Publish Date:Sep 10, 2016
Publish Date:Sep 8, 2016
Publish Date:Sep 1, 2016
Publish Date:Aug 27, 2016
Publish Date:Aug 26, 2016
Publish Date:Aug 23, 2016
Publish Date:Aug 22, 2016

EDITORIAL SPECIAL
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  విజయ్ దేవరకొండ నాలుగైదేళ్ల క్రితం వరకు కెరీర్‌లో చాలా స్ట్రగుల్ పడ్డాడు. సినిమా ఛాన్సుల కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు చేశాడు. సీన్ కట్ చేస్తే.. ఇవాళ అతను యూత్ ఐకాన్. అతనికి కథలు వినిపించాలని రైటర్లూ, అతడితో పనిచెయ్యాలని డైరెక్టర్లూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ దశ నుంచి ఈ దశకు రావడం అంత ఈజీగా జరగలేదు. విజయ్ చివరిసారిగా ఆడిషన్‌లో పాల్గొన్న సినిమా.. 2015లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం'. 'పెళ్లిచూపులు' సినిమా కంటే ముందు మూడు సినిమాల ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యాడు. వాటిలో వేషాలు చేజిక్కించుకున్నాడు. రవిబాబు డైరెక్ట్ చేసిన 'నువ్విలా', శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో ఆడిషన్ల ద్వారానే నటించాడు. అప్పుడు అతని స్క్రీన్ నేం 'విజయ్ సాయి'. ఆడిషన్లంటే అతనికి అయిష్టం కాదు కానీ, ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి, అక్కడ మరికొంతమందితో పాటు తనకు ఎప్పుడు అవకాశం వస్తుందా.. అని ఎదురుచూడాల్సి రావడమంటే చాలా కష్టంగా ఉండేది. అందరూ ఆడిషన్‌లో తాము ఎంపికవుతామని ఆశపడేవాళ్లే. అలాగే మిగతావాళ్లను దాటుకొని, తాను ఆ ఛాన్స్ దక్కించుకుంటానని నమ్మేవాడు విజయ్. అయితే నటుడిగా తన కెరీర్‌లో చేదు దశగా అతను దాన్ని భావిస్తాడు. అలాంటి దశ మళ్లీ ఎన్నడూ తన జీవితంలో రాకూడదని అతను కోరుకుంటున్నాడు. మనం శుక్రవారం సినిమాలకు వెళ్తాం. టికెట్ కొని, దాన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ తెరవెనుక చూస్తే, ఒక సినిమా మేకింగ్‌లో భాష, ప్రాంతం, పాలిటిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయని విజయ్‌కు బాగా తెలుసు. "ఒక కళగా అది 'క్లీన్' కాదు. డబ్బు, వ్యాపారం, అధికారం, కులం అనేవి అక్కడ రాజ్యం చేస్తుంటాయి. నాకు అదొక యుద్ధం లాంటిది" అని చెబుతాడు విజయ్. నటన అనేది అతడి పనిలో 30 శాతమే అని జనానికి తెలీదు. మిగతా 70 శాతం ఏమిటనేది.. అతడిని అత్యంత సమీపంగా చూసేవాళ్లకే తెలుస్తుంది. ఒక సినిమా చెయ్యాలంటే అనేకమంది కలిసి పనిచెయ్యాలి. జనానికి బెస్ట్ ఇవ్వడానికి కృషి చెయ్యాలి. ఎక్కువగా కొత్తవాళ్లతో పనిచేస్తుండటం వల్ల, ఆ సినిమా పూర్తి కావడానికీ, దాన్ని ప్రమోట్ చెయ్యడానికీ మరింత ఎక్కువగా అతను కష్టపడుతున్నాడు. విజయ్‌కు ఇవాళ డబ్బు అనేది ప్రయారిటీ కాదు. కంటెంట్ తనను ఎగ్జైట్ చేస్తేనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. గతంలో డబ్బు కోసం అతను చాలా పనులు చేశాడు. డబ్బు కోసమే మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఒక ఇల్లు కొనాలనే ఉద్దేశంతో 'నీ వెనకాలే నడిచి' అనే  ఒక మ్యూజిక్ వీడియో కూడా చేశాడు. కానీ దాంతో వచ్చిన డబ్బు ఇల్లు కొనడానికి సరిపోలేదు. పదివేల రూపాయలు, అంతకంటే ఎక్కువ వస్తుందనుకుంటే ఏ పని చెయ్యడానికైనా సిద్ధపడ్డ రోజులున్నాయి. ఆ రోజులు గతించాయి. ఇవాళ తన పనికి తగ్గ ఆదాయం గడిస్తున్నాడు. అయితే కంటెంట్ నచ్చకపోతే, ఎంత డబ్బు ఇచ్చినా చెయ్యకూడదనే డెసిషన్ తీసుకున్నాడు.  కొత్తవాళ్లతో పనిచెయ్యడానికి అతను సిద్ధంగా ఉంటాడు. అలా అని 'నేను బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తాను' అని ఊరికే మాటలు చెప్పేవాళ్లతో కలిసి పనిచెయ్యాలని అతను అనుకోవట్లేదు. ఎవరైనా తన దగ్గరకు కొత్త డైరెక్టర్ వస్తే, అతను చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ, యాడ్ ఫిల్మ్ కానీ చూపించమని అడుగుతున్నాడు విజయ్. అవి చూశాకే, స్క్రిప్ట్ వినడానికి అతను ఆసక్తి చూపిస్తున్నాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరి కథనూ వింటూ పోతే, తన మెదడు బ్లాంక్ అయిపోతుందని అతను భావిస్తున్నాడు. అతడి దృష్టిలో డైరెక్టర్స్ అనేకమంది ఉన్నారు కానీ, యాక్టర్లు మాత్రం ఒక గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. యాక్టర్ అవసరమైన స్క్రిప్టులు చాలానే ఉన్నాయి. విజయ్‌లో ఉన్న గుణమేమంటే.. అతను ఏ సినిమా ఒప్పుకున్నా, తన పాత్రను ఎలా పోషించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతుంటాడు. చేసే ప్రతి సినిమాతో నటుడిగా అతను ఇంకో రేంజికి వెళ్తాడని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. ఈ విషయం విజయ్‌కు బాగా తెలుసు. ఆ భయం విజయ్ మనసును తొలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు 'డియర్ కామ్రేడ్' చేసేటప్పుడు కొన్ని సీన్లను విని, వాటిని తాను చేయగలనా అని భయపడ్డాడు. కానీ చివరకు ఆ భయాన్ని జయించి వాటిని చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్టును పక్కనపెడితే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. త్వరలో అతను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో అతను ఎంతమంది హృదయాల్ని కొల్లగొడతాడో చూడాలి.
