Publish Date:Jan 21, 2013

EDITORIAL SPECIAL
  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.
  2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
ALSO ON TELUGUONE N E W S
  మహేశ్‌బాబు పక్కనే మహేశ్‌బాబు నిలబడితే ఎలా ఉంటుంది? సోమవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో ఈ దృశ్యం కనిపించింది. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం సింగపూర్‌ రూపొందించిన మహేశ్‌బాబు మైనపు ప్రతిమ (వాక్స్‌ స్టాట్యూ)ను మహేశ్‌బాబు ఆవిష్కరించారు. త్వరలో ఈ ప్రతిమను సింగపూర్‌ తరలిస్తారు. అక్కడ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, అనుష్కాశర్మ తదితర స్టార్స్‌ స్టాట్యూల సరసన మహేశ్‌ స్టాట్యూ కూడా కొలువు దీరుతుంది. సింగపూర్‌ వెలుపల టుస్సాడ్స్‌ మ్యూజియంకు చెందిన ఓ మైనపు ప్రతిమను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘నా స్టాట్యూను నేనే చూసుకుంటుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్పగా, ఉత్కంఠగా, ఒకింత భయంగా ఉందని మహేశ్‌బాబు అన్నారు. ఒకసారి టుస్సాడ్స్‌ వాళ్లు ఫొటోలు పంపారు. స్నేహితుల్లో కొందరికి పంపగా... నేనే అనుకున్నారు. ఏదో ఫొటోషూట్‌ చేశానని అనుకున్నారు. ఇంత రియల్‌గా స్టాట్యూ చేసినవాళ్ళకు థ్యాంక్స్‌’’ అన్నారు. మహేశ్‌ సతీమణి నమ్రత మాట్లాడుతూ ‘‘ఇద్దరు మహేశ్‌లను చూసినట్టుంది’’ అన్నారు. ఇద్దరిలో ఎవరు బావున్నారని ఆమెను మీడియా ప్రశ్నించగా ‘‘రియల్‌ మహేశ్‌ అందంగా ఉన్నారు. ఆయనంత అందంగా స్టాట్యూలో వ్యక్తి ఉన్నారు’’ అని సమాధానం ఇచ్చారు.
  పొలిటిక‌ల్ సినిమాతో రానా సినిమా కెరీర్ మొద‌లైంది. `లీడ‌ర్` లో యంగ్ చీఫ్ మినిస్ట‌ర్ గా న‌టించి తొలి సినిమాతో నే మెప్పించాడు రానా. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించాడు. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత మ‌రో పొలిటిక‌ల్ చిత్రంలో న‌టించాడు. అదే `నేనే రాజు నేనే మంత్రి`. జోగేంద్ర‌గా త‌న పాత్ర‌తో మెస్మ‌రైజ్ చేసేశాడు రానా. ఈ రెండు సినిమాలు కూడా స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు అద్దం ప‌ట్టే చిత్రాలు కావ‌డం విశేషం. అయితే ముచ్చ‌ట‌గా మూడో సారి పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయ‌బోతున్న స‌మాచారం అందుతోంది. `నీది నాదీ ఒకే క‌థ‌`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన వేణు ఊడుగుల. త‌న త‌దుప‌రి చిత్రాన్ని రానా, సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో `విరాట‌ప‌ర్వం` అనే టైటిల్ పిరియాడిక‌ల్ డ్రామాగా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎమ‌ర్జెన్సీ లో నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ప్ర‌జాస్వామ్యం, మ‌ర్క్సిజం, మాన‌వ హ‌క్కులు త‌దిత‌ర విష‌యాల్ని ట‌చ్ చేస్తున్నార‌ని టాక్.  అలాగే ఎమ‌ర్జెన్సీలో మొద‌లై , 1992 తో ముగిసే క‌థ ఇద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని టాలీవుడ్ టాక్. మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌గా ఆమె పాత్ర ఉంటుంద‌ట‌. ఆస‌క్తిక‌రమైన విషయ‌మేమిటంటే ట‌బు తొలి తెలుగు` కూలీ నెం.1` ని నిర్మించిన డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. జూలైలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.
  సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో `చిత్రల‌హ‌రి`  సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే ఈ  చిత్రంలో ఒక పాటై విడుద‌లైంది. ఇక రెండో పాట ఆదివారం విడుద‌లై వైర‌ల్ అవుతోంది. `స్కూల్ వెళ్లే వ‌ర‌కే రా క్లాస్ మేట్స్, రెండ్ క‌ట్టే వ‌ర‌కే రా రూమ్ మేట్స్, కానీ రియ‌ల్ రిలేష‌న్ షిప్ గ్లాస్ మేట్స్ ` అంటూ సాగే ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, పెంచ‌ల్ దాసు పాడారు. సునీల్ కూడా ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గ్లాప్ మేట్ పాట‌లో తేజ్ తో పాటు గ్లాసులు కొడుతూ ఛీర్స్ కొడుతున్నాడు. చంద్ర‌బోస్ ఈ పాట‌లో లిర‌క్స్ చాలా ట్రెండీగా ప్ర‌జంట్ ట్రెండ్ క‌నెక్ట‌య్యేలా చాలా క్యాజువ‌ల్ గా రాసాడు. ప్ర‌స్తుతం ఈ పాట‌ను యూత్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఉగాది కానుక‌గా మ‌రో సాంగ్ కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్ గా న‌టిస్తోంది.
  మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాల‌లో ప్ర‌భాస్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ రెండు సినిమాల‌లో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే వ‌ర్క‌వుటయింది. అయితే తాజాగా వీరిద్ద‌రు క‌లిసి మ‌రోమారు న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.  ఒక‌సారి ఆ వివార‌ల్లోకి వెళితే...`జిల్‌` ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ యూర‌ప్ లో పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఒక కీ రోల్ తో పాటు స్పెష‌ల్ గా సాంగ్ చేయ‌డానికి ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు కాజ‌ల్ ని సంప్ర‌దించాడ‌ట‌. దీనికి వెంట‌నే కాజ‌ల్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం అందుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో జ‌రుగుతోంది. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యార‌క్ట‌ర్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇక స్పెష‌ల్ సాంగ్ తో పాటు కీల‌క పాత్ర‌లో కాజ‌ల్ మెర‌వ‌నుంది.
    మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`.  గ‌త కొంత కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం నుండి మొద‌టి పాట ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీప్ర‌సాద్ తెలియ‌జేశారు. దీంతో మ‌హేష్ అభిమానులు పాట కోసం చాలా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌పుకుంటోంది. ఈ చిత్రంలో విడుద‌లయ్యే మొద‌టి పాట సినిమాకే కీల‌క‌మైన పాట అని తెలుస్తోంది. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రచించార‌ట‌. ఇందులో మొత్తం ఐదు పాట‌లున్నాయట‌.  రెండో పాట‌ను ఉగాది కానుక‌గా విడుద‌ల చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.
  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.
  వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.
