Publish Date:Nov 9, 2015
Publish Date:Oct 26, 2015
Publish Date:Oct 14, 2015
Publish Date:Oct 13, 2015
Publish Date:Oct 1, 2015
Publish Date:Sep 30, 2015
Publish Date:Sep 26, 2015
Publish Date:Sep 25, 2015
Publish Date:Sep 24, 2015

EDITORIAL SPECIAL
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
ALSO ON TELUGUONE N E W S
  ‘రాజావారు రాణిగారు’ చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. హీరో, హీరోయిన్‌, దర్శకుడు కొత్తవారైనా మంచి కంటెంట్‌, కామెడీ ఉండటంతో సినిమా హిట్‌ కొట్టింది. అందులో హీరోకి మరో రెండు ఛాన్సులు తెచ్చిపెట్టింది. అంతకు ముందు షార్ట్‌ ఫిలిమ్స్‌ చేసి, ‘రాజావారు రాణిగారు’తో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయిన కిరణ్‌ అబ్బవరం, ప్రజెంట్‌ రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రోజు (జూలై 15) అతడి బర్త్‌డే. విషెస్‌ చెబుతూ రెండు సినిమా యూనిట్స్‌ ఫస్ట్‌ లుక్స్‌ విడుదల చేశాయి. అందులో ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ ఓ సినిమా కాగా, ‘సెబాస్టియన్‌’ మరో సినిమా. రెండిటికీ నిర్మాతలు వాళ్లే.. ప్రమోద్‌, రాజు. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ సినిమాలో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తుండటమే కాదు... కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు అతడే రాశాడు. షార్ట్‌ ఫిలిమ్స్‌లో యాక్ట్‌ చేసేటప్పట్నుంచి రైటింగ్‌ మీద కాన్సంట్రేట్‌ చేశాననీ, ఆ అనుభవంతో ఇప్పుడు కథ రాశాననీ చెబుతున్నాడు. కళ్యాణమండపం నేపథ్యంలో కథ సాగుతుందనీ, అందుకే ఆ టైటిల్‌ పెట్టామన్నాడు. లవ్‌ స్టోరీ, ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌, కామెడీ... సినిమాలో అన్నీ ఉన్నాయట. నాలుగేళ్లుగా దర్శకుడు శ్రీధర్‌తో ట్రావెల్‌ చేస్తున్నానని, ఇద్దరికీ మంచి సింక్‌ ఉంద న్నాడు. ఈ కుర్రాడిది కడపలోని రాయచోటి. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ కడప నేపథ్యంలో తీస్తున్నారు. పాత్రలన్నీ రాయలసీమ యాసలో మాట్లాడతాయట.
  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సూసైడ్‌ కేసులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి ఓ విధంగా ఊరట లభించింది. ఆ కేసుకు, ఆయనకు అసలు సంబంధం లేదు. కానీ, చాలామంది సుశాంత్‌ ఆత్మహత్యకు సల్మాన్‌ కారణమని ఆరోపించారు. ట్విట్టర్‌లో ట్రోల్‌ చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సల్మాన్‌ స్పందించలేదు. సుశాంత్‌ అభిమానులకు అండగా ఉండమని, బాధలో వారేమన్నా పట్టించుకోవద్దని పిలుపు ఇచ్చాడు. అయితే, సోషల్‌ మీడియా ట్రోల్స్‌, కొన్ని విమర్శల నేపథ్యంలో కొంతమంది సల్మాన్‌ను పోలీసులు ప్రశ్నించవచ్చనే ప్రచారం జరిగింది. కేసు విచారిస్తున్న డీసీపీ సదరు ప్రచారాన్ని కొట్టివేశారు. జూన్‌లో సల్మాన్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, సంజయ్‌ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్‌ సహా మరికొంతమందిపై బీహార్‌లో కేసు వేశారు. సంజయ్‌ లీలా భన్సాలీని పోలీసులు విచారించారు కూడా! అయితే... ఈ విచారణకు, ఆ కేసుకు సంబంధం లేదు. కానీ, సల్మాన్‌ను విచారించవచ్చని భావించారంతా! చివరకు, ఆయనకు ఊరట లభించింది. గతంలో సల్మాన్‌ దగ్గర పని చేసిన మేనేజర్‌ రేష్మా శెట్టి విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో 35 మందిని పోలీసులు విచారించారు.