గత గురువారం నటి అర్చన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ హెల్త్‌కేర్‌లో వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రముఖ పారిశ్రామివేత్త జగదీష్‌తో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరినీ కలిపింది నటుడు శివబాలాజీ దంపతులు. అయితే... తమది ప్రేమ వివాహాం కాదనీ, అరేంజ్డ్ లవ్ అనీ అంటోంది అర్చన. జగదీష్, అర్చనను శివబాలాజీ దంపతులు కలిపిన తర్వాత ఇద్దరూ ఇంట్లో పెద్దలకు మీటింగ్ ఆరెంజ్ చేశారట. వాళ్ళ మీటింగ్ తర్వాతే తమ మధ్య ప్రేమ మొదలైందని అర్చన చెప్పుకొచ్చింది. కొత్తగా పెళ్ళైన జగదీష్, అర్చన జంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? మ్యాగ్జిమమ్ అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంకా ఫుల్ ప్లానింగ్ చేయలేదట. అమెరికాను ఒక ఆప్షన్ గా పెట్టుకున్నామన్నాడు. పెళ్ళికి ముందు పెళ్లి ప్లానింగ్ తో సరిపోయిందనీ, హనీమూన్ గురించి ఆలోచించలేదనీ... ఇప్పుడు న్యూ ఇయర్, హనీమూన్ ట్రిప్ ఒకేసారి ప్లాన్ చేస్తున్నామని జగదీష్ చెప్పాడు.
  దేశం గర్వించదగ్గ తారల్లో రేఖ ఒకరనే విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు వరించింది. ఆదివారం (నవంబర్ 17) అన్నపూర్ణ స్టూడియోస్‌లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో 2018 సంవత్సరానికి శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, 2019 సంవత్సరానికి రేఖ.. ఈ అవార్డును అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో రేఖను ఆకాశానికెత్తేశారు చిరంజీవి. కేవలం ఆమె గురించే దాదాపు 5 నిమిషాల సేపు మాట్లాడారు. ఆమె తన ఆరాధ్య తార అనీ, ఆమెను దృష్టిలో ఉంచుకొనే తన భార్య సురేఖను 'రేఖా' అని పిలుస్తాననీ ఆయన చెప్పారు. "పార్లమెంటంటే అందరికీ తెలుసు. రచ్చ రచ్చగా ఉంటుంది. కేకలు, కేరింతలు, పేపర్లు విసిరేసుకోవడాలు.. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రాజ్యసభలో.. ఈ గొడవలన్నీ మనకెందుకని తలవంచుకొని సెల్‌ఫోన్ చూసుకుంటున్నాను. ఒక్కసారిగా రాజ్యసభంతా సైలెంట్ అయిపోయింది. ఏంటా.. అని ఆశ్చర్యపోతూ నేను తలెత్తి చూస్తే.. అందరి తలలూ పొద్దు తిరుగుడు పువ్వులా ఒకవైపే చూస్తున్నాయి. ఒక అద్భుత సౌందర్యరాశి.. లోపలికి వస్తున్నారు. నేను అందర్నీ ఒకసారి చూశాను.. నోళ్లు వెళ్లబెట్టుకొని చూస్తున్నారు. ఆ అందాలరాశి ఎవరో కాదు, నా తోటి రాజ్యసభ సభ్యురాలు రేఖ గారు!" అని ఆయన గుర్తు చేసుకున్నారు. రేఖ వంక చూస్తూ.. "మీకు గుర్తుందా.. ఆరోజు మీరెంత మందిని డిస్టర్బ్ చేశారు! వాళ్ల ప్రాబ్లెమ్స్‌ని చర్చించుకోనీయకుండా, వాళ మెదళ్లలోని మేటర్‌ని మర్చిపోయేలా చేశారు" అన్నారు. "ఆరోజు సభ జరగలేదంటే ఒట్టు. ఆరోజు ఆమె తెలుసుకున్నారు.. తాను రాజ్యసభకు వస్తే డిస్టర్బెన్స్ అని. దాంతో ఆమె తాను అక్కడికి రావడం తగ్గించుకుంటే బెటర్ అని.. అప్పుడప్పుడు గెస్ట్‌గా వస్తుండేవారు" అని చిరంజీవి చెప్పారు. ఇది అతిశయోక్తి కాదనీ, నిజంగా జరిగిందనీ అన్నారు.. "స్టాండింగ్ బ్యూటీ, టైంలెస్ గ్లామర్, ఏజ్‌లెస్ బ్యూటీ.. ఎవరంటే.. ఒక్క రేఖగారు తప్ప ఎవరిని చెప్పుకోగలం! అలాంటి లెజెండరీ పర్సనాలిటీ చేతుల మీదుగా నేను లెజెండరీ ఫిలింఫేర్ అవార్డు తీసుకోవడం.. నేను జీవితంలో మర్చిపోలేని అద్భుత సంఘటన" అని తెలిపారు చిరంజీవి. ఎయిటీస్ క్లబ్ అని సౌత్ ఇండియన్ స్టార్స్ అంతా సెలబ్రేట్ చేసుకొనేది.. ఈసారి తమ ఇంట్లో చేసుకుందామని ప్లాన్ చేసి, రేఖ గారిని దానికి స్పెషల్ గెస్ట్‌గా రావాలనీ, వస్తే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతారనీ పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసి అడిగాననీ రావడానికి ప్రయత్నిస్తా అన్నారనీ ఆయన చెప్పారు. వస్తారో, రారో చూడాలన్నారు. "కాలేజీ రోజులు ముగిసే కాలం నుంచీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఆమె సినిమాలు చూస్తూనే ఉన్నాను. నేను ఆరాధించే నటీమణుల్లో ఆమె ప్రధానంగా ఉంటారు. ఆవిడంటే అంత ఆరాధన. ఆ విషయం ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఈరోజున నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడమన్నది నాకు అమితమైన సంతోషాన్నిస్తోంది. అది నాకు లభించిన అదృష్టం. ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు రావడం ఆమెకు గౌరవం. ఆమెకు అవార్డు ఇవ్వడం నాకు గౌరవం" అన్నారు చిరంజీవి.  ఆమెపై తనకున్నఇష్టానికి నేచర్ స్పందించిందేమో తెలీదనీ, తనకు భార్యగా సురేఖ దొరికిందన్నారు. "తనను అందరూ సురేఖ అని పిలుస్తారు. నేను మాత్రం రేఖా అని పిలుస్తాను. నా ఆరాధ్య నటీమణి రేఖను దృష్టిలో పెట్టుకొని తనను రేఖా అని పిలుస్తుంటానని ఆమెకు తెలీదు. (నాగార్జునను చూస్తూ).. ఇది నా వైఫ్ చూడకపోతే బెటర్.. ఎడిట్ చేసి పక్కనపెడితే బెటర్" అని నవ్వేశారు మెగాస్టార్.
రేఖ అందంగా ఉంటారు. ఆమెది ముగ్ద మనోహరమైన మోము. అంతేనా? ఆమె తెలుగు పలుకులూ అంతే అందంగా ఉంటాయి. ఆదివారం ఏయన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా రేఖ తెలుగులో మాట్లాడుతుంటే వేదిక పైన ఉన్న అతిథులు చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డితో పాటు అక్కినేని కుటుంబం, వేదిక ముందున్న ప్రేక్షకులు, టీవీల ముందున్న వీక్షకులు కళ్ళు అప్పగించారు. ఆమె అంత అందంగా మాట్లాడారు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు! తల్లితండ్రుల జీన్స్, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తన అందానికి కారణమని ఆమె అన్నారు. అక్కినేనితో తనకున్న అనుబంధాన్ని రేఖ గుర్తు చేసుకున్నారు. "మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు చెబుతుండేవారు. 'ఆ అబ్బాయికి సిగ్గు గానీ కెమెరా ముందుకొస్తే ఇరగదీస్తాడు' అని. అమ్మను 'ఆ అబ్బాయి' ఎవరు? అని అడిగా. అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పింది. తర్వాత ఆయన నటించిన 'సువర్ణ సుందరి' చూశా. నేను చూసిన తొలి చిత్రమిది. తర్వాత వందసార్లైనా చూసి ఉంటాను. నాకు సినిమా పిచ్చి పట్టేసింది. ఆ సినిమా చూసే సినిమా అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను నటి కావడానికి అక్కినేని, అంజలి అత్తయ్య కారణం. నటి అయ్యాక, అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేసేటప్పుడు అక్కినేని గారి ఇంటి ముందు వెళుతూ, ఆ ఇంటికి దణ్ణం పెట్టుకునేదాన్ని. అక్కినేనిగారిని ఎప్పుడు కలుస్తానా? అని ఎదురుచూసేదాన్ని. ఒకరోజు ఆయన ఇంటికి పిలిచారు. భోజనం చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం" అని రేఖ అన్నారు. రేఖకు ఏడాది వయసు ఉన్నప్పుడు 'ఇంటిగుట్టు'లో నటించారు. బాలనటిగా 'రంగులరాట్నం' చేశారు. కథానాయికగా హిందీ సినిమాలు ఎక్కువ చేశారు. అయితే, తెలుగులో కథానాయికగా నటించిన ఆమె తొలి సినిమా 'అమ్మ కోసం'. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు బిడ్డ. తన బిడ్డ తెలుగు సినిమా చేయాలని ఆమె కోరుకున్నారు. అందుకోసం మళ్ళీ తెలుగులో నటిస్తానని రేఖ అన్నారు. "మా అమ్మ నన్నెప్పుడూ తెలుగులో ఒక్క సినిమా చేయమ్మా అనేది. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను తెలుగులో సినిమా చేయమని కోరింది. అమ్మ కోసం మరోసారి తెలుగు సినిమా చేస్తా. స్పష్టంగా తెలుగు నేర్చుకుని సినిమా చేస్తా" అని రేఖ అన్నారు. ఆమె కోసం దర్శక, రచయితలు ప్రత్యేకంగా పాత్రలు రాసుకోవచ్చు అన్నమాట.
  నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' (కామ కథలు) వెబ్ సిరీస్ రసిక జనుల్ని విపరీతంగా అలరించాయి. మనుషుల్లో సహజంగా నిద్రాణమై ఉండే లైంగిక వాంఛల్ని ఎత్తి చూపుతూ రూపొందిన ఆ సిరీస్‌లో కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్ వంటి పేరుపొందిన బాలీవుడ్ మెయిన్ స్ట్రీం తారలు నటించారు. అంతేనా.. నాలుగు సెగ్మెంట్లుగా వచ్చిన స్టోరీస్‌ని కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, దిబాకర్ బెనర్జీ వంటి పేరుపొందిన డైరెక్టర్లు రూపొందించారు. ఇప్పుడు ఆ 'కామ కథలు' తెలుగులో వస్తున్నాయి. అయితే ఇవి 'లస్ట్ స్టోరీస్'కు రీమేక్ కాదనీ, 'ఫ్రెష్' స్టోరీలతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నామనీ, వాటిలో ఒక సెగ్మెంట్‌ను డైరెక్ట్ చేస్తోన్న నందినీరెడ్డి తెలిపారు.  ఆమె డైరెక్ట్ చేస్తున్న కామ కథల్లో జగపతిబాబు, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య స్టీమీ సీన్లు ఉంటాయా, ఉండవా.. అనే విషయం మరి కొద్ది రోజుల్లో వెల్లడైపోతుంది. ఈ సిరీస్ చేయడానికి ముందు 'ఆడై' అనే తమిళ సినిమా చేసింది అమలా పాల్. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ మూవీ రిలీజైంది. అందులో ఒక సన్నివేశాన్ని న్యూడ్‌గా చేసి సంచలనం సృష్టించింది అమల. సన్నివేశం డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించడానికి రెడీగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. బహుశా అందుకేనేమో.. 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కోసం సంప్రదించగానే ఆమె అంగీకరించింది. మొత్తం నాలుగు సెగ్మెంట్లుగా ఉండే ఈ సిరీస్‌లో ఒక దానికి తరుణ్ భాస్కర్, ఇంకో దానికి 'ఘాజీ' ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సంకల్ప్ డైరెక్ట్ చేస్తున్న సెగ్మెంటులో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొంటోంది కూడా. ఇటీవల సెట్స్‌పై షూట్‌కు సంబంధించిన క్లాప్‌బోర్డును పట్టుకొని కెమెరాకు పోజిచ్చిన ఫొటోను ఈషా పోస్ట్ చేసింది. ఇప్పటి దాకా తను చేసిన సినిమాలతో గాళ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ పొందిన ఆమె.. తొలిసారి ఈ వెబ్ సిరీస్ కోసం బోల్డ్‌గా నటిస్తుండటం విశేషం. ఈ కామ కథల్లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది, ఎలాంటి సీన్లు చేసిందనే విషయాలపై ఆమె అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులూ ఆసక్తి చూపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆమె సెగ్మెంట్ స్ట్రీమింగ్ అయ్యాక, ఈషాకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుందో చూడాలి. నాలుగో సెగ్మెంటును ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. నిజానికి 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఆ సెగ్మెంటును రూపొందించాల్సి ఉంది. మొదట తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. కానీ తెలీని కారణాలతో అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలోకి ఇంతవరకూ ఏ డైరెక్టరూ రాలేదు. 'లస్ట్ స్టోరీస్' హిందీ వెర్షన్‌ను ప్రొడ్యూస్ చేసిన ఆర్ఎస్‌వీపీ.. తెలుగు స్టోరీస్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ కామ కథలు తెలుగు వీక్షకుల్ని ఏ మేరకు అలరిస్తాయో చూడాలి. ఇంకో విషయం ఏమంటే.. వెబ్ సిరీస్‌లకు క్రమేణా ఆదరణ పెరుగుతుండటంతో, మెయిన్ స్ట్రీం ఫిల్మ్ యాక్టర్లు వాటిలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 'గూఢచారి' మూవీలో అడివి శేష్ జోడీగా కనిపించి మెప్పించిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల హిందీ వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'లో బోల్డ్‌గా నటించి, వీక్షకుల మతులు పోగొట్టింది. అదే సమయంలో ఆమె పర్ఫార్మెన్సుకూ ప్రశంసలు లభించాయి. 'దేశముదురు'తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై, ఇవాళ తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులకు సన్నిహితమైన హన్సిక సైతం లేటెస్టుగా ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 'భాగమతి' డైరెక్టర్ అశోక్ రూపొందిస్తున్న ఆ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది కూడా. ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీతో ఈ సిరీస్‌ను అశోక్ తీస్తున్నాడు. ఇలా.. సినీ తారలు ఒక్కొక్కరుగా వెబ్ సిరీస్‌పై ఆసక్తి చూపుతుండటంతో రానున్న రోజుల్లో అవి మరింత పాపులర్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
  నాన్ వెజ్ కి రుచి మరిగిన పులితో.. ఇక నుంచి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ వి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు అని చెప్తే వింటుందా? చెప్పండి. వద్దన్నా నాలుక నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. ఏపీలో కొందరి పొలిటీషియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వద్దన్నా అవినీతి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బలంగా చెప్పిన మాట.. అవినీతిరహిత పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అంతేకాదు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అవినీతి చేయడానికి వీల్లేదని, అవినీతి చేస్తే అస్సలు సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు నేతల్లో మార్పు కనిపించట్లేదు. అధికారంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను చెప్తున్నారట. అయితే నేతల అవినీతి వ్యవహారం జగన్ వరకు చేరడంతో.. ఇప్పటికే వారిని పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు కొందరు మంత్రులను అసలు కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. అవినీతికి పాల్పడుతున్నారట. ఆ లిస్ట్ జగన్ కి చేరడంతో గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఐదు నెలల్లో అవినీతిలో టాప్ లిస్ట్ లో ఉన్న ఓ నలుగురు మంత్రులని పదవి నుంచి తప్పించాలి అనుకుంటున్నారట. అలా చేయటం వల్ల మిగతా మంత్రులు.. ఎక్కడ తమ మంత్రి పదవి కూడా పోతుందేమోనన్న భయంతో అవినీతి చేయడం మానేస్తారు. ఎమ్మెల్యేలు కూడా తమకి మంత్రి పదవి దక్కదేమోనన్న భయంతో అవినీతి మానేస్తారు. అందుకే జగన్ ఆ నలుగురు మంత్రులని టార్గెట్ చేసారని తెలుస్తోంది. మరోవైపు ఆ  నలుగురు మంత్రులు ఎవరా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ నలుగురిలో.. ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, ఒక ఎస్సీ మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఈ మంత్రుల అవినీతిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు, ఆయన వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతలే జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నలుగురిలో మొదట హిట్ లిస్ట్ లో ఆ మంత్రే ఉన్నారు అంటున్నారు. ఇక మహిళా మంత్రి విషయానికొస్తే.. ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఆమె భర్త వసూళ్లకు పాల్పడుతున్నట్లు.. కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు ఒకసారి ఆ దంపతులు ఎవర్నో డబ్బులు డిమాండ్ చేసారని తెలియడంతో.. జగన్ స్వయంగా ఆ మహిళా మంత్రికి ఫోన్ చేసి.. ఎంత కావాలమ్మా డబ్బులు అన్నారట. దీంతో హడలిపోయిన మంత్రి.. జగన్ కి ఎదురుపడాలంటేనే భయపడుతున్నారట. మొత్తానికి టాప్ 4 లిస్ట్ లో మహిళా మంత్రి రెండో ప్లేస్ లో ఉండగా.. ఒక బీసీ మరియు ఒక ఓసీ మంత్రి.. తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఏ క్షణమైనా వారిని తప్పించి వేరే వారికి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
  ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు. అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి కృష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం.  ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
  ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్లుగా ఉంది నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈ లోపు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకముంచి విఠల్ రావు ఓపిక పట్టారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూర్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ కే దక్కింది. అప్పటికే నిజామాబాద్ జడ్పీ పీఠం విఠల్ రావ్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠల్ రావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది.  మక్లూర్ మండలానికి చెందిన దాదన్నగారి విఠల్ రావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు కానీ తన సొంత నియోజక వర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలోగాని.. పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ ను పెంచుకోవలసి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట , ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ ఛైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠల్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి విఠల్ రావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవనరెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠల్ రావును ఆదేశించారు. విఠల్ రావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందో అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  రెవిన్యూ డివిజన్ ల పునర్విభజన సమయంలో మక్లూరు మండలాన్ని ఆర్మూర్ డివిజన్ లో కలపాలని ఎమ్మెల్యే జీవనరెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్ కు దగ్గరలో ఉంటుందని.. దాన్ని నిజామాబాద్ లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్ లో కలుపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్నగారి విఠల్ రావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవల్ లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు.. నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు.అయితే తనకు వ్యతిరేకంగా పని చేసి.. తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పట్నుంచే విఠల్ రావు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉంది. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేది ఏమి లేక అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి.. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారు. విఠల్ రావును తన నియోజకవర్గంలోనూ తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ను కలవాలంటే జంకుతున్నారు.  ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠల్ రావు పేరు కూడా రాయించలేదు. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా పాటించడం లేదని స్వయాన కేసీఆర్ రికమెండ్ చేసిన విఠల్ రావును తన సొంత నియోజక వర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలలో హాట్ టాపిగ్గా మారింది. ఇప్పటికే విఠల్ రావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టిక్కెట్ కు ఎసరు పెడతాడన్న భావనతోనే ఎమ్మెల్యే జీవనరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని.. ప్రత్యామ్నాయంగా విఠల్ రావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కారణమేదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠల్ రావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిన కూడా వేశారు. ఆర్మూర్ లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబి పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారు. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.
