LATEST NEWS
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
Riding high with the success of Fidaa and Tholi Prema, young mega hero Varun Tej will next join hands with Sankalp Reddy of Ghazi fame for a space thriller. ‘Aham Brahmasmi’ is the title considered for the film in which Varun Tej will be seen as an astronaut. Varun Tej posted the above picture of his new toy- astronaut to describe about his character in next movie with Sankalp Reddy. Apparently, Varun Tej is also taking part in pre-production works of Aham Brahmasmi which will go on floors from May. The makers of the film are planning to wrap up the movie in short time period to release it later this year. Varun Tej is trying all different subjects starting from his debut movie Mukunda to last outing Tholi Prema. Aham Brahmasmi will be yet another special film for him. In fact, good form is assisting him to pick experimental subjects.
పాత హిట్ సినిమాల టైటిల్స్ తో సినిమాలు రావడం చిత్ర పరిశ్రమలో కామన్. అయితే... వాటి ఫలితాలెలా ఉన్నాయ్? హిట్లు ఎక్కవా? ఫట్లెక్కువా? అనే విషయాన్ని సరదాగా కాసేపు ముచ్చటించుకుందాం.. ముందు పాత టైటిల్స్ తో చిరంజీవి చేసిన సినిమాల విషయానికొస్తే...   ‘ఎన్టీయార్ ‘దేవాంతకుడు’ చాలా పెద్ద హిట్. తొలి సోషియో ఫాంటసీ సినిమాగా పేరు గడించిన సినిమా అది. ఆ సినిమా ప్రేరణతోనే తర్వాత యమగోల, యముడికి మొగుడు, యమలీల, యమదొంగ.. ఇవన్నీ వచ్చాయ్. అదే సినిమా టైటిల్ తో చిరంజీవి చేసిన ‘దేవాంతకుడు’... డిజాస్టర్.  ఎన్టీయార్ ‘ఇంటిగుట్టు’ సూపర్ హిట్. అదే టైటిల్ తో చిరంజీవి చేసిన ‘ఇంటిగుట్టు’ హిట్. చిరంజీవి ‘ఆరాధన’కు ముందు అదే టైటిల్ తో ఎన్టీయార్, ఏఎన్నార్లు సినిమాలు చేశారు. అక్కినేని ‘ఆరాధన’ బ్లాక్ బస్టర్. ఎన్టీయార్ ’ఆరాధన’ సూపర్ హిట్. కానీ.. చిరంజీవి ‘ఆరాధన’ అట్టర్ ఫ్లాప్ శోభన్ బాబు ‘జేబుదొంగ’ సూపర్ హిట్ కాగా.. చిరంజీవి ‘జేబు దొంగ’ డిజాస్టర్.  శోభన్ బాబు ‘ముగ్గురు మొనగాళ్లు’ యావరేజ్. చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫ్లాప్. అర్జున్ ‘జెంటిల్మేన్’ సూపర్ హిట్. చిరంజీవి ‘ది జెంటిల్మెన్’ అట్టర్ ఫ్లాప్.  అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ బ్లాక్ బస్టర్.. చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’ అట్టర్ ఫ్లాప్.  దీన్ని బట్టి... మెగాస్టార్ కి పాత టైటిల్స్ పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. ఇక బాలయ్య విషయానికొస్తే...  ఎన్టీయార్ ‘కథానాయకుడు’ సూపర్ హిట్. బాలయ్య ‘కథానాయకుడు’ కూడా మంచి హిట్టే.  ఎన్టీయార్ ‘భలే తమ్ముడు’ రికార్డులు తిరగరాస్తే... బాలయ్య ‘భలే తమ్ముడు’ యావరేజ్.  ఎన్టీయార్ ‘నిప్పులాంటి మనిషి’ ఓ చరిత్ర. బాలయ్య నిప్పులాంటి మనిషి ‘డిజాస్టర్’.  ఎన్టీయార్ ‘సీతారామకల్యాణం’  ఓ క్లాసిక్  బాలయ్య ‘సీతారామ కల్యాణం’... మంచి హిట్.  ఎన్టీయార్ ‘రాము’ పెద్ద హిట్. బాలయ్య ‘రాము’ యావరేజ్.  ఎన్టీయార్ ‘జయసింహ’... బాక్సాపీస్ రికార్డులను తిరగరాస్తే... బాలయ్య ‘జై సింహ’ హిట్ అనిపించుకుంది.   