Publish Date:May 14, 2016
Publish Date:May 10, 2016
Publish Date:May 8, 2016
Publish Date:Apr 25, 2016

EDITORIAL SPECIAL
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ALSO ON TELUGUONE N E W S
  తొలినాళ్ల నుంచీ తెలుగు సినిమా తెరపై ఎన్నో జంటలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ వస్తున్నాయి. స్క్రీన్‌పై వాళ్ల కెమిస్ట్రీ, వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనం అబ్బురపడుతూ వస్తున్నారు. హీరో హీరోయిన్లు విడిపోయిన సీన్లు వస్తే మనం చాలా బాధపడతాం. చివరలోనైనా ఆ ఇద్దరూ కలుసుకోవాలని కోరుకుంటాం. ఎప్పుడైనా ఆ ఇద్దరిలో ఒకరు చనిపోవడమో, లేక ఇద్దరూ చనిపోవడమో జరిగితే మన గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. 'దేవదాసు', 'మరో చరిత్ర', 'ప్రేమాభిషేకం' వంటి సినిమాలు విషాదాంతం అయినప్పుడు మన హృదయాలు బద్దలయ్యాయి, అయినా కానీ వాటికి మనం బ్రహ్మరథం పట్టాం. అయితే అల్టిమేట్‌గా మనం సుఖాంతాన్నే కోరుకుంటాం. అందుకే విషాదాంతం అయిన చాలా సినిమాల్ని మనం తిరస్కరించేశాం. కొంత కాలం క్రితం ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది దశకాల్లో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎక్కువగా పాటలకూ, ముద్దు ముచ్చట్లకే పరిమితమై కనిపించేది. కథంతా హీరో క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ, హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు ఉండేది. ఆ రోజులు మారిపోయాయి. ఇవాళ ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకూ కథలో కీలక స్థానం లభిస్తోంది. హీరోతో సమానంగా హీరోయిన్‌కూ ప్రాతినిధ్యం కనిపిస్తోంది. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్ కోసం హీరో పడే పాట్లు కూడా కనిపిస్తున్నాయి. 'అల.. వైకుంఠపురములో' అయితే హీరోయిన్ పూజా హెగ్డే కాళ్లు చూసి హీరో మనసుపారేసుకోవడం, ఏకంగా ఆమె కాళ్ల సొగసును వర్ణిస్తూ పాట పాడేసుకోవడమూ మనం చూశాం. ఆ విషయం అలా ఉంచితే తెరపై కొత్తగా జట్టు కట్టిన హీరో హీరోయిన్ల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ కొత్త జంట స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలని తహతహలాడుతుంటారు. అప్పటికే వచ్చిన స్టిల్స్, టీజర్ లేదా ట్రైలర్‌లో వాళ్లు కనిపించిన విధానం చూసి, సినిమా ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని కాచుకొని కూర్చుంటారు. సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'లో కొత్త జంట మహేశ్, రష్మిక అలరించింది. ఈ వారమే వచ్చిన 'భీష్మ'లో నితిన్, రష్మిక జోడీ కూడా ఆకట్టుకుంది. త్వరలో అలా ముందుకు రాబోతున్న కొత్త జంటలేవో ఓ లుక్కేద్దాం... 1. నాగచైతన్య - సాయిపల్లవి శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'లవ్ స్టోరి'లో నాగచైతన్య, సాయిపల్లవి తొలిసారి జంటగా కనిపించబోతున్నారు. ఆమధ్య విడుదల చేసిన ఆ ఇద్దరి ఇంటిమేట్ సీన్ లుక్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక టీజర్‌లో అయితే మెట్రో రైల్లో చైతూని పల్లవి ముద్దు పెట్టుకుంటే, చైతన్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వహ్వా అనిపించాయి. ఆ ఇద్దరి జోడీ చూడ ముచ్చటగా ఉందనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. ఇక వాళ్లిద్దరి 'లవ్ స్టోరి' తెరపై ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ తహతహలాడుతున్నారు. ఏప్రిల్ 2న వాళ్ల కోరిక తీరబోతోంది. 2. రామ్ - నివేదా పేతురాజ్ ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'తో తొలిసారి నభా నటేశ్, నిధి అగర్వాల్.. ఇద్దరితో జోడీ కట్టి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఇప్పుడు 'రెడ్' సినిమాలో ఏకంగా ముగ్గురు భామలతో తొలిసారి జట్టుకట్టాడు. వారిలో నివేదా పేతురాజ్‌తో అతడి జోడీ ఎలా ఉంటుందో చూడాలని అతని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆమె కాకుండా మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కూడా రామ్ సరసన కనిపించనున్నారు. రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో తయారవుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' ఏప్రిల్ 9న విడుదలవుతోంది.  3. సాయితేజ్ - నభా నటేశ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్న సాయితేజ్‌తో జత కట్టడానికి వచ్చింది నభా నటేశ్. 'ఇస్మార్ట్ శంకర్'లో తన గ్లామర్‌తో కుర్రకారుకు కిర్రెక్కించిన ఈ భామతో సాయితేజ్ తొలిసారి కలిసి నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత 'చిత్రలహరి'తో విజయాన్ని అందుకున్న సాయితేజ్, 'సోలో బ్రతుకే సో బెటర్'లో కనిపిస్తున్న విధానం ఆసక్తి కలిగిస్తోంది. నభా నటేశ్‌తో అతడి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తోన్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  4. వెంకటేశ్ - ప్రియమణి తమిళంలో ధనుష్ టైటిల్ రోల్ చేయగా బ్లాక్‌బస్టర్ అయిన 'అసురన్' మూవీ తెలుగులో 'నారప్ప'గా రీమేక్ అవుతోంది. టైటిల్ రోల్‌ను వెంకటేశ్ చేస్తుండగా, ఆయన భార్యగా ప్రియమణి నటిస్తోంది. గమనించాల్సిన విషయమేమంటే హీరోయిన్ మంచి ఫాంలో ఉండగా వెంకటేశ్‌తో జోడీ కట్టలేకపోయిన ప్రియమణి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలిసారి ఆయన సరసన నటిస్తుండటం. ఆ ఇద్దరి జంట తెరపై ఎలా ఉంటుందో చూడాలని వెంకీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులూ ఆసక్తి కనపరుస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న 'నారప్ప' మూవీ ఈ ఏడాది సెకండాఫ్‌లో విడుదల కానున్నది. 