోకి దించాలని మహాకూటమి భావిస్తోందట.     నందమూరి కుటుంబానికి సినీ, రాజకీయ రంగాల్లో మంచి పేరుంది.. ఆ కుటుంబాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.. విభజన అనంతరం టీడీపీ ఏపీలో అయితే అధికారంలోకి వచ్చింది కానీ, తెలంగాణలో మాత్రం వెనకపడిపోయింది.. మహాకూటమితో తిరిగి ట్రాక్ లోకి రావాలని చూస్తున్న టీడీపీకి, నందమూరి వారసులు కూడా తోడైతే తెలంగాణలో పార్టీ పూర్వవైభవానికి పూలబాట పరిచినట్టవుతోంది.. అందుకే తెలంగాణ టీడీపీ కళ్యాణ్ రామ్ వైపు చూస్తోంది.. అదీగాక హరికృష్ణ ఈమధ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు.. కళ్యాణ్ రామ్ ని బరిలోకి దించితే ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ఉంటుందని తెలంగాణ టీడీపీ భావన.. ఇప్పటికే ఈ విషయంపై సీనియర్ నేతలు నందమూరి కుటుంబంతో చర్చించినట్టు తెలుస్తోంది.. మొదట కళ్యాణ్ రామ్ అంగీకరించనప్పటికీ, తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ భవిష్యత్తు కోసం రావాలని నేతలు పట్టుబట్టడంతో ఆయన కాస్త మెత్త బడినట్టు తెలుస్తోంది.. మరోవైపు మహాకూటమిలోని మిగతా పార్టీలు కూడా కళ్యాణ్ రామ్ రాకను స్వాగతిస్తున్నట్టు సమాచారం.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించాలని టీడీపీ నేతలు కోరగా, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పోటీ చేస్తే ఆ స్థానాలు వదులుకోవడానికి సిద్ధమని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో ఈ రెండు స్థానాల్లో ఏదొక స్థానం నుండి కళ్యాణ్ రామ్ పోటీ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కళ్యాణ్ రామ్ నిజంగానే తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగితే తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతారు? ఇలాంటి విషయాలు తెలియాంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.
కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల వేడి పెంచారు.. దీంతో విపక్షాలు కూడా పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి.. అయితే ఒక పార్టీ తీరు మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు.. అదే జనసేన పార్టీ.. ప్రశింస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపారు.. తరువాత వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఒంటరిగా అడుగులు మొదలు పెట్టారు.. ఏపీలో ఐతే పవన్ పర్యటనలు, ప్రభుత్వం మీద విమర్శలతో ప్రజల్లోకి వెళ్తూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు కానీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.     తెలంగాణలో అసలు ఇంతవరకు జనసేన బలపడే ప్రయత్నమే మొదలు పెట్టలేదు.. నాయకులు కూడా లేరు.. ఓ వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్ని పార్టీలు బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంటే.. జనసేన మాత్రం ఆ ఊసే లేదు.. ఇలానే ఉంటే ముందస్తు వస్తే తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ప్రశ్నార్ధకం అవుతుందనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇంతవరకు వరకు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టలేదు.. ముందస్తు వస్తే తక్కువ సమయంలో పార్టీ నిర్మాణం, బలోపేతం కష్టమవుతుంది.. కొందరైతే అసలు జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. అయితే కార్యకర్తలు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జనసేన అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుంది అంటున్నారు.     మరోవైపు జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే సీపీఎం పార్టీ జనసేనతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది.. మరో వైపు విపక్షాలు కూడా ఏ పార్టీ వచ్చినా కలుపుకొని పోవాలని చూస్తున్నాయి.. కానీ జనసేనాని మాత్రం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు.. ఓ వైపు ముందస్తు వేడితో మిగతా పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలు పెడితే జనసేన మాత్రం మౌనంగా ఉండిపోయింది.. దీన్నిబట్టే చూస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బరిలోకి కష్టమనే విశ్లేషకులు భావిస్తోన్నారు.. మరి జనసేన మౌనానికి అసలు కారణం ఏంటి?.. మౌనంగా ఉండి వ్యూహాలు రచిస్తోందా?.. ఒంటరిగా బరిలోకి దిగుతుందా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా?.. లేదా అసలు బరిలోకి దిగదా?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే జనసేన మౌనం వీడాలి లేదా ఎన్నికలు రావాలి.. చూద్దాం ఏం జరుగుతుందో.
