Publish Date:Nov 15, 2013

EDITORIAL SPECIAL
  మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో.. 1909 జూలై 15 న మధ్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు.  బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాలుపంచుకున్నారు. ఓ వైపు చదువుకుంటేనే మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. తన 12 ఏళ్ళ వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి.. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను నెలకొల్పారు. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఆమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను అనుమతించలేదు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరు సంపాదించారు. స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత.. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె 1975 లో పద్మ విభూషణ్ పొందారు. దుర్గాబాయి..1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
  పోలవరం ప్రాజెక్ట్ అసలు ఇప్పట్లో పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పోలవరం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వందల మంది కార్మికులు, భారీ యంత్రాలతో హడావుడిగా కనిపించే పోలవరం ప్రాంతంలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరద సీజన్‌ కాబట్టి డయాఫ్రంవాల్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా నిలిచిపోయాయి. స్పిల్‌వే వద్ద కాంక్రీటు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలలు వరదల ప్రభావం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా వస్తాయి. ఇలా కొంతకాలం ఈ పనులు పుంజుకునే అవకాశం లేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.55వేల కోట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఏమీ కేటాయించలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.వేల కోట్లు రావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రూ.కోట్లాది బిల్లులు పెండింగ్‌ పడడంతో కాంట్రాక్టు సంస్థలు మెల్లగా సర్దుకుంటున్నాయి. ఇంతకాలం మట్టి పనులు చేసిన త్రివేణీ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు పని నుంచి తప్పుకుంది. తన కంటైనర్లతోపాటు ఇతర ఎక్విప్‌మెంట్‌ను కూడా తరలించుకుని పోతోంది. ఈ సంస్థకు సుమారు రూ.70 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయట. దీనికంటే ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ కాఫర్‌ డ్యామ్‌ బెడ్‌ పనులు చేసి వెళ్లిపోయింది. ఆ సంస్థకు కూడా రూ.కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నవయుగ, మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాత్రమే ఉన్నాయి. వీటికి కూడా రూ.వందల కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు గత నెలలోనే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అథార్టీ ఆదేశాల మేరకు ఈ పనులు ఆపేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల మధ్య గోదావరిలో నిర్మించనున్న ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం, దానికి ఎగువ, దిగువ భాగాలలో కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేపట్టారు. 2.47 కిలోమీటర్ల పొడవు లక్ష్యంగా పెట్టుకుని రెండు కరకట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. అందులో గత నెల వరకూ 1.7 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇంతలో ఈ పనులు ఆపేయమని పీపీఏ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. దీనిని తర్వాత పూర్తి చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం వరదల వల్ల ఇంతవరకూ నిర్మించిన కాఫర్‌డ్యామ్‌ దెబ్బతినకుండా పీపీఏ ఓ డిజైన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రక్షణ చర్యలు చేపట్టారు. మరో వారం రోజుల్లో ఇవి పూర్తి కావచ్చని చెబుతున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలో 34 గ్రామాలకు వరద ముప్పు ఉందని, ప్రజలు ఆ గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస కాలనీలు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలని తటపటాయిస్తున్నారు. కొందరు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివెళ్లిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రతీ ఏటా వరదల వల్ల దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు మునిగిపోతుంటాయి. పడవ ప్రయాణమే శరణ్యం. కానీ ఈసారి గోదావరిలో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. ఇక్కడ గోదావరి వెడల్పు 2.45 కిలోమీటర్లు. గతంలో ఇంత వెడల్పున గోదావరి వరద నీరు కిందకు ప్రవహించేది. కానీ ఇప్పటికే 1.7 కిలోమీటర్ల కాఫర్‌ డ్యామ్‌ను గోదావరికి అడ్డంగా కట్టారు. సుమారు 25మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వైపు నదిలో కొంత భాగం వదిలేశారు. ప్రస్తుతం వరద నీరు కాఫర్‌ డ్యామ్‌ కట్టగా, మిగిలిన నదీ భాగం నుంచే కిందకు లాగవలసి ఉంది. ప్రస్తుతం పోలవరం వైపు పైపుతో నిర్మించిన వంతెన ద్వారా నదిని మళ్లించారు. కానీ గోదావరి వరద ఉధృతమైతే ప్రాజెక్టు వద్ద తక్కువ భాగంలో నుంచి మొత్తం నీరు లాగదు. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం అంటే పాపికొండల వైపు వరదనీరు ఎగదన్నే అవకాశం ఉంది. ఆయా గ్రామాలలో ఎక్కువ నీరు నిల్వ ఉండి, గ్రామాలలో జనం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చని ప్రజల ఆందోళన చెందుతున్నారు.
  తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న కేసీఆర్ అండ్ కోకి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? అంటే అవుననే అనిపిస్తోంది తాజాగా జరుగుతున్న పరిణామాలు. కేసీఆర్, జగన్ ల మధ్య దోస్తీ రహస్యం ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే కేంద్రం మాత్రం కేసీఆర్ ను నమ్మినట్లే నమ్మి సమయం కోసం వేచి చూసింది కార్యాచరణ మొదలుపెట్టిందని తెలంగాణాలో కేసీఆర్ ప్రభ అంతం చేయడానికి పూనుకుందని అంటున్నారు.  ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కి ఊపిరి ఆడనివ్వడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రజలకు ఏదో చేసేశామని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని కేంద్రానికి నివేదికలు వెళ్లాయి. అసలే ఎప్పుడు ఎంటర్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేద్దామా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్న బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని వదులుకోడానికి సిద్దంగా లేక తాజాగా ఐటీ దాడులు మొదలు పెట్టారు.  హైదరాబాద్‌లో మై హోం రామేశ్వర రావు ఇల్లు, కార్యాలయాలపై నిన్నన  ఉదయం 7 గంటల నుంచి ఐటీ అధికారులు దాడులు చేశారు. నంది నగర్‌లోని ఆయన నివాసం, హైటెక్ సిటీలో ఉన్న ఆఫీసుల్లో సుమారు 200 మంది అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. చానెళ్ళ మీద చానెళ్ళు కొంటూ మీడియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ అండతో భూదందా చేసి వేలకోట్ల ఆస్తులు కూడగట్టి పెద్ద మాఫియాగా తయారైన రామేశ్వరావుకి అవేమీ కాకుండా అనవసరంగా కావాలని కొన్న లావాదేవీలు మెడకు చుట్టుకొని కేంద్రానికి అదే ఆయుధంగా మారింది.  అదీకాక మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర రావు టీఆర్‌ఎస్ పార్టీకి ఇటీవల రూ.3000 కోట్ల ధనాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రామేశ్వర రావుతో పాటు మరో వ్యాపారవేత్త శ్రీనిరాజు హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాల భూమిని 20% శాతం ధరకే దక్కించుకున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది. రైతులకు చెందిన భూములను ఉదారంగా కట్టబెట్టినట్లు కొంత మంది ఆరోపిస్తున్నారు.  అయితే నిన్నజరిగిన సోదా మాత్రం టీవీ9 సంస్థలోకి హవాలా మార్గం ద్వారా రామేశ్వర రావు రూ.220 కోట్లను తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అని అంటున్నారు. టీవీ9 సంస్థను రామేశ్వర రావు స్వాధీనం చేసుకోవడం, ఛానెల్ నుంచి రవిప్రకాశ్‌ను తప్పించడం వెనుక తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే రవి ప్రకాష్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
  Cast: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh, Satyadev & others Producers: Puri Jagannadh, Charmy Kaur Music Director: Mani Sharma Cinematographer: Raj Thota Story, Screenplay & Direction: Puri Jagannadh Release Date: July 18th 2019 After “Temple”, director Puri Jagannadh does not have any notable hits. On the other hand, Ram does not have any hits after the movie “Nenu Sailaja”. So both Puri Jagannadh & Ram are looking for a hit with the movie Ismart Shankar. How is the movie? Lets read the review. Story: Sitar Shankar (Ram) is a rowdy settled in Hyderabad. He kills a politician names Kasi & then the police start their chase for Shakar. Shankar escapes with his girlfriend (Nabha Natesh). Meanwhile a police’s memory is transplanted to Shankar. Why is that done? What is the link between Shankar & the police? How does Shankar become Ismart Shankar? Answer to all this questions forms the movie Ismart Shankar. Analysis: Inspired by the Hollywood’s criminal, Puri Jagannadh has taken the concept of brain transplantation & written the movie Ismart Shankar. So is the movie copied from Hollywood? Well the movie does not have anything new. This is purely a commercial film by Puri. Leaving the brain transplant concept aside, Puri has as-usual concentrated on the heroines. Music by Mani Sharma is very good. Plus Points: Ram Dance, Energy Nabha, Nidhi Beauty Mani Sharma Music & background music Minus Points: Puri Direction Routine scenes Ram’s Telangana accent Performances: After a long time Ram has done this mass character. He has done it with energy. His Telangana accent is bad. His dance is just too good. Another set of people will watch the movie more than once just to see the heroine’s beauty. All the others have done their part well. TeluguOne Perspective: Whatever may be the concept & whatever may be the story, may be Puri’s mark will not change. This is just a routine commercial cinema which can be enjoyed by only one set of people. Rating: 2/5
కాంట్ర‌వర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది అమలాపాల్. ఆమెకు వివాదాలు కొత్తేం కాదు. ఇక తాజాగా న‌టించిన `ఆమె` చిత్రంలో అమ‌లాపాల్ నగ్నంగా న‌టించింది. ఆమె పోస్ట‌ర్స్, ట్రైల‌ర్స్ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ ఇప్ప‌టికే చాలా రోజుల నుంచి వివాదంగా మారాయి. అయితే అమలా పాల్ మాత్రం `వాటిని స‌మ‌ర్థించుకుంటోంది. క‌థ‌లో భాగంగానే అలా న‌టించాను త‌ప్ప మ‌రో విధంగా కాదు. మీరు సినిమా చూస్తూ అలా ఎందుకు న‌టించాల్సి వ‌చ్చిందో మీకు అర్ధ‌మ‌వుతుంది అంటూ చెప్పుకొస్తోంది. కానీ అలా న‌గ్నంగా న‌టించ‌డం చాలా మంది వ్య‌తిరేఖిస్తున్నారు. ఆ న‌గ్న దృశ్యాలు, చిత్ర ప్ర‌చార చిత్రాలు, పోస్ట‌ర్స్ సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇచ్చేలా ఉన్నాయి కాబ‌ట్టి, ఆమె సినిమాను నిలిపేయాల‌ని త‌మిళ‌నాడులోని ఓ మ‌హిళ పోలీసు అధికారుల‌కు ఫిర్యాదు  చేసింది. ఆ సినిమా పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే మేము ఆందోళ‌న‌లు చేయాల్సివ‌స్తుందంటూ కూడా హెచ్చ‌రించార‌ట‌. సెన్సార్ జ‌రిగింది కాబ‌ట్టి సినిమా రేపు రిలీజ్ వి ష‌యంలో ఎలాంటి డోకా లేదు అంటున్నారు సినీ జ‌నాలు. రిలీజ్ అయ్యాక ఎలాంటి వ్య‌తిరేఖ‌త ఎదురువుతుందో అన్న‌ది ఆమె చిత్ర యూనిట్ మొద‌లైంది.