5. విజయ్ దేవరకొండ - అనన్యా పాండే వరుస ఫ్లాపుల తర్వాత 'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ ఫాంలోకి వచ్చిన పూరి జగన్నాథ్, లేటెస్టుగా విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా తయారవుతున్న ఈ సినిమాలో విజయ్ జోడీగా బాలీవుడ్ బాంబ్‌షెల్‌గా పేరుతెచ్చుకున్న అనన్యా పాండే నటిస్తోంది. ఇటీవలే ఆమె 'పతి పత్ని ఔర్ వో' అనే సినిమాలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సలహా మేరకే ఆమెను విజయ్ జోడీగా పూరి ఎంపిక చేశాడు. 'లైగర్' ఆమెకు ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఇందులో విజయ్, అనన్య కెమిస్ట్రీపై పూరి ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు సమాచారం. దసరా సీజన్‌లో ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. 6. రాంచరణ్ - అలియా భట్ యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా దేశమంతా వెయికళ్లతో ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి సౌంత్ ఇండియన్ మూవీ. బాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోయిన్ అయిన ఆమె రాంచరణ్ జోడీగా కనిపించడం ప్రేక్షకులకు కన్నులపంటగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించే ఈ సినిమాలో ఆయనను పెళ్లాడాలనుకొనే సీత అనే యువతి పాత్రను అలియా చేస్తోంది. ఇదే మూవీలో కొమరం భీమ్ పాత్రను పోషిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపించనున్నది. 2021 జనవరి 8న వచ్చే 'ఆర్ఆర్ఆర్'లో ఈ రెండు జంటలు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి. 7. ప్రభాస్ - పూజా హెగ్డే ప్రస్తుతం దేశంలోని ఏకైక పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఓ డియర్'లో అతని జోడీగా తొలిసారి పూజా హెగ్డే నటిస్తోంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోన్న పూజ, ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' అల్లు అర్జున్ జోడీగా కనిపించి, అలరించి, తన ఫ్యాన్ బేస్‌ను మరింతగా పెంచుకుంది. పొడగరి అయిన ఆమె ప్రభాస్ జోడీగా పర్ఫెక్టుగా మ్యాచ్ అవుతుందనీ, తెరపై ఆ ఇద్దరి కెమిస్ట్రీ బ్రహ్మాండంగా పండుతుందనీ ఆ ఇద్దరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పైగా 'ఓ డియర్' లవ్ స్టోరీ కావడం వల్ల తెరపై ఆ ఇద్దరూ ఎక్కువసేపు కలిసి కనిపించడం వాళ్లకు పండగ లాంటిదే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ 2021 మొదట్లో విడుదల కానున్నది.  8. అల్లు అర్జున్ - రష్మిక మందన్న 'అల.. వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో భారీ హిట్‌పై కన్నేసి సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ మూవీలో అతను తొలిసారి యంగ్ సెన్సేషన్ రష్మికా మందన్నతో జోడీ కడుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్‌తో, 'భీష్మ'తో నితిన్‌తో తొలిసారి నటించి సూపర్ హిట్లు కొట్టిన రష్మిక ఇప్పుడు బన్నీతో ఫస్ట్ టైం నటిస్తూ అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంటోంది. రొమాంటిక్ సీన్లు చెయ్యడంలో మాస్టర్ అనిపించుకున్న బన్నీ, ఈ మూవీలో రష్మికతో ఎలా రొమాన్స్ చేస్తాడో చూడాలని అతని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2021 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానున్నది. - బుద్ధి యజ్ఞమూర్తి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెట్రో జోనర్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. కథల్లో కొత్తదనం కోసం కాలంలో వెనక్కి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'జాన్' 1980 నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమే. రవితేజ కూడా 1980 నేపథ్యంలో సాగే కథతో మరో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. ఆల్రెడీ రవితేజ ఒక రెట్రో సినిమా చేశారు. అదే 'డిస్కో రాజా'. అందులో రవితేజ నటన అభిమానులను ఆకట్టుకుంది. కానీ, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా... రెట్రో జోనర్ మీద రవితేజ నమ్మకం పెట్టుకున్నారు. 'మేం వయసుకు వచ్చాం', 'నువ్విలా నేనిలా', 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాల దర్శకడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆ సినిమా కథ విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు. త్రినాథరావు నక్కిన రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథకు రవితేజ ఆమోద ముద్ర వేశారు. లవ్, ఫ్రెండ్ షిప్, రొమాన్స్, రివేంజ్, కామెడీ మేళవింపుతో 1980 నేపథ్యంలో కథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాల ఎక్కే అవకాశం ఉంది.