ఓ వైపు ముందస్తుతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్.. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే హీట్ పెంచుతున్నారు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేసీఆరే హాట్ టాపిక్ అయ్యారు.. ఓ వైపు అసెంబ్లీ రద్దు, 105 మంది అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన కేసీఆర్.. ఏపీలోని పార్టీలకు కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం.. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళతానని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ మేరకు కేసీఆర్ ఏపీలో వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.     చాలాకాలం నుండి వైసీపీతో, తెరాసకు సత్సంబంధాలు ఉన్నాయి.. తెలంగాణలో వైసీపీ కాంట్రాక్టర్లు పనులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. దీంతో కేసీఆర్ ఏపీలో ఎన్నికల వార్తలకు బలం చేకూరుతుంది.. అయితే కొందరు మాత్రం 'చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. బాబుకి బ్రేకులు వేసేందుకే కేసీఆర్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తారన్న ప్రచారానికి తెరలేపినట్టు' భావిస్తోన్నారు.. ఈ ప్రచారంతో బాబుని భయపెట్టి, తెలంగాణలో ప్రచారానికి వెళ్లకుండా నిలువరించటమే అసలు లక్ష్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     మరికొందరు మాత్రం కేసీఆర్ ఏపీలో ప్రచారం వార్త నిజమే.. బీజేపీ ఆదేశాల ప్రకారమే కేసీఆర్, జగన్ సహకరించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.. టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ కేసీఆర్ అనే అస్త్రాన్ని సిద్ధం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అయితే ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.. తెరాస వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తోందట.. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలలో తెరాస కొంతమంది అభ్యర్థులను నిలిపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న కొందరు తమకు తెరాస టిక్కెట్లు కావాలని కోరుతున్నట్టు సమాచారం.. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. కేసీఆర్ నిజంగా ఏపీలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా?.. ఏపీలో తెరాస తరుపున కొందరు అభ్యర్థులు బరిలోకి దిగుతారా? ఇవి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
  గత కొంతకాలంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.. ఇంకేముంది ఏపీలోని ప్రతిపక్షాలు, అధికార పార్టీ టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది అంటూ విమర్శించాయి.. ఇంకా కొందరైతే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ తో పొత్తుకి సిద్దమవటం సిగ్గుచేటు అంటూ విమర్శించారు.. ఇక ఈ పొత్తు గురించి టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కొందరు కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.. ఇక యనమల, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కాంగ్రెస్ తో పొత్తు అంటే ఒంటికాలు లేచారు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టేసారు.. అయినా కాంగ్రెస్ - టీడీపీల పొత్తు గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా పొత్తు వార్తలను ఖండించారు.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.. దీంతో ఏపీలో కాంగ్రెస్- టీడీపీల పొత్తు వార్తకు తెరపడేలాగానే ఉంది.     అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఏపీలో అంటే టీడీపీ అధికారంలో ఉంది.. పార్టీ బలంగా ఉంది.. అసలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదు.. నిజం చెప్పాలంటే పొత్తు కంటే ఒంటరిగా బరిలోకి దిగితేనే ఎక్కువ లాభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉంది కానీ రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితి మారిపోయింది.. మెజారిటీ నాయకులు పార్టీని వీడి తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. కొన్ని చోట్ల కేడర్ అయితే ఉంది కానీ వాటిని ఓట్లుగా మలిచి గెలిపించే నాయకులు కావాలి.. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావాలంటే ముందు పార్టీ నిలదొక్కుకోవాలి.. దానికి బలమైన పార్టీ మద్దతు ఖచ్చితంగా కావాలి.