LATEST NEWS
తెలుగు దేశం పార్టీ కి మొదటి నుండి స్నేహ హస్తం ఇస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆ పార్టీ పై పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జన సేన అధినేత, ప్రతిసారి, రాష్ట్రంలో టీడీపీ ని కేంద్రంలో బీజేపీ ని వెనకేసుకుంటూ వచ్చారు. కానీ, ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. అసలు, పవన్ తిరుగుబాటుకు అసలు కారణం ఏమై ఉండోచ్చబ్బా అని ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే, పవన్ కి బాబు మీద కన్నా ఆయన పుత్రుడు లోకేష్ మీదే కోపం ఎక్కువ ఉందట. దీనికి కారణం ఏంటంటే, లోకేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని చిన్న చూపు చూస్తున్నాడట. పార్టీ మీటింగ్స్ లో గానీ, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే, ఆయన వల్ల ఒరిగేదేమి లేదు, లైట్ తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చేవాడట. జన సేన తో పొత్తు కావాలంటే, తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తే, లోకేష్ ససేమీరా అన్నాడట. ఆ మధ్య పవన్ ని చంద్రబాబు ఎక్కువగా పట్టించుకోకపోవడానికి కారణం కూడా లోకేషే నట. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఇక టీడీపీ కి దూరం గా ఉందామని డిసైడ్ అయ్యాడట. తన స్పీచ్ ద్వారా మొత్తానికి బాబు, లోకేష్ పై కక్ష తీసుకున్నాడని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్  బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది. బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయిన ప్రశాంత్ కిషోర్ ఈ భేటీకి హాజరై... రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై వివరించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే, పీకే కి చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఓ టీవీ ఛానల్ క్లిప్ను జతచేస్తూ మరీ...`పూర్తిగా అవాస్తవ కథనం. అసత్యకథనాలను ప్రచారం చేసేందుకు దురుద్దేశపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారం గురించి వదిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది. అంతేకాకుండా  బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా  ప్రశాంత్ కిషోర్ను నియమించడం కూడా పూర్తిగా అబద్దమని పేర్కొంది. ఇదిలా ఉంటె, రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ కి, వైకాపా కి పోతుకుదుర్చే పనిలో ఉన్నారని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్‌కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తన భర్తని చూసేందుకు తనకు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 72 ఏళ్ల నటరాజన్‌కు లివర్ చెడిపోవడంతో 2017 అక్టోబర్‌లో కిడ్నీ మరియు లివర్ మార్పిడి ఆపరేషన్ జరిపారు. అయితే రెండు వారాల క్రితం ఆయన అస్వస్థతతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి హృద్రోగ సమస్య తలెత్తడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంతకు మునుపు నటరాజన్ కి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చినప్పుడు, శశికళ పెరోల్ పై వచ్చి భర్తని పరామర్శించి వెళ్లిన సంగతి తెలిసిందే.
ALSO ON TELUGUONE N E W S
We all know that, young hero Nithin is a die-hard fan of Power Star Pawan Kalyan. Fortunately, the actor got to associate with his favorite star who is co-producing his upcoming entertainer Chal Mohan Ranga directed by Krishna Chaitanya. Nithin informed that, Chal Mohan Ranga pre release function to be held on 25th month will be attended by none other than Pawan Kalyan as chief guest. “All set for a Grand Pre Release event of #ChalMohanaRanga on the 25th of this month..and my Producer and our POWER STAR wil b the Chief Guest for the function!! Exciteddd!! Other details soonn!!" tweeted Nithin. Earlier, Pawan Kalyan attended audio launch events of Nithin’s previous films Ishq and A Aa. This will be the third time, Pawan Kalyan gracing Nithin’s fim event.