  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి.  ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్. కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.
  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.
    ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 44 రోజులు పూర్తయింది. మరీ నిరసనలకు ముగింపు ఎప్పుడు. ఇవాళ హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది. కార్మికులకు ఊరటనిచ్చే నిర్ణయం ఏదైనా వస్తుందా లేక ప్రభుత్వం చెప్పిన సమాధానానికి ఊ కొట్టి మిన్నకుండిపోతుందా, నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో హోరెత్తిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం తో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టువీడడం లేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని సంస్థను కాపాడటం దాదాపుగా అసాధ్యం అనే రీతిలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అసలు ఈ సమ్మెకు ముగింపు ఎప్పుడు ఆందోళనలకూ పుల్ స్టాప్ పడేలా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తాం అంటూ హై కోర్టు చేసిన సూచనను ప్రభుత్వం తిరస్కరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కమిటీ ప్రస్తావన లేదంటూ నో చెప్పింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. మరోవైపు కార్మిక సంఘాల జేఏసీ ఒక్కో మెట్టూ దిగుతున్నాయి. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టామని ఇప్పటికే ప్రకటించాయి. చర్చలు చేపడితే మరి కొన్ని డిమాండ్ల విషయంలోనూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తొంది. దీంతో అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు జరుగుతుంది ఎప్పటి కి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది అయోమయంగా తయారైంది.సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మొదట్నుంచీ వాదిస్తూనే ఉంది. శనివారం నాడు మరింత ఘాటుగా అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. పారిశ్రామిక వివాదాల చట్ట ప్రకారం ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలని చర్చలు జరుగుతుండగా సమ్మె చేపట్టరాదని.. కానీ కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగారని అఫిడవిట్లో పేర్కొంది. ఇప్పటికిప్పుడు కార్మికులు వీధుల్లో చేరతామన్న కొనసాగించటం కష్టమేనంటూ ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ ఇచ్చారు.సునీల్ శర్మ పేరుతో ఇచ్చిన అఫిడవిట్ పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు.ఎండీగా బాధ్యతలు చేపట్టిన 17 నెలల్లో కనీసం ఏడు సార్లు కూడా ఆఫీసుకు రాని వ్యక్తి అఫిడవిట్ ఇచ్చారని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టుకు సమర్పించింది రాజకీయ అఫిడవిట్ల ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం పట్టువీడడం లేదు మరోవైపు కార్మిక సంఘాల దగ్గర ఉన్న నిరసన అస్త్రాలన్నీ అయిపోతున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ సమ్మెతో కార్మికులు కూలీ పనులు, వృత్తిపనులు చేసుకుంటున్నారు. మరి కొందరు అప్పులతో నెట్టుకొస్తున్నారు. జేఏసీ నేతలు తమంతట తాము గృహ నిర్బంధాలు చేసుకొని నిరసన దీక్షలు చేసినా పోలీసులు తాళాలు పగలగొట్టి మరీ దీక్ష భగ్నం చేశారు.ఈ సమ్మెకు ఫలితం ఎంటీ, కనీసం ముగింపు ఎప్పుడు ఈ ప్రశ్నలకు హై కోర్టు తీర్పు సమాధానం చెబుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. హైకోర్ట్ ఇచ్చిన కమిటీ సూచనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. సమ్మె చట్టవిరుద్ధం మాత్రమే కాదు విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇలాంటి సమయంలో సోమవారం హై కోర్టు ఏం చెప్ప నుంది అనేది ఆసక్తికరంగా మారింది.
    ఇండో అమెరికన్ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం వేదిక కానుంది. ఈరోజు ( నవంబర్ 18వ తేదీ ) నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలకు సైనిక, నౌకా దళ సిబ్బంది బీచ్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. బీచ్ రోడ్ లోకి వాహనాల రాకపోకలు నిషేధించారు. భారత్, అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలకు కాకినాడ బీచ్ ముస్తాబైంది. 4 రోజుల పాటు తూర్పు తీరంలో అద్భుత విన్యాసాలను ప్రదర్శించేందుకు ఇండియన్ ఆర్మీ అధికారులు కార్యాచరణ చేపట్టారు. కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట అనే గ్రామ పరిధిలో ఉన్న బీచ్ లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రజలు ఏయిర్ షో ను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జాతీయ విపత్తు వాటిల్లినప్పుడు రోడ్లు మూసుకుపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే దానిపై సుమారు 150 మంది నావి బృందం విన్యాసాలను ప్రదర్శిస్తారు. నావి ప్రదర్శనలతో భద్రత దృష్ట్యా కాకినాడ బీచ్ రోడ్ లోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. బీచ్ లోకి వచ్చే వాహనాలను పిఠాపురం వైపు నుండి దారి మళ్లించారు. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడంలో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ హార్బర్ పరిధిలో ఈ నెల 16 వరకు విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు కాకినాడ తీరంలో విన్యాసాలు కొనసాగనున్నాయి. ఈ విన్యాసాలు భారత నావికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ సంధాయక్ భారత్ ఆర్మీ లోని 7 గాడ్స్ యూనిట్ పాల్గొంటున్నాయి. ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూపర్ హెర్యులస్ విమానం ఎమ్ఐ 17 రవాణా హెలికాప్టర్ లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.
