Publish Date:Mar 27, 2014
Publish Date:Mar 24, 2014
Publish Date:Mar 21, 2014
Publish Date:Mar 20, 2014
Publish Date:Mar 18, 2014
Publish Date:Mar 13, 2014
Publish Date:Mar 12, 2014
Publish Date:Mar 11, 2014
Publish Date:Mar 10, 2014
Publish Date:Mar 7, 2014
Publish Date:Mar 5, 2014
Publish Date:Mar 3, 2014
Publish Date:Feb 27, 2014

LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
  ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో యువ కథానాయకుడు నిఖిల్‌ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘హ్యాపీ డేస్‌’, ‘యువత’ సినిమాలు తప్ప అతడి కెరీర్‌లో హిట్స్‌ అనేవి లేవని, వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి అతడికి వచ్చేస్తుందని కామెంట్స్‌ చేసిన వాళ్ళ చేత నిఖిల్‌ న్యూ ఏజ్‌ సినిమాలు చేస్తున్నాడనే పేరు తెచ్చుకున్నారు. ‘కార్తికేయ’ తరవాత ‘శంకరాభరణం’, ‘కిరాక్‌ పార్టీ’ చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకున్నా... నిఖిల్‌ ఇమేజ్‌ ఏమాత్రం మారలేదు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకున్న పేరుని నిలుపుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో అనూహ్య విజయం సాధించిన ‘కనితన్‌’ రీమేక్‌ ‘ముద్ర’లో నటిస్తున్నాడు. శుక్రవారం కొత్త సినిమా ‘శ్వాస’కి కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా కోసం చాలా సినిమాలను పక్కన పెట్టేశానని నిఖిల్‌ తెలిపాడు. తనకు ‘శ్వాస’ కథ విపరీతంగా నచ్చిందనీ, అందువల్ల ఈ సినిమా కంటే ముందు చేయాల్సిన చిత్రాలు కొన్నిటిని పక్కన పెట్టానని నిఖిల్‌ ప్రారంభోత్సవంలో పేర్కొన్నాడు. ఇంకా ఈ యువ కథానాయకుడు మాట్లాడుతూ ‘‘యంగ్‌ డైరెక్టర్స్‌తో పని చేసిన ప్రతిసారీ నాకు హిట్స్‌ వచ్చాయి. నా కెరీర్‌ చూసుకుంటే కొత్త డైరెక్టర్స్‌తో చేసిన సినిమాల్లో ఎక్కువ పర్సెంట్‌ హిట్స్‌ వున్నాయి. ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ ‘శ్వాస’లో నిఖిల్‌ సరసన నివేదా థామస్‌ హీరోయిన్‌. కిషేన్‌ కట్టా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు.  
బడ్జెట్ ఎక్కువ అవుతోందనీ, కాస్త ఖర్చులు తగ్గించాలనీ 'మహర్షి' టీమ్‌కి దిల్‌రాజు క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశార్ట‌. మ‌హేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న 'మహర్షి' సినిమాకు ముగ్గురు నిర్మాతలు. దిల్‌రాజుతో పాటు వైజయంతి మూవీస్ అశ్వినీదత్, పివిపి సినిమాస్ పొట్లూరి వరప్రసాద్ ఈ సినిమాలో పార్టనర్స్. కానీ, ప్రొడక్షన్ మొత్తం దిల్‌రాజే చూస్తున్నారు. అందువల్ల, బడ్జెట్ విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటివరకూ ఇండియాలో డెహ్రాడూన్‌, గోవా, హైద‌రాబాద్‌ తదితర ప్రాంతాల్లో 'మహర్షి' షూటింగ్ జరిగింది. ఇటీవల మేజర్ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ అమెరికా వెళ్ళింది. కథలో అమెరికా షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికా వెళ్లి లొకేషన్లు చూసుకుని వచ్చారు. అక్కడ ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వుంది. అలా చేస్తే బడ్జెట్ అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అవుతోందనీ, అందువల్ల ప్లాన్ మార్చమని దిల్‌రాజు చెప్పారట! అమెరికాలో అవుట్‌డోర్‌లో తీయాల్సిన స‌న్నివేశాలు తీయ‌మ‌ని, ఇండోర్ స‌న్నివేశాలు ఇండియాలో సెట్ వేసుకుని తీద్దామ‌ని ఆయన అన్నార్ట‌! బడ్జెట్ కంట్రోల్ చేయకపోతే ముగ్గురు నిర్మాతలకు లాభాలు రావడం కష్టమే మరి!!
  రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటేనే ప్రతిభతో కూడిన మూర్ఖత్వం గుర్తొస్తుంది. తొలిసినిమా శివతోనే ఎన్నో సంచలనాలు సృష్టించిన వర్మ.. దాని తరువాత కూడా పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే తరువాత తరువాత ఆ బ్రాండ్ ని దూరం చేసుకున్నాడు. ఒకప్పుడు వర్మ సినిమా!! అని ఆసక్తి కనబరిచిన వారు కూడా ఇప్పుడు వర్మ సినిమానేగా అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వర్మ ప్రేక్షకుల దృష్టిని తనవైపు మరలేలా చూసుకుంటున్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాని వర్మ ప్రకటించి తరువాత సైలెంట్ అయ్యాడు. దీంతో ఈ సినిమా కూడా టైం పాస్ గా అనౌన్స్ చేసుంటాడు అనుకున్నారంతా. కానీ కాస్త గ్యాప్ తీసుకొని మరీ సినిమా ఓపెనింగ్, ఆర్టిస్ట్ ల ఎంపిక అంటూ హడావిడి మొదలుపెట్టారు. అంతేకాదు ఈ సినిమా కోసం వర్మ ఏకంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వెంకన్నను సినిమా కోసం ప్రార్థించారట కూడా.     ఎక్కువగా హార్రర్, ఫ్యాక్షన్, మాఫియా సినిమాలు చేసే వర్మకు దేవుడిపై నమ్మకం ఉందంటే నమ్మలేం. ఈ విషయం ఆయన మాటల్లో కూడా అర్ధమవుతుంది. ఎప్పుడో 'గోవిందా గోవిందా' అంటూ ఓ సినిమా చేసారు. ఆ మధ్య షూటింగ్ సమయంలో లొకేషన్ లో ఉన్న వినాయక విగ్రహం పక్కన నిల్చొని ఫోటోకి పోజ్ ఇచ్చారు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కోసం ఏకంగా భక్తుడి అవతారమే ఎత్తారు. తాజాగా వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పుట్టినప్పట్నుంచి ఇప్పటి వరకూ దేవుడిని దర్శించుకోలేదన్నారు. కేవలం ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతోనే నేడు తిరులమ వెంకన్నను దర్శించుకున్నట్లు తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాలను ప్రజలకు అందించే ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ప్రార్థించామన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయన్నారు. వాటిని చూపించే ధైర్యం, సాహసం, శక్తి ఇవ్వమని వెంకన్నను ప్రార్థించానన్నారు. ఈ చిత్రం మనస్సుతో చేయాల్సిన చిత్రమని వర్మ అన్నారు.
  Actors: Ram, Anupama Parameshwaran, Prakash Raj, Pranitha Subhash, Aanmi, Praveen, Swami Rara Satya, Posani Krishnamurthy and others Camera: Vijay K. Chakravarthy Story, Dialogues: Prasanna Kumar Bejawada Director: Trinadha Rao Nakkina Music: Devisri Prasad Production Company: Sri Venkateswara Creations Producers: Sirish-Lakshman Screenplay, directed by: Trinathrao Rakshana Release date: October 18, 2018   Hello Guru Prema Kosame is a combination of Actor Ram, Director Trinadha Rao Nakkina and Producer Dil Raju. After Vunnadi Okkate Zindi, this is Ram’s next & for Dil Raju after a series of flops, romantic cinema ‘Hello Guru Prema Kosame’ is the only hope. Now let us see if the movie has won the audiences hearts. Story: Sanju (Ram), is a Kakinada boy looking for job after completing his education but does not want to come out of his comfort zones. Finally he gets a software job & is forced to move to Hyderabad, where he is asked to stay at a family friend aka Vishwanath’s (Prakashraj) house. While his journey to Hyderabad, he meets Anu (Anupama Parameshwaran) & tries to scare her. Upon realizing that she is Vishwanath’s daughter – he tries to befriend her since they will have to stay in the same house. In the due course – Sanju falls in love with Anu. How does Sanju fall in love with Anu? Even after knowing that Sanju is in love with his daughter – why is Vishwanath still cool? Does Anu reciprocates Sanju’s feelings? If yes, then why did she agree to marry the guy who is her father’s choice? And finally how did Sanju’s love story win? Answers to these questions form the storyline. Analysis: There is nothing new to be highlighted as far as the story of the movie is concerned. Also there are no twists and turns in the story. Characters chosen for the cinema are also not very unique, but despite all this there is lot of comedy in the movie. And for giving a decent comedy Actors Ram & Prakashraj have given a good support to the Director. Cinematographer has tried to make each frame beautiful. Again, the movie has not received a good support from Music Director Devi Sri Prasad – the songs are just average. To be frank the movie seems to be a sequel of ‘Nenu Local’ & ‘Cinema Choopista Mava’. Shadows of these two cinemas can be felt very well. Audience can only notice a new emotion when the Heroine’s father makes friendship with the Hero, which throws a limelight on the generation gap. Emotion and Humor get enough space and do not get diluted throughout. Starting with Sanju’s journey from Kakinada to Hyderabad followed by the training sequence at the software office and the scenes at the coffee shop where the orders are made and later on the worry regarding the bill starts makes the audience laugh heart out since each one of us can relate ourselves to the certain situations. Especially the current generation will image themselves in those scenes. All in all the first half runs without brakes. On the other hand during the second half audience can feel the speed breakers & sudden breaks. Every scene from start to end, the audience will feel like