LATEST NEWS
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
Director Radhakrishna Jagarlamudi aka Krish is presently busy helming a historical film “Manikarnika” with Bollywood actress Kangana Ranaut playing the title role. The film which is based on the life of Rani Laxmibai of Jhansi is fast progressing with its shoot. Even before wrapping up his ongoing project, Krish has begun pre-production works for his next directorial. Saibabu Jagarlamudi and Rajeev Reddy will jointly produce the high budget movie. The production unit has registered a classy and traditional title “Aham Brahmasmi” for the film. Director Krish is in talks to rope in a star hero to play lead role in the film.  Aham Brahmasmi is going to be a commercial movie with high technical values. Other cast and crew details will be announced soon after hero is locked for the film. Launching ceremony of Aham Brahmasmi will take place in August. Speculations were rife that, Varun Tej’s next movie with Ghazi director Sankalp Reddy was titled ‘Aham Brahmasmi. Now, this news is turned out to be a rumor.
Power Star Pawan Kalyan announced to quit films after the release of his last outing Agnyaathavaasi. Before that, he gave nod to do 2 to 3 films. One amongst them is with director Santosh Srinivas of Kandireega fame. It is heard that, when Santosh Srinivas almost lost hopes on Pawan Kalyan’s film, he is said to have got call from none other than the power star recently. As per reports, Pawan asked to make changes to the script. In fact, this is not the first time, Pawan asked alterations.  Now, Santosh is said to be in immense pressure with PK’s call. It is also heard that, if script works will be completed in few weeks, Pawan is willing to launch it in summer and wrap it up at brisk pace. It may be mentioned here that, Pawan Kalyan made director Sampath Nandi to wait for almost two years and he replaced the director with Bobby to make Gabbar Singh 2. This might be the reason that is bringing pressure to Santosh Srinivas who already spent few months on the script for PK’s film.
హీరోల మధ్య పోటీలు ఉండొచ్చు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రిలీజుల విషయంలో మాత్రం పోటీ పనికిరాదు. ఇప్పుడు సినిమారంగంలో వ్యాపార ధోరణి పెరిగిపోయింది. శుక్ర, శని, ఆదివారాల్లోనే డబ్బులు వెనక్కి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే.. సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లలో ివిడుదల చేసి త్వరత్వరగా డబ్బులు లాగేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పోటీలకు దిగి ఒకేసారి ఒకేరోజున సినిమాలను విడుదల చేస్తే.. సినిమాలు బాగున్నా... నష్టాలు మాత్రం తప్పవ్.  ఎన్ని సినిమాలు విడుదలైనా భరించే శక్తి ఒక్క సంక్రాంతికి మాత్రమే ఉంటుంది. మిగిలిన సమయాల్లో కాస్త చూసి ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం. అయితే... మన హీరోలు మాత్రం పంతాలకు దిగి.. నిర్మాతల కష్టాలు తెచ్చిపెడుతున్నారు.  రీసెంట్ గా తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాల విషయంలో అదే జరిగింది.ఒకే ఫ్యామిలీ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల చేయడంతో... బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ‘ఇంటిలిజెంట్’ సినిమాకు ఓపెనింగులు కూడా కరువైపోయాయ్. నిర్మాతలకు తీరని నష్టాలు తెచ్చిపెట్టిందా సినిమా. రాబోతున్న ఏప్రిల్ నెలలో కూడా మన హీరోలు ఇలాంటి తప్పే చేస్తున్నారు. ఏప్రిల్ 27న ఒకే రోజున మూడు పెద్ద సినిమాలు విడుదల చేసే సాహసానికి తెగబడ్డారు. రజనీకాంత్ ‘కాలా’, మహేశ్ బాబు ‘భరత్ అను నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలు ఒకే రోజున తలపడనున్నాయంటూ వార్తలొస్తున్నాయ్. ఇదే గనుక జరిగితే.. నిర్మాతలకు భారీగా నష్టాలు ఖాయం.  