Publish Date:Jan 20, 2014
Publish Date:Dec 2, 2013
Publish Date:Nov 23, 2013
Publish Date:Nov 20, 2013
Publish Date:Nov 18, 2013
Publish Date:Nov 14, 2013
Publish Date:Nov 13, 2013
Publish Date:Nov 12, 2013
Publish Date:Nov 1, 2013
Publish Date:Nov 1, 2013
Publish Date:Oct 29, 2013

EDITORIAL SPECIAL
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
ALSO ON TELUGUONE N E W S
  అక్కినేని నాగార్జున టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను బాలీవుడ్ పాపులర్ తార దియా మీర్జా చేస్తుండటం విశేషం. ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదనీ, పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రనీ, ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తున్న నమ్మకంతో ఆమెను తీసుకున్నామనీ చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అతి త్వరలోనే దియా మీర్జా పాల్గొనే సన్నివేశాలు మొదలు కానున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే. అందులో రీసెంట్‌గా జ‌రిగిన దిశ హంత‌కుల‌ ఎన్‌కౌంట‌ర్‌ను గుర్తుకు తెచ్చేలా నాగార్జున్ లుక్ ఉంది. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ పాత్ర‌లో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారనీ, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందనీ చిత్ర బృందం తెలిపింది. షానియల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకు డేవిడ్ ఇస్మాలోన్ యాక్షన్ డైరెక్టర్.  2000 సంవత్సరంలో మిస్ ఇండియా అయిన దియా స్వస్థలం హైదరాబాదే. ముంబైలో సెటిల్ అయిన ఆమె కొంత కాలం క్రితంవరకు బాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్‌గా రాణించింది. 2014లో బిజినెస్‌మ్యాన్ సాహిల్ సంఘాను పెళ్లాడిన ఆమె 2019 ఆగస్టులో అతని నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. 'వైల్డ్ డాగ్'లో ఆమె నాగార్జున భార్యగా కనిపిస్తుందని వినికిడి.
  ప్రభాస్ టైటిల్ రోల్ చెయ్యగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కంక్లూజన్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం అసాధారణం. 2015లో వచ్చిన మొదటి భాగమే సెన్సేషనల్ రన్ సాధించిందనుకుంటే, 2017లో వచ్చిన రెండో భాగం ప్రభంజనమే సృష్టించింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమా 'లవకుశ'ను చూసేందుకు జనం దూరాభారాన్ని సైతం లెక్కచెయ్యకుండా తండోపతండాలుగా థియేటర్ల వద్దకు వెళ్లేవారని చెప్పుకుంటారు. అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రేక్షకులు 'బాహుబలి 2' చూసేందుకు ఎగబడ్డారు. అందుకే తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని కలెక్షన్ల సునామీ ఆ సినిమాకు నమోదైంది. 'బాహుబలి 2' సాధించిన రికార్డులు ఏ స్థాయివంటే, ఆ తర్వాత వచ్చిన అనేక భారీ సినిమాలు ఆ రికార్డులపై ఎంతగా గురిపెట్టినా, దాని దరిదాపుల్లోకి రాలేక, చివరకు 'నాన్-బాహుబలి' రికార్డులతో సరిపెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇటీవల వైజాగ్‌లో జరిగిన 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో అల్లు అర్జున్ తన సినిమా 'ఇండస్ట్రీ రికార్డ్' సాధించిందని ఆర్భాటంగా చెప్పుకున్నాడు. కానీ అది 'బాహుబలి 2' రికార్డులో సగం వసూళ్లు కూడా సాధించలేదు. అంటే ఆయన చెప్పింది 'నాన్-బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్' అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పటికీ ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా నరసింహారెడ్డి' వసూళ్లను కూడా దాటలేదు. మనం చెప్పుకుంటున్నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలెక్షన్ల గురించి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన 'బాహుబలి 2' మూవీ 2017 ఏప్రిల్‌లో విడుదలైంది. దాని తర్వాత ప్రెజెంట్ టాప్ హీరోల సినిమాలు