LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల శివ ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే స్క్రిప్టు వ‌ర్క్ కూడా పూర్తి చేశాడు కొర‌టాల‌. సైరా సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఇదిలా ఉంటే  రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల కొర‌టాల‌తో ఒక డీల్ కుదుర్చుకున్నాడ‌ట‌. ఈ వార్త సోష‌ల్ మీడియాలో  ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆ విషయానికొస్తే... రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా జ‌న‌వ‌రిలో సంక్రాతి కానుక‌గా విడుద‌ల కానుంది. దీని త‌ర్వాత రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ‌తో సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట చ‌ర‌ణ్‌. ఈ లోపు చిరు, కొర‌టాల సినిమా అయిపోతుంది..కాబ‌ట్టి వెంట‌నే త‌న సినిమా ప్రారంభించాల‌ని ఇటీవ‌ల కొర‌టాల‌తో చెప్పాడ‌ట‌. దీనికి కొర‌టాల కూడా ఒప్పుకున్నార‌ట‌. ఆ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చి కొర‌టాల‌కు షాకిచ్చాడ‌ట చెర్రి.  మెగాప‌వ‌ర్ స్టార్ ప్లాన్ సూప‌ర్బ్ గా అంటున్నారు సినీ వ‌ర్గాలు.
  Actors: Ravi Teja, Ileyana, Vennela Kishore, Sunil, Satya, Srinivas Reddy, Raghubabu, Jayaprakash Reddy, Shayaji Shinde, Abhimanyu Singh and others Camera: Venkat C Dileep Story: Vamsi Rajesh Kondaveeti, Srinu Vaitla Music: S. Thaman Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Mohan Cherukuri (CVM), Praveen Marpuri Screenplay & Direction: Srinu Vaitla Release Date: 16th Nov 2018   Srinu Vaitla & Ravi Teja have made the audience laugh aloud with ‘Venky’. Later on, they made us happy with their next flick ‘Dubai Seenu’. Both these movies have entertained the audience. ‘Amar Akbar Anthony’, is the fourth cinema which the duo have attempted together. Both Srinu Vaitla & Ravi Teja, have given flops in the recent past and this cinema is crucial for both of them. Now has ‘Amar Akbar Anthony’ entertained the audience? Let us see. Story: Amar (Ravi Teja) goes to jail as a child. After spending 14 years in the jail, he begins to take revenge of those who killed his dear friend Aishwarya (Ileyana). Has Amar really lost his friend or has she escaped death? Why is Amar behaving wired? Will he succeed in taking revenge? And finally will Amar and Aishwarya unite? Answers to all these questions form the movie story. Plus Points: Sunil, Satya Comedy Ravi Teja, Ileyana Combination Ravi Teja, Srinu Vaitla Combination Minus Points: Srinu Vaitla Direction Thaman’s Tunes An uninteresting story Analysis: To describe in simple words, ‘Athanokkade’ + ‘Aparichitudu’ = ‘Amar Akbar Anthony’. Do you remember the movie 'Athanokkade' directed by Surender Reddy with KalyanRam in the lead role? Imagine the hero KalyanRam behaving strangely like Vikram in Aparichitudu. Amar Akbar Anthony cinema will exactly be like this. The only twist is even Ileyana in this movie has the multiple personality disorder. There are many scenes in the movie that do not make us laugh and does not even have an interesting story. This movie will again make the audience realize that, director Srinu Vaitla is not yet back in form. If at all he would have been in form, forget about the story – he would have surely made us laugh. Except a scene or two, we do not have anything in the movie which will make the audience laugh. Why did Maitri Movie Makers spend so much for this movie? There of no need for the film to be shot in America. Shooting the movie in India, would have made the same impact. Coming to the music