Publish Date:May 1, 2015

EDITORIAL SPECIAL
  అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర నిన్నరాత్రి విషాదం చోటు చేసుకుంది. అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జోరుగా వర్షం కురుస్తుండటంతో, అప్పుడే తన సోదరితో కలిసి మెట్రో రైలు దిగిన ఓ యువతి తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. కొద్ది సేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి, అంతెత్తు నుంచి పడ్డ పెచ్చుల ధాటికి ఆమె తల పగిలిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాదీలను భయపెడుతోంది. మృతురాలిని కూకట్ పల్లిలో నివాసముంటున్న మౌనికగా గుర్తించారు. మౌనికా స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాం పూర్, భర్త కంతాల హరికాంత్ రెడ్డి, ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. హరికాంత్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం రావటంతో ఆరు నెలల క్రితమే ఈ దంపతులు నగరానికొచ్చి కూకట్ పల్లి ఫేస్ త్రి ఎస్సార్ హోమ్స్ లో నివాసముంటున్నారు. తన చిన్నాన్న కూతురు నికితను అమీర్ పేటలో ని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్ పల్లిలో మెట్రో రైలు ఎక్కింది. ఇద్దరూ కలిసి అమీర్ పేటలో దిగారు, వర్షం కురుస్తుండటంతో సారధీ స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు. ఇద్దరు ఏ 1053 మెట్రో పిల్లర్ కింద నిలుచున్నారు, అనుకోకుండా మూడో అంతస్థులోని గోడకు చెందిన పెచ్చులు ఒక్క సారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె సోదరి, స్థానికుల్లో కొందరు కలిసి బాధితురాల్ని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్ధారించారు. సోదరిని హాస్టల్లో చేర్పించి గంటలో తిరిగి వస్తారని తనతో చెప్పి వెళ్లిన భార్య కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్ రెడ్డి షాక్ కు గురయ్యాడు, మృతదేహం వద్ద బోరున విలపించాడు. పెళ్లైన సంవత్సరానికే తనను వీడి వెళ్లిపోయావా అంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. సర్ఫేస్ వాల్ నుంచి చిన్న ప్లాస్టర్ ముక్క పడిందనీ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయిందని చెప్పారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు, మౌనిక కుటుంబానికి పరిహారమివ్వాలని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న మెట్రో రైలుకు సంబంధించి జరిగిన ఈ దుర్ఘటన నగర వాసులను భయపెడుతోంది. హైదరాబాదీల జీవితంలో భాగమైన మెట్రో రైల్లో ప్రమాదం జరగటం ప్రజలల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావుడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించటం, ప్రీ కాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సిగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్ఠంగా మూసివేయకపోవడం, ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర ఇంకా నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం, మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్ల వణకడం, ప్రీ కాస్ట్ కాంక్రీటు నిర్మాణానికి దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్ కి మధ్య పటిష్టంగా లేకపోవడం ఈ పెచ్చులూడటానికి కారణంగా తెలుస్తోంది.
  వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అంటూ శంఖారావం మోగించింది. అందులో భాగంగా ఏకంగా 'ప్రజావేదిక' నే కూల్చి వేసింది. ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శలు కూడా ఎదుర్కొంది అది వేరే విషయం. ఆ కూల్చివేత ప్రజావేదిక తో ఆగిపోలేదు. పలువురు ప్రతిపక్ష టీడీపీ నేతలకు నోటీసులు వచ్చాయి. కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలనీ చెప్పారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆ ఇల్లు అక్రమ నిర్మాణం, దాన్ని కూల్చివేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నట్టుండి మళ్లీ తెరమీదకు వచ్చింది. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్‌ పేరుతో సీఆర్డీఏ నోటీసులు అంటించింది. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులనూ ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన సీఆర్డీఏ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే రమేష్‌ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. కాగా, ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని రమేష్‌ వెల్లడించారు. మరి ఈ నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. గతంలో రమేష్ వివరణతో సంతృప్తి చెందని అధికారులు.. ఈసారి మాత్రం సంతృప్తి చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయక తప్పేలా లేదు. అదే జరిగితే అధికార పార్టీ పంతం నెగ్గినట్టే. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ.. చంద్రబాబుని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించాలని పట్టుదలతో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
    హుజూర్‌నగర్ ఉపఎన్నిక... ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక అభ్యర్ధిత్వంపై తలెత్తిన వివాదంతో నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా ఏకమయ్యారు. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య పద్మావతిని ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో సీనియర్లంతా ఏకమవుతున్నారు. అసలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది. పార్టీలో రేవంత్ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతోందని భావిస్తోన్న సీనియర్లు ఏకమవుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు  నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌‌పై మండిపడుతున్నారు. తాను రాజీనామాచేసిన తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ప్రకటిస్తే తప్పేటంటూ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు... తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎప్పుడూ ఉత్తమ్ పై విమర్శలుచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించడంతో... ఉత్తమ్-కోమటిరెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి... మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌.... మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక కోమటిరెడ్డి అయితే, రేవంత్ పై సెటైర్లు వేశారు. కొత్తగా వచ్చినోళ్ల సలహాలు తమకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో విభేదాలున్నా, తాను, ఉత్తమ్, జానారెడ్డి ఒక్కటిగా పనిచేస్తున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పీసీసీ రేసులో తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే... మరొకరు కాదనే నేతలు ఇప్పుడు... తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. మరి ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