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని, అందుకోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని చూస్తోంది.. ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆశపడుతోంది.. ఇది టీడీపీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.. తెలంగాణలో ఈ రెండు పార్టీ పొత్తుపెట్టుకుంటే.. అధికారం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ కి టీడీపీ బలం కూడా తోడైతే విజయావకాశాలు ఎక్కువుంటాయి.. అదే విధంగా టీడీపీ కూడా కాంగ్రెస్ మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకొని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి బాటలు వేసుకున్నట్టు అవుతోంది.. ఈ విధంగా తెలంగాణలో రెండు పార్టీలకు పొత్తు లాభించే అవకాశాలు ఉన్నాయి.. మొత్తానికి కాంగ్రెస్ - టీడీపీల పొత్తు 'ఏపీలో వద్దు.. తెలంగాణలో ముద్దు' అన్నట్టుగా ఉంది.. మరి ఈ పొత్తుపై అసలు ఈ రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
తెలంగాణలో ముందస్తు వేడి మొదలైంది కానీ ఏపీలో ఆ ఊసే లేదు.. అయినా ఏపీలో కూడా అప్పుడే ఎన్నికల సెగ మొదలైంది.. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే అభ్యర్థుల వేట మొదలైంది.. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రజల్లోకి వెళ్తూ మళ్ళీ అధికారం చేపట్టే దిశగా దూసుకువెళ్తుంది.. రోజంతా అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే చంద్రబాబు క్రమక్రమంగా రాజకీయ వేడి పెంచుతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో సమీక్షలకు సమయం పెంచుతూ వస్తున్నారు.. పార్టీ నేతలు, అధికార వర్గాలతో సమావేశమవుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నారు.. లోటుపాట్లు ఎక్కడున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే కోణంలో దృష్టి పెట్టారు.     క్రింది స్థాయిలో బూత్ కమిటీలు మొదలుకొని, పై స్థాయిలో తనవరకు అందరూ ప్రజల మధ్య ఉండేలా చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చన్న అంచనాతో పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెంచారు.. గతంలో అరగంట, గంటతో సరిపెట్టే రాజకీయ సమీక్షలను ఇప్పుడు రెండు మూడు గంటలు నిర్వహిస్తున్నారు.. అదే విధంగా వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామదర్శిని అమలు చేస్తున్నారు.. పార్టీపరంగా ఓ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.. సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారం చూపుతున్నారు.. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి రెండు రోజులు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.. నేతలు, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయటం వల్ల ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.     గ్రామదర్శినిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఒక్కోవారం రెండు నియోజకవర్గాలు ఎంపిక చేసుకొని అక్కడ ప్రజలను కలుస్తున్నారు.. ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామదర్శినిలో చురుకుగా పాల్గొనడంలేదని సమాచారం అందితే నేరుగా చంద్రబాబు లైన్ లోకి వస్తున్నారు.. వర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.. ఇప్పటికే 'దళిత తేజం', 'నారా హమారా- టీడీపీ హమారా' పేరిట రెండు సభలు ఏర్పాటు చేసారు.. త్వరలో గిరిజన గర్జన పేరుతో మరో సభ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.. తద్వారా ఆయా వర్గాల వారిని సమీకరించే కృషిలో పార్టీ నేతలు భాగస్వాములవుతారని, ఈ కార్యక్రమాలు, పథకాలు టీడీపీ అమలుచేస్తుందన్న ముద్ర వస్తుందని భావిస్తున్నారు.. అలాగే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపటానికి ప్రతిజిల్లాలో ధర్మ పోరాట సభలు నిర్వహిస్తున్నారు.     అదేవిధంగా కింది స్థాయిలో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయటానికి ప్రభుత్వం కొత్తగా సాధికార మిత్ర వ్యవస్థను రూపొందించింది.. అలాగే బూత్ స్థాయిలో టీడీపీ కార్యకర్తలను కూడా ఎన్నికల మూడ్ లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.. పార్టీ బూత్ లో కన్వీనర్లను నియమించి శిక్షణ ఇస్తున్నారు.. మొత్తానికి చంద్రబాబు పూర్తిస్థాయిలో ఎన్నికల వ్యూహ రచనలోకి వచ్చేసారు.. ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు చూస్తూనే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.. మళ్ళీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