అక్కినేని సినిమా టైటిల్స్ ని కూడా బాలయ్య వదల్లేదండోయ్. ’ఆత్మబలం’ పేరుతో బాలయ్య ఓ సినిమా చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. అంతేకాదు... అక్కినేని క్లాసిక్ ‘దొంగరాముడు’ పేరుతో కూడా బాలయ్య ఓ సినిమా చేశాడు.ఆ సినిమా కూడా డిజాస్టరే.  ఇక పాత సినిమా టైటిల్స్ తో నాగార్జున చేసిన సినిమాల గురించి చెప్పుకుందాం.  నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ తో గతంలో ఓ సినిమా వచ్చింది. దాంట్లో హీరో ఎన్టీయార్. అయితే.. ఎన్టీయార్ ‘నిన్నేపెళ్లాడతా’ పెద్ద ఫ్లాప్. నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’  బ్లాక్ బాస్టర్.  ఎన్టీయార్ ‘ఎదురులేని మనిషి’ బ్లాక్ బాస్టర్ కాగా, నాగ్ ‘ఎదురులేని మనిషి’ డిజాస్టర్.  ఎన్టీయార్ ‘సంతోషం’ ఫ్లాప్ సినిమా కాగా, నాగ్ ‘సంతోషం’ సూపర్ హిట్.  దాసరి ‘గ్రీకువీరుడు’ అట్టర్ ఫ్లాప్...  నాగ్ ‘గ్రీకువీరుడు’ కూడా అట్టర్ ఫ్లాప్.  ఓంకార్ ‘రాజుగారి గది’ మంచి హిట్. అతనే నాగ్ తో చేసిన ‘రాజుగారి గది’ అట్టర్ ఫ్లాప్.  ఇక మన వెంకీ విషయానికొస్తే... అక్కినేని ‘ప్రేమ’ యావరేజ్ కాగా, వెంకటేశ్ ‘ప్రేమ’ సూపర్ హిట్.  ఎన్టీయార్ ‘అగ్గిరాముడు’ సూపర్ హిట్ కాగా.. వెంకీ ’అగ్గిరాముడు’ డిజాస్టర్ అక్కినేని ‘పవిత్ర బంధం’ సూపర్ హిట్. వెంకీ ‘పవిత్ర బంధం’ సూపర్ హిట్ ఎన్టీయార్ ‘మల్లీశ్వరి’ తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటి కాగా, వెంకీ ‘మల్లీశ్వరి’ సూపర్ హిట్ అంతే.  మణిరత్నం’ ఘర్షణ’ మెగా హిట్. వెంకీ ‘ఘర్షణ’.. హిట్  కృష్ణ ‘ఈనాడు’ సూపర్ హిట్ కాగా, వెంకీ ’ ఈనాడు’ అట్టర్  ఫ్లాప్ ఈ నలుగురు కాక, మిగిలిన హీరోలు కూడా చాలామంది పాత టైటిల్స్ వాడేశారు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. 
మనలో ఎంతటి ప్రతిభ ఉన్నా.. ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎదగడం కష్టం. యాటిడ్యూడ్ కారణంగానే కెరీర్ లో వెనకబడిపోయిన వారు కోకొల్లలు. తమకున్న కొద్ది టాలెంట్ ను చూసుకొని ఎక్కువగా ఫీలవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయ్.  మన నిత్యామీనన్ నే తీసుకోండి. తొలి సినిమాతోనే ‘మంచి నటి’ అని పేరు తెచ్చుకుంది. కొందరైతే ఏకంగా సౌందర్యతో కంపైర్ చేసేశారు. సౌందర్యలో లేని అదనపు క్వాలిటీ కూడా నిత్యలో ఉంది. అదే... గానం. ఇన్ని ఉండి ఏం లాభం...కేవలం ఆమె ప్రవర్తనే ఈ రోజు ఆమె వెనకబడటానికి కారణం అయ్యింది. సినిమాలు లేకపోవడంతో శరీరంపై శ్రద్ధ కూడా పెట్టలేకపోతోంది నిత్య. బాగా బరువు పెరిగిపోయి.. చూడ్డానికే ఎబ్బెట్టుగా తయారైంది. దీనికంతటికీ కారణం ఆమె హెట్ వెయిటే.  నిజానికి నిత్యామీనన్ ని మంచి మంచి అవకాశాలే వరించాయ్. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో ముందు అనుకుంది నిత్యామీనన్నే. ఆమెను దర్శక, నిర్మాతలు కలిశారు కూడా. అయితే... ఆమె యాటిడ్యూడ్  అంతటి గొప్ప అవకాశాన్ని దక్కకుండా చేసింది. దర్శక, నిర్మాతల ముందు... ‘సావిత్రి కేరక్టర్ చేస్తే... నేనే చేయాలి.. ఎవరికుంది అంత దమ్ము’ అన్నట్టు బిహేవ్ చేసిందని విశ్వసనీయ వర్గాల భోగట్ట. అంతేకాదు... పారితోషికం విషయంలో కూడా స్థాయిని మించి అడిగిందట. దాంతో... చిర్రెత్తుకొచ్చిన దర్శకుడు నాగశ్విన్... ఆ పాత్రలో నిత్యను తప్పించి... కీర్తి సురేశ్ ని తీసుకున్నాడట. నిత్యామీనన్ యాటిడ్యూడ్... కీర్తి సురేశ్ కి వరంగా మారింది. అంతేకాదు.. బాలయ్య నిర్మించనున్న ‘ఎన్టీయార్ బయోపిక్’ లో ఎన్టీయార్ సతీమణి ‘బసవతారకం’ పాత్రకు నిత్యామీనన్నే అనుకున్నారట బాలయ్య. ‘మా అమ్మ పాత్రకు నిత్య సరిగ్గా సరిపోతుంది. మా అమ్మ పాత్ర కాబట్టి... డైరెక్ట్ గా నేనే వెళ్లి కథ చెబుతా. తన కేరక్టర్ ని ఎక్స్ ప్లయిన్ చేస్తా. ఆ అమ్మాయి లాంటి నటి చేస్తేనే మా అమ్మ పాత్రకు న్యాయం జరుగుతుంది’ అని బాలయ్య పలువురితో అన్నారట కూడా. కానీ... ఆ అమ్మాయి... అలాంటి అపూర్వమైన అవకాశాన్ని కూడా వదులుకుంది. పైగా మీడియా వారు ‘బసవతారకం’ పాత్ర చేస్తున్నారట కదా? అనడిగితే... ‘చేయట్లేదు.. దానికి కొన్ని కారణాలున్నాయ్. చెప్పకూడదు’ అంటూ ఎదుటివారికి అనుమానాలు తెప్పించే సమాధానం ఇచ్చిందట.  నిత్యామీనన్... మంచి నటి. అంతేతప్ప..స్టార్ హీరోయిన్ కి ఉండదగ్గ ఫిజిక్ అయితే ఆమెకు లేదు. ప్రయోగాత్మక పాత్రలన్నీ చేస్తూ... ప్రేక్షకులకు చేరువ అవ్వల్సిందే తప్ప... గ్లామర్ పాత్రలు చేస్తే జనాలు ఒప్పుకోరు. ఇలా వస్తున్న మంచి పాత్రలన్నింటినీ హెడ్ వెయిట్ తో తిప్పికొడితే... కొన్నాళ్లకు ఇంటికే పరిమితం అవ్వాల్సొస్తుంది. తెలుసుకోమ్మా... నిత్యా!
Akkineni Nagarjuna has given life to many debut directors in the industry. And one amongst them is Ram Gopal Varma. Even though RGV is making only flops of late, Nag gave him yet another chance. The yet to be titled movie is in last stage of production. Nagarjuna is said to be performing original stunts in the film which is likely to release in summer. Apparently, Nagarjuna’s film will face ire of women activists.  As we all know, RGV invited flak for making offensive comments on a woman activist. SIT officials also interrogated him for making a porn film titled ‘God Sex And Truth”. In fact, many women activists are hoping and are demanding that RGV would be arrested. In order to express their ire against RGV, they may even raise objections against release of Nagarjuna’s film. Although this won’t affect RGV much since it is not a new scenario for him. But, it will be a big black mark for Nagarjuna!
Virat Kohli and Anushka Sharma got married in December. Kohli recently thanked his wife Anushka after winning one day series against South Africa stating "People who are close to me deserve a lot of credit. My wife has kept me going throughout the tour. I am grateful for that. Obviously, you want to lead from the front, and that's a wonderful feeling." Freshly, Virat posted a romantic picture of him with Anushka in social platform. In this picture which is storming internet, both Virat and Anushka can be seen hugging each other affectionately. The pose is replica of the art can be seen on the wall. Virat Kohli captioned the pic, “My one and only! ♥😇♥.”