given by S S Thaman, there is not even a single tune which the audience will remember and hum. Background score is also not impressive. Technically also, there is nothing much to talk about. Performance: Ravi Teja’s performance as Amar will impress the audience. He has performed well. As Akbar and Anthony, he has over acted. While Antony's character is very good, dialogue delivery and voice modulation in Akbar's character are not correct. Ileyana appeared plump. She has dubbed for her character in Telugu for the first time and it sounded irrelevant. There are many comedians in the movie. But the people who make us laugh are just two. Abhimanyu Singh's performance and dubbing for the role does not have any connection. Villains were all routine. Heroine Laya, whose character did not have any significance performed well. Finally: Dr. Anthony’s signature dialogue ‘I am Strong. You are Strong. We are all strong. Relax’ will make the audience Relax and just relax throughout the movie. In the theatres, you all should be strong enough else it’s hard. Rating: 1.5/5
బాహుబ‌లి ది బిగినింగ్` చిత్రం సినిమా షూటింగ్ స‌మ‌యంలో డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి  కొన్ని చేదు అనుభ‌వాలు ఎదుర్కొన్నాడు. అవి ఏమిటంటే  సినిమాకు సంబంధించిన 14 నిమిషాల లెంగ్త్ గ‌ల వీడియో ఒకటి లీక్ అవ‌డం. ఈ సంఘ‌ట‌న టీమ్ అంద‌రినీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది. ఆ త‌ర్వాత ఆడియో రిలీజ్ కు ముందే పాట‌లు కూడా లీక‌య్యాయి. వెంట‌నే రాజ‌మౌళి అండ్ టీమ్ తేరుకుని లీకైన లింకుల్ డిలీట్ చేయించారు. ఇలాంటి స‌మ‌స్య‌లు మ‌ళ్లీ పున‌రావృత్తం కాకుండా సెకండ్ పార్ట్ కి చాలా కేర్ తీసుకున్నారు. ఇటీవ‌ల గీతం గోవిందం. టాక్సీవాలా చిత్రాలు లీకులు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.  అయితే ఇటీవ‌ల మొద‌లైన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం లీకుల బారిన ప‌డ‌కుండా రాజ‌మౌళి చాలా కేర్ తీసుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల టీమ్ అంద‌రినీ పిలిచి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చార‌ట‌. లొకేష‌న్ లో మొబైల్స్ వాడుకూడ‌దంటూ కండిష‌న్స్ కూడా పెట్టార‌ట‌.  ఎటువంటి లీకు బ‌య‌ట‌కు పొక్కడానికి వీల్లేద‌ని చెప్పాడ‌ట‌. అలాగే చైనా నుంచి జామ‌ర్స్ తెప్పించార‌ట‌. ఈ జామ‌ర్స్ వ‌ల్ల సీక్రెట్ కెమెరాలు , పెన్ కెమెరాలు ఏ వి తీసుకొచ్చినా కానీ ప‌ని చేయ‌వ‌ట‌. ఈ టెక్నాల‌జీ ఎంత వ‌ర‌కు లీక్ ల బెడ‌ద నుంచి త‌ప్పింస్తుందో మ‌రి చూద్దాం.
నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, 'వెన్నెల' కిశోర్, సత్య, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్ తదితరులు కెమెరా: వెంకట్ సి. దిలీప్ కథ: వంశీరాజేశ్ కొండవీటి, శ్రీనువైట్ల సంగీతం: ఎస్.ఎస్. తమన్ నిర్మాత‌లు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీను వైట్ల విడుదల తేదీ: నవంబర్ 16, 2018 తెలుగు ప్రేక్షకులను 'వెంకీ' సినిమాతో రవితేజ, శ్రీనువైట్ల విపరీతంగా నవ్వించారు. తరవాత 'వెంకీ' స్థాయిలో కానున్నా... 'దుబాయ్ శీను'తోనూ నవ్వించారు. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'నీ కోసం'ను మినహాయిస్తే... మిగతా రెండు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగో సినిమా 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. గత కొన్ని సినిమాలుగా సరైన విజయాలు లేని రవితేజ, శ్రీనువైట్ల ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారా? నవ్వించారా? లేదా? రివ్యూ చదవండి. క‌థ‌: తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు ఐశ్వర్య (ఇలియానా)ను చంపాడన్న కారణంగా ఒకరిని హత్య చేసి అమర్ (రవితేజ) చిన్నతనంలో జైలుకు వెళతాడు. 