  నందమూరి కుటుంబానికి అభిమానగణం ఎక్కువ.. అభిమానులు ఆ కుటుంబం మీద ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటారు.. నందమూరి హీరోలు కూడా అభిమానుల మీద అంతే ప్రేమ చూపిస్తూ, అభిమానుల బాగు కోరుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపై పదే పదే ఓ విషయం గుర్తు చేసేవారు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటి దగ్గర మీ కోసం మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అభిమానులను సున్నితంగా హెచ్చరించేవారు.. అయితే 2014 లో నందమూరి కుటుంబంలోనే ఓ విషాదం జరిగింది.     హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ సంఘటనతో హరికృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.. అన్న మృతితో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా కృంగిపోయారు.. ఇలాంటి బాధ అభిమానులకు రాకూడదని, ఈసారి అభిమానులను ఇంకాస్త గట్టిగా హెచ్చరించారు.. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటున్నాం అంటూ ఆయన సినిమా మొదలయ్యేటప్పుడు చూపించేవారు.. అదే విధంగా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వేగంగా వెళ్ళకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ వేదికపై కూడా పదే పదే గుర్తుచేసేవాడు జూనియర్ ఎన్టీఆర్.. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన తండ్రి ప్రాణాలు కోల్పోతాడని ఎప్పుడూ ఊహించి ఉండడు.     హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదానికి అతి వేగం మరియు జాగ్రత్తలు పాటించకపోవటమే కారణంగా తెలుస్తోంది.. హరికృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, అతి వేగంగా వెళ్తూ.. వెనకనున్న వాటర్ బాటిల్ తీసుకోబోతుండగా క్షణాల్లో అంతా తారుమారైపోయింది.. ఆయన కుటుంబంతో పాటు, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది.. ఆయన కుటుంబంలో జరిగిన విషాదం వేరే కుటుంబంలో జరగకూడదని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి అందరికీ గుర్తుచేశారు.. కానీ అదే కుటుంబంలో మరో విషాదం జరిగింది.. అందరూ బాగుండాలని కోరుకున్న కుటుంబానికి ఇలాంటి కష్టం రావటం చాలా బాధాకరం.. కానీ హరికృష్ణ మరణం మనకొక పాఠం నేర్పుతుంది.. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి.. మీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పొతే అది మీ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు.. ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించండి.. ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉండి మీ జీవిత ప్రయాణానికి అర్దాంతరంగా ముగింపు పలకకండి.
  ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు వినండి..  https://www.youtube.com/watch?v=d9D5pVYSowk&t=2s  
No kitchen is complete without that ‘dabba’ which has those lip smacking spices!   Apart from using them while cooking, did you know that they make fabulous beauty & health ingredients? No – then here are a few spices that help in enhancing beauty and staying healthy.   Turmeric : Turmeric is packed with antiseptic properties & thus when applied on skin gives positive impact. Besides this, turmeric is a great anti-oxidant and consuming turmeric with milk daily improves immunity.   Cumin Seeds : Cumin or Jeera not only adds tastes to food but research relieves that consuming jeera everyday promotes weight loss. In addition it improves digestion.   Cinnamon : Loaded with anti-oxicidents, regular consumption of cinnamon increases good cholesterol like HOL and also increases blood circulation in the body. Amazingly, it also has certain properties which fight cancer.   Black Pepper : Proudly known as king of all spices, Black pepper helps fight depression. From beauty perspective Black Pepper is very beneficial for preventing grey hair and is great for skin exfoliation.   Coriander Seeds : Coriander Seeds are full of antibacterial and antioxidant properties that help in reducing redness in eyes.   We tend to spend more, to maintain a healthy lifestyle – whereas all the health and beauty secrets are right in the kitchen. So next time, when you have any health or beauty related problem – peep into the kitchen!  - Teluguone Team