  టాలీవుడ్‌లో ‘దిల్‌’ సినిమాతో నిర్మాతగా వి. వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు జర్నీ మొదలైంది. మొదటి సినిమా నుండి ఆయనది ఒకటే పద్దతి అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ టాక్‌ ఉంది. రైటర్స్‌, డైరెక్టర్స్‌తో దగ్గరుండి మరీ స్ర్కిప్ట్‌ వర్క్‌ చేయించుకుంటారని! టాక్‌కి తగ్గట్టు తెలుగులో 25 ఫిలిమ్స్‌ మైల్‌స్టోన్‌ వరకూ స్ట్రయిట్‌ కథలతో సినిమాలు ప్రొడ్యూస్‌ చేశారు. కానీ, రీసెంట్‌గా ఆయన రీమేక్స్‌ రారాజు ముద్ర వేయించుకుంటున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా దిల్‌ రాజు ప్రొడ్యూస్‌ చేస్తున్న సినిమా ‘వకీల్‌ సాబ్‌’. హిందీ హిట్‌ ‘పింక్‌’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. అంతకు ముందు రాజ్‌తరుణ్‌ హీరోగా ప్రొడ్యూస్‌ చేసిన ‘ఇద్దరి లోకం ఒక్కటే’ ఫారిన్‌ సినిమాకు రీమేక్‌. అప్పట్లో రీమేక్‌ లేకపోతే పవన్‌తో సినిమా డ్రీమ్‌ నెరవేరేది కాదని ఆయన సమర్ధించుకున్నారు. ఇప్పుడు వరుసపెట్టి రీమేక్స్‌ అనౌన్స్‌ చేస్తున్నారు. విశ్వక్‌సేన్‌ హీరోగా నాని ప్రొడ్యూస్‌ చేసిన ‘హిట్‌’ను మరో నిర్మాతతో కలిసి హిందీలో ‘దిల్‌’ రాజు రీమేక్‌ చేస్తున్నారు. ‘జెర్సీ’ని అల్లు అరవింద్‌, ఇంకా ఎవరితోనో కలిసి చేస్తున్నారు. తెలుగులో ఆయనే నిర్మించిన ‘డీజే’ను హిందీలో మరొకరితో కలిసి రీమేక్‌ చేస్తున్నారు. స్ట్రయిట్‌ కథలపై కాన్సంట్రేట్‌ చేయడం మానేసి రీమేకుల మీద పడ్డారేంటో?
  షూటింగ్ లేక‌పోయినా, రాజ‌కీయ కార్య‌క‌లాపాలు లేక‌పోయినా సంగారెడ్డిలో ఉన్న త‌న ఫామ్‌హౌస్‌కు వెళ్లి గ‌డుపుతుంటారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఓవైపు అక్క‌డ ప్ర‌కృతి ఒడిలో సేద‌తీరుతూనే, మ‌రోవైపు పాడిప‌ని, తోట‌ప‌ని కూడా చేస్తుంటారు. చూస్తుంటే, ఆ బాట‌లోనే టాప్ డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. న‌ల్గొండ జిల్లా నార్కేట్‌ప‌ల్లి ద‌గ్గ‌రున్న ఎదురూలు గ్రామంలో ఆయ‌న ఓ ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఇప్పుడ‌ప్పుడే 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ పున‌రుద్ధ‌రించే అవ‌కాశాలు క‌నిపించ‌క‌పోతుండ‌టంతో ప్ర‌స్తుతం అక్క‌డే కాల‌క్షేపం చేస్తున్నారు. వాస్త‌వానికి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా 2021 సంక్రాంతికి విడుద‌ల కావాల్సి ఉంది. షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో 2021 వేస‌వికి విడుద‌ల వాయిదా ప‌డింది. జూలై 30కి వాయిదా ప‌డినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదంటున్నారు విశ్లేష‌కులు. అంటే మొట్ట‌మొద‌ట అనౌన్స్ చేసిన 2020 జూలై 30కి బ‌దులు 2021 జూలై 30కి సినిమా వ‌స్తుంద‌న్న మాట‌. అంటే స‌రిగ్గా ఏడాది పాటు విడుద‌ల తేదీ వాయిదా ప‌డిన‌ట్ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత మ‌హేశ్‌తో త‌ను తీయ‌బోయే సినిమా స్క్రిప్ట్ మీద ప‌నిచేస్తున్నాడు జ‌క్క‌న్న‌. "మ‌హేశ్ బాబు ఫిల్మ్ కోసం ఓ స‌బ్జెక్ట్‌ను ప్రిపేర్ చేయ‌డానికి మా నాన్న‌గారితో క‌లిసి క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నాను" అని ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న తెలిపాడు. మ‌హేశ్‌తో ఆయ‌న తీసే సినిమా బ‌హుశా 2021 చివ‌ర‌లో మొద‌లు కావ‌చ్చ‌నేది ఓ అంచ‌నా. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్ట‌ర్ కె.ఎల్‌. నారాయ‌ణ ఈ సినిమాని నిర్మించ‌నున్నారు.
  సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయ‌డానికి స‌సేమిరా అనే స్టార్లు.. వెబ్ సిరీస్ అనేస‌రికి ఏ త‌ర‌హా సీన్లకైనా రెడీ అవుతుండ‌టం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వాళ్లు అన్ని ర‌కాల ప్ర‌యోగాలూ చేస్తుంటారు. ఇంత‌కాలం ఒద్దిక‌గా, పొందిక‌గా వెండితెర‌పై క‌నిపిస్తూ వ‌చ్చిన బొద్దుభామ నిత్యా మీన‌న్ ఓ వెబ్ సిరీస్ కోసం లిప్‌లాక్ సీన్ చేసింది. అదీ ఓ ఫిమేల్ యాక్ట‌ర్‌తో! జూలై 10న ప్రైమ్ వీడియోలో ప్రీమియ‌ర్ అయిన 'బ్రీత్ ఇన్‌టు ద షాడోస్' సిరీస్‌లో మెయిన్ రోల్ చేసిన అభిషేక్ బ‌చ్చ‌న్ భార్య‌గా నిత్య న‌టించింది. ఇందులో ఓ స‌న్నివేశంలో శ్రుతి బ‌ప్నా అనే అంత‌గా పేరులేని తార‌తో ఆమె ఈ లిప్‌కిస్ సీన్ చేసింది. త‌న ప్లాన్‌లో భాగంగా ఆమెను ట్రాప్ చేసి, ఆమె పెదాల‌కు త‌న పెదాల‌ను ముడివేసి, ఆపై త‌న ప‌ని పూర్తి చేసుకొని వెళ్లే సీన్‌లో నిత్య జీవించింద‌ని చెప్పాలి. అయితే సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన్న‌డూ స్కిన్ షోకు కానీ, ఇంటిమేట్ సీన్లు చేయ‌డానికి కానీ నిత్య ఒప్పుకోలేదు. త‌న‌తోటి తార‌లు ఆ త‌ర‌హా సీన్లు చేసి, అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసి గ్లామ‌ర‌స్ హీరోయిన్స్‌గా అంద‌లం ఎక్కుతున్నా నిత్య మాత్రం త‌న పంథా మార్చుకోలేదు. అందుకే నిత్య అంటే ప్రేక్ష‌కుల్లో ఓ విధ‌మైన గౌర‌వం ఉంది. ఇప్పుడు వాళ్లు 'బ్రీత్' సిరీస్‌లో నిత్య లిప్‌లాక్ సీన్ చూసి షాక‌వుతున్నారు. ఆమె నుంచి ఇలాంటి సీన్‌ను ఊహించ‌లేద‌నీ, మ‌రో లేడీ యాక్ట‌ర్‌ను ట్రాప్‌చేసి, ఆమెకు లిప్‌కిస్ ఇవ్వ‌డం త‌మ‌కు నిజంగా షాక్ క‌లిగించింద‌నీ వాళ్లంటున్నారు. ఓటీటీ కంటెంట్ అంటేనే ఈ త‌ర‌హా స‌న్నివేశాలు ఉంటాయ‌నీ, ఏ యాక్ట‌రైనా వెబ్ సిరీస్‌లో ఈ త‌ర‌హా సీన్లు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నార‌నీ, నిత్య అందుకు మిన‌హాయింపు కాద‌నీ.. ఈ ప్లాట్‌ఫామ్ గురించి బాగా తెలిసిన‌వాళ్లు అంటున్నారు. మొత్తానికి త‌న బోల్డ్ యాక్ట్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది నిత్య‌.