శ్రీమంతుడు విడుదలయిన కొత్తలో ఆ సినిమా పవన్ కళ్యాణ్ చేసుంటే బాగుండేదని కొందరు అభిప్రాయ పడ్డారు. అందుకు కారణం లేకపోలేదు. రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు కాబట్టి ఆ సినిమా చేసుంటే పవన్ కి మైలేజ్ వచ్చేది అనేది వారి వాదన. శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ తో ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న భరత్ అనే నేను ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా కనిపించనున్నాడు. గత చిత్రాలకు సొంతంగా కథ రాసుకున్న శివ, ఈసారి మాత్రం శ్రీహరి నాను అనే కొత్త రచయిత దగ్గర స్టోరీ తీసుకున్నాడు. కథ రాసే సమయంలో, శ్రీహరి మనసులో పవన్ కళ్యాణ్ ఉన్నాడట. స్క్రిప్ట్ పనులు పూర్తవగానే పవన్ ని కలిసి నరేషన్ ఇచ్చాడట. కథ నచ్చినప్పటికీ, పవన్ ఆ సినిమా చేసేందుకు భయపడ్డాడట. అందుకు కారణం, సినిమాలో హీరో సీఎం కాబట్టి తనకు సీఎం అవ్వాలనే కోరిక ఉందనే తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయని అభిప్రాయ పడ్డాడట. ఇక ఆ కథ కొరటాల దగ్గరికి వెళ్లిన తర్వాత, మహేష్ బాబు వెంటనే ఓకే చేసాడట. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాల్ని రిజెక్ట్ చేయగా అవి సూపర్ హిట్టయ్యాయి. మరి, ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.
  తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న నయనతార తమిళ్లో మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ముందు కెళ్తుంది. ప్రమోషన్స్ కోసం పెద్ద ఇంటరెస్ట్ చూపని, నయన్ ఒకానొక సందర్భంలో ఏడ్చేసింది. శ్రీ రామ రాజ్యం సినిమా పై ఎంతో మక్కువ పెంచుకున్న నయన్, ఆ సినిమా షూటింగ్ అయిపోగానే అందరి ముందు కన్నీరు, మున్నీరై ఏడ్చేసింది. ఇక అలాంటి సంఘటనే మళ్లీ పునరావృతమైంది. కానీ, ఈసారి ఎమోషనల్ అయింది కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ మహానటి లో సావిత్రి రోల్ చేస్తున్న కీర్తి తాను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసిందట. ఇక నిన్నటితో షూటింగ్ ముగిసి పోవడంతో సెట్లోనే కన్నీటి పర్యంతమయ్యిందట. ఇక నుండి తాను సాధారణ నటిగా ఉండాల్సి వస్తుందని... సావిత్రి పాత్ర చేయడం తన జీవితంలో దొరికిన గొప్ప వరం గా చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయిందట. కీర్తి మాత్రమే కాదు, యూనిట్ మొత్తం షూటింగ్ ముగిసిపోవడంతో కొంచెం ఎమోషనల్ అయ్యారట. చివరి రోజు షూటింగ్ పురస్కరించుకొని, నిన్న పూలతో సావిత్రి చిత్రపఠానికి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే, మే 9 న మహానటి ప్రేక్షకుల ముందుకి వస్తున్న విషయం మనకు తెలిసిందే.
Stylish Star Allu Arjun and mega power star Ram Charan are gearing up to entertain mega fans this summer with their respective films Naa Peru Surya and Rangasthalam. While Charan’s movie is all set for release on 30th of this month, Bunny’s movie will grace theaters on May 4th. Meanwhile, Allu Arjun posted a picture of his son Allu Ayaan in Chitti Babu getup. As we all know, Ram Charan’s character name in Rangasthalam in Chitti Babu and the actor will be seen as a village guy who has hearing problem. In the picture, Allu Arjun’s son Allu Ayaan can be seen imitating Ram Charan. The costumes and pose is similar to that of Charan in Rangasthalam.
Mahanati team has finally broken the pumpkin. The team headed by director Nag Ashwin wrapped up entire shooting part with final day yesterday on sets. The biopic on legendary actress Savitri produced jointly by prestigious production houses Vyjayanthi Movies and Swapna Cinema will now move into rapid post production phase to release in theaters very soon. “Our special thanks to Akkineni Naga Chaitanya for donning the cap of his grandfather legendary ANR garu. Mohan Babu garu always stood our pillar support. We enriched ourselves every moment working with him. Thanks for his blessings on both of us and felicitation from such a great personality made our last day much more memorable,” said Swapna Dutt and Priyanka Dutt as Keerthy Suresh wiped the tears rolling down her cheeks.
