Publish Date:Feb 13, 2014
Publish Date:Feb 12, 2014
Publish Date:Feb 11, 2014
Publish Date:Feb 10, 2014
Publish Date:Feb 8, 2014
Publish Date:Feb 6, 2014
Publish Date:Feb 4, 2014
Publish Date:Jan 21, 2014
Publish Date:Jan 20, 2014
Publish Date:Dec 10, 2013
Publish Date:Dec 2, 2013

LATEST NEWS
In a bizarre incident, a man was let off with 2.5 lakhs for raping a girl and leaving her pregnant. A group of elders in a village of Telangana has let off the culprit. The incident has come to light when the girl’s mother noticed physical changes in her body. When she took her for a medical examination, the pregnancy was discovered with the 17 year old girl. However the news has soon spread like a wild fire and the police took the notice of it. Speaking to news agency PTI, the police inspector has revealed that the four "elders" who made such bargaining were arrested along with the accused. They were presented before the court and were sent to judicial custody.
Well! Facing a financial crisis is always natural to any organisation. But it would be surprising that a giant institution like Air India gets into a position where it could not even pay salaries to the staff. For the fifth month in a row Air India is said to making huge delay in disbursing the pay cheques. The pilots association is of course not happy with the turn of events. It has warned the management that delay of payment could affect the safety of passengers. “Financial uncertainty is a source of frustration, anxiety and stress, which result in undue fatigue, adversely impacting flight safety and the overall performance levels of employees,” said the statement issued by the employees association. However the civil aviation ministry is making all the plans to infuse huge amounts into the company to make it financially viable and fit to race with the competitors.
  Well! If you are stepping on a railway platform today, don’t get jolted by the view of Station Master sitting on the platform with a placard. The All India Station Masters Association (AISMA) was going on a one day long hunger strike. Reason! They were protesting the discrimination against station masters in the seventh pay commission. According to the pay commission, station masters can only one promotion in his life time. And the masters are asking for more! Meanwhile, Railways have issued an advisory asking the Railway Protection Force (RPF) to take precautionary measures for smooth running of the trains during the hunger strike.
ALSO ON TELUGUONE N E W S
  పరశురామ్ 'యువత' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.. ఆ తరువాత ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.. రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' ఘన విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. దీంతో పరశురామ్ తరువాతి సినిమా ఎవరితో అంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి.. అయితే పరశురామ్ మంచు విష్ణుతో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ‘శ్రీరస్తు శుభమస్తు’ సమయంలోనే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో ఓ సినిమా చేయడానికి పరశురామ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం విష్ణు ఓటర్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా అనంతరం విష్ణు, పరశురామ్ ల సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
తెలుగులో యాంకర్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు సుమ.. తన యాక్టీవ్ నెస్ తో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తారు.. అలానే సుమ చేసే షోస్ లో మొదటగా గుర్తొచ్చే షో స్టార్ మహిళ.. సుమారు 12 సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికి విజయవంతంగా దూసుకుపోతుంది.. అయితే ఈ షో ప్రేక్షకులకు ఓ బాడ్ న్యూస్.. త్వరలో ఈ షో నిలిపివేయబోతున్నట్టు తెలుస్తోంది.. ఈ విషయాన్ని స్వయంగా సుమ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.     'మీ అందరికీ ఈరోజు ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పబోతున్నాను.. మీరు సుమ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమం.. ఏకధాటిగా గత 12 ఏళ్లుగా ఈ షో విజయవంతంగా దూసుకెళుతోంది.. ఈ షోను ఆదరించినవారందరికీ శతకోటి వందనాలు.. కానీ, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదు.. అదే విధంగా ‘స్టార్‌ మహిళ’ ప్రయాణం కూడా ముగియనుంది.. మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ‘స్టార్‌ మహిళ’కు చిన్న ముగింపు పలుకుతున్నాం.. త్వరలో ఘనంగా ఫినాలే ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నాం.. మీరు నాకు, స్టార్‌ మహిళకు వీరాభిమానులైతే, నేనంటే మీకు అభిమానముంటే మీరు ఒక చిన్న పని చేయండి.. మీకు నేనంటే ఎంత ఇష్టమో, స్టార్‌ మహిళ కార్యక్రమం అంటే ఎంత ఇష్టమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీయండి.. వాటిలో బెస్ట్‌ వీడియోలను ఎంపిక చేసి ఫినాలే ఎపిసోడ్‌లో ప్రసారం చేస్తాం.. చిన్నా,పెద్దా అన్న తేడాలేకుండా ప్రతిఒక్కరూ ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమాన్ని ఆదరించారు.. వారందరి ప్రేమను, స్టార్‌ మహిళ ప్రోగ్రామ్‌ను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను’ అని సుమ తెలిపారు.. ఇది నిజంగా ప్రేక్షకులకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.  
  ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అతి తక్కువ సినిమాల్లో మన్మథుడు ఒకటి.. నాగార్జున హీరోగా, కె. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో మన్మథుడు సినిమా వచ్చింది.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ మాటలు అందించారు.. ఈ సినిమా ఘన విజయం సాధించటమే గాక, నాగార్జున మన్మథుడుగా అమ్మాయిల మనస్సు దోచుకున్నాడు.. అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి మరో హీరో మన్మథుడుగా వెండితెర మీద సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.. నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై మన్మథుడు చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.. ఇప్పటికే ‘మన్మథుడు 2’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారని ఫిలింనగర్ టాక్.. ఈ సీక్వెల్ లో మన్మథుడుగా నాగచైతన్య లేదా అఖిల్‌ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి మన్మథుడు 2 మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో.
  నాగార్జున, నాని కథానాయకులుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్‌’ అనే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతుంది.. ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న నాని కేరళ ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు.. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.. ఈ వరదల దాటికి ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.. అయితే ఈ విషయంపై స్పందించిన నాని ఆవేదన వ్యక్తం చేసారు..  ‘బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరుగుతోంది.. మా సినిమాటోగ్రాఫర్‌, అతడి బృందం కుటుంబ సభ్యులు కేరళలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వాళ్లు ఇవాళ లొకేషన్‌లో ఏడవడం చూశా.. అక్కడి వారి పరిస్థితి గురించి విన్న తర్వాత చాలా బాధపడ్డా.. నా ఆలోచనలు కేరళ ప్రజల చుట్టూ తిరుగుతున్నాయి.. వారు సురక్షితంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. మనకు వీలైన సహాయం చేసి, వారికి అండగా నిలుద్దాం’ అని నాని ట్వీట్‌ చేశారు.  
  బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.. ఎవరు బాగా ఆడుతున్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అంటూ అంచనాలు వేస్తున్నారు.. ఈ వారం ఎలిమినేషన్ కూడా క్లైమాక్స్ కి వచ్చింది.. ప్రస్తుతం నామినేషన్లో దీప్తి సునైనా, గీత మాధురి, నూతన నాయుడు, పూజ, రోల్ రైడా మరియు శ్యామల ఉన్నారు.. అయితే ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం ఎక్కువవుతుంది.. సునైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనడానికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. సునైనా బిగ్ బాస్ ఇంట్లో ఓ చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది తప్ప, స్వంతంగా గేమ్ ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవట్లేదు.. అలాగే రీసెంట్‌గా జరిగిన కాల్ సెంటర్ టాస్క్‌లో కౌశల్‌కి కాల్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటంతో సునైనా మీద ప్రేక్షకులకు నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.. దీంతో ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. ఆ తరం భావాలను... ఆ నాటి సిద్ధాంతాలను, అప్పటి ప్రేమాభిమానాలను ఇక్కడే వదిలేసి....అలా అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న ద్రవిళ జాతికి ఆయువులాంటి కరుణానిధి కన్నుమూశారు. నిన్నటికి నిన్న  మార్క్సిజాన్ని ఔపోసన పట్టిన సోమనాథ్ చటర్జి తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మాటకారి, చమత్కారి, "సంఘ" శ్రేయోభిలాషి అటల్ బిహారీ వాజ్‌పేయి ఇహాన్ని విడిచి పరలోకానికి పయనమయ్యారు. దీంతో ఓ మహానాయకుడి మహా ప్రస్తానం పూర్తి అయ్యింది. దేశ రాజకీయాల్లో భిన్న ధ్రవాలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ భావజాలం. మరొకటి హిందూత్వ సిద్ధాంతం. మూడోది కమ్యూనిస్టు పోరాటం. వీటిలో హిందూత్వకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు పొసగదు. రెంటికి ఆకాశం, భూమి మధ్య దూరమంత దగ్గరితనం. అవును దూరమనిపించే దగ్గరితరం ఆ రెండు సిద్ధాంతాల సారం.     స్వంత లాభం కొంత మానుకుని అన్న నానుడి ఈ రెండు పార్టీలకు అతికినట్లు సరిపోతుంది. అలాంటి హిందూత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అటల్ బిహారి వాజ్‌పేయి. పసిప్రాయంలో జనసంఘ్‌తో అడుగులు వేసిన వాజపేయి  ఆ నడకకు నడతను, పరుగును నేర్పారే తప్ప తన మార్గం నుంచి ఎప్పుడూ వెనుతిరగలేదు. ఇందుకోసం ఆయన సంసార జీవితాన్ని వదులుకున్నారు. జగమంత కుటుంబం నాది అనుకున్నారు. అలాగని ఏకాకి జీవితం అని మాత్రం అనుకోలేదు. వంద కోట్ల జనాభా నా కుటుంబం. నేను ఏకాకిని ఎలా అవుతాను అనేది వాజ్‌పైయి చిరునవ్వును చూస్తే అర్ధం అవుతుంది. వద్ధాప్యం వెంటాడగా... మతిమరుపు, శారీరిక సమస్యలతో గడచిన కొంతకాలంగా పోరాడుతున్నారు వాజ్‌పేయి. ఇక పోరాడలేను అనుకున్నారు. జీవధర్మాన్ని అనుసరించి పరమాత్మ వద్దకు చేరుకున్నారు. దేశంలో అతి చిన్న వయసులో లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. భాతర తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నిండు సభలో రేపటి భారత ప్రధాని ఈ యువకుడు అని తనను గురించి ప్రకటించేలా చేసుకున్న అసమాన ధీరుడు వాజ్‌పేయి.     నెహ్రు వాక్కు ఫలించింది. సువిశాల భారతదేశానికి... ఆ మాటకొస్తే హిందూ దేశానికి తొలి హిందూత్వ పార్టీ ప్రధానిగా ప్రమాణం చేశారు వాజ్‌పేయి. నేటి ముంబాయ్.... నాటి బొంబాయిలో జరిగిన భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీ మరో నేత లాల్ క్రష్ణ అద్వాణీ " మా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి " అని హఠత్తుగా ప్రకటించేంత వరకూ వాజ్‌పేయికి తెలియదు తాను ప్రధాని అభ్యర్ధిని అని. ఇది ఆ ఇద్దరు నాయకులు స్నేహానికి, వారిచ్చే రాజకీయ విలువలకి తార్కాణం. కుటిల రాజకీయాలు, కుట్రలు,కుతంత్రాలు ఆనాటి తరానికి తెలియవు. ఆనాడు అద్వాణీ ఉన్నారు కాబట్టి వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యారు. నేడు వాజ్‌పేయి లేరు కాబట్టి అద్వాణీ ప్రధాని కాలేరు. ఇంతే తేడా. నాటి హిందూత్వ రాజకీయాలకు, నేటి హిందూత్వ రాజకీయాలకు. వాజ్‌పేయి అంటే మాటల ప్రవాహం. వాజ్‌పేయి అంటే కవిత్వ గానం. వాజ్‌పేయి అంటే సుపరిపాలన. వాజ్‌పేయి అంటే చల్లని స్నేహం. కేవలం 13 రోజుల ప్రధానిగా ఉన్నా... ఒక్క ఓటుతో ఆయన్ని గద్దెదించినా చెరగని చిరునవ్వు వాజ్‌పేయి సొంతం. వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని పల్లెత్తు మాట అనని వాజ్‌పేయి తన కవిత్వంతోనే చురకలు వేసే దిట్ట. అయోధ్యలో రామమందిర నిర్మాణ సమయంలో కూడా వాజ్‌పేయి ఎంతో నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించారే తప్ప ఎక్కడా తడబడలేదు. ఆ వ్యక్తిత్వమే ఆయనను సమూహంలో ఒకడిగా కాకుండా సమూహమే ఆయనగా చేసింది.      భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాధించిన విజయాల్లో రెండు ప్రధానమైనవి. వాటిలో ఒకటి పోలియో నిర్మూలన అయితే, మరొకటి స్వర్ణభూజి పథకం. గ్రామాలను పట్టణాలకు, పట్టణాలను నగరాలకు అనుసంధానం చేస్తూ వేసిన ఆరు లైన్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం. ఈ పథకంపై అప్పటి ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. దీని రూపశిల్పి అటల్ బిహారీ వాజ్‌పేయి. దేశంలో అనేక మార్గాల్లో వందల మైళ్ల దూరం నల్లతాచులా కనిపించే రోడ్లపై నేడు వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తున్నాయి అంటే దాని వెనుక ప్రధానిగా వాజ్‌పేయి చేసిన క్రషి మరచిపోలేనిది. ఇక పట్టణ పేదల కోసం ఆయన హయాంలో చేపట్టిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) పథకం రూపకల్పన కూడా వాజ్‌పేయి ఘనతే. పట్టణ ప్రజలకు గూడు కల్పించే ఈ పథకం ద్వారా లక్షల మంది నిర్వాసితులు సొంత ఇంటి వారయ్యారు. ఇక రాజకీయంగా కూడా వాజ్‌పేయి తన మార్కుని దేశంలో చూపించారు. పోఖ్రాన్ అణుపరీక్షలు, పొరుగు దేశంతో సత్సంబంధాలు, కార్గిల్ వార్ వంటివి ప్రధానిగా వాజ్‌పేయి విజయాలుగానే పరిగణించాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి అన్నీ ఇచ్చారు. ఆయన వెంట కీర్తిని తీసుకువెళ్లారు. ఆప్తమిత్రుడు అద్వాణీని ఒంటరిని చేసి అనంతలోకాలకు సాగిపోయారు. ఆయన మరణానికి తెలుగు వన్ యాజమాన్యం తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తోంది. ఆ మహానాయకుడి ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధిస్తోంది.
