Publish Date:Dec 10, 2013
Publish Date:Dec 2, 2013
Publish Date:Nov 27, 2013
Publish Date:Nov 23, 2013
Publish Date:Nov 20, 2013
Publish Date:Nov 18, 2013
Publish Date:Nov 14, 2013
Publish Date:Nov 13, 2013
Publish Date:Nov 12, 2013
Publish Date:Nov 1, 2013
Publish Date:Nov 1, 2013
Publish Date:Oct 29, 2013

LATEST NEWS
In a bizarre incident, a man was let off with 2.5 lakhs for raping a girl and leaving her pregnant. A group of elders in a village of Telangana has let off the culprit. The incident has come to light when the girl’s mother noticed physical changes in her body. When she took her for a medical examination, the pregnancy was discovered with the 17 year old girl. However the news has soon spread like a wild fire and the police took the notice of it. Speaking to news agency PTI, the police inspector has revealed that the four "elders" who made such bargaining were arrested along with the accused. They were presented before the court and were sent to judicial custody.
Well! Facing a financial crisis is always natural to any organisation. But it would be surprising that a giant institution like Air India gets into a position where it could not even pay salaries to the staff. For the fifth month in a row Air India is said to making huge delay in disbursing the pay cheques. The pilots association is of course not happy with the turn of events. It has warned the management that delay of payment could affect the safety of passengers. “Financial uncertainty is a source of frustration, anxiety and stress, which result in undue fatigue, adversely impacting flight safety and the overall performance levels of employees,” said the statement issued by the employees association. However the civil aviation ministry is making all the plans to infuse huge amounts into the company to make it financially viable and fit to race with the competitors.
  Well! If you are stepping on a railway platform today, don’t get jolted by the view of Station Master sitting on the platform with a placard. The All India Station Masters Association (AISMA) was going on a one day long hunger strike. Reason! They were protesting the discrimination against station masters in the seventh pay commission. According to the pay commission, station masters can only one promotion in his life time. And the masters are asking for more! Meanwhile, Railways have issued an advisory asking the Railway Protection Force (RPF) to take precautionary measures for smooth running of the trains during the hunger strike.
ALSO ON TELUGUONE N E W S
  తారాగ‌ణం :  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు సంగీతం:  గోపీసుంద‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌ నిర్మాణం :  జీఏ2 పిక్చ‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ :  అల్లు అర‌వింద్‌ నిర్మాత :బ‌న్నీ వాసు క‌థ, ద‌ర్శ‌క‌త్వం, మాట‌లు :  ప‌ర‌శురామ్‌ త‌న‌కు కాబోయే భార్య‌లో అమ్మ ప్రేమ‌, వాత్స్య‌ల్యాన్ని కోరుకునే సంప్ర‌దాయ భావాలు క‌లిగిన యువ‌కుడు, అమ్మంటే ఓ దేవ‌తా స్వ‌రూపం..భార్య ఎప్ప‌టికీ అమ్మ కాలేదు కాబ‌ట్టి వ‌రించిన అమ్మాయినే అమ్మ‌గా చూసుకోవాల‌ని భావించే ఓ అమ్మాయి...కొంత విరుద్దభావాలు క‌లిగిన, మ‌రికొన్ని సారుప్య‌తలు క‌లిగిన ఓ జంట క‌లిసి చేసే ప్ర‌యాణం, ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డే మ‌న‌స్ప‌ర్థ‌లు, అనుమానాలు, అనురాగాలు, అల‌క‌లు, విర‌హం, వియోగం...వీట‌న్నింటి క‌ల‌బోతే గీత గోవిందం. మ‌న‌సును త‌ట్టే భావోద్వేగాలు, మ‌న‌సారా న‌వ్వించ‌గ‌లిలే హాస్యం ఉంటే ప్రేమ‌కథ‌లెప్పుడూ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తూనే ఉంటాయి. గీత గోవిందం చిత్రంలో ఈ ల‌క్ష‌ణాల‌న్ని పుష్క‌లంగా ఉన్నాయి. అర్జున్‌రెడ్డి చిత్రంతో విజ‌య్‌దేవ‌ర‌కొండ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. దీంతో ఆయ‌న త‌దుప‌రి చిత్రం గురించి యువ‌త ఉత్సుక‌త‌తో ఎదురుచూస్తున్నారు. మ‌హాన‌టి చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపించాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. అయితే అర్జున్‌రెడ్డి త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం గీత గోవిందం కావ‌డంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్ష‌కుల్లో, అటు ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. గీతా ఆర్ట్్స వంటి అగ్ర నిర్మాణ సంస్థ నుంచి వ‌స్తున్న‌చిత్రం కావ‌డం కూడా ఈ సినిమాపై అంచ‌నాల్ని పెంచింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన గీత గోవిందం క‌థాకమామీషు ఏమిటో ఓ సారి చూద్దాం.. క‌థ‌: కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు విజ‌య్ గోవిందం (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). ఆధునిక యువ‌కుడైనా సంప్ర‌దాయాల్ని అమితంగా గౌర‌విస్టుంటాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి నిత్యం క‌ల‌ల్లో విహ‌రిస్తుంటాడు. కాబోయే శ్రీ‌మ‌తి స‌ర్వ‌స్వంలా జీవితాన్ని గ‌డ‌పాల‌ని స్వ‌ప్పాల్లో తేలిపోతుంటాడు. ఓ రోజు గుడిలో త‌న ఊహా సుంద‌రిలాంటి అమ్మాయైన గీత (ర‌ష్మిక మంద‌న్న‌)ను చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న చెల్లెలి పెళ్లి కోసం సొంత ఊరు కాకినాడు వెళుతున్న అత‌నికి బ‌స్సులో గీత తార‌స‌ప‌డుతుంది. ఈ ప్ర‌యాణంలోనే గీత‌తో ప‌రిచ‌యం పెంచుకోవాల‌నుకుంటాడు గోవిందం. ఈ క్ర‌మంలో అనుకోకుండా గీత విషయంలో త‌ప్పు చేస్తాడు గోవిందం. త‌న‌తో గోవిందం అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాడ‌ని గీత కోపోద్రిక్తురాల‌వుతుంది. త‌న అన్న‌య్య (సుబ్బ‌రాజు)తో చెప్పి గోవిందం భ‌ర‌తం ప‌ట్టించాలనుకుంటుంది. తీరా కాకినాడ వెళ్లాక త‌న చెల్లిని పెళ్లాడేది గీత అన్నయ్యే అని తెలుసుకుంటాడు గోవిందం. ఈ క్ర‌మంలో గోవిందం, గీత మ‌ధ్య ఏం జ‌రిగింది?  గీత త‌న అన్న‌య్య‌కు గోవిందం గురించి నిజం చెప్పిందా?  రెండు వారాల పాటు హైద‌రాబాద్‌లో క‌లిసి ప్ర‌యాణం చేసిన గీత‌, గోవిందం చివ‌ర‌కు ఏం తెలుసుకున్నారు? ఇద్ద‌రి క‌ల‌హాల ప్ర‌ణ‌యం ఏ విధంగా సుఖాంతం అయింది? ఇవ‌న్నీ తెర‌పై చూడాల్సిందే...     విశ్లేష‌ణ‌... ప్రేమ‌క‌థ‌కు అంద‌మైన అల్లిక ముఖ్యం. క‌థాంశం ఏదైనా దానిని ప్రేక్ష‌క‌రంజ‌కంగా చెప్ప‌డంలోనే సృజ‌నాత్మ‌కత దాగి వుంటుంది. క‌థాప‌రంగా గీత గోవిందం న‌వ్య‌మైన‌దేమి కాదు. అనూహ్య మ‌లుపులు, అతిశ‌యోక్తులు ఏమి వుండ‌వు. ఓ చిన్న క‌థ‌ను అర్థ‌వంత‌మైన స‌న్నివేశాల కూర్పుతో చ‌క్క‌టి హాస్యంతో తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు ప‌రశురామ్‌. బ‌స్సు ప్ర‌యాణంలో అనుకోకుండా  గోవిందం చేసిన తప్పును గీత అపార్థం చేసుకోవ‌డంతో ఇద్ద‌రి పాత్ర‌ల మ‌ధ్య ఏర్ప‌డే సంఘ‌ర్ష‌ణ‌, ఆ త‌ర్వా క‌లిసి చేసే ప్ర‌యాణంలో గీత‌గోవిందం న‌డుమ‌ చోటుచేసుకునే సంఘ‌ట‌న‌లు...