  హీరో శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటినుండో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని శివాజీ డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేస్తున్న కుట్ర గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పట్ల ఒక జాతీయ పార్టీ ఆపరేషన్ చేపట్టిందని...ఆపరేషన్ పేరు ద్రవిడ అందులో భాగమే ఏపీ గరుడ... తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ...కర్నాటకలో ఆపరేషన్ కుమార అని అన్నారు. 2017 సెప్టెంబర్లోనే ఓ అజ్ఞాతవ్యక్తి ద్వారా ఈ విషయం నాకు తెలిసింది.. ఈ ఆపరేషన్ కు 4,800 కోట్లు కేటాయించారు..అందులో కొన్ని డిస్పాచ్ అయ్యాయి... 2019 ఎన్నికలే జాతీయ పార్టీ నిర్వహించే ఈ ఆపరేషన్ అని అన్నారు. రాష్ట్రం మీద వాళ్ల అధిపత్యం ఎలా సాధించాలనుకుంటున్నారో..ప్రతి విషయానికి నాదగ్గర ఆధారం ఉంది.. అంతేకాదు.. ఈ ఆపరేషన్ సంధాన కర్తగా ఓ రాజ్యాంగ శక్తి ఉన్నాడు అని కూడా చెప్పారు.   ఇదిలా ఉండగా..  ఇంకో విషయం కూడా శివాజీ బయటపెట్టారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం..రేపు అవిశ్వాసం తీర్మానం చర్చకు వస్తుంది..కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు మాట్లాడుతారు.. అందులో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు హిందీలో మాట్లాడతారని చెప్పారు. ఈ ఆరు మంది కూడా అనర్గళంగా ధడ్ ధడ్ లాడిస్తారని... ఏపీకి అంతా చేసేశామని చెప్తారని.. వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు. రేపు సభలో జరగబోయేది ఇదే అని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలపై చర్చలు మొదలయ్యాయి. మరి ఇంత గట్టిగా చెబుతున్నాడంటే సమాచారం పక్కాగానే ఉండోచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి శివాజీ చెప్పినట్టే జరుగుతుందా.. లేక బీజేపీ ఏదైనా మార్పులు చేస్తుందా.. చూడాలి..
  గత నాలుగేళ్ల నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చాలా సన్నిహత సంబంధం ఏర్పడింది. ఈ నాలుగేళ్లలో పవన్ వైసీపీ పై విమర్శలు గుప్పించడమే కానీ.. ప్రభుత్వాన్ని పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా సమస్యపై పవన్ ప్రభుత్వాన్ని నిలదీసిన.. ఈ పని చేయాలని డిమాండ్ చేసినా.. వెంటనే చంద్రబాబు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అలా ఇద్దరి మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండేది. అంతలా పవన్ ను చంద్రబాబు నమ్మారు. అయితే ఉన్నట్టుండి పవన్ యూటర్న్ తీసుకొని టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.   జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుండి ఈరోజు వరకూ పవన్ టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక పవన్ చేసిన విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అయితే పవన్ పై నిప్పులు చెరిగారు. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన పవన్... మరోసారి టీడీపీపై, చంద్రబాబుపై విమర్సలు గుప్పించారు. దీంతో ఈ ఉదయం ఎంపీలతో సుదీర్ఘ టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించిన ఆయన.. పవన్ వ్యాఖ్యలపై స్పందించి తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలతో ఇంత డ్యామేజ్ చేస్తారని ఎన్నడూ అనుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారట. వివిధ కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నామని పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి తేల్చి చెప్పారు.   తన స్వార్థ ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాల కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్ వంటి వ్యక్తి ఓ విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని.. తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు. మొత్తానికి పవన్ ను ఇంతలా నమ్మిన చంద్రబాబుకు.. పవన్ ఇలా చేస్తాడని కనీసం కలలో కూడా అనుకోని ఉండరు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడే ఏకంగా చంద్రబాబుపై, ఆయన తనయుడిపైనే డైరెక్ట్ గా విమర్శలు గుప్పించడంతో చంద్రబాబు బాగానే ఫీలవుతున్నట్టున్నారు.