ఒక విషయంలో స్పష్టత వచ్చింది... 'సరిలేరు నీకెవ్వరు' విజయం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. హీరోగా మహేష్ బాబు 27వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో మరో సందేహానికి తావులేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమా కోసం హీరో, డైరెక్టర్ ఇద్దరూ విదేశాలు వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫారెన్ లో ప్లాన్ చేసారని తెలిసింది. 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత స్టార్ హీరోలు ఎవరో ఒకరితో సినిమా చేయాలని దర్శకుడు పరుశురాం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా మహేష్ బాబును ఆయన కలిశారు. కథ చెప్పారు. అయితే... అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు... వంశీ పైడిపల్లి కథ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో మహేష్ మరో ఆప్షన్ కోసం వెతికారు. గతంలో కథ చెప్పిన పరశురామ్ కు పిలుపు వెళ్ళింది. ఆల్రెడీ నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న అతడు, అది పక్కన పెట్టి మరి మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమని చెప్పాడట. ఇంతకు ముందే కథ రెడీ చేయడంతో మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ను ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే మార్చి లేదంటే మేలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
  ఫిబ్రవరి 24 శ్రీదేవి రెండో వర్ధంతి. 2018లో ఇదే రోజు దుబాయ్‌లో ఒక పెళ్లికి హాజరై బాత్‌టబ్‌లో పడి ఆ అతిలోకసుందరి సుందరి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మరణం దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఆమె అభిమానులకు గుండె ఆగినంత పనైంది. ఇక ఆమె భర్త బోనీ కపూర్, ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషి పరిస్థితి అయితే ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా శ్రీదేవి సంపాదించుకున్న పాపులారిటీ ఆమెకు ముందు, ఆమె తర్వాత మరొకరు సాధించలేదనేది వాస్తవం. శ్రీదేవి తొలి వర్ధంతికి ఆమెకు సంబంధించిన తీపి గుర్తులను బోనీ ఫ్యామిలీ నెమరువేసుకుంది. జాన్వి తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో భావోద్వేగపూరితంగా రాసుకున్న మాటలు చిత్రసీమను కదిలించాయి. ఆ సమయంలో శ్రీదేవి మారుటి కుమారుడు, బోనీ కపూర్ పెద్దకొడుకు అర్జున్ కపూర్ పెద్దరికం వహించి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. "మా నాన్నకు ఒక మంచి కొడుకుగా ఉండటం నా విధి. అలాగే నాకు మరో ఇద్దరు చెల్లెల్లు ఉన్నారని గ్రహించాను. ఎంతో పెద్ద మనసుతో నా చెల్లెళ్లుగా పిలవడానికి వాళ్లు అంగీకరించారు" అని ఎమోషనల్ అయ్యాడు అర్జున్. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ విషాదం తమ కుటుంబాన్నంతా ఎలా ఒక్కటి చేసిందో జాన్వి తెలిపింది. "అర్జున్ అన్న, అన్షులా అక్క మాపై చూపించిన ప్రేమ, వాళ్లిచ్చిన సపోర్ట్ వల్లే మా జీవితంలో జరిగిన అత్యంత విషాద ఘటన సందర్భంగా నేను, ఖుషి బలంగా నిలవగలిగాం. కుటుంబంలోని గొప్పతనం అదే. ఇంతకంటే మంచి అన్న, అక్క కావాలని మేం అడగలేం. వాళ్లు మాకు చాలా బలాన్నిచ్చారు. అర్జున్ అన్న చాలా తెలివైనవాడు. 'నిజాయితీగా ఉండు, నువ్వు నువ్వులా ఉండు, మనుషులతో మర్యాదగా మెలగు' అని సలహాలిచ్చాడు. అతను చెప్పిన ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పింది జాన్వి. శ్రీదేవి ఫ్యామిలీ ఫొటోలు: 1. శ్రీదేవిని ముద్దాడుతున్న బోనీ కపూర్   2. భర్త బోనీ, చిన్నకూతురు ఖుషీతో శ్రీదేవి 3. క్రిస్మస్ ట్రీస్ దగ్గర శ్రీదేవి, బోనీ 4. చిన్నప్పటి జాన్వి, శ్రీదేవి 5. శ్రీదేవి, బోనీ, చిన్నారి జాన్వి 6. జాన్వి సమక్షంలో శ్రీదేవికి బోనీ ముద్దు 7. శ్రీదేవి, బోనీ ఆనంద క్షణాలు 8. భర్త, పిల్లలతో శ్రీదేవి  9. మీడియా కాన్ఫరెన్స్‌లో కెమెరా ముందు భర్త, పిల్లలతో శ్రీదేవి 10. చిన్నారి జాన్వితో శ్రీదేవి
  బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన 'భక్త కన్నప్ప' (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని కృష్ణంరాజు భావించారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ దానిపై ఆసక్తి చూపలేదు. కొన్నేళ్ల క్రితం రచయిత, నటుడు తనికెళ్ల భరణి తాను కన్నప్ప స్క్రిప్టు తయారు చేశాననీ, అందులో సునీల్ హీరోగా నటిస్తున్నాడని కూడా ప్రకటించారు. ఆయనది బాపు సినిమా రీమేక్ కాదు. సొంతంగా రాసుకున్న స్క్రిప్టు. అయితే సునీల్‌తో ఆ సినిమా తియ్యాలన్న భరణి ఆశలు నెరవేరలేదు. సునీల్‌పై భారీ బడ్జెట్ పెట్టడానికి  నిర్మాతలు వెనుకంజ వేశారు. దాంతో చాలా కాలం నిరీక్షించిన భరణి ఆ ప్రాజెక్ట్ ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టును మంచు విష్ణు టేకప్ చేశాడు. ఇప్పుడు మోహన్ బాబు ఆ ప్రాజెక్టుపై తొలిసారి మాట్లాడారు. రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆ సినిమా తీసేందుకు విష్ణు సిద్ధమవుతున్నాడని ఆయన వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. శివునిపై ఆరాధనతో తన కళ్లను పెకలించుకోవడానికి కూడా వెనుకాడని పరమ శివభక్తునిగా కన్నప్ప గురించి కథలు ప్రచారంలో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై రచయితల బృందం పనిచేస్తోందని కూడా మోహన్ బాబు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో విష్ణు నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కన్నప్పగా ఎవరు నటిస్తారు, ఎవరు ఆ సినిమాని డైరెక్ట్ చేస్తారనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అతి త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనున్నది.