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
ఏపీ బోర్డర్ కు దగ్గరలో తమిళనాడు లోని గుమ్మడిపూండి దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు లో 5.27 కోట్లను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆ కారులో ఉన్న ఒంగోలుకు చెందిన ముగ్గ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నై కి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఆరంబాక్కం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడంతో తెల్లవారుజామున ఎలావురు లోని చెక్ పోస్ట్ వద్ద వాహనాల ను చెక్ చేయడం మొదలు పెట్టారు. అపుడే అటుగా ఎమ్మెల్యే స్టిక్కర్ తో వచ్చిన కారును చెక్ చేయగా వెనుక సీటులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా వాటిలో ఏకంగా 5 కోట్లకు పైగా నగదు ఉండడంతో దానిని స్వాధీనం చేసుకుని ఆ వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వీరిని ఒంగోలుకు చెందిన వసంత్, నాగరాజు, కారు డ్రైవర్ సత్యనారాయణ గా గుర్తించారు. ఐతే నగదు తరలిస్తున్న కారు మాత్రం తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు సమాచారం. ఐతే ఈ కారు పై ఒంగోలుకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం తో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా తనిఖీ జరిగే సమయంలోనే మరో ఇద్దరు తప్పించుకు పారిపోయారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు, మరో బంగారు వ్యాపారి ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఘటన పై లోతైన దర్యాప్తు కోరిన మంత్రి బాలినేని ఈ ఘటన తో ఇపుడు ఏపీలో తీవ్ర దుమారమే రేగుతోంది. ఆ ఘటన పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ చెన్నై వెళుతున్న ఒక కారుపై నా పేరుతొ ఉన్న స్టిక్కర్ ఉన్నట్లుగా మీడియాలో ఈ ఉదయం వార్తలు వచ్చాయి. ఆ స్టిక్కర్ ఫోటో జిరాక్స్ కాపీ. అంతే కాకుండా అరెస్ట్ ఐన వారు ఒంగోలుకు చెందిన వారు కావడంతో తనకు అంటగడుతున్నారని వాపోయారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 5 కోట్లకు పైగా నగదు ఉందని చెపుతున్నారు. దీని పై అన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు.
కొద్ది రోజుల క్రితం ఎపి సీఎం సలహాదారుల బాధ్యతలలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులతో ముఖ్య సలహాదారులుగా ఉన్న కల్లం అజేయ రెడ్డి, పీవీ రమేష్ కు ఉన్న అధికారాలను కట్ చేసి సీఎం ఓ లోని ప్రవీణ్ ప్రకాష్ తదితర అధికారులకు అప్పగించారు. మళ్ళీ ఏమైందో ఏమో మొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ఢిల్లీ పర్యటనలో అజేయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలహాదారుగా ఉన్న అజేయ్ అధికారాలలో ఎటువంటి మార్పు లేదని కేవలం పీవీ రమేష్ అధికారులలో మాత్రమే కోత పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ తాజా ట్వీట్ ఎపి రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎపుడు మాస్క్ పెట్టని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితం మాస్క్ తో దర్సనమిచ్చాడు. దీనిని ఉదాహరణ గా చూపిస్తూ ప్రపంచంలోని నాయకులందరూ మాస్క్ లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రమేష్ ట్వీట్ చేసారు. ఐతే సీఎం జగన్ ను ఉద్దేశించి రమేష్ ఈ ట్వీట్స్ చేసారా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఎపి సీఎం కూడా చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే మాస్క్ ధరించి కనిపించారు.  