  ఎవ్వరూ ఉహించని విధంగా గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టీడీపీ పై విమర్శలు గుప్పించి ఏపీ రాజకీయ పరిణామాలనే మార్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ పై యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి.. ఇన్ని రోజులు టీడీపీని విమర్సించని పవన్ కళ్యాణ్ టీడీపీపై ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటీ అని.. ఆలోచనపడ్డారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. ఇసుక నుంచి  మట్టి వరకు  నేల తల్లిని అమ్ముకుంటున్నారు..  ఇదంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నా మీద్రుష్టికి రాలేదా? ఒకవేల వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. లేకపోతే మీకు తెలిసే అన్నీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తమిళనాడుకు చెందిన టీటీడీ మాజీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డికి లోకేష్ కు సబంధాలున్నాయని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు పవన్.   దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటని అనుకుంటున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎదురుదాడికి దిగింది. పవన్ వెనుక బీజేపీ ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై తాను అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటో పవన్ చెప్పాడు. ఓ న్యూస్ ఆఫీస్ కు వెళ్లిన పవన్ ను ఒక ముఖ్యమంత్రి కొడుకుపై మీ లాంటి సెలబ్రిటీ అటువంటి ఆరోపణలు చేశారు.. మీ దగ్గరేమన్నా.. ఆధారాలున్నాయా అని అడుగగా.. దీనికి పవన్ సమాధానం చెప్తూ.. లోకేష్ పై ఉన్న ఆరోపణలు అందరి దృష్టిలో ఉన్నవేనని.. వాటినే నేను మళ్లీ గుర్తు చేశానని అన్నారు. అందరి దృష్టిలో ఉండి నీ దృష్టికి రాలేదా అని అందరూ అడుగుతారనే తాను ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డితో తనకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు అది ఎంత వరకూ నిజమో చెప్పాలి అని అన్నారు...దానికి లోకేశ్..  శేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా అని అడుగగా.. అంటే.. ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అంటూ చెప్పాను అంతే అంటూ చాలా తేలిగ్గా తేల్చారు.
  రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అన్న దానికి పవన్ కళ్యాణ్ స్పీచే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్నటి వరకూ టీడీపీ పై ఎలాంటి విమర్సలు గుప్పించని పవన్.. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఎప్పుడు సభలు పెట్టినా.. వైసీపీ పార్టీ పై లేదా బీజేపీ పై సెటైర్లు, విమర్శలు చేసే పవన్ ఈసారి మాత్రం టీడీపీ పైనే విమర్శలు గుప్పించారు. కేంద్రంపై, వైసీపీపై ఏదో రెండు మూడు విమర్శలు చేసినా.. టార్గెట్ మొత్తం టీడీపీపైనే చేశారు. ముఖ్యంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.   అయితే ఇక్కడే ఓ ఆసక్తిర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రతిపక్షపార్టీగా ఉంది. అయితే ఆ విషయం జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే... వైసీపీ ప్రతిపక్షపార్టీ అన్న పేరే కానీ ప్రజా సమస్యలపై అధికార పార్టీతో పోరాడింది లేదు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. పోనీ తాను రాకపోయినా.. పార్టీ నేతలను అయినా పంపిస్తారంటే అదీ లేదు... తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు అని కండీషన్స్ పెడుతుంటాడు. సరే ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పినా.. దానిని పరిష్కరించకుండా.. నేను సీఎం అయిన తరువాత చేస్తా.. అప్పుడు చూస్తా అని కబుర్లు చెబుతుంటాడు. దీంతో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోయింది. ఇక సీబీఐ కేసుల భయంతో పూర్తిగా ఢిల్లీకి లొంగిపోయింది. పొత్తో.. విలీనమో.. ఖరారు చేసుకోవడానికి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష స్థానానికి పూర్తి స్థాయి ఖాళీ ఏర్పడింది.   ఇక దీన్నే పవన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్… తెలుగుదేశం పార్టీకి అనేక విషయాన్ని మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ లేవనెత్తే అంశాపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ… పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీ పార్టనర్ అంటూ… విమర్శలు ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టడంతో పాటు.. ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్లుగా ఉండేలా.. పవన్ కల్యాణ్ .. టీడీపీకి పూర్తి స్థాయిలో తన విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలా వెళితేనే రాజకీయంగా ముందుంటామని నిర్ణయించుకున్నట్టుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కనుక నిజమైతే.. జగన్ సీఎం అవ్వడం ఏమో కానీ.... ప్రతిపక్ష నేతగా ఉండటం కష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న పవన్ ఇప్పుడు ఇలా రివర్స్ పంచ్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటో పవన్ కే తెలియాలి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
  తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది నిజంగా ఘోరం, నేరం! తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సదరు ఎమ్మెల్యేలందర్నీ సస్పెండ్ చేసేసి, అవసరమైతే డిస్మిస్ కూడా చేసేయాల్సినంత దారుణం. లేకపోతే ఏమిటండీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు అసెంబ్లీలో కళ్ళకి, చెవులకి పని చెప్పి సైలెంట్‌గా కూర్చోవాలి. అధికార పార్టీ ఎలా పరిపాలించినా కిక్కురుమనకుండా పడి వుండాలి. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడమేంటసలు? పైగా బంగారు తెలంగాణను సాధించడానికి నిరంతరం శ్రమపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తెలియజేయడమేంటి? తప్పుకదా? అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి తగిన శాస్తి చేయడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందట.   అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. వాళ్ళ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలన భలే నచ్చేసి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోయి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మిగిలిన కొద్దిమంది కూడా టీఆర్ఎస్ జీవన స్రవంతిలో కలసిపోయి ధన్యులైపోవాలి. అలా కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే వుంది ఆందోళనలు చేయడం ఏమైనా పద్ధతిగా వుందా? పైగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గోలగోల చేయడం ఎంతమాత్రం బాగాలేదని టీఆర్ఎస్ నాయకులు ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఏంటీ? తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులు చేసిన గోలతో పోల్చుకుంటే ఈ గోల ఏపాటిదని అంటున్నారా? అప్పుడు ఇదే గవర్నర్ నరసింహన్ మీద టీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరారని, మైకు లాగారని, ఎమ్మెల్యే జె.పి. మీద డ్రైవర్ చేత దాడి చేయించారని గుర్తు చేసుకోండని అంటున్నారా? అసలు మీ వాదనలో అర్థం వుందా? అప్పుడంటే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏది చేసినా కరెక్ట్... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం అది తప్పున్నర తప్పు. అలాంటి తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ సభ్యులకు తగిన శిక్ష పడాల్సిందే.   అది సరేగానీ, తెలంగాణ విధాన మండలిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరారు. అది డైరెక్టుగా వెళ్ళి ఛైర్మన్ గారి కంటిమీద తగిలింది. ఆ దెబ్బ చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో వున్నారు కాబట్టి ఆ బాధని చాలాసేపు భరించారు. గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యే వరకూ ఆయన ఆ బాధని భరిస్తూనే వున్నారు. ఆయన ఓర్పుకి జోహార్. ఆ తర్వాత ఆయన సీఎం గారి సలహా మేరకు కంటి డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. కంటి డాక్టర్లు ఆయన కంటికి డాక్టర్ గారు పెద్ద కట్టు కట్టారు. గౌరవనీయులైన స్వామి గౌడ్ గారి కంటికి వున్న ఆ కట్టును చూసి తెలంగాణలో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. స్వామి గౌడ్ గారి కంటికి ఏమీ కాదని డాక్టర్లు భరోసా ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలి ఒక కన్ను పోతే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో! ఒక కంటితో ఆయన సమావేశం హాలు మొత్తాన్నీ ఒకేసారి చూడలేక చాలా ఇబ్బంది పడేవారు. అలా జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తూ రయ్యిమని దూసుకుని వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తగిన విధంగా శిక్షించాల్సిందే.