ఓ వేదిక మీదో, ఓ ఫంక్ష‌న్ లోనో, మ‌రే ఇత‌ర కార్య‌క్ర‌మాల్లోనో ఓ జంట  ప‌దే ప‌దే క‌నిపిస్తూ...కొంచెం చ‌నువుగా ఉంటున్నారంటే  చాలు ..ఇక మ‌న‌కు అనుమానాలు, ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు మొద‌ల‌వుతుంటాయి. ప్ర‌స్తుతం అలాంటి ద‌శ‌లోను ఉంది టాలీవుట్ లో ఓ జంట‌. `గీత గోవిందం` చిత్రం లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న క‌లిసి న‌టించారు.ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇద్ద‌రూ పోటీప‌డి న‌టించ‌డ‌మే కాదు..ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కూడా కుదిరిందంటూ రివ్యూస్ వ‌చ్చాయి. గీత గోవిందం త‌ర్వాత `డియ‌ర్ కామ్రేడ్ లోనూ విజ‌య్, ర‌ష్మిక క‌లిసి న‌టించారు. ఈ సినిమా ఇక విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగం ఈ జంట కొచ్చి, బెంగుళూరులో హ‌డావిడి చేసింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య మరింత చ‌నువు పెరిగింది. ఆ చ‌నువుని అనువుగా తీసుకుని ఇప్పుడు సోష‌ల్ నెట్ వ‌ర్క్స్ లో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్నన్యూస్ మొద‌ల‌య్యాయి. విజ‌య్ మాత్ర‌మే కాకుండా ర‌ష్మిక గా కూడా చ‌నువు కాస్త ఎక్కువ‌గానే తీసుకోవ‌డం వ‌ల్ల అంద‌రూ ఇప్పుడు అయ్య‌బాబోయ్ ఏంటిది అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇక ఆ మ‌ధ్య ర‌ష్మిక నిశ్చితార్థం ఆగిపోవ‌డం వెన‌కాల విజ‌య్ కూడా ఓ  కార‌ణం అంటూ ఆ మ‌ధ్య వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇక ప్ర‌తి విష‌యంలో విజ‌య్, ర‌ష్మ‌క‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నాడు. త్వ‌ర‌లో త‌న `రౌడీ వేర్ ` నుంచి లేడీస్ క్లాత్స్ కూడా రానున్నాయ‌ట‌. దీనికి ర‌ష్మిక బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉంటూ ...వాటిని ఆమె చేత ప్ర‌మోట్ చేయించ‌డ‌మే కాకుండా..ఆమెతో త్వ‌ర‌లో ఆ బ‌ట్ట‌లు లాంచ్ చేయించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇది కార్య‌రూపం దాల్చిందంటే టాలీవుడ్ లో ఈ జంట హాట్ టాపిక్ అవ‌డం ఖాయం అంటున్నారు సినీ జ‌నాలు. చూద్దాం  ఎలా ఉంటుందో మ‌రి.
  చిత్రం : ఇస్మార్ట్ శంకర్ బ్యానర్ : పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ నటీనటులు: రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను పాటలు: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం: మణిశర్మ నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్ విడుదల తేదీ: 18 జూలై 2019 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్‌కి హిట్ లేదు (స్వయంగా పూరి నోట వచ్చిన మాట). అటు 'నేను శైలజ' తర్వాత రామ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. వీరిద్దరూ కలిసి హిట్ కోసం చేసిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఎలా ఉంది? రివ్యూ చదవండి. కథ: హైద‌రాబాద్‌లో ఓ రౌడీ షీటర్ శంకర్ (రామ్). లైఫ్ సెటిల్ అవుతుందంటే రాజకీయ నాయకుడు కాశీ (పునీత్ ఇస్సార్)ను చంపేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులో సబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత శంక‌ర్‌కు తన ప్రేయసి (నభా నటేష్) బదులు సైంటిస్ట్‌ సారా (నిధి అగర్వాల్) ఎందుకు గుర్తుకు వస్తుంది? అసలు, కాశీ మరణానికి కారణం ఎవరు? అనేవి తెలియాలంటే సినిమా చూడాలి. విశ్లేషణ: హాలీవుడ్ 'క్రిమినల్' స్ఫూర్తితో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ కాన్సెప్ట్ తీసుకుని పూరి జగణనాథ్ 'ఇస్మార్ట్ శంకర్' కథ రాశారు. తను రాసే ప్రతి కథకు, తన ప్రతి చిత్రానికి స్ఫూర్తి హాలీవుడ్ చిత్రాలేనని 'ఇస్మార్ట్ శంకర్' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి చెప్పారు. అందువల్ల, హాలీవుడ్ సినిమాకు కాపీనా? కాదా? అనేది పక్కన పెట్టి, 'ఇస్మార్ట్ శంకర్' ఎలా ఉన్నాడని చూస్తే... కాస్త కూడా కొత్తగా లేడు. ఇదొక రొటీన్ కమర్షియల్ పూరి మార్క్ సినిమా. రామ్ క్యారెక్ట‌రైజేష‌న్‌లో పూరి గత సినిమాల్లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్లు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే... డైలాగుల్లో డోసు పెరిగింది. ఫైట్స్, సీన్స్ రొటీన్‌గా... పూరి గ‌త సినిమాల్లో ఉన్న‌ట్టున్నాయి. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ కాన్సెప్ట్ కంటే ఇద్దరు భామలు నిధి, నభా స్కిన్ షోపై పూరి ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్లు అందాలు దాచుకోవడం కంటే అందరికీ చూపించడంపై ఆసక్తి చూపించారు. వాళ్ల నటన కంటే అందాలే అందరినీ ఆకర్షిస్తాయి. ఇక, రామ్ తెలంగాణ యాస అయితే వినడానికి కష్టంగా ఉంది. అదే అసలైన తెలంగాణ యాస, పోనీ హైదరాబాదీ యాస అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. దర్శకుడిగా పూరి వైఫల్యాన్ని కప్పి పుచ్చడానికి మణిశర్మ మ్యాగ్జిమ‌మ్‌ ప్రయత్నించాడు. క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాకు తగ్గట్టు మాసీ పాటలు ఇచ్చాడు. మెలోడీ సాంగ్ 'ఉండిపో' కూడా బావుంది. నేపథ్య