చిన్నదేశమే అయినా ప్రపంచానికి సాయం.. మూడు దశల్లో జన జీవితాన్ని పునరుద్ధించే ప్రయత్నం.. హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్... కోవిద్ 19 వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా క్యూబా చేసిన ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. తమ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాల్లో కోవిద్ 19 రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. క్యూబా వైద్యసిబ్బంది సేవలను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ పొందిన ఈ వైద్యసిబ్బంది గతంలోనూ పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ను అరికట్టడంలోనూ విశేష సేవలందించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలన్న ప్రచారం జరుగుతోంది. కోవిద్ 19ను ఎదుర్కోవడంలో.. కోవిద్ 19ను సమర్థవంతంగా ఎదుర్కొన్న క్యూబాలో ఇప్పటివరకు 2399 కేసులు నమోదు కాగా వారిలో 2,242 మంది పూర్తిగా కోలుకున్నారు. మరికొందరు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య కేవలం 86 మాత్రమే. మరణించిన వారిలో సగం మంది ఆ దేశ రాజధాని  హవానా నగరంలో నివసించేవారే...మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వివిధ దేశాల్లో వైద్యసేవలందిస్తున్న వారిలోనూ కోవిద్ 19 వైరస్ సోకింది. అమెరికా, బ్రెజిల్లో వందలాంది మంది వైద్యసిబ్బంది చనిపోయారు. అయితే క్యూబాకు చెందిన వైద్యసిబ్బందిలో ఏ ఒక్కరిలోనూ కోవిద్ 19 వైరస్ వ్యాప్తించలేదు. ఇందుకు కారణం వారు తీసుకుంటున్న జాగ్రత్తలు. వైద్యసేవలు అందించడంలోనూ ఎంతో కఠిమైన, వైవిధ్యమైన శిక్షణను వారి తీసుకున్నారు. మూడుదశల ప్రక్రియ ద్వారా... క్యూబా ద్వీపాల సముదాయం. ఇక్కడి జనాభా కోటి పది లక్షలకు పైగా ఉంటారు. కోవిద్ వైరస్  ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగానే క్యూబాలోనూ వ్యాపించింది. అయితే అక్కడి ప్రభుత్వం చాకచక్యంగా రక్షణ చర్యలు తీసుకున్నారు. దశల వారీగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజలు వ్యాధి బారిన పడకుండా అవగాహన కల్పించారు. ఈ దేశంలోని 15ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ.. ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పన్నులు, విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపు వాయిదా వేశారు. ఒంటరిగా నివసించే వృద్ధులకు సామాజిక కార్యకర్తలు ఆహారాన్ని అందించారు. ప్రజలు వీధుల్లోకి రాకుండా నివారించారు. ఎలా సోకింది అరా తీస్తూ.. ప్రజారోగ్య అధికారులు వైరస్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించినప్పుడల్లా  వారికి ఎలా సోకింది వివరాలు తెలుసుకుని.. ఆ వ్యక్తితో కంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విధంగా చేయడం వల్ల లక్షణాలు కనిపించని పాజిటివ్ వ్యక్తులను కూడా గుర్తించి వారిని 14 రోజులు ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నవారిని ప్రతిరోజూ డాక్టర్లు పరీక్షించారు. వారిలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం ఉంటే వెంటనే హాస్పిటల్ కు తరలించేలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను సన్నద్దం చేశారు. అయితే ఇంటింటికి పరీక్షలు చేయడం ద్వారా వ్యాప్తిని అరికట్టి ఆసుపత్రి సౌకర్యాలు 60శాతం కన్నా తక్కువే వినియోగించారు. ఈ రోజుకు కూడా ప్రతిరోజూ సుమారు 2 వేల పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజా జీవనం మెరుగుపడేలా.. ప్రారంభంలోనే  దేశ సరిహద్దులను, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేవారి రద్దీని నివారించడానికి బస్సుల్లో, బస్ స్టాప్ ల్లో భౌతిక దూరం పాటించేలా, మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించారు. ట్యాంకర్లు, ట్రక్కులు, పంపుల ద్వారా వీధులను క్లోరిన్‌తో పిచికారీ చేశారు. ప్రతి ఉదయం తొమ్మిది గంటలకు, పబ్లిక్ హెల్త్ బులిటెన్ జాతీయ టీవీలో ప్రసారం చేశారు. కోవిద్ వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు తెలియజేశారు. కచ్ఛితమైన గణాంకాలు చెప్పడం ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి కల్పించారు. పర్యాటకులను అనుమతిస్తూ.. క్యూబా ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 75శాతం వైద్య సేవలను ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా వస్తోంది.  మానవ వనరులను ఆర్థిక వనరులుగా మలుచుకోవడంతో విజయవంతమైన దేశం. అక్కడి పర్యాటక ప్రాంతాలు ఆర్థికవనరులు.  కోవిద్ 19 వైరస్ కారణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం స్తంభించి పోయింది. అయితే క్యూబాలో పర్యాటకులను అనుమతిస్తున్నారు.  పూర్తి ఆరోగ్య భద్రత చర్యలు తీసుకుంటూ పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం సిద్ధం చేస్తున్నారు. 