they have seen them before. The climax of the movie seems very weak since it can be felt that, Director was in a hurry to frame the climax. Performances: Ram is energetic as always and has also done some good dance steps for all the songs. The chemistry between Prakashraj and Ram has worked out very well. Anupama Parameshwaran has done her job well. Pranita’s role is very weak and does not seem like she is the second heroine. Her presence can be greatly felt only in a song. The dialogues written for the Amma’s role ad her acting is very impressive. Though Praveen has appeared in just a few scenes, he has done his job well by making the audience laugh. Posani Murlikrishna has been restricted for 2 or 3 scenes. Final Verdict: Without expecting any logic, if you want to merely enjoy the comedy – you can surely watch the movie. On the contrary, if you are expecting a fresh story and its new fragrance – it is better to be away from this movie. ‘Hello Guru Prema Kosam’ – is just a comedy film. Rating: 2/5
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది తెలుగులో ఓ సామెత. దీని అర్థం ఏంటంటే... సమాన స్థాయి కలిగిన వ్యక్తులు ఇద్దరు ఒక చోట ఇమడలేరు అని! ఏ ఇద్దరు స్టార్ హీరోయిన్లూ ఒక చోట ఇమడలేరని, ఇద్దరి మధ్య స్నేహం కుదరదని అంటుంటారు. కానీ, ఇక్కడ కుదిరింది. రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే మధ్య స్నేహం కుదిరింది. విజయ దశమి సందర్భంగా ర‌కుల్‌ని తన ఇంటికి ఆహ్వానించింది పూజా హెగ్డే. ఫెస్టివల్ స్పెషల్ లంచ్ పెట్టింది. రకుల్ ఫ్యామిలీ ఢిల్లీలో సెటిల్ అయ్యింది. ఆమెకు హైదరాబాద్‌లో ఒక సొంత ఇల్లు కొనుక్కుంది. ప్రస్తుతం ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వుంది. పూజా హెగ్డే సొంతూరు బెంగళూరు. అయితే... ఫ్యామిలీ అంతా ముంబైలో సెటిల్ అయ్యింది. విజయదశమికి ఇంటి దగ్గరే వున్నారు. రకుల్ కూడా ముంబైలో వున్నారని తెలుసుకుని తన ఇంటికి ఆహ్వానించారు. పండుగ భోజనంలో సుమారు 20 ఐటమ్స్ వడ్డించడంతో రకుల్ ఆశ్చర్యపోయారు. అన్నీ ఇష్టంగా తిని తరవాత వర్కవుట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల్లో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ సరసన నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' విడుదలైంది. రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఎన్టీఆర్ బయోపిక్ చేస్తుంది కానీ... అందులో అతిథి పాత్ర మాత్రమే. కొన్ని సన్నివేశాల్లో శ్రీదేవిగా కనిపిస్తుంది. రకుల్ అవకాశాలను పూజా ఎగరేసుకు వెళ్తోందని కొంతమంది కామెంట్ చేశారు. నిజం ఏంటో ఇద్దరికీ తెలుసు. ప్రస్తుతం పూజా హెగ్డే నటిస్తున్న హీరోల పక్కన రకుల్ ఎప్పుడో నటించేసింది. ఈ కామెంట్స్ పక్కనపెట్టి ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.
  తిత్లీ తుఫాన్ రూపంలో శ్రీకాకుళంని కష్టం ముంచెత్తింది. తిత్లీ బాధితుల కన్నీళ్లు తుడవడానికి, వారికి అండగా నిలబడడానికి పలువురు ముందుకొస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విరాళాలు ప్రకటించాయి. హెరిటేజ్ సంస్థ రూ. 66 లక్షల చెక్కును సీఎంకి అందించింది. ఇక సీఎం చంద్రబాబు అయితే తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా రూ. కోటి సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే వైసీపీ రూ. కోటి సాయం ప్రకటనకే పరిమితమా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే వైసీపీ ఆ కోటిని సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు కానీ లేదా మరేదైనా మార్గంలో సాయం చేసిన దాఖలాలు కానీ లేవు. దీంతో వైసీపీ కోటి సాయం ప్రకటనకే పరిమితమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో వైసీపీ ప్రకటించిన ఆర్థికసాయాల విషయంలో కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ ను హుదూద్ కుదిపేసినప్పుడు.. జగన్ రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. ప్రభుత్వానికి ఇవ్వబోమని వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఖర్చు పెడతామని తన పత్రికలో ప్రకటించి పాఠకుల దగ్గర్నుంచి విరాళాలు సేకరించారు. ఇలానే అప్పట్లో మరో ప్రముఖ పత్రిక కూడా సేకరించి మత్య్సకారులకు ఇళ్లకు కట్టించింది. కానీ జగన్ ప్రకటించిన ఆ రూ. 50 లక్షలు సేకరించిన విరాళాలను ఏ విధంగా ప్రజలకు సాయం అందించారో బయటపెట్టలేదు. ఇక కేరళ వరదల సమయంలో సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఎవరికి తోచిన సాయం వారు చేసి కేరళకు అండగా నిలబెట్టారు. ఆ సమయంలో జగన్ కూడా కోటి సాయం ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన ప్రకటించిన సాయాన్ని కేరళకు అందించలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం.. తన కంపెనీ తరపున కేరళకు రూ. కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కేరళకు వెళ్లి సీఎంకు ఇచ్చి వచ్చారు. కానీ జగన్ చేసిన సాయం మాత్రం బయటకు రాలేదు. తమ పార్టీ వాళ్లే కాబట్టి వాళ్లు చేసినా నేను చేసిన ఒకటే అనుకున్నారా? ఏంటో తెలియట్లేదు. మరి జగన్ వైజాగ్ కు ప్రకటించిన రూ. 50 లక్షలు, కేరళకు ప్రకటించిన రూ. కోటి.. ప్రకటనకే పరిమితం చేసారా? లేక నిజంగానే సాయం చేసారా?. ఒకవేళ సాయం చేసుంటే సోషల్ మీడియాలో, సొంత మీడియాలో గట్టిగానే ప్రమోషన్ చేసేవాళ్లుగా?. దీనిబట్టి చూస్తుంటే ఆ సాయం ప్రకటనలకే పరిమితం అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి తిత్లీ బాధితుల కోసం ప్రకటించిన రూ. కోటి సాయమైనా బాధితులకు చేరుతుందా? లేక ప్రకటనగానే మిగిలిపోతుందా?. లేదా అసలు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే.. మా సాయం ప్రకటనలకే పరిమితం కాదు.. సాయం చేసి చూపిస్తామని నిరూపించుకుంటారా?. చూద్దాం ఏం జరుగుతుందో.
  ఎన్నికలకు 8 నెలల సమయమున్నా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు శ్రీకారం చుట్టారు. ఈసారి 60, 70 కాదు ఏకంగా వందకి పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి తెరమీదకు వచ్చిందో అప్పటినుంచి ఆ ధీమా తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది. టీడీపీ కూడా నాయకులు దూరమైనా పలుచోట్ల కేడర్ బలంగానే ఉంది. మరి ఈ రెండు పార్టీల బలం ఒక్కటైతే తెరాసకు ఇబ్బంది తప్పదు. దీంతో మొన్నటివరకు వచ్చే ఎన్నికల్లో తెరాసదే విజయం అని బల్లగుద్ది చెప్పినవాళ్లు కూడా.. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుంది పోరు అనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ ని మహాకూటమి బాగా ఆలోచనలో పడేస్తుంది. అందుకే ఆయన మహాకూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని, టీడీపీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈ మహాకూటమిని ఎలా ఎదుర్కోవాలని వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. అయితే ఆయనకి ఆ విజయం అంత ఈజీగా రాలేదు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంటేరు ప్రతాప్‌రెడ్డి.. కేసీఆర్ గట్టి పోటీనే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 44 % ఓట్లు సాధించగా.. ప్రతాప్‌రెడ్డి 34% ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన నర్సారెడ్డి 17 % ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతాప్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీలు దగ్గరయ్యాయి. అంటే ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి బలం మరింత పెరిగింది. అదీగాక ఆయనపై ప్రజల్లో అభిమానం ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటాడని మంచి పేరుంది. దీంతో మహాకూటమి తరుపున ఆయన బరిలోకి దిగితే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. కేసీఆర్ ప్రతాప్‌రెడ్డి చేతిలో ఓడిపోతారని చెప్పలేం కానీ.. ప్రతాప్‌రెడ్డి మీద స్వల్పతేడాతో గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వేరే నేతలకి ఈ గెలుపు ఓకే కానీ.. సీఎం స్థాయి నేతలకు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి నేతలకు ఈ గెలుపు సరిపోదు. ఆయన లాంటి నేతలు భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలవాలి. అందుకే ఆయన అవసరమైతే వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. మొన్నటివరకు ఆయన గజ్వేల్ తో పాటు.. మేడ్చల్ నుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ దృష్టి మాత్రం హరీష్‌రావు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మీద ఉందట. సిద్దిపేటలో తెరాసకి బలముంది. తిరుగులేని మెజారిటీ వస్తుంది. అందుకే కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగాలనుకుంటున్నారట. దీనివల్ల కేసీఆర్ తన నియోజకవర్గం గురించి ఏ ఆలోచనలేకుండా.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టొచ్చని భావిస్తున్నారట. మరి కేసీఆర్ మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలని.. గజ్వేల్ నియోజకవర్గాన్ని వదిలేస్తారా?.. ఒకవేళ కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగితే మరి హరీష్ రావు ఎక్కడినుండి పోటీ చేస్తారు?.. గజ్వేల్ నుండి పోటీ చేస్తారా? లేక అసలు పోటీకి దూరంగా ఉంటారా? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
  చిరంజీవి..తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగి మెగా స్టార్ గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు.నటుడుగా తనదైన ముద్ర వేసిన చిరంజీవి రాజకీయాలవైపు అడుగులు వేశాడు.2008 లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు.2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ బరిలోకి దిగగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను మాత్రమే పార్టీ గెలుచుకోగలిగింది.తిరుపతి,పాలకొల్లు అసెంబ్లీ స్థానాల నుంచి చిరంజీవి పోటీ చేయగా సొంత నియోజక వర్గం అయిన పాలకొల్లులో పరాజయం చవి చూశారు.తిరుపతి స్థానం లో గెలుపొందారు.రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలి అనుకున్న చిరంజీవికి ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవటంతో కొంత కాలానికి పార్టీని 2011 లో  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో 2012 ఏప్రిల్ లో ఆ పార్టీ రాజ్య సభ పదవి కట్టబెట్టింది.అదే సంవత్సరం అక్టోబర్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 లో పరిస్థితులు తారుమారు అయ్యాయి.అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉపందుకోవటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది.చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచార కమీటీ చైర్మన్ గా భాద్యతలు అప్పగించింది.