సంగీతంతో హీరోని, సినిమాను ఎలివేట్ చేయ‌డానికి ప్రయత్నించాడు. పాటల పిక్చ‌రైజేష‌న్‌ బావుంది. ప్లస్ పాయింట్స్: రామ్ డ్యాన్సులు, ఎనర్జీ   నభా, నిధి స్కిన్ షో మణిశర్మ స్వరాలు, నేపథ్య సంగీతం   మైనస్ పాయింట్స్: పూరి దర్శకత్వం రొటీన్ సీన్స్ రామ్ తెలంగాణ యాస నటీనటుల పనితీరు: రామ్ ఇటువంటి మాస్ క్యారెక్టర్ చేసి చాలా రోజులైంది. హుషారుగా చేశాడు. తెలంగాణ యాస ఒక్కటే బాగోలేదు. పాటల్లో మాస్ స్టెప్పులు ఇరగదీశాడు. ఓ వర్గం ప్రేక్షకులు హీరోయిన్లు అందాలు చూడటం కోసం మరోసారి వెళితే తప్పు లేదు. అంతలా చూపించారు మరి. షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి తదితరుల నటన, పాత్రలు రొటీనే. సత్యదేవ్ తన పాత్ర వరకూ బాగా చేశాడు.    తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: కథ ఏదైనా.. కాన్సెప్ట్ ఏదైనా... పూరి జగన్నాథ్ రాత, తీత ఇలాగే ఉంటుందని, మారదని 'ఇస్మార్ట్ శంకర్' చూసి అనుకోవాలేమో! సినిమాలో హీరో మారాడు గానీ... పూరి టేకింగ్, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ మారలేదు. మళ్లీ మళ్లీ అవే సన్నివేశాలు చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు సినిమాకు వెళ్లొచ్చు. లేదంటే ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఇదొక మార్క్ రొటీన్ కమర్షియల్ సినిమా. పూరి జగన్నాథ్ వీరాభిమానులు, అరివీర భయంకర మాస్ ప్రేక్షకులకు మాత్రమే. రేటింగ్: 2/5
టాలీవుడ్ యాంగ్రీ హీరో ఎవ‌రంటే వెంట‌నే మ‌నం రాజశేఖ‌ర్ అని చెబుతాం. అందుకు ఆయ‌న చేసిన అంకుశం,  ఆగ్ర‌హం, మ‌గాడు, అహంకారి, అంగ‌ర‌క్ష‌కుడు లాంటి  సినిమాలు ఉదాహ‌ర‌ణ‌లు. ఇలాంటి క్ర‌మంలో కె.రాఘ‌వేంద్ర‌రావు `అల్ల‌రి ప్రియుడు` లాంటి ఓ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ రాజ‌శేఖ‌ర్ తో చేసి సూప‌ర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఇక కొంత కాలం వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డ్డ రాజ‌శేఖ‌ర్ తో ప్రవీణ్ స‌త్తార్ `పియ‌స్వీ గ‌రుడ‌వేగ‌` చిత్రం చేసాడు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీస‌ర్ గా న‌టించాడు. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో , ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క  ప్ర‌తిభ‌తో  మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లో కి వ‌చ్చాడు రాజ‌శేఖ‌ర్‌. ఇటీవ‌ల చేసిన `క‌ల్కి`లో కూడా రాజ‌శేఖ‌ర్ న‌టుడుగా  త‌న స్టామినా ఎంటో మ‌రో సారి నిరూపించాడు. ఇక ఇదిలా ఉంటే  రాజ‌శేఖ‌ర్ త‌దుప‌రి  సినిమా ఏ ద‌ర్శ‌కుడితో ఉంటుంది? అని ఆరా తీయ‌గా ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే... అల్ల‌రి న‌రేష్ తో `అహ‌నాపెళ్లంటా`, సునీల్ తో `పూలరంగ‌డు`  చిత్రాలు చేసి హాస్య‌భ‌రిత‌మైన  చిత్రాలు చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు అనిపించుకున్న వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ త‌న తదుప‌రి సినిమా చేయ‌నున్నాడ‌ట‌. నాగార్జున‌తో భాయ్‌, ఆది సాయికుమార్ తో `చుట్టాల‌బ్బాయి` చేసి త‌ను హాస్య‌మే కాదు, యాక్ష‌న్ చిత్రాలు కూడా చేయ‌గ‌ల‌డు అనిపించుకున్న  వీర‌భ్ర‌మ్ మ‌రి యాంగ్రీ హీరో  రాజ‌శేఖ‌ర్ తో ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఇప్పుడు అంద‌ర్నీ మెదులుతోన్న  ప్ర‌శ్న‌. గ‌రుడ‌వేగ‌, క‌ల్కి రెండు సీరియ‌స్ యాక్ష‌న్ చిత్రాల‌తో మెప్పించిన యాంగ్రీ హీరో ఈసారి కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నాడా? అస‌లు  ద‌ర్శ‌కుడు వీర‌భద్ర‌మ్ ఎలాంటి స్క్రిప్ట్ తో ఈ సినిమా చేయ‌బోతున్నాడు? ఆ సంగ‌తుల‌న్నీ తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.
  అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ.. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కొంది. అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని.. పతనం దిశగా అడుగులు వేసింది. ఫిరాయింపుల విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి. ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటుంది అంటూ గోల చేసిన టీడీపీ.. తీరా ఏపీలో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నేతలను పార్టీలో చేర్చుకొని విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు ఫిరాయింపు నేతలకు పదవులు కట్టబెట్టి ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న నేతల్లో అసంతృప్తిని కలిగించింది. తమ మీద పోటీ చేసిన నేతలు, ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ మీదే పెత్తనం చెలాయించడం వారు తట్టుకోలేకపోయారు. ఈ ఫిరాయింపుల వల్ల కార్యకర్తల్లో కూడా అసహనం పెరిగింది. మొన్నటివరకు తమ నాయకులను, తమ పార్టీని తిట్టిన వారికి.. ఇప్పుడు తాము జై కొట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు ఈ ఫిరాయింపులను వైసీపీ అస్త్రంగా మలుచుకొని ఈ విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మొత్తానికి ఫిరాయింపులు కూడా ఓ రకంగా టీడీపీ ఓటమికి కారణమయ్యాయనే చెప్పాలి.