  'సైరా.. నరసింహారెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈవెంట్‌కు వేదికగా నిలిచిన ఎల్బీ స్టేడియం మెగా ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. వేడుక మరో రెండు మూడు గంటల్లో మొదలవుతుందనంగా దాదాపు గంటన్నరసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో చిరంజీవి బృందం, అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. స్టేడియం సీట్లు, గ్రౌండ్ ముద్దగా తడిసిపోయాయి. అయితే ఆ తర్వాత వర్షం ఆగడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగానే ఈవెంట్ సజావుగా, కోలాహలంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ప్రధానాకర్షణగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అతిథులుగా హాజరైన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దేశంలోనే టాప్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి అదనపు ఆకర్షణ అయ్యారు. వి.వి. వినాయక్, కొరటాల శివ వంటి దర్శకులూ ఈ వేడుకకు వచ్చారు. ఇక చిరంజీవి మాతృమూర్తి మినహా ఆయన కుటుంబమంతా దాదాపు ఈ వేడుకకు హాజరయింది. 'సైరా' నిర్మాత హోదాలో రాంచరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, కూతుల్లు సుస్మిత, శ్రీజ, కోడలు ఉపాసన్, బావమరిది అల్లు అరవింద్, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు, మేనల్లుడు అల్లు అర్జున్ మాత్రం ఈ వేడుకకు రాలేకపోయారు. ఇక మూవీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నటించిన అమితాబ్ బచ్చన్ వస్తారేమోనని ఏ మూలో ఆశతో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పటివరకూ 'సైరా'కు సంబంధించిన ఏ వేదికపైనా, ఏ ప్రచార కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనలేదు. చివరకు ఆ మధ్య ముంబైలో జరిగిన 'సైరా' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆయన కనిపించలేదు. అలాగే నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ, ప్రియురాలు లక్ష్మి పాత్రల్ని పోషించిన నయనతార, తమన్నా.. ఈ వేడుకకు దూరంగా ఉండిపోయారు. అత్యంత అరుదుగా మాత్రమే సినిమా ప్రమోషన్‌లో పాల్గొనే నయనతార.. ఈ వేడుకకూ అదే నియమాన్ని పాటించింది. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనే అలవాటున్న తమన్నా హాజరుకాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనివార్య పరిస్థితుల వల్లే ఆమె రాలేకపోయిందని సమాచారం. సినిమాలో కొద్దిసేపు కనిపించే అవుకు రాజు కేరెక్టర్ చేసిన కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ మరో కీలక పాత్ర చేసిన భోజ్‌పురి స్టార్ రవికిషన్ కూడా అటెండ్ కాలేదు. వీరారెడ్డి పాత్రను చేసిన మన విలక్షణ నటుడు జగపతిబాబు, రాజాపాండి రోల్‌లో కనిపించనున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మాట్లాడారు కూడా. టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ప్రధానమైన వాళ్లంతా హాజరయ్యారు. కథను సమకూర్చిన పరుచూరి బ్రదర్స్‌లో అగ్రజుడు వెంకటేశ్వరరావు ఈ ఈవెంట్‌కు రాగా, గోపాలకృష్ణ రాలేదు. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఫైట్ మాస్టర్ రాం-లక్ష్మణ్ వంటి వాళ్లు హాజరయ్యారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన 'సైరా' టైటిల్ సాంగ్ ఈ వేడుకలో మరో ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగిన సాహిత్యం, దాని తగిన బాణీలతో కూడిన ఆ పాటను ప్రదర్శించగానే స్టేడియం అంతా కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇక వేదికపై ఉన్నంతసేపూ బాబాయ్ అబ్బాయ్.. పవన్ కల్యాణ్, రాంచరణ్ చాలా క్లోజ్‌గా గడిపారు. చరణ్ తరచూ బాబాయ్‌తో ఏదో ఒకటి చెబుతూ కనిపించాడు. అతిథులందరూ చిరంజీవితో పాటు, గొప్ప గట్స్‌తో భారీగా ఖర్చుపెట్టి 'సైరా'ను నిర్మించాడంటూ చరణ్‌ను పొగడ్తలతో ముంచేశారు. అన్నయ్య చిరంజీవిని చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాత్రలో చూడాలని ఎన్నో ఏళ్ల నుంచీ తాను అనుకుంటూ వచ్చాననీ, ఇప్పుడు ఆ పనిని తనకంటే చాలా చిన్నవాడైన చరణ్ చేశాడనీ పవన్ కల్యాణ్ ప్రశంసించాడు. తను ఇంటర్మీడియేట్‌లో ఫెయిలయినప్పుడు డిప్రెషన్‌కు గురై అన్నయ్య తుపాకీతో కాల్చుకొని చనిపోవాలని అనుకున్నాననీ, కానీ జీవితం ముందు ఇంటర్మీడియేట్ పరీక్ష ఫెయిలవడం పెద్ద విషయం కాదంటూ అన్నయ్య తనకు ధైర్యాన్నిచ్చాడనీ, ఆయనిచ్చిన ధైర్యం వల్లే ఈరోజు నేను మీముందున్నాను అంటూ ఎమోషనల్‌గా పవన్ మాట్లాడాడు. దాదాపు అరగంటసేపు మాట్లాడిన చిరంజీవి రాజమౌళి, రాంచరణ్, సురేందర్ రెడ్డిలను ప్రశంసించారు. రాజమౌళి 'బాహుబలి' సినిమాను తీయకపోతే, తాము 'సైరా'ను తలపెట్టేవాళ్లమే కాదని చెప్పి ఆశ్చర్యపరిచారు. 'బాహుబలి'తో రాజమౌళి తెలుగువాళ్లంతా గర్వపడేట్లు చేయడమే కాకుండా, ఎంతోమందికి ధైర్యాన్నిచ్చాడని కొనియాడారు. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏదడిగితే అది సమకూర్చి రాంచరణ్ ఎంతో ధైర్యంగా ఈ సినిమా నిర్మించాడని ఆయన అన్నారు. జాజియాలో ఒక్టిన్నర నెలపాటు షూట్ చేసిన వార్స్ సీన్స్ కోసమే 75 కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాడని చిరంజీవి చెప్పారు. 'సైరా'ను యూత్ సినిమాగా ఆయన అభివర్ణించారు. సినిమా ఆరంభంలో, ముగింపులో రెండు నిమిషాల సేపు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ వస్తుందనీ, యూత్‌కు కనెక్టవడం కోసం ఆ వాయిస్ ఓవర్‌ను పవన్‌తో చెప్పించామనీ చిరంజీవి తెలిపారు. 'సైరాను' తెలుగువాళ్లు మాత్రమే కాకుండా భారతీయులందరూ గర్వించే సినిమాగా ఆయన అభివర్ణించారు. ఓవరాల్‌గా 'సైరా' ప్రి రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవడంతో మెగాస్టార్ బృందంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. ఇక మిగిలింది.. అక్టోబర్ 2న 'సైరా' మూవీ జనం ముందుకు రావడమే!
  రాజమౌళి 'బాహుబలి'ని తీసుండకపోతే, తాము 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాని తీసుండేవాళ్లం కాదనీ, 'సైరా' రావడానికి పరోక్షంగా రాజమౌళి దోహదం చేశారనీ అన్నారు చిరంజీవి. 'సైరా' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఆయన రాజమౌళిని ఘనంగా కీర్తించారు.  "నా 151వ సినిమాగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టిందీ, పరోక్షంగా సపోర్ట్ చేసిందీ దర్శకుడు రాజమౌళి. ఆయన గనుక 'బాహుబలి'ని తీసుండకపోతే, ఈ రోజు 'సైరా.. నరసింహారెడ్డి' వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారతదేశ వ్యాప్తంగా దారి వేశారు. శెభాష్. వందల కోట్లు పెట్టి తీసినా, అంతకు అంతా రాబట్టుకోవచ్చు, నిర్మాతకు నష్టం ఉండదు.. అని భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి. హ్యాట్సాఫ్ టు రాజమౌళి. ఎంతోమందికి ధైర్యాన్నిచ్చాడు. తెలుగువాళ్లు గర్వపడేలా 'బాహుబలి' తీసి, 'సైరా' రావడానికి దోహదం చేసిన రాజమౌళికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా నిర్మించడానికి రాంచరణ్ ముందుకొచ్చాడు. కాంప్రమైజ్ కాకుండా మనమే  చేద్దామంటే, 'సై' అన్నాను. ఈ సినిమాకి డైరెక్టర్‌గా ఎవరు న్యాయం చేకూరుస్తారనుకుంటే, "మీరే డైరెక్ట్ చేయ్యండి" అని మొదట్నుంచీ నామీద నమ్మకమున్న పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నేను "వద్దండీ. డైరెక్షన్ అనేది ఫుల్‌ప్లెడ్జెడ్ జాబ్. ఒక వైపు యాక్టింగ్ చేస్తూ, దర్శకత్వానికి న్యాయం చెయ్యలేం. నేను చెయ్యలేక కాదు. దేన్నో ఒకటి వదిలెయ్యాలి. దేన్ని వదిలెయ్యమంటారు?" అన్నాను. 'అబ్బబ్బే.. డైరెక్షన్‌ను ఎవరికైనా అప్పగించండి కానీ ఆ కేరెక్టర్ మీరే చెయ్యాలి. ఆ కేరెక్టర్‌లో తెరపై మీరే కనిపించాలి' అన్నారు" అని చిరంజీవి చెప్పారు.