కానీ చిరంజీవి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అది నామమాత్రమే అని చెప్పుకోవాలి.ఎందుకంటే రాష్ట్రము విడిపోవటం తో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ విజయం కాయం అని అందరు ఉహిచిందే.దీనికితోడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతు ఇవ్వటం,కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం చిరంజీవిని విస్మయానికి గురిచేశాయి.2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్య సభ సభ్యత్వం ముగిసింది.మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఏదైనా పదవి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవు.దీంతో గత కొంత కాలంగా క్రీయాశీల రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిణామాలే కనిపిస్తున్నాయి.తాజాగా చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా దాన్ని పునరుద్ధరించుకోలేదు.దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం.దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కూడా చిరంజీవి పార్టీకి దూరం అవ్వటానికి కారణంగా తెలుస్తోంది.గత ఎన్నికల్లో టీడీపీ కి మద్దతు ఇచ్చిన పవన్ రానున్న ఎన్నికల్లో స్వతహాగా పోటీ చేస్తున్నది తెలిసిందే.అయితే ప్రస్తుతం కాంగ్రెస్,టీడీపీ పార్టీలు కాస్త సాన్నిహిత్యంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయవలిసి వస్తే తమ్ముడు పవన్ పై విమర్శలు గుప్పించక తప్పదు.అది ఇష్టపడని చిరంజీవి యాక్టీవ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని సమాచారం. రాజకీయాలకు దూరం అవుతూవస్తున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.  
కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. ఎన్నికలకు 8 నెలలముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇలా దూకుడు మీదున్న కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే మేడ్చల్ నుండి పోటీకి సిద్దమవ్వడం. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు కేసీఆర్ మళ్ళీ అధికారం తమదేనని ధీమాగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడిందో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మహాకూటమి నుండి బలమైన పోటీ తప్పదని కేసీఆర్ కి అర్థమైంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.     టీడీపీకి తెలంగాణలో ఓటుబ్యాంకు బాగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివార్లలోని నియోజక వర్గాల్లో బలంగా ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో దోస్తీ చేయడానికి ముఖ్యకారణం. కాంగ్రెస్ తెలంగాణలో బలంగానే ఉంది కాని ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని పొందే అంత బలమైతే లేదనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ మహాకూటమి వైపు అడుగులు వేసింది. దీంతో కాంగ్రెస్, తెరాసకు ధీటైన ప్రత్యర్థిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల టీడీపీ ఓటుబ్యాంకు బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతెందుకు గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. అందుకే కేసీఆర్ ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.     కాంగ్రెస్ కి టీడీపీ బలం తోడైంది. ఈ బలాన్ని తట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల అధిక స్థానాలు గెలవాలంటే తాను ఏదైనా స్థానం నుండి బరిలోకి దిగడం కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ లాంటి బలమైన నేత, సీఎం అభ్యర్థి బరిలోకి దిగితే ఆ చుట్టుపక్కల స్థానాల మీద ఆ ప్రభావం ఉంటుంది. అది తెరాసకు బోలెడంత మైలేజీ తీసుకొస్తుంది. అందుకే కేసీఆర్ ప్రస్తుతం ఆయన ప్రాతినిద్యం వ‌హిస్తున్న గజ్వేల్ నియోజ‌కవ‌ర్గంతో పాటు మేడ్చ‌ల్ నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ నిజంగానే మేడ్చల్ నుండి బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగి.. అనుకున్నట్టే మహాకూటమి జోరుకి చెక్ పెడతారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
  తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మొదటి నుండి కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగేది.. ఒకసారి కాంగ్రెస్ పైచేయి సాధిస్తే మరోసారి టీడీపీ పైచేయి సాధించేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. అసలే జిల్లాలో బలమైన పార్టీలు. ఈ మూడు పార్టీలు మహాకూటమితో దగ్గరవడం.. ఖమ్మంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న తెరాసను కలవెరపెడుతుంది. తెరాసకు ముందు నుండి ఖమ్మం సమస్య ఉంది. గత ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో తెరాస ఎంతో కొంత తన మార్క్ చూపింది కానీ.. ఖమ్మంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల అనంతరం టీడీపీ నుండి సీనియర్ నేత తుమ్మల, కాంగ్రెస్ నుండి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్, సిపిఎం మద్దతుతో వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇలా పలువురు నేతలు తెరాసలో చేరారు. తెరాస నాయకులతో కళకళలాడింది కానీ కాంగ్రెస్, టీడీపీ కేడర్ మాత్రం అలాగే ఉంది. కాంగ్రెస్ లో రేణుక చౌదరి, భట్టి లాంటి సీనియర్ నేతలున్నారు. ఇక టీడీపీలో కూడా మాజీ ఎంపీ నామా, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర లాంటి సీనియర్ నేతలున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. ఓవైపు సీనియర్ నేతలు, మరోవైపు బలమైన కేడర్.. దీంతో ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     తెరాస మళ్ళీ అధికారం తమదే అనే ధీమాతో ముందస్తుకు సిద్ధమైంది. అయితే ఆ ఆశలకు మహాకూటమి ఆనకట్టలా మారింది. మొన్నటివరకు తెరాస వందకి పైగా సీట్లు వస్తాయి.. ఖమ్మంలో కూడా పాగా వేస్తామంటూ ధీమాగా ఉంది. అయితే మహాకూటమితో పరిస్థితి మారిపోయింది. నిన్నటిమొన్నటి దాకా తెలంగాణలో ఇంకా టీడీపీ ఎక్కడుంది? అన్నవాళ్ళే ముక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మంలో కూడా టీడీపీ ఒకప్పటిలా బలంగా లేదన్న వాళ్ళకి మొన్న బాలకృష్ణ పర్యటనతో కళ్ళుతెరుచుకున్నాయి. స్వచ్చందంగా కార్యకర్తలు కదిలొచ్చారు.. బాలయ్య వెంటనడిచి ఖమ్మంలో పసుపుదళం బలంగా ఉందని నిరూపించారు. దీంతో తెరాస నేతలు ఆలోచనలో పడ్డారు. ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడుతుందా? అని అనుమానం మొదలైంది. మిగతా స్థానాల్లో ఎలా ఉన్న మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరులో అయినా తెరాస జెండా ఎగురుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పాలేరులో కూడా పరిస్థితి మారిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ సర్వేలు కూడా మహాకూటమికే అనుకూలంగా వస్తున్నాయట. నిజానికి తుమ్మల ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. తరువాత తెరాసలో చేరి మంత్రి పదవి పొందారు. అయితే అప్పుడు పాలేరులో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగి తుమ్మల గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఉపఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. అయితే 2014 ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉపఎన్నికల్లో తుమ్మల విజయం సాధించినా ఈ రెండు ఏళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తాజా సర్వేల ప్రకారం పాలేరులో మహాకూటమే ముందుందట. దీనిబట్టి చూస్తుంటే ఖమ్మంలో పాగా వేయాలని చూస్తున్న తెరాస అసలు బోణి అయినా చేస్తుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అంచనాలను తారుమారు చేస్తూ తెరాస మహాకూటమిని మట్టి కరిపిస్తుందో లేదో చూడాలి.
  కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు షరమ్‌ లేని పొత్తు అని తెరాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. ఉత్తమ్ దీనికి అంతే ధీటుగా బదులిస్తూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హరీష్ రావు నాకు రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తేల్చేశారు.. హరీష్ రావు లేఖతో ఇప్పటివరకూ కేసీఆర్‌ చెబుతున్న వందసీట్ల కల చెదిరిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు, తెరాస ఓటమిని ముందుగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు.   కాంగ్రెస్‌ పొత్తుపై హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నల్లో ఒక్కటీ తెలంగాణ సమాజానికి పనికొచ్చేది లేదని.. అవన్నీ తెరాస ప్రభుత్వం చేతగానితనాన్ని, పాలనా వైఫల్యాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. తమ పొత్తు గురించి తెరాస పడుతున్న ఆందోళన చూస్తుంటే వారి పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. వారి పాలనే బాగుంటే తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్న ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో 2004లో, టీడీపీతో 2009లో తెరాస పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో 2009లో పొత్తు పెట్టుకున్నప్పడు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని తేల్చిచెప్పిన తర్వాత.. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీవి షరమ్‌ లేని పొత్తులు కావని, తెరాసే షరమ్‌లేని పొత్తులు పెట్టుకుందని ఉత్తమ్‌ విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించి.. రాయల తెలంగాణ డిమాండ్‌ చేసిన ఎంఐఎంతో తెరాస స్నేహమెలా చేస్తోందని నిలదీశారు. ఒంటరిగా పోటీ చేసి కూడా తెరాసను చిత్తుగా ఓడించే సత్తా కాంగ్రెస్ కి ఉందని, అయినా.. తెలంగాణను రక్షించుకోవడం కోసం సిద్ధాంత సారూప్యం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వారు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటి? అంటూ గతంలో కేసీఆర్‌ అన్నారు. మరి మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారికేంటి. ప్రజలకే మేం జవాబుదారులం. ప్రజలకు జవాబు చెప్పుకొనే శక్తి మాకు ఉంది. మా పొత్తుల విషయంలో ఎందుకు అంతగా భయపడుతున్నారు? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఉత్తమ్ లేఖలోని ముఖ్యాంశాలు: చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనడం మీ ప్రభుత్వం చేతకానితనానికి పరాకాష్ఠ. చంద్రబాబులో మార్పు వచ్చిందా అని అంటున్నారు.. మరి ఏ మార్పు వచ్చిందని ఆయనను చండీయాగానికి ఆహ్వానించి సన్మానించారు? అమరావతికి వెళ్లి ఆయనింట్లో చేపల పులుసు తిన్నారు? పరిటాల రవి కొడుకు పెళ్లికి వెళ్లి మంతనాలు చేశారు. మీరు చేస్తే సక్రమం మేం పొత్తు పెట్టుకుంటే ద్రోహం అవుతుందా?  సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్‌, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన లాంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేవని కూడా తెలీదా? ప్రధానమంత్రి మోదీ భజనలో మునిగి తేలుతున్నపుడు ఆ పనులన్నీ ఎందుకు చేయించలేకపోయారు?  ఖమ్మంలోని ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని సిగ్గులేకుండా చెబుతున్నారు. రాష్ట్రం సాధించామని గొప్పులు చెప్పుకొంటున్న మీరు.. ఏడు మండలాలు పోతుంటే పోరాటాలు చేయలేరా? చేతగాని దద్దమ్మల్లా చేతులు ముడుచుకు కూర్చున్నారా? సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు, లక్షలాది ఎకరాల భూములు ఆంధ్రాలో కలుస్తుంటే నిద్రపోయారా? మోదీని ఒక్కసారైనా సీలేరు ప్రాజెక్టు గురించి అడిగారా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలంటూ చంద్రబాబు 30 లేఖలు రాశారని అంటున్నారు. ఎగువ రాష్ట్రమైన మనం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఎలా ఆపుతారో చెప్పగలరా? ప్రాజెక్టులు కట్టడం చేతకాక చంద్రబాబు అడ్డుకున్నారని వంక పెడుతున్న మీ వైఖరిని తెలంగాణ ప్రజలు అర్థ చేసుకోగలరు. పోలవరం కడితే ఎగువ రాష్ట్రాలకు రావల్సిన 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని.. దీన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని అనడం చేతకానితనం. తెలంగాణ నీటిని వదిలితేనే ఆంధ్రప్రదేశ్‌కు పోతాయని గుర్తించాలి. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరిపై 86 ప్రాజెక్టులు నిర్మించాం. వాటిని ప్రారంభించినప్పుడు పైన ఉన్న రాష్ట్రాలు ఫిర్యాదులు చేశాయి. చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఫిర్యాదులు చేసినా ఆపుతామా? కేంద్రం వద్ద పోరాడి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. చేతకాకపోతే క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. మిషన్‌ భగీరథపై చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేశారో తెలియదు. కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టు అది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తెచ్చి కమీషన్లు కొల్లగొట్టారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడిగేది లేదన్నారు.. ఇప్పుడు ఇంటింటికీ నీరు వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు 150 మీటర్ల ఎత్తులో కడుతున్నారని, 50 లక్షల క్యుసెక్కుల ప్రవాహ నీటి సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మించాలని ప్రతిపాదించారని అంటున్నారు. మీరు సీఎంగా ఉండి ఏం చేస్తున్నారు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పోరాడాలి కదా? సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం వద్ద పంచాయితీ పెట్టి ఒప్పించాలి కదా? మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామంటూ.. గొప్పలు చెప్పుకొన్న మీరు.. పక్కనున్న తెలుగు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోలేరా? ఇదేనా మీ తెలివి? ఆయన ఒక సీఎం, మీరూ ఒక సీఎం. ఆయన గుంజుకున్నారని అంటున్నారంటే.. సీఎంగా మీరు ఏమీ చేయలేని దద్దమ్మ అని ఒప్పుకొన్నట్లేగా? టీడీపీ నుంచి గెలిచిన తలసానికి, తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడ్డ మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులిచ్చినప్పుడు షరమ్‌ గుర్తుకురాలేదా? తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి హన్మంతరావు, దానం నాగేందర్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకున్నప్పుడు సిగ్గనిపించలేదా? తెలంగాణను వ్యతిరేకించి రాయల తెలంగాణ కావాలని డిమాండ్‌ చేసిన ఎంఐఎంను మిత్రపక్షమని మీరు చెప్పుకుంటున్నప్పుడు షరమ్‌ లేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామో అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌ అన్నారు.
  తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.ఇప్పటికే పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపైన ప్రధానంగా దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశారు.తెరాస అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎటూ తేల్చకపోవడంతో కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఇటీవల కోదండరాం కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా మరో మారు కాంగ్రెస్‌, తెజస నేతల మధ్య కీలక భేటీ జరిగింది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.ఈ భేటీలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా తెజస అధ్యక్షుడు కోదండరాం, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు.పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని వివరించారు.తమ పార్టీ గుర్తుమీదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు.చర్చలు జరుగుతున్న దశలో వివరాలు బయటకు వెల్లడించడం సరికాదన్నారు. అయితే 16 సీట్లకు తెజస పట్టుబట్టగా..తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
  టీడీపీ, చంద్రబాబు నాయుడు ఈ పేర్లు వింటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కి విమర్శలు తన్నుకొస్తాయి.తాజాగా జీవీఎల్ మరోసారి టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూకుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో కనిపించిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన దాఖలాలే లేవని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్‌ బినామీలేనని విమర్శించారు. 24 గంటల్లో కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో వారి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారని ధ్వజమెత్తారు.నారా లోకేష్‌ అర్హతలపై పవన్‌ కళ్యాణ్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితుల దగ్గరకు వెళ్తున్నారని, సహాయక చర్యలు తక్కువ ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు.కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.కానీ కర్మాగారం విషయంలో కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కడప జిల్లాలో టీడీపీ తలపెట్టింది దొంగదీక్షని ఎద్దేవాచేశారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై జీవీఎల్ కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.సీఎం రమేశ్‌ బినామీ కంపెనీలతో రూ.వందల కోట్లు దారి మళ్లించారని జీవీఎల్ ఆరోపించారు.సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్ నెంబర్‌గా చేశారని విమర్శించారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంట్ పరువుపోతుందని ధ్వజమెత్తారు.తక్షణమే రమేష్‌ను పెద్దల సభ నుంచి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు.లేదంటే చంద్రబాబుకు రమేష్‌ బినామీ అనే ముద్ర వస్తుందని తెలిపారు.టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేషే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.రమేష్‌తో రాజీనామా చేయించకపోతే ఎతిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
  తెరాస భహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించినది విదితమే.కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కూడా  ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమైంది.ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భైంసా, కామారెడ్డిలలో జరిగే రెండు బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసగించనున్నారు.అనంతరం హైదరాబాద్‌లో జరిగే రాజీవ్‌ సద్భావనా యాత్రలోనూ పాల్గొననున్నారు.సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. రాహుల్‌ పర్యటన ముగిసిన వెంటనే పీసీసీ ప్రచార కమిటీ ప్రచారాన్ని కొనసాగించనుంది.ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నట్లు గద్దర్ తెలిపారు. 'దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో మరో జాతీయ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన రాహుల్‌ గాంధీకి స్వాగతం.భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో రాహుల్‌ సభలను విజయవంతం చేయండని విజ్ఞప్తి చేస్తున్నా' అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.ఇటీవల గద్దర్ ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోనూ చేరబోననని స్పష్టం చేశారు.త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందని గద్దర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.  
అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి.    గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట.  రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం.    *  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.   * గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది. * ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.   * ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. * బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. *  గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది . ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం. - కళ్యాణి
  కీళ్ల నొప్పులు, ఎముకలు అరిగిపోవడం, కూర్చుంటే లేవలేని పరిస్తితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి, చాలా దారుణమైన హింస. ఇలాంటి హింస వయసు పైబడినవాళ్లకు తప్పట్లేదు. ముందుగా మేల్కొన్న వాళ్లకు మాత్రం ఈ విషయంలో ఇబ్బందులు కాస్త తక్కువే అని చెప్పాలి. మరి ఇలాంటి కాళ్లూ, కీళ్లూ నొప్పుల బెడదను ముందుగా గుర్తించడానికి మార్గమేదైనా ఉందా.. అని అడిగితే డాక్టర్లు ఇప్పుడు చాలా సులభమైన మార్గం కూడా రెడీగా ఉందంటున్నారు.   క్రమం తప్పకుండా డెంటల్ పరీక్షలు చేయించుకునేవాళ్లకు ఎముకలు బోలుగా మారుతున్నాయా లేదా అన్న విషయాన్ని కనిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ పరిశోధనలు చెబుతున్నాయట. ఐదు వేల డెంటల్ ఎక్సరేల్ని క్షుణ్ణంగా పరిశీలించాక వైద్య శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఓ నిర్థారణకొచ్చారు. ఎముకల పటుత్వం తగ్గిపోవడవల్ల ముందుగా దెబ్బతినేవి దవడ ఎముకలే కనుక, డెంటల్ ఎక్స్ రేలవల్ల ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలున్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. సో.. క్రమంతప్పకుండా పళ్లని పరీక్షచేయించుకుంటే పనిలోపనిగా ఎముకల పటుత్వం సంగతికూడా తేలిపోతుందన్న మాట.. పదిహేనునుంచి తొంభైనాలుగేళ్ల మధ్యలో ఉన్నవాళ్ల డెంటల్ ఎక్సరేలను పరీక్షించినప్పుడు ఈ వివరాలు బైటపడ్డాయ్.
  Banana: Bananas are loaded with Potassium and magnesium which are essential in increasing bone density. They are also good source of arthritis fighting vitamin B6, folate and Vitamin C. So eating bananas may help to solve this problem.   Blue berries: Blue berries are high content of antioxidants. Research shows regular consumption of berries can help decrease the inflammation of the joints.   Grapes: Grapes are nutrient-dense, high in anti-oxidants and possess anti-inflammatory properties. Resveratrol is an antioxidant present in the skin of grapes, which help to reduce joint pains.   Walnuts: Walnuts are nutrient dense, and loaded with compounds that may help reduce the inflammation associated with joint disease. Walnuts are especially high in omega 3 fatty acids, which have been shown to decrease the symptoms of arthritis.   Cheese: Cheese is an excellent source of calcium for bones and protein for muscles and joint supporting tissues. Eating cheese regularly to prevent arthritis.   - TeluguOne Team
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.