  ఏపీ సీఎం కావడానికి జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఆయన చేపట్టిన పాదయాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. ఆయన ప్రజల్లో మమేకం అవ్వడానికి ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలో ఆయన బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ ‌కూడా ఈ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని నింపి తన అనుభవం కూడా పెంచుకునే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.  అయితే అది జగన్ మాదిరి సుదీర్ఘ పాదయాత్ర కాకుండా విడతల వారీగా యాత్ర చేయాలనీ చినబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టిడిపి ఒకపక్క అధికార పార్టీ దాడులతో, మరోపక్క బీజేపీలోకి ఫిరాయింపులతో ఊపిరి సలపలేకుండా పోతోంది. బాబు వల్ల కూడా కావడం లేదని, ఇక టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కొందరు, లేదు బాలయ్య అండర్ లోకి వెళ్ళాలని మరి కొందరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.  మరోపక్క అధికార పాఖం లోకేష్ కి పప్పు అనే నిక్ నేమ్ జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపధ్యంలో తనపై జరిగిన దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి లోకేష్ సంసిద్ధమవుతున్నారని అంటున్నారు. గత 2004 ఎన్నికల ముందు వైఎస్ పాదయాత్ర 2014 ఎన్నికల ముందు అంటే 2012లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. మొన్న  2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. దీంతో పాదయాత్ర చేసిన వారు అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఏర్పడింది.  అందుకే ఇప్పుడు చిన బాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.  అయితే వారు చెబుతున్న ఈ విడతల వారీ పాదయాత్ర అనేది సరయిన ఫలితాన్ని ఇవ్వదేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత వైఎస్ జగన్ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన శుక్రవారం అవగానే పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఈయనకి అలాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా ఎందుకు ఈ బ్రేక్ ఇస్తున్నారో లోకేష్ కే ఎరుక ! అదీ కాక ముచ్చటగా మూడు నెలల పాలన కూడా చూడకుండా ఇప్పుడే దాడి మొదలు పెడితే అది సత్ఫలితాన్ని ఇస్తుందా లేదనా అనే విషయం మీద కూడా తర్కించాల్సిన అవసరం ఉంది.      
  విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి అనుభవమున్న చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ఏపీ ప్రజలు భావించారు. అందుకే ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లో బాబుకి పట్టంకట్టారు. కానీ బాబు చేసిన కొన్ని తప్పుల మూలంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. గత ఐదేళ్లల్లో బాబు చేసిన తప్పుల్లో దుబారా ఖర్చు ప్రధానమైనదని చెప్పవచ్చు. నూతన రాష్ట్రం, రాజధాని లేదు, లోటు బడ్జెట్.. ఇలా ఎన్నో సమస్యలున్న వేళ సీఎం అయిన బాబు.. అనసరంగా హంగు ఆర్భాటాలకు పోయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రమాణ స్వీకారంతో మొదలైన దుబారా.. బాబుని ప్రతిపక్షానికి సాగనంపేలా చేసింది. అసలే లోటు బడ్జెట్ అంటే కోట్లు ఖర్చుతో ప్రమాణ స్వీకారం చేసారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని భవనాల మరమత్తులు, ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. తీరా కొద్ది నెలలు కూడా ఉండకుండానే అమరావతికి మకాం మార్చారు. అక్కడ తాత్కాలిక భవనాలకు కోట్ల ఖర్చు. వీటికితోడు విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు. ఇక నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు సరేసరి. దీక్ష అంటే ఓ టెంట్ వేస్తే సరిపోతుంది. కానీ బాబు దీక్షలు మాత్రం.. భారీ స్టేజ్, చుట్టూ క్లాత్ డెకరేషన్, ఏసీలు అబ్బో ఇలా మాములు హడావుడి కాదు. బాబు అనుభవం కొత్త రాష్ట్రానికి ఎంతలా ఉపయోగపడింది అనే దానికంటే.. బాబు చేసిన దుబారా అప్పటి విపక్ష వైసీపీకి మాత్రం మంచి అస్త్రం అయిందనే చెప్పాలి. బాబు దుబారాను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత మొదలై, అది ఎన్నికల్లో ఓడించే వరకు వెళ్లిందనే చెప్పాలి.
  ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎక్కడైనా నాయకులు పార్టీ మారుతున్నారు అంటే అది అధినేతకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి పార్టీలో చేరి పాత అధినేత మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. కానీ ఏపీలో మాత్రం పార్టీ మారుతున్నామని పార్టీ అధినేత దగ్గరకి వెళ్లి మరీ చెప్పి వస్తున్నారు. ఈ వింత పరిస్థితి తెలుగు దేశం పార్టీలో నెలకొంది. గత ఎన్నికల ముందు వరకూ మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు ఏపీలో అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు.  దానికి తోడు గత ప్రతిపక్షం ఎక్కడ తమను టార్గెట్ చేస్తుందో అనే భయంలో ఉన్న్నారు. ఇక వ్యాపారాలు ఉన్న నేతల సంగతి వర్ణనాతీతం. అందుకే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇప్పాతికే ఆ పార్టీ నుండి నలుగు ఎంపీలు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళగా ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. సీనియ‌ర్ నాయకుడు ప్రస్తుతం టీడీపీ నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది !  రెండు మూడు రోజుల్లో రాయ‌పాటి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నట్లు స‌మాచారం. రాయ‌పాటి బీజేపీలో చేర‌టం ద్వారా ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలో ఉన్న అనుచర వ‌ర్గం మొత్తంగా బీజేపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీని పైన రాయ‌పాటి ఒక‌టి రెండు రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని అంటున్నారు. ఈ చేరికల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ మాధవ్ రాయపాటి ఇంటికి వచ్చి తమ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.  కొద్ది రోజుల్లోనే తాను ఢిల్లీ వస్తానని... అక్కడ మరిన్ని విషయాలు మాట్లాడతానని రాయపాటి రామ్ మాధవ్‌కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సైతం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనతో బీజేపీ దూత వచ్చి పార్టీలోకి రావాలని కోరిన విషయాన్ని రాయపాటి సాంబశివరావు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని టాక్.  ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతో పాటు పోల‌వ‌రం సమస్యలను వివరించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాల్సిన ఆవశ్యకత గురించి వివరించినట్లు సమాచారం. పోల‌వ‌రం నిర్మాణం మీద ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నిపుణుల క‌మిటీ వేయ‌టం..రివ‌ర్స్ టెండ‌రింగ్ దిశ‌గా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఆ కాంట్రాక్ట్ చేస్తున్న తను మ‌రింత‌గా ఆర్దికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని చెప్పారట. ఈ నేపధ్యంలో రాయ‌పాటి టీడీపీ వీడి బీజేపీలో చేరటం ఖాయ‌మైందని అంటున్నారు.  
  అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. సభలో టీడీపీ సభ్యుల సంఖ్య తక్కువే అయినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాధవ నాయుడు సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీలోకి వెళతారని కొద్దిరోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.  అయినా సరే ఆయన జగన్ పాలన చేపట్టిన నాటి నుండే సైలెంట్ అయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు జగన్ పాలనపై కాస్తో కూస్తో ఆరోపణలు చేసినా, టీడీపీపై జరుగుతున్న దాడులపై అసహనం ప్రదర్శించినా గంటా మాత్రం చాలా సైలెంట్ గా చూస్తున్నారు. ఒకపక్క ఆయన వైసీపీలో చేరేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారని, అయితే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అడ్డు పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.  ఇంతకీ గంటా సైలెన్స్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన సీఎం జగన్ గతంలో టిడిపి హయాంలో చేసిన అవినీతిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు అవినీతి పుట్టలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అవినీతి చేసి కాస్తో కూస్తో వెనకేసుకున్న నాయకులలో టెన్షన్ మొదలైంది. అందులో భాగంగా ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టే పనిలో జగన్ సర్కార్ ఉన్నట్లుగా సమాచారం.   గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలో భూ దందాలు విపరీతంగా జరిగాయని ,విశాఖ భూ కుంభకోణం లో ఉన్నది టిడిపి నేతలేనని అప్పట్లో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది.  ఇక ఇప్పుడు జగన్ విశాఖ భూ కుంభకోణాన్ని బయటకు లాగి కుంభకోణానికి కారణమైన బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.విశాఖ భూకుంభకోణం పై సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశించటంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు, గంటా వర్గానికి టెన్షన్ పట్టుకుంది. అందుకే గంటా సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. నిజానికి సొంత మంత్రులే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో అప్పటి బాబు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.  ఈ సిట్ బృందం పలు కోణాల్లో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఎన్నికల దెబ్బకి ఈ విషయం మరుగున పడింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గంటా ఈ వ్యవహారంలో ఏం చెయ్యాలో అర్ధం కాక సమావేశాలకి కూడా సరిగా రావడం లేదని అంటున్నారు.   
  రాష్ట్ర విభజన అనంతరం సుమారు ఐదేళ్ళ తర్వాత ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించారు. ఇక ఇప్పుడు తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను తెలంగాణకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2009 నుండి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ని కూడా ఏక్షణంలోనైనా మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నా గత ప్రభుత్వం ముందే రాజధానిని అమరావతికి తరలించింది నెమ్మదిగా హైకోర్టు విభజన కూడా పూర్తిచేశారు.  మొన్న జగన్ చొరవతో ఆంధ్రా బిల్డింగ్స్ కూడా తెలంగాణకు ఇచ్చేయగా, సచివాలయంలో ఆంధ్రకు చెందిన బ్లాక్‌లను కూడా తెలంగాణకు కేటాయించారు. ఇక తాజాగా ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ కూడా పోయి.. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌లు వచ్చారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై చట్టంలో ప్రత్యేకంగా ‘సెక్షన్‌ 8’ను పొందుపరిచారు. సెక్షన్‌-1(7) లో ఉమ్మడి గవర్నర్‌ ప్రస్తావన ఉండగా ఆ తర్వాత సెక్షన్‌-1 (8)(1)లో రాజధానిలో గవర్నర్‌ అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి.  సెక్షన్‌-8లో ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం ప్రజల రక్షణ, ఆస్తులను కాపాడే అధికారం గవర్నర్‌కు అప్పగించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వ భవనాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం వంటి బాధ్యతలను గవర్నర్‌కు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ నియామకం నేపథ్యంలో నరసింహన్ పదవీకాలం కూడా ముగిసినట్లే అనే ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ళ క్రితం ఆయన గవర్నర్ గా తప్పుకుని కేంద్ర హోం శాఖకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఏమి జరగనుందో వేచి చూడాలి ?  