వీట‌న్నింటిని క‌న్విన్సింగ్‌గా తెర‌పై తీసుకొచ్చారు. ప్రథ‌మార్థ‌మంతా గీత‌గోవిందం మ‌ధ్య త‌లెత్తే అపోహ‌లు, గిల్లికజ్జాల‌తో ఆద్యంతం హాస్య‌భ‌రితంగా సాగింది. గోవిందంపై గీత ఎప్పుడూ చిట‌ప‌ట‌లాడ‌టం, మేడ‌మ్ మేడ‌మ్ అంటూ గీత‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి గోవిందం చేసే ప్ర‌యాస చ‌క్క‌టి వినోదాన్ని పండించాయి. దీనికి రాహుల్ రామ‌కృష్ణ (అర్జున్‌రెడ్డి ఫేమ్‌) మిత్ర బృందం జ‌త‌కావ‌డంతో హాస్యం ప‌రిపూర్ణంగా పండింది. గోవిందం మిత్రుడైన  రాహుల్‌రామ‌కృష్ణ‌..అత‌ని స్నేహితుల బ్యాచ్ పండించిన కామెడీ ఆసాంతం న‌వ్వించింది. ఇక ద్వితీయార్థంలో గీత‌..గోవిందు మంచిత‌నం గురించి తెలుసుకోవ‌డం, అత‌నికి ద‌గ్గ‌ర కావ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు..ఈ క్రమంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎమోష‌న‌ల్‌  స్ట్ర‌గుల్‌ను హార్ట్ ట‌చింగ్‌గా ఆవిష్క‌రించారు. ప్రీక్లైమాక్స్‌లో గీత‌, గోవిందం న‌డుమ అన్న‌వ‌రం దేవాల‌యంలో న‌డిచే ఎపిపోడ్ భావోద్వేగ‌భ‌రితంగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఘ‌ట్టాల్లో వెన్నెల కిషోర్ కామెడీ కడుపుబ్బా న‌వ్విస్తుంది. ఎక్క‌డా  విసుగు లేకుండా రెండున్న‌ర‌గంట‌ల పాటు క‌థ‌,  క‌థ‌నాల్ని అద్బ‌తంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. సంభాష‌ణ‌లు బాగున్నాయి. బిగిస‌డ‌ల‌ని క‌థ‌నంతో, చ‌క్క‌టి కామెడీతో సినిమాను అర్థ‌వంతంగా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌నిపిస్తుంది. న‌టీన‌టుల ప‌నితీరు.. ఈ క‌థ‌కు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పాత్ర‌లు మూల‌స్తంభాలుగా నిలిచాయి. తెర‌పై వీరిద్ద‌రి జంట అందంగా, క‌న్నుల‌పండువ‌గా అనిపించింది. ముఖ్యంగా విజ‌య్‌దేవ‌ర‌కొండ సెటిల్డ్ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. అర్జున్‌రెడ్డి వంటి స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ త‌ర్వాత ఇలాంటి సాఫ్ట్ అండ్ ఎమోష‌న‌ల్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒదిగిపోయిన తీరు అమోఘంగా అనిపిస్తుంది. విజ‌య్ నట‌న‌ను ఎక్క‌డా వేలేత్తి చూపించే ఆస్కారం క‌న‌బ‌డ‌దు. ర‌ష్మిక సినిమా ఆసాంతం సీరియ‌స్‌గా క‌నిపించినా ఆమె హావ‌భావాలు, చ‌క్క‌టిరూపం మెప్పిస్తాయి. ప‌తాక‌ఘ‌ట్టాల్లో అన్న‌పూర్ణ‌, వెన్నెల కిషోర్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నవేశాలు న‌వ్విస్తాయి. నాగ‌బాబు గోవిందం తండ్రిగా క‌నిపించారు. అయితే ఆయ‌న‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌డం కుద‌ర‌లేదు. గోపీసుంద‌ర్ సంగీతం బాగుంది. మెలోడీ ప్ర‌ధాన‌మైన స్వ‌రాల‌తో అల‌రించింది. ఇంకేం ఇంకేం కావాలి పాట హైలైట్‌గా నిలిచింది. మ‌ణికంద‌న్ కెమెరా ప‌నిత‌నం ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా బంధించింది. ముఖ్యంగా దేవాల‌యం నేప‌థ్మంలోని ప‌తాకఘ‌ట్టాల్లో ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. సాంకేతికంగా అన్ని అంశాలు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా అనిపించాయి.     తీర్పు క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా చ‌క్క‌టి కామెడీ, సున్నిత‌మైన భావోద్వేగాలు, హృద‌యానికి హ‌త్తుకునే ప్ర‌ణ‌య స‌న్నివేశాల‌తో గీత గోవిందం అంద‌రిని అల‌రిస్తుంది. ఓ ఆహ్లాద‌భ‌రిత‌మైన ప్రేమ క‌థ‌ను చూశామ‌నే అనుభూతిని మిగులుస్తుంది. విజ‌య్‌దేవ‌ర‌కొండ కెరీర్‌లో మ‌రో పెద్ద హిట్‌గా గీత గోవిందం నిలిచిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. రేటింగ్‌: 3
  బాలకృష్ణ కథానాయకుడిగా, నిర్మాతగా.. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను తీసుకుంటున్నారు.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్నారు.. అలాగే మరో కీలక పాత్ర ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తుండగా, చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.. అయితే రీసెంట్ గా భువనేశ్వరి పాత్ర కోసం, నాగ చైతన్యతో కలిసి ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేసిన హీరోయిన్ మంజిమా మోహన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.
  రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఎక్స్‌ 100' యూత్ ని బాగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.. ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.. త్వరలో ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది తమిళ వెర్షన్‌లో హీరోగా నటించనున్నారు.. తెలుగులో హీరో,హీరోయిన్లుగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ నటించిన విషయం తెలిసిందే.. తమిళ వెర్షన్‌లో హీరోగా ఆది చేస్తుండగా..  లిప్‌లాక్‌లతో సంచలనం సృష్టించిన పాయల్‌ రాజ్‌పుత్‌ స్థానంలో ఏ హీరోయిన్‌ను ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.. చూద్దాం మరి తెలుగు యువతను ఆకట్టుకున్న 'ఆర్‌ఎక్స్‌ 100 ' తమిళ యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
  కలర్స్‌ టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి.. కలర్స్‌ స్వాతిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టాచెమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలతో వెండితెర మీద సందడి చేసిన స్వాతి, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.. కొంత కాలంగా స్వాతి, మలేషియన్ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వికాస్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.. ఇరు కుటుంబాల అంగీకారంతో, ఆగస్ట్‌ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటల సమయంలో వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది.. కాగా వివాహం తర్వాత స్వాతి తన భర్తతో కలిసి ఇండోనేషియాలో స్థిరపడనున్నట్టు సమాచారం.
  హీరోయిన్ సోనాలి బింద్రే గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు.. కాగా ఆమె కుమారుడు ఈరోజు తన 13వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఈ నేపథ్యంలో ఇండియాలో ఉన్న కుమారుడ్ని కలవలేని ఆమె భావోద్వేగంతో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.. ‘రణ్‌వీర్‌.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం.. నేను కాస్త ఎక్కువ భావోద్వేగానికి‌ గురవుతున్నానేమో.. అయినా సరే, నీ 13వ పుట్టినరోజుకు ఆ అర్హత ఉంది.. వావ్‌, ఇప్పుడు నువ్వు టీనేజర్‌వి.. ఆ నిజాన్ని నమ్మడానికి నాకు కాస్త సమయం పడుతుంది.. నీ మానవత్వం, బలం, దయ పట్ల నేను ఎంత గర్వంగా ఉన్నానో చెప్పలేను.. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇది.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. నీకు నా అమితమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’ అని సోనాలి పోస్ట్‌ చేసారు.