ఒక వేళ సినిమాలకు మంచి టాక్ వచ్చినా రావాల్సిన వసూళ్లు మాత్రం రావ్. దీని మూలంగా నష్టపోయేది బయ్యేర్లే. అసలు ఆ రోజు కోసమే ఎందుకు ఆరాటం? అదేమన్నా సంక్రాంతా? ఎలాంటి ప్రత్యేకతా లేని ఆ రోజున ఒకేసారి మూడు సినిమాలూ విడుదల చేయాలనే ఆలోచన ఎందుకు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రజనీకాంత్, మహేశ్, బన్నీ... ముగ్గురూ సాధారణమైన స్టార్లు కాదు.  వీరి సినిమాలంటే థియేటర్ల సంఖ్య భారీగా ఉంటుంది. మరి ఇన్ని థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? సరైన థియేటర్లు దొరక్క బలైపోయే సినిమా ఏంటి? ఏది ఏమైనా... బయ్యర్ల క్షేమం మాత్రం చూడాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు ధ్రువాల్లాంటి నందమూరి-కొణిదెల నట వారసులు మల్టీస్టారర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. టాలీవుడ్‌లో మళ్లీ మల్టీస్టారర్‌కు ఊపొచ్చింది. వీరిని చూసి చాలా కాంభినేషన్లు తెర మీదకు వచ్చాయి. వాటిలో మహేశ్-బాలకృష్ణ, పవన్-చిరు, వెంకటేశ్ -వరుణ్ తేజ్ ఉన్నాయి. ఇప్పుడు లేటేస్ట్‌గా మహేశ్-చరణ్ మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఎవరో చెబితే దీనిని పట్టించుకునే వారు కాదు.. కానీ స్వయంగా రామ్‌చరణే ఈ న్యూస్ చెప్పాడు. రంగస్థలం ప్రమోషన్‌లో భాగంగా తన ఫేస్‌బుక్ నుంచి అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేశాడు చెర్రీ. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు.. మహేశ్‌తో మల్టీస్టారర్ చేస్తారా అని ప్రశ్నించగా.. దీనికి స్పందించిన చరణ్.. ఇండస్ట్రీలో నాకున్న మంచి స్నేహితుల్లో మహేశ్‌బాబు ఒకరు.. ఆయనతో రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటా.. ఇద్దరం పార్టీల్లో కలుస్తూనే ఉంటామని చెప్పారు. మంచి కథతో ఎవరైనా వస్తే.. సూపర్‌స్టార్‌తో మల్టీస్టారర్‌ చేయడానికి ఎప్పుడూ రెడీనే అన్నాడు చెర్రీ. తమ సినిమా సెట్ మీద నుంచి థియేటర్లలోకి వచ్చేటప్పుడు.. వేరే హీరో ఫ్యాన్స్‌ని ప్రసన్నం చేసుకోవడానికి.. పాత విషయాలను.. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని బయటకి చెప్పడం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఇప్పుడు చెర్రీ కూడా ఇదే దారిలో నడిచాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ఒకవేళ చరణ్-మహేశ్‌ తెరను పంచుకుంటే అభిమానులకే పండగే.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ దర్శకత్వంలో మొదలైన రంగస్థలం అసలు షెడ్యూల్ ప్రకారం దీపావళికి రావాలి.. సమ్మర్‌లో వడగాల్పులు, యూనిట్‌లో కొందరికి ఆరోగ్యం బాగోకపోవడం.. దీనికి తోడు తండ్రి సినిమా నిర్మాణ పనుల్లో చరణ్ బిజీగా ఉండటంతో.. షూటింగ్ లేటయ్యింది. చివరకు నవంబర్‌ నుంచి డిసెంబర్‌కు చివరకి చివరకు మార్చి 30కి రంగస్థలం డేట్ ఫిక్సయ్యింది. రెండు టీజర్లు, ఒక పాటతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటేస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం రంగస్థలానికి కొన్ని రీషూట్లు చేయాలనుకుంటున్నాడట సుకుమార్. చరణ్ సినిమాకు కర్త, కర్మగా వ్యవహరించే మెగాస్టార్ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూసిన మెగాస్టార్ కూడా.. కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేయాలని చెప్పడంతో.. మళ్లీ చిత్ర యూనిట్ షూటింగ్‌కు రెడీ అయ్యిందట. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో నాలుగు రోజుల పాటు రంగస్థలానికి మెరుగులు దిద్దబోతున్నాడట సుక్కు. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి రిలీజ్ డేట్ మళ్లీ మార్చరు కదా.? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే.. క్రమశిక్షణకు, కఠిన నియమాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ. కానీ ఇటీవలికాలంలో ఆ పార్టీ నేతలు కట్టుతప్పుతూ జనంలో బీజేపీని చులకన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా, విభజన సమస్యలు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ వాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోక పోగా.. ఏపీ కోసం మాట్లాడుతూ.. తమను ప్రశ్నిస్తున్న వారిని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.   