14 ఏళ్లు జైలు జీవితం గడిపి వచ్చిన తరవాత తన కుటుంబాన్ని, తన స్నేహితురాలు ఐశ్వర్య (ఇలియానా) తల్లిదండ్రులను చంపిన నలుగురు వ్యక్తులపై పగ తీర్చుకోవాలని ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో గ్లాస్ పగిలిన శబ్దం విన్నప్పుడు ముస్లిమ్ వ్యక్తి అక్బర్ వలే, మానసిక రోగులను చూసినప్పుడు డాక్టర్ మార్క్ ఆంటోని వలే ప్రవర్తిస్తాడు. బాంబ్ పేలిన శబ్దాలు విన్నప్పుడు అమర్ పాత్రలో వస్తాడు. అమర్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అమర్ మరణించిందనుకున్న ఐశ్వర్య ఎలా బ‌తికింది? పూజాగా పేరు ఎందుకు మార్చుకుంది? అమ‌ర్ త‌న ప‌గ‌ను ఎలా తీర్చుకున్నాడు? చివరికి... అమర్, ఐశ్వర్య ఎలా కలిశారు? అనేది సినిమా! ప్లస్ పాయింట్స్: సునీల్, సత్య కామెడీ.. రవితేజ-ఇలియానా, రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్స్   మైనస్ పాయింట్స్: శ్రీనువైట్ల కథ, దర్శకత్వం తమన్ స్వరపరిచిన బాణీలు ఏమాత్రం ఆసక్తిగా సాగని కథనం విశ్లేషణ: సింపుల్‌గా చెప్పాలంటే... 'అత‌నొక్క‌డే' + 'అపరిచితుడు' = 'అమర్ అక్బర్ ఆంటోని'. నందమూరి క‌ల్యాణ్‌రామ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతనొక్కడే' సినిమా గుర్తుందా? ఒకవేళ అందులో హీరో 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ వలే వింత వింతగా ప్రవర్తిస్తే ఎలా వుంటుందో? అచ్చంగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా అలాగే వుంటుంది. బోనస్ ఏంటంటే... ఇలియానా పాత్రకూ మ‌ల్టిపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌ పెట్టారు. అందువల్ల, ప్రేక్షకులకు రెండు సన్నివేశాల్లో నవ్వుకునే భాగ్యం దక్కింది. ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవిధంగా ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగిన కథనానికి తోడు అసలు నవ్వించని సన్నివేశాలు సినిమాలో చాలా వున్నాయి. శ్రీనువైట్ల మరోసారి ఫామ్‌లో లేడ‌నే విష‌యాన్ని మ‌రోసారి ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఒకవేళ ఆయన ఫామ్‌లో వుండి వుంటే... కథ ఎలా వున్నా కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేవారు. ఏదో అరకొర సన్నివేశాల్లో తప్ప సినిమాలో విపరీతంగా నవ్వుకునే సన్నివేశాలు లేవు. ఈ కథను నమ్మి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంత ఎందుకు ఖర్చుపెట్టిందో? అమెరికా నేపథ్యంలో సినిమాను తీయాల్సిన అవసరం లేదు. ఇండియా అయినా కథలో మార్పు ఏం వుండదు. ఎస్.ఎస్. తమన్ బాణీల్లో ఒక్కటీ గుర్తు పెట్టుకునే విధంగా లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సాంకేతిక పరంగానూ గుర్తుపెట్టుకునే అంశాలేవీ సినిమాలో లేవు.    నటీనటుల పనితీరు: అమ‌ర్‌గా రవితేజ నటన ఆకట్టుకుంది. సెటిల్డ్‌గా చేశారు. మిగతా రెండు క్యారెక్ట‌రైజేష‌న్స్‌లో ఓవర్ యాక్టింగ్ చేశారు. ఆంటోని పాత్రలో అతి మంచితనం ఎక్కువ అయితే... అక్బర్ పాత్రలో డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ సరిగా నప్పలేదు. ఇలియానా బొద్దుగా కనిపించింది. ఫ‌స్ట్‌టైమ్ ఈ సినిమా కోసం తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఆమె వాయిస్ పర్వాలేదు. హాస్య నటులు సినిమాలో చాలామంది వున్నారు. కానీ, నవ్వించింది మాత్రం ఇద్దరే. కేఏ పాల్ శిష్యుడి పాత్రలో సత్య, అప్పులు చేసి హాబీ వున్న వ్యక్తిగా సునీల్. అక్కడక్కడా 'వెన్నెల' కిశోర్ పర్వాలేదనిపించాడు. అభిమన్యు సింగ్ నటనకు, ఆ పాత్రకు చెప్పిన డ‌బ్బింగ్‌కు ఎక్క‌డా సంబంధం వుండ‌దు. విలన్స్ అందరూ రొటీన్ యాక్టింగ్ చేశారు. ఒకప్పటి హీరోయిన్ లయ అసలు ప్రాధాన్యత లేని అతిథి పాత్రలో సందడి చేశారు. హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో లయ కుమార్తె చక్కగా నటించారు. చివరగా: డాక్టర్ ఆంటోని పాత్రలో రవితేజ 'ఐ స్ట్రాంగ్. యు స్ట్రాంగ్. వుయ్ ఆల్ స్ట్రాంగ్. రిలాక్స్' అని సిగ్నేచర్ డైలాగ్ చెబుతుంటాడు. ఎదుటివ్యక్తి ఎంత ఆందోళనలో వున్నప్పటికీ అదే డైలాగ్ చెబుతాడు. తెరపై వచ్చే సన్నివేశాలు ఎంత ఆందోళనలకు గురి చేస్తున్నా... ప్రేక్షకులు అదే విధంగా 'రిలాక్స్.. రిలాక్స్' అంటుకుంటా వుండాలి. థియేట‌ర్ల‌లో స్ట్రాంగ్‌గా కూర్చోగ‌ల‌గాలి. లేదంటే క‌ష్టం!! రేటింగ్: 1.5/5