ఇప్పటివరకూ 14 రిలీజయ్యాయి. విడుదలకు ముందు వాటిలో ప్రతి సినిమా 'బాహుబలి 2'ని కాకపోయినా, 'బాహుబలి 1'ని అయినా దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ అందులో వైఫల్యం చెందాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి' మూవీ 113 కోట్ల రూపాయల షేర్, 'బాహుబలి 2' 203 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాల్నే షాక్‌కు గురిచేశాయి. వీటిలో 'బాహుబలి 2' సెట్ చేసిన రికార్డులు మిగతా హీరోల గుండెల్ని గుభేల్మనిపించాయి. అందుకే కనీసం 'బాహుబలి 1' మూవీ కలెక్షన్లనైనా దాటాలని ప్రతి హీరో ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కానీ ఇంతదాకా ఏ హీరో కూడా దాన్ని అందుకోలేకపోతున్నాడు. చిరంజీవి దగ్గర దాకా వచ్చాడు కానీ.. టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. ఆయన సినిమా 'సైరా.. నరసింహారెడ్డి' 103 కోట్ల షేర్ సాధించి, పది కోట్ల రూపాయల దూరంలో ఆగిపోయింది. పవన్ కల్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి' కేవలం 40 కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. 'బాహుబలి 2' రిలీజయ్యాక టాప్ హీరోల్లో అందరికంటే ఎక్కువగా మహేశ్ సినిమాలు నాలుగు వచ్చాయి. అయినా 'బాహుబలి 1'ని కూడా ఏ ఒక్కటీ టచ్ చెయ్యలేకపోయాయి. 'స్పైడర్' కేవలం 33 కోట్ల రూపాయలతో డిజాస్టర్ కాగా, 'భరత్ అనే నేను' మూవీ 65 కోట్ల రూపాయలు, 'మహర్షి' సినిమా 80 కోట్ల రూపాయలు, 'సరిలేరు నీకెవ్వరు' తొలివారం 81 కోట్ల రూపాయలు (ఇంకా థియేటర్లలో నడుస్తోంది) షేర్ వసూలు చేశాయి. ఈ కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రెండు విడుదలవగా, వాటిలో 'జై లవకుశ', 57 కోట్లు, 'అరవింద సమేత వీరరాఘవ' 72 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి టార్గెట్‌కు చాలా దూరంగా ఉండిపోయాయి. 2020లో విడుదలయ్యే 'ఆర్ ఆర్ ఆర్' మూవీతో అతను 'బాహుబలి 1' రికార్డును దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం.. ఆ మూవీకి డైరెక్టర్ రాజమౌళి కావడం. ప్రభాస్ సైతం తన సినిమా రికార్డుని తనే బద్దలు కొట్టాలని 'సాహో' మూవీతో ట్రై చేశాడు కానీ 83 కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోయాడు. యంగ్ మెగా హీరోల్లో రాంచరణ్ రెండు సినిమాలతో 'బాహుబలి'ని దాటాలనుకున్నాడు. వాటిలో 'రంగస్థలం'తో కాస్త దగ్గరగా 92 కోట్ల రూపాయల్ని సాధించాడు. మరో సినిమా 'వినయ విధేయరామ' 56 కోట్ల రూపాయల్ని మాత్రమే సాధించగలిగింది. తారక్ తరహాలోనే చరణ్ కూడా 'ఆర్ ఆర్ ఆర్'తో 'బాహుబలి' రికార్డును సాధిస్తాడని ఆశించవచ్చు. మెగా హీరో అనే గుర్తింపు నుంచి 'అల్లు హీరో' గుర్తింపు కోసం తహతహలాడుతున్న అల్లు అర్జున్ మూడు సినిమాలతో రికార్డులపై కన్నేశాడు. వాటిలో 'దువ్వాడ జగన్నాథం' చిత్రం 58 కోట్ల రూపాయల దగ్గర, 'నాపేరు సూర్య' మూవీ 39 కోట్ల దగ్గరా ఆగిపోయాయి. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమాతో 'బాహుబలి 1'ను దాటుతాననే ఆశాభావంతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 'ఇండస్ట్రీ హిట్' కొట్టాననే ఫీలింగ్‌తో ఉన్నాడు. అయితే ఆ సినిమా 'సైరా' కలెక్షన్‌ను దాటుతుందేమో కానీ, 'బాహుబలి 1' కలెక్షన్ అందుకొనే అవకాశాలు బహు తక్కువ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికి ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్ల రూపాయల దాకా సాధించింది. బన్నీ చెప్పిన 'ఇండస్ట్రీ రికార్డ్' ఎక్కడనుంచి వచ్చిందో మనకు తెలీదు. ఏదేమైనా 'బాహుబలి 1' రికార్డులు ఇంటా, బయటా కూడా ఈ ఏడాదే బద్దలయ్యే అవకాశాలు 'ఆర్ ఆర్ ఆర్'తో పుష్కలంగా ఉన్నాయి. తారక్, చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అక్టోబరులో రిలీజవుతుందని అంటున్నారు. సినిమా బ్రహ్మాండంగా ఉందనే టాక్ వస్తే, 'బాహుబలి 2' రికార్డుల్ని కూడా అది టార్గెట్ చేసే చాన్స్ ఉంది. లేకపోతే.. ఇప్పట్లో 'బాహుబలి 2' రికార్డులు చెక్కుచెదరవు.