తాజాగా ప్రత్యేకహోదా అంశంపై ఓ టీవీ ఛానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న.. సినీనటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.. ప్రజలు ఇంకా సహనంతో బీజేపీ నేతలను మాట్లాడనిస్తున్నారని.. ఇంకా ఎక్కువ మాట్లడితే తరిమి, తరిమి కొడతారని శివాజీ అనడం .. అక్కడే ఉన్న కాషాయ దళానికి చిర్రెత్తుకొచ్చి ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై కూడా దాడికి దిగబోతే పక్కనున్న ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. అసలు బీజేపీకి ఏమైంది.. ఎందుకు ఇంతలా అసహనాన్ని ప్రదర్శిస్తున్నారంటే.. ఒకప్పటి బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలే.. నేతలుగా ఎదిగారు.   కఠినమైన నియమాలతో.. గట్టుదాటితే తీవ్రమైన చర్యలు తీసుకునే ఆర్ఎస్ఎస్‌ శిక్షణతో.. బీజేపీలోకి అడుగుపెట్టిన వారు ఇప్పటికీ అదే దారిలో వెళ్తున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వలసనేతలకు బీజేపీ నియమాలు తెలియవు కాబట్టి.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెప్పాలో తెలియక.. అక్రోశంతో భౌతిక దాడులకు దిగుతున్నారు. దాని వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందే తప్ప.. పరిష్కారం కాదన్నది వారు గుర్తించాలి. శివాజీపై జరిగిన దాడి ఏ పవన్ కళ్యాణ్ మీదనో.. మరే ఛరిష్మా ఉన్న నేత మీదో జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికైనా అగ్రనాయకత్వం చర్యలకు దిగి.. కట్టుదాటుతున్న నేతలను క్రమశిక్షణలో పెట్టాలని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి.
జాతీయ పార్టీల హవా ఉత్తరాదిలో నడిచినట్లు దక్షిణాదిలో నడవదు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీల ముందు వాటి ఆటలు సాగవు. ఎంతపెద్ద కొమ్ములు తిరిగిన నేషనల్ పార్టీలైనా సరే... రీజనల్ లీడర్ల సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరన్నది ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ హైకమాండ్ చేసిన పొరపాట్లతో చేతులారా తన ఘోరీని అదే కట్టుకుంది. ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప జనం గుర్తించలేని పరిస్థితికి కాంగ్రెస్ చేరుకుంది. సరే.. అదిప్పుడు గడిచిన కథ.. వర్తమానంలోకి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో స్ట్రాంగ్‌గా ఎదగాలని కంకణం కట్టుకుంది.   కర్ణాటకలో అల్రెడీ ఒకసారి పవర్ రుచి చూసింది కాబట్టి.. అక్కడ అంతో ఇంతో బెటర్‌గానే ఉంది.. ఇక జయ మరణంతో తమిళ రాజకీయాల్లో వేలుపెట్టిన కమలం.. రజనీ సపోర్ట్‌తో కానీ.. అన్నాడీఎంకే అండతో కానీ నాలుగు సీట్లు వెనకెసుకునే ప్రయత్నాల్లో ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ ఎత్తుల ముందు కాషాయం నిలబడలేదు. ఎటోచ్చి ఆంధ్రప్రదేశ్‌లోనే పరువు కాపాడుకోవాలి.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి రెండు ఎంపీ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.   అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని వదిలించుకునేందుకే బీజేపీ పెద్దలు రాజకీయాన్ని.. నడిపారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మిత్రధర్మాన్ని పాటించకుండా... ఎక్కడ దొరికితే అక్కడ తెలుగుదేశాన్ని కార్నర్ చేసింది బీజేపీ. ముఖ్యంగా సోము వీర్రాజు వంటి నేతలైతే ఢిల్లీ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఓపికగా భరించిన టీడీపీకి తాజా బడ్జెట్‌తో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీనిలో భాగంగా తమ డిమాండ్లకు ఒప్పుకుంటే సరే.. లేదంటే ఎవరి దారులు వారు వెతుక్కోవడమే అన్న సంకేతాలు ఇచ్చారు టీడీపీ అధినేత.   తెలుగుదేశం పక్కకు తప్పుకున్నా.. జగన్ అండతో గట్టెక్కాలని కమలనాథులు భావిస్తున్నప్పటికీ.. అదంత తేలిక కాదు.. వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏ మాట మీద నిలబడతాడో ఆయనకే కాదు.. పార్టీ శ్రేణులకే అర్ధం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బీజేపీకి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అన్న చందాన తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదులుకుంటే.. కాంగ్రెస్, వామపక్షాల లాగా ఎవరో ఒకరు రాకపోతారా..? అన్నట్లు ఎదురుచూసే తోక పార్టీల లాగా బీజేపీ మారిపోతుందని విశ్లేషకుల అంచనా.