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు. కానీ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత అమరావతిలో విభజన ఏపీ రాజధాని కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం నాటి పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు వల్ల మిగతా ప్రాంతాలకు ఎలాంటి లాభనష్టాలు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమించిన ప్రజలు ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల నష్టమని తెలిసినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎందుకు తమదిగా భావించలేకపోతున్నారు? 1965లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాల్ని నిర్మించాలని భావించింది. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి అంగీకరించారు. అయితే 1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల  ప్రజలు కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యతిరేకించారు. ప్రస్తుత రాజధాని అమరావతిలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు టి.అమృత రావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, సొంతపార్టీకి వ్యతిరేకంగా 1966 అక్టోబర్ 14న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ రాకతో స్ధానికులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా, మిగతా ప్రాంతాల వారు సంకుచితంగా ఆలోచించలేదు. ఉక్కు పరిశ్రమ రాకతో తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధి చెందుతుందని భావించారు.  చివరికి ఎవ్నో పోరాటాల తర్వాత 1971 నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 90వ దశకం వరకూ కేంద్రంలో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నలుగురు ప్రధానులు కూడా మారారు. రాష్ట్రంలోనూ వివిధ పార్టీలు, 10 మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, మరే ఇతర కారణాలతోనో విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 24 వేల ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం..  మార్కెట్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం కూడా ఇచ్చింది. భూములు కోల్పోయిన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, వేలాదిగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంటిస్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సాయం కూడా అందించారు. కానీ గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో అనిశ్చితి మొదలైంది. వాస్తవానికి 2014 లో ప్రాంతీయ తత్వం కారణంగా ఏపీ విభజన జరిగితే, సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో  నిర్మాణం చేయాలని అసెంబ్లీ లో అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రాజధానికి 29 వేల రైతు కుటుంబాల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన ఈ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు 25 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను, పదేళ్ల పాటు కౌలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరో పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అమరావతిలో ఉన్న సచివాలయం, హైకోర్టును విశాఖ, కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సమర్ధించుకునేందుకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలను తెరపైకి తెచ్చింది. చివరికి 10 మంది మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజదానుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులు అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. మండలిలో మాత్రం ఛైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపడంతో ఈ నిర్ణయం భవితవ్యం ఏమిటన్నది ఇంకా తేలడం లేదు.  అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల నుంచి మాత్రం వారికి తగిన సహకారం, మద్దతు లభించడం లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రతి రోజూ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా మిగతా ప్రాంతాల్లో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి కట్టడాలతో కుదురుకుంటున్న రాజధానిని తరలింపు చేపట్టడం అనేది వాస్తవంగా అవసరమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కుల, మత , ప్రాంతాలకు అతీతంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలన్న వాదనకు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఊరూవాడా ఉద్యమించిన ప్రజలు రాజధాని విషయంలోనూ అదే చొరవ, తెలువ చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాత పాటు మేథావులు కూడా నిర్ణయాత్మక రీతిలో గొంతు విప్పితే అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వాదనకు బలం చేకూరినట్లవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు. అదే విధంగా భవిష్యత్తులో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తానేనని తప్పక చెప్పుకుంటారని, అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిని తరలించడమే కాకుండా అమరావతిని సర్వ నాశనం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వైఎస్ జగన్  నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఎడతెగని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు. రాజధాని తరలిపోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు. అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు ప్రచారం మొదలు పెడతారు. దాంతో ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అవుతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పందేరం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు. గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం నెట్టివేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు. కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలిచ్చి పంచితే అక్కడకు లక్షల సంఖ్యలో జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ మరో మూసీగా మారక తప్పదు. కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పడమే కాదు..దానికి నాందిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు కూడా. తర్వాత అక్కడ ఉన్న భవనాల యజమానులకు తాకీదులు కూడా ఇచ్చారు. కానీ కోర్టుల జోక్యంతో అక్కడ ఉన్న భవనాలను అంగుళం కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు కనపడుతోంది. నది ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని ఉదర కొట్టిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది..అని రాజధాని ప్రాంత రైతులు, ప్రతి పక్షాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-2020 జనవరి 23 వ తేదీ వరకూ, ఎక్కువ మొత్తం ఓ.డి. తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడటం ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో  ఓ.డి. పొందిన రోజులే 188 దినాలుగా నమోదు అయినట్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టి ఐ యాక్ట్) కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) వెల్లడించింది.  వివరాల్లోకి  వెళితే, 2014-15 లో 14 రోజులకు గాను 4,313 కోట్లు, 2015-16 లో 6 రోజులకు గాను 95. 38 కోట్లు, 2016-17 లో 6 రోజులకు గాను 1,295.22 కోట్లు, 2017-18 లో 38 రోజులకు గాను 8,625. 81 కోట్లు, 2018-19 లో 88 రోజులకు గాను 19,616.71 కోట్లు, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 23 వరకూ మొత్తం 36 రోజులకు గాను 13, 736. కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆర్బీఐ.. ఆర్టిఐ చట్టం కింద సమాచారం పొందు పరిచింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, గడిచిన ఏడాది అంటే 2018-19 వరకూ అత్యధికంగా, 2018-19 లోనే ఆ ప్రభుత్వం అత్యధికం గా 88 రోజులకు గాను 19,616.71 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్నిడ్రా చేసింది. ఇప్పుడా పెను భారాన్ని, వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కూడా మోయాల్సిన పరిస్థితి రావటం తో, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలైనపట్టి నుంచీ , ఈ ఏడాది జనవరి 23 వరకూ కేవలం 36 రోజులలో 13,736.75 కోట్ల రూపాయల ఓ.డి. సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. నిజానికి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి మించి పోతోందంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కు, నిరుడు జూన్ 11, జూన్ 12 తేదీల్లో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ రెండు లేఖలు కూడా పంపారు. 2019 జూన్ 10 వ తేదీ నాటికి ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం 699. 99 కోట్ల రూపాయల మొత్తం గా నమోదైందని, ఆ త్రైమాసికం లో 16 రోజులు ఓ.డి. సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందనీ, వరసగా 14 రోజుల పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓ.డి. పొందిన పక్షం లో రిజర్వ్ బ్యాంక్ చెల్లింపులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆ లేఖలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. నిరుడు జూన్ 12 వ తేదీన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 వరస పని దినాల్లో 339. 17 కోట్ల రూపాయల ఓ.డి. పొందినట్టు పేర్కొన్నారు. తక్షణమే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరారు. మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లెక్కలను పరిశీలించిన ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం..రాష్ర ఆర్ధిక పరిస్థితి అంట ఆశాజనకం గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అప్పచెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లెక్కల నుంచి బయటపడాలంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికక్రమశిక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని వారు సూచిస్తున్నారు.