Cast: Ravi Teja, Sunil, Payal Rajput, Vennela Kishore, Nabha Natesh & others Editor: Shravan Katikaneni Cinematography: Karthik Ghattamneni Music Director: Thaman S Producer: Ram Talluri Director: Vi Anand Release Date: 24th Jan 2020   After listening to the movie title Disco Raja, mass maharaja fans felt it apt for him. After seeing the teaser, fans felt that Ravi Teja has done a wonderful job. So how is the movie? Let us read the review.  Story:  A person (Ravi Teja) is shown freezing in the snow of Ladhakh. He is taken to a biochemical lab without anyone’s knowledge. With the technique of making a dead person alive, Ravi Teja becomes alive alive. But he does not know who he is! So what attempts did Ravi Teja make to recall his past? While a few call him Vasu, a few call him Disco Raja. So.. Who is he? Who is Disco Raja? What did Disco Raja do for his girlfriend (Payal Rajput)? Answers to all these questions form the movie story Disco Raja.  Analysis:  “I will not do any bad film, I will do movies which have content in them.” Are some of the things mentioned by Ravi Teja in his recent interviews. As he says “Disco Raja” has some good content. Hero Ravi Teja’s characterization is very good. But the movie’s execution and direction is very weak. Director Vi Anand was very confident about the technical elements but while coming to his story, it is very weak. Coming to the second half of the movie, the concept has been completely side tracked. Instead of concentrating on the concept, the director completely depended on Ravi Teja’s routine gangster story line. Thaman’s music is okay. Production values are good.  Plus Points:  RaviTeja as Disco Raja Cinematographer Karthik Ghattamneni Sunil acting in the climax ‘Nuvvu Natho Emmanavo’ song Disco recording  Minus Points:  Routine story with science fiction election Regular gangster scenes Editing Direction Second half Confusing screenplay   Performances:  It is difficult to imagine disco raja without RaviTeja. Mass Maharaja RaviTeja is only reason for Disco Raja to work from start to end. He just lived in the character. His attitude in the movie is very lively. Sunil must be remembered next after Ravi Teja in the movie. Bobby Simha is an award winning actor & he acted very well. Naresh did a very little different character. Heroine Payal Rajput has got a very good character. Nabha is confined to just a few songs & cannot be called as heroine.   TeluguOne Perspective:  When compared to the last few movies of RaviTeja, there are lot of good elements in this movie. RaviTeja’s characterization & acting is very good. But that does not mean, it is a good movie. Disco Raja has some odd elements too. But one thing has to be surely told that this movie is a one man show from Ravi Teja.  Rating: 2.5/5
నటీనటులు: రవితేజ, బాబీ సింహా, సునీల్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, 'వెన్నెల' కిషోర్, 'స్వామి రారా' సత్య తదితరులు మాటలు: అబ్బూరి రవి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని సంగీతం: ఎస్.ఎస్. తమన్ నిర్మాత: రజనీ తాళ్లూరి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విఐ ఆనంద్ విడుదల తేదీ: 24 జనవరి 2020 'డిస్కో రాజా' టైటిల్ విని మాస్ మహారాజా రవితేజకు పర్ఫెక్ట్ అన్నారంతా. టీజర్ వచ్చాక 'డిస్కో రాజా'గా రవితేజ ఇరగదీశాడని అన్నారు. మరి, సినిమా ఎలా ఉంది? వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రవితేజకు విజయం అందిస్తుందా? దర్శకుడు విఐ ఆనంద్ సినిమాను ఎలా తీశాడు? రివ్యూ చదివి తెలుసుకోండి.  కథ: లద్దాఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్ కి వెళ్లిన కొందరు యువకులకు అక్కడ మంచులో ఫ్రీజ్ అయిన ఒక వ్యక్తి (రవితేజ) కనిపిస్తాడు. అతడిని ఎవరికీ తెలియకుండా ఒక బయో కెమికల్ ల్యాబ్ కి తీసుకొస్తారు. మరణించిన మనిషికి మళ్లీ ప్రాణం పోయడానికి ప్రయత్నాలు చేసే వైద్యుడి ప్రయోగం ఫలించడంతో రవితేజకి  ప్రాణం తిరిగొస్తుంది. అయితే... తను ఎవరు? అనేది గుర్తుకు రాదు. గతం గుర్తుకు రావడానికి రవితేజ చేసిన ప్రయత్నాలు ఏంటి? అతణ్ణి వాసు అని కొందరు, డిస్కో రాజా అని కొందరు అంటారు. ఇంతకీ... వాసు ఎవరు? డిస్కో రాజా ఎవరు? ప్రేమించిన హెలెన్ (పాయల్ రాజ్ పుత్) కోసం డిస్కో రాజా ఏం చేశాడు? డిస్కో రాజాకి, బర్మా సేతు (బాబీ సింహ)కి ఉన్న వైరం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ:  ఇకపై బ్యాడ్ ఫిలిమ్స్ చెయ్యను. గుడ్ ఫిలిమ్స్, గుడ్ క్యారెక్టర్స్ చేస్తా. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ చేస్తా' - ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ చెప్పిన కామన్ డైలాగ్. ఆయన చెప్పినట్టు 'డిస్కో రాజా'లో గుడ్ కాన్సెప్ట్ ఉంది. కంటెంట్ ఉంది. కంటెంట్ కి తగ్గట్టు హీరోకి మంచి క్యారెక్టరైజేషన్ కూడా కుదిరింది. కానీ, ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బ్యాడ్. డైరెక్షన్ వీక్. టెక్నికల్ ఎలిమెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేలా దర్శకుడు విఐ ఆనంద్ చూసుకున్నారో... స్క్రిప్ట్ విషయంలో అంత వీక్ గా ఉన్నారు. అవసరం లేని సన్నివేశాలతో నిడివి పెంచడమే కాదు... సెకండాఫ్ కి వచ్చేసరికి అసలు కాన్సెప్ట్ పక్కన పెట్టేసి, కేవలం డిస్కో రాజాగా రవితేజ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యి రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సినిమాను మార్చేశారు.  సినిమా స్టార్ట్ అవ్వడమే మంచి పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. మరణించిన మనిషిని మళ్లీ బతికించడం అనే కాన్సెప్ట్ తో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి రవితేజ కోమాలోనుండి లేచిన తర్వాత, అంతకు ముందు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ గురించి వివరిస్తూ సన్నివేశాల నిడివి పెంచుకుంటూ వెళ్లారు. అక్కడకీ... తన టైమింగ్ తో రవితేజ చాలా సన్నివేశాలను లైవ్లీగా మార్చేశాడు. ప్రీ ఇంటర్వెల్ ముందు డిస్కో రాజా క్యారెక్టర్ రివీల్ చేసిన విధానం బావుంది. అక్కడ ప్రేక్షకులకు ఒక హై వస్తుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపు ఆ టెంపో కొనసాగింది. మెల్లమెల్లగా సినిమా రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్లింది. ఎండింగ్ కూడా మాఫియా, గ్యాంగ్ స్టార్ సినిమాల్లో చూసేదే. అందువల్ల, ట్విస్టులు పెద్దగా క్లిక్ కాలేదు. ప్రీ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కోసం తప్ప సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఎందుకూ ఉపయోగపడలేదు.  డైరెక్టర్ విఐ ఆనంద్ 100% బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వకపోయినా... సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ 100% అవుట్ పుట్ ఇచ్చారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ బావుంది. రిట్రో ఎపిసోడ్స్, మంచు కొండల్లో సీన్స్ ను కార్తీక్ ఘట్టమనేని బాగా పిక్చరైజ్ చేశాడు. ఆర్ట్ వర్క్ కూడా బావుంది. తమన్ పాటల్లో 'నువ్వు నాతో ఏమన్నావో' పాట మరికొన్ని నెలలు వినబడుతుంది. డిస్కో రాజా ఎపిసోడ్స్ కి మంచి రీ రికార్డింగ్ ఇచ్చాడు. 'ఫ్రీక్ అవుట్' సాంగ్ కూడా బావుంది. రామ్ తాళ్లూరి ఖర్చుకు వెనుకాడలేదు. ఆయన ప్రొడక్షన్ డిజైన్ బావుంది.   ప్లస్ పాయింట్స్: డిస్కో రాజాగా రవితేజ నటన కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ క్లైమాక్స్ లో సునీల్ నటన, బాబీ సింహా 'నువ్వు నాతో ఏమన్నావో' సాంగ్, డిస్కో రీరికార్డింగ్   మైనస్ పాయింట్స్: సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ తీస్తే రొటీన్ స్టోరీ కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే డైరెక్షన్  సెకండాఫ్ రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ సీన్స్ ఎడిటింగ్ నటీనటులు:  రవితేజ లేని 'డిస్కో రాజా'ను ఊహించుకోవడం కష్టం. ఈ సినిమాకు మొదలు... చివర...  అంతా మాస్ మహారాజానే. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ కుదరడంతో ఎక్కడా ఆగలేదు. తగ్గలేదు. క్యారెక్టర్ లోకి వెళ్లి కిక్ ఇచ్చాడు. డిస్కో రాజాగా రవితేజ నటనలో ఒక ఈజ్ కనపడుతుంది. బాడీలో ఒక మూమెంట్ ఉంటుంది. రవితేజ మేనరిజమ్స్, యాటిట్యూడ్ సినిమాను చాలావరకు లైవ్లీగా మార్చాయి. రవితేజ తర్వాత సినిమాలో చెప్పుకోవలసిన నటుడు సునీల్. డిస్కో రాజా అనుచరుడిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాదాసీదాగా ఉన్నప్పటికీ... పతాక సన్నివేశాల్లో చెలరేగాడు. 'అపరిచితుడు'లో విక్రమ్ తరహాలో వావ్ అనిపించాడు. బాబీ సింహా నేషనల్ అవార్డు అందుకున్న నటుడు. మంచి నటన కనబరిచాడు. నరేష్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ కి మంచి క్యారెక్టర్ దొరికింది. నభా నటేష్ ఒక పాటకు, రెండు సన్నివేశాలకు పరిమితమైంది. తాన్యా హోప్ క్యారెక్టర్ ను హీరోయిన్ రోల్ అని చెప్పలేం.   తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: లాస్ట్ రవితేజ చేసిన రెండు మూడు బ్యాడ్ ఫిలిమ్స్ తో పోలిస్తే... గుడ్ అనిపించుకోదగ్గ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రవితేజ నటన, క్యారెక్టరైజేషన్ బావున్నాయి. అలాగని, సినిమాను గుడ్ ఫిలిమ్ అనలేం. ఎందుకంటే... 'డిస్కో రాజా'లో బ్యాడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. అయితే... ఒక్కటి మాత్రం పక్కాగా చెప్పొచ్చు. రవితేజ వన్ మ్యాన్ షో చేసిన సినిమా 'డిస్కో రాజా'. మాస్ మహారాజా వీరాభిమానులకు నచ్చుతుంది. రేటింగ్: 2.5/5
  సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రపు నీళ్లలో నిల్చొన చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు. తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్ కు యాప్ట్ అనిపిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఏప్రిల్ 2న మూవీని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. టాప్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్‌లో అడుగుపెడుతుండగా, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేస్తున్నాడు. 'రాక్ స్టార్' దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'ఉప్పెన'ను నిర్మిస్తోంది. సాయిచంద్, బ్రహ్మాజీ మరో రెండు కీలక పాత్రలు చేస్తున్నారు.