  వైసీపీ పార్టీ పరిస్థితి ఏపీలో ఏంటో అందరికీ తెలిసిందే. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ తీరు నచ్చక పార్టీ నుండి కీలక నేతల సైతం జంప్ అవ్వడం ఇవన్నీ పార్టీ స్థాయిని ఎప్పుడో పడేశాయి. ఇక జగన్ పాదయాత్ర గురించి తమ ఛానెల్ కు తప్ప మరో ఛానెల్ కు గుర్తుండదు. అలాంటిది జగన్ గురించి జాతీయా మీడియాలో రావడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి కారణం.. బీజేపీతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎలాంటి సంబంధం లేకపోయినా... బీజేపీ మౌత్ పీస్ గా పేరున్న రిపబ్లిక్ టీవి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. అప్పుడే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటాయేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే చెబుతూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పకనే చెబుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటిది... దాని గురించి వార్తలు రాయడం మానేసి.. సమయం సందర్బం లేకుండా... జగన్ కు వకాల్తా పుచ్చుకొని కొన్నిజాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుస్తాడు అని వార్తలు రాయడం పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...వైకాపా అధికారంలోకి రాకపోయినా...టిడిపి దగ్గరకు చేరుతుందని...టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. టిడిపికి...వైకాపాకు కేవలం రెండుశాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని..రాబోయే రోజుల్లో లోటును అధిగమించి..అధికారం వైపు వైకాపా దూసుకుపోతుందని..'జగన్‌' చేస్తోన్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా..వంటి అంశాలు..ప్రజల్లోకి బాగా వెళ్లాయని...దీంతో...'జగన్‌' గెలుస్తారని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ రకంగా బీజేపీ-వైసీపీ పొత్తు ఖాయమని తెలుస్తుంది. లేకపోతే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే పట్టించుకోవడం లేదుకానీ.. దేశంలో వార్తలు ఏం లేనట్టు జాతీయ మీడియా జగన్ కు గురించి ఇలాంటి రాతలు రాయడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. బీజేపీ హ్యాండ్ లేకపోతే ఇలాంటి వార్తలు రావడం.. అందులో జాతీయ మీడియా సంస్థల్లో రావడం అంటే కష్టం. మరి ఇప్పటికే 'బిజెపి'తో 'జగన్‌' కుమ్మక్కయ్యారని ప్రజలు భావిస్తున్నారు.. ఈ వార్తలు చూసి వైసీపీ-బీజేపీ పొత్తు పై క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీతో వైసీపీ కలిస్తే ఏముంటుంది.. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న సామెత లాగ ఉంటుంది..
  ఏపీకి కేంద్రం మరో షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన చిల్లర బుద్దిని చూపించింది. ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు కేటాయించకపోగా.. ఇప్పుడు ఇచ్చిన నిధుల్లోనే మళ్లీ వెనక్కి తీసుకోవడం ఆ ప్రభుత్వానికి చెల్లింది. గతంలో వెనుక బడిన జిల్లాల నిధుల విషయంలో ఇలానే వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీపై తన చిన్న చూపు చూపింది. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం... వంద శాతం కాదు కదా.. కనీసం యాభై శాతం కూడా నిధులు ఇవ్వకుండా డ్రామాలాడుతుంది. అడగ్గ అడగ్గా.. ఎప్పుడో ఒకసారి... అరునెలలకో.. ఏడాదికో ఏదో నానా సాకులు చెబుతూ... ఏదో చిల్లర విధిల్చినట్టు నిధులు విడుదల చేస్తోంది. ఇప్పుడు ఆ నిధుల్లో కూడా వంకలు చూపించి.. ఇచ్చిన దాంట్లోనే కొంత భాగం వెనక్కితీసుకుంటున్నారు.  ఏపీ ప్రభుత్వం నెలల తరబడి ప్రయత్నాలు చేయగా.. కేంద్రం పధ్నాలుగు వందల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ నాబార్డుకు లేఖ రాసింది. అయితే కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలపై  వెంటనే రంగంలోకి దిగిన పీఎంవో పోలవరం కోసం విడుదల చేసిన మొత్తం నుంచి…కొంత తగ్గించాలని ఒత్తిడి చేసింది. దాంతో కేంద్ర జలవనరుల శాఖ… నాలుగొందలు కోట్ల రూపాయలను తగ్గిస్తూ … కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మరోసారి కేంద్రానికి ఏపీ విషయంలో చిన్నచూపు చూపు ఉందన్న విషయం అర్దమైంది...