  అతి త‌క్కువ కాలంలోనే    క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌ను న‌టించిన తాజా చిత్రం `టాక్సీవాలా`. జిఎ2 పిక్చ‌ర్స్ , యువి క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ కేయ‌న్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఆ విశేషాలు...    `గీత గోవిందం` కూడా పైర‌సీ అయింది కానీ ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది...పైర‌సీ ప్ర‌భావం పెద్దగా ప‌డ‌లేద‌న్న‌ట్టే క‌దా?  అయితే అన్ని సంద‌ర్బాల్లో అలా జ‌ర‌గాల‌ని లేదు క‌దా. పైర‌సీ వ‌ల్ల మా సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఆడియ‌న్స్ సినిమా చూడ‌టానికి థియేట‌ర్స్ కి వ‌స్తారా?  లేదా అన్న టెన్ష‌న్ అయితే ఉంటుందిగా. పెళ్లి చూపులు సినిమా పైర‌సీ జ‌ర‌గి ఉంటే నాకు ఆ త‌ర్వాత సినిమాలు వ‌చ్చి ఉండేవి కావు. నేను ఇంత దూరం వ‌చ్చి ఉండేవాన్ని కూడా కాదు. ఏమైనా పైర‌సీని బ్యాన్ చేయాలి.  పోర్న్ సైట్స్ లాగే పైర‌సీని బ్యాన్ చేయాలి.    మీ సినిమాలే పైర‌సీ అవుతున్నాయి...కావాల‌నే ఎవ‌రైనా చేస్తున్నారంటారా?  ఎవ‌రో కావాల‌ని నా సినిమాలు పైర‌సీ చేస్తున్నార‌నీ అయితే మాత్రం నేను అనుకోవ‌డం లేదు. పైర‌సీ అనేది పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో టీమ్ లో ఉన్న వ్య‌క్తులే చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంఇ. `గీత గోవిందం` కూడా అలాగే పైర‌సీ అయింది. ఏమైనా ఒక సినిమా పైర‌సీ చేస్తే ఆ సినిమాకు సంబంధించి ప్ర‌తి ఒక్క‌రి లైఫ్ తో ఆడుకున్న‌ట్లే.దీని వ‌ల్ల చాలా టెన్ష‌న్ కి , ప్రెజ‌ర్ కి గురి అవుతున్నాం.    ఇక మీదట ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు?  ఎవ‌రో పైర‌సీ చేస్తున్నారో తెలిస్తే వారి మీద ఏమైనా యాక్ష‌న్ తీసుకోవ‌చ్చు. ఎవ‌రు  చేస్తున్నారో తెలియ‌దు క‌దా. చాలా పైర‌సీ సైట్స్ ఉన్నాయి. ఫ‌స్ట్ వాటిని బ్యాన్ చేస్తే స‌రిపోతుంది.     టాక్సీవాలా సినిమా విష‌యంలో చాలా అంచ‌నాలున్నాయి...అందుకుంటాన‌నుకుంటున్నారా?  నేను అంచాన‌లు అనేవి పెద్ద‌గా న‌మ్మ‌ను. ఎవ‌రైనా సినిమా బాగుందంటేనే చూస్తారు. లేదంటే ఎవ్వ‌రు చూడ‌రు. నేను అదే న‌మ్ముతాను. కానీ చాలా మంది నాతో కూడా అంటుంటారు నీ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయ‌నీ...నేను వాటిని అంత సీరియ‌స్ గా తీసుకోను.     నోటా మూవీ రిజ‌ల్ట్స్ ముందే ఊహించారా?  రిలీజ్ కు ముందు రోజే చూసాను. కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయ‌నిపించింది కానీ అప్పుడు ఏం చేయ‌లేం కదా...    టాక్సీవాలా రీ షూట్స్ ఏమైనా చేసారా?  పెళ్లి చూపులు త‌ర్వాత ఒప్పుకున్న సినిమా `టాక్సీవాలా`. ఈ క‌థ విన్న‌ప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. స్టోరీ విన్న‌తంసేపూ న‌వ్వుతూనే ఉన్నాను. ఆ న‌మ్మ‌కంతోనే చెబుతున్నా సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి కూడా న‌చ్చే సినిమా.    ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో బ‌న్నీ మిమ్మ‌ల్ని బాగా పొగిడేశాడు...ఎలా అనిపించింది?  వాటిని వీలైనంత త్వ‌రగా మ‌ర్చిపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా. బ‌న్నీ గారు, చిరంజీవిగారు నా గురించి మాట్లాడ‌టం అనేది వాళ్ల గొప్ప‌త‌నం. అంత గొప్ప స్టార్స్ నా గురించి మాట్లాడ‌టం ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నా.    కొత్త డైర‌క్ట‌ర్స్ తో కాకుండా పెద్ద డైర‌క్ట‌ర్స్ తో సినిమా చేస్తే మార్కెంట్ ఇంకా పెరుగుతుంది క‌దా?  ఆ విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. క‌థ నచ్చితే సినిమా చేస్తున్నా అంతే. అయితే వ‌చ్చే ఏడాది మాత్రం ఒక పెద్ద డైర‌క్ట‌ర్ తో సినిమా క‌చ్చితంగా ఉంటుంది. నేను ఆయ‌న‌కు పెద్ద అభిమానిని ఆయ‌న సినిమా చేద్దాం అని అడ‌గ‌టం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.     నెక్ట్స్ ప్రాజెక్ట్స్?   ప్ర‌స్తుతం డియ‌ర్ కామెడీ న‌డుస్తోంది.   ఈ మంత్ ఎండింగ్ నుంచి మ‌రో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 30శాతం షూటింగ్ పూర్త‌యింది.  నెక్ట్స్ ఇయ‌ర్ మిడిల్ లో సినిమా రిలీజ్ ఉంటుందంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు క్రేజీ హీరో.
  టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఇంటి పార్టీకి కాంగ్రెస్ ఒక టిక్కెట్ కేటాయించిందని, ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ నకిరేకల్ నుంచి బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్ సీటుని చిరుమర్తి లింగయ్యకు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికే సీటుని కేటాయించింది. దీనిపై ఇంటి పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో పాపం కాంగ్రెస్ ది కూడా ఏం చేయలేని పరిస్థితి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలోని మిగతా మూడు పార్టీలకు సీట్లు కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో నిరసన సెగలు తగులుతున్నాయి. మరి అలాంటి సమయంలో అంతగా బలం లేని ఇంటి పార్టీకి టిక్కెట్ కేటాయిస్తే ఇంకేమైనా ఉందా?. నిరసన సెగ తారాస్థాయికి చేరదు. దీనికితోడు నల్గొండలో బలమైన కేడరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదనలేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టే ఇంటి పార్టీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇంటి పార్టీ మాత్రం కూటమిలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది.  తెలంగాణ ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ తాజాగా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అమరావతి నుంచే కాంగ్రెస్ టిక్కెట్లు వస్తున్నాయని ఆరోపించారు. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని ఆయన చెప్పారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని అన్నారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. చెరుకు సుధాకర్ బరిలోకి దిగుతానని చెప్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009లో సుమారు 29వేలు, 2014 ఎన్నికల్లో 23వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఉత్తమ్ మీద పోటీకి సుధాకర్ సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు మహాకూటమిలో ఉన్న సుధాకర్.. ఇప్పుడు కూటమిలోని పెద్దన్న పార్టీ కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ మీదే పోటీకి సిద్ధమయ్యారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
  టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు అసలు ఈ కూటమి ఎన్నికల వరకు ఉంటుందా? ముందే ముక్కలవుతుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమి దూసుకుపోతుంది. కూటమిలోని పార్టీలు, నేతలు త్యాగానికి సిద్దమవుతూ తమ ప్రధాన లక్ష్యం ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. టీడీపీ తక్కువ సీట్లకు సర్దుకుపోయింది. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కోసం సీటు త్యాగం చేసి పొత్తు ధర్మాన్ని పాటించారు. ఇక సీపీఐ కూడా తక్కువ సీట్లు కేటాయించినా.. టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పారు. కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. పొన్నాల జనగామ నుంచి అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయనికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటి పొన్నాలకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటుని టీజేఎస్ కి కేటాయించింది. ఇక్కడి నుంచి కోదండరాం బరిలోకి దిగలనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పినా.. పొన్నాల మాత్రం జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సుముఖుత వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ సీనియర్ నేత అయిన పొన్నాలకు మొండిచేయి చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కోదండరాం పొన్నాల కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా టీజేఎస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి.. కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కోదండరాం వేరే ఏదైనా స్థానం పోటీ చేస్తారో లేక కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారో చూడాలి. మొత్తానికి కూటమిలోని పార్టీలు, నేతల త్యాగాలు చూస్తుంటే టీఆర్ఎస్ ని ఓడించాలని కూటమి ఎంత బలంగా ఫిక్స్ అయిందో అర్ధమవుతోంది. చూద్దాం కూటమి లక్ష్యం నెరవేరుతుందో లేదో.