    ఒకరు సంక్షోభాలతో చెలిమి చేస్తే, మరొకరు పైనున్న దేవుడిపైన భారం వేశారు... ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు అంటూ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసిన యువ నేత జగన్మోహన రెడ్డి. తనపై రుద్దబడిన లక్ష కోట్ల అవినీతి బురదను వదిలించుకోవటానికి లేదా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈయనకు తొమ్మిదేళ్ల గడ్డు కాలం పట్టింది. నాయుడిదయితే  డిఫ్ఫరెంట్ స్టైల్. ఆధునికాంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ పితగా తనను తాను  ఆయన మార్కెట్ చేసుకున్న తీరుకు నార్త్ ఇండియా ముఖ్యమంత్రులు సైతం ఫిదా అయిపోయి, ఆయన చేత రెండు దశాబ్దాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పించారు. వివిధ జాతీయ పార్టీల గోసలకు , వాటి మధ్య సమన్వయానికి ఆయనే చుక్కాని అయ్యారు. అటువంటి నాయుడిని ఈ రోజు 24 గ్రామాల చక్రబంధంలో ఇరికించింది  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే , తాజాగా... ఆయన ఒకప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అతడి నుంచి  విలువైన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సేకరింపచేసిన అమిత్ షా-మోడీ ద్వయం తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి నాలుగేళ్ల వెనక్కు రీలు తిప్పితే--అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2014లో విజయవాడ వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 2015 మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ కనిపించింది. . 'విభజనలో అన్యాయం జరిగింది. అయినా రెట్టింపు ఉత్సాహంతో, ధృఢ సంకల్పంతో పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని తలదన్నే మహా నగరాన్ని నిర్మించుకోవాలి' అనే పాజిటివ్ స్పిరిట్ఆ యన మాటల్లో ధ్వనించింది. ప్రజల్లో అనేక కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించే పదాలు ఆ సందర్భంలో వినిపించాయి. ఆ తర్వాత ఆలాంటి 'స్ఫూర్తి'నిచ్చే ప్రసంగాలే 2018 మార్చి వరకూ కొనసాగాయి. అయితే ప్రజలు ఆతర్వాత ఎన్నికల్లో భిన్నంగా స్పందించారు. ఇప్పుడు, అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితి, తాను ప్రజలకిచ్చిన హామీలు, రెండింటి మధ్య సమన్వయము  చేస్తున్న తీరు, రాష్ట్ర పరిస్థితిపై తన ప్రణాళికలు చెపుతున్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు .'గాలిలో మేడలు, అసాధ్యమైన హామీలు ఇచ్చే ఆలోచన తనకు లేదని, మన రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకుని ఆ మేరకు ఎంత చేయగలమో అంతే మాట్లాడాలి' అనే భావం వినిపించింది.మరి అయినా సారం జగన్మోహన్ రెడ్డి ఎందుకింతగా ఆఫీసర్ల మధ్యన సమన్వయము సాధించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్ర చరిత్ర లోనూ లేని విధంగా ప్రస్తుతం, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల మధ్య ఆధిపత్య పోరుకు అమరావతి సెక్రెటేరియట్  వేదిక కావటం ప్రస్తుతం దేశం మొత్తం చూస్తున్న చోద్యం. ముఖ్యమంత్రులుగా అటు నాయుడు, ఇటు  జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ని పరిశీలిస్తే, నాయుడి ఎడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చాలా గుంభనం గా వ్యవహరించేది. లోపల తగువులున్నప్పటికీ, ఎక్కడా ఎవరూ బయటపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అందుకు భిన్నంగాఉంది... జాస్తి కృష్ణ కిషోర్, ఏ బి వెంకటేశ్వర రావు ల ఎపిసోడ్లు పరిశీలిస్తే, అమరావతి సచివాలయం నేషనల్ మీడియాకు కావలసినంత మసాలాను ఉత్తి  పుణ్యానికే అందించినట్టు తెలిసిపోతోంది. ఇది అవాంఛనీయ, అనభిలషణీయ పరిణామమని సీనియర్ అధికారులంటున్నారు. అమరావతి లో క్యాపిటల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనల ద్వారా రాష్ట్రం పరువు ఢిల్లీ వీధుల్లో మార్కెట్ వస్తువుగా మాత్రం మారిపోయింది. ఇక నైనా , అధికారం లో ఉన్న వారు పూర్తిగా ఐ ఏ ఎస్ ల మీద ఆధారపడి పాలన సాగించే ఛత్రం నుంచి బయట పడాలి. నాయుడి ఓటమి కి కారణం ఆయన పూర్తిగా బ్యూరోక్రాట్లమీదే ఆధారపడటం అని తెలుగుదేశం లో సీనియర్ నాయకులు ఇప్పటికే, ఒక పార్టీ అధ్యక్షడుకి ఒక ధీసిస్ కూడా సమర్పించిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి.