  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  
  అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే.. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం.. ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది. జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తోట నర్సింహం వైసీపీలో చేరినా.. జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. జగన్ టికెట్ కూడా ఆయనకే ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 'సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరి మాట వినరు, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు' అని కొందరు నేతలు ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కి సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులతో.. నువ్వేమైనా పోటుగాడివి అనుకుంటున్నావా? అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారట. రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తోటా వైసీపీలో చేరాలంటే తనకి కాకినాడ ఎంపీ టికెట్, తమ కుమారుడికి రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఇదే విషయంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డితో తోటా చర్చించగా.. ఒక్క సీటు మాత్రమే ఇస్తామని, రెండో సీటు కష్టమని విజయసాయి చెప్పారట. దీనికి బదులిస్తూ.. రెండ్లు సీట్లు ఇస్తేనే వైసీపీలో చేరతానని తోటా తెగేసి చెప్పడంతో విజయ సాయికి ఏం చేయాలో తెలియక జగన్ తో ఫోన్ మాట్లాడించారట. జగన్ తోటాతో ఫోన్లో మాట్లాడుతూ.. 'అన్నా ఒక్క సీటిస్తాం. అది నీకా? మీ అబ్బాయికా? అన్నది మీరే తేల్చుకోండి. రెండో సీటు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని' చెప్పారట. దానికి తోటా స్పందిస్తూ.. రెండు సీట్లిస్తేనే వైసీపీలో చేరతా అన్నారట. ఇంకేముంది జగన్ కి కోపం కట్టలు తెంచుకొని తోటా మీద ఫైర్ అయ్యారట. 'నువ్వు ఏమన్నా పోటుగాడివి అనుకుంటున్నావా? చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికే నీకు సీటు ఇస్తానంటున్నా. నువ్వు ఎంత పోటుగాడివో నాకు తెలుసులే. ఇష్టమైతే ఒక సీటు తీసుకొని పార్టీలోకి రా. లేదంటే మానేయ్' అంటూ ఆవేశంగా ఫోన్ పెట్టేశారట. దీంతో తోటాకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఇప్పుడే ఇలా ఉంటే వైసీపీలో చేరాక నా పరిస్థితి ఎలా ఉంటుందో అనుకొని.. ప్రస్తుతానికి వైసీపీలో చేరే ప్రోగ్రాంకి ఫుల్ స్టాప్ పెట్టి.. చంద్రబాబుతో భేటీ అయ్యి టీడీపీలోనే ఉంటానని తోటా స్పష్టం చేశారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. తోటా త్రిమూర్తుల మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
  ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవ్వడానికి ముందే.. ఏపీకి నెక్స్ట్ సీఎం నేనేనంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ హడావుడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన కేఏ పాల్.. మార్చి 25 మధ్యాహ్నం భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందే తన బంధువు ఒకరితో నామినేషన్ పత్రాలను పంపించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. పాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయాల్సి ఉండగా.. అప్పటికే సమయం అయిపోయిందని అధికారులు నిరాకరించారు. తన నామినేషన్‌ను నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉందని, అధికారులు ఉద్దేశ పూర్వకంగానే అలా చేశారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. నరసాపురంలో ఎంపీగా గెలిచి తానేంటో చూపిస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. అసలే నామినేషన్ కి చివరి రోజు, దానికి తోడు టైం కి వెళ్ళలేదు.. ఇలా అయితే సీఎం ఎలా అవుతావు కేఏ పాల్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
  లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) జరిగింది. ఇందులో రాహుల్‌తో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘దేశంలోని పేదలకు కనీస ఆదాయ భరోసా పథకం అమలు చేస్తాం. భారత్‌లోని 20 శాతం మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అంటే ఐదు కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మంది పేదలు దీని ప్రయోజనాలను పొందవచ్చు. వారి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 వేస్తాం. దీని కోసం అన్ని గణాంకాలను సరిచూసుకున్నాం. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదు’ అని తెలిపారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై చివరి అస్త్రం తాము సంధిస్తున్నామని రాహుల్‌ అన్నారు. కనీస ఆదాయ భరోసా పథకం గురించి రాహుల్‌ గాంధీ రెండు నెలల క్రితం ప్రకటించారు. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచారసభలో ఈ పథకాన్ని తాము తెస్తామని హామీ ఇచ్చారు. తరవాత దీనిపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ కూలంకషంగా చర్చించి... సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. దేశంలో కనీసం 20 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నారని పార్టీ అంచనా వేసింది. వీరందరికి నెలకు రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ. 72,000 చెల్లించాలని పార్టీ నిర్ణయించింది. దీన్నే ప్రధాన నినాదంగా జనంలోకి తీసుకెళతామని పార్టీ పేర్కొంది.