  "ఈ రోజు సెప్టెంబర్ 22. నా జీవితంలో ఒక అత్భుతమైన ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' రిలీజైన రోజు. ఆ రోజు 'నా సినిమా ప్రజల ముందు వెళ్తోంది, వాళ్లు చూస్తున్నారు.. ఎలా ఉంటుంది.. నా గురించి వాళ్లు ఏమనుకుంటారు.. నా భవిష్యత్తు ఎలా ఉంటుంద'నే మీమాంసతో నాలో ఒక మిశ్రమ భావన.. ఒక పక్క టెన్షన్.. ఒక పక్క ఎగ్జైట్‌మెంట్.. ఒక పక్క ఏదో తెలీని ఉద్విగ్నత.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో నేనీ నేలమీద లేనంటే.. ఒట్టు. అలాంటి టెన్షన్.. అలాంటి ఎగ్జైట్‌మెంట్.. అలాంటి ఉద్విగ్నత.. 41 ఒక్క సంవత్సరాల తర్వాత ఈ 2019 సెప్టెంబర్ 22న నేను ఫీలవుతున్నాననేది వాస్తవం. దానికి కారణం.. 'సైరా.. నరసింహారెడ్డి'.  ఒక పుష్కర కాలం నుంచీ ఈ కథ నాలో మెదులుతూ ఉంది. దానికంటే 20 సంవత్సరాల ముందు "మీరు చెయ్యాలనుకుంటున్న అద్భుత పాత్రలేవైనా ఉన్నాయా?" అనడిగితే, ఎప్పుడూ అంటుంటాను - "నాకు స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చెయ్యాలని ఉంది. అది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి. నా కెరీర్‌కి అది బెస్ట్ కేరెక్టర్ అవ్వాలి. ఆ పాత్ర.. భగత్ సింగ్" అని. కానీ ఎందుకో భగత్ సింగ్ కథను ఏ కథకుడూ తీసుకు రాలేదు. ఏ నిర్మాతా, ఏ దర్శకుడూ తీసుకు రాలేదు. అలా ఆ కోరిక, ఆ కల అలాగే ఉండిపోయింది. పుష్కర కాలం ముందు పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. కర్నూలు జిల్లా ఉయాలవాడలోని నొస్సం దగ్గర ప్రాంతానికి చెందిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడనీ, ఆ పాత్ర నాకు బాగుంటుందనీ, అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయనీ చెప్పారు. 'సినిమాగా ఎంత సక్సెస్ అవుతుందనేది పక్కనపెడితే, ఒక యోగి లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి కథని మన తెలుగువారికి, భారతీయులందరికీ తెలియజెప్పినట్లు ఉంటుంది.. అలాంటి హీరో ఆయన.. అది మీరు చెయ్యాలి' అంటూ అప్పట్నుంచీ అడుగుతూనే ఉన్నారు.  అక్కడి రెండు మూడు జిల్లాల్లోని చరిత్ర పరిశోధకులకో, ఏ కొంతమందికో తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ టైంలో నాకూ తెలీదు. నా చుట్టుపక్కల వాళ్లని అడిగినా తమకూ తెలియదన్నారు. ఏవో నలభై, యాభై పేజీల పుస్తకాలు, స్థానికంగా బుర్రకథలు, కొన్ని ఒగ్గు కథలు.. వంటివి ఉన్నాయి తప్ప, ఆయన గురించిన ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ ఆయన కథ విన్నప్పుడు ఒక అన్‌సంగ్ హీరో స్టోరీ, తెరమరుగైపోయిన ఒక యోధుడి కథ అనిపించింది.  మనకు 1857 సిపాయిల తిరుగుబాటు, అప్పటి మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు. ఆ తర్వాత కాలానికి చెందిన చంద్రశేఖర అజాద్, భగత్ సింగ్, నేతాజీ, మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల గురించి మనకు తెలుసు. కానీ తెరమరుగైపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జనం ముందుకు తీసుకురావాలి. ఆయన తెలుగువాడు.. అనేది మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది. ఈ సినిమా చెయ్యాలని ఎప్పుడైతే పరుచూరి బ్రదర్స్ సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశారో, యెస్.. చెయ్యాలి.. అనే బలమైన కోరిక నాలో ఏర్పడిపోయింది. ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను అనిపించింది. అయితే - ఇలాంటి కథకు న్యాయం చెయ్యాలంటే బడ్జెట్ ప్రాబ్లెం అనిపించింది. పది, పదిహేనేళ్ల క్రితం నాపై ముప్పై, నలభై కోట్లు పెట్టి సినిమా తీసే రోజుల్లో ఇది.. అరవై, డెబ్భై కోట్ల పైన అవుతుంది.. ఏ నిర్మాతా ముందుకు రాలేడు.. ఏ నిర్మాతనీ చెయ్యమని అడగలేం. నష్టపోయే పరిస్థితి. అలా బడ్జెట్ సపోర్ట్ లేక, ఏ నిర్మాతా ముందుకు రాక.. ఆగిపోయింది." అని ఆయన చెప్పారు.
  మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ మూవీ 'అల.. వైకుంఠపురములో..' 2020 సంక్రాంతికి విడుదలవుతున్నట్లు ఇప్పటికే వాటి నిర్మాతలు ప్రకటించారు. దాంతో మహేశ్, బన్నీ మధ్య సంక్రాంతి పోటీ అనివార్యమయింది. తాజాగా మరో హీరో కూడా వాళ్ళతో పోటీ పడేందుకు సై అంటున్నాడు. అతను నందమూరి క‌ల్యాణ్‌రామ్. అవును. అతను హీరోగా నటిస్తోన్న 'ఎంత మంచివాడవురా' సినిమాను 2020 జనవరి 15న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.  క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్  ఫిల్మ్స్ సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడ‌వురా'. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. 'శ‌త‌మానం భ‌వ‌తి'తో జాతీయ పుర‌స్కారం అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో మెహ‌రీన్‌  క‌థానాయిక‌.  చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఉమేష్ గుప్తా, చిత్ర స‌మ‌ర్ప‌కులు శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ మాట్లాడుతూ "ఆగ‌స్టు 26 నుంచి  రాజ‌మండ్రి, పెండ్యాల‌, పురుషోత్త‌మ‌ప‌ట్నం, వంగ‌ల‌పూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాం. ఈ నెల 25 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంది.  ఏక‌ధాటిగా  జ‌రుగుతున్న  ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నాం. హీరో, హీరోయిన్ల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నారు.  తొర్రేడులో రూ. 35 ల‌క్ష‌ల వ్య‌యంతో భారీ జాత‌ర సెట్ వేశాం.  అక్క‌డ క‌ల్యాణ్‌రామ్‌, న‌టాషా దోషి ('జై సింహా' ఫేమ్‌)పై ఒక సాంగ్ షూట్ చేశాం. ఈ చిత్రీక‌ర‌ణ‌లో 50 మంది డ్యాన్స‌ర్లు, 500 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే పెండ్యాల‌లోని ఇసుక ర్యాంపుల మ‌ధ్య భారీ ఎత్తున తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగ‌ల‌పూడి స‌మీపంలో గోదావ‌రిలో 16 బోట్ల‌తో తెర‌కెక్కించిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌  క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది. జ‌న‌వ‌రి 15న సంక్రాంతి కానుక‌గా  చిత్రాన్ని విడుద‌ల చేస్తాం" అని చెప్పారు.   ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ "రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లోని అందాల‌ను మా 'ఎంత మంచివాడ‌వురా'లో మ‌రోసారి చూపించ‌బోతున్నాం. అక్టోబ‌ర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో  మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ త‌ర్వాత  కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో జరిగే నాలుగో షెద్యూల్లో కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది" అని తెలిపాడు.  వి.కె. న‌రేశ్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: రామాంజనేయులు, రచన-దర్శకత్వం: సతీశ్ వేగేశ్న.
  వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేయగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) మూవీ రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 3.50 కోట్లను వసూలు చేసింది. వెరసి 'గద్దలకొండ గణేష్' రెండు రోజుల షేర్ రూ. 9 కోట్లు దాటింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య 25 శాతం తగ్గింది. అయినప్పటికీ ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఆదివారం ఎంత తక్కువ అంచనా వేసుకున్నా రూ. 3 కోట్లు రావడం గ్యారంటీ అని, దాంతో తొలి వారాంతం ఈ సినిమా కలెక్షను రూ. 12 కోట్ల మార్కును దాటుతుందని ఊహిస్తున్నారు. నైజాం, ఆంధ్రా, రాయలసీమ ఏరియాల ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 20 కోట్లని విశ్లేషకుల అంచనా. అంటే మూడు రోజులకు 60 శాతం పైగా రికవరీ అయినట్లే.  నైజాంలో తొలి రోజు రూ. 1.6 కోట్లు వసూలవగా, రెండు రోజులకు అది రూ. 3 కోట్ల మార్కును దాటింది. ఇక్కడ బయ్యర్ సేఫ్ అవ్వాలంటే ఇంకో రూ. 4.4 కోట్ల షేర్ రావాలి. రాయలసీమలో రూ. 3.35 కోట్ల ప్రి బిజినెస్ జరగ్గా, రెండు రోజుల్లో అక్కడ రూ. 1.4 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఆంధ్రా ఏరియా మొత్తం కలిపి రూ. 9.25 కోట్ల ప్రి బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో రూ. 4.6 కోట్ల షేర్ వసూలయ్యింది. 'గద్దలకొండ గణేష్'కు అసలు పరీక్ష సోమవారం నుంచి ఎదురవనున్నది. 
  పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కంచుకోట హుజుర్ నగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలాగైనా ఉత్తమ్ కు చెక్ పెట్టాలని గులాబీ బాస్ తీవ్రంగా ప్రయత్నించినా, టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. 2009నుంచి హూజుర్ నగర్ నుంచి చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి... టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2014లో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చినా, ఆమె కూడా ఉత్తమ్ పై గెలవలేకపోయింది. దాంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే, సైదిరెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, చివరికి ఉత్తమ్ చేతిలో పరాజయం పాలవ్వక తప్పలేదు. వరుసగా మూడోసారి టీఆర్ఎస్ కు భంగపాటు కలిగినా, సైదిరెడ్డి... గట్టిపోటీనివ్వడంతో... మళ్లీ అతనికే టికెట్ ఇచ్చి, బరిలోకి దింపింది గులాబీ పార్టీ. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతోనే నష్టం జరిగిందని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం.... ఈసారి ముందుజాగ్రత్తపడింది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధిని ప్రకటించి కదనరంగంలోకి దింపింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ మొత్తం దాదాపు క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ.... రెండు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నల్గొండ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... నల్గొండ బరిలో నిలిచి సూపర్ విక్టరీ కొట్టారు. అయితే, నల్గొండ ఎంపీ సీటును కోల్పోయి పరాభవంలో ఉన్న టీఆర్ఎస్.... ఎలాగైనాసరే హుజుర్ నగర్ ఉపఎన్నికలో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను... గ్రామ-మండల ఇన్ ఛార్జులుగా నియమించి విజయానికి వ్యూహం పన్నింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగుతుండగా, బీజేపీ నుంచి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ కూడా తన అభ్యర్ధిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎంతమంది పోటీలో ఉన్నా, ఈసారి మాత్రం హుజూర్ నగర్ లో ఎగిరేది గులాబీ జెండానే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. దాంతో, హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.
  పరిస్థితిని బట్టి పద్దతి మార్చుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అబ్బే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మా తీరు మార్చుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో దూసుకెళ్తుంది అనుకుంటే టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. పోనీ 2018 ఎన్నికల్లో అయినా మిగతా పార్టీల మద్దతుతో సత్తా చాటుతుంది అనుకుంటే.. మహాకూటమి రూపంలో మునిగిపోయింది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు పార్టీని వీడారు. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ.. పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతల పోరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా మారింది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి.. తమకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేసారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలు చేసారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు. పీసీసీ కుర్చీపై కన్నేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సీనియర్ నేతలంతా కలిసిపోయారు. వారి కలయికకు కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. రేవంత్ కి టీడీపీలో ఉన్న సమయంలోనే మాస్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరాక కూడా ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. అయితే రేవంత్ తో ఇన్నాళ్లు సీనియర్లకు అంతగా ప్రాబ్లమ్ రాలేదు. కానీ ఇటీవల రేవంత్.. కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దాంతోపాటే సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు మనలో మనం పోటీ పడ్డాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ కి ఇస్తానంటే ఎలా ఊరుకుంటాం అనుకున్నారేమో.. అందరూ ఏకమయ్యారు. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రేవంత్ తన వ్యాఖ్యలతో సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం అంశాలలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా ఏకమై రేవంత్ ని కార్నర్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి, విహెచ్, సంపత్ వంటి వారు పీసీసీ చీఫ్ గా తామే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా ఒంటరిగానే ఉన్నారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవొచ్చు. మరి అధిష్టానం అందరికి సర్ది చెప్పి గొడవ సద్దు మణిగేలా చేస్తుందో లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి నష్టం చేసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్ బీజేపీ వైపు చూసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ లాంటి నేతను కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ కాంగ్రెస్ లో వర్గ పోరు పడలేక బీజేపీలోకి చేరి తన సత్తా చూపుతారేమో చూడాలి.