వాజ్ పేయ్ అనగానే మనకు ఓ మాజీ పీఎం మాత్రమే గుర్తుకు రారు. ఆయన ప్రధాని కావటం కేవలం క్లైమాక్స్ మాత్రమే! అంతకు ముందే బోలెడంత సినిమా నడిచింది! దానికి ఆయనే దర్శకుడు, ఆయనే హీరో! అసలు వాజ్ పేయ్ 1996లో తొలిసారి ప్రధాన మంత్రి కావటానికి ముందే సుప్రసిద్ధులు! ఎంతగా ఆయనకు గొప్ప పేరు వుండేదంటే… అప్పట్లో… ఆయన గురించి… భారతదేశం పొందకుండా మిగిలిపోయిన అతి గొప్ప ప్రధాని వాజ్ పేయ్ అనేవారు! అలా ఆయన ప్రధాని అవ్వక ముందే ప్రధాన మంత్రి స్థాయిని పొందేశారు! ఇక 96లో, 98లో, 99లో మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చాశారు! ఇంతకీ ఏంటది? భారతదేశాన్ని ఒక పూర్తి కాలం పరిపాలించిన తొలి కాంగ్రేసేతర ప్రధాని కావటం! అంతకంటే మించీ హస్తిన సింహాసనాన్ని కాషాయం అంటలేదని భావించిన వార్ని తప్పుగా నిరూపిస్తూ హిందూత్వ విజయానికి అత్యుత్తమ సంకేతంగా నిలవటం! ఈ రోజు మోదీ అనే పరిణామం సాధ్యమైందంటే… దాని వెనుక వాజ్ పేయ్ అనే మూలం వుండబట్టే!     అటల్ బిహారీ వాజ్ పేయ్ కి నిస్సందేహంగా రాజకీయ కోణం వుంది. ఆయనని చరిత్ర తప్పకుండా సాటిలేని రాజనీతిజ్ఞుడుగానే గుర్తు పెట్టుకుంటుంది! కానీ, వాజ్ పేయ్ కేవలం పొలిటీషన్ మాత్రమే కాదు. అదే ఆయనకు, ఇతర నేతలకు వున్న తేడా! వాజ్ పేయ్ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, హిందూత్వవాది, అన్నిటికంటే మించి … అద్బుతమైన ఉపాన్యాసకుడు! ఆయన సభలో నోరు తెరిచినా, బహిరంగ సభలో నోరు మెదిపినా అత్యంత సామాన్య జనం మొదలు మహా మేధావుల దాకా అందరూ చెవులు రిక్కించి వినేవారు. అంతటి విషయం, విశేషం రెండూ వుండేవి ఆయన ప్రసంగాల్లో! ఆయన మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అందులో గొప్ప సందేశాన్ని అందించే వారు కాదు! ఆయన గొప్ప సందేశం అందించాల్సి వస్తేనే మాట్లాడేవారు! ఊరికే ఒక్క మాట కూడా మాట్లాడని నిజమైన మౌని… వాజ్ పేయ్!     వాజ్ పేయ్ నోటి వెంట వచ్చిన ప్రతీ ప్రసంగం చారిత్రాత్మకమే అయినా … అందులో అయిదు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటిల్లో మొదటిది… 1996లో ఆయన ప్రభుత్వం కూలిపోయే స్థితి వచ్చినప్పుడు పార్లమెంట్లో చేసింది. ఒకింత సుదీర్ఘ ఉపన్యాసం తరువాత ఆయన ‘’నేను రాష్ట్రపతి వద్దకెళ్లి నా రాజీనామా అందిస్తాను’’ అన్నారు! ఇది నిజంగా ఆశ్చర్యమే! వాజ్ పేయ్ ఒటింగ్ కు అడగలేదు. ఆయన ఒటింగ్ పెట్టమని స్పీకర్ ని అడిగినా ఓడేవారే! అయినా, ఒక అద్భుత ప్రసంగం తరువాత ప్రతిపక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం స్వచ్ఛందంగా ఇచ్చేస్తూ తన పరిణతిని ప్రదర్శించారు! కాకపోతే, ప్రధానిగా రాజీనామా చేయబోతూ కూడా … ‘’మేం ప్రారంభించిన దేశానికి ఉపయోగపడే పనులు మీ చేత కూడా చేయించే దాకా మేం విశ్రమించం!’’ అంటూ ముగించారు! ఇదీ వాజ్ పేయ్ మార్కు అత్యున్నత రాజకీయ పరిపక్వత!     ఇక రెండోసారి … భారత శాస్త్రవేత్తలు ప్రోక్రన్ లో అణు పరీక్షలు జరిపాక ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం! ఇది చాలా చిన్న మీడియా మెసేజ్! ప్రోక్రన్ లో అణు పరీక్షలు జరిపాం. విజయవంతం అయ్యాయి. 1974 తరువాత ఈ విజయం సాధించిన మన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు… అన్నారు! ఇప్పుడు వింటే ఇది మామూలుగా వుండవచ్చు కానీ… 1998 నాటి ఇండియాకి అతి పెద్ద విజయం! అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లాంటివి ఒకవైపు, మనం ఒకవైపు! భారత్ తన ఆత్మరక్షణ విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గదని నిరూపించింది ఆనాటి వాజ్ పేయ్ సర్కార్! ముఖ్యంగా ప్రోక్రన్ అణు బాంబులు పాకిస్తాన్, చైనాల గుండెల్లో పేలాయి! మూడోసారి వాజ్ పేయ్ ఉపన్యాసం చరిత్రలో నిలిచిపోయింది… ప్రోక్రన్ పరీక్షల విషయంలోనే! ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ … ‘’ ఇప్పటికే మూడు సార్లు మనం విదేశీ దాడులకు బాధితులుగా మిగిలాం! ఇక మీదట కాదు. మనం ఎవరి మీదా దాడి చేయటానికి ఈ పరీక్షలు చేయలేదు. మనకు ఆ ఉద్దేశం కూడా లేదు’’ అంటూ స్పష్టం చేశారు! 1947 నుంచీ స్వంత మెజార్టీ వున్న ఏ భారత ప్రభుత్వమూ ఇలా మాట్లాడలేదు. తొలిసారి వాజ్ పేయ్ పార్లెంట్ సాక్షిగా భారత్ విదేశీ దాడుల్ని సహించబోదని ప్రపంచానికి సూటిగా చెప్పారు! వాజ్ పేయ్ కంఠంలోంచి వచ్చీ చరిత్రలో మార్మోగిపోతూనే వున్న మరో ఉపన్యాసం 1980 నాటిది. బీజేపీ పుట్టిన తొలి నాళ్లలో ఆయన ముంబై మహాసభలో ప్రసంగించారు. ఏప్రెల్ 6 , 1980న కమలదళం కార్యకర్తల సమావేశంలో వాజ్ పేయ్ అద్భుతంగా ఉపన్యసించారు. ఆయన ప్రసంగం ముగిస్తూ అన్నమాటలు ఇప్పటికీ కాషాయ శ్రేణులకు ప్రేరణ కలిగిస్తూనే వుంటాయి! ‘’చీకట్లు తొలిగిపోతాయి! సూర్యుడు ఉదయిస్తాడు! కమలం వికసిస్తుంది!’’ అన్నారు! 2014లోమోదీ స్వంత మెజార్టీతో ప్రధాని అయిన వేళ నిజంగానే వాజ్ పేయ్ చెప్పినట్లు కమలం సంపూర్ణంగా వికసించింది!     ఇక అయిదోసారి వాజ్ పేయ్ పార్లమెంట్లో గర్జించిన సందర్భం… ఐకే గుజ్రాల్ ప్రధానిగా వున్నప్పుడు! ఆయన పీఎంగా వుండగా లాలు ప్రసాద్ యాదవ్ బీహార్ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. బీహార్ లో పాలన పూర్తిగా గాడితప్పింది. గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్రం మాత్రం లాలూని చూసీ చూడనట్టు వదిలేస్తూ వచ్చింది! వాజ్ పేయ్ ఆ సమయంలో లోక్ సభలో ఛండప్రఛండగా ప్రసంగించారు! ఆనాటి ప్రధానమంత్రి దాదాపు నిశ్చేష్ఠులు కావాల్సి వచ్చింది!రాజకీయ నేతలు చాలా మంది మాటలు చెబుతారు! కానీ, వాజ్ పేయ్ మాటలు అలాంటివి కావు! సాధారణ నేతల మాటలు పెదల మీద నుంచి వస్తే… ఆయన పలుకులు గుండెలోతుల్లోంచీ వచ్చేవి! అందుకే అవి ఎదుటి వారి చెవుల్లోకి మాత్రమే కాక… నేరుగా చరిత్రలోకి వెళ్లిపోయాయి! శాశ్వతంగా స్థిరపడిపోయాయి!
  జమిలి ఎన్నికలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్టుదలగా ఉంది. 2019 వ సంవత్సరంలో లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యం. ఈ జమిలి ఎన్నికలతో తాము లాభపడాలన్నది బీజేపీ నాయకుల పన్నాగం. జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాలకు ఎలాంటి మేలు జరగదన్నది వివిధ రాష్ట్రాల్లోని పాంత్రీయ పార్టీలకు చెందిన నాయకులు వాదన. ఇందులో కొంత నిజం ఉంది. ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి వస్తే ఒకటి రాష్ట్రంలో ఒకరికి... కేంద్రంలో మరొకరికి వేస్తారని ప్రాంతీయ పార్టీలకు చెందిన వారి భావన. ఇదే జరిగితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారు ఎవరన్నది ప్రాంతీయ పార్టీల బలాబలాను బట్టి ఉండేది. జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి అవకాశమూ ఉండదు. జాతీయ పార్టీలది ఇష్టారాజ్యంగా ఉంటుంది. ఈ కారణంగా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జి, ఇటీవలే మరణించిన కరుణానిధి, దేవెగౌడ వంటి వారు వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ససేమిరా అన్నారు. అయితే, కేంద్రం మాత్రం దీనిపై పట్టుదలగా వ్యవహరిస్తోంది.     ఈ సారి లోక్‌సభకు జరగాల్సిన ఎన్నికలను అన్ని శాసనసభా ఎన్నికలతో కలిపి నిర్వహించాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల యోచన. ఈ ఆలోచనను ఎలాగైనా అడ్డుకోవాలని. జమిలి ఎన్నికలు జరగనివ్వరాదని కొందరు నాయకులు పట్టుదలగా ఉన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వారి నుంచే వ్యతిరేకత వచ్చేలా చేయాలన్నది ప్రాంతీయ పార్టీల నాయకుల ఉద్దేశ్యం. ఈ ఎత్తులను గమనించిన కేంద్రం వీరి ఎత్తులకు పైఎత్తుగా జమిలి ఎన్నికలకు  ఏకంగా చట్టబద్దత కల్పించాలని చూస్తోంది. దీనికి చట్టబద్దత కల్పిస్తే ఇక రాష్ట్రాలు ఏమీ చేయలేవన్నది కేంద్రం యోచన. ఇందుకోసం లా కమిషన్ తన పని ప్రారంభించింది. జమిలి ఎన్నికలకు సాధాసాధ్యలను బేరీజు వేస్తోందిజ ఈ నెల 31 నాటికి లా కమిషన్ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా జమిలిపై ఓ నివేదిక తయారు చేసి ఇచ్చే పనిలో పడ్డారు లా కమిషన్ సభ్యులు. వారి పని పూర్తి అయిన వెంటనే కేంద్రం వచ్చే లోక్‌సభ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు తీసుకువచ్చి దీన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. ఇదే జరిగితే ఈసారి లోక్‌సభతో పాటు 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారికి ఇలా కానిచ్చినా..... 2024 ఎన్నికలను మాత్రం జమిలిగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. దీనిపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా దీన్ని ఎదుర్కొవాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. ఈ వ్యూహంతో ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి యుద్ధమైనా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. జమిలిపై ఆయన వేసిన పాచిక పారుతుందో... లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే...!!!