జాతీయ పార్టీల హవా ఉత్తరాదిలో నడిచినట్లు దక్షిణాదిలో నడవదు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీల ముందు వాటి ఆటలు సాగవు. ఎంతపెద్ద కొమ్ములు తిరిగిన నేషనల్ పార్టీలైనా సరే... రీజనల్ లీడర్ల సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరన్నది ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ హైకమాండ్ చేసిన పొరపాట్లతో చేతులారా తన ఘోరీని అదే కట్టుకుంది. ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప జనం గుర్తించలేని పరిస్థితికి కాంగ్రెస్ చేరుకుంది. సరే.. అదిప్పుడు గడిచిన కథ.. వర్తమానంలోకి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో స్ట్రాంగ్‌గా ఎదగాలని కంకణం కట్టుకుంది.   కర్ణాటకలో అల్రెడీ ఒకసారి పవర్ రుచి చూసింది కాబట్టి.. అక్కడ అంతో ఇంతో బెటర్‌గానే ఉంది.. ఇక జయ మరణంతో తమిళ రాజకీయాల్లో వేలుపెట్టిన కమలం.. రజనీ సపోర్ట్‌తో కానీ.. అన్నాడీఎంకే అండతో కానీ నాలుగు సీట్లు వెనకెసుకునే ప్రయత్నాల్లో ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ ఎత్తుల ముందు కాషాయం నిలబడలేదు. ఎటోచ్చి ఆంధ్రప్రదేశ్‌లోనే పరువు కాపాడుకోవాలి.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి రెండు ఎంపీ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.   అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని వదిలించుకునేందుకే బీజేపీ పెద్దలు రాజకీయాన్ని.. నడిపారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మిత్రధర్మాన్ని పాటించకుండా... ఎక్కడ దొరికితే అక్కడ తెలుగుదేశాన్ని కార్నర్ చేసింది బీజేపీ. ముఖ్యంగా సోము వీర్రాజు వంటి నేతలైతే ఢిల్లీ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఓపికగా భరించిన టీడీపీకి తాజా బడ్జెట్‌తో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీనిలో భాగంగా తమ డిమాండ్లకు ఒప్పుకుంటే సరే.. లేదంటే ఎవరి దారులు వారు వెతుక్కోవడమే అన్న సంకేతాలు ఇచ్చారు టీడీపీ అధినేత.   తెలుగుదేశం పక్కకు తప్పుకున్నా.. జగన్ అండతో గట్టెక్కాలని కమలనాథులు భావిస్తున్నప్పటికీ.. అదంత తేలిక కాదు.. వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏ మాట మీద నిలబడతాడో ఆయనకే కాదు.. పార్టీ శ్రేణులకే అర్ధం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బీజేపీకి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అన్న చందాన తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదులుకుంటే.. కాంగ్రెస్, వామపక్షాల లాగా ఎవరో ఒకరు రాకపోతారా..? అన్నట్లు ఎదురుచూసే తోక పార్టీల లాగా బీజేపీ మారిపోతుందని విశ్లేషకుల అంచనా.
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి.. జనాన్ని ఆకర్షించడానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం తన ఎంపీల చేత పార్లమెంట్‌లో ఆందోళన చేయించిన జగన్.. ప్రత్యేకహోదా నినాదంతో సెంటిమెంట్‌ను రగిల్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అధినేత. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ప్రత్యేకహోదాని చేర్చేశారు కూడా. ఈలోపు జనాన్ని అటెన్షన్ చేయడానికి తన కార్యచరణను ప్రకటించారు. మార్చి 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్‌‌ల ముట్టడి.. 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పటికి కేంద్రం దిగి రాకపోతే.. ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.   ఈ వేడి ఇంకా చల్లారకముందే నిన్న మరో బాంబు పేల్చారు ప్రతిపక్షనేత.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని.. అందుకు టీడీపీ సహకరిస్తుందా..? టీడీపీ ఆ పనిచేస్తే.. తాము మద్దతు ఇస్తామంటూ సవాల్ విసిరారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉంచుకోవాలా..? తెంచుకోవాలా..? అన్న దానిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీతో పాటు జగన్‌ని కూడా ఏకకాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో చూసి.. తలపండిపోయిన టీడీపీ అధినేతకు ఇదేమంత కష్టమైన పని కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   ఇందుకోసం మొదటగా మార్చి 5వ తేదీనే తన గేమ్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారట ఏపీ ముఖ్యమంత్రి. మార్చి 5వ తేదీ నుంచి చివరి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రానిపక్షంలో.. ఆ రోజే బీజేపీకి తొలి షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. మార్చి 5న టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే.. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి వైసీపీ కంటే ముందుగానే కేంద్రాన్ని ఒత్తిడిలో పడేసేందుకు చంద్రబాబు తెరవెనుక పావులు కదుపుతున్నారట.
ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని.. అవినీతిని ఎండగడతానని పార్టీ పెట్టిన సినీనటుడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఎన్నికలకు రెడీ అవ్వకపోవడం.. అభిమానులు తప్ప కార్యకర్తలు లేకపోవడంతో.. టీడీపీ-బీజేపీ తరపున ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి.. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో.. షూటింగ్‌లకు పెకప్ చెప్పేసి.. రాజకీయ రణరంగంలోకి దిగాడు. బస్సు యాత్రలు.. ఆ యాత్రలు చేస్తూ.. పొలిటికల్ లీడర్‌గా మారే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మేధావి వర్గం గానీ.. ప్రజలు కానీ కల్యాణ్ బాబుని.. పొలిటికల్ బాబుగా గుర్తించడానికి ఒప్పుకోవడం లేదు.   పార్టీని నిర్మించుకోవాల్సిన టైంలో సినిమాలు తీస్తూ.. జనసేనని గాలికొదిలేయడంతో పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అటకెక్కింది అనుకున్న ప్రత్యేకహోదా మళ్లీ తెరపైకి రావడంతో పవన్‌కి బాగా కలిసొచ్చింది. విభజన హామీల అమలులో ఎవరి తప్పు ఎంతుందో అందరి లెక్కలు తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ రాజకీయాలను వదిలేసిన వారిని, ఎవరికీ పట్టకుండా పోయిన మేథావుల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ఒక చోటు కూర్చొబెట్టాడు జనసేనాని.. నిజంగా ఇది మంచి ప్రయత్నమేనని.. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయవాదిగా మారుతున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఆ పొగడ్తలతో పాటు మరో రకం పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.   రాజకీయంగా ఎలాంటి నాలెడ్జ్ లేని పవన్ కళ్యాణ్.. జనసేనకు ఒక రూపం ఇవ్వలేక విమర్శలపాలవుతున్న పవన్ కళ్యాణ్‌.. జేఎఫ్‌సీలోని మేధావుల సాన్నిహిత్యంలో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జేపీ, ఉండవల్లి, ఎంవీఆర్ శాస్త్రి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇలా ఎవరిని కదిలించినా ఉద్ధండపిండాలే. ఇలాంటి వారి సలహాలు, సూచనలతో కల్యాణ్ రాజకీయంగా రాటుదేలే అవకాశం ఉందని.. దానిని ఆయన ఉపయోగించుకుంటే మంచిదేనంటున్నారు విశ్లేషకులు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. విజయవాడలో చంద్రబాబును కలిసి వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ.. రాజీనామా సమర్పించినట్టు ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు కూడా.. అంతకు పార్టీలు మారినవారంతా తమ తమ పదవులకు రిజైన్ చేయలేదు.. కానీ రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారని అందరూ ఆయనను అభినందించారు. కానీ.. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ కూడా రాజీనామా విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన తన రిజైన్‌ లెటర్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు కానీ.. స్పీకర్‌కు పంపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.   మరి ఇంత జరిగినా ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ముఖ్యం. రేవంత్ అనర్హత గురించి తెలుగుదేశం ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక కేసీఆర్‌ది ఇదే రకమైన పరిస్దితి.. తన అధికారం చెక్కుచెదరకుండా ఉండేందుకు.. ఎవ్వరూ తనకు పోటీకాకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను నామ రూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్. ఆ వ్యూహాంలో చాలా వరకు విజయం సాధించారు. అలా టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వారందరి చేత రాజీనామాలు చేయించలేదు. ఒకవేళ రాజీనామాలు చేయిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు 20 నుంచి 30 ఉపఎన్నికలు ఖాయం. ఈ తలనొప్పంతా ఎందుకని.. రేవంత్‌ విషయంలో ఎక్కడి వారక్కడే గప్‌చుప్ అంటోంది.   ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ కాంగ్రెస్. కొడంగల్‌లో హస్తం పార్టీ ఉపఎన్నికలకు వెళ్లిందే అనుకున్నాం.. కానీ అక్కడ కేసీఆర్ వదులుతాడా..? సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించైనా సరే.. రేవంత్‌ను అడ్డుకుంటాడు.. కాంగ్రెస్ గెలిస్తే మంచిదే. ఒకవేళ అటు ఇటైతే మాత్రం ఎన్నికల వేళ శ్రేణుల మానసిక స్థైర్యం దెబ్బతిన్నట్లే. ఉపఎన్నికల్లోనూ.. ఇటీవల ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. ఇంకేదైనా బైపోల్ వచ్చినా.. ఇదే రిజల్ట్ ఖాయమని సర్వేలు చెబుతున్న తరుణంలో.. కాంగ్రెస్ హైకమాండ్ సాహసం చేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. సో.. రేవంత్‌ను కదిపేవారు కానీ.. ఇదేంటని అడిగేవారు కానీ లేరని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
’పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయడు...‘ కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసే మాట.  ’కమలహాసన్ ఇక నటించడు...‘ యావత్ భారతావనే బాధతో నిట్టూర్చే మాట.  ’సూపర్ స్టార్ రజనీకాంత్... ఇక తెరపై కనిపించడు...‘ దేశవ్యాప్త తలైవా ఫ్యాన్సును విషాదంలో ముంచెత్తే మాట.  నిజానికి రాజకీయాల్లోకెళ్తే.. చేసే పనిని వదిలిపెట్టాలా? అలా అయితే... ఎన్టీయార్ ‘నా దేశం’ సినిమా చేసేవారు కాదే. అలా అయితే... ఎన్టీయార్ నుంచి ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర’ సినిమా వచ్చేది కాదే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదనేం రూల్ లేదు. అలాంటి రూలే ఉంటే... ముఖ్యమంత్రిగా ఉంటూనే  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ఎందుకు చేస్తాడు ఎన్టీయార్? ఓ వైపు ప్రతి పక్షనేతగా ఉంటూ.. మరో వైపు ఏకంగా సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాధ కవిసార్వభౌమ చిత్రాల్లో ఎందుకు నటిస్తారు?    ఎన్టీయార్ రాజకీయాల్లో ప్రవేశించిన కొత్తలో.. ప్రచారంలో ఉండగా చేసిన సినిమా ‘నాదేశం’. అప్పటి రాష్ట్ర పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ చేసిన సినిమా అది. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు ఆ సినిమా ఉపయోగపడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పవర్ స్టార్ చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘అజ్ఙాతవాసి’... ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసింది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తెరపై కనిపించబోయే సినిమాలు... రోబో2, కాలా.. ఇవి సమకాలీన సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు కావు. మామూలు కమర్షియల్ సినిమాలు. కమల్ విశ్వరూపం 2, భారతీయుడు 2 సినిమాలు చేస్తానంటున్నాడు     అసలు ఈ సూపర్ స్టార్లు ముగ్గురూ ఎన్టీయార్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? సామాజికాంశాలు మేళవించిన కథలను ఎంచుకొని... జనాల్లో చైతన్య దీపికలను వెలిగిస్తూ... ఓ వైపు నటులుగా.. మరో వైపు నాయకులుగా ఎందుకు ముందుకెళ్ల కూడదు? చేతిలో ఉన్న బలమైన ఆయుధమైన సినిమాను ఉపయోగించుకోవడం చాతకాని వీరు.. రేపు రాజకీయాలేం చేస్తారని చాలామంది అనుకుంటున్నారు.    సూపర్ స్టార్, వపర్ స్టార్ల రాజకీయ జీవితాలకు ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించే దర్శకులు కానీ.. రచయితలు కానీ ఇప్పుడు లేరా? అనే అనుమానాలను కూడా జనాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయార్ ‘నా దేశం’ స్థాయి సినిమాను తీసే దర్శక, రచయితలు నేడుంటే... దేశ రాజకీయ చిత్రాన్ని.. వెండితెర సాక్షిగా ఎండగట్టే సినిమాలు వీరిద్దరి నుంచి వస్తే... దేశ రాజకీయాల్లో వేడి మొదలవ్వడం ఖాయం. జనాల్లో కొత్త కదలక రావడం ఖాయం. దక్షిణాది సినిమాల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ మొదలవ్వడం ఖాయం.  ఏమంటారు ఫ్రెండ్స్. 