మండలిలో పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే... కౌన్సిల్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో... తెలుగుదేశానికి రుచి చూపించాలన్న పట్టుదలతో... జగన్మోహన్ రెడ్డి ఉన్నారని... దాంతో, మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో జగన్ పట్టుదలకు పోతేమాత్రం మండలి రద్దు తప్పదంటున్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విశ్లేషించిన మీడియా, రాజకీయ విశ్లేషకులు సైతం మండలి రద్దు ఖాయమనే చెబుతున్నారు. అయితే, పట్టుదలకుపోయి మండలిని రద్దుచేస్తే, ముందుముందు జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. మరి, వీళ్లందరికీ ఏం సమాధానం చెబుతారు... ఏవిధంగా పదవుల్లో అకామిడేట్ చేస్తారనేది ప్రశ్నార్ధకమే. హామీలు పొందినవాళ్ల సంగతి పక్కనబెడితే... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న 9మంది తమ పదవులు కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారతారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.  అయితే, మండలి రద్దయితే, ఇప్పటికిప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు వచ్చే ముప్పు లేకపోయినా, ఆరు నెలలు తర్వాత మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈలోపు... ఏవైనా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలొచ్చి... ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్ప.... వీళ్లిద్దరూ మంత్రి పదవుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సుండదు. అయితే, ఏపీలో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగే పరిస్థితే లేదు. దాంతో, మండలి రద్దు జరిగితే మాత్రం ఆర్నెళ్ల తర్వాత కచ్చితంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు మాజీలుగా మారిపోతారు. అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు... వైఎస్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తులు. పైగా ఎప్పట్నుంచో వైఎస్ ఫ్యామిలీతో అసోసియేటై ఉన్నారు. అదే సమయంలో జగన్ కు కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. అందుకే, మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అయితే, మండలి రద్దయి ఆర్నెళ్ల తర్వాత మాజీలుగా మారితే... వీళ్లిద్దరికీ కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టొచ్చని అంటున్నారు.
ఏపీ రాజధానిని మూడు భాగాలుగా విభజించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించడం అంటే.. పసి పిల్లాడిని పెంచి పెద్ద చేయడం లాంటిది. పిల్లోడు పుష్టిగా పెరగాలంటే టైంకి పాలు, ఫుడ్, నీళ్లు సరిగ్గా అందించాలి. అలా కాకుండా పాలు ఒక దగ్గర, ఫుడ్ ఒక దగ్గర, నీళ్లు మరో దగ్గర అంటూ.. అటు ఇటు తిప్పితే పిల్లోడి ఎదుగుదలకే ప్రమాదం. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించి అభివృద్ధికి బలమైన పునాది వేయాలి. ఆ రాజధాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేయాలి. దానిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాని ఇలా పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఒరిగేదేమి లేదు. ఇలా మూడు నాలుగు రాజధానుల అనుకంటూ పొతే.. ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా పోతుంది. ఎక్కడా పూర్తిగా అభివృద్ధి జరగదు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపవు. మన దేశంలోని పలు రాష్ట్రాలను తీసుకోండి. వాటికంటూ రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాతే.. రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేసుకున్నాయి. తమిళనాడుని తీసుకోండి. రాజధాని చెన్నైని బాగా అభివృద్ధి చేసుకుంది. దాంతో పాటే కోయంబత్తూర్, తిర్పూర్, ట్రిచీ, సేలం ఇలా ఎన్నో నగరాలను అభివృద్ధి చేసుకుంది. మహారాష్ట్రని తీసుకుంటే ముంబై, నాగపూర్, పూణే ఇలా ఎన్నో నగరాలు అభివృద్ధి చెందాయి. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణను తీసుకుంటే.. తెలంగాణకు ఆదాయం తెచ్చే కామధేనువు హైదరాబాద్. రాష్ట్రానికి భారీగా ఆదాయం తెచ్చే పునాది హైదరాబాద్ ఉంది కాబట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలలో.. ఐటీ హబ్ లు, మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు.. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని అభివృద్ధి చేసుకొని.. ఆ తరువాత రాష్ట్రంలోని మిగతా నగరాలని అభివృద్ధి చేసుకొని దూసుకుపోతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానులు పేరుతో.. అసలు ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా చేస్తోంది. హైదరాబాద్ కి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. వసతులు, ఆదాయ వనరులు ఉండటంతో.. లక్షల్లో ప్రజలు హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇప్పుడు ఏపీలో ప్రాంతానికో రాజధాని పెట్టుకుంటే పొతే.. పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. ఈ మూడు రాజధానుల వల్ల ఏపీకి ఆదాయం తగ్గిపోవడమే కాదు.. భారీగా ఆర్ధిక భారం కూడా పడనుంది. గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల కోసం పలు భవనాలు నిర్మించింది. అధికారులు, ఉద్యోగుల వసతి కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ పరిపాలనను విశాఖకు మారిస్తే.. కొత్తగా భవనాలు నిర్మించాలి, ఉద్యోగులకు వసతి కల్పించాలి. ఇదంతా ఆర్ధిక భారం కాదా? వివిధ శాఖలను తీసుకుంటే విశాఖకు తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు సుమారుగా లక్షమంది ఉంటారు. ఈ ఉద్యోగులందరికీ విశాఖ వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బిఎ) ఇవ్వనుంది. ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం ఇవ్వనుంది. 1) ఒక్కొక్కరికి 200 గజాల ప్లాటు గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. అంటే 1,00,000x 200x 21,000 = 42,000 కోట్లలుతుంది. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టడటం సాధ్యం కాదన్న వారు.. కేవలం ఉద్యోగుల స్థలాల కోసం 42 వేల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? సరే ఎక్కడో సిటీకి దూరంగా ఇచ్చినా గజం రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు. పోనీ గజం 5,000 తీసుకున్నా.. 10,000 కోట్లు ఖర్చవుతుంది. 2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం. 1,00,000 x 25,00,000 = 25 వేల కోట్లు 3) షిఫ్టింగు భత్యం 50,000 నుండి లక్ష వరకు. సగటు గా ఒక్కొక్కరికి 75,000 అనుకుంటే 1,00,000 x 75,000 = 750 కోట్లు అంటే కేవలం ఉద్యోగుల కోసమే దాదాపు 50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా అయిపోలేదు. పలు శాఖల భవనాలు కూడా ఉన్నాయి. * విజయవాడలో 4 లక్షల చదరపు అడుగులలో వంద కోట్ల ఖర్చుతో R&B భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో వంద కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 2 లక్షల చదరపు అడుగులలో 108 కోట్ల ఖర్చుతో ఏపీఐఐసీ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 108 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో లక్ష చదరపు అడుగులలో 40 కోట్ల ఖర్చుతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 40 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * విజయవాడలో లక్ష చదరపు అడుగులలో 143 కోట్ల ఖర్చుతో విద్యుత్ సౌధ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 143 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో శాసనసభ, శాసనమండలి మరియు సచివాలయం భవనాలకు కలిపి నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు మళ్లీ విశాఖలో సచివాలయం కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడతారు? * గొల్లపూడిలో 30 వేల చదరపు అడుగులలో నాలుగున్నర కోట్ల ఖర్చుతో దేవాదాయ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో 58 కోట్ల ఖర్చుతో కమాండ్ కంట్రోల్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 58 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 65 వేల చదరపు అడుగులలో 19 కోట్ల ఖర్చుతో ఏపీ పోలీస్ టెక్ టవర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 19 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? అమరావతిలో ఎన్నో భవనాల నిర్మాణం జరిగింది. వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజధానిని తరలించాలని నిర్ణయించింది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఖర్చుతో రాజధానిని తరలిస్తే.. అదంతా ప్రభుత్వం మీద భారం కాదా? ప్రజా ధనం వృధా కాదా?. ఇప్పటికైనా ఆలోచించండి.