  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. భవిష్యత్తులో తనయుడు కేటీఆర్ ని సీఎం చేయడం కోసం ఇప్పటి నుంచే హరీష్ రావుని పక్కన పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ లో జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టే విపక్షాలు అలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మధ్య టీఆర్ఎస్ లో హరీష్ పేరు అంతగా వినిపించట్లేదు. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న హరీష్ ఈమధ్య పార్టీ కార్యక్రమాల్లో అంతగా కనిపించట్లేదు. హరీష్ కి మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. కేటీఆర్ కి కూడా మంత్రి పదవి ఇవ్వనప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. దీంతో విపక్షాలు.. కేసీఆర్, హరీష్ ని కావాలనే పక్కన పెడుతున్నారు. హరీష్, కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచే రోజు త్వరలోనే ఉందంటూ విమర్శిస్తున్నాయి. అయితే కేసీఆర్ విపక్షాలు విమర్శలు చేయడానికి తాజాగా మరో అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ కి అవకాశం కల్పించకుండా పక్కన పెట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 20 మంది స్టార్‌ క్యాంపెయినర్లుగా పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ వెల్లడించింది. ఈ మేరకు సీఈవోకి వివరాలు అందజేసింది. అయితే టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ పేరు లేకపోవడం గమనార్హం. జాబితాలో కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు.. మంత్రులు, పలువురి నేతల పేర్లు ఉన్నాయి. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్.. గతంలో ఎన్నో నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. ఎందరో అభ్యర్థుల గెలుపు బాధ్యతని తన భుజాన వేసుకున్నారు. తన వ్యూహాలతో బలమైన ప్రత్యర్థులను కూడా ఓడించి టీఆర్ఎస్ కు విజయాలు అందించారు. అలాంటి హరీష్ పేరు టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో లేకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్య పోతున్నాయి. మరోవైపు విపక్షాలు కేసీఆర్, హరీష్ కి అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.
           ఆకలి వేస్తే తినడానికి ఎంత ఉవ్విళ్ళూరుతామో.... తిన్నది అరిగి బయటపడకపోతే అంత అల్లాడిపోతాము. మనం తిన్నది... జీర్ణం కాక... శుష్కించి వుండలు గట్టి మలమార్గం నుండి సునాయాసంగా బయటకు రాకుండా ఉంటే దాన్ని  అనాహము మలబద్ధకము అంటారు. నడుము, వీపు యందు పట్టుకొని నట్లు ఉండటం వలన కడుపునొప్పి, ఆయాసం, వాంతి లాంటివి మలపవ్రుత్తి జరగకపోతే వస్తాయి. దప్పిక జలుబు, శిరస్సునందు మంట, కడుపునొప్పి రొమ్ము పట్టినట్టు ఉండటం, త్రేనుపులు పైకి రాకుండటం వంటి లక్షణాలు కొందరిలో ఇలా కనబడతాయి.   ముందుజాగ్రత్తలు:  ఇలా వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఏమిటంటే.....లేతముల్లంగి, మునగ ఆకులు, మునగకాయ, కాకరకాయ, పొన్నగంటికూర, ద్రాక్ష, వెల్లుల్లి, ఆవుపాలు, ఆముదము, లవల కట్టు ఏడాది దాటిన బియ్యం హితకరములు వగరు రుచిగల పదార్ధాలు, కషాయరసము గలవి మలబద్ధకము గల వారు విసర్జించాలి. మందుజాగ్రత్తలు:    హింగుత్రిగుణ తైలం రెండుచెంచాలు తీసుకొని పాలలో కలిపి సేవిస్తే గుణకారిగా ఉంటుంది. రాత్రిపూట త్రిఫలా చూర్ణం, ఒకటి రెండు చెంచాలు వేడి నీటిలో సేవించాలి. అభయారిష్ట లేదా ద్రాక్షారిష్ట  కొద్దిరోజులు సేవించాలి. అపత్తిక చూర్ణం ఒకటిరెండు చెంచాలు సేవిస్తే బావుంటుంది.  