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి.. జనాన్ని ఆకర్షించడానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం తన ఎంపీల చేత పార్లమెంట్‌లో ఆందోళన చేయించిన జగన్.. ప్రత్యేకహోదా నినాదంతో సెంటిమెంట్‌ను రగిల్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అధినేత. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ప్రత్యేకహోదాని చేర్చేశారు కూడా. ఈలోపు జనాన్ని అటెన్షన్ చేయడానికి తన కార్యచరణను ప్రకటించారు. మార్చి 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్‌‌ల ముట్టడి.. 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పటికి కేంద్రం దిగి రాకపోతే.. ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.   ఈ వేడి ఇంకా చల్లారకముందే నిన్న మరో బాంబు పేల్చారు ప్రతిపక్షనేత.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని.. అందుకు టీడీపీ సహకరిస్తుందా..? టీడీపీ ఆ పనిచేస్తే.. తాము మద్దతు ఇస్తామంటూ సవాల్ విసిరారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉంచుకోవాలా..? తెంచుకోవాలా..? అన్న దానిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీతో పాటు జగన్‌ని కూడా ఏకకాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో చూసి.. తలపండిపోయిన టీడీపీ అధినేతకు ఇదేమంత కష్టమైన పని కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   ఇందుకోసం మొదటగా మార్చి 5వ తేదీనే తన గేమ్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారట ఏపీ ముఖ్యమంత్రి. మార్చి 5వ తేదీ నుంచి చివరి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రానిపక్షంలో.. ఆ రోజే బీజేపీకి తొలి షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. మార్చి 5న టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే.. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి వైసీపీ కంటే ముందుగానే కేంద్రాన్ని ఒత్తిడిలో పడేసేందుకు చంద్రబాబు తెరవెనుక పావులు కదుపుతున్నారట.
ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని.. అవినీతిని ఎండగడతానని పార్టీ పెట్టిన సినీనటుడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఎన్నికలకు రెడీ అవ్వకపోవడం.. అభిమానులు తప్ప కార్యకర్తలు లేకపోవడంతో.. టీడీపీ-బీజేపీ తరపున ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి.. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో.. షూటింగ్‌లకు పెకప్ చెప్పేసి.. రాజకీయ రణరంగంలోకి దిగాడు. బస్సు యాత్రలు.. ఆ యాత్రలు చేస్తూ.. పొలిటికల్ లీడర్‌గా మారే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మేధావి వర్గం గానీ.. ప్రజలు కానీ కల్యాణ్ బాబుని.. పొలిటికల్ బాబుగా గుర్తించడానికి ఒప్పుకోవడం లేదు.   పార్టీని నిర్మించుకోవాల్సిన టైంలో సినిమాలు తీస్తూ.. జనసేనని గాలికొదిలేయడంతో పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అటకెక్కింది అనుకున్న ప్రత్యేకహోదా మళ్లీ తెరపైకి రావడంతో పవన్‌కి బాగా కలిసొచ్చింది. విభజన హామీల అమలులో ఎవరి తప్పు ఎంతుందో అందరి లెక్కలు తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ రాజకీయాలను వదిలేసిన వారిని, ఎవరికీ పట్టకుండా పోయిన మేథావుల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ఒక చోటు కూర్చొబెట్టాడు జనసేనాని.. నిజంగా ఇది మంచి ప్రయత్నమేనని.. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయవాదిగా మారుతున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఆ పొగడ్తలతో పాటు మరో రకం పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.   