రారాజు అయిన తరువాత కాంగ్రెస్ యువరాజు పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చారు! సోనియా గాంధీ పట్టుదలతో రాష్ట్ర విభజన చేసిన తరువాత హస్తం గతి రెంటికీ చెడిన రేవడి అయింది. ఏపీలో సున్నా సీట్లు రాగా … తెలంగాణలో అధికారం సున్నా అయ్యి కూర్చుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాతో గత నాలుగేళ్లుగా సరిపెట్టుకుంటూ వస్తోంది రాహుల్ పార్టీ! ఇప్పుడు ఆయన హైద్రాబాద్ లో దిగి రెండు రోజుల పాటూ ఇక్కడే మకాం వేశారు. అందుక్కారణం పెద్దగా ఆలోచించాల్సినదేం కాదు. కేసీఆర్ మోదీతో వరుస భేటీలు జరుపుతూ ఏ క్షణాన్నైనా అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో వున్నారు. అది పసిగట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ తాము విభజించిన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క దాంట్లోనైనా అధికారం సాధించాలని తాపత్రయపడుతున్నారు. కానీ, అది ఎంత వరకూ సాద్యం?     ఎవరో కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానులు లేదా కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులు చెప్పే మాటలు కాదు… నిజంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవటం అంత సులువు కాదు! రాజకీయాల్లో అపర చాణుక్యుడైన గులాబీ బాస్ గత నాలుగేళ్లలో వీలైనంత జనాకర్షణ చేశారు. పాలన మొదలు పెట్టగానే ఆయన చేసిన సకల జనుల సర్వే మొదలు నిన్న మొన్నటి రైతు బంధు వరకూ అన్నీ ఓటర్లలో కోలాహలం సృష్టించాయి. వాటి వల్ల నిజంగా క్షేత్రస్థాయిలో జనానికి మేలు జరిగిందా అంటే ఎవరి వాదనలు వారికుంటాయి. కాకపోతే, ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాత్రం మరీ దారుణమైన పాలన చేయలేదు. అలాగని అద్భుతాలు కూడా సృష్టించలేదు!     ఒకవైపు కేసీఆర్ పాలనలో కొన్ని లోపాలున్నా టీ కాంగ్రెస్ లో వాట్ని ఎత్తి చూపి ముందుకు దూసుకుపోయిన వారెవరు? నాలుగేళ్లుగా ఎవ్వరూ లేరనే చెప్పాలి! మొన్నటికి మొన్న మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారటం వరకూ టీ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు కేసీఆర్. కానీ, ఆ రేంజ్లో తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ ని ఢీకొట్టింది లేదు. రేవంత్ రెడ్డి, నాగం లాంటి కొత్త నేతలు చేరినా, ఉత్తమ్ కుమార్, జానా లాంటి పాత నేతలు సిద్ధంగా వున్నా జనం పక్షాన జరిగిన భారీ ఉద్యమాలంటూ ఏమీ లేవు! పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారి కారణంగా అంతర్గత కుమ్ములాటలు యథప్రకారం సాగిపోతున్నాయి. వీటన్నటి మధ్యా హైద్రాబాద్ లో దిగిన రాహుల్ … తనకు కంప్లైంట్లు ఇవ్వద్దంటూ చెప్పేశారట! అందరూ కలిసి పని చేయండి. అధికారం సాధిద్దాం. తరువాత ఆలోచిద్దాం అన్నారట! ఈ మాటలతో కాంగ్రెస్ మార్కు అంతర్గత రాజకీయాలు చల్లబడిపోతాయి. అందరూ ఏకమైపోతారా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు… ఈ నలుగురితో కూడుకున్న గులాబీ దళాన్ని ఎదుర్కుని ఓడిస్తారా? డౌటే!     రాహుల్ పర్యటన సందర్భంగా మీడియాలో హడావిడి జరగవచ్చు. ఆయన దిల్లీ వెళ్లిపోతే మళ్లీ అంతా చల్లబడిపోతుంది. కానీ, కేసీఆర్ ఇక్కడే వుంటారు. ఆయనకు తెలంగాణ తప్ప మరో ప్రాంతంపై గురి లేదు. ఆయన స్వయంగా చెప్పినట్టు రాహుల్ కుటుంబానికి దేశం మొత్తం గోల కావాలి. కానీ, కేసీఆర్ ఫ్యామిలి దృష్టి మొత్తం తెలంగాణపైనే! కుటుంబ పార్టీనే అయినా టీఆర్ఎస్ తెలంగాణ జనానికి ఎక్కువ దగ్గరగా వుందన్నది నిజం. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి? ఏం చేయాలన్నా దిల్లీ నుంచీ ఆదేశాలు రావాలి! ఇది కేవలం తెలంగాణ కాంగ్రెస్ ఇబ్బందే కాదు. తెలంగాణ బీజేపీ కూడా అమిత్ షా వచ్చిపోయిన రెండ్రోజులు హడావిడి చేస్తుంది. తరువాత అంతా గప్ చుప్! ఇదే కేసీఆర్ లాంటి ప్రాంతీయ నేతలకి కలిసొచ్చే విషయం! వాళ్ల కాన్సన్ట్రేషన్ పూర్తిగా వారి రాష్ట్రంపైనే! జాతీయ పార్టీలు అలా చేయలేవు. జాతీయ పార్టీల స్థానిక నాయకత్వానికి పూర్తి స్వేఛ్ఛ వుండదు! మరీ ముఖ్యంగా, గాంధీలకు విధేయులైన కాంగ్రెస్ నేతల్లో అస్సలు వుండదు!     ఇక రాహుల్ తెలంగాణలో అస్సలు గుర్తించని సమస్య మరొకటి వుంది. ఎక్కడైనా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పక్షానికి లాభం. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది కాబట్టి! తెలంగాణలో కూడా అదే జరగటం దాదాపు ఖాయం అయిపోయింది. సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు అన్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చేసినప్పటికీ రాహుల్ పొత్తుల కోసం ప్రయత్రాలు చేసినట్టు కనిపించటం లేదు. తెలంగాణలో కోదండరామ్ పార్టీ, గద్దర్ పార్టీ, టీ టీడీపీ పొత్తుకు అనుకూలమైన పార్టీల లిస్టులో వున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం ఎలాగూ కాంగ్రెస్ తో చేతులు కలిపే రాజకీయ వాతావరణం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ లు బద్ధశత్రువులే! ఇలాంటి స్థితిలో తమతో కలసి నడవగలిగే కోదండరామ్, గద్దర్, టీ టీడీపీ శ్రేణుల్ని కూడా ఇంతవరకూ రాహుల్ పలకరించలేదు. ఉత్తమ్ కూడా వారి మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు! మరి దీని ఎఫెక్ట్ ఏంటి? కాస్త రాజకీయం తెలిసిన వారెవరైనా చెప్పేస్తారు! జాతీయ స్థాయిలో రాహుల్ మోదీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల్ని జట్టుకట్టుటంలో విఫలం అవుతున్నారు. అదే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ పార్టీల్ని తమతో కలిసేలా చేయలేకపోతున్నారు. కేసీఆర్ మాటల్లో ధ్వనించే భరోసాకు ఇదే కారణం! హైద్రాబాద్ లో హడావిడి పర్యటనలు, కుటుంబ పాలనపై సెల్ఫ్ గోల్స్ లాంటి కామెంట్లు చేయటం కంటే రాహుల్ ముందు పొత్తులపై ఆలోచిస్తే ఎంతో బావుంటుంది. ఎందుకంటే, మిగిలింది ఇంకాస్త సమయమే కాబట్టి!
తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఇందుకు సంకేతంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే రోజు సమర శంఖం పూరించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మహిళలతో సమావేశం నిర్వహించారు. అది జరిగిన కొద్ది గంటలకే తెలంగాణ రాఫ్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తన ఎన్నికల ప్రణాళికను కూడా వెల్లడించారు.  అంతే కాదు... ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే అవి ముందస్తు ఎన్నికలు కావని కొత్త సూత్రీకరణలకు కూడా తెర తీసారు.     అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆయన ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ని.మయ్యేలా ఉన్నాయి. అంతే కాదు... ఈ సెప్టెంబర్ నెలలోనే తమ అభ్యర్ధులను సైతం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని, తిరిగి మళ్లీ తమదే అధికారమనే ధీమాను సైతం వ్యక్తం చేశారు.  ఈ ప్రకటనను ఆయన ఆత్మవిశ్వాసంగా చూడాలా... లేక అతి విశ్వాసంగా చూడాలో పరిశీలకులు లెక్కలు తీస్తున్నారు. ఆత్మ విశ్వాసంగా పరిగణించాలంటే కె.చంద్రశేఖర రావు గడచిన నాలుగేళ్లుగా చేపట్టిన పలు పథకాల అమలును బేరీజు వేయాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులకు ఇచ్చిన పెట్టుబడి పథకం, మహిళలకు ప్రకటించిన కెసీఆర్ కిట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఆయన్ని తిరిగి అధికారంలో కూర్చోపెడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అలాగే మిషన్ భగీరథ, చెరువులు పునరుద్ధరణ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలుగానే వారు చూస్తున్నారు. అయితే ఇవన్నీ పైకి కనిపించే పథకాలే అయినా... వాటి వెనుక దాగి ఉన్న అవినీతి ప్రతిపక్షాలకు ఈ సారి ఎన్నికల ఆయుదం కానుంది.     ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు తొలి సారి వచ్చారు. ఇక నుంచి ప్రతి నెలా ఇక్కడకు వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లో తన తొలి పర్యటన ప్రారంభించిన రాహుల్ గాంధీకి ఇక్కడ మంచి స్వాగతమే లభించిందని చెప్పాలి. ఈమధ్య ఆయన తన ప్రసంగాలలోనూ, లోక్‌సభలోనూ రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు. కన్నుకొట్టడం వంటి చిలిపి పనులను మినహాయిస్తే ఏడాది క్రితం రాహుల్ గాంధీకీ... ఈనాటి రాహుల్ గాంధీకి మధ్య తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ప్రధానమంత్రిని లోక్‌సభలో తన ప్రసంగం అనంతరం కౌగలించుకున్న రాహుల్ గాంధీ జాతీయ స్ధాయిలో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో కూడా ఆయన చేసిన ప్రసంగం ఇక్కడి ఏలికలకు కాసింత ఇబ్బందుల పాలు చేసిందనే చెప్పాలి. అందుకే హడావుడిగా... అది కూడా రాహుల్ గాంధీ వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అధికార పార్టీలో ఆందోళనను తెలియజేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర సెటిలర్లదే. వీరి మద్దతు ఎవరికి ఉంటుందో వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సెటిలర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు.     సెటిలర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కాసింత ముందుగానే స్పందించింది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆయుధాన్ని తెలంగాణలో సెటిల్ అయిన వారిపై ప్రయోగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి సెటిలర్ల ఓట్లను అడిగే నైతిక హక్కును కోల్పోయింది. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ కూడా టిఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారంటే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అని ప్రకటనలు  చేశారు. దీంతో సెటిలర్ల ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు దిద్దుబాటు చర్యలకూ ఉపక్రమించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వారందరూ తెలంగాణ వాసులే అని ప్రకటించారు. అయితే, సెటిలర్లు ఆయన మాటలను నమ్ముతారో... లేక తమ బంధువులు, స్నేహితులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఆరు నెలల ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందని మాత్రం తేటతెల్లం అయ్యింది.
కులం అడ్డుగోడల్ని కూలగొడదాం… ఇలాంటి మాటలు మేధావులు మొదలు మీడియా వాళ్ల దాకా అందరూ మాట్లాడతారు! కానీ, నిజంగా మన దేశంలో కుల నిర్మూలన ఉద్యమం పెద్దగా ఏం జరగటం లేదు. ప్రభుత్వం నుంచీ స్టార్ట్ సినిమాల దాకా అంతటా కులాన్ని పటిష్టం చేసే మాటలు, చర్యలే తప్ప మరొకటి కనిపించవు. అలాంటి కోవలో కుల రిజర్వేషన్లు కూడా వస్తాయి. అసలు కులం ఆధారంగా ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అవసరమే అయినా కూడా ఇంకెంత కాలం వరకూ? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు చర్చకు రావాల్సిన సమయంలో దేశ వ్యాప్తంగా కొత్త కొత్త కులాలు తమకూ రిజర్వేషన్లు కావాలంటూ బరిలోకి దిగుతున్నాయి. రాజకీయ నేతలు కూడా తమ ఓట్ల లావాదేవీల్లో భాగంగా వాట్ని వెన్నుతట్టి ప్రొత్సహిస్తున్నారు. కులం అంటే అధికార పక్షాలు భయపడతాయి. ప్రతిపక్షం గజగజ వణికిపోతుంది. కులంతో పెట్టుకునే మోధుడంటూ ఎవరూ లేకుండాపోయారు!     కేంద్రంలో వున్న బీజేపీ నిజానికి ఒకప్పుడు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఆరెస్సెస్ అయితే బాహాటంగానే రిజర్వేషన్లపై రివ్యూ జరగాలనేది. కానీ, పూర్తి మెజార్టీతో తొలిసారి మోదీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఒక్కసారిగా స్వరం మారిపోయింది! స్వయంగా ప్రధానే తన తాజా ఇంటర్వ్యూలో… కుల రిజర్వేషన్లు ఇంకా చాలా కాలం భద్రంగా వుండబోతున్నాయని తేల్చి చెప్పారు! మరోవైపు బీజేపీకే చెందిన నితిన్ గడ్కరీ మరాఠా ప్రజల రిజర్వేషన్ ఉద్యమంపై స్పందిస్తూ … అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కుడున్నాయని ఎదురు ప్రశ్నవేశారు! అంటే… రిజర్వేషన్ల గోలంతా ఓట్ల మాయాజాలమే తప్ప నిజంగా రిజర్వేషన్లు వున్న వాడికీ, లేని వాడికి, ఎవరికీ అవతల ఉద్యోగాలు లేవన్నమాట! ఇంత మాత్రం దానికి జనాన్ని పొలిటీషన్స్ జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం దేనికి?     