  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు 'వార్ వన్ సైడ్' మళ్ళీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా మారింది. కొందరైతే మహాకూటమిదే పైచేయి అని భావించారు. తాజాగా ఓ సర్వే కూడా అదే తేల్చింది. ఏబీపీ న్యూస్‌ కోసం సీ-వోటర్‌ చేసిన సర్వేలో తెలంగాణలో మహాకూటమిదే విజయమని తేలింది.  కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, టీఆర్‌ఎస్‌ కు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 22.6 శాతం మంది జానారెడ్డి వైపు మొగ్గు చూపారు.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. దీనిబట్టి చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్వే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూటమి నుంచి రెబెల్స్ వచ్చే అవకాశముంది. దీనివల్ల ఓట్లు చీలుతాయి. అది టీఆర్‌ఎస్‌ కు కలిసిరావొచ్చు. ఫలితాలు మారొచ్చు. మరి కూటమి వీటిని అధిగమించి టీఆర్‌ఎస్‌ ని ఓడించి సర్వే ఫలితాలను నిజం చేస్తుందేమో చూడాలి. సీ-ఓటర్‌ సర్వే తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో కూడా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 45 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సీ-ఓటర్‌ సర్వే చెప్పింది. అయితే, చివరికి గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని తేల్చింది. ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 42.3% ఓట్లతో 116 సీట్లు, బీజేపీ 41.5% ఓట్లతో 107 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే బీజేపీకి 43 సీట్లు.. కాంగ్రెస్ కి 41 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఛత్తీస్‌గఢ్‌ లో ఓటు శాతం మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువ వస్తుందని తేల్చింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక మిజోరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయని తెలిపింది.
  తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి తారక రామారావు పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలానే తమిళనాట అంతే గొప్ప పేరు ఉన్న నటుడు ఎం.జీ.రామచంద్రన్ (ఎంజీఆర్).ఇద్దరు సినీరంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు.ఎంజీఆర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ స్థాపిస్తే,ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించారు.రాష్ట్రాలు వేరైనా సమన్వయంతో,స్నేహబంధంతో మెలిగేవారు.అలానే డీఎంకే పార్టీ కూడా తెదేపాకు తమ మద్దతునిచ్చేది.తమిళనాడులో  అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏది అధికారంలో ఉన్నా తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చేవి.ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు నాయుడుకు జయలలిత, కరుణానిధితో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరు ఎన్నికల్లో గెలుపొందినా తప్పకుండా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేవారు.కానీ జయ మరణాంతరం తెదేపాకు అన్నాడీఎంకే నుంచి ప్రాధాన్యత తగ్గిపోయింది.ఆ పార్టీ నేతలతో సమావేశమవ్వటానికి వచ్చిన తెదేపా ఎంపీలకు సమయం ఇవ్వకపోవటమే పార్టీల మధ్య దూరం పెరిగిందంటానికి ఉదాహరణ.అయితే డీఎంకే మాత్రం కరుణానిధి మరణం తర్వాత కూడా తెదేపాకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.     ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయటానికి సన్నద్ధమైన సంగతి తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలో భేటీ అయ్యారు.అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సైతం భేటీ అయ్యారు.ఈ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా నిన్న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఇతర నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.నేడు తెదేపాకు మొదటి నుంచి సన్నిహిత పార్టీ అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో సమావేశమవనున్నారు.బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపమని చంద్రబాబు స్టాలిన్‌ ను కోరే అవకాశం ఉంది.ఎలాగో స్నేహబంధం ఉంది కాబట్టి  స్టాలిన్‌ కూడా అందుకు సానుకూలంగా ఉంటారనే అనుకోవాలి.అంతబాగానే ఉంది కానీ ఇంతకీ చంద్రబాబు అన్నాడీఎంకే పార్టీ నేతలతో సమావేశమవుతారా? లేదా? అనేదే ప్రస్నార్ధకం.అన్నాడీఎంకే కూడా గత కొంత కాలంగా బీజేపీ కి కాస్త అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెరాస నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 18 ప్రశ్నలతో కూడిన ఈ లేఖను తాజాగా హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు.. తాను ఏపీకి సీఎం అయ్యాక అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తే.. అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వలేదని.. ఆ కుట్రలను చేధించిన కేసీఆర్ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేసి నాలుగు సీట్లు సాధించుకుంటే అభివృద్ధికి అడ్డుపడవచ్చనే కుట్రతోనే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగుకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, వాటర్‌ బోర్డులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయినా చంద్రబాబు బాధపడరు కానీ.. వాటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటే మాత్రం సహించలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్న ఆయన.. తిరిగి ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుకు హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలోని 18 ప్రశ్నలు: నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా? పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా? కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా? కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా? పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా? ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా? సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా? విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా? పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా? రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా? ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా? ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా? హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా? విభజన మాయని గాయం అని బాధ పడలేదా?
కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.     ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల అనంతరం రామనగర స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామం జేడీఎస్‌కు ఎంతగానో కలిసొచ్చింది. రామనగరంలో బీజేపీకి 15,906 మాత్రమే పోలయ్యాయి. లక్షా 9వేలకు పైగా భారీ మెజారిటీని అనితా కుమారస్వామి దక్కించుకోవడంతో జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిద్ధు కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  ఆనంద్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిచ్చింది. అయితే శివరామకు పోటీగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పొటీ ఏకపక్షమే అయ్యింది. బీజేపీ కంచుకోట 'బళ్లారి'లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి శాంత బరిలోకి దిగారు. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కనీసం ఈ సీటు నిలుపుకుంటే బీజేపీ పరువు దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. మధుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఫలితాల్లో రాఘవేంద్ర, మధు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో మధు ఆధిక్యం కూడా కనబర్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన శివమొగ్గ ఉపఎన్నికలో చివరకు రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికలు ఫలితాలు బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
  We have spent enough time accumulating things for our living spaces and in the name of organizing things we see that we have gathered enough stuff that we begin to see that its is a reflection of our state of mind. If there's one deeper, universal truth, than it's that clutter can prevent us from letting anything new into our lives. As you see the clutter growing we begin to feel overwhelmed and it is only when we shift our houses that we realize how much of stuff we have gathered .   Getting started to de -clutter your home: There is no need to start immediately ! Do it phase wise.Your house is a reflection of your self.Shift your perspective and see what you need and what you don’t and work on individual spaces.This can be done phase wise and room by room.Ask yourself : Do I love it? and Do I need it? This will help you   get a more objective view of what was taking up space.   Once you begin to  get an objective, clear-eyed view of the  clutter, we were ready for phase two -- no, not clearing out, but planning. Specifically, making a plan to prevent future clutter and a plan for moving out existing clutter. It's pretty simple: First, determine where clutter is coming from and shut off the flow. If the items are too valuable you can donate to charity or old age homes or if its is of no use to anyone just throw the stuff away. Donate those old books to the  local library or to a school for under privileged.  Now we were ready to roll on actually clearing space. which is phase three.Most people find that the energy generated during this part propels them forward, but to avoid feeling overwhelmed at the outset, work in a specific area at a time for 30 minutes a day -to sort through the clutter. Keep the garbage bags, boxes, ready and  "When in doubt, throw it out," once you start you get motivated to get the job done. You will  experience one of the biggest perks of clutter clearing: a feeling of greater emotional and mental space -- a sense of greater ease, of having more time and less stress. In a span of a few days or week based on the plan you have made  you will feel better and  the changes will be much deeper. You will feel much better about yourself and have more energy, feel more "togetherness," with your family member and just felt more enthusiastic about life in general .See what happens when we make the space for something to enter our life and when the old is pushed out. Obstacles you may encounter while clearing out your clutter: Procrastination- Don't feel overwhelmed by the task, make baby steps towards cleaning.These are tiny steps -- five minutes or less -- that will move you toward completing your project.  Paper -Just keep those  financial and legal documents which are important to us and release attachment to all kinds of information like unused recipes stuck in a file, old magazine articles ,paintings etc. Use the internet and find what you want. The Past- By hanging on to  items which keeps us attached to the past. Ask yourself, What do I need to do to complete the past and let go?  You will feel amazing; happier, lighter and free! when you clear up the physical clutter in your life. This creates space and possibility for the “new” to enter your life that you can start to change your life and begin to live a life that you love. Clear the old and enjoy the new! - Charitha
  పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే! దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే! ‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది. రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు. రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది. ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు. రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు. స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి! ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు. ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు. ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. - నిర్జర.
  Diabetes is on the rise, yet most cases are preventable with healthy lifestyle changes. Some can even be reversed. Taking steps to prevent and control diabetes doesn’t mean living in deprivation. While eating right is important, you don’t have to give up sweets entirely or resign yourself to a lifetime of bland “health food”. With these tips, you can still enjoy your favorite foods and take pleasure from your meals without feeling hungry or deprived. https://www.youtube.com/watch?v=cNjKPvT1wkw  
  Dry Eyes : One common side effect of wearing contact lenses is developing dry eyes. This condition results from having insufficient tears. Dry eyes can occur in wearers of soft and hard contact lenses, alike. People with dry eyes might experience symptoms such as the eyes feeling hot, a sensation of something stuck inside the eye, redness, and burning or tearing. Fluid deposit : Intraocular fluid from the lens gets deposit on the retina. This fluid can lead to eye infections. This is more common when you wear soft lenses daily, as they are flexible and the fluid doesn’t come out easily after washing with the solution. Burning eyes : When you try to set these plastic or silicon lens inside your eyes, you feel a burning sensation instantly. Eyes are very sensitive. If a small dust particle enters, it becomes red. What will happen when you try to put lens? The inflammation is felt but, it is temporary. You can also get bumps on the eyelids and these swollen eyelid are painful. Pressure on the Eyes : Contact lenses exert a certain amount of pressure on the eye. Depending upon the fit and oxygen permeability of your lens, this pressure can change the shape of the cornea. Allergic Reactions : The chemicals used in the cleaning, disinfecting and lenses storage solutions may irritate sensitive eyes. Giant Papillary Conjunctivitis (GPC) is a particular allergic condition that is often due to chemical allergies and protein build-up on contact lenses. Symptoms include small bumps on the inside of an eyelid, mucus and itching.