మూడు దశల్లో మూడు విధాలుగా నివారణ చర్యలు.. భయం బలహీనుల్ని చేస్తుంది.. కరోనా ఎవరికైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావల్సిందే. ప్రతి కుటుంబం తమ ఇంటిని అత్యవసరమైన పరిస్థితుల్లో ఐసోలేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోోవాలి. ప్రాథమిక చికిత్స కోసం వీటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. పారాసెటమాల్ విటమిన్ సి, డి 3 సప్లిమెంట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఆక్సిమీటర్   కోవిడ్ మూడు దశలు: కోవిడ్ 19 మానవ శరీరంలోకి చేరిన తర్వాత మూడు దశల్లో తన ప్రభావం చూపిస్తోంది.  ఒక్కక్కరిలో ఒకవిధమైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించి నివారణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. - ముక్కులో కొందరికీ ముక్కు చేరిన ఈ వైరస్ అక్కడే వుంటుంది. దీనిని నివారించడానికి ఆవిరి పట్టడం ఒక్కటే సరైన మార్గం. -గొంతులో గొంతు నొప్పితో బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు వేడి నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేస్తే చాలు. 2,3రోజులు వరుసగా ఉదయం, రాత్రి వేడినీటితో గార్లింగ్ చేస్తే వైరస్ ను అరికట్టవచ్చు. -ఊపిరితిత్తులలో ముక్కు, గొంతును దాటి ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఈ లక్షణాలు కనిపించేవారు వేడి నీటి గార్లింగ్ చేస్తూ ప్రాణాయామం చేయాలి,విటమిన్ సి, బి కాంప్లెక్స్, ,పారాసెటమాల్ వేసుకోవాలి. ఆక్సిమీటర్ తో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో  ఆసుపత్రికి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనించాలి. సాధారణ 98-100 ఉండాలి. అయితే 80కన్నా తగ్గితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే సరి. లేకపోతే  ఆసుపత్రిలో చేరాలి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్లు చేతులు, ముఖం కడుక్కోవాలి. కరోనా అనగానే భయపడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల వైరస్ ల మాదిరిగానే దీన్ని పరగణిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా కన్న ముందు భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే దినుసుల్లో కొన్ని వంటింట్లో ఉండే పొపుల డబ్బాను ఔషధాల పెట్టెగా చెప్పవచ్చు. మన పూర్వీకులు ఎంతో అనుభవంతో కొన్ని రకాల గింజలను మన ఆహారంలో భాగంగా చేర్చారు. వాటిలో కొన్నింటి గురించి ... - నల్లమిరియాలు వీటినే క్వీన్ ఆఫ్ స్పెషల్ గా పిలుస్తారు. నల్లమిరియాల కి ఆయుర్వేదంలో చాలా విశిష్ట స్థానం ఉంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి పాలల్లో చిటికెడు మిరియాలపొడి వేసుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫం అంతా పోతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. వెల్లుల్లి మిరియాలు కాంబినేషన్ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి. మిరియాల టీ, అల్లం మిరియాల టీ రోజూ తీసుకుంటే అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. - జీలకర్ర జీలకర్ర బెల్లం లేకుండా హిందూ సంప్రదాయంలో పెండ్లి జరగదు.  జీలకర్ర ఆవాలు పోపు లేనిదే చాలామందికి పప్పు అన్నం గొంతు దిగదు. శరీరంలోని ఉష్ణాన్ని తీసేసే శక్తి జీలకర్రకు ఉంది.