జాతీయ స్థాయి నుంచీ రాష్ట్ర స్థాయికొస్తే… ఏపీలో కాపు రిజర్వేషన్ల వివాదం కాక రేపుతోంది. అసలు కాపులకి బీసీ స్టేటస్ ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి? ఇవ్వకపోతే కాపు సోదరుల డిమాండ్లు మరో మార్గంలో ఎలా పరిష్కరించాలి? ఇవీ చర్చించాల్సిన ప్రశ్నలు! కానీ, వాటికి బదులు రాజకీయ డ్రామా నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయించేశారు. బంతి కేంద్రం కోర్టులోకి తోశారు. కాపులకి రిజర్వేషన్లు ఇప్పుడు మోదీ సర్కార్ చేతిలో వున్నాయి! మరి దిల్లీ ప్రభుత్వం అంగీకరిస్తుందా? వాళ్లు సుప్రీమ్ రూల్స్ అంటూ నెపాన్ని అత్యున్నత న్యాయస్థానంపై నెట్టేస్తారు! అలా కాపుల రిజర్వేషన్ కోరికని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు!     కేంద్ర , రాష్ట్ర అధికార పక్షాలు కాపుల రిజర్వేషన్లపై తాత్సారం చేస్తుండటంతో జగన్, పవన్ లాంటి నేతలు కాపుల వివాదంతో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అందులోనూ క్లారిటీ లేదు. రోజుకో మాట మాట్లాడుతుంటారు. కులాల గురించి పెద్దగా మాట్లాడని జనసేనానికి అదేదో 9వ షెడ్యూల్ అనే మాట వాడి ఒక కామెంట్ చేసేశారు. ఆ మార్గంలో ఎప్పటికి కాపులకు రిజర్వేషన్లు లభిస్తాయి? దేవుడికే తెలియాలి! ఇక జగన్ దైతే మరీ పెద్ద డైలామా! ఆయన ఓ రోజు నా చేతుల్లో ఏం లేదు అంటారు. అంతా కేంద్రం చేయాల్సిందే అంటూ కుండ బద్ధలు కొడతారు. తెల్లారే సరికి కాపు ఓట్లు మొత్తానికి మొత్తంగా తుడిచి పెట్టుకుపోతాయని గ్రహించి యూటర్న్ తీసుకుంటారు. కాపులకు బీసీ హోదా విషయంలో నేను రెడీనే… కాకపోతే చంద్రబాబు కంటే రెట్టింపు నిధులు కాపు కార్పొరేషన్ కు కేటాయిస్తా అంటూ చెబుతారు!     జగన్ రోజుకో మాట మాట్లాడుతుండటంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా ఆయనకు రివర్స్ అయ్యారు. జగన్ తమకు పదివేల కోట్లు ఇవ్వటం కాదు మేమే ఇరవై వేల కోట్లు ఆయనకు ఇస్తాం. సీఎంగా కాపు కులస్థుడ్ని కూర్చోబెట్టండని సవాల్ విసిరారు! మొత్తంగా ఈ వివాదం జగన్ సెల్ఫ్ గోల్స్ లో అతి పెద్దదిగా మారింది. ఆయన చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు కాపు ఓటర్లని, కాపు నాయకుల్ని ఇద్దర్నీ జగన్ కు దూరం చేస్తోంది. అదే సమయంలో తమ కులానికే చెందిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ నేతగా అవతరించనున్నాడు కాబట్టి కాపులు ఆయన వైపు వెళ్లే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాళ్లు జనసేన వైపు వెళ్లినా, టీడీపీ వైపు మళ్లినా… నష్టం మాత్రం కాబోయే సీఎంని అనుకుంటున్న జగన్ కే! కాపు రిజర్వేషన్ల విషయంలో నోరు జారిన జగన్ ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తే… మన దేశ తలపండిన పొలిటీషన్ప్ ఎవ్వరూ , ఎందుకు రిజర్వేషన్ల కొరివితో తలగొక్కోరో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, కుల ఉద్యమాలు, కుల రిజర్వేషన్ల విషయంలో తేరుకోవాల్సింది జనమే! ఎందుకంటే అన్ని పోరాటాల తరువాత లాభపడేది ఏదో ఒక రాజకీయ పక్షమే తప్ప నిజమైన నిరుపేద జనం కాదు! ఎందుకంటే, రిజర్వేషన్ ఆధారంగా ఇవ్వబోయే ఉద్యోగాలు అంటూ ప్రస్తుత ప్రైవేటీకరణ ప్రపంచంలో పెద్దగా లేవనే చెప్పాలి!
  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత, వాజ్‌పేయి చితికి నిప్పంటించారు.. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిగాయి.. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అడ్వాణీ సహా పలువురు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయికు నివాళులర్పించారు.  
  భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల, త్వరలో పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్‌ సంతాపం తెలిపారు.. భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని అన్నారు.. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేసిన వాజ్‌పేయి, ప్రధాని అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగించారని తెలిపారు.. భారత్‌, పాక్‌ల మధ్య శాంతి నెలకొల్పడమే వాజ్‌పేయీ సాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.
  ఇప్పటి రాజకీయ నాయకులు చాలామంది ఒకరిమీద ఒకరు అర్ధంపర్థం లేని ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాల విలువ తగ్గిస్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు.. సిద్ధాంత పరంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసినా, వ్యక్తిగతంగా మాత్రం మంచిగా ఉంటూ విలువైన రాజకీయాలు నడిపేవారు.. అలాంటివారిలో ముందువరుసలో ఉంటారు వాజ్‌పేయి.. నెహ్రూ, ఇందిరాగాంధీలను సిద్ధాంతపరంగా వ్యతిరేకించినా.. వారు మంచి చేస్తే వాజ్‌పేయి ప్రశంసించేవారు.     నెహ్రూకి కూడా వాజ్‌పేయి అంటే అభిమానం ఉండేదట.. భారత పర్యటనకు వచ్చిన విదేశీ అతిథిలకు, ప్రధానమంత్రిలకు వాజ్‌పేయిని పరిచయం చేస్తూ.. 'ఈయన ఎదుగుతున్న విపక్ష నాయకుడు.. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటారు.. నా దృష్టిలో ఆయన మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు.. భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి' అని నెహ్రూ చెప్పిన సందర్భాలు ఉన్నాయట.. అలాగే వాజ్‌పేయి కూడా నెహ్రూను గౌరవించేవారు.. 1977లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టాక, సౌత్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వెళ్లగా అక్కడ గోడపై ఉండాల్సిన నెహ్రూ చిత్రపటం లేకపోవడాన్ని గమనించారు.. వెంటనే ఆయన నెహ్రూ చిత్రపటం ఎక్కడ ఉండేదో దానిని అక్కడే ఉంచాలని ఆదేశించారట.     అలానే ఓ సారి వాజ్‌పేయి ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది.. ఉత్తర భారతదేశంపై పాకిస్తాన్ తొలుత వైమానిక దాడులు చేయడంతో భారత్ యుద్ధ క్షేత్రంలోకి దిగింది..అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పలు దేశాల మద్దతు సంపాదించడంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయి వెనకడుగు వేసింది.. ఈ యుద్ధం దక్షిణాసియా రాజకీయ చిత్రంలో భారత్‌ను బలీయ శక్తిగా మార్చింది.. ఈ యుద్ధం తరువాత రాజ్యసభలో వాజ్‌పేయి మాట్లాడుతూ ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.. విపక్షంలో ఉన్నప్పటికీ ప్రధాని స్థానంలో ఉన్న ఇందిరాగాంధీ తెగువను ప్రశంసించడానికి ఏమాత్రం సందేహించని వాజ్‌పేయిని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి.