ఐదోరోజు విచారణలో కంట తడి పెట్టిన పెండ్యాల జరుగుతున్న దర్యాప్తు తీరుతో బిత్తరపోయిన తెలుగుదేశం శ్రేణులు దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ..ఏమీ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్, లీడర్లకు నాయుడు ఆదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ, దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొందరు సీనియర్ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. వరసగా ఐదోరోజు కూడా పెండ్యాల శ్రీనివాస్ ఇంటిలో జరిగిన సోదాల సందర్భంగా, పెండ్యాల శ్రీనివాస్ అటు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ , ఇటు ఇన్ కమ్ ట్యాక్స్, మరో వైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల బృందాల వద్ద తన వైపు నుంచి అప్రూవర్ గా మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడైన ఒక మాజీ ఐ.ఏ.ఎస్. అధికారికి బంధువైన పెండ్యాల శ్రీనివాస్, నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చాలా సంవత్సరాలు పని చేశారు. 2014 లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తర్వాత నాయుడు, పెండ్యాల శ్రీనివాస్ ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో, పెండ్యాల కొందరు ఐఏఎస్ లను ఏక వచనంతో సంబోధించేంతగా ఎదిగారు. నాయుడు దగ్గర పూర్తిగా ఆంతరంగిక సిబ్బందిలో భాగమైన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా జరిగినట్టుగా ప్రచారమవుతున్న లావాదేవీలలో, ఎక్కువగా నాయుడికి అత్యంత సన్నిహితులైన వారి పేర్లు ఎక్కువ దఫాలు శ్రీనివాస్ ద్వారా జరిపిన బ్యాంక్ నగదు లావాదేవీల్లో రిఫ్లెక్ట్ అయినట్టు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కోటి రూపాయలకు పైబడి నగదు లావాదేవీలు జరిపేంతటి స్థాయి లేని పెండ్యాల శ్రీనివాస్ , పలు దఫాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందుకు బాధ్యులైన వారితో జరిపిన లావాదేవీలు, అలాగే ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా సేకరించి, అధ్యయనం చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, వివిధ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పెండ్యాల శ్రీనివాస్.. తాను అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాననీ, వచ్చే మాసం లో తన కుమార్తె వివాహం ఉన్న దృష్ట్యా తనను ప్రస్తుతానికి విడిచిపెట్టాలని అభ్యర్ధించినట్టు సమాచారం. అంతేకాకుండా, తన ద్వారా ప్రతిరోజూ పార్టీ లోని, ప్రభుత్వం లోని అత్యంత కీలకమైన వ్యక్తులకు ఏ మేరకు సొమ్ములు చేరవేసింది కూడా పెండ్యాల శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అతని కాల్ రికార్డు హిస్టరీని, అలాగే బ్యాంక్ నగదు లావాదేవీల హిస్టరీని అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులకు విస్తుపోయే సంగతులు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు, మాజీ ఎం.పి కి చెందిన నిర్మాణ సంస్థ తోనూ, అలాగే, మరో మాజీ ఎం.పి, ఆటోమోబైల్ వ్యాపార రంగం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా శాఖలున్న సంస్థ తోనూ...శ్రీనివాస్ ద్వారా జరిగిన ఆర్ధిక లావాదేవీలతో దర్యాప్తు సంస్థలు అనివార్యంగా తమ ఇంటరాగేషన్ ను మరి కొద్దీ రోజులు పొడిగించాల్సి వచ్చింది. వాస్తవానికి అటు హైదరాబాద్ లోనూ, ఇటు విజయవాడ లోనూ, ఇంకా శ్రీనివాస్ స్వస్థలంలోనూ జరుగుతున్న సోదాల సందర్భంగా తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని లోగడ ముఖ్యమంత్రి కార్యాలయం లో చక్రం తిప్పిన పలువురు సిబ్బంది ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగు  దేశం హెడ్ క్వార్ట్రర్స్ నుంచి శ్రీనివాస్ ను ఆదుకునే వ్యవస్థేలేవీ ముందుకు రాకపోవడంతోనే, ఆయన అప్రూవర్ గా మారటానికి   నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
    ఏపీలో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా నేలమట్టం చేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిధిలాల తొలగింపుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సీఎం జగన్ అధికారం చేపట్టగానే మొదటిసారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రజావేదికను కూల్చివేశారు. కానీ అప్పటి నుంచి వాటి శిధిలాలను అక్కడి నుంచి తరలించలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వీటిని అక్కడే ఉంచినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శిధిలాల తొలగింపు కోసం టెంటర్లను ఆహ్వానించింది. మార్చి 3 వరూ ఆన్ లైన్ లో టెండర్లు స్వీకరించనున్నారు.  ఏపీలో 2014లో అధికారంలోకి రాగానే హైదరాబాద్ నుంచి పాలన సాగించిన అప్పటి సీఎం చంద్రబాబు, ఓటుకు నోటు కేసు వివాదం తర్వాత అమరావతికి తరలివచ్చారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం వద్ద కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని లీజుకు తీసుకున్న చంద్రబాబు అక్కడి నుంచే పాలన ప్రారంభించారు. తన నివాసం పక్కనే ప్రజావేదిక పేరుతో ఐదు కోట్ల రూపాయలతో ఓ ప్రాంగణాన్ని నిర్మించారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. కరకట్టపై నదీ చట్టాలను ఉల్లంఘించి ఇల్లు కట్టుకోవడమే నేరమైతే ప్రజావేదికను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించింది. అయినా అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అతి తక్కువ సమయంలో తాత్కాలిక నిర్మాణంగా ప్రజావేదికను నిర్మించడమే కాకుండా అక్కడే కలెక్టర్ల సమావేశాలతో పాటు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహించేవారు.  గతేడాది వైసీ అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ ప్రజా వేదికపై దృష్టిపెట్టారు. అధికారంలోకి రాగానే నిర్వహించిన మొట్టమొదటి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వేదికగా మార్చిన జగన్.. నిబంధలను ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లను నిలదీశారు. కలెక్టర్ల భేటీ ముగిసిన వెంటనే అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చేయాలని ఈ భేటీలోనే ఆదేశాలు సైతం ఇచ్చారు. దీంతో కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే సీఆర్డీఏ అధికారులు ప్రజావేదికను నేలమట్టం చేశారు. అయితే శిధిలాలను మాత్రం అక్కడి నుంచి తొలగించలేదు. దీంతో శిధిలాల తొలగింపును ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే వదిలేసిందనే విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు శిదిలాల తొలగింపు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. మార్చి 3 వరకూ  దరఖాస్తుల స్వీకరణకు గడువు కూడా ఇచ్చింది. శిధిలాల తొలగింపుతో పాటు ఇనుము వేలానికి కూడా టెండర్లు పిలిచింది. దీంతో ఈ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడినట్లయింది.