  ఉప్పు కిలో 400 రూపాయలకి చేరుకుందనే పుకారుతో దేశం తల్లడిల్లిపోయింది. ఉత్తరభారతంలో అయితే అర్ధరాత్రులు కూడా ఉప్పు సంచుల కోసం వీధుల మీద పడ్డారు. మన భారతీయులకి ఉప్పంటే ఎంత ప్రాణమో చెప్పేందుకు ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. కానీ మన ప్రాణంగా చూసుకునే ఉప్పే అత్యంత ప్రాణాంతకంగా మారుతోందంటున్నారు. తాజాగా ముక్కుపచ్చలారని పిల్లలు సైతం ఎక్కువ ఉప్పుని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటని ఎదుర్కొంటున్నారంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది.   అంతకు మించి: పెద్దవారితో పోలిస్తే పిల్లలు కాస్త ఉప్పు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పటి ఆహారపు అలవాట్లను బట్టి పరిస్థితి కాస్త భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బిస్కెట్లు, చిప్ప్, ఫాస్ట్‌ఫుడ్స్‌ అంటూ పిల్లలు అవసరానికి మించి ఉప్పుని లాగించేస్తున్నారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అమెరికాలో రెండువేలకు పైగా పిల్లల ఆహారపు అలవాట్లను గమనించారు. వీరంతా కూడా 6 నుంచి 18 ఏళ్ల వయసులోపు వారే. ఆశ్చర్యకరంగా వీరిలో 90 శాతం మంది పరిమితికి మించి ఉప్పుని తీసుకుంటున్నట్లు తేలింది.   దీర్ఘకాలిక సమస్యలు: అధిక మోతాదులో ఉప్పు వల్ల మొదటగా కలిగే దుష్ఫలితం అధిక రక్తపోటు. అదే ఈ పిల్లలందరిలోనూ కనిపించడం బాధాకరం. ప్రతి తొమ్మిది మందిలోనూ ఒక పిల్లవాడిలో, అతని వయసుకి ఉండాల్సినదానికంటే వారిలో రక్తపోటు అధికంగా కనిపించింది. ఇలా చిన్న వయసులోనే రక్తపోటు ఛాయలు కనిపిస్తే అది వారిని జీవితాంతమూ వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   కళ్లెం వేయాల్సిందే! పిల్లలు ఎప్పుడు ఆహారాన్ని తీసుకున్నా, దానిని ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నా కూడా... సర్వత్రా ఉప్పే కనిపిస్తోందని పరిశోధకులు వాపోయారు. చిన్నప్పుడే ఎక్కువ ఉప్పు రుచికి అలవాటుపడిన పిల్లలలో ఆ రుచి ఒక వ్యసనంగా మారిపోతోందట. ఫలితంగా వారు పెద్దవారయ్యాక గుండెజబ్బులను సైతం ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లల ఆహారంలో పళ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం; వారికి అందించే చిరుతిండి ప్యాకెట్ల మీద సోడియం మోతాదుని గమనించడం; చిప్స్‌ వంటి చిరుతిళ్లకు వారిని దూరంగా ఉంచడం... వంటి చర్యలు పాటించి తీరమంటున్నారు.   మనకీ ఇది హెచ్చరికే! ఇది కేవలం అమెరికాలో పరిస్థితి అనుకోవడానికి లేదు. అసలే భారతీయ వంటకాలలో ఉప్పుకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. దీనికి తోడు ఇప్పటి తరానికి ఫాస్ట్‌ఫుడ్స్‌ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది. పైగా చదువు తప్ప ఎలాంటి వ్యాయామమూ ఎరుగని కాలం ఇది. కాబట్టి భవిష్యత్తులో వారి కెరీర్‌ గురించి ఎంత కంగారు పడుతున్నామో, వారి ఆరోగ్యం గురించి అంతకుమించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం అటు వారి ఆహారపు అలవాట్లను నిశితంగా గమనిస్తూ, ఇటు ఇంట్లోనూ ఉప్పు వాడకం తగినంతగా తగ్గించుకుంటే మేలు. - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.