ప్రొటీన్స్ అనేవి మన ఆహారంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన న్యూట్రీషియన్స్. మోడరన్ లైఫ్ స్టైల్ లో ప్రొటీన్ శాతం డైట్ లో ఉండేలా చేసుకోవడం ఖచ్చితం. కండరాల పటుత్వం పెంచుకోవాలనుకున్నా, బరువు తగ్గాలనుకున్నా, ప్రొటీన్ లెవెల్స్ సరైన మోతాదులో తీసుకోవాలి. ఇంతకీ ప్రొటీన్ల ఆవశ్యకత శరీరానికి ఎంతో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=IZL1JYO0o24    
  మన ఇంట్లో మనకు తెలియకుండా హానిచేసే ఎన్నో కాలుష్య కారకాలుంటాయట. ఒక ఏజెన్సీ నివేదిక ప్రకారం, సుమారు 12 రకాల హానికారక కెమికల్స్ తో మనం నిత్యం సహజీవనం చేస్తామట. బయటి కంటే అయిదు రెట్లు హానికారక కెమికల్స్ మన ఇంట్లో ఉంటాయి అంటే నమ్మగలరా? ఆస్తమా లాంటి జబ్బులకి ఇంటి లోపలి కాలుష్యమే కారణమట. ఇందుకు సంబంధించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=C8tNTxqY0yM
మహాత్మాగాంధి సిద్ధాంతాలతో కొందరు అంగీకరించవచ్చు, లేదా విభేదించనూవచ్చు. కానీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్రని ఎవరూ కొట్టిపారేయలేరు. అహింసని సైతం ఒక ఆయుధంగా మార్చిన తీరుని మర్చిపోనూలేరు. తను ఏర్పరుచుకున్న నియమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే గాంధీగారిని మిగతావారికంటే భిన్నంగా నిలిపిందన్నది వాస్తవం. అది సత్యాగ్రహం కావచ్చు, అహింసా సిద్ధాంతం కావచ్చు. ఆయన జీవనశైలిని గమనిస్తే ఇలాంటి నియమాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో ఒకటి మేకపాలు తాగడం! ఎవరు ఎగతాళి చేసినా కూడా గాంధీగారు మేకపాలు మానేవారు కాదు. ఇంతకీ గాంధీగారు మేకపాలు తాగడం వెనుకనున్న కథ ఏమిటో, అసలు మేకపాలంటే కొందరికి ఎందుకంత అభిమానమో చూద్దాం...   మాటకు కట్టుబడి! గాంధీ ఒకప్పుడు పూర్తిగా శాకాహారానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఇతర జంతువుల నుంచి వచ్చే పాలని కూడా ఆయన ముట్టుకోవడం మానేశారు. ఇలా ఒక ఆరేళ్లపాటు పాలకి దూరంగా ఉన్నారు కూడా! అయితే 1917లో ఆయనకు తీవ్రమైన అతిసార వ్యాధి పట్టుకుంది. మనిషి నీరసంతో కృశించిపోయాడు. అలాంటి స్థితిలో పాలు చాలా మేలు చేస్తాయని అందరూ సూచించినా, తన పాత నిర్ణయానికి కట్టుబడి ఆయన పాలని ముట్టుకోలేదు.   ఒక ఐడియా! గాంధీగారి పరిస్థితి చూసిన ఒక వైద్యుడు ఓ ఉపాయాన్ని సూచించాడు. ‘మీరు పాలని ముట్టుకోను అని నిర్ణయించుకున్నప్పుడు మీ మనసులో ఆవు లేదా గేదె పాలే మెదిలి ఉంటాయి కదా! అలంటప్పుడు మీ మాటని కాస్త సడలించి మేక పాలుని తీసుకోవచ్చు కదా!’ అన్నాడు. దీన్ని గాంధీగారి భార్య కస్తూరిబాయి కూడా సమర్థించడంతో, అప్పటి నుంచీ ఆయన మేకపాలని తీసుకోవడం మొదలుపెట్టారు.   నిజానికి గాంధీగారి దృష్టిలో పాలు అంత ఆరోగ్యకరం కాదు. వాటిద్వారా సదరు జంతువులలో ఉండే రోగకారకాలన్నీ మనకు అంటుకుంటాయని ఆయన అభిప్రాయం. అయితే శాకాహారులకు పూర్తిస్థాయి పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో గత్యంతరం లేదని ఆయన తరువాత రోజుల్లో ఒప్పుకొనేవారు.   మేకపాలు ప్రత్యేకమేనా! గాంధీగారు మేకపాలు తాగడం మాట అటుంచి, చాలామంది నిపుణులు గేదెపాలకంటే మేకపాలు శ్రేష్టమని వాదిస్తున్నారు. వారి వాదనల ప్రకారం మేకపాలలో చాలా సుగుణాలే ఉన్నాయి.   - ఆవు/గేదెపాలకంటే మేకపాలలోని కొవ్వుకణాలు చిన్నగా ఉంటాయట. అందుకని ఇవి మిగతా పాలకంటే సులభంగా జీర్ణమవుతాయి.   - కొందరికి పాలు సరిపడవు. కారణం! వాటిలో ఉండే లాక్టోజ్‌ అనే పదార్థం. మేకపాలలో లాక్టోజ్‌ చాలా తక్కువ స్థాయిలో ఉండి పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కేవలం లాక్టోజే కాదు. పాలల్లో ఉండే ‘A1 కేసిన్‌’ అనే మాంసకృత్తుల వల్ల చాలామందికి జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అయితే మేకపాలలో ‘A1 కేసిన్‌’ బదులు ‘A2 కేసిన్‌’ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జీర్ణసంబంధమైన ఇబ్బందులు దరిచేరవు.   - గేదెపాలకంటే మేకపాలలోనే ఎక్కువశాతం ఖనిజాలు లభిస్తాయి. ఇక విటమిన్లు, కొవ్వు సంగతి చెప్పనే అక్కర్లేదు. మేకపాలు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతాయంటున్నారు నిపుణులు.   - మేకపాలలో ఎక్కువ పోషకాలు ఉండటమే కాదు. ఇతర పాలతో పోలిస్తే ఈ పోషకాలని మన శరీరం మరింత సులువుగా గ్రహించగలదట.   - మేకపాలలో విటమిన్‌ A ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి కాంతినీ, మృదుత్వాన్నీ తీసుకువస్తుందట. పైగా చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా నివారించే శక్తి దీనికి ఉంది. అందుకనే కొంతమంది మేకపాలని చర్మానికి నేరుగా రాసుకుంటారు. మేకపాలతో చేసిన సబ్బులకు కూడా మంచి ఆదరణ ఉంది.   - శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సెలేనియం అనే ఖనిజం మేకపాలలో ఎక్కువగా ఉంటుంది. జుట్టు మొదలుకొని థైరాయిడ్ వరకూ ఈ సెలేనియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా మేకపాల ప్రత్యేకతలు చాలానే కనిపిస్తాయి. గాంధీగారు చెప్పారని కాదు కానీ ఇప్పటికీ చాలామంది మేకపాలను మిగతా పాలతో సమానమైన విలువ కలిగనివా భావిస్తారు. ఇంత చదివిన తరువాత మేకపాల గురించి ఎలా ఎగతాళి చేయగలం!   - నిర్జర.