రారాజు అయిన తరువాత కాంగ్రెస్ యువరాజు పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చారు! సోనియా గాంధీ పట్టుదలతో రాష్ట్ర విభజన చేసిన తరువాత హస్తం గతి రెంటికీ చెడిన రేవడి అయింది. ఏపీలో సున్నా సీట్లు రాగా … తెలంగాణలో అధికారం సున్నా అయ్యి కూర్చుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాతో గత నాలుగేళ్లుగా సరిపెట్టుకుంటూ వస్తోంది రాహుల్ పార్టీ! ఇప్పుడు ఆయన హైద్రాబాద్ లో దిగి రెండు రోజుల పాటూ ఇక్కడే మకాం వేశారు. అందుక్కారణం పెద్దగా ఆలోచించాల్సినదేం కాదు. కేసీఆర్ మోదీతో వరుస భేటీలు జరుపుతూ ఏ క్షణాన్నైనా అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో వున్నారు. అది పసిగట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ తాము విభజించిన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క దాంట్లోనైనా అధికారం సాధించాలని తాపత్రయపడుతున్నారు. కానీ, అది ఎంత వరకూ సాద్యం?     ఎవరో కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానులు లేదా కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులు చెప్పే మాటలు కాదు… నిజంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవటం అంత సులువు కాదు! రాజకీయాల్లో అపర చాణుక్యుడైన గులాబీ బాస్ గత నాలుగేళ్లలో వీలైనంత జనాకర్షణ చేశారు. పాలన మొదలు పెట్టగానే ఆయన చేసిన సకల జనుల సర్వే మొదలు నిన్న మొన్నటి రైతు బంధు వరకూ అన్నీ ఓటర్లలో కోలాహలం సృష్టించాయి. వాటి వల్ల నిజంగా క్షేత్రస్థాయిలో జనానికి మేలు జరిగిందా అంటే ఎవరి వాదనలు వారికుంటాయి. కాకపోతే, ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాత్రం మరీ దారుణమైన పాలన చేయలేదు. అలాగని అద్భుతాలు కూడా సృష్టించలేదు!     ఒకవైపు కేసీఆర్ పాలనలో కొన్ని లోపాలున్నా టీ కాంగ్రెస్ లో వాట్ని ఎత్తి చూపి ముందుకు దూసుకుపోయిన వారెవరు? నాలుగేళ్లుగా ఎవ్వరూ లేరనే చెప్పాలి! మొన్నటికి మొన్న మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారటం వరకూ టీ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు కేసీఆర్. కానీ, ఆ రేంజ్లో తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ ని ఢీకొట్టింది లేదు. రేవంత్ రెడ్డి, నాగం లాంటి కొత్త నేతలు చేరినా, ఉత్తమ్ కుమార్, జానా లాంటి పాత నేతలు సిద్ధంగా వున్నా జనం పక్షాన జరిగిన భారీ ఉద్యమాలంటూ ఏమీ లేవు! పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారి కారణంగా అంతర్గత కుమ్ములాటలు యథప్రకారం సాగిపోతున్నాయి. వీటన్నటి మధ్యా హైద్రాబాద్ లో దిగిన రాహుల్ … తనకు కంప్లైంట్లు ఇవ్వద్దంటూ చెప్పేశారట! అందరూ కలిసి పని చేయండి. అధికారం సాధిద్దాం. తరువాత ఆలోచిద్దాం అన్నారట! ఈ మాటలతో కాంగ్రెస్ మార్కు అంతర్గత రాజకీయాలు చల్లబడిపోతాయి. అందరూ ఏకమైపోతారా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు… ఈ నలుగురితో కూడుకున్న గులాబీ దళాన్ని ఎదుర్కుని ఓడిస్తారా? డౌటే!     రాహుల్ పర్యటన సందర్భంగా మీడియాలో హడావిడి జరగవచ్చు. ఆయన దిల్లీ వెళ్లిపోతే మళ్లీ అంతా చల్లబడిపోతుంది. కానీ, కేసీఆర్ ఇక్కడే వుంటారు. ఆయనకు తెలంగాణ తప్ప మరో ప్రాంతంపై గురి లేదు. ఆయన స్వయంగా చెప్పినట్టు రాహుల్ కుటుంబానికి దేశం మొత్తం గోల కావాలి. కానీ, కేసీఆర్ ఫ్యామిలి దృష్టి మొత్తం తెలంగాణపైనే! కుటుంబ పార్టీనే అయినా టీఆర్ఎస్ తెలంగాణ జనానికి ఎక్కువ దగ్గరగా వుందన్నది నిజం. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి? ఏం చేయాలన్నా దిల్లీ నుంచీ ఆదేశాలు రావాలి! ఇది కేవలం తెలంగాణ కాంగ్రెస్ ఇబ్బందే కాదు. తెలంగాణ బీజేపీ కూడా అమిత్ షా వచ్చిపోయిన రెండ్రోజులు హడావిడి చేస్తుంది. తరువాత అంతా గప్ చుప్! ఇదే కేసీఆర్ లాంటి ప్రాంతీయ నేతలకి కలిసొచ్చే విషయం! వాళ్ల కాన్సన్ట్రేషన్ పూర్తిగా వారి రాష్ట్రంపైనే! జాతీయ పార్టీలు అలా చేయలేవు. జాతీయ పార్టీల స్థానిక నాయకత్వానికి పూర్తి స్వేఛ్ఛ వుండదు! మరీ ముఖ్యంగా, గాంధీలకు విధేయులైన కాంగ్రెస్ నేతల్లో అస్సలు వుండదు!     ఇక రాహుల్ తెలంగాణలో అస్సలు గుర్తించని సమస్య మరొకటి వుంది. ఎక్కడైనా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పక్షానికి లాభం. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది కాబట్టి! తెలంగాణలో కూడా అదే జరగటం దాదాపు ఖాయం అయిపోయింది. సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు అన్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చేసినప్పటికీ రాహుల్ పొత్తుల కోసం ప్రయత్రాలు చేసినట్టు కనిపించటం లేదు. తెలంగాణలో కోదండరామ్ పార్టీ, గద్దర్ పార్టీ, టీ టీడీపీ పొత్తుకు అనుకూలమైన పార్టీల లిస్టులో వున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం ఎలాగూ కాంగ్రెస్ తో చేతులు కలిపే రాజకీయ వాతావరణం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ లు బద్ధశత్రువులే! ఇలాంటి స్థితిలో తమతో కలసి నడవగలిగే కోదండరామ్, గద్దర్, టీ టీడీపీ శ్రేణుల్ని కూడా ఇంతవరకూ రాహుల్ పలకరించలేదు. ఉత్తమ్ కూడా వారి మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు! మరి దీని ఎఫెక్ట్ ఏంటి? కాస్త రాజకీయం తెలిసిన వారెవరైనా చెప్పేస్తారు! జాతీయ స్థాయిలో రాహుల్ మోదీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల్ని జట్టుకట్టుటంలో విఫలం అవుతున్నారు. అదే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ పార్టీల్ని తమతో కలిసేలా చేయలేకపోతున్నారు. కేసీఆర్ మాటల్లో ధ్వనించే భరోసాకు ఇదే కారణం! హైద్రాబాద్ లో హడావిడి పర్యటనలు, కుటుంబ పాలనపై సెల్ఫ్ గోల్స్ లాంటి కామెంట్లు చేయటం కంటే రాహుల్ ముందు పొత్తులపై ఆలోచిస్తే ఎంతో బావుంటుంది. ఎందుకంటే, మిగిలింది ఇంకాస్త సమయమే కాబట్టి!
తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఇందుకు సంకేతంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే రోజు సమర శంఖం పూరించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మహిళలతో సమావేశం నిర్వహించారు. అది జరిగిన కొద్ది గంటలకే తెలంగాణ రాఫ్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తన ఎన్నికల ప్రణాళికను కూడా వెల్లడించారు.  అంతే కాదు... ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే అవి ముందస్తు ఎన్నికలు కావని కొత్త సూత్రీకరణలకు కూడా తెర తీసారు.     అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆయన ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ని.మయ్యేలా ఉన్నాయి. అంతే కాదు... ఈ సెప్టెంబర్ నెలలోనే తమ అభ్యర్ధులను సైతం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని, తిరిగి మళ్లీ తమదే అధికారమనే ధీమాను సైతం వ్యక్తం చేశారు.  ఈ ప్రకటనను ఆయన ఆత్మవిశ్వాసంగా చూడాలా... లేక అతి విశ్వాసంగా చూడాలో పరిశీలకులు లెక్కలు తీస్తున్నారు. ఆత్మ విశ్వాసంగా పరిగణించాలంటే కె.చంద్రశేఖర రావు గడచిన నాలుగేళ్లుగా చేపట్టిన పలు పథకాల అమలును బేరీజు వేయాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులకు ఇచ్చిన పెట్టుబడి పథకం, మహిళలకు ప్రకటించిన కెసీఆర్ కిట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఆయన్ని తిరిగి అధికారంలో కూర్చోపెడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అలాగే మిషన్ భగీరథ, చెరువులు పునరుద్ధరణ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలుగానే వారు చూస్తున్నారు. అయితే ఇవన్నీ పైకి కనిపించే పథకాలే అయినా... వాటి వెనుక దాగి ఉన్న అవినీతి ప్రతిపక్షాలకు ఈ సారి ఎన్నికల ఆయుదం కానుంది.     ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు తొలి సారి వచ్చారు. ఇక నుంచి ప్రతి నెలా ఇక్కడకు వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లో తన తొలి పర్యటన ప్రారంభించిన రాహుల్ గాంధీకి ఇక్కడ మంచి స్వాగతమే లభించిందని చెప్పాలి. ఈమధ్య ఆయన తన ప్రసంగాలలోనూ, లోక్‌సభలోనూ రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు. కన్నుకొట్టడం వంటి చిలిపి పనులను మినహాయిస్తే ఏడాది క్రితం రాహుల్ గాంధీకీ... ఈనాటి రాహుల్ గాంధీకి మధ్య తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ప్రధానమంత్రిని లోక్‌సభలో తన ప్రసంగం అనంతరం కౌగలించుకున్న రాహుల్ గాంధీ జాతీయ స్ధాయిలో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో కూడా ఆయన చేసిన ప్రసంగం ఇక్కడి ఏలికలకు కాసింత ఇబ్బందుల పాలు చేసిందనే చెప్పాలి. అందుకే హడావుడిగా... అది కూడా రాహుల్ గాంధీ వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అధికార పార్టీలో ఆందోళనను తెలియజేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర సెటిలర్లదే. వీరి మద్దతు ఎవరికి ఉంటుందో వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సెటిలర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు.     సెటిలర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కాసింత ముందుగానే స్పందించింది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆయుధాన్ని తెలంగాణలో సెటిల్ అయిన వారిపై ప్రయోగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి సెటిలర్ల ఓట్లను అడిగే నైతిక హక్కును కోల్పోయింది. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ కూడా టిఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారంటే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అని ప్రకటనలు  చేశారు. దీంతో సెటిలర్ల ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు దిద్దుబాటు చర్యలకూ ఉపక్రమించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వారందరూ తెలంగాణ వాసులే అని ప్రకటించారు. అయితే, సెటిలర్లు ఆయన మాటలను నమ్ముతారో... లేక తమ బంధువులు, స్నేహితులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఆరు నెలల ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందని మాత్రం తేటతెల్లం అయ్యింది.
కులం అడ్డుగోడల్ని కూలగొడదాం… ఇలాంటి మాటలు మేధావులు మొదలు మీడియా వాళ్ల దాకా అందరూ మాట్లాడతారు! కానీ, నిజంగా మన దేశంలో కుల నిర్మూలన ఉద్యమం పెద్దగా ఏం జరగటం లేదు. ప్రభుత్వం నుంచీ స్టార్ట్ సినిమాల దాకా అంతటా కులాన్ని పటిష్టం చేసే మాటలు, చర్యలే తప్ప మరొకటి కనిపించవు. అలాంటి కోవలో కుల రిజర్వేషన్లు కూడా వస్తాయి. అసలు కులం ఆధారంగా ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అవసరమే అయినా కూడా ఇంకెంత కాలం వరకూ? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు చర్చకు రావాల్సిన సమయంలో దేశ వ్యాప్తంగా కొత్త కొత్త కులాలు తమకూ రిజర్వేషన్లు కావాలంటూ బరిలోకి దిగుతున్నాయి. రాజకీయ నేతలు కూడా తమ ఓట్ల లావాదేవీల్లో భాగంగా వాట్ని వెన్నుతట్టి ప్రొత్సహిస్తున్నారు. కులం అంటే అధికార పక్షాలు భయపడతాయి. ప్రతిపక్షం గజగజ వణికిపోతుంది. కులంతో పెట్టుకునే మోధుడంటూ ఎవరూ లేకుండాపోయారు!     కేంద్రంలో వున్న బీజేపీ నిజానికి ఒకప్పుడు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఆరెస్సెస్ అయితే బాహాటంగానే రిజర్వేషన్లపై రివ్యూ జరగాలనేది. కానీ, పూర్తి మెజార్టీతో తొలిసారి మోదీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఒక్కసారిగా స్వరం మారిపోయింది! స్వయంగా ప్రధానే తన తాజా ఇంటర్వ్యూలో… కుల రిజర్వేషన్లు ఇంకా చాలా కాలం భద్రంగా వుండబోతున్నాయని తేల్చి చెప్పారు! మరోవైపు బీజేపీకే చెందిన నితిన్ గడ్కరీ మరాఠా ప్రజల రిజర్వేషన్ ఉద్యమంపై స్పందిస్తూ … అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కుడున్నాయని ఎదురు ప్రశ్నవేశారు! అంటే… రిజర్వేషన్ల గోలంతా ఓట్ల మాయాజాలమే తప్ప నిజంగా రిజర్వేషన్లు వున్న వాడికీ, లేని వాడికి, ఎవరికీ అవతల ఉద్యోగాలు లేవన్నమాట! ఇంత మాత్రం దానికి జనాన్ని పొలిటీషన్స్ జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం దేనికి?     జాతీయ స్థాయి నుంచీ రాష్ట్ర స్థాయికొస్తే… ఏపీలో కాపు రిజర్వేషన్ల వివాదం కాక రేపుతోంది. అసలు కాపులకి బీసీ స్టేటస్ ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి? ఇవ్వకపోతే కాపు సోదరుల డిమాండ్లు మరో మార్గంలో ఎలా పరిష్కరించాలి? ఇవీ చర్చించాల్సిన ప్రశ్నలు! కానీ, వాటికి బదులు రాజకీయ డ్రామా నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయించేశారు. బంతి కేంద్రం కోర్టులోకి తోశారు. కాపులకి రిజర్వేషన్లు ఇప్పుడు మోదీ సర్కార్ చేతిలో వున్నాయి! మరి దిల్లీ ప్రభుత్వం అంగీకరిస్తుందా? వాళ్లు సుప్రీమ్ రూల్స్ అంటూ నెపాన్ని అత్యున్నత న్యాయస్థానంపై నెట్టేస్తారు! అలా కాపుల రిజర్వేషన్ కోరికని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు!     