  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... వైసీపీకి అండగా నిలిచిన సినీ ప్రముఖులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతోంది. 30 ఇయర్స్ పృద్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా... విజయచందర్ ను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా... నియమించింది. అయితే, ఇప్పటివరకు కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే పదవులివ్వగా, ఇంకా చాలామంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లు దాటిపోతున్నా... తమకింకా పిలుపురాలేదని కొందరు అలకపాన్పు ఎక్కారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ కంటే జూనియర్లను పిలిచిమరీ కీలక పదవులు కట్టబెడుతున్న జగన్.... తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. ముఖ్యంగా ఆ లిస్టులో అలీ, పోసాని, మోహన్ బాబు, జయసుధ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. హాస్యనటుడు అలీ, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విజయవాడ, లేదా గుంటూరులో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. అయితే, అప్పటికే అభ్యర్ధులు ఖరారు కావడంతో, అధికారంలోకి వస్తే, న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు అలీకి జగన్ నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక,  చంద్రబాబుపై మొదట్నుంచీ ధాటిగా విమర్శలు కురిపించిన వ్యక్తుల్లో పోసాని మురళి ఒకరు. అయితే, పోసానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి పిలుపూ రాలేదు. దాంతో పోసాని కాస్త ఆవేదనకు లోనైనట్టు తెలుస్తోంది. ఇక, మంచు మోహన్ బాబు... సీఎం జగన్ కు స్వయానా బంధువు.... అయితే, ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు.... చంద్రబాబుపై ఓ రేంజులో విరుచుకుపడ్డారు. ఊరూరా తిరిగి వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. దాంతో, వైసీపీ అధికారంలోకి వస్తే... మోహన్ బాబుకి కీలక పదవి గ్యారంటీ అని ప్రచారం జరిగింది. ఒకసారి టీటీడీ ఛైర్మన్ అని... మరోసారి ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పదవి అని... ఇలా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్న ప్రతీసారి మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఇంతవరకు మోహన్ బాబుకి ఏ పదవీ కట్టబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవులు పొందినవారంతా మొదట్నుంచీ ఆయన వెంట నడిచివారే. విజయ్ చందర్, 30 ఇయర్స్ పృథ్వీ, లక్ష్మీపార్వతి... వైసీపీ ఆరంభం నుంచీ జగన్ కు అండగా ఉన్నారు. అలాగే, పోసాని మురళి కూడా మొదట్నుంచీ జగన్ వైపే ఉన్నారు. మిగతా వారంతా, ఎన్నికలకు ముందు పార్టీలో చేరినవారే. అందుకే, మొదట్నుంచీ తనతో నడిచినవారికే జగన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. అయితే, ఆ ప్రాధాన్యత క్రమంలో కొందరు ప్రముఖులను ఇంకా పదవులు తలుపు తట్టలేదని, కానీ కచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, మొదట్నుంచీ జగన్ కు అండగా ఉంటూ, చంద్రబాబుపై ఒంటి కాలిపై విరుచుకుపడుతూ... ఘాటు వ్యాఖ్యలుచేసిన పోసానికి ఇంతవరకు పదవి ఇవ్వకపోవడంపై మాత్రం చర్చ జరుగుతోంది.