  భవనం నిర్మించాలంటే నెలల సమయం పడుతుంది. కానీ కూల్చివేయాలంటే నిమిషాలు చాలు. అలాగే మనిషి మంచి పేరు సంపాదించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఆ పేరు పోవాలంటే కొన్ని క్షణాలు చాలు. తెలిసో తెలియకో కోడెల శివ ప్రసాద్ విషయంలో కూడా అలాగే జరిగింది. వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో ఏళ్లు సేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొంతకాలంగా ఆరోపణలు, అవమానాలు చుట్టుముట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకొని మరణించారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో.. కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ వైసీపీ కోడెలను బాగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ అంశాన్ని బాగా హైలైట్ చేసి కోడెల ప్రతిష్టను మసకబారేలా చేసింది. నిజంగా తప్పు చేసుంటే ఎంతవారినైనా శిక్షించాల్సిందే. కానీ కోడెల చేయని తప్పుకి ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ఉండి, పదవీకాలం ముగిసి ఖాళీ చేసేటప్పుడు.. ఫర్నీచర్ అప్పజెప్పడం, పాడైన వాటికి ఖరీదు చెల్లించడం ఆనాయితీ. అసలు సరిగా అప్పజెప్పకపోవడం కూడా ఆనాయితీనే. అంతెందుకు కొత్త మంత్రులు, గవర్నర్లు, కొత్త సీఎంలు వచ్జ్చినప్పుడు కొత్త ఫర్నీచర్, ఇతర సామాగ్రి కొనడం.. పాతవి పక్కనెయ్యడం లేదా సిబ్బంది ఇళ్ళకు తరలిపోవడం కూడా ఆనవాయితీనే. కానీ కోడెల విషయంలో ఈ ఆనవాయితేనే అవినీతి అన్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయం హైద్రాబాద్ నుండి అమరావతికి వచ్చినప్పుడు.. కొత్త భవనాలు ఫర్నీచర్ తో సహా అమర్చి ఇవ్వడంతో.. పాత ఫర్నీచర్ ను ఆయన తన క్యాంప్ ఆఫీసుల్లో అధికారులకు చెప్పి ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అదేం కోట్ల విలువైన సొత్తు కాదు. రెండు మూడు లక్షల విలువైన పాత ఫర్నీచర్ మాత్రమే. అది కూడా కోడెల అప్పనంగా కొట్టేయాలి అనుకోలేదు. ఎందరో నాయకులు కోట్లు దోచుకున్నారు. కానీ కోడెల మాత్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫర్నీచర్ తీసుకెళ్లండని బాధ్యతగా లేఖ రాసారు. కొత్త స్పీకర్ జూన్ 12 లేదా 13 న ఛార్జ్ తీసుకొని ఉండొచ్చు. కానీ జూన్ 7 నే కోడెల పాత సామాగ్రి అప్పగిస్తాను లేదా వెల కట్టండి డబ్బులు చెల్లిస్తాను అని లేఖ రాసారు. కానీ అధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో కోడెల మళ్ళీ ఆగస్ట్ 20 న మొదటి లేఖను ప్రస్తావిస్తూ మరో లేఖ రాసారు. అయినా సమాధానం లేదు. నిజానికి ఆ లేఖలకు స్పందించి ఫర్నీచర్ ని పట్టుకొని పోవచ్చు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా రాద్దాంతం చేసి, కక్ష సాధింపు తరహాలో ఆగష్టు 24న కేసులు పెట్టి ఆయన్ని అవమానించారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి వంటి వారు కోడెలపై దొంగ అనే ముద్ర వేశారు. విజయ సాయి రెడ్డి అయితే కోడెల దూడలు అంటూ వెటకారాలు చేస్తూ ట్విట్టర్ వేదికగా పదేపదే విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కోడెలను బాగా కృంగదీశాయి. అసలు నా తప్పులేదు, నేను ముందే లేఖలు రాసాను.. కక్ష సాధింపుతో నా మీద నిందలు వేస్తున్నారని.. కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అవివివేకం కానీ.. ఈ సోషల్ మీడియాలో యుగంలో ఆయన ఆవేదన ఎవరికి పడుతుంది?. 'ఫర్నీచర్ కోసం కోడెల కక్కుర్తి' అంటూ అటు మీడియా, సోషల్ మీడియాలో పదేపదే వార్తలు రావడంతో.. దానిలోని నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ ఆయన మీద విమర్శలు గుప్పించారు. వీటిని కోడెల డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరోవైపు పార్టీ నుండి కూడా ఆయనకు మద్దతు కరువైంది. ఆయనకు మద్దతిస్తే ఎక్కడ తమ మీద విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో.. టీడీపీ నేతలు ఎవరూ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడెలకు మద్దతుగా మాట్లాడలేదు. ఒకవైపు అధికార పార్టీ నేతల విమర్శలు, వేధింపులు ఎక్కువవ్వడం.. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరువవ్వడంతో కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన మరణించారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ మీద మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసులు అడ్డుపెట్టుకొని కోడెలను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. ఇలాంటి మద్దతే కోడెల కోరుకున్నారు. కానీ పాపం ఆయన మరణించాక లభించింది. ఏమీలేని అంశంలో ఆయనను అంతలా ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కడే ఎలా ఎదుర్కోవాలో తెలియక కోడెల మరణానికి తలవంచారు. కోడెల విషయంలో టీడీపీ నేతలు చేసిన తప్పు.. మిగతా నేతల విషయంలో చేయవద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా ఇలా వేధింపులకు గురైతే.. ముందే వారికి అండగా నిలబడి, వారికి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు, అధినాయకత్వం.. కోడెలలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వారికి అండగా ఉండి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. అంతేకాదు.. కోడెల మరణంతో టీడీపీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైసీపీ మీద విరుచుకుపడింది. కేంద్రానికి, గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఎంక్వయిరీ కోరుతోంది. మరి ఈ పోరాటం టీడీపీ ఇలానే కొనసాగిస్తుందా?. అసలు కోడెల విషయంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందో చూడాలి. మొత్తానికి ఎలాంటి స్టెప్ తీసుకున్నా.. కార్యకర్తలు మాత్రం వేధింపులకు గురవుతున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీదే ఉందని అంటున్నారు.