దీనిలోని పాలీఫినాల్స్ అనే పదార్థం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది - నట్స్ శరీరానికి ఇమ్యూన్ బూస్టర్ గా నట్స్  పనిచేస్తాయి యాంటీఆక్సిడెంట్ గాను, రోగనిరోధక శక్తి పెంచడంలోనూ గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ గింజలు రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. - బాదం పప్పు ఇంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. బాదం, గసగసాలు రెండు కలిపి పొడిగా చేసి పాలలో కలుపుకుని తాగితే శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. - అవిసె గింజలు గింజల్లో కెల్ల చాలా ప్రత్యేకమైన స్థానం. ఇందులో ఉన్న ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,  ఒమేగా-3 కొవ్వు కరిగించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని ఫైటో ఈస్ట్రోజెన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన గ్రహించే శక్తి ని ఇవి ఇస్తాయి. ఇవి రోజూ తీసుకుంటే... శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంతో, రోగనిరోధక శక్తి పెంచడంలో లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, వెల్లుల్లి బాగా పనిచేస్తాయి. - లవంగాలు ఇందులో ఉండే ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మెదడు పని తీరును చురుగ్గా చేస్తాయి. అంతేకాదు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతాయి.  వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి,  విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, కఫం, పంటినొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లవంగాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. - దాల్చిన చెక్క శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క ది కీలక పాత్ర. ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.-  అంతేకాదు శరీరంలోని రక్త కణాలు ఆక్సిజన్ను గ్రహించే శక్తిని కూడా పెంచుతాయి. -అల్లం రోజూ అల్లం తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తోంది. రోజూ పరగడుపున అల్లం తేనెతో కలిపి తీసుకోవడం ఎంతో ఉత్తమం. అల్లం తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం. -వెల్లుల్లి అల్లము వెల్లుల్లి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమం లేనిదే నాన్ వెజ్ కర్రీలకు రుచి రాదు. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్న వెల్లుల్లి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. గుండె జబ్బులను వెల్లుల్లి నివారిస్తుంది.
గుమ్మడి, బొప్పాయ రోగనిరోధకశక్తి పెంచుతాయి ఎనర్జీ బూస్టర్ గా పనిచేసే సిట్రస్ జాతి పండ్లు కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి.  ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను మనం ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర భాగాల పని తీరు సక్రమంగా సాగుతుంది. సీజనల్ వచ్చే అనేక వ్యాధుల నుంచి,  కరోనా లాంటి భయంకర రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...  గుమ్మడి కాయ గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. బొప్పాయి బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజాయ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో  విటమిన్ లోపాలు ఉండవు . అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. - కివి ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి. - నిమ్మకాయ సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. - నారింజ జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు  ఆరెంజ్ రసం తాగితే  తక్షణం శక్తి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.  - ఉసిరి ఔషధాల సిరి గా ఉసిరిని చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండు రకాల ఉసిరి లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే ఉసిరిలో అధిక రక్తస్రావాన్ని నివారించేలో లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూరగాయలు లోనే కాకుండా ఔషధాలలో ఎక్కువగా వాడతారు. - అరటిపండు అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. - పుచ్చకాయ ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఆకట్టుకునే పుచ్చకాయ సీజనల్ లోనే లభించేది. కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు మార్కెట్లో కనిపిస్తుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. - అల్ల నేరేడు సీజనల్ గా  వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లు కు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.  చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.