  నేను ప్రధాని మోడీని కలుస్తా.. ఎన్నిసార్లైనా కలుస్తా.. మీకెందుకు.. చంద్రబాబుకు ఎందుకు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా మీద చిందులు వేసిన సంగతి తెలిసిందే కదా. ఇక విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు ఆయనపై కామెంట్లు విసిరారు. ఓ దొంగ, ఓ అవినీతిపరుడు ప్రధాని మోదీని కలిస్తే... ఇక మనం చెప్పేదేముంటుందని... నేరస్థులకు పీఎంవో గస్తీ కాస్తుందా అని ప్రశ్నించారు. పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయి రెడ్డి తనను బోనులో పెట్టిస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకుముందు మాజీ నేరస్తుడు సీబీఐ డైరెక్టర్‌ను కలిస్తే కేసు పెట్టారు.. ఇప్పుడు ఏకంగా ఒక నేరస్థుడే పీఎంవోకి రెగ్యులర్ విజిటర్ అయిపోయాడు..దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని ప్రశ్నించారు. అంతేకాదు నేను ఎన్నిసార్లైనా మోడీని కలుస్తా అని అంటున్నారు.. అవసరమైతే పీఎంవోలోనే కాపురం పెట్టుకోండి... మాకు నష్టం ఏంలేదని సెటైర్ వేశారు.
  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డీజీగా ఈయన పనిచేస్తున్నారు. ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాజీనామా దరఖాస్తును ఆమోదించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ప్రచారం జరుగుతుంది. లక్ష్మీ నారాయణ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారని.. అంతేకాదు.. కొత్త పార్టీ స్థాపన లేదా.. జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  కాగా గతంలో సీబీఐ జేడీగా లక్ష్మినారాయణ  జగన్ అక్రమాస్తుల కేసులను విచారించిన సంగతి తెలిసిందే.
గ్లోబల్ వార్మింగో మరొకటో.... కారణం ఏదైతేనేం! ఒకో ఏడాది గడిచేకొద్దీ ఎండల తీవ్రత పెరిగిపోతూనే వస్తోంది. ఆ ఎండల బారిన పడి వడదెబ్బతో విలవిల్లాడిపోయేవారి సంఖ్యా పెరిగిపోతోంది. కానీ కాస్తంత అవగాహన ఉంటే వడదెబ్బని తప్పించుకోవడం ఏమంత కష్టం కాదంటున్నారు.   వడదబ్బ కలిగే పరిస్థితిని Hyperthermia అంటారు. మన శరీరం నుంచి వెళ్లిపోయే వేడికన్నా, శరీరం లోపల ఉన్న వేడి ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పుడుతుంది. దాంతో శరీరంలో వేడిని నియంత్రించే thermo regulation అనే వ్యవస్థ దెబ్బతినిపోయి వడదెబ్బకి దారితీస్తుంది. సాధారణంగా 40.6 డిగ్రీలని మించి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వడదెబ్బ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   విపరీతమైన ఉష్ణోగ్రతలకి తోడు మరికొన్ని పరిస్థితులు కూడా వడదెబ్బకి కారణం కావచ్చు. మందపాటి దుస్తులు వేసుకోవడం, ఎండలో విపరీతంగా శ్రమించడం, నేరుగా ఎండ తీక్షణత ఒంటికి తగిలేలా తిరగడం వంటి చర్యలతో ఏరికోరి వడదెబ్బని తెచ్చుకున్నట్లవుతుంది. ఇక మద్యపానం, కాఫీటీలు తాగడం వల్ల కూడా వాటిలోని రసాయనాలకి ఒంట్లో డీహైడ్రేషన్ ఏర్పడి వడదెబ్బకి దారితీయవచ్చు.   