కీడు ఎంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సమయంలో 2015 లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట గుర్తుచేశారు. "అనేక వేల మంది రైతులు.. వారి నమ్మకాన్ని, వారి భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని టీడీపీ ప్రభుత్వం చేతుల్లో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి?. కీడు ఎంచి మేలెంచమంటారు కదా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాలేదు అనుకున్నాం. అప్పుడు మంత్రి నారాయణ ఉండరు, పత్తిపాటి పుల్లారావు ఉండరు. మరి రైతుల పరిస్థితి ఏంటి?. వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి?. వారు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తున్నారు.. కానీ ఆ నమ్మకానికి గ్యారంటీ ఏంటి?" అని పవన్ ప్రశ్నించారు. పవన్ అనుమానమే నిజమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతులు పెట్టుకున్న నమ్మకం కన్నీటి పాలైంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు అడుగులు వేస్తోంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంచి.. మిగతా పరిపాలన విభాగమంతా విశాఖకు తరలిస్తోంది. దీంతో రైతులు, మహిళలు.. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారు ఎంత గొంతు చించుకున్నా, ఎంత కన్నీరు పెట్టుకున్నా ఏం లాభం?. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది. అప్పుడు టీడీపీ నేతలు.. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం.. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రాకెట్ లా దూసుకుపోతుందని చెప్పారు.. ల్యాండ్ పూలింగ్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా వంటివారు.. ల్యాండ్ పూలింగ్ లో ప్రధాన పాత్ర పోషించారు. మీ భవిష్యత్తు ఆకాశాన్ని తాకుతుంది అంటూ.. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? పవన్ అనుమానించినట్టుగానే.. టీడీపీ అధికారంలోకి రాలేదు. రైతుల నమ్మకానికి గ్యారంటీ ఏంటని పవన్ ప్రశ్నించినట్టుగానే.. వారి నమ్మకం దుఃఖంగా మారింది. ఇప్పుడు రైతులు రాజధానిని తరలించొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు రైతులకు మాటలు చెప్పి భూములు తీసుకున్నవారు ఏమైపోయారు?. ముఖ్యంగా 'ల్యాండ్ పూలింగ్' అనే సినిమాకి తానే 'స్టోరీ-డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్' అన్నట్టు ఫీలైన మాజీ మంత్రి నారాయణ ఏమైపోయారు?. అప్పుడు రైతులు భూములు ఇచ్చేవరకు తిరిగారు కాదా.. మరి ఇప్పుడు అదే రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే.. వారి పక్షాన పోరాడరా?. ఏమైపోయారు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలు?. దేవినేని ఉమా వంటి వారు అప్పుడప్పుడు బయటికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కానీ.. నిజంగా రైతులకు మేమున్నామన్న ధైర్యం ఇస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారా? లేదు. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో.. రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడించాలని టీడీపీ ప్లాన్ చేసింది. కానీ ఏమైంది? టీడీపీ నేతలు ఎంతమంది పాల్గొన్నారు?. ఎవరికివారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే చాలు, మేం ఉద్యమంలో పాల్గొన్నట్టే అని ఫీలయ్యారు. ఈ తూతూ మంత్రం పోరాటాలు వల్ల ఒరిగేది ఏంటి?. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనని హౌస్ అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి.. సీక్రెట్ గా ఒక చోట దాక్కొని, పోలీసుల కళ్ళు గప్పి సడెన్ గా ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. అలాంటి దూకుడు ఏపీ టీడీపీ నేతల్లో కరువైంది. ఎలాగూ హౌస్ అరెస్ట్ చేస్తారు.. ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా అన్నట్టుంది నేతల తీరు. ఎంపీ గల్లా జయదేవ్ మాత్రమే దూకుడు కనబరిచారు. కొందరి నేతల్లా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయకుండా.. పొలాల వెంట, గుట్టల వెంట నడిచి.. రైతులకి అండగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరి మిగతా నేతలు ఏం చేస్తున్నారు? అప్పుడు రైతుల పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు రైతుల కోసం పోరాడలేరా?
కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.  రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చుక్కుదురైంది. తనపై ఉన్నఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై.. ఈరోజు కోర్టు విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్న సీఎం జగన్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 31 కి వాయిదా వేసింది. దీంతో ఇకపై జగన్ కోర్టుకి హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓవైపు రాజధానిని అమ‌రావ‌తి నుండి తరలించాలని ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. మ‌రోవైపు ఈ న‌గ‌రానికి ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఆసక్తికరంగా మారింది. స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి పురస్కారం లభించింది. స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో.. స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. కాగా, విశాఖకు వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి షాక్ ఇస్తూ 15 వ ఆర్థిక సంఘం తన నివేదికను సిద్ధం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించింది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష కేటాయింపులు తగ్గించి వివిధ రూపాల్లో రాష్ట్రాలకు అందించే గ్రాంట్లను పెంచుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్కె సింగ్ నేతృత్వం వహించిన ఆర్ధిక సంఘం తన నివేదికను గత ఏడాది డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించింది. పథకాలకు నిధులను తగ్గించి రెవిన్యూ లోటు, విపత్తునిధి మున్సిపల్, పంచాయితీలు ఇతర స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ లను పెంచిందని అధికార వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రాల పని తీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని సిఫారసు చేసినట్లు సమాచారం.  గ్రామీణ, సామాజిక రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశముంది. ఈ సిఫారసులు 14 వ ఆర్థిక సంఘానికి భిన్నంగా ఉన్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఉన్న 32 శాతం నిధుల కేటాయింపును 14 వ ఆర్థిక సంఘం 42 శాతానికి పెంచి గ్రాంట్లను తగ్గించింది. 15వ ఆర్ధిక సంఘం తద్భిన్నంగా నిధులు తగ్గించి గ్రాంట్లను పెంచుతుంది. నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బ పడనుంది, నిధుల లేమితో వాటిని కుదించడమో లేక ఆపేయటమో చేయాలి. గ్రాంట్ల పెంపు అనేది షరతులకు లోబడి ఉంటుందని రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఈ దృష్ట్యా కూడా తమకు భారమేనని రాష్ట్ర అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ఖజానాపై భారం తగ్గుతున్నప్పటికీ రాష్ట్రాలకు భారం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను సైతం ఆశించిన రీతిలో చేపట్టలేక పోవచ్చునని రాష్ట్రంలో ఆందోళన నెలకొనవచ్చని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పని తీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సిఫారసు సరిగ్గా అమలు జరగకపోవచ్చని, పర్ఫామెన్స్ ఎసెస్ మెంట్ అనేది కేంద్రం చేతిలోనే ఉంటుంది కాబట్టి సరిగ్గా న్యాయం జరగదని రాష్ట్రాల నుంచి సిఫారసులు రావచ్చు. కానీ ఈ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఓ అధికారి తెలిపారు. 2020, 2021 వార్షిక బడ్జెట్ కు ఇంకా పది రోజుల గడువు ఉందనగా ప్రస్తుతం ద్రవ్యలోటు జిడిపిలో 3.6 ఉంది. అంచనా 3.3 శాతం కంటే ఇది ఎక్కువ, ఇక రెవిన్యూ కూడా భారీగా పడిపోయింది.ఫలితంగా ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం 114 శాతానికి పెరిగి పోయింది. ఈ దశలో రాష్ర్టాలకూ ఉదారంగా నిధులు ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. 15 వ ఆర్థిక సంఘం సిఫారసులు నిజంగా ఈ లైవ్ లోనే ఉంటే రాష్ట్రాల నుంచి ప్రతిఘటన తప్పదని పలువురు ఆర్థిక రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల తగ్గింపులో ప్రతిపక్షాలు వ్యతిరేకించవచ్చునని వారంటున్నారు. జీఎస్టీ కింద రావాల్సిన మొత్తాన్నే కేంద్రం నెలల తరబడి ఇవ్వటం లేదు, ఇక పన్నుల వాటా కింద నిధుల్లో కోత పెట్టడమే కాక ఆ కోత పెట్టిన మొత్తాన్ని కూడా సకాలంలో ఇస్తుందన్న నమ్మకం లేదని రాజకీయ విశ్లేషకులు తమదైన వాదనను వినిపిస్తున్నారు.