  సబర్మతి ఆశ్రమంలో వస్తువులను ట్రంప్ మెలానియా దంపతులు ఆసక్తిగా తిలకించారు. సబర్మతి ఆశ్రమంలో ప్రతి గదినీ దగ్గరుండి చూపించిన మోడీ.... గాంధీజీ వినియోగించిన నూలు వడికే రాట్నం దగ్గర ఎక్కువ సమయం గడిపారు. నూలు వడికే రాట్నం దగ్గర కూర్చొని ఎలా నూలు వడుకుతారో పరిశీలించారు. రాట్నాన్ని తిప్పుతూ నూలు వడికే ప్రయత్నం చేశారు. మెలానియా అయితే, రాట్నాని తిప్పుతూ సంతోషానికి గురైంది. అనంతరం, ఎలా నూలు వడకాలో... ట్రంప్ అండ్ మెలానియాకు అక్కడున్న సబర్మతి సిబ్బంది చేసి చూపించారు. అనంతరం ట్రంప్ కూడా నూలు వడికేందుకు ప్రయత్నించారు. చివరిగా, సబర్మతి ఆశ్రమ బుక్ లో తన అనుభూతులను ట్రంప్ అండ్ మెలానియాలు స్వహస్తాలతో రాశారు. ఆ తర్వాత గాంధీజీ బోధించిన చెడు వినకు... చెడు చూడకు... చెడు మాట్లాడకు... అనే మూడు కోతుల బొమ్మను చూపించి... వివరించారు మోడీ. అనంతరం మొతేరా స్టేడియానిక బయల్దేరి వెళ్లారు.
నిన్న అమరావతిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, తన కాన్వాయ్ లో కారు హనుమంతు అనే రైతు కాలిపై నుంచి వెళ్లిన ఘటనపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇవాళ వివరణ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సురేష్.. నిన్నటి ఘటనలకు దారి తీసిన పరిస్ధితులను వివరించారు. అమరావతికి వస్తుండగా తన కారు గుద్దుకుని ఓ వ్యక్తికి దెబ్బలు తగిలాయని, ఆయన్ను ఆస్పత్రికి తరలించాలని అనచరులకు చెప్పానని కానీ వారు కావాలని చేయలేదు కాబట్టి ఇంతటితో వదిలేయాలని వారు కోరారని సురేష్ వెల్లడించారు. అమరలింగేశ్వర స్వామి గుడి వద్ద రథోత్సవం ముగించుకుని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి వస్తుండగా కొందరు తమ దగ్గరికి వచ్చి జై అమరావతి, జై సీబీఎన్ నినాదాలు చేశారన్నారు. నినాదాలతో పాటు చెవి దగ్గరికి వచ్చి బూతులు కూడా తిట్టి వెళ్లారని సురేష్ తెలిపారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డి వాహనంలో అక్కడి నుంచి మద్దూరు వైపు బయలుదేరామన్నారు. లేమల్లె వద్ద కారు మారేందుకు కిందకి దిగిన సమయంలో అక్కడికి మహిళా జేఏసీ నేతల బస్సు వచ్చిందని, అందులో ఉన్న మహిళలు తనను చూసి జై అమరావతి నినాదాలు చేశారన్నారు. అందులో ఓ యువతి తన దగ్గరకు వచ్చి నువ్వొక ఎంపీవా, మమ్మల్ని ఏం పీకుతార్రా అని అభ్యంతరకర వ్యాఖలు చేసిందని సురేష్ వెల్లడించారు. ఆమెను తాను వారిస్తుండగానే పదిమంది మహిళలు వచ్చి తనపై కారం జల్లి దాడి చేస్తుండగా...గన్ మెన్లు జోక్యం చేసుకుని తనను కారులోకి పంపించారన్నారు. అదే సమయంలో మహిళలు తన అనుచరులపై దారి చేసి చెప్పులతో కొట్టారుని సురేష్ ఆరోపించారు. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనను దళితుడని కూడా చూడకుండా టార్గెట్ చేస్తున్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహిళలపై దాడి చేసినట్లు కథనాలు ప్రసారం చేస్తున్న పలు ఛానళ్లపైనా సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం మాట్లాడటానికి అలవాటుపడాలని సూచించారు. గతంలో అబద్ధాలు మాట్లాడి చంద్రబాబును 23 సీట్లకు తీసుకొచ్చారని, ఇప్పటికైనా వాస్తవాలు చూపించాలన్నారు. తనపై దాడిలో పాల్గొన్నది అమరావతి స్దానికులు కాదని, వారికి అమరావతితో ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడికి పాల్పడిన వారంతా టీడీపీ పంపిన పెయిడ్ ఆర్టిస్టులేనని ఎంపీ సురేష్ తెలిపారు. రాజధానిలో తాము మాత్రమే బతకాలనే స్ధాయికి వీరు చేరుకున్నారని దాడి చేసిన వారినుద్దేశించి సురేష్ వ్యాఖ్యానించారు. దళితులంటే ఎలాగో విలువలేదు కనీసం ఎంపీగా అన్నా గౌరవం ఇవ్వాలి కదా అని సురేష్ తెలిపారు.  టీడీపీ అధినేత చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు ఆపాలని సురేష్ డిమాండ్ చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో యుఎస్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి  నీ అంతుచూస్తాం, నిన్నువదలిపెట్టం, ఏం పీక్కుంటావో పీక్కోరా జగన్ వచ్చి కాపాడతాడా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. బలహీన వర్గాలెవరూ ఉండకూడదు, మేమే పాలించాలని చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని సురేష్ విమర్శించారు. మహిళా జేఏసీ బస్సులో ఉన్న ఓ మహిళ కారం ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే సురేష్ అనుచరులే వేశారని చెప్పాలంటూ మాట్లాడుతున్న వీడియోను సురేష్ తన ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు.
  We are all aware of the fact that the food that is popular among the population today, does not make any positive contribution to our health. So its time we give up our present food habits and turn towards a balanced diet. When I say balanced diet I mean, a meal consisting of fruits, vegetables, protein and dairy products. We have only read about this for a science exam in school. Its time we put that lesson to practice. This article will describe to you why each of the above mentioned things are essential and you decide whether to accept or reject my suggestion. Fruits and vegetables will give you those vitamins and nutrients that