  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై వివాదం రాజుకుంటోంది. సుమారు వందేళ్ల టీటీడీ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా 29మందితో జంబో బోర్డును నియమించిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 29మందికి అదనంగా మరో ఏడుగురికి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ బోర్డులో సభ్యులు ఎక్కువయ్యారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ విమర్శలు చెలరేగుతుండగా, ఇఫ్పుడు అదనంగా మరో ఏడుగురికి చోటు కల్పించడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మండిపడుతున్నారు. 29మందితో జంబో బోర్డు ఏర్పాటుచేసిన జగన్ ప్రభుత్వం.... తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్‌సింహా, శేఖర్‌, కుపేందర్‌రెడ్డి, గోవింద హరి, దుష్మంత్ కుమార్‌, అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో ఇచ్చింది. మిగతా సభ్యుల్లాగే వీళ్లకూ టీటీడీ ప్రోటోకాల్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి చోటు కల్పించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి నివాసం నుంచి వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెనుసంచలనమైంది. అప్పుడు శేఖర్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం అతడిని బోర్డు నుంచి తొలగించింది. అంతేకాదు శేఖర్ రెడ్డిని తొలగించాలంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా డిమాండ్ చేసింది. అయితే, అదే శేఖర్ రెడ్డికి ఇఫ్పుడు టీటీడీ బోర్డులో వైసీపీ సర్కార్ చోటు కల్పించడం ఆశ్చర్యంగా మారింది. ఇక, టీటీడీలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. అసలే 29మందితో జంబో టీమ్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం.... అది చాలదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో మరికొందరికి చోటు కల్పించడంపై భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈసారి ప్రకటించిన పాలక మండలిలో రాష్ట్రేతరులకే పెద్ద పీట వేశారు. అలాగే అన్ని దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న జగన్.... తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
  కోడెల గురించి తెలిసినవాళ్లు... ఆయనది చాలా సున్నిత మనస్తత్వం అంటారు. రూపాయి డాక్టర్ గా పేదల ప్రజలకు సేవలందించిన కోడెల ...రాజకీయాల్లోకి వచ్చాకే రాటుదేలారని చెబుతారు. స్వయంగా ఎన్టీఆర్ కోరడంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో వచ్చిన కోడెల... అప్పటికే పల్నాడులో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న కాసు కుటుంబానికి ఎదురెళ్లి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే, 1983లో కోడెల ఎమ్మెల్యేగా గెలిచాక, కాసు కుటుంబం దాడికి ప్రయత్నించింది. దాంతో కోడెలకు ప్రజలే అండగా నిలబడ్డారు. కోడెలను వాటర్ ట్యాంక్ లో పెట్టి, ఆయనకు రక్షణగా నిలిచారు. ఆ సంఘటనే కోడెలలో పట్టుదల రగిల్చింది. దాంతో ప్రజల అండదండలతో పల్నాడులో పట్టుసాధించిన కోడెల... తర్వాతి కాలంలో రాజకీయంగా రాటుదేలారు. కాసు కుటుంబం అరాచకాలకు ఎదురెళ్లి ప్రజలకు రక్షణగా నిలబడ్డారు. ఆ తెగువే కోడెలను అతికొద్దికాలంలోనే ప్రజానాయకుడిగా చేసింది. దాంతో ఒక్క పల్నాడులోనే కాదు... మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కోడెల పేరు మోరుమోగిపోయింది. తన వ్యక్తిత్వంతో తలదించని నేతగా ఎదిగారు. పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా పనిచేసిన కోడెలకు రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, కేసుల గురించి తెలియకుండా ఉండదు. రాజకీయాల్లో ఇది సహజమే అయినా, జగన్ ప్రభుత్వం మాత్రం... ఎన్నో అడుగులు ముందుకేసి కోడెలకు ఊపిరిసలపనీయకుండా చేసింది. కేసు మీద కేసు పెడుతూ, 3నెలల కాలంలోనే కుటుంబం మొత్తంపై దాదాపు 30 కేసులను పెట్టించి వేధించింది. దాంతో కోడెల కుమిలిపోయారు. మానసికంగా కుంగిపోయారు. 70ఏళ్ల పైబడిన వయసులో ధైర్యం సడలింది. మానసిక-ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆ సమయంలో పార్టీ అండ కోసం కోడెల ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగాల నేపథ్యంలో... కోడెలకు అండగా నిలిచేందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. కోడెలపై ఎంతో అభిమానమున్నా, అత్యంత సన్నిహితుడైనా, వెనకేసుకొస్తే ఎక్కడ పార్టీకి చెడ్డపేరు వస్తుందోనని బాబు భయపడ్డారు. కోడెలపై, కోడెల కుటుంబంపై జగన్ సర్కార్ ... వరుస కేసులు పెడుతుంటే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు... పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వలేదు... కనీసం కోడెలను పరామర్శంచలేదు... ఇదే కోడెలను మరింత కుంగదీసింది. ఒకవైపు జగన్ ప్రభుత్వ వేధింపులు.... మరోవైపు బాబు నుంచి అండ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కోడెల... ఎటూపాలుపోక విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు ఒడిగట్టారని అంటున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు .... జగన్ ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కోడెల మరణాన్ని తలచుకుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కోడెల భౌతికకాయం వెంటే చంద్రబాబు కూడా వచ్చారు. అయితే, ఇదంతా కోడెల బతికుండగా, ఆయనకు అండగా నిలిచి ఉంటే కోడెల బతికుండేవారని అనుకుంటున్నారు. కనీసం కోడెలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ నిన్న పెట్టినట్లు ...కనీసం మూడ్రోజులు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే ఆయన బతికేవారని, ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అంటున్నారు.
  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లడం.. కొంత మంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. పవన్ సమావేశానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమక్షంలో.. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. రేవంత్ రెడ్డిపై విమర్శలకు..ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని, పవన్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు పంపించాలని అనుకుంటున్నారంటూ నేతలను నిలదీశారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ రాలేదని గుర్తు చేశారు. సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటని సంపత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించడంతో.. జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని సీనియర్ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చేశారు. కొన్ని అంశాలలో విపక్షాలు కలిసి పోరాడటం సహజం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అందర్నీ కలుపుకొని పోవడం కాంగ్రెస్ కి అవసరం. కానీ కొందరు నేతలు మాత్రం పవన్ సమావేశానికి వెళ్లిన నేతలను తప్పుపడుతున్నారు. అయితే దీని వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ కూడా రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఆయన పార్టీని చిన్న బుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించి.. అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది.