పూర్వం చైనాలో లిలి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి తనకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ, లిలికి ఆమె అత్తగారంటే పడేది కాదు. ఏదో ఒక విషయంలో వారిద్దరూ నిరంతరం గొడవపడుతూనే ఉండేవారు. పైగా భర్త కూడా తల్లి మాటలలో నిజం ఉందని తేల్చడంతో లిలి అహం తరచూ దెబ్బతినేది. అత్తగారు లిలిని ఏదో ఒక విషయంలో సరిదిద్దేందుకు ప్రయత్నించడం, దానికి లిలి ప్రతిఘటించడం వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కొన్నాళ్లకి లిలి విసిగివేసారిపోయింది. ఎలాగైనా సరే తన అత్తగారి పీడను వదిలించుకోవాలని అనుకుంది. అందుకు తగిన మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా, తన కుటుంబ స్నేహితుడైన ఒక వైద్యుడు గుర్తుకువచ్చాడు. ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి తన క్షోభ అంతా వెళ్లగక్కింది లిలి. ఎలాగైనా ఏదో ఒక మందు ఇచ్చి తన అత్తగారి పీడని వదిలించమని వేడుకొంది. లిలి మాటలు విన్న పెద్దాయన కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత తన ఇంటి వెనుక ఉన్న గదిలోకి వెళ్లి, ఒక మందు సీసాతో తిరిగివచ్చాడు. ‘‘చూడు! ఇది మనుషులను నిదానంగా చావుకి చేరువచేసే మందు. మీ అత్తగారికి అనుమానం రాకుండా రోజూ ఆమె తినే తిండిలో కలుపుతూ ఉండు. ఒక మూడు నెలల నుంచి ఈ మందు తన ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఆర్నెళ్లు తిరిగేసరికల్లా మీ అత్తకి ఆఖరి ఘడియలు ముంచుకొస్తాయి. కాకపోతే ఒక్క విషయం! మీ అత్త చావుకి కారణం నువ్వే అన్న అనుమానం ఎవ్వరికీ రాకుండా ఉండాలి. అందుకోసం నువ్వు ఆమెతో ప్రేమగా ఉంటున్నట్లు నటించాలి,’’ అంటూ ఆ మందు సీసాని లిలి చేతిలో ఉంచాడు వైద్యుడు. అర్నెళ్లు తిరిగే సరికి తన అత్త తన జీవితంలో ఉండదన్న సంతోషంతో పొంగిపోతూ లిలి ఇల్లు చేరుకుంది. ఆ రోజు నుంచి తన అత్తతో ప్రేమగా ఉంటూ కొంచెంకొంచెంగా ఆ విషాన్ని ఆమె ఆహారంలో కలపసాగింది. రోజులు గడిచేకొద్దీ ఆమె చూపించే అనురాగానికి అత్త లొంగిపోయింది. లిలిలాంటి కోడలు తనకి దొరకడం అదృష్టమంటూ ఊరూవాడా చెప్పుకొని తిరిగేది అత్త. లిలి మనసులో కూడా అత్త పట్ల అనురాగం మొదలైంది. ఆమెని చూస్తుంటే చనిపోయిన తన తల్లి గుర్తుకురాసాగింది. అలా ఓ మూడు నెలలు గడిచేసరికి, ఆమెను తన చేతులతో చంపుతున్నానన్న విషయాన్ని సహించలేకపోయింది లిలి. వెంటనే ఆ వైద్యుడి దగ్గరకు పరుగులెత్తింది. ‘‘ఏదో మొదట్లో నేనూ మా అత్తా గొడవపడిన మాట నిజం. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె నా మంచి కోసమే విమర్శించేదని తెలిసొచ్చింది. నేను ప్రేమగా ఉండేసరికి మా అత్త కూడా నాలో లోపాలను వెతకడం మానివేసింది. దయచేసి ఇన్నాళ్లూ నేను ఆమెకు పెట్టిన విషానికి విరుగుడు మందుని ఇవ్వండి,’’ అంటూ వైద్యుని ప్రాధేయపడింది లిలి. వైద్యుడు చిరునవ్వుతో- ‘‘నేను నీకిచ్చిన మందులో విషం లేనేలేదు. విషం ఉన్నదల్లా నీ మనసులోనే. ఆ విషానికి విరుగుడు స్నేహం, సహనం అని నాకు తెలుసు. ఆ విషయాన్ని నీకు తెలిసేలా చేసేందుకు ఈ నాటకం ఆడాను. నీలో ఎప్పుడైతే ప్రేమ కనిపించడం మొదలైందో... అది నీలోనూ, నీ అత్తగారిలోనూ ఉన్న ద్వేషాన్ని జయించింది. వెళ్లి నీ అత్త, భర్తలతో హాయిగా ఉండు,’’ అంటూ పంపించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)
  ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.
  అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.
  తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ అత్తి వరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులకు గాయాలు కావడంతో కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల్లో ఏపీకి చెందిన మహిళ కూడా ఉంది. అత్తి వరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 48 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 18వ రోజైన గురువారం శ్రవణా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ క్రమంలో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. నలుగురు మరణించారు. వీరిలో గుంటూరుకు చెందిన నారాయణమ్మ అనే మహిళ కూడా ఉన్నారు. కాగా ఈ ఆలయానికి విశిష్టత ఉంది. 40 ఏళ్ళకు ఒకసారి అత్తి వరదరాజ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. వరదరాజ స్వామి ని 40 ఏళ్ళకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన వరదరాజ స్వామి.. ఈ సంవత్సరం జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు దర్శనం ఇవ్వనున్నారు. 40 ఏళ్ళకు ఒకసారి మాత్రమే స్వామి దర్శనం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం భక్తుల రద్దీ మరింత పెరగడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆలయ రద్దీ దృష్ట్యా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని గర్భిణులకు, వృద్ధులకు స్థానిక కలెక్టర్‌ సూచించారు.
  వైసీపీ ప్రభుత్వంలో అప్పుడే వాటాల బాగోతం మొదలైందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ఇసుక కోసం వైసీపీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొట్టుకునే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, గుమ్మడి సంధ్యారాణితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ తన రౌడీయిజాన్ని నెల్లూరులో చూపించుకోవాలని రాజేంద్రప్రసాద్‌ హితవు పలికారు. బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రౌడీల మాదిరిగా మండలిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగి, అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. క్యూసెక్కుకు, టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి జలవనరుల శాఖ మంత్రి అంటూ అనిల్‌ కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
  తెలుగు బుల్లితెరపై గత రెండు సీజన్లుగా విజయవంతం అయిన 'బిగ్ బాస్' షో తాజాగా మూడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. అయితే మూడో సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు షో పేరుతో లైంగిక వేధింపులకు పాలపడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై బిగ్ బాస్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ వివాదం ఢిల్లీకి చేరింది. శ్వేతారెడ్డి, గాయత్రీగుప్తా తమకు ఎదురైన అనుభవాలను ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా తమ ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జత చేశారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ వివాదం దేశ రాజధానికి చేరింది.
  ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డు మీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లన్నీ మోటర్‌ సైకిళ్లతో నిండిపోయాయి. ఒళ్లు అలవకుండా ఉండేందుకో, ప్రతిష్ట కోసమో... ఇప్పుడు జనాలంతా బైక్‌ల మీదే కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సర్వేని చూపిస్తున్నారు. బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించారు. 2,50,00 మంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రెండులక్షలా యాభైవేలమందిలో ఐదేళ్లకాలం ముగిసేసరికి 2,430 మంది చనిపోయారు. 3,748 మందికి కేన్సర్‌ సోకింది. 1,110 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు. అయితే ఈ గణాంకాలకీ వారిలో సైకిల్ తొక్కడానికీ మధ్య సంబంధం ఉండటమే ఆశ్చర్యం కలిగించే అంశం. వాహనాల మీద ఆఫీసుకి వెళ్లేవారితో పోలిస్తే, సైకిల్‌ తొక్కేవారిలో కేన్సర్‌ సంభవించే అవకాశం 45 శాతం తక్కువని తేలింది. వీరిలో గుండెజబ్బు సోకే ప్రమాదం కూడా 46 శాతం తక్కువగా నమోదైంది. ఏతావాతా.... సైకిల్‌ మీద ప్రయాణం చేసేవారు, ఇతరులతో పోలిస్తే అర్థంతరంగా చనిపోయే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువని వెల్లడైంది. సైకిల్ మీద ఆఫీసుకి వెళ్లేవారు, సగటున వారానికి 30 మైళ్ల వరకూ ప్రయాణం చేస్తున్నట్లు తేలింది. ఇదేమీ మామూలు వ్యాయామం కాదు కదా! క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తే ఎంత లాభమో, రోజూ సైకిల్‌ తొక్కడం వల్ల అంతే లాభమని చెబుతున్నారు. ఒక్కసారి కనుక ఈ అలవాటు మన జీవితంలో భాగమైతే, అదిక పెద్ద కష్టంగా తోచదని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు! ఊబకాయం, పొగత్రాగడం, ఆహారనియమాలు పాటించపోవడం వంటి సందర్భాలలో కూడా సైకిల్‌ తొక్కడం వల్ల లాభం కనిపించిందట. ఇంతాచేసి పరిశోధకులు చెబుతున్న విషయం ఏమిటంటే... వీలైనప్పుడల్లా బైక్‌ని పక్కనపెట్టి సైకిల్‌ మీద స్వారీ చేయమనే! దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది, పర్యావరణానికీ మేలు జరుగుతుంది, బస్సుల కోసం నిరీక్షించే సమయమూ మిగులుతుంది. అన్నింటికీ మించి ఆరోగ్యం దక్కుతుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. -నిర్జర.
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.   ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!     మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్.   ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే!   ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది.   మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట.   - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి.   - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి.   - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి.   - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది.   - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర.
గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక-     గోల్ఫ్ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌ World Golf Foundation అనే సంస్థ గోల్ఫ్‌ ఆటకీ ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు ఈ గోల్ఫ్‌ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్టుని ఆరంభించింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు... గోల్ఫ్‌ మీద ఇప్పటివరకూ జరిగిన ఐదేవేల పరిశోధనలను సమీక్షించారు. గోల్ఫ్‌ ఆడే సమయంలో వారిలో ఎన్ని కేలొరిలు ఖర్చవుతున్నాయి, వారు సగటున ఎంత దూరం నడవాల్సి వస్తోంది, వారి ఆరోగ్యం మీద ఆట ప్రభావం ఏమిటి... తదితర విషయాలను పరిశీలించారు.     జీవతకాలమే మెరుగుపడింది. పరిశోధకుల సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. గుండెపోటు, పక్షవాతం, డయాబెటీస్‌, పేగు క్యాన్సర్ వంటి 40 రకాల తీవ్రమైన రోగాలను గోల్ఫ్‌ నివారించగలుగుతోందని తేలింది. ఒక పరిశోధనలో అయితే గోల్ఫ్‌ అడేవారి జీవితకాలం ఏకంగా ఐదేళ్లపాటు మెరుగుపడినట్లు బయటపడింది. ఇంతేకాదు! వయసుతో పాటు వచ్చే నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు... గోల్ఫ్‌ ఆటలో మాయమవుతున్నాయట. గోల్ఫ్‌ ఆటతో శరీరమే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటుగా... ఆందోళన, మతిమరపు, క్రుంగుబాటు వంటి వ్యాధుల నుంచి దూరం కావడం జరిగిందట.     కారణం! గోల్ఫ్ ఆటలో ఆటగాళ్లు కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాలి. వారి బలమంతా ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లలో గుట్టలని దాటుతూ, మైదానాలలో నడుస్తూ ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు దాదాపు 6 నుంచి 13 కిలోమీటర్ల వరకూ నడుస్తారనీ, 500కి పైగా కేలొరీలను ఖర్చు చేస్తారని తేలింది. పైగా గోల్ఫ్‌ ఆటని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఆడవచ్చు. తమ ఓపికను బట్టి ఆటలో మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నింటి వలనా గోల్ఫ్‌ గొప్ప ఆరోగ్యాన్ని అందించే ఆటగా మారిపోయిందని పరిశోధకులు సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఐదుకోట్ల మందికి పైగా ఈ ఆటని ఆడుతున్నారనీ, భవిష్యత్తులో మరింత మంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపుతారనీ భావిస్తున్నారు. - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.