కేంద్ర , రాష్ట్ర అధికార పక్షాలు కాపుల రిజర్వేషన్లపై తాత్సారం చేస్తుండటంతో జగన్, పవన్ లాంటి నేతలు కాపుల వివాదంతో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అందులోనూ క్లారిటీ లేదు. రోజుకో మాట మాట్లాడుతుంటారు. కులాల గురించి పెద్దగా మాట్లాడని జనసేనానికి అదేదో 9వ షెడ్యూల్ అనే మాట వాడి ఒక కామెంట్ చేసేశారు. ఆ మార్గంలో ఎప్పటికి కాపులకు రిజర్వేషన్లు లభిస్తాయి? దేవుడికే తెలియాలి! ఇక జగన్ దైతే మరీ పెద్ద డైలామా! ఆయన ఓ రోజు నా చేతుల్లో ఏం లేదు అంటారు. అంతా కేంద్రం చేయాల్సిందే అంటూ కుండ బద్ధలు కొడతారు. తెల్లారే సరికి కాపు ఓట్లు మొత్తానికి మొత్తంగా తుడిచి పెట్టుకుపోతాయని గ్రహించి యూటర్న్ తీసుకుంటారు. కాపులకు బీసీ హోదా విషయంలో నేను రెడీనే… కాకపోతే చంద్రబాబు కంటే రెట్టింపు నిధులు కాపు కార్పొరేషన్ కు కేటాయిస్తా అంటూ చెబుతారు!     జగన్ రోజుకో మాట మాట్లాడుతుండటంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా ఆయనకు రివర్స్ అయ్యారు. జగన్ తమకు పదివేల కోట్లు ఇవ్వటం కాదు మేమే ఇరవై వేల కోట్లు ఆయనకు ఇస్తాం. సీఎంగా కాపు కులస్థుడ్ని కూర్చోబెట్టండని సవాల్ విసిరారు! మొత్తంగా ఈ వివాదం జగన్ సెల్ఫ్ గోల్స్ లో అతి పెద్దదిగా మారింది. ఆయన చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు కాపు ఓటర్లని, కాపు నాయకుల్ని ఇద్దర్నీ జగన్ కు దూరం చేస్తోంది. అదే సమయంలో తమ కులానికే చెందిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ నేతగా అవతరించనున్నాడు కాబట్టి కాపులు ఆయన వైపు వెళ్లే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాళ్లు జనసేన వైపు వెళ్లినా, టీడీపీ వైపు మళ్లినా… నష్టం మాత్రం కాబోయే సీఎంని అనుకుంటున్న జగన్ కే! కాపు రిజర్వేషన్ల విషయంలో నోరు జారిన జగన్ ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తే… మన దేశ తలపండిన పొలిటీషన్ప్ ఎవ్వరూ , ఎందుకు రిజర్వేషన్ల కొరివితో తలగొక్కోరో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, కుల ఉద్యమాలు, కుల రిజర్వేషన్ల విషయంలో తేరుకోవాల్సింది జనమే! ఎందుకంటే అన్ని పోరాటాల తరువాత లాభపడేది ఏదో ఒక రాజకీయ పక్షమే తప్ప నిజమైన నిరుపేద జనం కాదు! ఎందుకంటే, రిజర్వేషన్ ఆధారంగా ఇవ్వబోయే ఉద్యోగాలు అంటూ ప్రస్తుత ప్రైవేటీకరణ ప్రపంచంలో పెద్దగా లేవనే చెప్పాలి!
దేశంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. జాతీయ స్ధాయిలోనే కాదు... రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ఉత్తరాదిలో ఒకలాంటి రాజకీయాలు జరుగుతూంటే... దక్షిణాదిలో మరో విధంగా రాజకీయాలున్నాయి. దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రత్యేకంగా ఉన్నాయి రాజకీయాలు. అవునంటే కాదనిలే... కాదంటే అవుననిలే అన్నట్లుగా రాజకీయాల రూపము, స్వరూపమూ రెండూ పూర్తి స్ధాయిలో మారిపోతున్నాయి. ఈ రోజు ఉన్న రాజకీయాలు రేపు ఉండడం లేదు. నిన్న జరిగిన రాజకీయాలు రేపు ఎలా ఉంటాయో తెలియడం లేదు. అంతా చిందర వందర గందరగోళంగా మారుతున్నాయి. నిన్నటి వరకూ ముందస్తుకు వెళ్దామా... వద్దా అని సంశయంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తాజాగా ముందస్తుకు వెళ్లిపోవాలని నిర్ణయించేసుకున్నారు. వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలుసుకున్న కె.చంద్రశేఖరావు అక్కడి నుంచి వచ్చిన వెంటనే చకచకా పావులు కదపుతున్నారు. ముందస్తుకు వెళ్లిపోదాం.... అందరూ సిద్ధంగా ఉండండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపు కూడా ఇస్తున్నారు. ముందస్తుకు వెళ్లాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు ఇక్కడ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందుగా తలుపులు తీస్తున్నారు. అంతే కాదు.... ఎన్నాళ్ల నుంచో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల నాలుకలపై నానుతున్న జమిలి ఎన్నికలకు కూడా ఇదే మంచి సమయం అని సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలను రోజురోజుకు తీవ్రం చేస్తున్నారు.     ఇందుకోసం తన మిత్ర పక్షాలను ముందుగా ముందుకు తోస్తున్నారు. అందులో భాగమే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందస్తు పచ్చ జెండా ఊపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ముందస్తు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారనే విషయం ప్రతిపక్షాలకు... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేయడమే ఈ ఇద్దరు నాయకుల వెనుక ఉన్న బహిరంగ రహస్యం. భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమతికి ఉన్న స్నేహం ఎంత గాఢమైనదో ఈమధ్య జరిగిన రాజ్యసభ  ఉపాధ్యక్ష ఎన్నికే బహిర్గతం చేసింది. ఈ స్నేహం ఇప్పుడు వికసించి ముందస్తుకు ముహూర్తం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుల ముందస్తు మాయాజాలంలో పడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భీష్మించుకున్నారు. అంతే కాదు... లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి నిర్వహిద్దామనుకున్న జమిలి ఎన్నికలకు కూడా ఆయన ససేమిరా అంటున్నారు. దీని వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందన్నది చంద్రబాబు నాయుడి ఆలోచన. జమిలి ఎన్నికలకు వెళ్లడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి కలిసి వస్తుందన్నది చంద్రబాబు నాయుడి నమ్మకం. ఇంతకు ముందు ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ చంద్రబాబు నాయుడికి పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఈ సారి మాత్రం తనను నమ్మించి నట్టేట ముంచిన భారతీయ జనతా పార్టీకి కేంద్రంలోనే కాదు... ఏ రాష్ట్రంలోనూ కూడా మేలు జరగరాదన్నది చంద్రబాబు నాయుడి ఆలోచన. భారతీయ జనతా పార్టీ కారణంగా తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చులకనయ్యానని, వారి మోసం తాను తెలుసుకోలేకపోయానని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందుతున్నారు.      కేంద్ర ప్రభుత్వం... ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కొనేందుకు.... వారిని ఢీకొట్టేందుకు చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికల జరగొద్దు అని జాతీయ స్ధాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం తనతో కలిసి వచ్చే పార్టీలతో జత కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తెలుగుదేశం పార్టీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. జమిలి ఎన్నికలకు ఏ పార్టీ కూడా తమ మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే అవకాశం ఉంది. ఇందుకోసం ఆయన జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించే అవకాశమూ ఉంది. ముఖ్యంగా కర్నాటకలోని జెడీయు, త్రణమూల్ కాంగ్రెస్, శివసేనలతో పాటు వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు జాతీయ స్ధాయిలో జమిలి వ్యతిరేక పోరాటం చేసే అవకాశమూ లేకపోలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరు ముందస్తుతో పాటు జమిలి ఎన్నికలకు... మరొకరు ముందు లేదు... జమిలి ఎన్నికలు అంత కంటే లేవూ అని అంటున్నారు. ఈ రెంటిలో ఏది జరిగినా తెలుగు రాష్ట్రాలు ఓడిపోయి భారతీయ జనతా పార్టీ గెలిచినట్లే. ఎందుకంటే వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టి లాభపడాలనుకుంటున్న జాతీయ పార్టీల వాంఛ తీరుతుంది. ఎటొచ్చి ఈ విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అర్ధం కావడం లేదు. పిట్ట పోరు... పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు అన్న చందంగా ఉంది పరిస్ధితి.  