We all know, Love Is Blind. But do you know, touch can make a person with pain feel better? Confused? Research says that, when your loved ones are with you and support you during acute pains, pain reduces and in certain cases pain completely gets cured. https://www.youtube.com/watch?v=lRjVrNLhsCE  
Watch If you have diabetes and high blood pressure it’s important that you add foods to your diet that will help you control both disorders, and avoid anything that could be harmful Many people suffer from these two diseases and might think it’s too hard to follow a diet that excludes salt and sugar....   https://www.youtube.com/watch?time_continue=23&v=B-MMpbWSO2k  
  యాంటిబయాటిక్స్‌ని కనుక్కోవడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అవే లేని రోజుల్లో చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారేది. కానీ అవే యాంటిబయాటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి వాడకం వల్ల శరీరంలో నానా రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడం మాట అటుంచితే… అవసరమైనప్పుడు అసలు ఏ మందూ పనిచేయని పరిస్థితి వస్తుంది. దీనినే antibiotic resistance అని పిలుస్తున్నారు.   యాంటిబయాటిక్స్‌ గురించి ఇప్పుడు ఈ కథంతా మళ్లీ చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. వైద్యులు ఈ యాంటిబయాటిక్స్‌ని రోగులకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు లండన్‌ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 1,85,014 మందిని పరిశీలించారు. వీరంతా కూడా 65 ఏళ్లు పైబడినవారే. అంటే వైద్యులు వీరికి చికిత్సని అందించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. దురదృష్టవశాత్తూ వీరంతా వైద్యుల దగ్గరకి చిన్నచిన్న అనారోగ్యాలతో వెళ్లినప్పుడు కూడా, వీరికి అనవరసంగా యాంటిబయాటిక్స్‌ను అందించారట. ఇలా సగానికి సగం కేసులలో యాంటిబయాటిక్స్‌ తీసుకోవాలంటూ వైద్యులు తొందరపడినట్లు తేలింది. ఈ యాంటిబయాటిక్స్‌ కూడా మామూలువి కాదు… అలెర్జీలు, విరేచనాలు, గుండెజబ్బులు, కండరాల సమస్యలు వంటి నానారకాల దుష్ప్రభావాలు చూపించేవి. ఇలా ఉత్తిపుణ్యానికే శక్తివంతమైన యాంటిబయాటిక్స్‌ తీసుకోమంటూ వైద్యులు సలహా ఇస్తున్నట్లు తేలింది.   కాస్త విశ్రాంతి, మరికాస్త ఉపశమనంతో తగ్గిపోయే జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి సమస్యలకు కూడా యాంటిబయాటిక్స్‌ను సూచించడం చూసి పరిశోధకుల తల తిరిగిపోయింది. ఇంతాచేసి ఈ వైద్యులంతా మహామహా సీనియర్లు! యాంటిబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడకూడదన్న అవగాహన ఉన్నవారు. చిన్నపాటి సమస్యలకు ఆ మందులు అస్సలు అవసరమే లేదని తెలిసినవారు. ఆరోగ్యం మీద అవగాహన ఉండే లండన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో కదా! అందుకనే యాంటిబయాటిక్స్‌ వాడకాన్ని అదుపు చేసేలా… అటు ప్రభుత్వమూ, ఇటు వైద్య సంస్థలూ కఠినమైన నిబంధనలను విధించాలని కోరుకుంటున్నారు పరిశోధకులు.   -నిర్జర.
ఇటీవలి కాలంలో డయాబెటిస్ అనేది కామన్‌గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాఢపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే చాలు.. లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. అందుకే డయాబెటిస్ అంటే చాలు జనం హడలిపోతారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, స్థూలకాయం, స్మోకింగ్ తదితర కారణాలు షుగర్ రావడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత అది తినకూడదు. ఇది తినకూడదు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చట. అలాంటి ఫుడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.