    Try this online free smoking risk calculator that helps you to understand how much of your life span is taken up by smoking. It also tells you how much of your life span is left with you if you continue to smoke based on the information you give about your cigarette intake. The calculator takes into input your age, the date from when you have started smoking, and in case if have quit smoking too. Based on this user input information, the smoking risk calculator calculates the risk involved in smoking by providing the following output, i.e., the total life you have lost due to smoking, and how much of it remains. This  prediction is only an approximate assessment of how smoking poses a risk to a person’s life span. http://www.medindia.net/patients/calculators/ciger_smoke.asp        
కాలం మారిపోయి ఉండవచ్చు. మనం తినే ఆహారంలో చిన్నా చితకా మార్పులు వచ్చి ఉండవచ్చు. కానీ  మనదేశంలో ఇప్పటికీ ఆహారాన్ని అమ్మే తీరులో పెద్దగా మార్పు రాలేదు. రోడ్డు పక్కన దొరికే సమోసాల దగ్గర్నుంచీ, బండి మీద అమ్మే బజ్జీల వరకూ సాధారణంగా న్యూస్‌పేపర్లోనే చుట్టి ఇస్తారు. న్యూస్‌పేపర్ చవకగా దొరుకుతుంది కదా, దాంతో పొట్లం తేలికగా కదా అని అమ్మేవాడు అనుకోవచ్చు... కానీ ఆ అలవాటుతో కేన్సర్ సైతం దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   అసలు న్యూస్‌పేపర్లలో చుట్టిన పదార్థాలు ఎంతవరకు క్షేమం అన్న అనుమానం వచ్చింది మన దేశ ఆరోగ్యశాఖ మంత్రి జే.పి.నడ్డాకి. దాంతో ఈ అలవాటు మీద తగిన మార్గదర్శకాలను జారీచేయవలసిందిగా The Food Safety and Standards Authority of India (FSSAI) కి సూచించారు. దాంతో FSSAI వెలువరించిన ఓ ప్రకటన ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.   FSSAI ప్రకారం న్యూస్‌పేపర్‌ ముద్రణలో వాడే నానారకాల రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్రహాని జరగవచ్చు. పైగా వీటిలో ఉండే Bioactive materials వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు, పాత న్యూస్‌పేపర్ల మీద రకరకాల సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది FSSAI.   రీసైక్లింగ్ చేసిన కాగితాలతో రూపొందిన అట్టపెట్టెల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తప్పంటున్నారు. వీటిలో లోహ అవశేషాలు, phthalates వంటి హానికారక రసాయనాలు ఉంటాయట. అవి జీర్ణసంబంధ వ్యాధులకి దారితీస్తాయనీ, శరీరాన్ని విషమయం చేసేస్తాయనీ హెచ్చరిస్తున్నారు.   అదీ విషయం! కాబట్టి న్యూస్‌పేపర్లలో కానీ, రీసైక్లింగ్ చేసిన వస్తువులలో కానీ ఆహారపదార్థాలను చుట్టవద్దన్నది FSSAI సూచన. కనీసం ఆహార పదార్థాలలో ఉండే నూనెను పీల్చేసేందుకు కూడా వీటిని వాడవద్దంటున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, రోగులు ఇలాంటి అలవాటుకి దూరంగా ఉండాలని కోరుతున్నారు. వీరిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, కేన్సర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.   న్యూస్‌పేపర్లో ఆహారాన్ని అందించడాన్ని నివారించేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అవకాశం ఏదీ లేదు. కాకపోతే ప్రజల్లోనూ, అమ్మకందారుల్లోనూ తగిన అవగాహన కల్పించేందుకు దేశమంతటా ప్రచారం చేసే దిశగా FSSAI చర్యలు తీసుకుంటోంది. అది ఎంతవరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే! ఈలోగా మనవరకు మనం అలాంటి ఆహారానికి కాస్త దూరంగా ఉంటే మంచిది.   - నిర్జర.
    In a new research study it was discovered that exercising not only keeps you fit but is also known to reverse skin aging in people who exercise regularly. Earlier studies at McMaster involving mice that were bred to age prematurely had shown that a steady regimen of exercise could stave off or even undo the signs of early aging in these animals. When members of this breed of mice remained sedentary, they rapidly grew wizened, frail, ill, demented, and graying or bald. But if they were given access to running wheels, they maintained healthy brains, hearts, muscles, reproductive organs, and fur far longer than their sedentary labmates. Their fur never even turned gray. The researchers speculated that this might do the same for our skin. Researchers at McMaster University in Ontario began to wonder if such alterations were inevitable.So to test that possibility, the scientists first gathered 29 local male and female volunteers ages 20 to 84. About half of the participants were active, performing at least three hours of moderate or vigorous physical activity every week, while the others were resolutely sedentary, exercising for less than an hour per week. Then the researchers asked each volunteer to uncover a buttock. “We wanted to examine skin that had not been frequently exposed to the sun,” said Dr. Mark Tarnopolsky, a professor of pediatrics and exercise science at McMaster who oversaw the study, which was presented this month at the American Medical Society for Sports Medicine annual meeting in New Orleans. But those results shifted noticeably when the researchers further subdivided their samples by exercise habits. They found that after age 40, the men and women who exercised frequently had markedly thinner, healthier stratum corneums and thicker dermis layers in their skin. Their skin was much closer in composition to that of the 20- and 30-year-olds than to that of others of their age, even if they were past age 65. But now the samples looked quite different, with outer and inner layers that looked very similar to those of 20- to 40-year-olds. “I don’t want to over-hype the results, but, really, it was pretty remarkable to see,” said Dr. Tarnopolsky, himself a middle-aged exerciser. Under a microscope, the volunteers’ skin “looked like that of a much younger person, and all that they had done differently was exercise.” How exercise changes skin composition is not completely clear, but in a separate portion of the study, the researchers checked for alterations in the levels of certain substances created by working muscles. Called myokines, these substances are known to enter the bloodstream and jump-start changes in cells far from the muscles themselves. In this case, the scientists found greatly augmented levels of a myokine called IL-15 in the skin samples of volunteers after exercise. Their skin samples contained almost 50 percent more IL-15 after they had been exercising than at the start of the study. Nor is there evidence that exercise reverses wrinkling and other damage from the sun, some of which many of us accumulate during outdoor exercise. Still, Dr. Tarnopolsky said, “it is astonishing to consider all of the intricate ways in which exercise changes our bodies —including the skin ". Source:NY Times
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.