రాజకీయాల్లో బాగా రాటుదేలిన నేతలు రెండు వ్యూహాలు అమలు చేస్తుంటారు! ప్లాన్ A… ఇది ఏంటంటే… తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎదురు దాడి చేయటం! ఇక ప్లాన్ B… దీంట్లో భాగంగా తమ మీద వచ్చిన ఆరోపణ గురించి అస్సలు మాట్లాడరు! కాకపోతే, మరో దారిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న తామే బాధితులమని ప్రచారం చేసుకుంటారు. తమకు ఓటు వేసే ఆలోచనలో వున్నవార్ని మరింతగా ఒడిసి పట్టుకునేలా సానుభూతి సంపాదించుకుంటూ వుంటారు! ఇదంతా చెప్పుకోటానికి కారణం… జగన్!     జగన్ ఏనాటికైనా ఏపీ ముఖ్యమంత్రి అవ్వొచ్చు. కానీ, అదెప్పుడో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుక్కారణం ఆయన మీద వున్న తీవ్రమైన ఆర్దిక అభియోగాలే! ఏ క్షణాన జైలుకి వెళతారో తెలియని పరిస్థితి. మరోవైపు ఏ జిల్లాలో ఎన్ని వందల కిలో మీటర్ల దూరంలో పాదయాత్రలో వున్నా ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు వచ్చి వెళుతుంటారు. ఇలాంటి సంకట స్థితి మరే రాజకీయ నేతకు ప్రస్తుతం లేదు. మరీ ముఖ్యంగా, ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ప్రతీ వారం కోర్టుకు హాజరు కావటం కూడా దేశంలో ఎక్కడా లేదు. మరి ఇలాంటి జగన్ని ఓటర్లు ఎందుకు నమ్మాలి? దీని వల్లే ఆయనను అభిమానించే వాళ్లు ఎంతగా ఓట్లు వేసినా చంద్రబాబు సీఎం అయ్యారు గత ఎన్నికల్లో! అవినీతిని, అనుభవాన్ని రెండిట్నీ దృష్టిలో పెట్టుకునే ఓటర్లు జగన్ ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు!     2014 పోతే పోయింది 2019 నాదే అనుకుంటున్న జగన్ వీలు చిక్కినప్పుడల్లా ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. అంటే… సానుభూతి ఫార్ములా అన్నమాట! తండ్రి వైఎస్ మరణించాక నెలలు,సంవత్సరాల తరబడి ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. అంతలోనే ఈడీ ఆయనకు షాకిస్తూ భార్య భారతీ పేరును కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది! అదే విషయం మీడియాలో వచ్చింది. వెంటనే జగన్ అసలు పక్కన పెట్టి కొసరు మీద దృష్టి పెట్టారు. భారతి పేరు కూడా ఛార్జ్ షిట్ లో ఎందుకు చేరింది? ఆమెకు జగన్ అవినీతితో సంబంధం వుందా? అసలు తన భార్య పేరు ఛార్జ్ షిట్లో వుందనే వార్త నిజం కాదా? మీడియా చెప్పిందంతా అబద్ధమేనా? … ఇలాంటి విషయాలేవీ వైసీపీ అధినేత మాట్లాడలేదు. తెలివిగా ‘’నా భార్యని కూడా టార్గెట్ చేశారు’’ అంటూ సింపతీ యాంగిల్ తీసుకొచ్చారు!     కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు అంటూ స్వయంగా జగనే వ్యక్తిగత విమర్శలు చేశారు! ఇప్పుడు మాత్రం మీడియా తన భార్యని అనవసరంగా వివాదంలోకి లాగుతోందని బాధపడిపోయారు! వ్యక్తిగత దాడి తాము చేస్తే ఒక న్యాయం... ఎదుటి వారు చేస్తే మరో తర్కం! ఇదీ వరస! అసలింతకీ మీడియా చెప్పింది కరెక్టా? తప్పా? జగన్ ఎదుర్కొంటోన్న అవినీతి ఆరోపణల్లో భారతికి ప్రమేయం వుందని ఈడీ భావిస్తోందా? లేదా? వీటికి జగన్ వద్ద సమాధానం లేదు! ఆయన చెప్పుకొచ్చే ఏకైక పాయింట్… ‘’ నా భార్య పేరు ఛార్జిషీట్లో వుందని మీడియాకు ఎలా తెలిసింది? ‘’ ఇదొక్కటే!     జగన్ తన భార్య గురించి వస్తోన్న వార్తల్ని ఖండించకుండా కేవలం మీడియాను అనుమానించటం, అలాగే, తన కుటుంబాన్ని రోడ్డుకీడుస్తున్నారని వాపోవటం చూస్తుంటే… సానుభూతి కోణం తప్ప మరేదీ కనిపించటం లేదు. అయితే, జగన్ అమలు చేసిన ప్లాన్ బీ ఎంత వరకూ రిజల్ట్స్ ఇస్తుంది? ఎన్నికలు వస్తేగానీ తెలియదు. గతంలో వైఎస్ మరణించిన అనంతరం వెల్లువెత్తిన సానుభూతి తనని సీఎం చేస్తుందని జగన్ బలంగానే భావించారు. కానీ, అలా జరగలేదు. మరి ఇప్పుడు ఏమవుతుందో…
భారత రాజకీయ వ్యవస్థలో నేరగాళ్ల నిరోధాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కట్టడి చేయనుందా..?. దేశ రాజకీయ వ్యవస్థలో  నానాటికి పెరుగుతున్న నేరగాళ్ల ప్రమేయం సుప్రీం చొరవతో తగ్గనుందా...? దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలలో రౌడీలు, గుండాలు, వివిధ కేసుల్లో కీలకమైన నేరగాళ్లుగా నమోదైన వారు చట్ట సభలలో ఠీవిగా కూర్చుంటున్నారు. ప్రజలకు సంబంధించిన పలు కీలక చట్టాలకు వారు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇది దేశానికి అంత మంచిది కాదు. నేరాలూ, ఘోరాలు వివిధ కుంభకోణాలతో సంబంధం ఉన్నవారు, మహిళలపై అత్యాచారలు చేసిన వారు, భార్యల, బంధువులను హత్య చేసిన కేసులలో ఉన్నవారు చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. వారి ప్రభావంతో కీలకమైన బిల్లుల పాస్ అవుతున్నాయి. అంతే కాదు నేరగాళ్లకు కఠిన శిక్షలు వేసేందుకు రూపొందించిన బిల్లులకు సభలలోకొన్ని ఆమోదం పొందడంలేదు.      ఇది దేశానికి క్షేమకరం కాదు. 2014 సంవత్సరం లెక్కల ప్రకారం శాసన కర్తలలో దాదాపు 34 శాతం మందికి నేర చరిత్ర ఉందని వెల్లడయింది. గడచిన నాలుగేళ్లలో ఈ సంఖ్య దాదాపు 10 శాతం పెరిగిందని ఓ అంచన. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, బిహార్, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఉత్తర‌ప్రదేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల నుంచి నేర చ‌రిత్ర ఉన్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఆయా రాష్ట్రాల ప్రజ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. పార్లమెంటు, శాసన సభలలో నానాటికి పెరిగిపోతున్న నేరగాళ్లను నిరోదించాలంటూ పబ్లిక్‌ ఇంట్రేస్ట్ ఫౌండేషన్ సంస్థ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది. దీనిపై ప్రారంభమైన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో జస్టిస్ ఆర్.ఎఫ్. నారీమన్, జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ‌ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. భారత దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో ఇది ఓ మైలురాయి. ప్రభుత్వ న్యాయ‌వాదుల‌కు, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగింది.     ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు చేసిన వ్యాఖ్యలు కొన్నిదేశ రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతున్నాయి. దేశ రాజ‌కీయ వ్యవ‌స్ధలో నేర చ‌రిత్ర ఉన్న వారి జోక్యం పెర‌గ‌రాద‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు అన్నారు. దీనిపై వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు. దేశంలో ఇంతవరకూ రాజకీయాలకు న్యాయస్థానాలకు మధ్య ఎప్పుడూ ఇంతటి వైరం లేదు. ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ వ్యవస్థకు మచ్చుతునకలు. దేశంలో రాజకీయ వ్యవస్థ నేరపూరితం కాకూడదంటూనే పార్లమెంటు, న్యాయవ్యవస్థల మధ్య ఓ లక్ష్మణరేఖ ఉందని, దాన్ని ఇరువురూ దాటకూడదని సుప్రీం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను ఆషామాషీగా చూడకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల మధ్య వివాదంగానూ  పరిగణించరాదు. గత కొంతకాలంగా కేంద్రం, సుప్రీం ఉప్పూ, నిప్పుగా ఉన్నాయి. రాజకీయాలలో నేరచరితుల పాత్రపై ఈ రెండు వ్యవస్థలు ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. ఈ సందర్భంలో సుప్రీం రాజకీయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులను కలవర పెడతాయి. అయితే సుప్రీం కనబరచిన తీరును మాత్రం దేశ ప్రజలు హర్షిస్తారు. చట్టసభలలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడంలో నేరగాళ్ల పాత్ర లేకుండా చేసేందుకు సుప్రీం వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొంత వరకూ దోహదపడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థకు శుభ పరిణామం. భవిష‌్యత్తులో రాజకీయ వ్యవస్థ మరింత బాగుపడడానికి శుభశూచకం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు సదా అభినందనీయం. దేశానికి ముందు ముందు మంచిరోజులు వస్తాయనడానికి ఓ నిదర్శనం.
  ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలి ఎన్నికల కోసం బీజేపీ ఇటీవల దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే అంశంపై అమిత్‌షా లా కమిషన్‌కు లేఖ కూడా రాశారు.. సంవత్సరం పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని.. చాలామంది అధికారులు ఎన్నికల డ్యూటీలో గడపాల్సి రావడం వల్ల మాటామాటికీ జరుగుతున్న ఎన్నికలతో ఖర్చు పెరిగిపోతున్నదని ఆయన లేఖలో పేర్కొన్నారు.. అయితే అమిత్ షా అలా లేఖ రాసారో లేదో, దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తేల్చిచెప్పారు.. 'దేశమంతా ఎన్నికలు జరగాలంటే శాసనసభల గడువు తగ్గించడం లేదా పెంచడం చేయాలి.. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది.. దీనికి న్యాయపరమైన అంశాలు పూర్తి చేయడానికి సమయం పడుతుంది.. వీటికి తోడు వీవీప్యాట్‌ యంత్రాలు 100శాతం అందుబాటులో ఉండాలి.. సమీప భవిష్యత్‌లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం’ అని రావత్‌ స్పష్టం చేసారు.
  2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ని దెబ్బ తీసింది.. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.. గత కొంతకాలంగా బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. మరోవైపు మిత్రపక్షాలు కూడా కొన్ని బీజేపీకి దూరమయ్యాయి.. ఇవన్నీ కాంగ్రెస్ పాలిట వరంలా మారుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవి పొందటం కాదు, మోదీకి ప్రధాని పదవి అందకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. దానిలో భాగంగానే ప్రాంతీయ పార్టీలకు దగ్గరవుతుంది.. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌‌‌గడ్‌ రాష్ట్రాలలో ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే నిర్వహించింది.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.. రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను 130 స్థానాలు, ఛత్తీగఢ్‌లో 90 స్థానాలకు గాను 54 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకు గాను 117 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది.. ఈ సర్వేతో కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం పెరుగుతుందేమో.
  జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌‌ను భీమవరంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ విడుదల చేశారు.. విజన్‌ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలు.. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ,మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు మరో ఐదు శాతం పెంచే ఆలోచన, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ కింద రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయడం, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ముస్లింల అభివృద్ధికి సచార్‌ విధానం అమలు, మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు వసతి గృహాలు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు.. జనసేన అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేపడుతుందని జనసేన పేర్కొంది.  
మహాత్మాగాంధి సిద్ధాంతాలతో కొందరు అంగీకరించవచ్చు, లేదా విభేదించనూవచ్చు. కానీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్రని ఎవరూ కొట్టిపారేయలేరు. అహింసని సైతం ఒక ఆయుధంగా మార్చిన తీరుని మర్చిపోనూలేరు. తను ఏర్పరుచుకున్న నియమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే గాంధీగారిని మిగతావారికంటే భిన్నంగా నిలిపిందన్నది వాస్తవం. అది సత్యాగ్రహం కావచ్చు, అహింసా సిద్ధాంతం కావచ్చు. ఆయన జీవనశైలిని గమనిస్తే ఇలాంటి నియమాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో ఒకటి మేకపాలు తాగడం! ఎవరు ఎగతాళి చేసినా కూడా గాంధీగారు మేకపాలు మానేవారు కాదు. ఇంతకీ గాంధీగారు మేకపాలు తాగడం వెనుకనున్న కథ ఏమిటో, అసలు మేకపాలంటే కొందరికి ఎందుకంత అభిమానమో చూద్దాం...   మాటకు కట్టుబడి! గాంధీ ఒకప్పుడు పూర్తిగా శాకాహారానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఇతర జంతువుల నుంచి వచ్చే పాలని కూడా ఆయన ముట్టుకోవడం మానేశారు. ఇలా ఒక ఆరేళ్లపాటు పాలకి దూరంగా ఉన్నారు కూడా! అయితే 1917లో ఆయనకు తీవ్రమైన అతిసార వ్యాధి పట్టుకుంది. మనిషి నీరసంతో కృశించిపోయాడు. అలాంటి స్థితిలో పాలు చాలా మేలు చేస్తాయని అందరూ సూచించినా, తన పాత నిర్ణయానికి కట్టుబడి ఆయన పాలని ముట్టుకోలేదు.   ఒక ఐడియా! గాంధీగారి పరిస్థితి చూసిన ఒక వైద్యుడు ఓ ఉపాయాన్ని సూచించాడు. ‘మీరు పాలని ముట్టుకోను అని నిర్ణయించుకున్నప్పుడు మీ మనసులో ఆవు లేదా గేదె పాలే మెదిలి ఉంటాయి కదా! అలంటప్పుడు మీ మాటని కాస్త సడలించి మేక పాలుని తీసుకోవచ్చు కదా!’ అన్నాడు. దీన్ని గాంధీగారి భార్య కస్తూరిబాయి కూడా సమర్థించడంతో, అప్పటి నుంచీ ఆయన మేకపాలని తీసుకోవడం మొదలుపెట్టారు.   నిజానికి గాంధీగారి దృష్టిలో పాలు అంత ఆరోగ్యకరం కాదు. వాటిద్వారా సదరు జంతువులలో ఉండే రోగకారకాలన్నీ మనకు అంటుకుంటాయని ఆయన అభిప్రాయం. అయితే శాకాహారులకు పూర్తిస్థాయి పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో గత్యంతరం లేదని ఆయన తరువాత రోజుల్లో ఒప్పుకొనేవారు.   మేకపాలు ప్రత్యేకమేనా! గాంధీగారు మేకపాలు తాగడం మాట అటుంచి, చాలామంది నిపుణులు గేదెపాలకంటే మేకపాలు శ్రేష్టమని వాదిస్తున్నారు. వారి వాదనల ప్రకారం మేకపాలలో చాలా సుగుణాలే ఉన్నాయి.   - ఆవు/గేదెపాలకంటే మేకపాలలోని కొవ్వుకణాలు చిన్నగా ఉంటాయట. అందుకని ఇవి మిగతా పాలకంటే సులభంగా జీర్ణమవుతాయి.   - కొందరికి పాలు సరిపడవు. కారణం! వాటిలో ఉండే లాక్టోజ్‌ అనే పదార్థం. మేకపాలలో లాక్టోజ్‌ చాలా తక్కువ స్థాయిలో ఉండి పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కేవలం లాక్టోజే కాదు. పాలల్లో ఉండే ‘A1 కేసిన్‌’ అనే మాంసకృత్తుల వల్ల చాలామందికి జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అయితే మేకపాలలో ‘A1 కేసిన్‌’ బదులు ‘A2 కేసిన్‌’ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జీర్ణసంబంధమైన ఇబ్బందులు దరిచేరవు.   - గేదెపాలకంటే మేకపాలలోనే ఎక్కువశాతం ఖనిజాలు లభిస్తాయి. ఇక విటమిన్లు, కొవ్వు సంగతి చెప్పనే అక్కర్లేదు. మేకపాలు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతాయంటున్నారు నిపుణులు.   - మేకపాలలో ఎక్కువ పోషకాలు ఉండటమే కాదు. ఇతర పాలతో పోలిస్తే ఈ పోషకాలని మన శరీరం మరింత సులువుగా గ్రహించగలదట.   - మేకపాలలో విటమిన్‌ A ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి కాంతినీ, మృదుత్వాన్నీ తీసుకువస్తుందట. పైగా చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా నివారించే శక్తి దీనికి ఉంది. అందుకనే కొంతమంది మేకపాలని చర్మానికి నేరుగా రాసుకుంటారు. మేకపాలతో చేసిన సబ్బులకు కూడా మంచి ఆదరణ ఉంది.   - శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సెలేనియం అనే ఖనిజం మేకపాలలో ఎక్కువగా ఉంటుంది. జుట్టు మొదలుకొని థైరాయిడ్ వరకూ ఈ సెలేనియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా మేకపాల ప్రత్యేకతలు చాలానే కనిపిస్తాయి. గాంధీగారు చెప్పారని కాదు కానీ ఇప్పటికీ చాలామంది మేకపాలను మిగతా పాలతో సమానమైన విలువ కలిగనివా భావిస్తారు. ఇంత చదివిన తరువాత మేకపాల గురించి ఎలా ఎగతాళి చేయగలం!   - నిర్జర.