  Shopping for personal goods and lifestyle products has been interesting to everyone at a certain point in time...online shopping is picking up its swing in India too. In the Western World, it is already a pretty familiar thing. Buy anything, anytime with just a card!! It is so comfortable, time saving, and an effortless job. Returning items bought online, is also getting easier these days. The 'Free Shipping' is such an attractive part. Email notifications and Cellphone Alerts from the shopping websites have made it even more easier and better to keep a track of the deals and sales. Just make sure you keep your card details secure and use only presonal devices to shop online. Just wait for the after Festival Season in India and the Thanksgiving, Christmas Sale in the USA and every online shopper gets so crazy...so do i !! Most of us just get so curious to know whats every website we signed up for sells during its clearance event...whether we buy things or not, browsing for hours, putting everyother item in the shopping bag and then when you realise the amount is going to high or if it still doesnot qualify for 'free shipping', just close the browser !!! For most of us, it is a Passtime activity.     Even the Birthday Gifts are arriving from online stores, a day after the guests attend the party ! I actually did almost something similar, not intentional, the gifts got delayed and arrived to the host a day after i attended the party ! This online shopping is not as timely as shopping at the store..due to climatic reasons, transport strikes, unavailability of items in stock, the shipments arrive so late and you get so frustrated with the long wait...and strangely sometimes the orders arrive so early. Whatever be the reason to still continue with in-store shopping, Online Buying is irresistibly, crazily attractive !!   -Prathyusha Talluri
  కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.   ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
Which should be our priority? Helping others, attending other's needs? or taking care of self ? Is a million dollor question for most of us... Specially for women, this will be the dilemma which always puts them in nutshell... Majority of women find their happiness in keeping their family happy; however constant urge to satisfy other's needs is putting them in "both physical and mental stress" says a recent survey. Experts add that, If women continue to stay in this state of mind for long time, they might loose their self confidence too. Right from simple things of choosing her own wardrobe, food habits, hobbies which keep her happiness intact are the things which need not impress others or approved by others.  Do you believe? Most of the ladies, won't be able to decide the restaurants for the parties they host, can't finalise on the menu for a get together they arrange.. They always put themselves last comparing to family members and kids for that matter. These incidents might sound silly but they have lot of impact on one's personality traits. However, encouraging women in your family to make choices of their own, allow them to take a call when you all go to an eat street, appreciating her choices when you are deciding on home reated affairs are few gestures which build lot of confidence in women in family. On the other hand , women need to take out time for their ownselves; remember, your new cutlery is not only for guests to show off but you have every right to cook, serve and enjoy a special meal for yourself. Treating yourself with an icecream, gifting a book to you by you, wearing a new outfit and trying anew hairstyle just to pep up your day are few of the options to catch up with one own self. Try this out and see the kind of happiness you experience.. ....Bhavana
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదని రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాగ్ పేర్కొంది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికే రాష్ట్ర అప్పులు రెండు లక్షల కోట్లు దాటాయని కొత్తగా తీసుకొస్తున్న అప్పులు సింహ భాగం పాత రుణాలు తీర్చేందుకే ఉపయోగించాల్సి వస్తోందని వెళ్ళడించింది. రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిది మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితులను కాగ్ తన నివేదికలో వివరించింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ వార్షిక బడ్జెట్ అంచనాలు వాస్తవాలకు భారీ వ్యత్యాసం ఉందని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి, ఖర్చు, మూలధన వ్యయంలో అంచనాలు వాస్తవాలకు పోలిక లేదని పేర్కొంది. బడ్జెట్ రూపకల్పనలో హేతుబద్ధత అవసరమని సూచించింది. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఏ మేరకు పలితాలు పొందుతున్నారో ప్రభుత్వం ప్రకటించలేకపోయిందని కాగ్ ఆక్షేపించింది. నిర్మాణంలో జాప్యం వల్ల ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగినట్టు పేర్కొంది. పెట్టుబడులపై రుణాలు, డిస్కంలపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది. పన్నుల వసూలు మూలధన వ్యయంలో మాత్రం కేసీఆర్ సర్కారు ముందంజలో ఉందని ప్రశంసించింది. కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైందని కొనియాడింది. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో దృఢ వైఖరి అవ లంబించాలని కాగ్ సూచించింది. అలా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు బేషరుతుగా రుణాలు ఇవ్వడం, పాత రుణాలు తిరిగి చెల్లించేందుకు మళ్లీ అప్పులివ్వడం జవాబుదారీతనానికి విఘాతం కలిగిస్తోందని ఆర్ధిక నిర్వహణ సరిగా లేదన్న విషయాన్ని తెలియజేస్తోందని అబిప్రాయపడింది. అప్పుల చెల్లింపు భారాన్ని తట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులను పెంచుకోవాలి. ఇది జరగాలంటే భూములు అమ్ముకోవాలి లేదా పన్నుల పెంచుకోవాలి లేకపోతే మూలధన వ్యయాన్ని తగ్గించుకోవాల్సి వస్తుందని కాగ్ హెచ్చరించింది. ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు అప్పు తెస్తే అందులో పది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు వడ్డీ చెల్లింపులకు, మరో నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు అసలు అప్పు చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చిందనీ వివరించింది. పన్నుల రాబడిలో ఎనిమిది శాతం అప్పులు చెల్లించటానికే పోతుంది అని తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జీ.ఎస్.డీ.పీ తో పోల్చినప్పుడు అప్పులు పదిహేను పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉండగా రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిదిలో పంతొమ్మిది శాతానికి పెరిగాయంది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికి ఉన్న మొత్తం అప్పు లక్షా నలభై రెండు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది కోట్లు అని తెలిపింది. ఈ అప్పులు వడ్డీల చెల్లింపులకు రానున్న ఏడేళ్లలో ప్రభుత్వం లక్ష అరవై మూడు వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. మరోవైపు పూచీకత్తుల అప్పు నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అప్పుల భారం రెండు లక్షల ఐదు వేల కోట్లని కాగ్ వెల్లడించింది. రాష్ట్రంలో రాబడి పెరిగినా అంచనాల స్థాయిలో లేదని తెలిపింది. రెండు వేల పదిహహేడు పధ్ధెనిమిదికి రెవిన్యూ రాబడి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు అని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఆరు వేల ఆరు కోట్లు పెరిగినప్పటికీ బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు తగ్గిందని వివరించింది. రెవెన్యూ ఖర్చుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందని కాగ్ వ్యాఖ్యానించింది. ఖర్చులు ఎనభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లని ఇవి అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు పెరుగుదల ఉన్నప్పటికీ అంచనాల కంటే ఏడు వేల