  ఎర్రగా, చూడగానే నాలుగు గింజలు నోట్లో వేసుకునేలా ఊరించే దానిమ్మలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో పోషకాలు వున్నాయి. దానిమ్మ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసా?... నోటి పూతగా వుంటే ఒక దానిమ్మని వలచి గుప్పెడు గింజలు నోట్లో వేసుకోండి చాలు. దానిమ్మలోని యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి.  ఆడవారు నెలసరి రోజుల్లో దానిమ్మని తింటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ సమయంలో వుండే ఇతర శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇవేకాదు.. దానిమ్మని రోజూ తినడం అలవాటుగా చేసుకుంటే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. అలాగే దీనిని సహజ యాస్పిరిన్ అనచ్చు. ఎందుకంటే రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. రోజుకి పావు కప్పు దానిమ్మరసం చాలు గుండె భద్రంగా వుండటానికి. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలామంచిది.  ఆస్టియో ఆర్ద్రస్టియస్‌తో బాధపడేవారు రోజూ దానిమ్మ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వయసు పెరిగేకొద్దీ ఏర్పడే చర్మం ముడతలను నివారించే గుణం కలిగిన దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కూడా. దీనిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. రుచిగా, చూడగానే తినాలనిపించే దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిశాక తినకుండా వుంటామా! రోజూ తప్పకుండా గుప్పెడు గింజలని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యంగా వుందాం.   -రమ 
Who hasn't come across someone suffering from backaches...one in every three adults complains of back ache, at some time of the day. There have been several pain relief techniques such as over-the-counter drugs, physiotherapy treatments, exercises, acupressure and accupuncture, yoga and such, all promising to offer pain relief and problem eradication. A recent study conducted by a health research institute in Seattle, Washington state, USA revealed that training the brain through meditation can help cure back ache isssues. They invited more than 300 people between the ages 20 and 70, suffering from some form of back pain issues and offered them three different treatments, randomly to each for more than 3 months. One was a form of phychotherapy, second a mindfullness based therapy such as yoga and meditation, third being the usually followed treatment such as medication through drugs with the Doctors help. The first therapy was concentrating on changing the thought process of the patients, teaching them relaxation therapies...the Second practice taught the group to train the brain to accept the difficult emotions and thoughts of discomfort and relaxing thebrain using yoga and meditation.     After offering these two therapies for 8 weeks, the study conducted a result oriented casestudy and observed that at 6 months milestone, the second form of treatment that involved meditation fetched more good results than the phychotherapy based treatment, and the medication technique was the last...and the number of people who reported a recurrence of back pain was lesser in the meditation group, next the phychotherapy group, last the drug-treated group, after one year after starting the respective treatments. The study revealed that training the brain helped people to get more immune to back aches and recurrence was reduced than through the traditional physiotherapy and medication techniques, which is a healthier option compared to risks that may come along with medication for some people...and a cost effective, affordable option for those who cannot afford expensive medicines and physiotherapy sitting fees every week or so. There needs to be a further study extended to find out if these positive results of the meditation technique are valid even after an year and beyond or not, until then it is considered a better, healtheir and affordable alternative to any other techinques to fight chronic lower back aches. --Pratyusha
  ‘మిరపకాయ’ చూడటానికి చిన్నదే అయినా మన వంటల్లో దాని స్థానం మాత్రం పెద్దదే. కారం లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. కేవలం రుచికి మాత్రమే కాదు... ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయట. మిరపకాయలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు పొటాషియం, మాంగనీసు, ఫోలేట్ వంటి పోషకాలు బాగా లభిస్తాయట. మన ఆరోగ్యానికి మేలు చేసే కాప్సాసిన్ అనే పదార్ధం పచ్చిమిర్చిలో మనకు దొరుకుతుంది. శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడి ఆరోగ్యం చేకూర్చే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పచ్చిమిరపకాయలో ఉన్నాయట. తొక్కే కదా అని తీసిపారేయకండి... ఇక మిరపకాయలలోని విటమిన్ బి శరీరంలో హోమోసిస్టిన్ పరిమాణాన్ని తగ్గించడమే కాదు.. హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందిట. సరే మరి, ఘాటైన మిరపకాయలోనే ఇన్ని సుగుణాలు వుంటే తియ్యటి యాపిల్ పండులో ఎన్ని ఉండాలి? రోజుకో యాపిల్ తింటే ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవు అంటారు కదా. చివరికి రోజుకో యాపిల్ తింటే క్యాన్సర్ కూడా దరిచేరదుట. యాపిల్ పండు తొక్కలో వుండే దాదాపు పన్నెండు రకాల రసాయన పదార్ధాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌లో తేలింది. ‘ట్రిటర్ పెనాయిడ్స్’గా వ్యవహరించే ఈ పదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయిట. కేవలం క్యాన్సర్ కణాలను అడ్డుకోవడమే కాదు.. ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటకి పంపించడంలోనూ యాపిల్ పై తొక్కులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు పరిశోధకులు. తొక్కులోనే కాదు.. యాపిల్ పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ, ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్ తింటే క్యాన్సర్‌కి చెక్ చెప్పవచ్చని వీరు సూచిస్తున్నారు. సో.. రోజుకో యాపిల్ తినడం అలవాటుగా మార్చుకోవాలి. హాయిగా ఊపిరి తీయండిలా... మన శరీరం మొత్తానికి రోజంతా ప్రాణవాయువు సరఫరా అవ్వాలంటే ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేయాల్సిందే. ఈ ఊపిరితిత్తులు బలహీనమైతే జలుబు, దగ్గు వంటివి తరచూ పట్టి పీడిస్తుంటాయి. వీటి బారిన పడకుండా వుండాలంటే వారానికి కనీసం 5 యాపిల్స్ తినడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే వెల్లుల్లిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయిట. అలాగే ఉల్లిపాయలో వుండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, గ్రీన్ టీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది అని తేలింది పరిశోధనల్లో. మోకాళ్ళ నొప్పులు హుష్ కాకి... మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడేవారు రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అలాగే నువ్వులని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ములగాకుని సాధారణంగా చాలామంది వంటకాలలో వాడరుగానీ, మునగాకుని వీలైనంత ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ళ నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుందట. ఇవండీ.. చక్కటి ఆరోగ్యానికి కొన్ని మంచి సూత్రాలు.. మరి పాటిస్తారు కదూ! -రమ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.