are exclusively available through them. They are low in fat content and high in water so you don't have to worry about adding to your calories. The next thing that must be on your plate is a good source of protein. The main function of proteins is to repair and help in the growth of your hair and nails along with helping in healing of wounds. So if you want lovely hair and quickly healing wounds, protein is a must! There is nothing new I can say about the importance of dairy products. Its known to all that they are the richest sources of calcium. So if you dont want a calcium deficiency, make sure you get at least 200ml of milk everyday. What are you waiting for? Start a healthy life today! -Kruti Beesam  
      Papaya is a deliciously sweet fruit which has numerous nutritional benefits. It is very low in calories and also contains no cholesterol. Excellent for those who want to lose weight, consider eating papaya every day to maximize its health benefits.   Also a beauty food, papaya is low in fructose and is excellent for digestion! The antioxidant nutrients found in it, including Vitamins C and E and beta-carotene, are great at reducing inflammation and acne. Moreover, Vitamin C may also protect your skin against sun damage. Once considered quite exotic, they can now be found in markets throughout the year and if you have tree at home you can enjoy its benefits year long. The fruit, as well as the other parts of the papaya tree, contain papain, an enzyme that helps digest proteins. This enzyme is especially concentrated in the fruit when it is unripe. Health Benefits Papayas are a rich source of nutrients like carotenes, vitamin C and flavonoids; e B vitamin, folate and pantothenic acid; and rich in minerals like potassium, copper, and magnesium; and fiber. To categorize the health benefits without going into depth, the health benefits of papaya include: ·        It’s an antioxidant ·        Protection against Heart Disease ·        Promotes digestive health ·        Anti-Inflammatory ·        Supports the Immune system ·        Protection against Macular degeneration ·        Protects  against Rheumatoid arthritis ·        Protects against colon cancer   276.00 grams of Papaya contains 119 Calories Nutrient Values Vitamin C 224.1% Folate        25.5% Fiber         18.7% Vitamin A 14.5% Magnesium 14.4% Potassium    14.3% Copper        13.3% Pantothenic Acid  10.6%
India has emerged as the world's largest consumer of antibiotics, followed by China and the US, according to a new study on the growing alarm surrounding antibiotic-resistance. The study, Global Trends in Antibiotic Consumption 2000- 2010, according to Princeton University researchers found that worldwide antibiotic use has risen a staggering 36 per cent over the studied 10-year period. Among the 16 groups of antibiotics studied, cephalosporins, broad-spectrum penicillins and fluoroquinolones accounted for more than half of that increase, with consumption rising 55 per cent from 2000 to 2010. The study quantifies the growing alarm surrounding antibiotic-resistant pathogens and a loss of efficacy among antibiotics used to combat the most common illnesses. The report also highlights an increasing resistance to carbapenems and polymixins, two classes of drugs that have long been considered last-resort antibiotics for illnesses without any other known treatment. Overall, the study reviewed patterns, seasonality and frequency of use of antibiotics in 71 countries. "The data underscore the welcome evidence that more global citizens are able to access and purchase antibiotics. But that use is not being effectively monitored by health officials, from doctors to hospital workers to clinicians," the researchers noted. "Consequently, antibiotic use is both rampant and less targeted. That reality is driving antibiotic resistance at an unprecedented rate," researchers said. The five BRICS nations - Brazil, Russia, India, China and South Africa - have been held responsible for more than three-quarters of that surge. While India is the largest consumer of antibiotics, US accounts for the highest per capita consumption, with a rate of more than twice that of India. Source: PTI  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.