ముందు జాగ్రత్త   వడదెబ్బ వచ్చాక బాధపడేకంటే రాకుండా చూసుకోవడం తేలిక. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. - ఎండాకాలం వదులుగా, లేత రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోవాలి. - బయటకి వెళ్లాల్సి వస్తే వెడల్పాటి అంచులు ఉన్న టోపీ పెట్టుకోవడం చాలా ఉపయోగం. - మూసి ఉన్న కారులో ఉష్ణోగ్రతలు చాలా త్వరగా పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని కారులో వదిలి వెళ్లకూడదు. ఎండలో ఉంచిన కారులో వేడి కాస్త తగ్గేదాకా తలుపులు తీసి ఉంచాలి. - పిల్లలు, వృద్ధులలో వేడిని నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. - కుక్కలు, పిల్లులకి చెమటే పట్టదు. ఇవి త్వరగా వడదెబ్బకి గురవుతాయి. కాబట్టి వీటిని వదలి బయటకు వెళ్లేటప్పుడు, వాటికి అందుబాటులో తగినంత మంచినీరు ఉందో లేదో గమనించుకోవాలి. - మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మూత్రం పచ్చగా ఉంటే మనం తగినంత నీరు తాగడం లేదని గ్రహించాలి.   వడదెబ్బ తగిలితే! కళ్లు తిరగడం, అయోమయంగా ప్రవర్తించడం, నిస్సత్తువగా మారిపోవడం, తలనొప్పి, చెమట పట్టకపోవడం, వాంతులు, గుండెదడ... లాంటి లక్షణాలన్నీ వడదెబ్బ సమయంలో చూడవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఫిట్స్ రావడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మరణానికే దారితీయవచ్చు. అందుకని వడదెబ్బ తగిలిందన్న అనుమానం రాగానే ఈ చర్యలు తీసుకుంటే రోగి కోలుకునే అవకాశం ఉంటుంది.   - రోగి ఒంటి మీద ఉన్న దుస్తులు వదులుచేసి బాగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. - మెడ, గజ్జలు, తల దగ్గర నీటిలో తడిపిన గుడ్డలని ఉంచాలి. దాంతో ఉష్ణోగ్రతలు వెంటనే అదుపులోకి వస్తాయి. - చల్లటి నీరు నింపిన టబ్బులో రోగిని ముంచితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. - ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని ఒక్కసారిగా కాకుండా నిదానంగా తాగించాలి.   ఒక పక్క ప్రాథమిక చికిత్స చేస్తూనే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవసరాన్ని బట్టి రోగికి ఇంట్రావీనస్ ద్వారా శరీరంలో కోల్పోయిన లవణాలను వెంటనే అందించే ప్రయత్నం చేస్తారు. - నిర్జర.      
  మిరపకాయలకి.. ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటీ..? పండు మిరపకాయల వల్ల ఆయుష్సు పెరుగుతుందట. వెర్మంట్ యూనివర్శిటీ పరిశోధనలో ఏం తేలింది..? https://www.youtube.com/watch?v=fShjOnYEoKs
ఆహారంలో ఉప్పు ప్రాధాన్యత మనకు తెలిసిందే. అయితే, ఉప్పు సరయిన మోతాదులో వేస్తేనే కూరలు రుచిగా ఉంటాయి. ఉప్పు ఎక్కువయినా ప్రాబ్లమ్, తక్కువయినా టేస్టీ గా ఉండదు. మరి, మనం తినే ఆహారంలో ఉప్పు ఎంత వాడాలి. ఎక్కువ వాడితే వచ్చే సమస్యలు ఏంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=X4qx29YBtw0