రాజకీయంగా ఎలాంటి నాలెడ్జ్ లేని పవన్ కళ్యాణ్.. జనసేనకు ఒక రూపం ఇవ్వలేక విమర్శలపాలవుతున్న పవన్ కళ్యాణ్‌.. జేఎఫ్‌సీలోని మేధావుల సాన్నిహిత్యంలో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జేపీ, ఉండవల్లి, ఎంవీఆర్ శాస్త్రి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇలా ఎవరిని కదిలించినా ఉద్ధండపిండాలే. ఇలాంటి వారి సలహాలు, సూచనలతో కల్యాణ్ రాజకీయంగా రాటుదేలే అవకాశం ఉందని.. దానిని ఆయన ఉపయోగించుకుంటే మంచిదేనంటున్నారు విశ్లేషకులు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. విజయవాడలో చంద్రబాబును కలిసి వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ.. రాజీనామా సమర్పించినట్టు ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు కూడా.. అంతకు పార్టీలు మారినవారంతా తమ తమ పదవులకు రిజైన్ చేయలేదు.. కానీ రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారని అందరూ ఆయనను అభినందించారు. కానీ.. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ కూడా రాజీనామా విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన తన రిజైన్‌ లెటర్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు కానీ.. స్పీకర్‌కు పంపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.   మరి ఇంత జరిగినా ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ముఖ్యం. రేవంత్ అనర్హత గురించి తెలుగుదేశం ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక కేసీఆర్‌ది ఇదే రకమైన పరిస్దితి.. తన అధికారం చెక్కుచెదరకుండా ఉండేందుకు.. ఎవ్వరూ తనకు పోటీకాకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను నామ రూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్. ఆ వ్యూహాంలో చాలా వరకు విజయం సాధించారు. అలా టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వారందరి చేత రాజీనామాలు చేయించలేదు. ఒకవేళ రాజీనామాలు చేయిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు 20 నుంచి 30 ఉపఎన్నికలు ఖాయం. ఈ తలనొప్పంతా ఎందుకని.. రేవంత్‌ విషయంలో ఎక్కడి వారక్కడే గప్‌చుప్ అంటోంది.   ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ కాంగ్రెస్. కొడంగల్‌లో హస్తం పార్టీ ఉపఎన్నికలకు వెళ్లిందే అనుకున్నాం.. కానీ అక్కడ కేసీఆర్ వదులుతాడా..? సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించైనా సరే.. రేవంత్‌ను అడ్డుకుంటాడు.. కాంగ్రెస్ గెలిస్తే మంచిదే. ఒకవేళ అటు ఇటైతే మాత్రం ఎన్నికల వేళ శ్రేణుల మానసిక స్థైర్యం దెబ్బతిన్నట్లే. ఉపఎన్నికల్లోనూ.. ఇటీవల ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. ఇంకేదైనా బైపోల్ వచ్చినా.. ఇదే రిజల్ట్ ఖాయమని సర్వేలు చెబుతున్న తరుణంలో.. కాంగ్రెస్ హైకమాండ్ సాహసం చేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. సో.. రేవంత్‌ను కదిపేవారు కానీ.. ఇదేంటని అడిగేవారు కానీ లేరని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
’పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయడు...‘ కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసే మాట.  ’కమలహాసన్ ఇక నటించడు...‘ యావత్ భారతావనే బాధతో నిట్టూర్చే మాట.  ’సూపర్ స్టార్ రజనీకాంత్... ఇక తెరపై కనిపించడు...‘ దేశవ్యాప్త తలైవా ఫ్యాన్సును విషాదంలో ముంచెత్తే మాట.  నిజానికి రాజకీయాల్లోకెళ్తే.. చేసే పనిని వదిలిపెట్టాలా? అలా అయితే... ఎన్టీయార్ ‘నా దేశం’ సినిమా చేసేవారు కాదే. అలా అయితే... ఎన్టీయార్ నుంచి ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర’ సినిమా వచ్చేది కాదే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదనేం రూల్ లేదు. అలాంటి రూలే ఉంటే... ముఖ్యమంత్రిగా ఉంటూనే  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ఎందుకు చేస్తాడు ఎన్టీయార్? ఓ వైపు ప్రతి పక్షనేతగా ఉంటూ.. మరో వైపు ఏకంగా సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాధ కవిసార్వభౌమ చిత్రాల్లో ఎందుకు నటిస్తారు?    ఎన్టీయార్ రాజకీయాల్లో ప్రవేశించిన కొత్తలో.. ప్రచారంలో ఉండగా చేసిన సినిమా ‘నాదేశం’. అప్పటి రాష్ట్ర పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ చేసిన సినిమా అది. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు ఆ సినిమా ఉపయోగపడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పవర్ స్టార్ చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘అజ్ఙాతవాసి’... ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసింది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తెరపై కనిపించబోయే సినిమాలు... రోబో2, కాలా.. ఇవి సమకాలీన సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు కావు. మామూలు కమర్షియల్ సినిమాలు. కమల్ విశ్వరూపం 2, భారతీయుడు 2 సినిమాలు చేస్తానంటున్నాడు     అసలు ఈ సూపర్ స్టార్లు ముగ్గురూ ఎన్టీయార్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? సామాజికాంశాలు మేళవించిన కథలను ఎంచుకొని... జనాల్లో చైతన్య దీపికలను వెలిగిస్తూ... ఓ వైపు నటులుగా.. మరో వైపు నాయకులుగా ఎందుకు ముందుకెళ్ల కూడదు? చేతిలో ఉన్న బలమైన ఆయుధమైన సినిమాను ఉపయోగించుకోవడం చాతకాని వీరు.. రేపు రాజకీయాలేం చేస్తారని చాలామంది అనుకుంటున్నారు.    సూపర్ స్టార్, వపర్ స్టార్ల రాజకీయ జీవితాలకు ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించే దర్శకులు కానీ.. రచయితలు కానీ ఇప్పుడు లేరా? అనే అనుమానాలను కూడా జనాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయార్ ‘నా దేశం’ స్థాయి సినిమాను తీసే దర్శక, రచయితలు నేడుంటే... దేశ రాజకీయ చిత్రాన్ని.. వెండితెర సాక్షిగా ఎండగట్టే సినిమాలు వీరిద్దరి నుంచి వస్తే... దేశ రాజకీయాల్లో వేడి మొదలవ్వడం ఖాయం. జనాల్లో కొత్త కదలక రావడం ఖాయం. దక్షిణాది సినిమాల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ మొదలవ్వడం ఖాయం.  ఏమంటారు ఫ్రెండ్స్. 
           
  మీకు ఏ ఐస్ క్రీం అంటే ఇష్టం అని అడిగితే ఠక్కున ఎదో ఒక ఫ్లేవర్ చెబుతాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనుక ఒక మనస్తత్వం దాగి ఉంది అంటే నమ్మగలరా. అయితే, కొన్ని రుచుల్ని మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే లింబిక్ లోబ్ అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=3gjAu3IVsr0  
  పిల్లల సమగ్రాభివృద్ధి- అంటే పది మందిలో చక్కగా మాట్లాడగలగాలి... బాగా చదువుకోవాలి... చలాకీగా ఉండాలి... అన్ని విషయాల్లో అవసరమయినంత పరిజ్ఞానం కావాలి. అయితే, పిల్లల్లో సమగ్రాభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగర్తలు వహించాల్సి ఉంటుంది అంటున్నారు డాక్టర్ చిట్టి విష్ణు ప్రియా గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=0ffOytXW6mw&t=125s  
బరువు తగ్గాలంటే ఈ మధ్య కాలంలో ఇండియన్స్ నాన్ వెజిటేరియన్, టీ, కాఫీ, స్వీట్స్ లాంటివి మానేయడం చేస్తున్నారు. మరి, కేవలం ఇవి తినడం తగ్గించడమో, మానేయడమో చేస్తే బరువు తగ్గుతారా అంటే కాదు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మరి బరువు తగ్గాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=TfY-zjWdfXc&t=13s  
70 - 80 సంవత్సరాలు పైబడిన వారు ఎలాంటి ఆహరం తీసుకోవడం మంచిది? వాస్తవానికి ఆ వయసుకి వచ్చిన వారికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది ఉంటది. వాళ్ళ ఫిజికల్ ఆక్టివిటీ కూడా తగ్గుతూ వస్తుంది. ఇవి కాకుండా వారికి ఆర్టిఫీషియల్ పల్లు ఉండడం మరియు ఇతర ఇబ్బందులు కూడా ఉండవచ్చు. అయితే, వృద్దులు ఎలాంటి డైట్ తీసుకోవాలో ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు సలహాలు ఇస్తున్నారు. ఈ వీడియో లో చూడండి...   https://www.youtube.com/watch?v=QSUZnzL0kD8  
ఈ మధ్య కాలంలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య పొట్టదగ్గర కొవ్వు పెరగడం. జనరల్ గా చెప్పాలి అంటే, మనకు పొట్ట ఎక్కువ ఉంది అంటే, మన శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంది అని అర్ధం. మరి సరయిన డైట్ తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు తగ్గించొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...  http:// https://www.youtube.com/watch?v=NIvG84ZDoHY