కడుపునొప్పి ఉన్నాదా కడుపు నొప్పి... చెప్పండి నోరు విప్పి..... శూలము గుచ్చినట్టు సడన్ గా నొప్పి కలగటం వలన... శరీరాన్ని చీల్చినట్టు బాధ కలగటం వలన.. ఈ వ్యాధికి శూలవ్యాధి అనిపేరు వచ్చింది.  పొట్ట  పై భాగంలో నాభి ప్రాంతంలో, హ్రుదయము, పార్శ్వము వీపు వెన్నెముక కింది భాగము, కంఠము, పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కడైనా నొప్పి రావచ్చు. ఆహారం తినేటప్పుడు లేదా జీర్ణమయ్యే టప్పుడు కూడా నొప్పి రావచ్చు.  ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు:  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తికూర, మునగకూర, ఉప్పు వెల్లుల్లి సంవత్సరము దాటిన పాతబియ్యం ఆముదము, గోమూత్రము, వేడినీరు, నిమ్మపండ్లరసము సేవించాలి. రాత్రుల యందు నిద్రమేల్కొనుట, చేదురసం గల పదార్ధములు శీతల పదార్ధములు, వ్యాయామము, సంభోగము మద్యపానము, పప్పుదినుసులు, కారము గల పదార్ధములు తీసుకోకూడదు. దు:ఖము,కోపము, ఆవలింత, నవ్వు ఆకలి అపాన వాయువు, తుమ్ము లాంటివి నిరోధించాలి. మందుజాగ్రత్తలు:   ఆవు సంచితంలో కరక్కాయను ఉడికించి ఎండించి చూర్ణించి దాంట్లో బెల్లం, లోహభస్మం కలిపి సేవిస్తే కడుపులో మంటతో కూడిన నొప్పి వెంటనే తగ్గుతుంది. మజ్జిగలో భాస్కరలవణము, అజామోదార్కము, శంఖవటి అను ఔషధాలు బాగా పనిచేస్తాయి. హింగుత్రిగుణ తైలం ఒకటి రెండు చంచాలు వేడి నీరు గానీ లేదా పాలతో సేవిస్తే కడుపుబ్బరం, నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది. ఇంటికి చూసుకొనేది వీధి శూల... ఒంటికి చూసుకొనేది వ్యాధి శూల...
     మనం తినే ఆహారం జీర్ణమయ్యే సమయంలో కుక్షి, జఠరం, నాభి, పొత్తికడుపు, స్తనమధ్య  ప్రదేశం, నడుము, పక్కటెముకలందు నొప్పి వస్తుంది. దీనినే పరిణామ శూల కడుపులో పుండు అని అంటారు.  ఇది భుజించిన వెంటనే వాంతి చేసుకున్నాప్పుడు ఆహారమంతా జీర్ణమైనప్పుడు వస్తుంది. వరి అన్నం ఎక్కువ తిన్నప్పుడు వస్తుంది. ముందు జాగ్రత్తలు:    ఇలా వచ్చినప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఏమిటంటే.... మినుములు లాంటి పప్పు ధాన్యాలు, మద్యములు, స్త్రీ సంభోగాలు, శీతల పదార్ధాలు ఎండతిరుగుడు, నిద్రలో మేల్కొని కాలక్షేపం చేయటం, కోపము, దుఃఖము, ఆమ్ల పదార్ధసేవనం, అజీర్ణపదార్ధములు నువ్వులు లాంటివన్నీ నిషిద్దములు.  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తి కూర, మునగకూర, ఉప్పు, వెల్లుల్లి, సంవత్సరం దాటిన పాత బియ్యం, ఆముదం, గోమూత్రం, వేడి నీరు, నిమ్మపండురసం, క్షార చూర్ణము వంటివి పధ్యములు. మందుజాగ్రత్తలు:  శొంఠి, నువ్వులు, బెల్లము తీసుకొని కలిపి ముద్దగా నూరి పాలలో కలిపి సేవిస్తే ఏడురోజులలో పరిణామాలశూల శమిస్తుంది. పిప్పళ్ళ చూర్ణానికి మండూర భస్మ, తేనె కలిపి సేవిస్తే కడుపులో పుండు వెంటనే తగ్గుతుంది. పిప్పళ్ళచూర్ణం, కరకవలపు చూర్ణం, లోహభస్మమును సమభాగాలు గా కలిపి తేనె నేతులలో సేవిస్తే తీవ్ర పరిణామశూల వెంటనే శమిస్తుంది. భోజనమైన తరువాత ధాత్రీలోహము, సూతశేఖర రసము సేవిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.... ఇదే కనక అమలుచేస్తే... కడుపులో పుండు...ఇక్కడితో ఎండు...  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.