  2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వున్నాయా? దేశ రాజకీయాలను శాశించగల వ్యక్తులు చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి వ్యూహ రచన ఇప్పటికే ప్రారంభమైందా? తాజాగా జరిగిన పరిణామాలు ఇలాంటి సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మంగళవారం నాడు అమరావతిని సందర్శించారు. అమరావతిలో జరుగుతున్న పరిపాలన కార్యక్రమాలను చూసి ఆయన చంద్రబాబును అభినందించారు. ‘‘చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు ‘‘మరింత పెద్దహోదా’’లో వుంటే అద్భుత ఫలితాలు ఒనగూరుతాయి’’ అని ముకేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ముకేష్ అంబానీ భావిస్తున్న ‘‘పెద్ద హోదా’’ ప్రధానమంత్రి పదవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా దేశ రాజకీయాలను శాశించే శక్తి వున్న వ్యక్తి ముకేష్ అంబానీ... ఆయన నోటి వెంట వచ్చిన ఈ మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.   చంద్రబాబుకు ప్రధానమంత్రి సీటు మీద కూర్చోవాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. గతంలో  ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన ఎగిరి గంతేసి ప్రధాని కుర్చీ మీద కూర్చోలేదు. ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడమే తనముందు వున్న ఏకైక లక్ష్యమని అప్పట్లో ఆయన ప్రకటించారు. గత నాలుగేళ్ళుగా నవ్యాంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపించే పనిలో ఆయన తలమునకలుగా వున్నారు. నిధులు లేని రాష్ట్రం ఏ విషయంలోనూ వెనుకబడకుండా వుండేందుకు ఆయన తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతికి చిప్ప ఇచ్చి హైదరాబాద్ నుంచి తరిమేసిన ఆంధ్రులను గౌరవప్రద స్థానంలో నిలబెట్టడానికి తపిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కృషిని గమనించే ముకేష్ అంబానీ చంద్రబాబుకు ‘పెద్ద హోదా’ రావాలని భావించారేమో!   2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం మరోసారి లభిస్తే ఆయన ఈసారి దానిని సున్నితంగా తిరస్కరించరనే భావించవచ్చు. నిజంగానే చంద్రబాబు ఉండాల్సిన స్థాయి ప్రధానమంత్రి స్థాయే. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి చంద్రబాబు లాంటి ప్రధానమంత్రి అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను వ్యక్తం చేసి వుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కి ద్రోహం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రధానమంత్రి స్థానాన్ని చేపడితే అది ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేసే అంశం అవుతుంది. అందుచేత.. ఈసారి చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుందాం.
  మీకు ఏ ఐస్ క్రీం అంటే ఇష్టం అని అడిగితే ఠక్కున ఎదో ఒక ఫ్లేవర్ చెబుతాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనుక ఒక మనస్తత్వం దాగి ఉంది అంటే నమ్మగలరా. అయితే, కొన్ని రుచుల్ని మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే లింబిక్ లోబ్ అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=3gjAu3IVsr0  
  పిల్లల సమగ్రాభివృద్ధి- అంటే పది మందిలో చక్కగా మాట్లాడగలగాలి... బాగా చదువుకోవాలి... చలాకీగా ఉండాలి... అన్ని విషయాల్లో అవసరమయినంత పరిజ్ఞానం కావాలి. అయితే, పిల్లల్లో సమగ్రాభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగర్తలు వహించాల్సి ఉంటుంది అంటున్నారు డాక్టర్ చిట్టి విష్ణు ప్రియా గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=0ffOytXW6mw&t=125s  
ఎంత చదవాలనుకున్నా.. మీ మైండ్ డైవర్ట్ అవుతుందా..? మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏకగ్రతతో ఎలా ఉండాలి.. డాక్టర్ పూర్ణిమా నాగరాజ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=DAZ-yKYEQ4k  
ఈ మధ్య కాలంలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య పొట్టదగ్గర కొవ్వు పెరగడం. జనరల్ గా చెప్పాలి అంటే, మనకు పొట్ట ఎక్కువ ఉంది అంటే, మన శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంది అని అర్ధం. మరి సరయిన డైట్ తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు తగ్గించొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...  http:// https://www.youtube.com/watch?v=NIvG84ZDoHY  
డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఆహరం విషయంలో అతి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చిరు ధాన్యాలు సరయిన మోతాదులో తీసుకోవడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మిల్లెట్స్ డైట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=OnSe-wLn_XY