  వినడానికి వింతగా ఉంది కాదూ! కానీ ఇదెవ్వరో దారిన పోయే దాన్నయ్య చెప్పిన మాట కాదు... పోర్చుగల్‌లో కొంతమంది పరిశోధకులు తేల్చిన విషయం. మనలో చాలామందిలో ఒళ్లు పెరిగిపోవడానికి కారణం- శారీరక శ్రమ తక్కువగా చేస్తూ, ఎక్కువ కెలోరీలు ఉన్న ఆరాహాన్ని తీసుకోవడం అని తెలుసు. కానీ ఈమధ్యకాలంలో ఒబెసిటీకి మరో కారణం కూడా కనుగొన్నారు. అదే obesogens! ఇవి మన శరీరంలో కొవ్వుని ప్రభావితం చేసే ఒక రకమైన కెమికల్స్‌.   మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ obesogens పనితీరుని మార్చేస్తాయట. ఆహారపదార్థాలలో కనిపించే పెస్టిసైడ్స్, బ్యాటరీలలో ఉండే కాడ్మియం, బాత్రూం క్లీనర్లు, డియోడరెంట్లు... లాంటి నానారకాల కెమికల్స్ ఈ obesogens మీద పనిచేస్తుంటాయి. అలాగని వీటన్నింటికీ దూరంగా ఉండటం కష్టమే కదా! ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కెమికల్స్ మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ obesogensని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక వస్తువుని మాత్రం మనం కంట్రోల్‌ చేయగలం. అదే చెప్పులు!   చెప్పులతో మనం ఊరంతా తిరిగి వస్తాం. దాంతో వాటికి నానారకాల కెమికల్స్ అంటుకుని ఉంటాయి. చెప్పుల మీద పేరుకునే దుమ్ములో ఆ కెమికల్స్‌ భద్రంగా ఉంటాయి. అవి రకరకాల అనారోగ్యాలు ఎలాగూ కలిగిస్తాయి. ఇక obesogens మీద కూడా తమ ఎఫెక్ట్‌ చూపుతాయి. అందుకే చెప్పులని ఇంటి బయటే విడిచిపెట్టేయాలనీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలనీ పోర్చుగల్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంట్లో దుమ్ముని కూడా ఎప్పటికప్పుడు దులిపేయడం, కార్పెట్లులాంటివి వాడకపోవడం వల్ల కూడా కెమికల్స్ పేరుకోకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. https://www.youtube.com/watch?v=clFCJAz2o_0 - Nirjara    
ఇంట్లో ఏ కరెంటు వస్తువు ఉన్నా... అది votage fluctuationsని తట్టుకోవాలంటే ఒక ఎర్త్‌ వైర్ పెడతారు. మరి మన body పరిస్థితి ఏమిటి? మన శరీరం కూడా ఒక బ్యాటరీలాంటిదే కదా! అందులో ప్రతి అవయవం పనిచేయడానికి ఎంతో కొంత విద్యుత్తు అవసరమేగా. అందుకే నేలతో శరీరానికి నేరుగా సంబంధం ఉంటే... ఒంట్లో వైబ్రేషన్స్‌ కూడా perfectగా ఉంటాయని చెబుతున్నారు.     Earth నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికైనా, మన ఒంట్లో అధికంగా ఉన్న నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ను వదిలించుకోవడానికైనా... చెప్పులు లేకుండా కాసేపు నేల మీద నడవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకప్పుడు నేల మీద చెప్పులు లేకుండానే నడిచేవారు. రాత్రిపూట కూడా నేల మీదే పడుకునేవారు. దాని వల్ల భూమితో శరీరానికి నేరుగా సంబంధం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరిగేస్తున్నారు. బయటకి వెళ్లినా ప్లాస్టిక్‌ లేదా రబ్బర్‌ చెప్పులు వేసకుంటున్నారు. ఇవి నేల నుంచి శరీరంలోకి ఎలాంటి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి. కాళ్లకి ఎలాంటి అడ్డూ లేకుండా నేల మీద నడవడాన్ని Grounding అని పిలుస్తారు. కేవలం Groundingతోనే రోగులను నయం చేసే Earthing Therapy అనే ట్రీట్‌మెంట్‌ కూడా ఇప్పుడు పాపులర్‌ అవుతోంది. ఈ ధెరపీతో చాలా రకాల సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.     - Grounding వల్ల ఒంట్లో వాపు, నొప్పిలాంటి సమస్యలన్నీ తీరిపోతాయట. ఒక నాలుగువారాల పాటు ఇలా నడిస్తే... వెన్నునొప్పి, మోకాలి నొప్పులు, పొద్దున పూట కీళ్లు పట్టేయడం లాంటి సమస్యలలో మంచి రిలీఫ్‌ కనిపించినట్లు రీసెర్చ్‌లో తేలింది. - Grounding వల్ల stress కూడా చాలావరకు తగ్గిపోతుందని తెలిసింది. మన శరీరంలో cortisol అనే హార్మోన్‌ ఉంటుంది. ఈ హార్మోనుని గమనిస్తే, ఒంట్లో ఎంత stress ఉందో తెలిసిపోతుంది. నేల మీద పాదాల ఉంచి నడవటం వల్ల ఈ cortisol చాలావరకు తగ్గిపోయిందట. - Grounding వల్ల blood circulation మెరుగుపడుతుందని చెబుతున్నారు. Blood circulation బాగుంటేనే మన ఒంట్లో ప్రతి అవయవానికీ సక్రమంగా ఆక్సిజన్‌, విటమిన్స్ అందుతాయి. దాంతో చర్మం దగ్గర నుంచి గుండె దాకా అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. - భూమిలో లెక్కలేనన్ని electrons, antioxidants ఉంటాయి. చెప్పులు లేకుండా నడవటం వల్ల ఇవి మన శరీరానికి నేరుగా అందుతాయి. చూశారుగా! Grounding వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే రోజుకి ఒక అరగంటసేపన్నా... గడ్డి, నేల, ఇసుక ఉన్న ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడిచి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. - Nirjara