ఇరవై ఎనిమిది కోట్లు తక్కువని పేర్కొంది. అంచనాలకు వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్ధం చేయాలని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రెండు వేల పదిహేను, పదహారు, రెండు వేల పదిహేడు, పధ్ధెనిమిది మధ్య కాలంలో రెవెన్యూ రాబడి, ఖర్చులు రెండూ పెరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రెవెన్యూ మిగులును మూడు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మేర ఎక్కువగా చూపగా ద్రవ్యలోటును తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల మేర తగ్గించి చూపారని వెల్లడించింది. రెండు వేల పదహారు, పదిహహేడుతో పోలిస్తే రెండు వేల పదిహహేడు పధ్ధెనిమిదిలో వడ్డీ చెల్లింపుల్లో ఇరవై ఆరు శాతం పెరుగుదల ఉందని తెలిపింది. విద్యా రంగంలో రాష్ట్రం వెనుకబడిందని తెలిపింది. సాగునీటి పారుదల రంగం మీద పెడుతున్న భారీ పెట్టుబడుల వల్ల కలిగిన ప్రయోజనాలను మదింపు చేయటానికి వాటి ఫలితాలను ప్రభుత్వం సంకలనం చేయాలని కాగ్ తెలిపింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి నాటికి రాష్ట్రంలో ముప్పై ఆరు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో పంతొమ్మిది ప్రాజెక్టుల విషయంలో మూడు నుంచి పదకొండేళ్ల వరకు జాప్యం జరిగిందని వెల్లడించింది. ఈ కారణంగా తొలి అంచనా వ్యయం నలభై రెండు వేల రెండు వందల ఒక్క కోట్ల నుంచి లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే డెబ్బై వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసినా అవి ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేసింది. దీనికి అదనంగా ముప్పై ఐదు వేల రెండు వందల కోట్లతో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని సాగునీటి ప్రాజెక్టుల ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని వెల్లడించింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలను విడుదల చేయాలని సూచించింది. నూతన విధాన నిర్ణయాలను అమలు పరిచేటప్పుడు డిస్కమ్ లకు నష్ట పరిహారం చెల్లించాలని కాగ్ సిఫారసు చేస్తుంది. వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ నిర్ణయం డిస్కంల ఆర్థిక పరిస్థితులను మరింత ప్రభావితం చేసిందని వివరించింది. సీపీఎస్ కోసం ఉద్యోగుల మూలవేతనం కరువు భత్యాల నుంచి ప్రభుత్వం ప్రతి నెలా పది శాతం చందాల రూపంలో వసూలు చేస్తుంది. దీనికి సమానమైన మొత్తాన్ని తన వాటాగా చెల్లించాల్సి ఉంది కానీ, ఇది అమలు కావడం లేదని ప్రభుత్వం కనీస వడ్డీలు కూడా చెల్లించడం లేదని కాగ్ పేర్కొంది. ప్రభుత్వం తన వాటాను తక్కువగా జమ చేయటం వడ్డీ కోసం కేటాయింపులు చేయకపోవడం వల్ల రెవిన్యూ మిగులు ఎక్కువగానూ, ద్రవ్యలోటును తక్కువగా చేసి చూపినట్లు తేలిందని స్పష్టం చేసింది. రెండు వేల పద్నాలుగు, పదిహేను నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు నూట నలభై ఒక్క కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు బకాయి పడిందని తెలిపింది. ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దకపోతే సీపీఎస్ మూలనిధి దివాలాకు దారితీసి పథకం వైఫల్యానికి చివరికి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
  హౌడీ మోదీ కార్యక్రమంలో ట్రంప్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆప్ కి భార్ ట్రంప్ సర్కార్ అంటూ నినదించారు. హౌడీ మోదీ కార్యక్రమం సందర్భంగా ప్రవాస భారతీయులకు విభిన్న రీతిలో ట్రంపును పరిచయం చేశారు. ఆయన ప్రతి రంగంలోనూ చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం అయ్యారు. అమెరికాకే కాకుండా ప్రపంచానికి ఆయన ఎంతో చేశారన్నారు, ఆయనే ట్రంప్ అని మరోసారి అమెరికాను గ్రేట్ చేయాలని తపిస్తున్నారని మోదీ అన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి టెక్సాస్ లో ఉన్న హ్యూస్టన్ ని ప్రధాని మోదీ ఎంచుకోవటానికి బలమైన కారణం ఉంది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో జమ్ము కశ్మీర్ అంతర్భాగం కానట్టే అమెరికా ఏర్పడినపుడు టెక్సాస్ కూడా అమెరికాలో భాగం కాదు, పధ్ధెనిమిది వందల ముప్పై ఆరు వరకూ అది మెక్సికో లోని భాగం. టెక్సాస్ లో పుట్టిన శామ్యూల్ హూస్టన్ అనే నాయకుడు నేతృత్వంలో పధ్ధెనిమిది వందల ముప్పై ఆరులో అక్కడి ప్రజలు మెక్సికోపై తిరుగుబాటు చేశారు. తమ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ గా ప్రకటించుకున్నారు. తర్వాత అమెరికాలో టెక్సాస్ విలీనానికి అమెరికా కాంగ్రెస్, టెక్సాస్ కాంగ్రెస్ మద్దతు తెలుపడంతో యూఎస్ లో టెక్సాస్ ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అటూ ఇటుగా జమ్మూ కశ్మీర్, టెక్సాస్ నేపథ్యాలు ఒకే విధంగా ఉండటంతో 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు హ్యూస్టన్ ను ప్రధాని మోదీ వేదికగా ఎంచుకున్నారు. హౌడీ మోదీ సభావేదికపై ప్రధాని మోదీకి హ్యూస్టన్ కీని బహుకరించారు. ఆ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఈ కీ ను మోదీకి అందజేశారు. హ్యూస్టన్ అభివృద్ధిలో భారత సంతతి పౌరులు కీలక పాత్రలు పోషిస్తున్నందుకు సూచికగా భారీ సైజు హ్యూస్టన్ కీని అందించినట్టుగా టర్నర్ తెలిపారు.
  వైఎస్ జగన్‌ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ విమర్శలకు ప్రధాన కారణం చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి. వైసీపీ ప్రతిపక్షములో ఉన్న సమయంలో శేఖర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. శేఖర్ రెడ్డి వద్ద వందల కోట్ల బ్లాక్ మనీ ఉందని, ఆయన పలువురు రాజకీయ నేతలకు బినామీ అని, ఆయన దగ్గర వందకోట్లు తీసుకొని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిందని.. అబ్బో ఇలా ఎన్నో విమర్శలు చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ టోటల్ రివర్స్ అయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.. గతంలో ఏ శేఖర్ రెడ్డి మీద విమర్శలు చేసిందో.. ఇప్పుడదే శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ముందుకెళ్తోంది. మరోవైపు శేఖర్ రెడ్డి కూడా తనకే పాపం తెలీదు, తాను ఉత్తముడిని అంటున్నారు. నేడు టీటీడీ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చిన శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నాపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు, పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని దేవుడే చూసుకుంటారు అన్నారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 25 ఏళ్ళుగా శ్రీవారి సేవలో తరిస్తున్నానను. ఆరేళ్లుగా ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు పుష్పాలు సమర్పిస్తున్నాను. రూ. 15 కోట్లతో అలిపిరిలో నిర్మిస్తున్న గోశాల నిర్మాణానికి పూర్తిగా నేనే నిధులు ఇచ్చాను. స్వామి వారికి ఎన్నో విరాళాలు ఇచ్చాను అంటూ శ్రీవారి మీద తనకున్న భక్తిని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇన్ కం టాక్స్ రైడ్ జరిగిన నాడు నా ఇంట్లో కేవలం రూ. 12 లక్షలు మాత్రమే దొరికాయని అన్నారు. ఇప్పటికైనా నాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయండని శేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరి శేఖర్ రెడ్డి చెప్తున్నట్లు.. ఆయన ఇంట్లో కేవలం రూ. 12 లక్షలు మాత్రమే దొరికితే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆయన ఇంట్లో వందల కోట్లు దొరికాయని ఎందుకు ప్రచారం చేసినట్టు? మళ్లీ అదే శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి పాలకమండలిలో ఎందుకు నియమించినట్టు? అంతా ఆ ఏడుకొండల వాడికే తెలియాలి.
  టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.     ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.   మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం. ......కళ్యాణి
మనం ఆరోగ్యంగా వుండటానికి అత్యుత్తమమైన మార్గం యోగా. భారతదేశంలో అభివృద్ధి చెందిన యోగాను ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తోంది. మనం ఎదుర్కొనే అన్ని అనారోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారం లభిస్తుంది. శ్రద్ధగా యోగాను అనుసరించాలేగానీ, మనకు చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. పొత్తికడుపును తగ్గించుకునే యోగాసనాల గురించి ప్రముఖ యోగా థెరపిస్ట్ రాజేశ్వరి వడ్డిపర్తి వివరిస్తున్నారు చూడండి...
    Food Check   Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s.   Fitness Check   Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime...   No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit.  Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts,  This keeps your workout fun and your mind motivated.           Take care, Stay Healthy!!!!   -Sandya Koya    
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.